
అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ సీఓఓ అరెస్ట్
చెన్నై: సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ మేరకు స్పందించారు. కేరళ బదిలీ చేయడంతో ఐదు నెలల క్రితం సన్ టీవీలో ఆమె ఉద్యోగం వదులుకుంది.
అత్యాచార ఆరోపణలతో సన్ టీవీ ఉన్నతోద్యోగి అరెస్ట్ కావడం ఈ ఏడాదిలో రెండోసారి. మహిళా యాంకర్ ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో న్యూస్ ఎడిటర్ ఒకరు అంతకుముందు అరెస్ట్ అయ్యారు.