రూ.కోటి సాయం ప్రకటించిన వెంకటేశ్‌, రానా | Venkatesh, Rana Daggubati Led Financial Help For Flood Hit Telugu State | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. వెంకటేశ్‌, రానా ఆర్థిక సాయం

Published Fri, Sep 6 2024 5:41 PM | Last Updated on Fri, Sep 6 2024 5:51 PM

Venkatesh, Rana Daggubati Led Financial Help For Flood Hit Telugu State

భారీగా కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎంతోమంది అమాయక జనాలు నిరాశ్రయులయ్యారు. నిత్యావసరాల కోసం అలమటిస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి సినీతారలు మేముసైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పటికే చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, నాగార్జున, అలీ, సాయిధరమ్‌తేజ్‌.. ఇలా ఎంతోమంది విరాళాలు ప్రకటించారు.

కోటి రూపాయ విరాళం 
తాజాగా దగ్గుబాటి వెంకటేశ్‌, రానా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దగ్గుబాటి హీరోలను అభిమానులు మెచ్చుకుంటున్నారు. కష్టకాలంలో ఆదుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement