judicial remand
-
దర్శన్ జైల్లో ఉన్నాడా.. రిసార్ట్లోనా??
దొడ్డబళ్లాపురం: తన కుమారున్ని హత్య చేసిన కేసులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్న దర్శన్ జైలులో ఉన్నాడా, లేక రిసార్టులో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయని రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆవేదన చెందారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జైల్లో దర్శన్‌కు దొరుకుతున్న రాచ మర్యాదలు చూస్తుంటే తనకు న్యాయం జరగదనే అనిపిస్తోంది. జైల్లో కూడా పేద, ధనిక ఖైదీలనే తారతమ్యం ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్నారు. దర్శన్ జైల్లో హ్యాపీగా ఉన్నారని, తప్పు చేసాననే భావన ఆయన కళ్లల్లో కనబడడం లేదన్నారు. నిందితుల భేటీకి బల్లలు ఏర్పాటు చేశారు. టీ కప్పు, సిగరెట్ పట్టుకుని ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. పరప్పన నుంచి రౌడీ నాగను తరలించండి పరప్పన అగ్రహార జైలు నుండి రౌడీ విల్సన్ గార్డెన్ నాగను వేరే జైలుకు తరలించాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ జైళ్ల శాఖ డీజీపీకి లేఖ రాసారు. నాగ, దర్శన్ డ్రింక్, సిగరెట్ తాగుతున్న ఫోటో వైరల్ కావడమే ఇందుకు కారణం. దర్శన్, రౌడీ నాగకు మధ్య స్నేహం ఎలా కుదిరిందనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. సీసీబీ పోలీసులు కూడా జైలును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రౌడీషిటర్ కుమారుడికి దర్శన్ వీడియో కాల్ రౌడీషిటర్కుమారుడికి దర్శన్ వీడియో కాల్ చేసి మాట్లాడిన వార్త ఇప్పుడు పోలీసులకు మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. వీడియోకాల్ ఏ అధికారి సస్పెన్షన్‌కు దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. బ్యాడరహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీïÙటర్ కుమారుడికి వీడియో కాల్ చేసిన దర్శన్ ఉభయ కుశలోపరి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జైలులో దర్శన్‌కు స్మార్ట్ ఫోన్ ఎవరిచ్చారు? రౌడీషిటర్ కుమారుడికి దర్శన్‌కు ఉన్న సంబంధం ఏంటనేది కనిపెట్టే పనిలో పడ్డారు. -
గొర్రెల స్కీం కుంభకోణంలో కీలక అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు కీలక నింది తులను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్ కుమార్‌లను శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరుపరిచారు. సబావత్ రాంచందర్‌ను ఏ–9గా, కల్యాణ్‌గా ఏ–10గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీ షియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఆదేశాలు నిందితులిద్దరూ నిబంధనలు తుంగలో తొక్కి, గొర్రెల సేకరణ ప్రక్రియ ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగిస్తూ అన్ని జిల్లాల పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధి కారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఏపీ రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.2.10 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు.ఈ కుంభకోణంతో సంబంధమున్నట్టు లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చి లో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి కృష్ణయ్యలను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు. గొర్రెల కుంభకోణం అసలు కథ ఇదీబీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో నిధులు దారి మళ్లించడంపై అందిన ఫిర్యాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఏపీ రైతులు ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డిజిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారు లకు గొర్రెలు పంపిణీ చేసేందుకు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరాదారులను సంప్రదించారు. ఆ తర్వాత పశువైద్యశాఖ అధి కారులు రవి, ఆదిత్యకేశవసాయితోపాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారులను తీసుకెళ్లి 133 యూనిట్లను ఒక్కో యూనిట్ రూ.1.58 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.అయితే ఇందుకు సంబంధించిన డబ్బులు గొర్రెలు విక్రయించిన రైతులకు ఇవ్వకుండా ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై కుంభకోణానికి తెరలే పారు. మొత్తం రూ. 2.10 కోట్లను గొర్రెల సరఫరా రైతుల పేరిట కాకుండా బినామీల పేరిట చెక్కులు మంజూరు చేశారు. అనంతరం ఆ సొమ్మును కొట్టేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కోడ్ కారణంగానే తమకు డబ్బులు రావడం లేదని ఏపీ గొర్రెల సరఫరా రైతులు అనుకున్నారు. కోడ్ ముగిసిన తర్వాత కూడా డబ్బులు రాక పోవడంతో మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు.తమకు రావా ల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లా ల్లోని ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసును ఏసీబీకి బదిలీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తూ, వరుస అరెస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ తాజాగా ముగియడంతో ఈడీ ఆయన్ని ఈ ఉదయం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో.. కాసేపట్లో ఆయన్ని జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.ఇంకోవైపు.. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది రిక్వెస్ట్ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, అలాగే పుస్తకాలను అనుమతించాలని కోరారు. అదనంగా మతపరమైన లాకెట్ ధరించేందుకు కేజ్రీవాల్‌ను అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ తొమ్మిది సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఊరట కోసం కేజ్రీవాల్ కోర్టులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. దీంతో.. సివిల్ లేన్స్‌లోని నివాసంలో మార్చి 22వ తేదీన తనిఖీల పేరుతో వెళ్లిన ఈడీ.. కొన్ని గంటలకే ఆయన్ని అరెస్ట్ చేసి తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు. -
తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ తాజాగా ముగియడంతో ఈడీ ఆయన్ని ఈ ఉదయం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. తీహార్ జైలుకు తరలించే ముందు భార్య సునీత, మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లను కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఇక.. ఇవాళ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ విచారణలో.. కేజ్రీవాల్ ఈ కేసు విచారణలో సహకరించడం లేదంటూ కోర్టుకు నివేదించింది. కేజ్రీవాల్ పొంతన లేని సమాధానాలతో దర్యాప్తును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని.. అలాగే తన డిజిటల్ డివైస్‌లను పాస్‌వర్డ్‌లను సైతం ఆయన చెప్పడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు కేజ్రీవాల్‌కు జ్యూడీషియల్ రిమాండ్ విధించినప్పటికీ.. భవిష్యత్తులో ఈడీ ఆయన్ని మరోసారి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది రిక్వెస్ట్ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, అలాగే పుస్తకాలను అనుమతించాలని కోరారు. అదనంగా మతపరమైన లాకెట్ ధరించేందుకు కేజ్రీవాల్‌ను అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ తొమ్మిది సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఊరట కోసం కేజ్రీవాల్ కోర్టులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. దీంతో.. సివిల్ లేన్స్‌లోని నివాసంలో మార్చి 22వ తేదీన తనిఖీల పేరుతో వెళ్లిన ఈడీ.. కొన్ని గంటలకే ఆయన్ని అరెస్ట్ చేసి తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇదీ చదవండి: అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటో తెలుసా? -
Phone tapping Case: రాధాకిషన్‌రావుకు జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు గురువారం ఉదయం రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న విషయం తెలి సిందే. అప్పటి నుంచి రాత్రి వరకు ఆయన్ను బంజారాహిల్స్ ఠాణాలో సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను శుక్రవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీ సులు వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఈ ముగ్గురినీ కలిపి, విడివిడిగా విచారించారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఆపై రాధాకిషన్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లికి తీసుకు వెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం రాధాకిషన్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతి కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభాకర్‌రావుతో లింకులు, వసూళ్ల కోణంలో... సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. ఏసీబీ కేసుకు రంగం సిద్ధం రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేక ల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టా రని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు.వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివా దాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తో ంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోప ణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియో గాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కార ణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నగదు రవాణా చేసినట్టూ అంగీకరించారు.. పంజగుట్ట ఠాణాలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ఆయన తాను చేసిన నేరాలను అంగీకరించారు. చట్టవిరుద్ధంగా, తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడం, కుట్రపూరితంగా అనధికారికంగా ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం చేసినట్టు బయటపెట్టారు. రాజకీయంగా పక్షపాతంతో వ్యవహరించడంతోపాటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో తాము అక్రమంగా డబ్బు రవాణా చేయడానికి అధికారిక వనరులను వినియోగించామని అంగీకరించారు. ఇతర నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. – ఎస్ఎం.విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ -
‘స్కిల్డ్’ క్రిమినల్ చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం చంద్రబాబు అంతులేని అక్రమాలకు ఓ మచ్చు తునక మాత్రమే. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట చంద్రబాబు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌కి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో కాగితాలపై ప్రాజెక్టు సృష్టించారు. రూ.370 కోట్ల వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. సీమెన్స్ పేరుతో జీవో జారీ చేసి తన బినామీ కంపెనీ డిజైన్‌టెక్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రూ.271 కోట్లు విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా అక్రమార్జనను తన నివాసానికే చేరవేశారు. ఈ అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడంతో చంద్రబాబు అక్రమాలు బట్టబయలయ్యాయి. స్కిల్ స్కామ్ సృష్టికర్త చంద్రబాబేనని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఆధారాలతో సహా వెల్లడైంది. దీంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షిట్ నమోదు చేసింది. టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గతేడాది సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తరువాత అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు సాగించిన స్కిల్ స్కామ్ ఇలా సాగింది.. విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్ఎస్డీసీ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. అంతా బాబు ముఠానే.. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా 4 పోస్టులు కట్టబెట్టారు. నేరుగా నిధులు మంజూరు జరిగేలా కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్‌భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు సీమెన్స్‌కి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90% కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. టెండర్లు లేకుండా తన బినామీ కంపెనీకి ప్రాజెక్ట్ కట్టబెట్టేందుకే ఈ ఎత్తుగడ వేశారు. నో రూల్స్... సీమెన్స్– డిజైన్ టెక్ ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్ నోట్ ఫైల్లో పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల నిబంధనలకు విరుద్ధమని వారించినా చంద్రబాబు లెక్క చేయలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లు నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, తరువాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు పీవీ రమేశ్ తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్–ట్రైనింగ్, సాధారణ పరిపాలన శాఖకు చెందిన మొత్తం 13 నోట్ ఫైళ్లలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఐదు చోట్ల సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమరి్పంచి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబు బంగ్లాకు రూ.241 కోట్లు చేరవేశారు. కేసులో కీలక నిందితులు ఏ–1 చంద్రబాబు, నాటి ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, నాటి కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, నాటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్, నాటి ఫైనాన్షియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, డిజైన్‌టెక్ ఎండీ ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. మదింపు బూటకం.. నివేదిక నాటకం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు సరైందేనంటూ ‘సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) థర్డ్ పార్టీగా మదింపు జరిపి నివేదిక సమర్పించిందంటూ చంద్రబాబు అడ్డగోలుగా వాదించి అడ్డంగా దొరికిపోయారు. తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని, కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని ‘సీఐటీడీ’ స్పష్టం చేసింది. వాస్తవానికి అంతకంటే ముందే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. కొరడా ఝుళిపించిన ఈడీ ఈ స్కామ్‌పై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి అవి ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు వెళ్లాయి? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది. రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు ఇప్పటికే నిర్ధారించింది. నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా నాడు ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. బాబు అవినీతి నెట్వర్క్ ఇదిగో.. టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. ♦ అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్‌కి మనోజ్ అక్రమ నిధులను తరలించిన పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్‌కు ఉడాయించారు. -
చంద్రబాబు తప్పించుకోలేరు..‘యావజ్జీవం’ తప్పదు!
‘చంద్రబాబు శాశ్వతంగా జైలు పక్షిగా మారక తప్పదు. ఒకట్రెండ్రోజులు ఆలస్యం కావచ్చు తప్ప, యావజ్జీవ కారాగార శిక్ష మాత్రం పక్కా’ అని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఐపీసీ 409 సెక్షన్ కింద ఒక్కో కేసులో విడివిడిగా యావజ్జీవ కారాగార శిక్ష, పీసీ యాక్ట్ 13(బి) కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.కోటి ఫీజు చెల్లిస్తూ.. ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు తీసుకువచ్చే న్యాయవాదులతో కేసు విచారణను కాస్త జాప్యం చేయగలరేమోగానీ నేరం నుంచి మాత్రం తప్పించలేరని స్పష్టం చేస్తున్నారు.భారీ అవినీతి కుంభకోణాల కుట్రదారు, లబ్దిదారులు.. చంద్రబాబు, ఆయన కుటుంబం, సన్నిహితులు, బినామీలేనని డాక్యుమెంటరీ ఆధారాలు, న్యాయ స్థానాల్లో నమోదు చేసిన కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుపై అభియోగాలతో ఏకీభవిస్తూ ఏసీబీ న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడాన్ని బట్టి చూస్తుంటే.. ఈ ఒక్క కేసు చాలు చంద్రబాబుకు యావజ్జీవ శిక్ష పడటానికి అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.అనారోగ్య కారణాలతో స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ ఇస్తున్నప్పుడు గానీ.. తాజాగా మూడు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ సందర్భంగా గానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. తద్వారా చంద్రబాబు, లోకేశ్‌తోపాటు సహచర కుట్రదారులైన టీడీపీ ప్రభుత్వంలో మంత్రులది కూడా జైలు దారేనన్నది స్పష్టమవుతోంది. స్కిల్ కార్పొరేషన్, ఫైబర్‌నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఎంతగా బరితెగించిందనే విషయం చర్చనీయాంశమైంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కిల్ కార్పొరేషన్, ఫైబర్‌నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాలకు కర్త, కర్మ, క్రియ గత ముఖ్యమంత్రి చంద్రబాబే అని సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతో వెల్లడి కావడంతో ఆయనకు ఏ రకంగా చూసినా జీవిత ఖైదు తప్పదని న్యాయ నిపుణులు బల్ల గుద్ది చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన సర్వం తానై కుట్ర పన్నారు. అందుకోసం కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేశారు. స్కిల్ ప్రాజెక్ట్, ఫైబర్ నెట్, బినామీల పేరుతో అసైన్డ్ భూములు పొందిన వారికి భూ సమీకరణ ప్యాకేజీ, మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ పన్ను.. జీఎస్టీ ఎత్తివేత, ఉచిత ఇసుక విధానం.. ఇలా అన్ని కుంభకోణాలకు మార్గం సుగమం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఆ జీవోకు కూడా కేబినెట్ ఆమోదం లేకపోవడం చంద్రబాబు కుట్రను వెల్లడిస్తోంది. ఆ జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను కూడా మాయం చేయడం గమనార్హం. మాయం చేసిన నోట్ ఫైళ్లను సీఐడీ అధికారులు రిట్రీవ్ చేసి వెలుగులోకి తేవడంతో అన్ని కుంభకోణాల కుట్రలకు కీలక ఆధారాలు లభించాయి. చంద్రబాబు ముఠా గల్లంతు చేసిన అమరావతిలో అసైన్డ్ భూముల రికార్డులను సీఐడీ వెలికి తీసింది. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్‌లలో కొల్లగొట్టిన నిధులు చంద్రబాబు నివాసానికే చేర్చిన అవినీతి నెట్‌వర్క్‌ను బ్యాంకు ఖాతాల వివరాలతోసహా ఛేదించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు, క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు కరకట్ట నివాసం పొందడం, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు దక్కడం, చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట భూ సమీకరణ ప్యాకేజీ పొందడం మొదలైనవన్నీ రికార్డులతో సహా వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా చంద్రబాబు, లోకేశ్, నారాయణల పాత్రను స్పష్టం చేస్తూ పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలు లభించాయి. మరోవైపు ఈ కుంభకోణాలన్నింటికి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. అది కూడా 164 సీఆర్సీపీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదని అప్పటి సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ వాంగ్మూలాలు ఇచ్చారు. ఫైబర్‌నెట్, స్కిల్ స్కామ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయొద్దని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని కీలక అధికారుల వాంగ్మూలాలు నమోదు చేశారు. షెల్ కంపెనీల ప్రతినిధులు కూడా అప్రూవర్‌గా మారి అదే విషయాన్ని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కన్సల్టెన్సీ కంపెనీ, స్కిల్ స్కామ్‌కు సంబంధించి సీమెన్స్ కంపెనీ కూడా 164 సీఆర్సీపీ కింద వాంగ్మూలాలు నమోదు చేశాయి. ఈ విధంగా అన్ని కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్దిదారు అనేదానికి అటు డాక్యుమెంటరీ ఆధారాలు, ఇటు కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసా«ద్యమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపడమే తార్కాణం ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు. అలానే చంద్రబాబు పాల్పడ్డ ఇన్ని కుంభకోణాలలో ఒక్క స్కిల్ స్కామ్‌ను పరిశీలిస్తే చాలు.. ఆయన అవినీతి బాగోతం తెలిసిపోతోంది. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరు పరిచింది. ఆ సందర్భంగా దాదాపు 10 గంటలపాటు ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత ఆయనకు జ్యుడిషి యల్ రిమాండ్ విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సీఐడీ నమోదు చేసిన అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. దాంతోనే చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇక సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించ లేదు. ముందస్తు బెయిల్‌పై ఎల్లో మీడియా వక్రీకరణ ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆ సందర్భంగా కూడా ఆయన అవినీతికి ఆధారాలు లేవని న్యాయస్థానం చెప్ప లేదు. కేసు పూర్వాపరాల్లోకి ఇంకా తాము వెళ్లడం లేదని కూడా స్పష్టం చేసింది. కేవలం షరతులతోనే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. విచారణకు చంద్రబాబు సహకరించాలని.. విచారణకు పిలిస్తే వెళ్లాలని కూడా చెప్పింది. కానీ హైకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెబుతూ చంద్రబాబుకు క్లీన్ చిట్ లభించినట్టుగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా హడావుడి చేయడం విస్మయ పరుస్తోంది. సీఐడీ సేకరించిన ఆధారాలతో నేరం రుజువు కావడం ఖాయమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేరం నిరూపితమైన తర్వాత ఒక్కో కేసులో చంద్రబాబుకు యావజ్జీవ జైలు శిక్ష పడుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఆయనపై సీఐడీ నమోదు చేసిన వివిధ సెక్షన్ల తీవ్రత, కేసుల విచారణ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు వీరే ♦ నారా చంద్రబాబునాయుడు ♦ నారా లోకేశ్, పొంగూరు నారాయణ ♦ కింజరాపు అచ్చెన్నాయుడు ♦ దేవినేని ఉమామహేశ్వరరావు ♦ కొల్లు రవీంద్ర, పీతల సుజాత ♦ చింతమనేని ప్రభాకర్ తవ్వేకొద్దీ అవినీతే ♦ స్కిల్ స్కామ్‌లో రూ.241 కోట్లు చంద్రబాబు నివాసానికి చేరాయని సీఐడీ ఆధారాలతోసహా వెలుగులోకి తెచ్చింది. ♦ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు తన బినామీ అయిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టేశారు. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ టెండరు అప్పగించారు. నాసిరకం పనులు చేసినాసరే పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా రూ.244 కోట్లు చెల్లించగా అందులో రూ.144 కోట్లు చంద్రబాబు నివాసానికే చేరాయి. ♦ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్, నారాయణ భారీ భూ బాగోతానికి పాల్పడ్డారు. తమ బినామీ అయిన లింగమనేని కుటుంబానికి చెందిన భూములను ఆనుకుని నిర్మించేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారులో క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. కృష్ణా నదికి ఇటూ అటూ కూడా లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 355 ఎకరాల సమీపం నుంచి నిర్మించేలా రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకోసం కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై కట్టబెట్టారు. అనంతరం అదే అలైన్‌మెంట్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చేలా ముందుగానే షరతు విధించి మరీ రాజధాని మాస్టర్ ప్లాన్ డెవలపర్‌ను నిర్ణయించారు. దాంతో అప్పటి వరకు చంద్రబాబు, లింగమనేని, నారాయణ భూముల మార్కెట్ విలువ మొత్తం రూ.177.50 కోట్లు ఉండగా.. అలైన్మెంట్ ఖారారుతో ఏకంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచిన తర్వాత అమాంతంగా రూ.2,130 కోట్లకు పెరుగుతుందని స్పష్టమైంది. అంటే అలైన్మెంట్ ఖరారులో అక్రమాలకు పాల్పడి దాదాపు రూ.2 వేల కోట్ల అక్రమ లబ్ధికి పచ్చముఠా కుట్ర పన్నింది. ♦ చంద్రబాబు కనుసన్నల్లో సాగిన అమరావతిలోని అసైన్డ్ భూముల దందా దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీగా రికార్డు సృష్టించింది. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని ఏకంగా కేంద్ర అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు. అందుకోసం అమరావతి పరిధిలో అసలు 1954 తర్వాత అసైన్డ్ భూములే ఇవ్వలేదంటూ భూ రికార్డులు తారుమారు చేశారు. అసైన్డ్ భూములను జిరాయితీ భూములుగా రికార్డుల్లో కనికట్టు చేశారు. పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటుందని రైతులను భయపెట్టారు. అందుకోసం మొదట జీవో నంబర్–1 జారీ చేశారు. ఆ జీవోను బూచిగా చూపిస్తూ తమ ఏజంట్ల ద్వారా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నంబర్–41 జారీ చేశారు. తద్వారా భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.3,737.30 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములను కూడా తమ బినామీల భూములుగా చూపిస్తూ ఏకంగా 328 ఎకరాలను కొల్లగొట్టారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లు విలువైన స్థలాలు పొందారు. ♦ పేరుకు ఉచిత ఇసుక అని చెప్పి.. చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులు మాత్రమే ఉచితంగా ఇసుక కొల్లగొట్టి బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయించేలా చక్రం తిప్పారు. తద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ♦ తమ అస్మదీయ, బినామీ కంపెనీలకు మద్యం కొనుగోళ్ల కాంట్రాక్టులు కట్టబెడుతూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న మద్యం దుకాణాలు, బార్లపై ఉన్న ప్రివిలేజ్ ట్యాక్స్.. జీఎస్టీని తొలగిస్తూ చీకటి జీవోలు జారీ చేశారు. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్ల యజమానుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఆరు కేసుల్లోనూ శిక్ష తప్పదు చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటిలో అత్యంత కీలకమైనది సెక్షన్ 409. ఆ సెక్షన్ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇతర సెక్షన్లు సరేసరి. ఈ ఆరు కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్షలు పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికే బాబుకు 73 ఏళ్లు నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓసారి నేరం నిరూపితమై ఒక్కో కేసులో ఐపీసీ 409 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష, అవినీతి నిరోధక చట్టం 13(2) కింద గరిష్టంగా పదేళ్ల కారాగార శిక్ష పడితే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ కూడా నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. సీఎంగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడిన ఉదంతాన్ని ఉదాహరిస్తున్నారు. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. బాబుపై నమోదైన ఐపీసీ సెక్షన్లు ఇవే.. 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) 409 సెక్షన్ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. 13 (2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది. -
ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
ఇస్లామాబాద్: అల్–ఖదీర్ ట్రస్టు అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రహస్య పత్రాల లీకేజీ కేసులో రావలి్పండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) అల్–ఖదీర్ ట్రస్ట్ కేసులో ఈ నెల 14న అదుపులోకి తీసుకుంది. రూ.2 వేల కోట్లు మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తున్న ఈ కేసులో ఇమ్రాన్‌ను కస్టడీకివ్వాలన్న ఎన్ఏబీ వాదనను జడ్జి తోసిపుచ్చుతూ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..!
-
ముగియనున్న చంద్రబాబు రిమాండ్..రాజమండ్రికి లోకేష్
-
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ అక్టోబర్ 5వ తేదీ వరకూ పొడిగింపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబు రిమాండ్ పొడగింపు
-
5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది. చంద్రబాబు రెండు రోజుల పోలీసు కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు కస్టడీ ముగియడంతో జైలు అధికారులు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంది. విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? కఠినంగా ఏమైనా వ్యవహరించారా? అని ఆరా తీసింది. అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు కోర్టుకు నివేదించారు. విచారణ సందర్భంగా ఆహారం, మందులతోపాటు న్యాయవాదులతో మాట్లాడుకునే వెసులుబాటు తదితర అవకాశాలిస్తూ ఆదేశాలిచ్చామని, వాటిని ఏమైనా అధికారులు ఉల్లంఘించారా? అని న్యాయస్థానం ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. భౌతికంగా ఇబ్బందులకు గురి చేశారా? అని కోర్టు ప్రశ్నించగా, లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇంకేమైనా చెప్పాల్సి ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించడంతో, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, అక్రమంగా జైలులో ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు. మీ పాత్రపై 600కిపైగా డాక్యుమెంట్లు... మీపై ప్రస్తుతం ఉన్నవి ఆరోపణలేనని కోర్టు చంద్రబాబుకు తెలిపింది. సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో మీ పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచిందని పేర్కొంది. సీఐడీ సమర్పించిన ఆధారాలను పరిశీలించి వాటికి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారణకు వచ్చిన తరువాతే జుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు కోర్టు చంద్రబాబుకు తేల్చి చెప్పింది. సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాతనే మీరు దోషినా? నిర్ధోషినా? అన్నది కోర్టు తేలుస్తుందని చంద్రబాబుకు స్పష్టం చేసింది. చట్టాన్ని అనుసరించే ఈ కోర్టు ముందుకెళుతుందని తెలిపింది. సీఐడీ అధికారులు ఈ కేసులో మీ పాత్రకు సంబంధించి 600కిపైగా డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారని తెలిపింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అవన్నీ ఈ దశలో రహస్య డాక్యుమెంట్లే అవుతాయని చంద్రబాబుకు స్పష్టం చేసింది. దర్యాప్తు జరగాల్సిందే.. అది ప్రొసీజర్ దర్యాప్తు అధికారులకు విశిష్ట అధికారాలుంటాయని కోర్టు పేర్కొంది. అయితే మీ హక్కులను, దర్యాప్తు సంస్థ విశిష్టాధికారాన్ని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని, ఇప్పుడు తాము అదే చేస్తున్నామని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు తేల్చి చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, సీఐడీ ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వలేదని చంద్రబాబు పేర్కొనగా, మీకు ఇవ్వదగ్గ డాక్యుమెంట్లు కొన్ని ఉంటాయని, వాటిని మీ న్యాయవాదుల ద్వారా తీసుకోవచ్చని సూచించింది. వాటిని పరిశీలిస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారన్న సంగతి మీకు అర్థం కావచ్చని చంద్రబాబునుద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు జరగాల్సిందేనని, అది ప్రొసీజర్ అని కోర్టు గుర్తు చేసింది. మీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని, దానిపై విచారణ జరపాల్సి ఉందని కోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే బెయిల్ ఇవ్వాలా?వద్దా? అనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుందని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. అందుకోసమే జుడీషియల్ రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మీరు ప్రస్తుతం పోలీసు కస్టడీలో లేరని, కోర్టు కస్టడీలో ఉన్నారని పేర్కొంటూ చంద్రబాబును జాగ్రత్తగా చూసుకోవాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. యాంత్రికంగా ఉత్తర్వులిస్తున్నామా? అంతకు ముందు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో చిన్నపాటి హైడ్రామా నడిపారు. జుడీషియల్ రిమాండ్ పొడిగింపుపై చంద్రబాబు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలిపారు. కోర్టు తనంతట తానుగా రిమాండ్‌ను పొడిగించలేదన్నారు. రిమాండ్‌ను పొడిగించవద్దని కోరారు. పొడిగింపు కోసం సీఐడీ మెమో దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగింపు పిటిషన్ వేయలేదా? అని ఏసీబీ కోర్టు ప్రశ్నించడంతో తాము రిమాండ్ పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదించారు. ఆ కాపీని చంద్రబాబు న్యాయవాదులకు అందచేయాలని పీపీని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం పోసాని స్పందిస్తూ కోర్టు యాంత్రికంగా జుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొనడంపై న్యాయస్థానం ఒకింత తీవ్రంగా స్పందించింది. సీఐడీ తమ ముందుంచిన కేసు డైరీని, సెక్షన్ 164 స్టేట్మెంట్లన్నింటినీ చదివామని, అలాగే 2000 పేజీలపైగా డాక్యుమెంట్లను పరిశీలించామని, వాటన్నింటినీ చూసిన తరువాతనే చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారణకు రావడం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలకు అనుగుణంగానే జుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తేల్చి చెప్పింది. అంతేకానీ మీరు చెబుతున్నట్లు యాంత్రికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. కోర్టు ఆగ్రహంతో ఖంగుతిన్న చంద్రబాబు న్యాయవాది తమ ఉద్దేశం అది కాదంటూ సమర్థించుకునే యత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం న్యాయస్థానం ఆయన రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మాకు సమయం ఎక్కడిస్తున్నారు..? అటు తరువాత ఏసీబీ కోర్టు ఇరుపక్షాలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కోర్టు ఏదీ యాంత్రికంగా చేయడం లేదని పేర్కొంది. ప్రతి చిన్న విషయానికి పలు పిటిషన్లు వేస్తున్నారని, ఒకదాని వెంట మరొకటి పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారని గుర్తు చేసింది. ‘మీరు వేసిన దానికి వారు, వారు వేసిన దానికి మీరు కౌంటర్లు వేస్తారు. వాటిన్నింటినీ ఈ కోర్టు క్షుణ్ణంగా చదవాలి. అర్థం చేసుకోవాలి. చట్టం ఏం చెబుతుందో చూడాలి. కోర్టు ఇన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసేందుకు మీరు కోర్టుకు సమయం ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు పిటిషన్ వేశాం, వినాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందరూ కోర్టుకు సహకరిస్తేనే పనిచేయడం సాధ్యం అవుతుంది. చట్టానికి లోబడే వ్యవహరించాలి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’ అని న్యాయస్థానం పేర్కొంది. -
చంద్రబాబు రిమాండ్ 24 వరకు పొడిగింపు
సాక్షి అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీíÙయల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 24వతేదీ వరకు ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ఉదయం 11.10 గంటల సమయంలో చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి జైలులో పరిస్థితుల గురించి వాకబు చేశారు. ఆయనకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని సూచించారు. ఆహారం విషయంలో ఫిర్యాదులు ఉంటే చెప్పొచ్చని పేర్కొన్నారు. చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. తనది 45 ఏళ్ల రాజకీయ జీవితం అని, తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు న్యాయమూర్తికి నివేదించారు. తాను మాజీ ముఖ్యమంత్రినని, తనను జైలులో ఉంచడం ద్వారా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వాపోయారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా చట్టం ముందు ఒకటేనని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాల్సి ఉంటుందని, తాము కూడా చట్టానికి లోబడే విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. మీపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని, దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్నారు. దర్యాప్తు పూర్తై చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత ట్రయల్ మొదలవుతుందని, నేరం చేశారో లేదో అందులో తేలుతుందన్నారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచడాన్ని శిక్షగా భావించరాదన్నారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు నిందితులు బయట ఉంటే దానికి ఆటంకం కలుగుతుందని విచారణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసినప్పుడు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపుతామని చెప్పారు. జ్యుడిషియల్ రిమాండ్ అంటే కోర్టు సంరక్షణలో ఉన్నట్లేనని తెలిపారు. కోర్టు ఆదేశాలను సానుకూల దృక్పథంతో, హుందాగా చూడాలన్నారు. ఇరుపక్షాలు చెప్పిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే కోర్టు ఓ నిర్ణయానికి వస్తుందన్నారు. ఇది కూడా చదవండి: సీఐడీ కస్టడీకి చంద్రబాబు -
ఇంకెన్నాళ్లు ఈ డ్రామాలు ?
-
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ‘హౌస్ రిమాండ్’ పిటిషన్‌ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సాక్ష్యాధారాలు ఉండడంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు
-
కస్టడీలోకి తీసుకుంటేనే మరిన్ని వివరాలు తెలుస్తాయి
-
ఈ నెల 22 వరకూ చంద్రబాబుకు రిమాండ్
-
ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు మరోసారి కోర్టు షాకిచ్చింది. ఇప్పటికే వారం రోజులు సీబీఐ కస్టడీలో ఉన్నఆయనకు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు. ఈనెల 20 వరకు ఆయన రిమాండ్‌లోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత ఆదివారం(ఫిబ్రవరి 26) సిసోడియాను 8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు అనంతరం అరెస్టు చేశారు. ఆ మరునాడే కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీ విధించింది. అనంతరం మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టగా మరో రెండు రోజులు కస్టడీ విధించింది. ఈ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ మరోసారి సిసోడియాను కోర్టులో ప్రవేశపట్టారు. ఈసారి కస్టడీ కాకుండా జ్యుడీషియల్ రిమాండ్ కోరారు. న్యాయస్థానం ఇందుకు అనుమతి ఇవ్వడంతో సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు. కాగా.. సిసోడియా ఇప్పటికే బెయిల్ కోసం దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 10న దీనిపై విచారణ చేపడతామని న్యాయస్థానం చెప్పింది. చదవండి: మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో -
Urination incident: ‘ఎయిరిండియా’ నిందితుని అరెస్టు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనామిక పేర్కొన్నారు. ఘటన సమయంలో విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు నిందితుడిని గుర్తించాల్సి ఉన్నందున శంకర్ మిశ్రాను మూడు రోజుల కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల వినతిని మేజిస్ట్రేట్ తోసిపుచ్చారు. ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయనే కారణంతో కస్టడీకి కోరడం తగదన్నారు. నిందితుడి పరోక్షంలో విమాన ప్రయాణికులు, సిబ్బంది వాంగ్మూలం నమోదు చేస్తే సరిపోతుందన్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు.. అంతకుముందు మిశ్రా కోసం ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ జనవరి 3న బెంగళూరుగా చూపించింది. స్నేహితులతో సోషల్ మీడియా ద్వారా అతను టచ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి బెంగళూరు మహదేవపురలోని చిన్నప్ప లేఔట్లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. బాధితురాలిని ఇబ్బందులకు గురిచేశారు ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది బాధ్యతా రాహిత్యాన్ని బాధితురాలి పక్క సీట్లో ప్రయాణించిన డాక్టర్ సుగతా భట్టాచార్య వెల్లడించారు. ‘‘మిశ్రా నిర్వాకానికి బాధితురాలి దుస్తులు, సీటు పూర్తిగా తడిచి దుర్వాసన వెదజల్లుతున్నా మరో సీటు కేటాయించకుండా పైలట్ ఆమెను రెండు గంటలపాటు ఇబ్బందిపెట్టారు. ఫస్ట్‌క్లాస్‌లో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నా వెంటనే సిబ్బంది సీటివ్వలేదు. ఆ ఘటనతో మేమంతా షాకయ్యాం’’ అంటూ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బా ధితురాలికి ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ వి ల్సన్ క్షమాపణలు చెప్పారు. ‘‘సిబ్బంది సరిగా వ్య వహరించాల్సింది. పైలట్‌తో పాటు నలుగురికి షో కాజ్ నోటీసులిచ్చాం. విమానంలో ప్రయాణికులకు మందు సరఫరా చేయడాన్ని సమీక్షిస్తాం’’అన్నారు. -
రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్..
Youtuber Karthik Gopi Nath Arrested For Cheating Rs 44 Lakh: ఆలయాల పునరుద్ధరణ పేరుతో రూ. 44 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన యూట్యూబర్, బీజేపీ మద్దతుదారుడు కార్తీక్ గోపీనాథ్‌ను ఆవడి పోలీసులు సోమవారం (మే 30) అరెస్టు చేశారు. ఆవడిలో స్టూడియాతోపాటుగా యూట్యూబ్ చానల్‌ను కార్తీక్ నడుపుతున్నాడు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన కార్తీక్‌పై దేవదాయ శాఖ కన్నెర్ర చేసింది. పెరంబలూరులో రెండు ఆలయాల పునరుద్ధరణ కోసం అంటూ.. కార్తీక్ విరాళాల్ని సేకరించాడు. ఇందులో ఒకటైన మదుర కాళి అమ్మన్ ఆలయం దేవదాయశాఖ పరిధిలో ఉంది. కాగా అనుమతి లేకుండా వసూళ్లకు పాల్పడినందుకు సంబంధిత అధికారులు ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు రూ. 44 లక్షల మేరకు వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో కార్తీక్‌ను అరెస్టు చేశారు. అంబత్తూరు కోర్టు అతనికి జూన్ 13 వరకు రిమాండ్‌కు విధించింది. చదవండి:👇 తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్ అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించేందుకు ఎర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు. కోవిడ పరీక్ష అనంతరం నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా, రాహుల్ హత్య తర్వాత రెండ్రోజుల పాటు పరారీలో ఉన్న కోగంటి సత్యంను విజయవాడ పోలీసులు నిన్న బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ కూడా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. చదవండి: కామం మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్.. తెల్లారి లేచి చూస్తే -
రియాకు రిమాండ్ పొడిగింపు
ముంబై: నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇరువురూ బాంబే హైకోర్టులో మంగళవారం బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు విచారణ బుధవారం జస్టిస్ సారంగ్ కొత్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుందని వారి తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. సెప్టెంబర్ 9న రియాచక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. రియా చక్రవర్తి తాను ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్న వ్యక్తులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ, ఆ రోజు వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్లను స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు తిరస్కరించింది. స్పెషల్ కోర్టు వీరి జ్యూడీషియల్ రిమాండ్‌ని అక్టోబర్ 6 వరకు మరో పద్నాలుగు రోజులు పొడిగించింది. శామ్యూల్ మిరాండాతో సహా రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ సెప్టెంబర్ 5న అరెస్టు చేసింది. వీరి బెయిలు పిటిషన్లను సైతం ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 11న తిరస్కరించింది. -
ఈ నెల 25 వరకూ చింతమనేనికి రిమాండ్
సాక్షి, ఏలూరు: దళితులను దూషించి.. దౌర్జన్యం చేసిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు న్యాయస్థానం ఈ నెల 25 వరకూ రిమాండ్ విధించింది. అంతకు ముందు ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు అనంతరం చింతమనేనిని ఏలూరు ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఈ నెల 25 వరకూ చింతమనేనికి రిమాండ్ విధించారు. గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన నివాసానికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి పది కేసులు నమోదు చేశారు. చదవండి: చింతమనేని ప్రభాకర్ అరెస్టు..