వరదలు : తమిళ మీడియా సంస్థలు, నటుల ఔదార్యం | Kerala flood relief Sun TV donates Rs 1cr | Sakshi
Sakshi News home page

కేరళ వరదలు : తమిళ మీడియా సంస్థలు, నటుల ఔదార్యం

Published Fri, Aug 17 2018 7:56 PM | Last Updated on Fri, Aug 17 2018 10:05 PM

Kerala  flood relief Sun TV donates Rs 1cr   - Sakshi

చెన్నై: ప్రకృతి బీభత్సంతో  విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునే విషయంలో తమిళనాడు ప్రజలు, నటులు, మీడియా సంస్థలు తమ  ఔదార్యాన్ని  ప్రదర్శించాయి. పొరుగు రాష్ట్రం కేరళ మద్దతుగా స్పందిస్తున్నాయి. అక‍్కడి సహాయ, రక్షణ,పునారవాస కార్యక్రమాల్లో అనేకమంది ప్రజలు నిమగ్నమయ్యారు. అలాగే  కోట్ల రూపాయలు విరాళాలతో ఆపదలో ఆపన్నహస్తమవుతున్నారు. ముఖ్యంగా సన్‌టీవీ కోటి రూపాయల  విరాళమిస్తున్నట్టు వెల్లడించింది.   ఈ మేరకు కోటి రూపాయలను  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు  అందించారు.  అలాగే తమిళనాట మరో ప్రముఖ టీవీ విజయ్‌ టీవీ  కూడా 25లక్షల రూపాయలను ప్రకటించింది.

ఇప్పటికే తమిళ సినీహీరో విశాల్‌ భారీ విరాళం ఇవ్వనున‍్నట్టు ప్రకటించారు. అలాగే కేరళ ప్రజలను ఆదుకోవాల్సిందిగా ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. అలాగే మరో హీరో సిద్దార్థ్‌ ట్విటర్‌లో  కేరళ డొనేషన్‌ చాలెంజ్‌ను ప్రారంభించారు. దీనికి భారీ స్పందన లభిస్తోంది.  సినీ నటుడు,  లీడర్‌ కమల్‌హాసన్‌ రూ. 25లక్షలు,  తమిళ హీరోలు సూర్య, కార్తి 25లక్షలు విరాళమిచ్చారు.  మరోవైపు తమిళనటులతో పాటు మలయాళం నటుడు మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సాల్మన్‌   కేరళ వదరబాధితులకు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు.  దీంతోపాటు అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాల మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మా) 10కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్‌ విజయ్‌ దేవర్‌  కొండ భారీ విరాళాలను ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement