Benefit Shows
-
ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఆరో షోకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం
ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు ఏపీ ప్రభుత్వం ఆరో ఆటకు అనుమతులిచ్చారు. ఈ నెల 27న రిలీజవుతోన్న ఈ సినిమాను గురువారం ఉదయం 4.30 నుంచి 8 గంటల వరకు బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.టికెట్ ధరల పెంపుఇప్పటికే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రానికి రెండు వారాల పాటు టికెట్స్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చారు. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పైన అదనంగా రు.125 వసూలు చేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.75 పెంచుకునేలా ఉత్తర్వులిచ్చారు. అయితే గత ఐదేళ్ల లో ఎన్నడూ లేని భారీ ప్రయోజనాలు చేకూరుస్తూ ఏపీ ప్రభుత్వం ఏకంగా 2 జీవోలు జారీ చేయడం గమనార్హం. రాబోయే రెండు వారాల పాటు ఏపీలో అదనపు ధరలతో పాటు కల్కి సినిమాను 5 షోలు ప్రదర్శించనున్నారు.భారీ అంచనాలుప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీలో అమితాబ్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. సైన్స్ ఫిక్షన్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం: విజయేందర్ రెడ్డి
ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు. ‘నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు. కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తాం’ అని విజయేందర్ రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు వస్తునాయని చెబుతూ పది రోజులు వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయంనైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటాల ప్రతిపాదనలను తెలుగు నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు పంపించింది. -
'ఆర్ఆర్ఆర్' స్పెషల్ బెన్ఫిట్ షో కేవలం ఈ థియేటర్లలోనే..
RRR Movie Special Benefit Shows Only In 5 Theatres: ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆర్ఆర్ఆర్' మేనియా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్, అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రౌద్రం.. రణం.. రుధిరం.. సినిమా ఎట్టకేలకు మార్చి25న అంటే మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ సమయం సమీపిస్తుండటంతో అభిమానులు, ప్రేక్షకులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఫ్యాన్స్ తమ హీరోల కటౌట్లతోపాటు డైరెక్టర్ రాజమౌళి కటౌట్లను భారీగా ఏర్పాటు చేశారు. చదవండి: అధిక ధరకు 'ఆర్ఆర్ఆర్' టికెట్లు.. ఎక్కడ ? ఎలా ఉన్నాయంటే ? ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇచ్చాయి. అయితే, ఈ ప్రదర్శనలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల కోరిక మేరకు హైదరాబాద్‌లోని 5 థియేటర్లలో స్పెషల్ బెన్ఫిట్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరంలోని విశ్వనాథ్ (కూకట్పల్లి), అర్జున్ (కూకట్పల్లి), భ్రమరాంబ (కూకట్పల్లి), మల్లి కార్జున (కూకట్పల్లి), శ్రీరాములు (మూసాపేట) థియేటర్లలో మాత్రమే స్పెషల్ బెన్ఫిట్ షోకు అనుమతి ఉంది. కేవలం ఈ థియేటర్లలోనే ఉదయం 7 గంటల కన్నా ముందు షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా కేవలం మార్చి 25 తేదికి మాత్రమే పరిమితం. ఈ థియేటర్లు కాకుండా మరెక్కడైనా 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శిస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. చదవండి: అభిమానుల నుంచి జక్కన్నకు ఆసక్తికర గిఫ్ట్.. దర్శక ధీరుడి భారీ కటౌట్ -
థియేటర్ల బ్లాక్‌బస్టర్
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : తమకు ఇష్టమైన నటుడి సినిమాను విడుదల రోజు మొదటి ఆట (బెనిఫిట్ షో) చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహం చూపుతుంటారు. అభిమానుల ఆత్రుతను ఆసరా చేసుకుంటున్న థియేటర్ల నిర్వాహకులు అభిమానులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైన ప్రతిసారీ టికెట్ వాస్తవ ధర కన్నా.. కొన్ని రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ అభిమానుల జేబులు కొల్లగొడుతున్నారు. ఈ నెల 30న ఓ ప్రముఖ తెలుగు హీరో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాశాయి. బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీకి ఒకరోజు ముందు అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. దీన్ని అడ్డం పెట్టుకుని థియేటర్ల యజమానులు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. సాధారణ రోజుల్లో సినిమా టికెట్ల ధరలు తరగతులను బట్టి రూ.40, రూ.70, రూ.120, రూ. 150గా ఉంటాయి. పెద్ద హీరోలు, ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు వచ్చినప్పుడు చిత్ర నిర్మాణ సంస్థలు సినిమా విడుదలైన మొదటి వారం, పదిరోజుల పాటు సాధారణ రోజుల్లో ధరల కంటే అదనంగా విక్రయించుకునేందుకు అనుమతులను తీసుకుంటాయి. ఈనెల 30న విడుదల కాబోయే సినిమాకు కూడా అనుమతులు తీసుకున్నారు. అనుమతులకు అనుగుణంగా తరగతుల వారీగా రూ.50, రూ.100, రూ.200 కు టికెట్లను విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఈ రేట్లకు ఏమాత్రం సంబంధం లేకుండా టికెట్ల ధరలను థియేటర్ల యాజమాన్యాలు భారీగా పెంచేశాయి. అనుమతులు తీసుకున్న దానికన్నా.. ఎక్కువ ధరలకు విక్రయించేందుకు సినిమా డిస్ట్రిబ్యూటర్లు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఏలూరులో రూ.50కి విక్రయించాల్సిన టికెట్‌ను రూ.300కు, రూ.100కి విక్రయించాల్సిన టిక్కెట్‌ను రూ.400కు, రూ.200కు విక్రయించాల్సిన టిక్కెట్‌ను రూ.1000కు అమ్ముతున్నట్టు సమాచారం. భీమవరంలో రూ.200కు అమ్మాల్సిన టిక్కెట్‌ను రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకూ అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమాన సంఘాల నాయకుల ఆందోళన సాధారణంగా బెనిఫిట్ షో టికెట్లను అభిమాన సంఘాల నాయకులు తీసుకుంటుంటారు. ఈ సినిమా టిక్కెట్లనూ తీసుకునేందుకు అభిమాన సంఘ నేతలు డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా తాము నిర్ణయించిన ధరలను చెల్లించి టికెట్లను తీసుకోవాలని చెప్పినట్టు అభిమాన సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దీంతో చేసేది లేక ఆ ధరలకే టికెట్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ విక్రయాలు స్టాప్ ప్రతి సినిమా విడుదల తేదీ ముందు నుంచే ఆయా షోల టికెట్లను థియేటర్ల నిర్వాహకులు ఆన్లైన్లో విక్రయాలకు ఉంచుతుంటారు. కానీ పెద్ద హీరోల సినిమా టికెట్లను మొదటి రెండు, మూడు రోజుల పాటు ఆన్లైన్లో పెట్టకుండా అదనపు ధరలకు విక్రయిస్తూ ప్రేక్షకుల జేబులను కొల్లగొడుతున్నారు. టికెట్ల ధరలను మొదటి వారం రోజులపాటు పెంచి విక్రయించుకొనేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ విక్రయించే ధరలను థియేటర్ బుకింగ్ కౌంటర్ వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ థియేటర్ల నిర్వాహకులు ఆ విధంగా చేయడం లేదు. ఇలా చేయకపోవడం కూడా చట్ట విరుద్ధమేనని అధికారులు చెబుతున్నారు. పోలీసుల పాత్రపై అనుమానాలు సినిమా టికెట్ల ధరలను నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ బెనిపిట్ షోల టికెట్లను అదనపు ధరలకు విక్రయించుకునేందుకు పోలీసు శాఖ అధికారులూ సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పోలీసు అధికారులు ఇలాగే అనుమతులు ఇవ్వడం, దీనిపై సాక్షిలో కథనాలు రావడంతో విచారణ జరిపి గతంలో ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్‌కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కనీస సదుపాయాల్లేవు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సమయంలో సాధారణ ధరల కంటే ఎక్కువకు విక్రయించుకునేందుకు అనుమతులను తీసుకువస్తున్నారు. దీంతో పాటు బెనిఫిట్ షో టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తూ అభిమానుల జేబులు కొల్లగొడుతున్నారు. దీనిలో చూపిస్తున్న శ్రద్ధ థియేటర్లలో ప్రేక్షకులకు వసతులు కల్పించడంలో చూపడం లేదు. దీనిపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. – జి.శివకుమార్. డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోం కొత్త సినిమాల విడుదల సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు టికెట్లు అమ్మితే ఊరుకోం. బుధవారం సినిమా థియేటర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతాను. నిబంధనలు ఏం చెబుతున్నాయో, దానికి అనుగుణంగా టికెట్లు అమ్మాల్సి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటాం. – దిలీప్‌కిరణ్, ఏలూరు డీఎస్పీ -
మెగా అభిమానులకు నిరాశే..!
ప్రస్తుతం టాలీవుడ్లో ధృవ ఫీవర్ నడుస్తోంది. బడా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతుండటంతో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత సినిమా బ్రూస్లీ నిరాశపరచటంతో చరణ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్‌ను అందుకోవటంతో పాటు ఓవరాల్‌గా వందకోట్ల క్లబ్లో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ధృవ విషయంలో మెగా అభిమానులకు నిరాశ తప్పదని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోల సందడి మొదలవుతుంది. తమ అభిమాన నటుడి సినిమాను అందరికంటే ముందే చూసేందుకు ఫ్యాన్స్ ఎంత రేటు పెట్టైనా టికెట్ కొనేందుకు సిద్ధమవుతారు. అయితే ధృవ విషయంలో మాత్రం నిర్మాత అల్లు అరవింద్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ధృవ సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవట. ఉదయం ఆరుగంటల తరువాతే తొలి షో వేసేలా ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ కారణంగా ముందే టాక్ బయటికి వచ్చేయటంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో సరైనోడు రిలీజ్ సమయంలోనూ బెనిఫిట్ షోలకు నో చెప్పిన అల్లు అరవింద్. ప్రస్తుతం ధృవ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.