jayalalithaa da case
-
శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..
దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరప్పణ అగ్రహార జైలు శశికళకు కొత్తేమీ కాదు గానీ, అక్కడ దాదాపు నాలుగేళ్లు ఉండటం మాత్రం అంత సులభం కాదు. 2014 సంవత్సరంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతో పాటు దోషిగా తేలి ఇక్కడకు వచ్చిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఒక సాధారణ ఖైదీగా మాత్రమే ఈ జైల్లో ఉండాల్సి వస్తుంది. జయలలితతో కలిసి ఉన్నప్పుడు ఆమెకు కూడా స్పెషల్ హోదా లభించింది. ప్రైవేటు సెల్, ఫ్యాన్, ఇంగ్లీషు, తమిళ వార్తా పత్రికలు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రాజభోగాలన్నీ పోయాయి. సర్వసాధారణంగానే ఇతర ఖైదీల్లాగే మామూలు సెల్లో ఆమె ఉండాలి. ఆమెతోపాటు మరో ఇద్దరు మహిళలు కూడా అదే సెల్లో ఉంటారు. ఇందులో సర్వసాధారణ సదుపాయాలు మాత్రమే ఉంటాయి. ఏమాత్రం ప్రైవసీ ఉండదు. తెల్లవారుజామున లేస్తే తప్ప టాయిలెట్లను వాడటం అంత ఈజీ కాదు. ఒక గంట తర్వాత రోజంతా అవి కంపు కొడుతూనే ఉంటాయి. ఖైదీలందరికీ తెల్లటి యూనిఫాం తప్పనిసరి. పనిచేయడానికి ఒక బేకరీ, ట్రక్ షాపు.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే అక్కడ చేసిన పనికి సరిపడ కూపన్లు ఇస్తారు. అక్కడ ఒక గుడి, చర్చి, మసీదు అన్నీ ఉన్నాయి. పరప్పణ అగ్రహార జైలుకు దాదాపు మూడేళ్ల నుంచి సున్నం కూడా వేయలేదు. కొత్తగా వచ్చినవాళ్లయితే ఈ జైలు చూసి భయపడటం ఖాయం. దాదాపుగా పెద్దగోడలున్న ఓ మురికివాడలాగే ఉంటుందని అంటారు. బ్యారక్‌లలో ఉన్న టాయిలెట్లకు ఒక గంట పాటు మాత్రమే నీళ్లు వస్తాయి. అదే స్పెషల్ సెల్‌లకు అయితే అక్కడి బాత్రూంలలో ఎప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయి. తాను జైలు నుంచే పార్టీ కోసం పనిచేస్తానని శశికళ చెప్పారు గానీ, అది అంత సులభం కాదు. ఎందుకంటే ఆమె ఇక్కడ కిచెన్‌లో గానీ, బేకరీలో గానీ, చెక్క పని గానీ చేయాల్సి ఉంటుంది. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
చిన్నమ్మ చేసిన శపథం ఏంటంటే..!
చెన్నై: బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోయేముందు శశికళ.. చెన్నై మెరీనా బీచ్‌లో తన నెచ్చెలి జయలలిత సమాధిపై మూడుసార్లు కొట్టి శపథం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బెంగళూరుకు బయల్దేరారు. ఈ దృశ్యాలు టీవీల్లో కనిపించడంతో అమ్మ సమాధి సాక్షిగా చిన్నమ్మ ఏ శపథం చేశారన్నది తమిళనాడులో చర్చనీయాంశమైంది. అన్నా డీఎంకే ట్విట్టర్ లో దీనిపై వివరణ ఇచ్చారు. తనకు చేసిన నమ్మకద్రోహానికి, తనపై జరిగిన కుట్రలకు ప్రతీకారం తీర్చుకుంటామని చిన్నమ్మ శపథం చేసినట్టు ట్వీట్లో వెల్లడించారు. కాగా తమిళ వెబ్సైట్లలో శశికళ చేసిన శపథాలపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆ మూడు శపథాలు ఏంటంటే.. శపథం 1: కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటా శపథం 2: నాపై జరిగిన కుట్రకు ప్రతీకారం తీర్చుకుంటా శపథం 3: నమ్మక ద్రోహులకు గుణపాఠం చెబుతా తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చీలిక దిశగా అన్నాడీఎంకే! జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే
శశికళ చెన్నై నగరాన్ని వీడి బెంగళూరుకు అలా బయల్దేరారో లేదో.. ఆమె మీద ఒక కిడ్నాప్ కేసు నమోదైంది. శశికళతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన మంత్రి పళనిసామి మీద కూడా కలిపి ఈ కేసు నమోదు చేశారు. తనను వీళ్లిద్దరూ కలిసి కిడ్నాప్ చేశారంటూ దక్షిణ మదురై ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూవత్తూరు పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అయితే ఇంతకుముందు చెన్నై పోలీసులు కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి అక్కడ తాము ప్రతి ఎమ్మెల్యేతోను మాట్లాడామని, మొత్తం 112 మంది ఎమ్మెల్యేలు తాము స్వచ్ఛందంగానే వచ్చినట్లు చెప్పారంటూ హైకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. మరి ఇప్పుడు ఈ ఫిర్యాదు ఎలా వచ్చిందో చూడాలి. కాగా గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యే శరవణన్ పారిపోయి బయటకు వచ్చారు. ఆయన పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపారు. -
జయ సమాధి సాక్షిగా శశికళ శపథం
-
జయ సమాధి సాక్షిగా శశికళ శపథం
చెన్నై : అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...తన నిచ్చెలి జయలలిత సమాధి వద్ద శపథం చేశారు. బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు బయల్దేరిన ఆమె ముందుగా మెరినా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద నివాళి అర్పించింది. ఈ సందర్భంగా శశికళ ఉద్వేగంతో పాటు ఒకింత ఆగ్రహంగా కూడా కనిపించారు. మూడుసార్లు జయ సమాధిపై మూడుసార్లు చేత్తో కొట్టి శపథం చేశారు. మరోవైపు శశికళ మద్దతుదారులు ఆమెకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జయకు నివాళి అర్పించిన అనంతరం శశికళ వాహనంలో బెంగళూరు బయల్దేరారు. రోడ్డు మార్గంలో ఆమె అక్కడకు చేరుకోనున్నారు. కాగా అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఆరోగ్యం బాగోలేనందున లొంగిపోయేందుకు నెల రోజుల సమయం కావాలని శశికళ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆమెకు చుక్కెదురు అయింది. శశికళ వెంటనే లొంగిపోవల్సిందేనని న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. దాంతో శశికళ బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. ఈ మేరకు ఆమె సాయంత్రంలోగా కోర్టులో లొంగిపోతారని శశికళ తరఫు న్యాయవాదులు బెంగళూరు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదొరై బెంగళూరు చేరుకున్నారు. అంతకు ముందు పోయెస్ గార్డెన్ లో శశికళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
జయలలితకు మూడుసార్లు మొక్కి..
జైలుకు వెళ్లాల్సి వస్తుందని నిర్ణయించుకున్న శశికళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పోయెస్ గార్డెన్స్ నుంచి బయల్దేరిన ఆమె.. ముందుగా మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి, అక్కడ ప్రదక్షిణలు చేసి, మూడుసార్లు సమాధికి మొక్కి మరీ అక్కడి నుంచి బెంగళూరు బయల్దేరారు. అయితే సాధారణంగా ఆ సమయంలో ఎవరైనా నమస్కారం మాత్రమే పెడతారు. కానీ శశికళ మాత్రం అరచేత్తో సమాధి మీద కొట్టినట్లు చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. గులాబి పూల రేకులు సమాధి మీద ఉంచి.. ఆ తర్వాత చేత్తో సమాధి మీద కొట్టారు. ఇలా ఎందుకు చేశారన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి ఎంజీఆర్ మెమోరియల్ వద్దకు వెళ్లారు. అక్కడ ఎంజీఆర్ చిత్రపటానికి నమస్కారం చేసుకుని, తర్వాత అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చుని కాసేపు ధ్యానముద్రలోకి కూడా వెళ్లిపోయారు. తర్వాత మళ్ల లేచి బయట ఉన్న ఎంజీఆర్ కాంస్య విగ్రహానికి నమస్కరించారు. బయట వేచి ఉన్న తన అభిమానులకు కూడా నమస్కారం చేసి, కళ్లు తుడుచుకుంటూ తన వాహనంలోకి వెళ్లిపోయారు. బయటకు వస్తున్న వశికళకు అభిమానులు హారతులిచ్చారు. ఆ తర్వాత ఆమె తన సొంత వాహనంలో ఇళవరసి, సుధాకరన్‌లతో కలిసి రోడ్డుమార్గంలో బెంగళూరు బయల్దేరారు. సాయంత్రంలోగా బెంగళూరు కోర్టులో శశికళ లొంగిపోవాల్సి ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
శశికళకు మరో షాక్
జయలలిత ఆస్తుల కేసులో శిక్ష పడిన శశికళకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తనకు ఆరోగ్యం బాగోలేనందున లొంగిపోయేందుకు నెల రోజుల సమయం కావాలని ఆమె కోరగా, సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది. ఈ విషయాన్ని శశికళ తరఫున సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే సుప్రీం మాత్రం శశికళ వెంటనే లొంగిపోవల్సిందేనని స్పష్టం చేసింది. తన తీర్పులో ఎలాంటి మార్పు చేసే ప్రసక్తి లేదని జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. దాంతో శశికళ బుధవారమే బెంగళూరు ప్రత్యేక కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆమె సాయంత్రం లోగా కోర్టులో లొంగిపోతారని శశికళ తరఫు న్యాయవాదులు బెంగళూరు కోర్టుకు తెలిపారు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యం స్వామి దాదాపు 19 సంవత్సరాల క్రితం దాఖలు చేసిన పిటిషన్లో తుది తీర్పు మంగళవారం వచ్చింది. అందులో శశికళ, మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు విధించింది. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
శశికళ అరెస్టా.. లొంగుబాటా?
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన శశికళను పోలీసులు అరెస్టు చేస్తారా.. లేక ఆమె తనంతట తానే లొంగిపోతారా అన్న విషయంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. సుప్రీంకోర్టు తీర్పు కాపీలు అందలేదన్న కారణంతో మంగళవారం రాత్రి మొత్తం ఆమె పోయెస్ గార్డెన్స్‌లోనే ఉండిపోయారు. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న అభిమానులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కాసేపటి వరకు వారిని ఓదార్చే ప్రయత్నం చేసిన చిన్నమ్మ శశికళ.. ఆ తర్వాత లోపలకు వెళ్లిపోయారు. రాత్రంతా కూడా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, పోలీసులు ఆమెను అరెస్టుచేసి బెంగళూరు తీసుకెళ్తారా లేద అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. దాదాపుగా శశికళే స్వయంగా బెంగళూరు వెళ్లి అక్కడ లొంగిపోవచ్చని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించిన శశికళ.. మరో మూడున్నరేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. అప్పట్లో జయలలితతో పాటు ఉన్న పరప్పణ అగ్రహా జైల్లోనే ఇప్పుడు కూడా శశికళ ఉండాల్సి ఉంటుంది. ఆమెతో పాటు ఇళవరసి, సుధాకరన్ సైతం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతోపాటు సుప్రీం కోర్టు విధించిన జరిమానాను కూడా వాళ్లు ముగ్గురూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శశికళ ఎప్పుడు చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరతారో ఇంకా తెలియాల్సి ఉంది. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పారు..?
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జీవించి ఉన్న ముగ్గురు నిందితులు దోషులేనంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 570 పేజీలతో కూడిన సుదీర్ఘ తీర్పును సుప్రీం వెల్లడించింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి... ''కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నాం. ఎ2 నుంచి ఎ4 వరకు ఉన్న ముగ్గురు నిందితులపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలుచేయాలని ఆదేశిస్తున్నాం. ఎ1తో ఎ2 నుంచి ఎ4 వరకు సంబంధాలు ఉన్నప్పటికీ, ఎ1 నిందితురాలు మరణించినందువల్ల ఆమెకు సంబంధించిన విషయాలను తీసేవేయాల్సి వస్తోంది. ఎ2 నుంచి ఎ4 వరకు ఉన్న నిందితులపై అభియోగాలు రుజువయ్యాయి. వారికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను పునరుద్ధరించాలి. దాని పరిణామాలను కూడా వారు అనుభవించాలి. ఆ ముగ్గురూ ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలి. ఎ2 నుంచి ఎ4 వరకు గల దోషులు వారికి మిగిలి ఉన్న శిక్షాకాలాన్ని పూర్తిచేసుకోవాలి, ఈ తీర్పులో చెప్పిన మిగిలిన అంశాలను కూడా చట్టానికి అనుగుణంగా పాటించాలి'' అని తీర్పు తుదిపాఠంలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి సారాంశం... -
సుప్రీం తీర్పు: జయలలిత ఆస్తులు ఏమవుతాయి?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎ2, ఎ3, ఎ4 అందరూ దోషులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇందులో తప్పు చేసినట్లే లెక్కలోకి వస్తుంది. దాంతో ఆమె ఆస్తులు ఇప్పుడు ఏమవుతాయన్న విషయం చర్చకు వస్తోంది. బోలెడన్ని ఎస్టేట్లు, బంగారం, భవనాలు, వజ్రాలు.. ఇవన్నీ కూడా ప్రస్తుతం కోర్టుల ఆధీనంలోనే ఉండిపోతాయి. ముందుగా అధికారులు శశికళ, ఇళవరసి, సుధాకరన్ ముగ్గురినీ జైళ్లకు పంపించి, ఆ తర్వాత మొత్తం రూ. 130 కోట్ల జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. జయలలిత సహా మొత్తం నలుగురికీ కలిపి ఈ జరిమానా విధించారు. ప్రస్తుతం కోర్టు ఎటాచ్‌మెంట్‌లో ఉన్న దాదాపు 250 ఆస్తులను అధికారులు పూర్తిగా స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేస్తారు. ఆ తర్వాతే.. ఏం చేయాలన్న విషయమై చర్యలు తీసుకుంటారు. కొన్ని ఆస్తుల విషయంలో మాత్రం అన్నాడీఎంకే పార్టీ రివ్యూ పిటిషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. -
శశికళకు భారీ ఊరట!
తమిళ సీఎం పీఠం ఆశిస్తూ.. ఏ క్షణంలో ఏం జరుగుతుంతో అర్థం కాక సతమతం అవుతున్న చిన్నమ్మ శశికళకు అనుకోకుండా భారీ ఊరట లభించింది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నెం.2గా ఉన్న శశికళ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మరికొంత ఆలస్యం అవుతోంది. వాస్తవానికి ఈ వారంలోనే తీర్పు వస్తుందని భావించినా, ఇప్పుడు మాత్రం అది మరికొంత ఆలస్యం కాక తప్పదని చెబుతున్నారు. 2016 జూన్ నెలలోనే విచారణ పూర్తి కాగా అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఒకేవేళ ఈ కేసులో శశికళను దోషిగా నిర్ణయిస్తే ఆమె సీఎం పదవి కోల్పోవడమే కాదు.. కొంత కాలం పాటు ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా వీలు లేకుండా నిషేధం పడుతుంది. 1996లో జయలలితపై బీజేపీ నాయకుడు సుప్రబమణ్యం స్వామి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దాఖలు చేశారు. దాంతో ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 2015 సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు జయలలిత తదితరులపై ఉన్న కేసును కొట్టేయడంతో.. అందరూ విడుదలయ్యారు. కానీ, అదే సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలుచేసింది. అంతకుముందు బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికళలకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. దాంతో తాత్కాలికంగా ఆమె ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. మళ్లీ హైకోర్టు తీర్పు అనంతరం 2016 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. జయలలిత, శశికళ, ఇళవరసి, వీఎన్ సుధాకరన్.. ఈ నలుగురిని నిర్దోషులుగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు 2016 జూన్ 7వ తేదీన వాయిదా వేసింది. సంబంధిత కథనాలు చదవండి.. గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు!