చెన్నై: ఎఐఎడిఎంకె నేత వికె శశికళకు సుప్రీంకోర్టు షాక్ ఇవ్వడంతో మార్కెట్లో సన్ టీవీ, రాజ్‌టీవీ షేర్లు దూసుకుపోయాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్దారిస్తూ సుప్రీం తీర్పు వెలువరించడంతో మార్కెట్లో ఈ షేర్లకు డిమాండ్ పుట్టింది. మదుపర్ల కొనుగోళ్లతో సన్‌టీవీ 4శాతం, రాజ్ టీవీ 12 శాతానికిపైగా ఎగిసింది.
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి మురసోలి మారన్ కుమారుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే నేతకరుణానిధికి మేనల్లుని కుమారుడు కళానిధి మారన్ 75 శాతం సొంతం చేసుకున్న సన్ టీవీ షేర్లు రూ 4 శాతం లాభపడింది. మరోవైపు ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్కు భారీ ఊరట కలగడంతో సన్ టీవీ ఇటీవల బాగా ర్యాలీ అయింది. ఈ ర్యాలీకి తాజా సుప్రీం తీర్పు మరింత జోష్ నిచ్చింది.
కాగా తమిళనాడు ముఖ‍్యమంత్రి పీఠంకోసం మల్లగుల్లాలుపడుతున్న శశికళపై నమోదైన ఆదాయానికిమంచి అక్రమ ఆస్తుల కేసులో మంగళవారం తుది తీర్పును వెలువరించింది సుప్రీం. నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో తదుపరి పది సంవత్సరాలు ఎన్నికల పోటీ నుంచి శశికళను నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
శశికళ షాక్‌తో సన్‌టీవీ జూమ్
Published Tue, Feb 14 2017 5:25 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
Advertisement