సాక్షి అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీíÙయల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 24వతేదీ వరకు ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు ఉదయం 11.10 గంటల సమయంలో చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి జైలులో పరిస్థితుల గురించి వాకబు చేశారు. ఆయనకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే చెప్పాలని సూచించారు. ఆహారం విషయంలో ఫిర్యాదులు ఉంటే చెప్పొచ్చని పేర్కొన్నారు. చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతకు సంబంధించిన వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. తనది 45 ఏళ్ల రాజకీయ జీవితం అని, తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు న్యాయమూర్తికి నివేదించారు.
తాను మాజీ ముఖ్యమంత్రినని, తనను జైలులో ఉంచడం ద్వారా మానసిక క్షోభకు గురి చేస్తున్నారని వాపోయారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా చట్టం ముందు ఒకటేనని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడే నడుచుకోవాల్సి ఉంటుందని, తాము కూడా చట్టానికి లోబడే విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. మీపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని, దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్నారు. దర్యాప్తు పూర్తై చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత ట్రయల్ మొదలవుతుందని, నేరం చేశారో లేదో అందులో తేలుతుందన్నారు.
జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచడాన్ని శిక్షగా భావించరాదన్నారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు నిందితులు బయట ఉంటే దానికి ఆటంకం కలుగుతుందని విచారణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసినప్పుడు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపుతామని చెప్పారు. జ్యుడిషియల్ రిమాండ్ అంటే కోర్టు సంరక్షణలో ఉన్నట్లేనని తెలిపారు. కోర్టు ఆదేశాలను సానుకూల దృక్పథంతో, హుందాగా చూడాలన్నారు. ఇరుపక్షాలు చెప్పిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే కోర్టు ఓ నిర్ణయానికి వస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: సీఐడీ కస్టడీకి చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment