విపత్కర పరిస్థితుల్లో ‘మేం ఉన్నాం’ అంటూ సినిమా పరిశ్రమ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీపై ఆధారపడి జీవనం సాగించే చిన్నస్థాయి కళాకారుల జీవనశైలి కుంటుపడింది. దీంతో అటు కరోనా వైరస్‌పై పోరాడేందుకు కొందరు, చిన్నస్థాయి కళాకారులకు అండగా ఉండేందుకు మరికొందరు సినిమా తారలు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. గురువారం మరికొంతమంది తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించారు. ఈ వివరాలు.
► చిరంజీవి – కోటి రూపాయలు
(కరోనా కారణంగా ఉపాధి కాల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం).
► మహేశ్‌బాబు – కోటి రూపాయలు
(ఆంధ్రప్రదేశ్‌కు 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు.)
► ప్రభాస్ – కోటి రూపాయలు
(ఆంధ్రప్రదేశ్‌కు 50లక్షలు, తెలంగాణకు 50 లక్షలు.)
► పవన్‌కల్యాణ్ – 2 కోట్లు
(ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి కోటి రూపాయలు.)
► ఎన్టీఆర్ – 75 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, తెలుగు సినీ కార్మికులకు 25 లక్షలు.)
► రామ్‌చరణ్ – 70 లక్షలు
(కేంద్ర, తెలుగురాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి)
► ‘నాంది’
(ప్రస్తుతం ‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న చిత్రం) యూనిట్‌లో రోజువారి వేతనంతో జీవనం సాగించే 50మందికి పైగా ఉన్న కార్మికులకు చిత్రనిర్మాత సతీష్ వేగేశ్నతో కలిసి ప్రతి ఒక్కరికి తలా 10వేల రూపాయలను సాయంగా అందించాలని ‘అల్లరి’ నరేశ్ నిర్ణయించుకున్నారు.
► సాయితేజ్ – 10 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.)
► నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ – 20 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు.)
► త్రివిక్రమ్ – 20 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 10లక్షలు, తెలంగాణకు 10 లక్షలు.)
► అనిల్ రావిపూడి – 10 లక్షలు
( ఆంధ్రప్రదేశ్‌కు 5లక్షలు, తెలంగాణకు 5లక్షలు)
► కొరటాల శివ – 10 లక్షలు
( ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.)
సాయం సమయం
Published Fri, Mar 27 2020 6:57 AM | Last Updated on Fri, Mar 27 2020 6:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment