ఈ సెక్సువల్ హెరాస్‌మెంట్స్ అన్నీ ఎక్కడో బయట వారి నుంచి ఎదురవ్వవు. మన బంధువుల్లో నుంచే ఎదురవుతాయి.
‘‘మన దేశం ప్రస్తుతం చాలా సమస్యలతో సతమతమౌతోంది. కొన్ని సమస్యలను మనం పరిష్కరించలేం. కొన్నింటిని మనం పరిష్కరించుకోగలం. అందులో ఫస్ట్‌ది ఉమెన్ సేఫ్టీ. సెక్సువల్ హెరాస్‌మెంట్‌కి గురైనవారు చాలామంది ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను’’ అన్నారు నివేథా పెతురాజ్. ఈ మలయాళ బ్యూటీ ‘మెంటల్ మదిలో’ చిత్రంలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ మధ్య దాదాపు రోజుకో లైంగిక దాడికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నివేథా పైవిధంగా పేర్కొన్నారు. తన మనోభావాలను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో నివేథా ఏం మాట్లాడారంటే.. ‘‘చిన్నప్పుడు నా మీద లైంగిక దాడి జరిగింది. ఆ విషయాన్ని నా తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఆ వయసులో నాకు అర్థం కాలేదు. ఈ సెక్సువల్ హెరాస్‌మెంట్స్ అన్నీ ఎక్కడో బయట వారి నుంచి ఎదురవ్వవు.
మన బంధువుల్లో నుంచే ఎదురవుతాయి. పేరెంట్స్ అందరూ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ పిల్లలతో కూర్చోండి, అడిగి తెలుసుకోండి. ఈ విషయాలపై అవగాహన కల్పించండి. స్కూల్‌లో, ట్యూషన్‌లో ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఈ సందర్భంగా మా మేల్ ఫ్రెండ్స్ అందరికీ ఓ విషయం చెప్పదలిచాను. మీరు మాకోసం చాలా చేస్తారు. మీ అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నా. మన వీధుల్లో ఏం జరుగుతుందో కనుక్కోండి. ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి. మీరు ఏవిధంగా హెల్ప్ చేయాలనుకున్నారో అలా చేయండి. ప్రతీదానికి పోలీసుల మీద డిపెండ్ అవ్వలేం కదా. వాళ్లు హెల్ప్ చేయరని కాదు, కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారి సహాయం అవసరం అవుతుంది. బయటకు వెళ్లగానే చూసిన ప్రతీవాళ్లను అనుమానించాలంటే భయంగానూ, బాధగానూ ఉంటుంది. ఆ పరిస్థితి మారాలి. మారాలంటే లైంగిక దాడులు జరగకూడదు. మీరు (మగవాళ్లు) తలుచుకుంటే దీన్ని అంతం చేయగలరు. మా హంబుల్ రిక్వెస్ట్, మమ్మల్ని కాపాడండి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment