parappana agrahara jail
-
త్వరలో బళ్లారి జైలుకు దర్శన్ !
బొమ్మనహళ్లి : అభిమాని రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి పరప్పన అగ్రహార జైలులో న్యాయ నిర్బంధంలో ఉన్న నటుడు దర్శన్‌కు అక్కడ రాచ మర్యాదలు లభించడం పెను సంచలనమైన విషయం తెలిసిందే. రాచమర్యాదులు అందుతున్న ఫొటోలు వెలుగులోకి రావడంతో జైళ్లశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దర్శన్‌ను పరప్పన ఆగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈమేరకు బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో దర్శన్‌ను బళ్లారికి తరించనున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో విచారణ నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బళ్లారి జైలు నుంచే కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు సమాచారం. రాచమర్యాదల కేసుపై దర్యాప్తు దొడ్డబళ్లాపురం: దర్శన్‌కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు.దర్శన్ ఉదంతంపై సీఎం సమీక్ష దర్శన్, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలకు జైలులో రాచ మర్యాదలు దక్కుతున్న అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులతో సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం హోంమంత్రి పరమేశ్వర్ ముఖ్యమంత్రిని కలిసి జైల్లో జరుగుతున్న అక్రమాలు, లోపాల గురించి వివరించారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో కలిపి మొత్తం 9 మందిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని చెప్పారు. ఆలోపు కోర్టు అనుమతి తీసుకుని దర్శన్‌ను వేరే జైలుకి తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. కోర్టు అనుమతిస్తే దర్శన్‌ను బళ్లారి లేదా హిండలగా జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి.తనిఖీకి ఐపీఎస్ అధికారులతో కమిటీ దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైల్లో దర్శన్, ప్రజ్వల్ రేవణ్ణ, రౌడీ షీటర్లకు రాచ మర్యాదలు ఇస్తున్న విషయానికి సంబంధించి తనిఖీ చేయడానికి ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జైల్లో దర్శన్, ఇతర ఖైదీలు ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్‌లోకి తిరగడానికి అవకాశం కలి్పంచినట్టు సీసీటీవీలో స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జైళ్లలో ఇదే పరిస్థితి ఉందన్నారు. జైలును సందర్శించిన పోలీస్ కమిషనర్ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ పరప్పన అగ్రహార జైలును సందర్శించారు. జైలులో గంజాయి, మద్యం, సిగరెట్లు, మొబైళ్లు అన్నీ ఇస్తున్నారని ఇటీవల పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలై వచ్చిన ఒక ఖైదీ మీడియా ముందు వెల్లడించాడు. దీంతో కమిషనర్ దయానంద్ జైలుని సందర్శించారు. ఫొటోలు, వీడియోలపై జైలు అధికారులను ప్రశ్నించారు. -
దర్శన్ జైలు రాచమర్యాదల్లో డీకేఎస్ హ్యాండ్: బీజేపీ
బెంగళూరు: అభిమాని హత్య కేసులో బెంగళూరు జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్.. వీఐపీ ట్రీట్మెంట్తో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది. ‘‘దర్శన్ అనుచరుడు ఒకరు వచ్చి తనను సాయం కోరాడంటూ గతంలో డిప్యూటీ సీఎం(డీకే శివకుమార్) చెప్పారు. నాలుగైదు రోజుల కిందట.. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో తనిఖీలు జరిగి కొందరు ఖైదీల నుంచి ఫోన్లు సీజ్ చేసినట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు దర్శన్ కాల్ మాట్లాడేందుకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది?.. ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఈ వ్యవహారంలో డీకే శివకుమార్ హస్తం కూడా ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయనడానికి జైళ్ల పరిస్థితులే నిదర్శనం’’ అని బీజేపీ ఎమ్మెల్యే అశోక ఆరోపించారు.ఇదీ చదవండి: డీకే శివకుమార్‌తో దర్శన్ భార్య భేటీఇక.. ఈ వ్యవహారంపై జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి సైతం స్పందించారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలకు ఫైవ్ స్టార్ హోటల్ ట్రీట్మెంట్ అందుతుందనే చర్చ ఈనాటిదేం కాదు. కొన్నేళ్లుగా ఆ చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ అంశంపై సంబంధిత శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి అని అన్నారు. పనిలో పనిగా సిద్ధరామయ్య సర్కార్ పని తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించారు.మరోవైపు.. విమర్శల నేపథ్యంలో దర్శన్ వీఐపీ ట్రీట్మెంట్ ఎపిసోడ్‌పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ వ్యవహారంలో జైలు అధికారులదే తప్పని, కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించిన మాట వాస్తవమేనని, ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ప్రకటించారాయన.జైలు గదిలో ఉండాల్సిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు.. రాచమర్యాదల అంశం చివరకు తొమ్మిది మంది జైలు అధికారులపై సస్పెన్షన్ వేటుకు దారితీసింది. స్వేచ్ఛగా జైల్లో తిరుగుతూ, సిగరెట్లు కాలుస్తూ, వీడియో కాల్ మాట్లాడినట్లు ఫొటో, వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో కర్ణాటక పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలకు దిగింది. జైల్లో ఉన్న రౌడీషీటర్ వేలు ఈ ఫొటోను రహస్యంగా సెల్ఫోన్లో తీసి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించడంతో ఇది వెలుగు చూసింది. జైలు చీఫ్ సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్సహా 9 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సోమవారం ప్రకటించారు. ‘‘చీఫ్ సూపరింటెండెంట్ స్థాయిలో తప్పిదం జరిగింది. అసలు ఫోన్లు, కురీ్చలు, సిగరెట్లు, టీ, కాఫీలు ఎవరు సమకూర్చారో దర్యాప్తుచేస్తున్నాం. సీనియర్ ఐపీఎస్‌తో విచారణ జరిపిస్తున్నాం. దర్శన్‌ను వేరే జైలుకు తరలించే అంశాన్నీ పరిశీలిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. ‘‘ఆగస్ట్ 22న ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా, జైల్లో ఫోన్లను గుర్తించే కృత్రిమ మేథ పరికరాలను బిగిస్తాం’’అని అదనపు డైరెక్టర్ జనరల్(జైళ్లు) మాలిని కృష్ణమూర్తి చెప్పారు.జూన్ 9న సుమనహళ్లి వద్ద కాల్వలో రేణుకాస్వామి మృతదేహం లభ్యమైన కేసులో దర్శన్, అతని సన్నిహిత నటి పవిత్రా గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి విచారణఖైదీలుగా కారాగారానికి పంపడం తెల్సిందే. -
దర్శన్ జైల్లో ఉన్నాడా.. రిసార్ట్లోనా??
దొడ్డబళ్లాపురం: తన కుమారున్ని హత్య చేసిన కేసులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్న దర్శన్ జైలులో ఉన్నాడా, లేక రిసార్టులో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయని రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆవేదన చెందారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జైల్లో దర్శన్‌కు దొరుకుతున్న రాచ మర్యాదలు చూస్తుంటే తనకు న్యాయం జరగదనే అనిపిస్తోంది. జైల్లో కూడా పేద, ధనిక ఖైదీలనే తారతమ్యం ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్నారు. దర్శన్ జైల్లో హ్యాపీగా ఉన్నారని, తప్పు చేసాననే భావన ఆయన కళ్లల్లో కనబడడం లేదన్నారు. నిందితుల భేటీకి బల్లలు ఏర్పాటు చేశారు. టీ కప్పు, సిగరెట్ పట్టుకుని ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. పరప్పన నుంచి రౌడీ నాగను తరలించండి పరప్పన అగ్రహార జైలు నుండి రౌడీ విల్సన్ గార్డెన్ నాగను వేరే జైలుకు తరలించాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ జైళ్ల శాఖ డీజీపీకి లేఖ రాసారు. నాగ, దర్శన్ డ్రింక్, సిగరెట్ తాగుతున్న ఫోటో వైరల్ కావడమే ఇందుకు కారణం. దర్శన్, రౌడీ నాగకు మధ్య స్నేహం ఎలా కుదిరిందనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. సీసీబీ పోలీసులు కూడా జైలును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రౌడీషిటర్ కుమారుడికి దర్శన్ వీడియో కాల్ రౌడీషిటర్కుమారుడికి దర్శన్ వీడియో కాల్ చేసి మాట్లాడిన వార్త ఇప్పుడు పోలీసులకు మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. వీడియోకాల్ ఏ అధికారి సస్పెన్షన్‌కు దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీïÙటర్ కుమారుడికి వీడియో కాల్ చేసిన దర్శన్ ఉభయ కుశలోపరి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జైలులో దర్శన్‌కు స్మార్ట్ ఫోన్ ఎవరిచ్చారు? రౌడీషిటర్ కుమారుడికి దర్శన్‌కు ఉన్న సంబంధం ఏంటనేది కనిపెట్టే పనిలో పడ్డారు. -
జైల్లో స్టార్ హీరో విలాసాలు.. కాఫీ కప్పు,సిగరెట్‌తో..
ఓ చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగరెట్‌ను గుప్పు గుప్పు మని పీలుస్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా?ఈ ఏడాది జూన్ 8,2024 తన ప్రియురాలు పవిత్ర గౌడ అశ్లీల పంపించాడని రేణుకాస్వామి (28) అనే యువకుడిని దారుణంగా హత్య చేసి జైలు శిక్షను అనుభవిస్తున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే ఆ ఫొటో. అభిమాని హత్య కేసులోని ఏ1 దర్శన్‌తో పాటు ఇతర నిందితులు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, దర్శన్ బెయిల్ కోసం ఆయన భార్య ప్రయత్నిస్తున్నారు.ఈ తరుణంలో దర్శన్ పరప్పన అగ్రహార జైలు గార్డెన్లో ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శన్‌తో పాటు రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ,మరో ఖైదీ మేనేజర్ నాగరాజ్ ఉన్నారు.ఇక ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో క్షణాల్లో వైరలైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో జైల్లో నిబంధనలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న దర్శన్‌కు వీవీఐపీ ట్రీట్మెంట్ అందుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు జైలు గార్డెన్లో తోటి నేరస్తులతో కబర్లు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, తాగేందుకు కాఫీ, సిగరెట్లు అందించడమేనని అంటున్నారు. మరి ఈ ఫొటోపై పరప్పన జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ಏನ್ರೀ ಸ್ವಾಮಿ ಜೈಲುಇದ್ರೆ ನೆಮ್ಮದಿ ಆಗಿರ್ಬೇಕು 💀💥#DBoss #Darshan pic.twitter.com/eTNmHZqt4j— S R E E | ಶ್ರೀ ✨ (@SreeDharaNEL) August 25, 2024 -
దర్శన్‌కు ఇంటి భోజనం లేనట్టే!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో ఉన్న హీరో దర్శన్ ఇంటి భోజనం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దర్శన్‌కు ఇంటి భోజనాన్ని అనుమతించలేమని, ఆ అవసరం కూడా లేదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించగా, మీ వైఖరి ఏమిటో చెప్పాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. గత నెల రోజులుగా ఇంటి భోజనం కేసు సాగుతోంది. హత్య కేసులో నిందితుడికి ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించలేమని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేశారు. -
‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌ను కలిసిన నటుడు వినోద్ రాజ్ కొన్ని రోజుల వ్యవధిలోనే రేణుకాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. దర్శన్, రేణుకాస్వామి కుటుంబం మధ్య రాజీ చేయడానికి వినోద్‌రాజ్ వెళ్లారని వదంతులు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన వినోద్ రాజ్...తోటి ఆర్టిస్టు అనే అభిమానంతో, దర్శన్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో దర్శన్‌ను జైలుకు వెళ్లి కలిశానన్నారు. మానవత్వం కోణంలో ఆలోచించి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేద్దామని రేణుకాస్వామి కుటుంబ సభ్యులను కలిశానని, రాజీ కుదిర్చే ఉద్దేశం ఆలోచన తనకు లేవన్నారు. -
శశికళ చుట్టూ బిగిసిన ఉచ్చు
►రోజుకో చర్చ ►చిన్నమ్మకు ఇంటి భోజనం ►ఆ మంత్రి ఎవరో ? ►విచారణలోనిగ్గు తేలుతుందన్న పళని పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. రోజుకో అంశం తెర మీదకు వస్తుండడంతో రాష్ట్రంలో చర్చ ఊపందుకుంది. హోసూరు నుంచి అంబులెన్స్‌లో శశికళకు అన్ని రకాల వస్తువులు సరఫరా సాగినట్టు మంగళవారం సమాచారం అందింది. అయితే, ఓ మంత్రి ఇంటి నుంచి అన్నాడీఎంకే నాయకుడి పర్యవేక్షణలో ఈ అంబులెన్స్ వెళ్లి ఉండడంతో ఆ మంత్రి, ఆ నాయకుడు ఎవరో అన్న ప్రశ్న మొదలైంది. చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు పరప్పన అగ్రహార చెరలో లగ్జరీ సౌకర్యాల వ్యవహారం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఈ పరిస్థితుల్లో విచారణ తమిళనాడు చుట్టూ తిరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే సమాచారాలు విచారణలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటక డీజీపీ మొదలు అందరూ అధికారులకు ఆకాశ రామన్న ఉత్తరం ఒకటి చేరడం, అందులో ఉన్న అంశాలు వెలుగులోకి రావడంతో తమిళనాట చర్చ మరింతగా ఊపందుకుంది. ఇక, చిన్నమ్మ చుట్టూ ఉచ్చు మరింతగా బిగిసినట్టుగా ఆ ఉత్తరం స్పష్టం చేస్తుండటం ఆలోచించ దగ్గ విషయం. ఆ ఉత్తరం మేరకు నల్ల ధనం కేసులో కర్ణాటకలో పట్టుబడ్డ పలువురు ప్రముఖులు శశికళకు సౌకర్యాల కల్పనలో రాయబారాలు అధికారులతో సాగించినట్టు వివరించి ఉన్నట్టు సమాచారం. అలాగే, పరప్పన అగ్రహార చెరలో పనిచేస్తున్న ఎస్ఐ స్థాయి అధికారి ఒకరు కేవలం వీఐపీల సౌకార్యాల కల్పన మీదే పూర్తిస్థాయిలో మునిగి ఉన్నట్టు, ఆ అధికారి శశికళకు అన్ని సౌకర్యాలు సమకూర్చినట్టు ఆకాశ రామన్న ఉత్తరంలో పేర్కొని ఉంది. అలాగే, హోసూరుకు చెందిన ఓ అన్నాడీఎంకే నేత అంబులెన్స్‌లో చిన్నమ్మకు కావాల్సినవన్నీ పరప్పన అగ్రహార చెరకు తరలించినట్టు, ప్రత్యేకంగా వంటకాలు రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరి ఇంటి నుంచి వెళ్లినట్టుగా ఆరోపణలు గుప్పించి ఉండటంతో ఆ ఇద్దరు ఎవరో అన్న చర్చ బయలు దేరింది. ఇక, డీఐజీ రూపా సైతం రోజుకో వివరాలను బయటపెడుతూ రావడంతో, ఈ ఇతివృత్తంతో సినిమా తీసే అవకాశాలు ఉన్నట్టుగా కర్ణాటక నుంచి సంకేతాలు వస్తుండటంతో అందర్నీ ముక్కుమీద వేలు వేసుకునేలా చేస్తున్నాయి. కాగా, ఇన్నాళ్లు శశికళ విషయంలో నోరు మెదపని సీఎం పళని స్వామి ఢిల్లీ వేదికగా ప్రపథమంగా గళం విప్పడం గమనార్హం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సీఎం పళని స్వామి తమిళనాడు భవన్లో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శశికళ లగ్జరీ సౌకర్యాల గురించి ప్రశ్నించగా, ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణ సాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విచారణ మేరకు అన్ని విషయాలు నిగ్గు తేలుతాయని వ్యాఖ్యానించారు. -
'శశికళను మామూలుగా చూడండి.. లీకులొద్దు'
బనశంకరి(కర్ణాటక): ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా పకడ్బందీగా పనిచేయాలని పరప్పన అగ్రహార జైలు అధికారులకు జైళ్ల ఏడీజీపీ ఎన్ఎస్ మేఘరిక్ గట్టి హెచ్చరికలు చేశారు. జైళ్ల విభాగం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా బుధవారం పరప్పన సెంట్రల్ జైలును సందర్శించిన మేఘరిక్ అన్ని విభాగాలను పరిశీలించి, అధికారులతో సమావేశమయ్యారు. కారాగారంలో పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని చెప్పారు. ఖైదీలకు జైలు సూచనల ప్రకారం సౌలభ్యాలు కల్పించాలని, ఎవరికీ నిబంధనలకు వ్యతిరేకంగా వసతులు కల్పించరాదని హెచ్చరించారు. ఖైదీలతో ములాఖత్‌కు వచ్చేవారు తెచ్చే వస్తువులను ఆధునిక పరిజ్ఞానంతో తనిఖీ చేయాలని, ఆ వస్తువులను ఎవరికి, ఎందుకోసం తెచ్చారో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అన్నా డీఎంకే నాయకురాలు శశికళను ఇతర ఖైదీల తరహాలోనే పరిగణించాలని, ఆమెకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించరాదని చెప్పారు. జైలు లోపలి దృశ్యాలను చిత్రీకరించి వాటిని మీడియాకు లీక్ చేయడం తగదని హెచ్చరించారు. సైకో శంకర్ పారిపోయిన అనంతరం జైళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటిలో సభ్యుడిగా తనకు జైలు వ్యవస్థ, నిర్వహణ పట్ల అవగాహన ఉందన్నారు. ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ అనుభవం కలిగిన తనతో ఏ విషయాన్నయినా పంచుకోవచ్చని అధికారులకు సూచించారు. ఖైదీల సమస్యలపట్ల జైలు అధికారులు ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని, కానీ మీడియాకు లీక్ చేస్తే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జైలు నియమాలను అనుసరించి తాను విధులు నిర్వహిస్తానని తెలిపారు. జైలు సిబ్బందితో పాటు కొందరు ఖైదీలతోనూ చర్చించి జైలు ప్రక్షాళనకు నడుం బిగిస్తానని మేఘరిక్ తెలిపారు. -
చిన్నమ్మా.. చాలమ్మా!
► ములాఖత్‌కు ముక్కుతాడు ► మంత్రులకు సైతం నో ► అధికారుల ఆంక్షలు సాక్షి ప్రతినిధి, చెన్నై: కుప్పలు తెప్పలుగా వస్తున్న సందర్శకులతో పరప్పన ఆగ్రహార జైలును పార్టీ కార్యాలయంగా మార్చవద్దు చిన్నమ్మా...ఇక చాలు అంటూ ఆంక్షలు విధించారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సరిగ్గా సీఎం పీఠం ఎక్కబోతున్న తరుణంలో ఆమె కటకటాల పాలయ్యారు. ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లపాటు శిక్షను అనుభవించక తప్పదు. ఇదే కేసులో శశికళతోపాటూ ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లు అదే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. జైలులోని ఖైదీలు ములాఖత్ పేరున తమ వారిని కలుసుకునేందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కర్నాటక ప్రభుత్వ జైళ్లశాఖ నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 రోజులకు ఒకసారి, కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చనేది అత్యంత ముఖ్యమైనది అయితే, శశికళ జైలు నిబంధనలను అతిక్రమంచి అత్యధికుల సందర్శకులతో సంభాషించినట్లు తేలింది. ఫిబ్రవరి 16వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు (31 రోజుల్లో) 28 మందిని శశికళ కలుసుకుని సంభాషించినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. సంభాషణ సైతం 15 నిమిషాలకు పరిమితం కాకుండా 40 నిమిషాలపాటూ సాగించారు. అంతేగాక ములాఖత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. నేడో రేపో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయాల్సిన తరుణంలో ఆమె జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నా రాష్ట్రంలో ఆమె కన్నుసన్నులోని ప్రభుత్వమే నడుస్తోంది. జైలు నుండే పరోక్షంగా పార్టీ, ప్రభుత్వంపై ఆమె పెత్తనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తరచూ తమ పార్టీ వారిని కలుసుకోవడం ఆమెకు అనివార్యంగా మారింది. ములాఖత్‌కు ముక్కుతాడు ములాఖత్ కింద ఇప్పటికే లెక్కకు మించి సందర్శకులు వచ్చినందున ఇకపై జోరు తగ్గించాలని శశికళను జైలు అధికారులు ఆదేశించారు. సాధారణ సందర్శకులే కాదు మంత్రులను సైతం అనుమతించేది లేదని నొక్కిచెప్పారు. ప్రత్యేక అనుమతి పొంది వచ్చినా అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. ఆర్కేనగర్ ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఆమెను కలిసేందుకు ప్రయత్నించినవారిని జైలు అధికారులు తిప్పిపంపేశారు. ములాఖత్ కింద శశికళ ఇప్పటికే సంఖ్య గీతను దాటారు, ఇకపై ఆ లెక్కను తగ్గించే ప్రయత్నంలో ఉన్నామ్ని బెంగళూరు జైలు అధికారి తెలిపారు. -
తులసిచెట్టు చుట్టూ చిన్నమ్మ ప్రదక్షిణలు
జైలుకు అలవాటుపడుతున్న చిన్నమ్మ జైలు వద్ద మాజీ మంత్రులకు చుక్కెదురు ఆరునెలల తరువాతనే పెరోల్ సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితతో (దాదాపు) సమానంగా గౌరవ మర్యాదలు అందుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తన జీవితంలో రెండోసారి జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పినపుడు జయతోపాటూ సుమారు ఆరునెలలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువడగా ఈనెల 15వ తేదీ నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పర అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా అత్యున్నతమైన హోదాను తృటిలో చేజార్చుకున్న శశికళ జీవితంపై సర్వాత్రా ఆసక్తి నెలకొని ఉంది. జైల్లోని ఖైదీల సెల్‌లోకి వెళ్లిన రోజున శశికళ ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా గడిపారు. తనలో దుఃఖాన్ని బైటకు కనపడనీయకుండా జాగ్రత్తపడ్డారు. సుమారు నాలుగేళ్లపాటు శిక్షను అనుభవించక తప్పదనే సత్యాన్ని ఆకళింపు చేసుకున్నట్లుగా రానురానూ జైలు జీవితానికి అలవాటు పడుతున్నారు. మొదటి రోజున ఆమెకు చాప, రెండు నీలం రంగు చీరలు, చెంబును ఇచ్చారు. ప్రస్తుతం ఇనుప మంచం, రెండు దుప్పట్లు, టీవీ వసతిని కల్పించారు. ఆధ్యాత్మిక జీవనం: ప్రతిరోజూ తెల్లవారుజాము 5 గంటలకు నిద్రలేచి ఒకగంటపాటు తన సెల్లోనే ధాన్యం, 6.30 గంటలకు వేడినీళ్లతో స్నానమాచరించి, జైలు ప్రాంగణంలోనే ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. ఆలయ రాకపోకల్లో ఇళవరసి కూడా శశికళను అనుసరిస్తున్నారు. జయ జైల్లో ఉన్నపుడు ఆలయ ప్రాంగణంలో తులసి చెట్టు మండపాన్ని ఏర్పాటు చేసుకుని రోజూ ప్రార్థనలు చేసేవారు. నేడు శశికళ అదే మండపం వద్ద పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ తరువాత తమిళం, ఇంగ్లిషు వార్తా పత్రికలు చదువుతున్నారు. ఉదయం 6.30 గంటలకు టిఫిన్ తినడం పూర్తి చేసుకుని మధ్యాహ్నం వరకు టీవీని చూస్తూ కాలంగడుపుతున్నారు. సందర్శకులు ఎవరైనా వస్తే వారిని కలుస్తున్నారు. రాత్రి 7.30 గంటలకు జైల్లో పెట్టే ఆహారాన్ని ఆరగించి, రాత్రి 10 గంటల తరువాత నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఆరునెలల తరువాతనే శశికళకు పెరోల్ లభించే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఆచార్య బుధవారం మీడియాకు తెలిపారు. మరో జైలుకు శశికళ జైలుమెట్ సైనేడు మల్లిక: జైల్లో శశికళకు కేటాయించిన పక్కసెల్‌లో సైనేడ్ మల్లిక (52) అనే మహిళ పలు హత్యల నేరంపై శిక్షను అనుభవిస్తోంది. ఆమెను మరోచోటకు మార్చాల్సిందిగా శశికళ పదే పదే జైలు అధికారులను ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. శశికళ విజ్ఞప్తి మేరకు సైనేడ్ మల్లికను బెంగళూరు జైలు నుంచి బెల్గాం జైలుకు మార్చారు. మంత్రాలతో భయపెడుతున్న సుధాకరన్: ఇదిలా ఉండగా, అదే జైలులోని మగ ఖైదీల వార్డులో ఉన్న సుధాకరన్ నిత్యం తరచూ కాళీమాత ఫొటోను ముందు పెట్టుకుని మంత్రాలు చదువుతున్నాడు. దీంతో తోటి ఖైదీలు సుధాకరన్ను ఒక మంత్రవాదిగా భావిస్తూ భయపడుతున్నారు. సుధాకరన్ను తమ వార్డు నుంచి వేరే చోటికి మార్చాల్సిందిగా జైలు అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. శశికళ వద్దకు చేరిన ఈసీ నోటీసు: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎంపిక చట్ట విరుద్ధంగా సాగిందంటూ వచ్చిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటీసు జైలులోని శశికళకు చేరింది. మాజీ మంత్రులకు చేదు అనుభవం: శశికళ నియమించిన ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బెంగళూరు జైలుకెళ్లి కలిసిరావాలనే ప్రయత్నించినా ఎం దుకో విరమించారు. టీటీవీ దినకరన్ చిన్నమ్మను కలిసివచ్చారు. రాష్ట్ర మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజా మంగళవారం బెంగళూరుకు వెళ్లి జైలు అధికారులను లిఖితపూర్వకంగా కోరినా అనుమతి లభించలేదు. కర్ణాటక డీజీపీ నుంచి ఉత్తర్వులు పొందాలని జైలు అధికారులు వారిని నిరాకరించారు. శశికళ చూసేందుకు అంటూ గుంపులు గుంపులుగా జైలు ముందు చేరితే సహించేది లేదని జైలు అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, శశికళను కలుసుకునేందుకు అగ్రహార జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు పి. వలర్మతి, గోకుల ఇందిర, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలకు ఛేదు అనుభవం ఎదురైంది. మంగళవారం రాత్రి జైలు వద్దకు వెళ్లిన ఈ ముగ్గురిని లోనికి అనుమతించలేదు. దీంతో జైలు పరిసరాల్లో నిల్చుని ఉండగా జైలు సిబ్బంది లాఠీలతో వచ్చి తరిమివేయడంతో పరుగులాంటి నడకతో వారు బతుకు జీవుడా అని అక్కడి నుంచి బైటపడ్డారు. -
శశికళ బెంగళూరు టు చెన్నై జైల్..??
జైలు మార్చే అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ బెంగళూరు నుంచి చెన్నై జైలుకు మారాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమెను చెన్నై పజల్ సెంట్రల్ జైలుకు మార్చాలని ఆమె న్యాయవాదులు కర్ణాటక ప్రభుత్వానికి పిటిషన్ దాఖలుచేశారు. శశికళను చెన్నై జైలుకు తరలించాలనే విషయంపై అన్నాడీఎంకే నేతలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. చట్టబద్ధంగా శశికళను చెన్నై జైలుకు తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వారు పేర్కొంటున్నారు. ఈ నెల 14న అక్రమాస్తుల కేసులో శశికళతోపాటు ఆమె బంధువులైన ఇళవరసి, వీఎన్ సుధాకరన్‌లను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరప్పన అగ్రహార జైలు నుంచి ఆమెను తరలించాలంటే ఆమె న్యాయవాదులు మొదట జైలు సూపరింటెండెంట్, కర్ణాటక న్యాయశాఖ మంత్రిని సంప్రదించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తమ అభ్యర్థనను రెండు రాష్ట్రాలు ఒప్పుకొంటే శశికళ తరలింపు సాధ్యమేనని ఆమె లాయర్లు చెప్తున్నారు. మరోవైపు శశికళ న్యాయవాదుల అభ్యర్థనపై లీగల్ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్టు కర్ణాటక న్యాయశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది అసాధారణ కేసు కాబట్టి చట్టబద్ధంగా వీలైన మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. న్యాయనిపుణులు మాత్రం శశికళను చెన్నై జైలుకు మార్చే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడుతున్నారు. 'శశికళ కేసు భిన్నమైనది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆమె కర్ణాటక జైలులో ఖైదీగా ఉన్నారు. సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప ఆమెను మరో జైలుకు మార్చడం కుదరదు. సుప్రీంకోర్టుకు తెలియజేయకుంటే జైలు మార్పు ప్రక్రియ చేపడితే.. దీనిని సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశముంది' అని అక్రమాస్తుల కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య తెలిపారు. -
శశికళ బెంగళూరు టు చెన్నై జైల్..??
జైలు మార్చే అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ బెంగళూరు నుంచి చెన్నై జైలుకు మారాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆమెను చెన్నై పజల్ సెంట్రల్ జైలుకు మార్చాలని ఆమె న్యాయవాదులు కర్ణాటక ప్రభుత్వానికి పిటిషన్ దాఖలుచేశారు. శశికళను చెన్నై జైలుకు తరలించాలనే విషయంపై అన్నాడీఎంకే నేతలు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. చట్టబద్ధంగా శశికళను చెన్నై జైలుకు తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వారు పేర్కొంటున్నారు. ఈ నెల 14న అక్రమాస్తుల కేసులో శశికళతోపాటు ఆమె బంధువులైన ఇళవరసి, వీఎన్ సుధాకరన్‌లను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరప్పన అగ్రహార జైలు నుంచి ఆమెను తరలించాలంటే ఆమె న్యాయవాదులు మొదట జైలు సూపరింటెండెంట్, కర్ణాటక న్యాయశాఖ మంత్రిని సంప్రదించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తమ అభ్యర్థనను రెండు రాష్ట్రాలు ఒప్పుకొంటే శశికళ తరలింపు సాధ్యమేనని ఆమె లాయర్లు చెప్తున్నారు. మరోవైపు శశికళ న్యాయవాదుల అభ్యర్థనపై లీగల్ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్టు కర్ణాటక న్యాయశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది అసాధారణ కేసు కాబట్టి చట్టబద్ధంగా వీలైన మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. న్యాయనిపుణులు మాత్రం శశికళను చెన్నై జైలుకు మార్చే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడుతున్నారు. 'శశికళ కేసు భిన్నమైనది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆమె కర్ణాటక జైలులో ఖైదీగా ఉన్నారు. సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప ఆమెను మరో జైలుకు మార్చడం కుదరదు. సుప్రీంకోర్టుకు తెలియజేయకుంటే జైలు మార్పు ప్రక్రియ చేపడితే.. దీనిని సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశముంది' అని అక్రమాస్తుల కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య తెలిపారు. -
శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..
దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరప్పణ అగ్రహార జైలు శశికళకు కొత్తేమీ కాదు గానీ, అక్కడ దాదాపు నాలుగేళ్లు ఉండటం మాత్రం అంత సులభం కాదు. 2014 సంవత్సరంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతో పాటు దోషిగా తేలి ఇక్కడకు వచ్చిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఒక సాధారణ ఖైదీగా మాత్రమే ఈ జైల్లో ఉండాల్సి వస్తుంది. జయలలితతో కలిసి ఉన్నప్పుడు ఆమెకు కూడా స్పెషల్ హోదా లభించింది. ప్రైవేటు సెల్, ఫ్యాన్, ఇంగ్లీషు, తమిళ వార్తా పత్రికలు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రాజభోగాలన్నీ పోయాయి. సర్వసాధారణంగానే ఇతర ఖైదీల్లాగే మామూలు సెల్లో ఆమె ఉండాలి. ఆమెతోపాటు మరో ఇద్దరు మహిళలు కూడా అదే సెల్లో ఉంటారు. ఇందులో సర్వసాధారణ సదుపాయాలు మాత్రమే ఉంటాయి. ఏమాత్రం ప్రైవసీ ఉండదు. తెల్లవారుజామున లేస్తే తప్ప టాయిలెట్లను వాడటం అంత ఈజీ కాదు. ఒక గంట తర్వాత రోజంతా అవి కంపు కొడుతూనే ఉంటాయి. ఖైదీలందరికీ తెల్లటి యూనిఫాం తప్పనిసరి. పనిచేయడానికి ఒక బేకరీ, ట్రక్ షాపు.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే అక్కడ చేసిన పనికి సరిపడ కూపన్లు ఇస్తారు. అక్కడ ఒక గుడి, చర్చి, మసీదు అన్నీ ఉన్నాయి. పరప్పణ అగ్రహార జైలుకు దాదాపు మూడేళ్ల నుంచి సున్నం కూడా వేయలేదు. కొత్తగా వచ్చినవాళ్లయితే ఈ జైలు చూసి భయపడటం ఖాయం. దాదాపుగా పెద్దగోడలున్న ఓ మురికివాడలాగే ఉంటుందని అంటారు. బ్యారక్‌లలో ఉన్న టాయిలెట్లకు ఒక గంట పాటు మాత్రమే నీళ్లు వస్తాయి. అదే స్పెషల్ సెల్‌లకు అయితే అక్కడి బాత్రూంలలో ఎప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయి. తాను జైలు నుంచే పార్టీ కోసం పనిచేస్తానని శశికళ చెప్పారు గానీ, అది అంత సులభం కాదు. ఎందుకంటే ఆమె ఇక్కడ కిచెన్‌లో గానీ, బేకరీలో గానీ, చెక్క పని గానీ చేయాల్సి ఉంటుంది. తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు! నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం ‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం లొంగిపోయిన చిన్నమ్మ వీడని ఉత్కంఠ ఇక అమ్మ ఫొటో కనిపించదా పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ ఆచితూచి అడుగులు మద్దతు కాదు కృతజ్ఞతే! -
శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..
-
'తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాం'
-
లొంగిపోయిన చిన్నమ్మ
చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు చేరుకున్న శశికళ బృందం - పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ప్రత్యేక కోర్టుకు హాజరు - ప్రత్యేక సదుపాయాలకు న్యాయమూర్తి తిరస్కృతి - అక్కడి నుంచి జైలుకు తరలింపు - శశి, ఇళవరసిలకు ఒకే గది.. శశికళకు ఖైదీ నెం 9234 సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు కోరిన శశికళ విన్నపాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. శశికళతో పాటు ఇదే కేసులో దోషులుగా ఉన్న ఇళవరసి, సుధాకర న్లు కూడా వెళ్లారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక కోర్టులో తొలుత లొంగిపోయి అనంతరం వీరు జైలుకు వెళ్లాలి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక కోర్టును పరప్పన అగ్రహార జైలు ఆవరణలో ఏర్పాటు చేశారు. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన శశికళ... పూమల్లి, పెరంబదూరు, కాంచీపురం, రాణీపేట, వెల్లూరు, వాణం బాడి, అంబూరు, క్రిష్ణగిరి, హోసూరు మీదుగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 5.15 గంటలకు జైలు వద్దకు శశికళ, ఇళవరసిలు ఒకే వాహనంలో వచ్చి కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి అశ్వత్థ నారా యణ వారితో ‘మీకు సుప్రీంకోర్టు శిక్ష విధించి న విషయం తెలిసిందా’అని అడిగారు. ఇందు కు వారు ‘తెలుసు, అందుకే ఇక్కడ లొంగిపోవ డానికి వచ్చామ’ని బదులిచ్చారు. వివరాల నమోదు, సాధారణ వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి అనుమతితో శశికల, ఇళవరసి లు పది నిమిషాల పాటు బంధువు లతో మాట్లాడారు. అనంతరం వారిద్దరినీ జైల్లోని మహిళల బ్యారక్‌లోనికి తీసుకెళ్లారు. సుధాక రన్ మాత్రం సాయంత్రం 6.15 గంటలకు కోర్టుకు వచ్చారు. ‘మా కారు డ్రైవరుపై కొంత మంది దాడికి పాల్పడడంతో వేరే మార్గంలో జైలుకు రావాల్సి వచ్చింది’అని ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చారు. కోర్టు ప్రక్రియ ముగిశాక అతన్ని జైల్లోకి తీసుకెళ్లారు. జైలు వద్ద ఎలాంటి అల్లర్లు చోటుచేసు కోకుండా బెంగళూరు పోలీసులు 200 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శశికళ విన్నపం తిరస్కరణ జైల్లోకి వెళ్లడానికి రెండు వారాల గడువు, ఇంటి నుంచి భోజనం కల్పించాలని శశికళ తన న్యాయవాదుల ద్వారా చేసిన విజ్ఞప్తిని న్యాయ మూర్తి తిరస్కరించారు. ఏ–క్లాస్ ఖైదీగా పరిగణించే విషయంలో జైలు ప్రధానాధికారిని సంప్రదించి, పొందవచ్చని సూచించారు. శశికళ గంభీరంగా, చిరునవ్వుతో జైలులోకి వెళ్తూ కనిపించారు. జైలు అధికారులు శశికళకు 9234 నంబర్, ఇళవరసికి 9235, సుధాకరన్‌కు 9236 నంబర్‌ను కేటాయించారు. శశికళ, ఇళవరసిలకు ఒకే గది కేటాయించారు. శశికలకు మూడు నీలిరంగు చీరలు, ఒక ప్లేటు, ఒక చెంబు, ఒక గ్లాసు, ఒక కంబళి, దిండు, దుప్పటిని అందజేశారు. ప్రతి శుక్రవారం మాంసాహారం, పండుగ సందర్భాల్లో ప్రత్యేక భోజనాన్ని అందజేస్తారు. జైలులోని ఇతర ఖైదీలతో కలిసి టీవీ చూడవచ్చు. సాధారణ ఖైదీలతో పాటు వారు జైలులో చేయాల్సిన పనిని (అగరబత్తీలు, క్యాండిల్స్ తయారీ, నేతపని తదితరాలు)ఆదివారం కేటాయిం చనున్నారు. ఇందుకు రోజుకు రూ.50 వేతనం లభిస్తుంది. శశికళ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి శశికళ నటరాజన్ జైలుకు చేరుకునే సమయంలో కొంతమంది ఆందోళనకారులు కాన్వాయ్‌లోని వాహనాలతో పాటు తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న కొన్ని వాహనాలపై దాడికి పాల్పడ్డారు. కేకలు వేస్తూ రాళ్లు చెప్పులతో దాడికి దిగారు. దీంతో ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి, ఆందోళనకారులను చెదర గొట్టారు. కాగా, పన్నీరుసెల్వం మద్దతు దారులే ఈ దాడికి పాల్పడ్డారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు. చెన్నై జైలుకు బదిలీకి ప్రయత్నాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తమిళనాడులో దాఖలైంది కాబట్టి తమను బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నైలోని పుళల్ జైలు లేదా మరేదైనా జైలుకు మార్చేందుకు శశికళ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. తమిళనాడుకు తరలింపును కోరుతూ బెంగళూరు కోర్టులో త్వరలో పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ముందుగా తమ అంగీకారాన్ని తెలిపితేనే బెంగళూరు కోర్టు శశికళ పిటిషన్‌ను పరిశీలిస్తుందని నిపుణులు అంటున్నారు. బెంగళూరు కోర్టులో లొంగిపోయినందున కనీసం రెండు నెలలు అగ్రహార జైల్లో గడపాల్సి ఉంటుంది. సాధారణ ఖైదీగానే శశికళ జైల్లో తనకు వీఐపీ వసతులు కల్పించాలని కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు శశికళ ఒక ఉత్తరం ద్వారా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మినరల్ వాటర్, ప్రత్యేకంగా ఎయిర్ కండీషన్డ్ గది, ఇంట్లో తయారైన భోజనం, వాకింగ్ సౌకర్యం కల్పించాలని ఆ ఉత్తరంలో కోరినట్లు సమాచారం. ఆదాయపు పన్ను క్రమం తప్పకుండా చెల్లించేవారికి మా త్రమే ఫ్యాన్, వార్తాపత్రికల సరఫరా తదితర సౌకర్యాలు కల్పించేందుకు వీలవు తుందని అధికారులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం జైలు జీవితాన్ని ప్రారంభించిన శశికళను అధికారులు సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు తెలిసింది. కోర్టు అనుమతిస్తేనే ఇంటి నుంచి ఆహారం పొందవచ్చని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం. -
శశికళ కాన్వాయ్ పై దాడి
-
ఖైదీ నంబర్ 10711
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడిన అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ ఖైదీగా మారారు. అక్రమ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించడంతో ఆమె మరోసారి కటకటాల పాలయ్యారు. బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టులో లొంగిపోయిన ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. ఆమెతో పాటు ఇళవరసి, సుధాకరన్ కూడా లొంగిపోయారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చడంతో ఆమె సాధారణ ఖైదీగా జైలు జీవితం గడపనున్నారు. శశికళకు జైలు అధికారులు 10711 నంబరు కేటాయించారు. ఇదే కేసులో శిక్ష పడిన ఇళవరసికి 10712 నంబరు ఇచ్చారు. శశికళ మూడున్నరేళ్లు శిక్ష అనుభవించనున్నారు. ఇప్పటికే ఆమె 6 నెలలు జైలులో గడిపారు. -
శశికళ కాన్వాయ్ పై దాడి
బెంగళూరు: అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ కాన్వాయ్ పై దాడి జరిగింది. కోర్టులో లొంగిపోయేందుకు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శశికళ బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. వీరిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పన్నీర్ సెల్వం వర్గీయులే ఈ దాడికి పాల్పడివుంటారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు. మరోవైపు కోర్టులో లొంగిపోయిన శశికళ న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. చిన్నమ్మ చేసిన శపథం ఏంటంటే..! సీఎం కుర్చీ కోసం నువ్వా-నేనా? చీలిక దిశగా అన్నాడీఎంకే! పన్నీర్ వర్సెస్ పళని జయలలితకు మూడుసార్లు మొక్కి.. జయ సమాధి సాక్షిగా శశికళ శపథం శశికళపై తమిళ ప్రజలకు కోపం? శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే పళనిస్వామికే మెజార్టీ ఉంది... శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
కూరగాయల సంచిలో దూరి ఖైదీ పరారీ
బెంగళూరు(బనశంకరి): సినీ ఫక్కీలో ఖైదీ పరారైన ఘటన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు. సంజయనగర కు చెందిన డేవిడ్‌కు ఓ చోరీకేసులో కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో మూడున్నర సంవత్సరాలుగా అతను పరప్పన అగ్రళహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళవారం ఉదయం జైలుకు కూరగాయాలు తీసుకువచ్చిన వాహనంలోకి చొరబడిన డేవిడ్ కూరగాయాల సంచిలో దూరి తప్పించుకున్నాడు. జైలు అధికారులు పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్లో పరారీ ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖైదీ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ బోరలింగయ్య తెలిపారు. -
గాలి జనార్దనరెడ్డి విడుదల
ఓఎంసీ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. చిట్ట చివరి కేసులో కూడా ఆయనకు మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అనంతరం కొన్ని అధికారిక లాంఛనాలు ముగించి, పరప్పన అగ్రహార జైలు నుంచి శుక్రవారం సాయంత్రం గాలి జనార్దనరెడ్డిని విడుదల చేశారు. జైలు నుంచి తన కాన్వాయ్ లో జనార్దనరెడ్డి చిరునవ్వుతో చేతులు ఊపుతూ వెళ్లారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై 2011 సెప్టెంబర్ 5న సీబీఐ వర్గాలు ఆయనను బళ్లారిలోని ఆయన ఇంట్లోనే అరెస్టు చేశాయి. శుక్రవారం విడుదల కావడంతో ఆయన మొత్తం 1,237 రోజులు వివిధ జైళ్లలో గడిపినట్లు అయ్యింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన ఆయన.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లోనే చాలా కాలం ఉన్నారు. మధ్యలో ఆయన బెంగళూరులోని పరప్పణ అగ్రహారంలో గల ప్రధాన జైలుకు కూడా వెళ్లి వచ్చేవారు. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దాంతో ఆయనను బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
గాలి జనార్దనరెడ్డి విడుదల
-
నిద్రలేమితో బాధపడిన జయలలిత
బెంగళూరు: నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నా డీఎంకే అధినేత్రి జె.జయలలిత రాత్రంతా నిద్రలేమితో బాధపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ శనివారం తీర్పు చెప్పడంతో ఆమెను సెంట్రల్ జైలుకు తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడిన జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలులోని 23వ నంబర్ గదిలో జయలలిత ఒంటరిగానే ఉన్నారు. ఇదిలా ఉండగా, జయలలిత దోషిగా తేలడంతో చెన్నైలో నిన్న ఆత్మహత్య చేసుకున్న అన్నాడిఎంకె కార్యకర్త వెంకటేశన్ మృతి చెందాడు. **