చిన్నమ్మ చేసిన శపథం ఏంటంటే..!
చెన్నై: బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోయేముందు శశికళ.. చెన్నై మెరీనా బీచ్లో తన నెచ్చెలి జయలలిత సమాధిపై మూడుసార్లు కొట్టి శపథం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బెంగళూరుకు బయల్దేరారు. ఈ దృశ్యాలు టీవీల్లో కనిపించడంతో అమ్మ సమాధి సాక్షిగా చిన్నమ్మ ఏ శపథం చేశారన్నది తమిళనాడులో చర్చనీయాంశమైంది. అన్నా డీఎంకే ట్విట్టర్ లో దీనిపై వివరణ ఇచ్చారు. తనకు చేసిన నమ్మకద్రోహానికి, తనపై జరిగిన కుట్రలకు ప్రతీకారం తీర్చుకుంటామని చిన్నమ్మ శపథం చేసినట్టు ట్వీట్లో వెల్లడించారు.
కాగా తమిళ వెబ్‌సైట్లలో శశికళ చేసిన శపథాలపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆ మూడు శపథాలు ఏంటంటే..
శపథం 1: కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటా
శపథం 2: నాపై జరిగిన కుట్రకు ప్రతీకారం తీర్చుకుంటా
శపథం 3: నమ్మక ద్రోహులకు గుణపాఠం చెబుతా
తమిళనాడు మరిన్ని అప్‌డేట్స్ చూడండి..