శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..
దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరప్పణ అగ్రహార జైలు శశికళకు కొత్తేమీ కాదు గానీ, అక్కడ దాదాపు నాలుగేళ్లు ఉండటం మాత్రం అంత సులభం కాదు.
దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరప్పణ అగ్రహార జైలు శశికళకు కొత్తేమీ కాదు గానీ, అక్కడ దాదాపు నాలుగేళ్లు ఉండటం మాత్రం అంత సులభం కాదు. 2014 సంవత్సరంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతో పాటు దోషిగా తేలి ఇక్కడకు వచ్చిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఒక సాధారణ ఖైదీగా మాత్రమే ఈ జైల్లో ఉండాల్సి వస్తుంది. జయలలితతో కలిసి ఉన్నప్పుడు ఆమెకు కూడా స్పెషల్ హోదా లభించింది. ప్రైవేటు సెల్, ఫ్యాన్, ఇంగ్లీషు, తమిళ వార్తా పత్రికలు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రాజభోగాలన్నీ పోయాయి. సర్వసాధారణంగానే ఇతర ఖైదీల్లాగే మామూలు సెల్‌లో ఆమె ఉండాలి. ఆమెతోపాటు మరో ఇద్దరు మహిళలు కూడా అదే సెల్‌లో ఉంటారు. ఇందులో సర్వసాధారణ సదుపాయాలు మాత్రమే ఉంటాయి. ఏమాత్రం ప్రైవసీ ఉండదు. తెల్లవారుజామున లేస్తే తప్ప టాయిలెట్లను వాడటం అంత ఈజీ కాదు. ఒక గంట తర్వాత రోజంతా అవి కంపు కొడుతూనే ఉంటాయి. ఖైదీలందరికీ తెల్లటి యూనిఫాం తప్పనిసరి. పనిచేయడానికి ఒక బేకరీ, ట్రక్ షాపు.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే అక్కడ చేసిన పనికి సరిపడ కూపన్లు ఇస్తారు. అక్కడ ఒక గుడి, చర్చి, మసీదు అన్నీ ఉన్నాయి.