Kalanithi Maran
-
కేంద్ర మాజీ మంత్రిపై సీబీఐ చార్జ్ షీట్
చెన్నై: టెలికాం మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లపై సీబీఐ అధికారులు చార్జ్ షీటు దాఖలుచేశారు. ప్రైవేట్ టీవీ(సన్ టీవీ నెట్ వర్క్) ఛానల్‌కు అక్రమంగా 764 హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా కనెక్షన్లు (ఎయిర్ సెల్-మాక్సిస్)ప్రొవైడ్ చేసిన కేసులో మారన్ సోదరులు నిందితులుగా ఉన్నారు. చెన్నైలోని స్పెషల్ కోర్టులో మారన్ సోదరులతో పాటు మరికొందరు నిందితులపై అవినీతి నిరోధక చట్టం పరిధికి లోబడి చర్యలు తీసుకోనున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఫోర్జరీ చేశారని ఆరోపణలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఎలాంటి బిల్లులే లేకుండా 764 హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా కనెక్షన్లు ఇవ్వడం వల్ల బీఎస్ఎన్ఎల్ సంస్థతో పాటు చెన్నై, ఢిల్లీకి చెందిన ఎంటీఎన్ఎల్ టెలికాం కంపెనీలు 1.78కోట్లు నష్టపోయాయి. అయితే ఆ సమయంలో సన్ టీవీ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన కళానిధి మారన్ సహా ఆ టీవీ ఇద్దరు ఉన్నత అధికారులు, ఆయన అనుయాయుల పేర్లను చార్జ్‌షీటులో చేర్చినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లకు పైగా టెలికాం స్కామ్ కేసు విచారణ కొనసాగుతోంది. -
కేసీఆర్ కు థాంక్స్: సన్ రైజర్స్ యజమాని
హైదరాబాద్: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ను ప్రోత్సహించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆ జట్టు యజమాని కళానిధి మారన్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను మారన్, సన్ గ్రూప్ సీఈఓ షణ్ముగం, జెమినీ టీవీ ఎండీ కిరణ్, జీఎం బాలకృష్ణన్ కలిశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం .. హైదరాబాద్, తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభ, ఫైనల్ మ్యాచ్ లు హైదరాబాద్ లోనే నిర్వహిస్తారని, ఆ రెండు మ్యాచ్ లకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరినట్లు మారన్ తెలిపారు. వచ్చే సీజన్లో ఐపీఎల్ మ్యాచ్ లను మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కళానిధి మారన్ వెల్లడించారు. -
మద్రాస్ హైకోర్టులో మారన్ సోదరులకు ఎదురుదెబ్బ
చెన్నై: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో తమ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ కళానిధి మారన్‌కు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్లు వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను విచారించనని, ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది కనుక అక్కడికే వెళ్లాలని జస్టిస్ సత్యనారాయణన్ బుధవారం చెప్పారు. టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి , ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రూ. 742 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా జప్తు(అటాచ్మెంట్) చేస్తూ ఈడీ మార్చిలో ఇచ్చిన ఉత్తర్వును పిటిషనర్లు సవాలు చేశారు. దయానిధికి చెందిన సన్ డెరైక్ట్ టీవీ, సౌత్ ఏసియా ఎఫ్ఎం లిమిటెట్ కంపెనీల్లోకి పెట్టుబడుల ముసుగులో రూ. 742 కోట్ల ముడుపులు వచ్చాయని సీబీఐ ఆరోపించడం తెలిసిందే. -
కుదుపుల ప్రయాణంలో స్పైస్‌జెట్
పెరిగిపోతున్న రుణభారం, బకాయిలు స్వయంకృతాపరాధం, సమస్యలతో సతమతం అన్ని వ్యాపారాలు ఒకేలా ఉండవు. ఒక దాంట్లో గెలిచాం కదా మరొకటేదైనా కూడా అంతే అనుకుంటే సమస్యలు తప్పవు. మీడియాలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న సన్ గ్రూప్ సంస్థ స్పైస్‌జెట్ ఏవియేషన్ రంగంలో రివ్వున ఎగరలేకపోతుండటం దీనికి మరో నిదర్శనం. ఇప్పుడిప్పుడు ఇన్వెస్ట్ చేసేందుకు కొందరు ముందుకొస్తున్నా.. స్పైస్‌జెట్ కష్టాలకు అనేకానేక కారణాలు ఉన్నాయి. ఇందులో కొన్ని స్వయంకృతాపరాధాలు కాగా మరికొన్ని రాజకీయపరమైనవి. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ సమస్యలపై ఈ కథనం. దేశీయంగా ఎయిర్‌లైన్స్ వ్యాపారం చాలా సంక్లిష్టమైనది. ఈ రంగంలో సమస్యల ధాటికి తట్టుకోలేక పలు సంస్థలు మూతబడ్డాయి. దమానియా, ఈస్ట్ వెస్ట్, మోదీలుఫ్త్, ఎండీఎల్ఆర్, పారమౌంట్, ఎన్ఈపీసీ, కింగ్‌ఫిషర్.. ఇవన్నీ ఆ కోవకి చెందినవే. తాజాగా స్పైస్‌జెట్ అదే బాటలో ఉందన్న సందేహాలు రేకెత్తాయి. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దాకా దేశీయంగా రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఉన్న స్పైస్‌జెట్‌కి 20% మార్కెట్ వాటా ఉంది. కింగ్‌ఫిషర్ మూతపడటంతో ఆ సంస్థ మార్కెట్‌ను స్పైస్‌జెట్, ఇండిగో దక్కించుకున్నాయి. అలాంటిది అకస్మాత్తుగా స్పైస్‌జెట్‌కు జబ్బు చేసింది. ప్రస్తుతం రోజు గడవడానికి నిధులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. విమానాలు లీజుకిచ్చిన కంపెనీలు, చమురు సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ. 1,400 కోట్లు బకాయి పడింది. మరో 2,000 కోట్ల పైచిలుకు రుణ భారమూ ఉంది. చేతులారా స్పైస్‌జెట్ పరిస్థితి ఇలా దిగజారడానికి కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా కారణం. తక్షణ అవసరాలు తీర్చుకునేందుకు తరచూ డిస్కౌంట్ స్కీములు మొదలైన వాటితో అప్పటికప్పుడు నిధులు సమకూర్చుకోవడం వీటిలో ఒకటి. ఏ కంపెనీ అయినా ఎంతో కాలం ఇలాంటి వాటితో మనుగడ సాగించడం కష్టం. పై స్థాయిలో నిర్వహణపరమైన లోపాలు దీనికి తోడయ్యాయి. వ్యాపారాన్ని అప్పటిదాకా మెరుగ్గా నిర్వహించుకుంటూ వస్తున్న పై స్థాయి అధికారులు మేనేజ్మెంట్తో విభేదాల కారణంగా వైదొలిగారు. ప్రమోటరు కళానిధి మారన్ కుటుంబం అడపాదడపా నిధులు సమకూరుస్తూనే ఉన్నా అవి సరిపోవడం లేదు. అలాగే రుణాలపై అధిక వడ్డీలూ తోడయ్యాయి. పలు విమానాల రద్దు వల్ల సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో కంపెనీ రోజుకీ రూ. 2 - 2.5 కోట్ల మేర నష్టాలను చవిచూసినట్లు అంచనా. ఏవియేషన్ సంబంధిత సమస్యలూ కంపెనీ కుదేలవుతుండటానికి కారణమయ్యాయి. దేశీయంగా విమాన ఇంధనం చార్జీలు అత్యధిక స్థాయిలో ఉంటుండటంపై ఎయిర్‌లైన్స్ గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. ఎందుకంటే.. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 75% దాకా ఇంధనం ఖర్చులే (ఏటీఎఫ్) ఉంటాయి. ఇన్వెస్టర్ల నిరాసక్తి..: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌లో మనీల్యాండరింగ్కి సంబంధించి మారన్ సోదరులపై అభియోగాలు ఉండటంతో స్పైస్‌జెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా ముందుకు రాకపోయి ఉండొచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇటు విశ్వసనీయత, అటు క్రెడిట్ రేటింగ్ రెండూ కూడా దెబ్బతినడంతో ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి కనపర్చలేదని వారి అంచనా. అయితే, ప్రస్తుతం వ్యవస్థాపక ప్రమోటరు అజయ్ సింగ్, జేపీ మోర్గాన్ చేజ్ సంస్థ ఇందులో 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం కంపెనీకి ఊరటనిచ్చే విషయం. రాజకీయపరమైన సమస్యలు .. కంపెనీ కష్టాలు మరింతగా పెరుగుతుండటం వెనుక రాజకీయపరమైన కారణాలు కూడా ఉండొచ్చంటున్నారు మార్కెట్ వర్గాలు. స్పైస్‌జెట్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వారిని అణగదొక్కడానికి ప్రత్యర్థులు ఈ మార్గాన్ని అనుసరిస్తుండొచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. సంస్థకు సరైన సమయంలో నిధులు లభించకుండా అడ్డంకులు సృష్టించడం, బకాయిలు అప్పటికప్పుడు కట్టేయాల్సిందేనంటూ ఒత్తిళ్లు తేవడం, చాలా రోజుల ముందుగా టికెట్ల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకోనివ్వకుండా ఆంక్షలు విధించడం మొదలైనవన్నీ ఇందులో భాగమే అయి ఉంటాయన్నది వారి విశ్లేషణ. ఇప్పుడు కంపెనీని ఆదుకునేందుకు ముందుకొచ్చిన వ్యవస్థాపక ప్రమోటరు అజయ్ సింగ్‌కి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఇందుకు బలం చేకూరుస్త్తున్నాయని వారంటున్నారు. -
స్పైస్‌జెట్‌కు కొత్త ఓనర్?
⇒సన్‌గ్రూప్ కళానిధి మారన్ యాజమాన్యంలో మార్పు! ⇒రంగంలోకి దిగిన పాత ప్రమోటర్ అజయ్ సింగ్.. ⇒ఇన్వెస్టర్ల నుంచి త్వరలో రూ.1,400 కోట్ల పెట్టుబడులకు చాన్స్... న్యూఢిల్లీ: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దేశీ చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చేతులు మారనుందా? త్వరలో కొత్త యాజమాన్యం రాబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఊహాగానాలు నిజం కానున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. భారత్, విదేశాలకు చెందిన కొందరు ఇన్వెస్టర్లు కంపెనీలో సుమారు రూ.1,400-1,500 కోట్లమేర కొత్తగా పెట్టుబడులు పెట్టి.. ఆమేరకు వాటాను దక్కించుకోవడానికి సుముఖంగా ఉన్నారని సమాచారం. కంపెనీ బ్యాలెన్స్‌షీట్, ఆర్థిక పరిస్థితిని మదింపు(డ్యూడెలిజెన్స్) చేసిన తర్వాత పెట్టుబడులపై స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)కి బకాయిలు చెల్లించకపోవడంతో ఐదు రోజుల క్రితం స్పైస్‌జెట్ విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయి కంపెనీ దాదాపు కుప్పకూలే దశకు చేరిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యంతో చమురు కంపెనీలు, ఏఏఐ బకాయిల చెల్లింపునకు కొంత వ్యవధి ఇవ్వడంతో స్పైస్‌జెట్‌కు తాత్కాలికంగా కొంత ఊరట లభించింది. రంగంలోకి అజయ్ సింగ్... కష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్‌పై ఈ కంపెనీని నెలకొల్పిన అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. కంపెనీని గాడిలోపెట్టడంతోపాటు ఇతర ఇన్వెస్టర్లతో కలిసి మళ్లీ పెట్టుబడులు పెట్టే ప్రణాళికల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సింగ్ పలుమార్లు భేటీ కావడంతో ఈ వాదనలు జోరందుకున్నాయి. అంతేకాకుండా స్పైస్‌జెట్‌లో పెట్టుబడులకు ఇది మంచి తరుణమని.. కంపెనీకి మళ్లీ పుంజుకోగల సత్తా ఉందంటూ వ్యాఖ్యానించారుకూడా. 2010లో సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్.. స్పైస్‌జెట్ ఇన్వెస్టర్లయిన కన్సాగ్రా, విల్బర్ రాస్ నుంచి 38% వాటాను కొనుగోలు చేయడం తెలిసిందే. ఆతర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా కొంత వాటాను దక్కించుకోవడంతో యాజమాన్యం ఆయన చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం మారన్, సన్‌గ్రూప్‌లకు స్పైస్‌జెట్‌లో 53.48 శాతం వాటా ఉంది. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో మైనారిటీ వాటాదారుగా ఉన్న అజయ్ సింగ్‌కు సుమారు 5 శాతం వాటా ఉంది. కాగా, కంపెనీ ఆస్తులు, ఇతరత్రా అంశాలను మదింపుచేసేందుకు 4-6 వారాల వ్యవధి పట్టొచ్చని.. ఆ తర్వాత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. మారన్, సన్‌గ్రూప్ వద్దనుంచి యాజమాన్య నియంత్రణ ఇతర ఇన్వెస్టర్లకు వెళ్తుంది. తక్షణావసరం రూ.1,400 కోట్లు... విమానాలను లీజుకిచ్చిన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ.1,400 కోట్లమేర బకాయి పడింది. కంపెనీ గట్టెక్కాలంటే తక్షణం ఈ మొత్తం అవసరం. మరో రూ.2,000 కోట్లకుపైగా రుణ భారం కూడా ఉంది. కాగా, స్పైస్‌జెట్‌లో పెట్టుబడుల విషయంలో బడా ఇన్వెస్టర్లతో అజయ్ సింగ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వాళ్లుగనుక వాటా కొనుగోలు చేస్తే.. యాజమాన్య మార్పిడితో పాటు రుణాల చెల్లింపు బాధ్యతను కూడా తలకెత్తుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా.. విమానయాన సేవలు సజావుగా సాగేందుకు మరిన్ని నిధులను కూడా వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ(షేర్ల మొత్తం విలువ) రూ.900 కోట్లుగా ఉంది. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.48 చొప్పున మారన్ వాటాను కొన్నారు. కంపెనీ కష్టాల నేపథ్యంలో ఇటీవలే రూ.13 స్థాయిని తాకిన షేరు.. తాజా ఊరటతో మళ్లీ 16 స్థాయికి కోలుకుంది. ఎవరీ అజయ్ సింగ్... స్పైస్‌జెట్‌ను గట్టెక్కించేందుకు దీని అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ తెరపైకి రావడంతో అందరికళ్లూ ఇప్పుడు ఆయనపైనే ఉన్నాయి. ఢిల్లీ ఐఐటీలో పట్టాపుచ్చుకున్న సింగ్.. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. పారిశ్రామికవేత్త ఎస్కే మోడీకి చెందిన నష్టజాతక మోడీలుఫ్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత దీని పేరును స్పైస్‌జెట్‌గా మార్చి.. లాభాలబాట పట్టించారు. దేశంలో ప్రధాన చౌక విమానయాన సంస్థగా తీర్చిదిద్దిన ఘనత అజయ్ సింగ్‌కే దక్కుతుంది. అయితే, 2010లో కంపెనీలో ఇతర ప్రధాన ఇన్వెస్టర్లు తమ వాటాను మారన్‌కు విక్రయిండచంతో యాజమాన్యం చేతులు మారింది. ఇదిలాఉంటే... అధికార బీజీపీ ప్రభుత్వంతో సింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో స్పైస్‌జెట్ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎందుకంటే తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం విషయంలో సింగ్ కీలక పాత్ర పోషించారు. స్పైస్‌జెట్ యాజమాన్యం తమను ఆదుకోవాలంటూ ఎన్నివిజ్ఞప్తులు చేసినా పట్టించుకోని మోదీ సర్కారు.. సింగ్ రంగంలోకి దిగాక ఊరటకల్పించే చర్యలు చేపట్టడం గమనార్హం. -
మారన్ సోదరులపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో మారన్ సోదరులపై ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఎయిర్ సెల్-మ్యాక్సీస్ ఒప్పందం కేసులో మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్, కళానిధి మారన్, మలేషియన్ వ్యాపారవేత్త టి. ఆనంద కృష్ణన్ తోపాటు మరో ఐదుగురిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు సీబీఐ పేర్కోంది. వచ్చేనెల 11 తేది నుంచి ప్రత్యేక న్యాయస్థానంలో ఓపీ సైనీ విచారణ జరుగుతుందని తెలిపారు. -
మారన్ సోదరులపై బిగుస్తున్న ఉచ్చు
చెన్నై: ఎయిర్‌సెల్ - మాక్సిస్ వ్యవహారంలో మారన్ సోదరులపై వచ్చేవారంలో చార్జ్‌షీటు దాఖలు చేస్తామని సీబీఐ డెరైక్టర్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉంది. అందులో 2004 - 2007 మధ్య కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా దయానిధిమారన్ పని చేశారు. ఆ సమయంలో ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త శివశంకరన్ చెన్నైలో నడుపుతున్న ఎయిర్‌సెల్ సమాచార సంస్థకు బ్రాడ్‌బ్యాండ్ కేటాయింపు కోరుతూ 2006లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దానికి ఒప్పందం కుదరలేదు. ఇలా ఉండగా ఎయిర్‌సెల్ సంస్థ షేర్లు హఠాత్తుగా మలేషియా మాక్సిస్ సంస్థకు చేతులు మారాయి. ఆ తరువాత అనేక ప్రాంతాల్లో ఎయిర్‌సెల్ సర్వీసును ప్రారంభించేందుకు 14 లెసైన్స్‌లు ఇచ్చారు. దీనికి ప్రతి ఫలంగా మాక్సిస్ సంస్థ తమ అనుబంధ సంస్థల ద్వారా దయానిధిమారన్ సోదరుడు కళానిధిమారన్ నిర్వహించే సన్ డెరైక్ట్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తరువాత శివశంకరన్ విదేశాల్లో స్థిరపడ్డారు. 2008లో కరుణానిధి, మారన్ సోదరుల మధ్య అభిప్రాయాల భేదాలు ఏర్పడగా శివశంకరన్ ఢిల్లీ చేరుకున్నారు. సీబీఐతో మారన్ సోదరులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. 2011లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మారన్ సోదరులపై చార్జ్‌షీటు రూపొందించేందుకు సీబీఐ చర్యలు తీసుకుంటోంది. -
సామాన్యుడికి విమాన సేవలు చేరేనా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెట్టు ముందా, కాయ ముందా? అన్నట్టుంది భారత విమానయాన రంగం పరిస్థితి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం వచ్చే 20 ఏళ్లలో 200 చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం ఉంటే విస్తరణ చేపట్టడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మరి విమానాలు నడిపేందుకు కావాల్సిన సౌకర్యాల మాటేమిటన్నదే ఇక్కడ ప్రశ్న. సర్వీసులతోపాటే ప్రయాణికులు పెరుగుతారని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి అశోక్ లావాసా చెబుతున్నారు. చిన్న ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అంటూ బాధ్యతను రాష్ట్రాలపై మోపారు. మరోవైపు అన్ని వసతులుంటే సర్వీసులు నడుపుతామని ఆపరేటర్లు అంటున్నారు. ముందు సర్వీసులు ప్రారంభించండి వసతులు కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. మీరు నిర్మిస్తే మేమొస్తాం.. నాన్-హబ్ ప్రాంతాల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య తమకు 66 శాతముందని ఎమిరేట్స్ భారత్, నేపాల్ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ ఎస్సా సులేమాన్ అహ్మద్ తెలిపారు. అమృత్సర్, పుణె, గోవా తదితర నగరాలకు సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌లో నాన్-హబ్ ప్రాంతాల్లో విమాన సేవల కంపెనీలకు అవకాశాలనేకమని చెప్పారు. అయితే మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తే సర్వీసులు ప్రారంభించేందుకు ఆపరేటర్లు ముందుకు వస్తారని వెల్లడించారు. భారత్‌లో వైమానిక ఇంధనం ధర ఎక్కువగా ఉండడమే పెద్ద సమస్యగా పరిణమించిందని స్పైస్‌జెట్ గ్రౌండ్ సేవల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కమల్ హింగోరాణి అన్నారు. పన్నులు తగ్గితే సర్వీసులు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పన్నులు, ఇతర చార్జీలు తగ్గించకుండా చిన్న విమానాశ్రయాల్లో కల్పించే సాధారణ వసతులు తమకు వద్దంటున్నారు. అందరూ కలిస్తేనే.. ప్రస్తుతం భారత్‌లో వ్యాపార, పర్యాటక ప్రయాణికులే అధికం. సాధారణ ప్రయాణికులకు విమాన సేవలు చేరువ కావాలి. ఫిక్కీ, కేపీఎంజీ నాలెడ్జ్ పేపర్ ప్రకారం 2030 నాటికి భారత విమానయాన రంగం ప్రపంచంలో అగ్ర స్థానానికి చేరుకుంటుంది. ఇది కార్యరూపం దాల్చాలంటే విమానయాన సంస్థలకు విమాన సీట్ల కేటాయింపుల విషయంలో నిబంధనలు సరళతరం కావాల్సిందేనని కేపీఎంజీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్ట్నర్, హెడ్ అంబర్ దూబే అన్నారు. ఎంఆర్వో కేంద్రాలు దిగుమతి చేసుకుంటున్న పరికరాలు ఏడాదిలోపు వినియోగించకపోతే పన్నులు చెల్లించాలన్న నిబంధన హాస్యాస్పదమన్నారు. విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను ఇతర దేశాలతో పోలిస్తే 60% ఎక్కువగా ఉంది. ఇది పరిశ్రమ వృద్ధికి ఆటంకమేనని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం, పరిశ్రమ రెండూ చేతులు కలిస్తేనే విమానయాన రంగానికి మంచి రోజులని స్పష్టం చేశారు. -
వేతన ప్యాకేజీల్లో సన్ టీవీ ప్రమోటర్లు టాప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పే ప్యాకేజీని పొందిన వ్యక్తులుగా సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన భార్య కావేరిలు రికార్డు సృ ష్టించారు. స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో అత్యధికంగా వేతనం పొందిన ఎగ్జిక్యూటివ్‌లుగా రూ.56.25 కోట్ల పే ప్యాకేజీతో వీరు అగ్రస్థానంలో నిలిచారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం టాప్ 10 పే ప్యాకేజీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జిందాల్ స్టీల్ నవీన్ జిందాల్ (రూ.54.98 కోట్లు)ృత ఆర్థిక సంవత్సరం టాప్ 10 జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. ఇక రూ.49.62 కోట్లతో బిర్లా గ్రూప్ కుమార మంగళం బిర్లా నాలుగో స్థానంలో నిలవగా, హీరో మోటోకార్ప్‌కు చెందిన బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్, పవన్ ముంజాల్, సునీల్ కాంత్ ముంజాల్‌లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ పే ప్యాకేజీలో వేతనం, ఇతర భత్యాలు, కమీషన్లు, లాభం అనుంసధానిత ప్రోత్సాహాకాలు, ఇతర ప్రయోజనాలు కూడా కలగలసి ఉన్నాయి. రూ.30.96 కోట్ల పే ప్యాకేజీతో పి.ఆర్.ఆర్, రాజా(రామ్‌కో సిమెంట్స్)ఎనిమిదవ స్థానంలో, రూ.30.90 కోట్ల ప్యాకేజీతో షింజో నకనిషి తొమ్మిదవ స్థానంలో, రూ.26.46 కోట్ల ప్యాకేజీతో మురళి కె. దివి(దివీస్ ల్యాబ్స్)పదవ స్థానాల్లో ఉన్నారు. ఇక 11 వస్థానంలో భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్(రూ.24.33 కోట్లు), 12 వస్థానంలో అమర రాజా బ్యాటరీస్ జయదేవ్ గల్లా(రూ.23.48 కోట్లు) ఉన్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరం టాప్ 10 జాబితాలో ఉన్న బీజీఆర్ ఎనర్జీ బీజీ రఘుపతి, కార్ల్ పీటర్ పోర్స్టర్లకు గత ఆర్థిక సంవత్సరం జాబితాలో చోటు దక్కలేదు. కార్పొరేట్ దిగ్గజాలు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, అజిమ్ ప్రేమ్‌జీ, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్‌లకు టాప్ 10 జాబితాలో చోటు దక్కక పోవడం విశేషం. రూ. 15 కోట్ల పే ప్యాకేజీతో ముకేష్ అంబానీ 16 వస్థానంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా ఆయన ఈ స్థానంలోనే కొనసాగుతున్నారు. -
ఆర్జనలో కళానిధి మారన్ దంపతులు టాప్
భారత కార్పొరేట్ రంగంలో అత్యధిక మొత్తంలో వేతనాలు పొందుతున్న వారి జాబితాలో సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మొదటి స్థానంలో నిలిచారు. గత ఆర్థిక సంవత్సరంలో మారన్ దంపతులు చెరో 56.25 కోట్ల రూపాయలు ఆర్జించారు. అంతకుముందు ఏడాది మొదటి స్థానంలో ఉన్న జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్‌ను వీరిద్దరూ వెనక్కినెట్టారు. జిందాల్ (54.98 కోట్లు) ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నారు. 2011-12 సంవత్సరంలో 73.42 కోట్ల రూపాయాలతో అగ్రస్థానంలో నిలిచిన జిందాల్‌కు గతేడాది 25 శాతం ఆదాయం తగ్గింది. కాగా గత నాలుగేళ్ల నుంచి మారన్, జిందాల్ కుటుంబ సభ్యులే ఎక్కువ వేతనం పొందుతుండటం విశేషం. ఇద్దరూ చెరో రెండేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్నారు. తాజా జాబితాలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా (49.62 కోట్లు) నాలుగో స్థానంలో నిలిచారు.