వేతన ప్యాకేజీల్లో సన్ టీవీ ప్రమోటర్లు టాప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పే ప్యాకేజీని పొందిన వ్యక్తులుగా సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన భార్య కావేరిలు రికార్డు సృ ష్టించారు. స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో అత్యధికంగా వేతనం పొందిన ఎగ్జిక్యూటివ్‌లుగా రూ.56.25 కోట్ల పే ప్యాకేజీతో వీరు అగ్రస్థానంలో నిలిచారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం టాప్ 10 పే ప్యాకేజీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జిందాల్ స్టీల్ నవీన్ జిందాల్ (రూ.54.98 కోట్లు)ృత ఆర్థిక సంవత్సరం టాప్ 10 జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. ఇక రూ.49.62 కోట్లతో బిర్లా గ్రూప్ కుమార మంగళం బిర్లా నాలుగో స్థానంలో నిలవగా, హీరో మోటోకార్ప్‌కు చెందిన బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్, పవన్ ముంజాల్, సునీల్ కాంత్ ముంజాల్‌లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ పే ప్యాకేజీలో వేతనం, ఇతర భత్యాలు, కమీషన్లు, లాభం అనుంసధానిత ప్రోత్సాహాకాలు, ఇతర ప్రయోజనాలు కూడా కలగలసి ఉన్నాయి. రూ.30.96 కోట్ల పే ప్యాకేజీతో పి.ఆర్.ఆర్, రాజా(రామ్‌కో సిమెంట్స్)ఎనిమిదవ స్థానంలో, రూ.30.90 కోట్ల ప్యాకేజీతో షింజో నకనిషి తొమ్మిదవ స్థానంలో, రూ.26.46 కోట్ల ప్యాకేజీతో మురళి కె. దివి(దివీస్ ల్యాబ్స్)పదవ స్థానాల్లో ఉన్నారు. ఇక 11 వస్థానంలో భారతీ ఎయిర్‌టెల్ సునీల్ మిట్టల్(రూ.24.33 కోట్లు), 12 వస్థానంలో అమర రాజా బ్యాటరీస్ జయదేవ్ గల్లా(రూ.23.48 కోట్లు) ఉన్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరం టాప్ 10 జాబితాలో ఉన్న బీజీఆర్ ఎనర్జీ బీజీ రఘుపతి, కార్ల్ పీటర్ పోర్‌స్టర్‌లకు గత ఆర్థిక సంవత్సరం జాబితాలో చోటు దక్కలేదు. కార్పొరేట్ దిగ్గజాలు ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, అజిమ్ ప్రేమ్‌జీ, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్‌లకు టాప్ 10 జాబితాలో చోటు దక్కక పోవడం విశేషం. రూ. 15 కోట్ల పే ప్యాకేజీతో ముకేష్ అంబానీ 16 వస్థానంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా ఆయన ఈ స్థానంలోనే కొనసాగుతున్నారు.