సాక్షి,విశాఖపట్నం : కూటమి నేతల మధ్య బెనిఫిట్ షో వివాదం తలెత్తింది. బడా సినిమాల బెనిఫిట్ షోలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమర్థించారు. మరోపక్క ఎంఎల్ఏలు విష్ణు కుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి బెనిఫిట్ షోను వ్యతిరేకించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ‘బెనిఫిట్ షోలు రద్దు చెయ్యాలనేది నా అభిప్రాయం. బెనిఫిట్ షోల వల్ల ఎవరికి లాభం. ఒకవేళ షోలకు అనుమతిచ్చినప్పటికీ నియంత్రణ ఉండాలి.
అల్లు అర్జున్‌పై పురందేశ్వరి, కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు’అని స్పష్టం చేశారు. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ‘బెనిఫిట్ షోలు ఎవరికోసం అనుమతినిస్తున్నారు.ఒక్కో హీరో వంద నుంచి 300 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
గతంలో బెనిఫిట్స్ అంటే చారిటీ కోసం వేసేవారు.ఇప్పుడు సినిమా నిర్మాతల కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారు.సినిమాలకు వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ,ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు.ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు’అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: నేనే సీఎం.. డిప్యూటీ సీఎం
Comments
Please login to add a commentAdd a comment