Telangana Film Chamber
-
టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజు.. సీనీ ప్రముఖుల అభినందనలు (ఫొటోలు)
-
టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదు
‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందలేదు. ఆ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నిర్వహించే నంది అవార్డు వేడుక ఆయన వ్యక్తిగతంతో పాటు ఓ ప్రైవేట్ వేడుక. ఈ నంది అవార్డు వేడుకకు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి)కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేడుకకి మేం భాగస్వామ్యం వహించం’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్. దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి, ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన సంస్థలు. 24–09–2023న దుబాయ్‌లో నిర్వహించనున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి మా రెండు ఛాంబర్లకు సంబంధం లేదు. ‘నంది’ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేటెంట్. నంది పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని ఖండిస్తున్నాం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద కూడా టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
టాలీవుడ్ మీటింగ్, హాజరైన రాజమౌళి!
సాక్షి, హైదరాబాద్: సినీపరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఆది శేషగిరిరావు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు.. ఇలా అన్ని రంగాల నుంచి ఆయా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై చర్చించనున్నాం. పరిశ్రమలోని అన్ని వ్యవస్థల సభ్యులను ఆహ్వానించాం. గత రెండేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నింటిపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గంటన్నర పాటు అన్ని విషయాలపై చర్చించుకోనున్నాం. ఇది చిత్ర పరిశ్రమ మంచి కోసం ఏర్పాటు చేసిన భేటీ' అని పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. 'క్యూబ్, టికెట్ రేట్లు, చిత్ర పరిశ్రమ అంతర్గత విషయాలు చర్చకు వస్తాయి. ఏపీ ప్రభుత్వంతో జరిగిన మీటింగ్ విషయాలను సైతం చర్చిస్తాము. పూర్తి వివాదరహితంగా సమావేశం ఉంటుందని ఆశిస్తున్నాము' అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించనున్నాం. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా, ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగేదే ఇండస్ట్రీ సమావేశం' అని తెలిపారు. ఎస్ఎస్ రాజమౌళి, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి, నవీన్, బివిఎస్ఎసన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్ , తమ్మారెడ్డి భరధ్వాజ, ముత్యాల రాందాస్ ,మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలను చర్చించిన విషయం తెలిసిందే! ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే టాలీవుడ్ ప్రతినిధులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిలిం చాంబర్ 76వ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశం అనంతరం తెలంగాణ ఫిలిం చాంబర్ నూతన కార్యవర్గం (2021– 2023) ఎంపిక జరిగింది. అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, ఉపాధ్యక్షులుగా బాలగోవింద్ రాజ్ తడ, వి.ఎల్.శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి (కో అప్టెడ్), కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జె.చంద్రశేఖర్ రావు, కోశాధికారిగా ఎం. విజయేందర్ రెడ్డి ఎంపికయ్యారు. చదవండి : అవసరాల.. నవరసాల శ్రీనివాస్ అయ్యారు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడి ఇంటిపై సోదాలు, అరెస్ట్ -
త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. టాకీస్‌లను తెరవాలన్న దిశగా సినిమా ఎగ్జిబిటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాది నుంచి థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్నామని, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్, సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సునీల్ నారంగ్, అనుపమ్‌రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్‌గౌడ్, బాలగోవింద్, రాజ్‌తాడ్ల తదితరులు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. థియేటర్లు మూసి ఉంచిన కాలానికి సంబంధించి ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని, ఎస్జీఎస్టీని రద్దు చేయాలని, షూటింగ్ అనుమతుల చార్జీలను తగ్గించాలని కోరారు. దీనిపై స్పందించిన తలసాని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవచ్చని ఫిలిం చాంబర్ తీర్మానించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ థియేటర్లు తెరవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అంతా ఏకాభిప్రాయానికి వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ఫిలిం చాంబర్ నేతలు ప్రకటించారు. త్వరలోనే తెరిచే అవకాశం ఉందని వెల్లడించారు. -
ఈ నెలాఖర్లో థియేటర్లు తెరుచుకోవడం ఖాయం!
ఓ పక్క కరోనా, మరో పక్క ఓటీటీ ఎగ్జిబిటర్స్‌ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. దీంతోపాటు నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతుండటంతో థియేటర్ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి? జనాలు తిరిగి థియేటర్లలో బొమ్మ చూసేదెప్పుడు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఏదేమైనా జూలై నెలాఖరు వరకు థియేటర్లు ఓపెన్ చేస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ వీఎల్ శ్రీధర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ జాయింట్ సెక్రటరీ బాలగోవిందరాజు స్పష్టం చేశారు. ఆగస్టు 15కు రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా ఓ 15 సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయని తెలిపారు. ఓటీటీ కేవలం కంటెంట్‌ను అందించేది మాత్రమేనని, థియేటర్లు దాన్ని ప్రదర్శించేదని చెప్పుకొచ్చారు. -
ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు
‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టి.ఎఫ్.సి.సి.) ఏర్పాటు చేసి నాలుగేళ్లవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో మేమూ ఉన్నాం. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉందని చెప్పడం తగదు’’ అన్నారు టి.ఎఫ్.సి.సి. చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. బుధవారం ఆయన మాట్లాడుతూ– ‘‘టీఎఫ్‌సీసీలో ఇప్పటికి అమ్మకు ప్రేమతో, దీక్ష, చిన్న చిన్న ఆశ, కోమలి సినిమాలు సెన్సార్ కాగా, 10 సినిమాలు సెన్సార్‌కు రెడీగా ఉన్నాయి. అలాంటి మా సంస్థకు గుర్తింపు లేదనడం సరికాదు. మా సంస్థలో వెయ్యిమంది దర్శక–నిర్మాతలు, 3 వేల మంది టెక్నీషియన్స్ సభ్యులుగా ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో డిజిటల్ చార్జీలు వారానికి 2500 ఉంటే మన దగ్గర వారానికి సుమారు 13,000 వసూలు చేస్తున్నారు. నెలకు దాదాపు 15 కోట్లు కొల్లగొడుతూ కొందరు నిర్మాతలు ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు’’ అన్నారు. -
బోగస్ సంస్థలతో మోసపోవద్దు
‘‘తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందాయి. కొందరు వీటి అనుబంధ పేర్లతో బోగస్ సంస్థలు ఏర్పాటు చేసి కొత్త నిర్మాతలను మోసగిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ సంస్థల వలలో పడి మోసపోవద్దు’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సి.కల్యాణ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘బోగస్ సంస్థలపై నిఘా ఉంచేందుకు ‘అడ్‌హక్’ కమిటీ ఏర్పాటు చేశాం. కొత్త నిర్మాతలు ఎవరైనా తెలుగు ఫిలిం ఛాంబర్ లేదా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మాత్రమే సభ్యత్వం తీసుకోవాలి. ఎలాంటి గుర్తింపు లేని బోగస్ సంస్థల్లో సభ్యత్వం తీసుకుని, మోసపోతే న్యాయం చేయలేం. సినిమా అవార్డులన్నవి ప్రభుత్వాలు ఇస్తేనే బాగుంటుంది కానీ, సంస్థలు కాదు. ఇల్లీగల్ వ్యవహారాల్లో కౌన్సిల్ జోక్యం చేసుకోదు’’ అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి మురళీమోహన్, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
సినీ పరిశ్రమలో దళారీ వ్యవస్థ
పెండింగ్‌లో 200 చిన్న చిత్రాలు: ప్రతాని సిద్దిపేట జోన్: సినీ పరిశ్రమలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీమాంధ్రకు చెందిన ప్రముఖుల చేతిలో థియేటర్లు ఉండడంతో చిన్న నిర్మాతలు తీవ్ర నష్టాలకు గురి కావాల్సి వస్తోందన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి సీఎం సానుకులంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వం థియేటర్లపై విధించే పన్నులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న సినిమాల నిర్మాతలు నష్టాలను చవి చూడాల్సి వస్తోందన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా 2 వేల ఎకరాలతో నిర్మాణం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 200 చిన్న సినిమాలు రిలీజ్‌కు నోచుకోక పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సినిమా విడుదల, తేదీలు తదితర ప్రక్రియలను పర్యవేక్షించేందుకు కమిటీని వేయనున్నట్లు తెలిపారు. -
జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్: తెలుగు, తమిళ సినీతారలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ నటులతో ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ... మ్యాచ్ నిర్వహణతో వచ్చిన ఆదాయాన్ని సీఎం సహాయ నిధికి అందిస్తామని వెల్లడించారు. సినీ నటుల క్రికెట్ మ్యాచ్ కు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.