సినీ పరిశ్రమలో దళారీ వ్యవస్థ
పెండింగ్‌లో 200 చిన్న చిత్రాలు: ప్రతాని
సిద్దిపేట జోన్: సినీ పరిశ్రమలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీమాంధ్రకు చెందిన ప్రముఖుల చేతిలో థియేటర్లు ఉండడంతో చిన్న నిర్మాతలు తీవ్ర నష్టాలకు గురి కావాల్సి వస్తోందన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి సీఎం సానుకులంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వం థియేటర్లపై విధించే పన్నులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న సినిమాల నిర్మాతలు నష్టాలను చవి చూడాల్సి వస్తోందన్నారు.
తెలంగాణలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా 2 వేల ఎకరాలతో నిర్మాణం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 200 చిన్న సినిమాలు రిలీజ్‌కు నోచుకోక పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సినిమా విడుదల, తేదీలు తదితర ప్రక్రియలను పర్యవేక్షించేందుకు కమిటీని వేయనున్నట్లు తెలిపారు.