సంధ్య థియేటర్ దగ్గర మహిళ మృతి చెందిన విషయమై రీసెంట్‌గా అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇకపై తాను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు.. సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ రెండో సీజన్)
తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సింగిల్ స్క్రీన్స్‌కు ఊపిరి పోసేలా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ.. కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని ఎక్కువ రేట్లు పెడుతున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు, థియేటర్ వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రాలోనూ అమలు అవ్వాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ మాట్లాడుతూ.. ఆడియన్స్‌కి టికెట్ రేటు ఎంత ఉందో కూడా తెలియనంత అయోమయంలో ఉన్నారు. తెలంగాణాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేట్లు పెరగడం వల్ల పెద్ద సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దీంతో చిన్న సినిమాకు డబ్బులు ఉండడం లేదు అని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్ షో’ వివాదం)
Comments
Please login to add a commentAdd a comment