ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం: విజయేందర్ రెడ్డి | Tollywood Exhibitors Decided Not To Run Benefit Shows In Theaters | Sakshi
Sakshi News home page

ఎగ్జిబిటర్లకు పర్సంటేజీలు ఇవ్వాల్సిందే: తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు

Published Wed, May 22 2024 2:43 PM | Last Updated on Wed, May 22 2024 6:27 PM

Tollywood Exhibitors Decided Not To Run Benefit Shows In Theaters

ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్‌లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు.

 ‘నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు. కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తాం’ అని విజయేందర్‌ రెడ్డి అన్నారు. 

కాగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు వస్తునాయని చెబుతూ పది రోజులు వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం

నైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటాల ప్రతిపాదనలను తెలుగు నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు పంపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement