Rowdy shitters
-
దర్శన్ జైల్లో ఉన్నాడా.. రిసార్ట్లోనా??
దొడ్డబళ్లాపురం: తన కుమారున్ని హత్య చేసిన కేసులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్న దర్శన్ జైలులో ఉన్నాడా, లేక రిసార్టులో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయని రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆవేదన చెందారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జైల్లో దర్శన్‌కు దొరుకుతున్న రాచ మర్యాదలు చూస్తుంటే తనకు న్యాయం జరగదనే అనిపిస్తోంది. జైల్లో కూడా పేద, ధనిక ఖైదీలనే తారతమ్యం ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్నారు. దర్శన్ జైల్లో హ్యాపీగా ఉన్నారని, తప్పు చేసాననే భావన ఆయన కళ్లల్లో కనబడడం లేదన్నారు. నిందితుల భేటీకి బల్లలు ఏర్పాటు చేశారు. టీ కప్పు, సిగరెట్ పట్టుకుని ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. పరప్పన నుంచి రౌడీ నాగను తరలించండి పరప్పన అగ్రహార జైలు నుండి రౌడీ విల్సన్ గార్డెన్ నాగను వేరే జైలుకు తరలించాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ జైళ్ల శాఖ డీజీపీకి లేఖ రాసారు. నాగ, దర్శన్ డ్రింక్, సిగరెట్ తాగుతున్న ఫోటో వైరల్ కావడమే ఇందుకు కారణం. దర్శన్, రౌడీ నాగకు మధ్య స్నేహం ఎలా కుదిరిందనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. సీసీబీ పోలీసులు కూడా జైలును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రౌడీషిటర్ కుమారుడికి దర్శన్ వీడియో కాల్ రౌడీషిటర్కుమారుడికి దర్శన్ వీడియో కాల్ చేసి మాట్లాడిన వార్త ఇప్పుడు పోలీసులకు మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. వీడియోకాల్ ఏ అధికారి సస్పెన్షన్‌కు దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీïÙటర్ కుమారుడికి వీడియో కాల్ చేసిన దర్శన్ ఉభయ కుశలోపరి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జైలులో దర్శన్‌కు స్మార్ట్ ఫోన్ ఎవరిచ్చారు? రౌడీషిటర్ కుమారుడికి దర్శన్‌కు ఉన్న సంబంధం ఏంటనేది కనిపెట్టే పనిలో పడ్డారు. -
మాట్లాడాలని పిలిపించి స్నేహితుడి హత్య
దొడ్డబళ్లాపురం: బార్లో ఉన్న స్నేహితుడిని మాట్లాడాలని తీసికెళ్లి మరో మిత్రుడు తన సహచరులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా హుస్కూరు గ్రామం నివాసి శశికుమార్ కుమారుడు హేమంత్‌గౌడ (27) హత్యకు గురైన యువకుడు. రౌడీషీటర్ నరసింహమూర్తి తన సహచరులతో కలిసి హత్యకు పాల్పడ్డ నిందితుడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హేమంత్‌గౌడ తన స్నేహితులతో కలిసి బాశెట్టిహళ్లి వద్ద ఉన్న జేపీ బార్లో పార్టీ చేసుకుంటుండగా నిందితుడు నరసింహమూర్తి ఫోన్ చేసి మాట్లాడాలని బయటకు రమ్మని పిలిచాడు.హేమంత్ బార్లో నుండి బయటకు రాగానే నరసింహమూర్తితో వచ్చిన సుమారు 10 మంది సహచరులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడ్డ హేమంత్‌ను టెంపోలో వేసుకుని ఊరంతా తిప్పారు. చావుబతుకుల మధ్య పోరాడుతున్న హేమంత్‌ను చూసి పైశాచికానందం పొందారు. హేమంత్పై దాడి జరగగానే పక్కనే ఉన్న స్నేహితులు వెంటనే హేమంత్ తండ్రికి సమాచారం ఇచ్చారు. హేమంత్ తండ్రి, కుటుంబ సభ్యులు బార్ వద్ద వచ్చి చూడగా హేమంత్ జాడ లేదు.హేమంత్ ఊపిరి ఆగిపోయే వరకూ టెంపోలో ఊరంతా తిప్పిన నరసింహమూర్తి చివరకు శవాన్ని బెంగళూరు రోడ్డులో ఉన్న నవోదయ పాఠశాల వద్ద రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. మృతుడు హేమంత్ రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నిందితుడు నరసింహమూర్తి పేకాట క్లబ్బులు నడుపుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. దీంతో అతడిపై పోలీసులు రౌడీషిట్ తెరిచారు. అయితే మృతుడు, హతుడు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం పెరిగిందనేది తెలీడంలేదు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అందరూ పరారీలో ఉన్నారు. -
సై ఖతం
తాడేపల్లి రూరల్ : ఆ ఇసుక క్వారీకి అనుమతులు రాలేదు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయలేదు. అధికారికంగా ధ్రువీకరించ లేదు. ఏ వెబ్సైట్లోనూ వివరాలు లేవు. అయినా.. జిల్లాలోని ఓ అధికార పార్టీ శాసనసభ్యుడి అండతో ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరైనా అడ్డొస్తే బెదిరించేందుకు స్థానిక రౌడీషీటర్ల సహకారం తీసుకుంటున్నారు. వివరాలను పరిశీలిస్తే... మండల పరిధిలోని ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట జీరో పాయి ంట్ ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బంధుగణం తెరలేపింది. అనుమతులు వచ్చేశాయని ప్రచారం చేసుకొని ఏకాదశినాడు పూజలు చేసి తవ్వకాలు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న వెబ్సైట్లో ఆ క్వారీ నిర్వహణకు సంబంధించి ఎక్కడా వివరాలు లేకపోవడం, సంబంధిత జీవో కాపీలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఈ రీచ్‌కు సంబంధించి ఎండీవో, తహశీల్దార్ కార్యాలయాలతోపాటు ఇతర అధికారులకు ఏ విధమైన అధికారిక పత్రాలు అందకపోవడంతో అనుమా నాలు బలపడుతున్నాయి. ఈ క్వారీని డ్వాక్రా మహిళల నేతృత్వంలో నడపాలి. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలి. ఇవేవీ లేకుండా ఇసుక తవ్వకాలు ప్రారంభించిన నిర్వాహకులు అధికార పార్టీ ఎమ్మెల్యేకు స్వయానా తమ్ముడు, వేలు విడిచిన బామ్మర్దులు కావడం విశేషం. వీరి అక్రమాలకు ఎవరూ అడ్డురాకుండా మత్స్యకారుల సొసైటీ ముసుగులో రౌడీషీటర్లను ఇసుక డంప్ చేసే ప్రాంతంలో ఉంచారు. స్థానిక మత్స్యకారులు నోరు మెదపకుండా ఉండేందుకు వారిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. మరోవైపు బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జిపై 2012లో భారీ వాహనాలను నిషేధించారు. ప్రస్తుత ఇసుక క్వారీ నిర్వాహకులు ఇదే వంతెనపై రాకపోకలు సాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ క్వారీని ఉండవల్లి డ్వాక్రా మహిళలకు కాకుండా నిర్వాహకులకు అనుకూలంగా ఉన్న పెనుమాక మ్యాక్స్ సొసైటీకి వచ్చే విధంగా ఓ మంత్రితో సిఫార్సు చేయించుకున్నట్టు సమాచారం.