తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సామాన్యుడికి అందుబాటులో సినిమా టికెట్ ధరలు ఉండాలని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం అద్భుతమని ఆ రోజే తాను చెప్పానని అన్నారు. థియేటర్స్, టిక్కెట్ రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైందేనని తెలిపారు.
కానీ అప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా భయపడిందని విజయేందర్ రెడ్డి గుర్తు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇపుడు తెలంగాణలో అమలు చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారని విజయేందర్ వెల్లడించారు.
అయితే ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్స్ రేట్ల పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment