కూతురి నిశ్చితార్థం రద్దు.. విలేకరి విరాళం | Journalist Cancelled Daughter Engagement In kerala | Sakshi
Sakshi News home page

కూతురి నిశ్చితార్థం రద్దు.. విలేకరి విరాళం

Published Fri, Aug 17 2018 9:50 PM | Last Updated on Sat, Aug 18 2018 12:28 PM

Journalist Cancelled Daughter Engagement In kerala - Sakshi

తన కుటుంబం వివాహ వేడుకలు చేసుకోవడం సబబు కాదనుకున్నాడు..

తిరువనంతపురం : వరుణుడి ఉగ్రరూపానికి కేరళ ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నారు. వందేళ్ల చర్రితలో ఎన్నడూలేని విధంగా వరదల దాటికి శుక్రవారం నాటికి 326 మంది మృతి చెందినా వరుణుడు కనీసం కనికరం చూపించట్లేదు. ఈ నేపథ్యంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా అనేక మంది ముందుకు వస్తున్నారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఓ విలేకరి నిజమైన మానవత్వాన్ని చాటాడు. తన కూతురి నిశ్చితార్థం కోసం దాచిన డబ్బును కేరళ వరద బాధితులకు సహాయం చేశారు.

కేరళకు చెందిన మనోజ్‌ అనే విలేకరి కుమారై వివాహం త్వరలో జరగాల్సి ఉంది. కాగా ఈ నెల 19న కుమార్తె నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో ఒ వైపు తన రాష్ట్ర ప్రజల వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. తన కుటుంబం వివాహ వేడుకలు చేసుకోవడం సబబు కాదనుకున్నాడు. ఈ మేరకు వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడు. అంతేకాకుండా వివాహం కోసం దాచిన డబ్బును వరుడి అనుమతితో ముఖ్యమంత్రి సహయ నిధికి విరాళంగా చెల్లించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement