కేసీఆర్ కు థాంక్స్: సన్ రైజర్స్ యజమాని | Kalanithi Maran and sun group head meets cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కు థాంక్స్: సన్ రైజర్స్ యజమాని

Published Thu, Jun 2 2016 6:08 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

కేసీఆర్ కు థాంక్స్: సన్ రైజర్స్ యజమాని - Sakshi

కేసీఆర్ కు థాంక్స్: సన్ రైజర్స్ యజమాని

హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ను ప్రోత్సహించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆ జట్టు యజమాని కళానిధి మారన్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను మారన్, సన్ గ్రూప్ సీఈఓ షణ్ముగం, జెమినీ టీవీ ఎండీ కిరణ్, జీఎం బాలకృష్ణన్ కలిశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం .. హైదరాబాద్, తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభ, ఫైనల్ మ్యాచ్ లు హైదరాబాద్ లోనే నిర్వహిస్తారని, ఆ రెండు మ్యాచ్ లకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరినట్లు మారన్ తెలిపారు. వచ్చే సీజన్లో ఐపీఎల్ మ్యాచ్ లను మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కళానిధి మారన్ వెల్లడించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement