దర్శన్‌ జైల్లో ఉన్నాడా.. రిసార్ట్‌లోనా?? | ‘Is he inside jail or resort?’ | Sakshi
Sakshi News home page

దర్శన్‌ జైల్లో ఉన్నాడా.. రిసార్ట్‌లోనా??

Published Tue, Aug 27 2024 7:40 AM | Last Updated on Tue, Aug 27 2024 9:07 AM

‘Is he inside jail or resort?’

     రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆవేదన   

దొడ్డబళ్లాపురం: తన కుమారున్ని హత్య చేసిన కేసులో జ్యుడీషియల్‌ రిమాండులో ఉన్న దర్శన్‌ జైలులో ఉన్నాడా, లేక రిసార్టులో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయని రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య  ఆవేదన చెందారు.  ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జైల్లో దర్శన్‌కు దొరుకుతున్న రాచ మర్యాదలు చూస్తుంటే తనకు న్యాయం జరగదనే   అనిపిస్తోంది. జైల్లో కూడా పేద, ధనిక ఖైదీలనే తారతమ్యం ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్నారు. దర్శన్‌ జైల్లో హ్యాపీగా ఉన్నారని, తప్పు చేసాననే భావన ఆయన కళ్లల్లో కనబడడం లేదన్నారు. నిందితుల భేటీకి   బల్లలు ఏర్పాటు చేశారు. టీ కప్పు, సిగరెట్‌ పట్టుకుని ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.   

పరప్పన నుంచి రౌడీ నాగను తరలించండి   
పరప్పన అగ్రహార జైలు నుండి రౌడీ విల్సన్‌ గార్డెన్‌ నాగను వేరే జైలుకు తరలించాలని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌  దయానంద్‌ జైళ్ల శాఖ డీజీపీకి లేఖ రాసారు.  నాగ, దర్శన్‌ డ్రింక్, సిగరెట్‌ తాగుతున్న ఫోటో వైరల్‌ కావడమే ఇందుకు కారణం.  దర్శన్, రౌడీ నాగకు మధ్య స్నేహం ఎలా కుదిరిందనే కోణంలో వివరాలు రాబడుతున్నారు.  సీసీబీ పోలీసులు కూడా జైలును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. 

రౌడీషిటర్‌ కుమారుడికి దర్శన్‌ వీడియో కాల్‌ 
రౌడీషిటర్‌కుమారుడికి దర్శన్‌ వీడియో కాల్‌ చేసి మాట్లాడిన వార్త ఇప్పుడు పోలీసులకు మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది.  వీడియోకాల్‌ ఏ అధికారి సస్పెన్షన్‌కు దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రౌడీïÙటర్‌ కుమారుడికి వీడియో కాల్‌ చేసిన దర్శన్‌ ఉభయ కుశలోపరి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జైలులో దర్శన్‌కు స్మార్ట్‌ ఫోన్‌ ఎవరిచ్చారు? రౌడీషిటర్‌ కుమారుడికి దర్శన్‌కు ఉన్న సంబంధం ఏంటనేది కనిపెట్టే పనిలో పడ్డారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement