ఆర్జనలో కళానిధి మారన్ దంపతులు టాప్ | Kalanithi Maran, his wife top paid corporates in India | Sakshi
Sakshi News home page

ఆర్జనలో కళానిధి మారన్ దంపతులు టాప్

Published Sun, Sep 22 2013 2:23 PM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

Kalanithi Maran, his wife top paid corporates in India

భారత కార్పొరేట్ రంగంలో అత్యధిక మొత్తంలో వేతనాలు పొందుతున్న వారి జాబితాలో సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మొదటి స్థానంలో నిలిచారు. గత ఆర్థిక సంవత్సరంలో మారన్ దంపతులు చెరో 56.25 కోట్ల రూపాయలు ఆర్జించారు. అంతకుముందు ఏడాది మొదటి స్థానంలో ఉన్న జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్ను వీరిద్దరూ వెనక్కినెట్టారు.

జిందాల్ (54.98 కోట్లు) ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నారు. 2011-12 సంవత్సరంలో 73.42 కోట్ల రూపాయాలతో అగ్రస్థానంలో నిలిచిన జిందాల్కు గతేడాది 25 శాతం ఆదాయం తగ్గింది. కాగా గత నాలుగేళ్ల నుంచి మారన్, జిందాల్ కుటుంబ సభ్యులే ఎక్కువ వేతనం పొందుతుండటం విశేషం. ఇద్దరూ చెరో రెండేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్నారు. తాజా జాబితాలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా (49.62 కోట్లు) నాలుగో స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement