బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై(Saif Ali Khan) దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంతసమయం క్రితం అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు(Bandra Police) రంగంలోకి దిగారు. సుమారు 36 గంటల్లో అతన్ని బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందుతుడిని పోలీసులు విచారిస్తున్నారు.
రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద అతనిపై పోలీసులు కేసు పెట్టారు. సైఫ్‌పై దాడి ఘటనలో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్)
దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే, తాజాగా నిందితుడు పట్టుబడటంతో మరిన్ని వివరాలు వెళ్లడి అయ్యే ఛాన్స్ ఉంది. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది.
అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలోనే సైఫ్‌పై కత్తితో విచక్షణారహితంగా నిందితుడు పొడిచాడు.
Comments
Please login to add a commentAdd a comment