ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.
‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.
→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.
→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు
రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు.
→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.
→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్‌చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.
→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.
→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.
→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు.
బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి
రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment