RRR Movie: Special Benefit Shows Only In 5 Theatres, Details Inside - Sakshi
Sakshi News home page

RRR Movie: 'ఆర్ఆర్ఆర్‌' స్పెషల్‌ బెన్‌ఫిట్‌ షో కేవలం ఈ థియేటర్లలోనే..

Published Thu, Mar 24 2022 9:16 PM | Last Updated on Fri, Mar 25 2022 1:00 PM

RRR Movie Special Benefit Shows Only In 5 Theatres - Sakshi

RRR Movie Special Benefit Shows Only In 5 Theatres: ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆర్‌ఆర్‌ఆర్‌' మేనియా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌, అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రౌద్రం.. రణం.. రుధిరం.. సినిమా ఎట్టకేలకు మార్చి25న అంటే మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్‌ కావడం, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌ సమయం సమీపిస్తుండటంతో అభిమానులు, ప్రేక్షకులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఫ్యాన్స్‌ తమ హీరోల కటౌట్‌లతోపాటు డైరెక్టర్‌ రాజమౌళి కటౌట్‌లను భారీగా ఏర్పాటు చేశారు. 

చదవండి: అధిక ధరకు 'ఆర్ఆర్ఆర్‌' టికెట్లు.. ఎక్కడ ? ఎలా ఉన్నాయంటే ?

ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇచ్చాయి. అయితే, ఈ ప్రదర్శనలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల కోరిక మేరకు హైదరాబాద్‌లోని 5 థియేటర్లలో స్పెషల్‌ బెన్‌ఫిట్‌ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరంలోని విశ్వనాథ్ (కూకట్‌పల్లి), అర్జున్‌ (కూకట్‌పల్లి), భ్రమరాంబ (కూకట్‌పల్లి), మల్లి కార్జున (కూకట్‌పల్లి), శ్రీరాములు (మూసాపేట) థియేటర్లలో మాత్రమే స్పెషల్‌ బెన్‌ఫిట్‌ షోకు అనుమతి ఉంది. కేవలం ఈ థియేటర్లలోనే ఉదయం 7 గంటల కన్నా ముందు షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా కేవలం మార్చి 25 తేదికి మాత్రమే పరిమితం. ఈ థియేటర్లు కాకుండా మరెక్కడైనా 'ఆర్ఆర్ఆర్‌' సినిమాను ప్రదర్శిస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. 



చదవండి: అభిమానుల నుంచి జక్కన్నకు ఆసక్తికర గిఫ్ట్‌.. దర్శక ధీరుడి భారీ కటౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement