బీజేపీ నేత యశ్వంత్ సిన్హా జైలుకు | Yashwant Sinha sent to jail in assault case | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత యశ్వంత్ సిన్హా జైలుకు

Published Wed, Jun 4 2014 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

బీజేపీ నేత యశ్వంత్ సిన్హా  జైలుకు

బీజేపీ నేత యశ్వంత్ సిన్హా జైలుకు

హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. బెయిల్ కోరడానికి నిరాకరించడంతో సిన్హాతోపాటు మరో 54 మందికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆర్‌బీ పాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ కొరతకు నిరసనగా సిన్హా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సోమవారం హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement