sun tv
-
విషాదం: క్యాన్సర్‌తో కన్నుమూసిన యాక్టర్ ఆనంద
RIP Anandha Kannan: కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యాంకర్, సినీ నటుడు ఆనంద కణ్ణన్ క్యాన్సర్‌తో కన్నుమూశాడు. సింగపూర్-తమిళియన్ అయిన ఆనంద.. 90వ దశకంలో కోలీవుడ్ ఆడియొన్స్‌కు ఫేవరెట్ నటుడు కూడా. ముఖ్యంగా సన్ టీవీ సిరీస్ సింధ్‌బాద్‌లో లీడ్ రోల్ ద్వారా పిల్లలకు, యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆనంద.. ఆగష్టు 16న కన్నుమూసినట్లు తెలుస్తోంది. 48 ఏళ్ల వయసులో క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ.. ఆయన నవ్వుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం తిరగబడడంతో ఆయన్ని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయం తెలియగానే యావత్ కోలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. క్రియేటర్‌గా, నటుడిగా 30 ఏళ్ల పాటు తమిళ ఆడియొన్స్‌ను ఆయన అలరించాడు. ఏకేటీ థియేటర్స్‌ను ఏర్పాటుచేసి.. వర్క్‌షాప్స్‌తో రూరల్ కల్చర్ ద్వారా వర్ధమాన నటులెందరినో ప్రోత్సహించాడు. కాగా, సింగపూర్‌లో వసంతం టీవీ ద్వారా వీజేగా కెరీర్ ప్రారంభించిన ఆనంద.. తర్వాత చెన్నైలో స్థిరపడ్డాడు. సన్ మ్యూజిక్ తో పాటు సన్ టీవీలో సీరియళ్ల ద్వారా ఆడియెన్స్‌ను అలరించాడు. ‘సరోజ, అదిసయ ఉల్గం’ చిత్రాల్లో ఆయన నటించగా.. మరో రెండు చిత్రాలు రిలీజ్‌కు నోచుకోలేదు. సింగపూర్‌లోనూ ఆయన షోలు సూపర్ హిట్. యూత్ ఐకాన్‌గా పేరున్న ఆనంద మృతిని చాలామంది తట్టుకోలేకపోతున్నారు. #RIPanandakannan ట్రెండ్‌తో సోషల్ మీడియా నివాళి అర్పిస్తోంది. సింగపూర్ సెలబ్రిటీ వడివళన్, కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. A great friend a great human is no more!! #RIPanandakannan my deepest condolences pic.twitter.com/6MtEQGcF8q — venkat prabhu (@vp_offl) August 16, 2021 -
టీవీ ఛానల్‌ను ప్రశ్నించిన త్రిష!
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’ సినిమా ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ నాట ఈ మూవీ సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. దీపావళి కానుకగా సన్ నెట్వర్క్ ఈ చిత్రాన్ని టీవీలో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. దీనిపై త్రిష సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఇప్పటికీ 80 శాతం థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. అలాంటప్పుడు ఇంత త్వరగా సినిమా ప్రీమియర్ షో వేయడం కరెక్ట్ కాదు. సంక్రాంతికి ప్రీమియర్ షో వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం’ అంటూ త్రిష ట్వీట్ చేసింది. Its our 5th week and we still have an 80% occupancy in all theatres.We as a team feel its unfair to be premiering 96 this early. Its our request to push it to a Pongal viewing pls @SunTV Will be grateful #96thefilm #Ban96MoviePremierOnSunTv — Trish Krish (@trishtrashers) 3 November 2018 -
బుల్లితెరకు విశాల్!
పెద్ద పెద్ద హీరోలంతా... చిన్న తెరలపై కనిపించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, కమల్ హాసన్, మోహన్ లాల్, సూర్య లాంటి హీరోలు బుల్లితెరపై కనిపించి అభిమానులను సంతోషపరిచారు. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్ లాంటి షోలతో పెద్ద హీరోలు బుల్లితెరపై హంగామా చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి విశాల్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు. నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతగా, నటుడిగా బిజీగా ఉన్న విశాల్.. తాజాగా ఓ షోతో బుల్లితెరను పలకరించబోతున్నారు. తెలుగులో పాపులర్ అయిన ‘మేము సైతం’ కార్యక్రమంలాంటి షోను తమిళ్లో విశాల్ హోస్ట్ చేయబోతోన్నాడు. సెలబ్రెటీలు సామాన్యులుగా మారి సంపాదించే డబ్బును చారిటీలకు ఇచ్చేలా షోను డిజైన్ చేయబోతున్నారు నిర్వాహకులు. సన్ టీవీలో ప్రసారం కానున్న ఈ షో త్వరలోనే ప్రారంభంకానుంది. A unique show hosted by @VishalKOfficial. Coming soon on @SunTV ! pic.twitter.com/uWb1djXVoM — Sun TV (@SunTV) 18 September 2018 -
వరదలు : తమిళ మీడియా సంస్థలు, నటుల ఔదార్యం
చెన్నై: ప్రకృతి బీభత్సంతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునే విషయంలో తమిళనాడు ప్రజలు, నటులు, మీడియా సంస్థలు తమ ఔదార్యాన్ని ప్రదర్శించాయి. పొరుగు రాష్ట్రం కేరళ మద్దతుగా స్పందిస్తున్నాయి. అక్కడి సహాయ, రక్షణ,పునారవాస కార్యక్రమాల్లో అనేకమంది ప్రజలు నిమగ్నమయ్యారు. అలాగే కోట్ల రూపాయలు విరాళాలతో ఆపదలో ఆపన్నహస్తమవుతున్నారు. ముఖ్యంగా సన్‌టీవీ కోటి రూపాయల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందించారు. అలాగే తమిళనాట మరో ప్రముఖ టీవీ విజయ్ టీవీ కూడా 25లక్షల రూపాయలను ప్రకటించింది. ఇప్పటికే తమిళ సినీహీరో విశాల్ భారీ విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే కేరళ ప్రజలను ఆదుకోవాల్సిందిగా ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అలాగే మరో హీరో సిద్దార్థ్ ట్విటర్లో కేరళ డొనేషన్ చాలెంజ్‌ను ప్రారంభించారు. దీనికి భారీ స్పందన లభిస్తోంది. సినీ నటుడు, లీడర్ కమల్‌హాసన్ రూ. 25లక్షలు, తమిళ హీరోలు సూర్య, కార్తి 25లక్షలు విరాళమిచ్చారు. మరోవైపు తమిళనటులతో పాటు మలయాళం నటుడు మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సాల్మన్ కేరళ వదరబాధితులకు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. దీంతోపాటు అసోసియేషన్ ఆఫ్ మలయాల మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మా) 10కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్ విజయ్ దేవర్ కొండ భారీ విరాళాలను ప్రకటించారు. Sun TV has donated One Crore Rupees to the Kerala Chief Minister’s Disaster Relief Fund towards the Kerala Government’s flood relief works. pic.twitter.com/sF5T6Gtvn1 — Sun TV (@SunTV) August 17, 2018 -
ఆ ఛానెల్ వార్తను నమ్మొద్దు : స్టార్ హీరో
సాక్షి, చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ అసత్యపు కథనాలపై స్పందించారు. తన ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగిందంటూ ఓ ప్రముఖ ఛానెల్ లో వస్తున్న వార్తను ఆయన ఖండించారు. ‘సన్ న్యూస్ ఛానెల్లో నా ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగినట్లు ఫ్లాష్ న్యూస్ స్క్రోలింగ్ వస్తోంది. అది నిజం కాదు’ అని ఆయన కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. కాగా, గతంలో డీఎంకే పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన.. కరుణానిధి కుటుంబంతో విభేధాల కారణంగా 2006లో పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం అఖిల భారతీయ సమతువా మక్కల్ అనే రాజకీయ పార్టీతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. The flash news scrolling in Sun News channel that petrol bombs have been hurled at my house is not true — R Sarath Kumar (@realsarathkumar) 11 March 2018 -
సూర్యకు క్షమాపణ చెప్పాల్సిందే..
తమిళసినిమా: నటుడు సూర్య ఎత్తు గురించి వ్యంగ్యంగా మాట్లాడిన సన్ టీవీ యాంకర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కోలీవుడ్‌లో అధికం అవుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో సూర్య హీల్స్ వేసుకుని అనుష్కతో నటించా రని, త్వరలో అమితాబ్ బచ్చన్‌తో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో స్టూల్‌పై నిలబడి నటిస్తారా? అని పరిహాసం చేసిన లేడీ యాంకర్ల వ్యవహారం కోలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే దక్షిణ భారత నటీనటుల సంఘం సన్‌టీవీ యాంకర్ల వ్యవహారంపై సీరియస్ అయిన విష యం తెలిసిందే. ఆ మహిళా వ్యా ఖ్యాతలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నటుడు కరుణాస్, దర్శకుడు విఘ్నేశ్‌శివ, నిర్మాత కేఈ. జ్ఞానవేల్‌రాజా వ్యాఖ్యాత తీరును తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి కుష్బూ ఆ యంకర్లు సూర్య కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమె ఆదివారం ట్విట్టర్లో ఈ వ్యవహారంపై స్పందిస్తూ పొడవైన వారు ఎవరూ? పొట్టివా రు ఎవరూ? ఎవరు లావు అయితే వీరికేమిటీ, సన్ననైనే వీరికేమిటీ? అంటూ ప్రశ్నించారు. వీటి వల్ల వారికి కలిగే సంతోషం ఏమిటీ? అన్నారు. సూర్య గురించి మాట్లాడిన వారు సిగ్గు పడాలన్నారు. ఇది అర్ధరహిత చర్చ అన్నారు. ఆ ఇద్దరు మహిళా యాంకర్లు సూర్యకు క్షమాపణ చెప్పాలని కుష్బూ డిమాండ్ చేశారు. -
శశికళ షాక్‌తో సన్‌టీవీ జూమ్
చెన్నై: ఎఐఎడిఎంకె నేత వికె శశికళకు సుప్రీంకోర్టు షాక్ ఇవ్వడంతో మార్కెట్లో సన్ టీవీ, రాజ్టీవీ షేర్లు దూసుకుపోయాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్దారిస్తూ సుప్రీం తీర్పు వెలువరించడంతో మార్కెట్లో ఈ షేర్లకు డిమాండ్ పుట్టింది. మదుపర్ల కొనుగోళ్లతో సన్‌టీవీ 4శాతం, రాజ్ టీవీ 12 శాతానికిపైగా ఎగిసింది. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి మురసోలి మారన్ కుమారుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే నేతకరుణానిధికి మేనల్లుని కుమారుడు కళానిధి మారన్ 75 శాతం సొంతం చేసుకున్న సన్ టీవీ షేర్లు రూ 4 శాతం లాభపడింది. మరోవైపు ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్‌కు భారీ ఊరట కలగడంతో సన్ టీవీ ఇటీవల బాగా ర్యాలీ అయింది. ఈ ర్యాలీకి తాజా సుప్రీం తీర్పు మరింత జోష్ నిచ్చింది. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంకోసం మల్లగుల్లాలుపడుతున్న శశికళపై నమోదైన ఆదాయానికిమంచి అక్రమ ఆస్తుల కేసులో మంగళవారం తుది తీర్పును వెలువరించింది సుప్రీం. నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో తదుపరి పది సంవత్సరాలు ఎన్నికల పోటీ నుంచి శశికళను నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
రెండో రోజూ ర్యాలీ..
సెన్సెక్స్ 120 పాయింట్లు లాభం ప్రపంచ ట్రెండ్ అనుకూలించడంతో పాటు అస్సాంలో తొలిసారిగా బీజేపీ అధికారం చేపట్టవచ్చన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో వరుసగా రెండో రోజు మార్కెట్ పెరిగింది. పశ్చిమ బెంగాల్, కేరళలో బీజేపీ సీట్ల సంఖ్య పెరగవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ పెరుగుదలకు దోహదపడిందని విశ్లేషకులు చెప్పారు. దీంతో కీలకమైన సంస్కరణల బిల్లుల్ని కేంద్రం ఆమోదింపచేసుకోగలుగుతుందన్న ఆశలు ఇన్వెస్టర్లలో కలిగాయని బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ అన్నారు. ఒకదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపినా.. ముగింపులో లాభాల స్వీకరణ కారణంగా 120 పాయింట్ల లాభంతో 25,774 పాయింట్ల వద్ద ముగిసింది. 7,940 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 30 పాయింట్ల లాభంతో 7,891 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆసియా మార్కెట్లయిన హాంకాంగ్, సింగపూర్, జపాన్, తైవాన్ సూచీలు 1.6% వరకూ పెరిగాయి. పెట్రో కంపెనీల జోరు... ప్రభుత్వం తాజాగా డీజిల్, పెట్రోల్ ధరల్ని పెంచడంతో పెట్రో మార్కెటింగ్ కంపెనీలు ఆయిల్ ఇండియా, బీపీసీల్, ఆయిల్ ఇండియా షేర్లు 0.8-3.6% మధ్య పెరిగాయి. అన్నింటికంటే అధికంగా ఓఎన్జీసీ 3.72% ఎగిసింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, మారుతి, మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-3.32%మధ్య పెరిగాయి. ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనీలీవర్, ఆదాని పోర్ట్స్ షేర్లు 1-2%మధ్య క్షీణించాయి. సన్‌టీవీ అదుర్స్... తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక ల్లో డీఎంకే మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోవచ్చన్న అంచనాల్ని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించడంతో సన్‌టీవీ షేరు దూసుకుపోయింది. 10 %పెరిగిన ఈ షేరు 52 వారాల గరిష్టస్థాయి రూ. 431.65 వద్ద ముగిసింది. సన్‌టీవీ అధినేత కళానిధి మారన్...డీఎంకే చీఫ్ కరుణానిధికి సమీప బంధువు, సన్నిహితుడుకావడంతో ఆ పార్టీ అధికారంలోకి వస్తే సన్‌టీవీ నెట్వర్క్ మరింత విస్తరించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆ షేర్లను కొనుగోలుచేసినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్
చెన్నై: సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. కేరళ బదిలీ చేయడంతో ఐదు నెలల క్రితం సన్ టీవీలో ఆమె ఉద్యోగం వదులుకుంది. అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ ఉన్నతోద్యోగి అరెస్ట్ కావడం ఈ ఏడాదిలో రెండోసారి. మహిళా యాంకర్ ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో న్యూస్ ఎడిటర్ ఒకరు అంతకుముందు అరెస్ట్ అయ్యారు. -
మార్కెట్ మరో కొత్త రికార్డ్
వర్షాలు ఆలస్యమైనప్పటికీ ద్రవ్యోల్బణంపై ఆందోళనలు అక్కర్లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన అభయంతో స్టాక్ మార్కెట్లు మరోసారి కొత్త రికార్డులను సాధించాయి. అమెరికా సూచీ డోజోన్స్ 17,000 పాయింట్లను అధిగమించడం, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు బాగా దిగిరావడం కూడా ఇందుకు దోహదపడింది. వెరసి సెన్సెక్స్ 138పాయింట్లు పుంజుకుని 25,962 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 37 పాయింట్లు బలపడి 7,752 వద్ద నిలిచింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా, ఒక దశలో సెన్సెక్స్ 160 పాయింట్లకుపైగా నష్టపోయింది. కనిష్టంగా 25,659ను తాకింది.తగిన స్థాయిలో నిల్వ ఉంచిన ఆహారోత్పత్తుల విడుదల ద్వారా ధరలు పెరగకుండా చూస్తామని జైట్లీ వ్యాఖ్యానించడంతో చివర్లో సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా బ్లాక్‌మార్కెటీర్లపై తగిన చర్యలను చేపట్టనున్నట్లు జైట్లీ తెలియజేయడం, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 111 డాలర్ల దిగువకు చేరడం వంటి అంశాలు కూడా దీనికి బలాన్ని చేకూర్చాయని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వారంలో సెన్సెక్స్ 862 పాయింట్లు లాభపడటం విశేషం! ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నాలుగు రోజుల్లో రూ. 4,400 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తాజాగా రూ. 943 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీ సంస్థలు రూ. 853 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ప్రధానంగా ఆయిల్, రియల్టీ రంగాలు 1%పైగా లాభపడ్డాయి. కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచే ప్రతిపాదనలపై ఆయిల్ శాఖ నిపుణుల కమిటీని నియమించనుందన్న వార్తలతో చమురు, గ్యాస్ షేర్లు వెలుగులో నిలిచినట్లు విశ్లేషకులు తెలిపారు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఆర్ఐఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, గెయిల్ 4-1% మధ్య పురోగమించాయి. సెన్సెక్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.3%, డాక్టర్ రెడ్డీస్ 1.6% చొప్పున లాభపడగా, సెసాస్టెరిలైట్, విప్రో 1.5% స్థాయిలో నష్టపోయాయి. చిన్న షేర్లు ఓకే మార్కెట్లకు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5%పైగా లాభపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,683 లాభపడితే, 1,357 నష్టపోయాయి. కంపెనీ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 990 కోట్ల ప్యాకేజీని ఇవ్వనుందన్న వార్తలతో ఫ్యాక్ట్ షేరు 5% ఎగసింది. మిడ్ క్యాప్స్‌లో హిందుజా గ్లోబల్ 20% దూసుకెళ్లగా, యునెటైడ్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్, పొలారిస్, కాక్స్‌అండ్‌కింగ్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, కార్బొరేండమ్, ఇక్రా, ట్రీహౌస్, మహీంద్రా సీఐఈ, పీసీ జ్యువెలరీ, రోల్టా, కేపీఐటీ కమిన్స్ 13-6% మధ్య జంప్‌చేశాయి. -
ఆర్జనలో కళానిధి మారన్ దంపతులు టాప్
భారత కార్పొరేట్ రంగంలో అత్యధిక మొత్తంలో వేతనాలు పొందుతున్న వారి జాబితాలో సన్ టీవీ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మొదటి స్థానంలో నిలిచారు. గత ఆర్థిక సంవత్సరంలో మారన్ దంపతులు చెరో 56.25 కోట్ల రూపాయలు ఆర్జించారు. అంతకుముందు ఏడాది మొదటి స్థానంలో ఉన్న జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్‌ను వీరిద్దరూ వెనక్కినెట్టారు. జిందాల్ (54.98 కోట్లు) ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నారు. 2011-12 సంవత్సరంలో 73.42 కోట్ల రూపాయాలతో అగ్రస్థానంలో నిలిచిన జిందాల్‌కు గతేడాది 25 శాతం ఆదాయం తగ్గింది. కాగా గత నాలుగేళ్ల నుంచి మారన్, జిందాల్ కుటుంబ సభ్యులే ఎక్కువ వేతనం పొందుతుండటం విశేషం. ఇద్దరూ చెరో రెండేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్నారు. తాజా జాబితాలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా (49.62 కోట్లు) నాలుగో స్థానంలో నిలిచారు.