power department
-
విద్యుత్ కమిషన్ విచారణ పారదర్శకంగా జరగడం లేదు: జగదీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్‌పై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. విచారణ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం జరగలేదు.. ఒప్పందాల మేరకే ప్రాజెక్టులు జరిగాయని కేసీఆర్ లేఖ రూపంలో చెప్పారు. నియమాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుంది. కమిషన్ న్యాయ బద్దంగా విచారణ చేయాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా వివక్ష లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలి’’ అని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. బండి సంజయ్‌కు కనీస పరిజ్ఞానం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఐదేళ్ల నుంచి చెబుతున్నాం’’ అని జగదీష్‌రెడ్డి అన్నారు. -
‘యాదాద్రి’లో ఎందుకీ జాప్యం?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఇంకా ఎందుకు పూర్తి కాలేదంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీహెచ్ఈఎల్తో జరిగిన ఒప్పందం ప్రకారం 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి 3 యూనిట్ల నిర్మాణం పూర్తి కావాలి. మొత్తంగా 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలి. కానీ ఇంత జాప్యం జరగడానికి కారణాలు ఏమిటి? కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు ఆహా్వనించకుండా..నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు పనులు ఎందుకు అప్పగించారంటూ’భట్టి ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో ఇంధనశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజారిజీ్వతో కలిసి బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. థర్మల్ కేంద్రం నిర్మాణానికి జెన్కో రూపొందించిన అంచనాలు, బీహెచ్ఈఎల్ కోట్ చేసిన రేటు, ధరల విషయంలో బీహెచ్ఈఎల్తో జరిగిన సంప్రదింపులు, అగ్రిమెంట్ విలువ వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధనశాఖ కార్యదర్శిని భట్టి విక్రమార్క ఆదేశించారు. రూ.34,500 కోట్ల అంచనాలతో యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 2015 జూన్ 6న ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్‌లో వర్క్ఆర్డర్ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్ ప్రకారం 2021 నాటికి పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదు ? అని ఆయన మండిపడ్డారు. ఇంకా విద్యుదుత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడమే కారణం: బీహెచ్ఈఎల్ రూ.34,500 కోట్ల పనుల్లో బీహెచ్ఈఎల్కు అప్పగించిన పనుల విలువ ఎంత అని భట్టి అడగ్గా.. రూ.20,444 కోట్లు విలువ చేసే పనులు బీహెచ్ఈఎల్కు అప్పగించారని, మిగిలిన పను లు జెన్కో, ఇతర సంస్థలు చేపట్టాయని బీహెచ్ఈఎల్ అధికారులు వివరించారు. తమకు ఇచి్చన పనుల్లో రూ.15,860 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేశామని, రూ.14,400 కోట్ల బిల్లుల చెల్లింపులు జరిగాయన్నారు. రూ.1,167 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చెల్లింపులు ప్రతినెలా చేయలేదని, ఒక్క మార్చి(2023) నెలలోనే 91 శాతం చెల్లింపులు జరిపిందన్నారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో తాము కూడా సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేకపోయామని, దీంతో పనులు సజావుగా జరగలేదన్నారు. పర్యావరణానికి సంబంధించిన మరికొన్ని అనుమతులు ఏప్రిల్ 2024 నాటికి తీసుకొస్తే..సెప్టెంబర్ 2024 నాటికి రెండు యూనిట్లు, డిసెంబర్ 2024 లోగా మరో రెండు యూనిట్లు, 2025 మే నాటికి మిగిలిన ఒక యూనిట్‌ను పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీహెచ్ఈఎల్ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో బీహెచ్ఈఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొప్పు సదాశివమూర్తి, డైరెక్టర్ తజీందర్గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
గత పీపీఏలపై నివేదిక ఇవ్వండి
రాష్ట్రానికి సమగ్ర విద్యుత్ విధానం లేక ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాత కొత్తగా సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. ఇందుకోసం విద్యుత్ రంగ నిపుణులతో సైతం విస్తృతంగా సంప్రదింపులు నిర్వహిస్తామన్నారు. ఇతర అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన విద్యుత్ విధానానికి రూపకల్పన చేస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు విద్యుదుత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న అన్నిరకాల పీపీఏలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర అంశాలతో పాటు పీపీఏలకు సంబంధించిన నిబంధనలు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నుంచి పొందిన అనుమతులు, విద్యుత్ కొనుగోలు ధరలు నివేదికలో ఉండాలని అన్నారు. అధిక ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను కూడా వివరించాలని కోరారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తున్నారో వారి వద్ద నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డి.శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, భవిష్యత్తులో పెరిగే రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి వీలుగా కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల, ఎన్నికల హామీ మేరకు గృహజ్యోతి పథకం కింద గృహ వినియోగదారులకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. జెన్కో ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుదుత్పత్తి, ఇతర విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితులు, డిస్కంల ఆర్థిక పరిస్థితి, పనితీరుపై ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని సీఎం స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రాలను సత్వరం పూర్తి చేయాలని చెప్పారు. విద్యుత్ దురి్వనియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్ నిరంతర సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తుగా పటిష్ట చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి/ జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల ఇన్చార్జి సీఎండీ సయ్యద్ ముర్తుజా అలీ రిజ్వీ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ ఫారూఖీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి కూడా సమీక్షలో పాల్గొన్నారు. వికారాబాద్‌లో నేవీ రాడార్ స్టేషన్: సీఎం ఫిబ్రవరిలో పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనులు వచ్చే ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దామగుండం దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తారని చెప్పారు. అదే స్థలంలో ఆలయాభివృద్ధి పనులు కూడాచేపడ్తారన్నారు. ఇండియన్ నేవీ కమాండర్ కార్తిక్ శంకర్ నేతృత్వంలోని బృందం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. రాడార్ స్టేషన్ నిర్మాణం విశేషాలను వివరించింది. నేవీకి సంబంధించిన భారీ పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారని, దీంతో పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపింది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. కాగా పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని సమన్వయం చేసుకుని త్వరలో పనులు ప్రారంభించాలని నేవీ అధికారులకు సీఎం సూచించారు. కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ సిబ్బంది సందీప్ దాస్, రాజ్బీర్ సింగ్, మణిశర్మ, మనోజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యుత్’ డైరెక్టర్లకు ఉద్వాసన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుదీర్ఘకాలం నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారి స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు విద్యుత్ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పిడీసీఎల్ తదితర సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు (సీఎండీ)గా ఐఏఎస్ అధికారులను నియమించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. తదుపరి చర్యగా కొత్త డైరెక్టర్ల నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్సర్విస్, రిటైర్డ్ విద్యుత్ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. 2012 మే 14న ఇంధన శాఖ జారీ చేసిన జీవో 18 ప్రకారం నియామకాలు చేపట్టనున్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోల ఇన్చార్జి సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి.. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లిస్టును రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది. ఈ సెలెక్షన్ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వినర్లుగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్ రంగ స్వతంత్ర నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ సిఫార్సు చేసినవారి నుంచి డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. అర్హతలు ఉంటేనే కొలువు గతంలో కనీస అర్హతలు లేనివారిని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్లుగా నియమించడంతోపాటు అడ్డగోలుగా పదవీ కాలాన్ని పొడిగించినట్టు ఆరోపణలున్నాయి. డైరెక్టర్‌గా ఎంపికయ్యే వారికి కనీసం చీఫ్ ఇంజనీర్‌గా మూడేళ్ల అనుభవం ఉండాల్సి ఉన్నా.. డీఈలుగా రిటైరైన వారిని సైతం నియమించి కీలక విభాగాలను అప్పగించినట్టు విమర్శలున్నాయి. దీంతో ఈసారి పక్కాగా నిబంధనలను అనుసరించి నియామకాలు జరపాలని నిర్ణయించి, పాత ఉత్తర్వులను వెలికితీశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్ పదవికి ఎంపిక కావాలంటే.. సంబంధిత విద్యుత్ విభాగాల కార్యకలాపాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవంతోపాటు మొత్తంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసి ఉండాలి. కనీసం మూడేళ్లపాటు చీఫ్ ఇంజనీర్/చీఫ్ జనరల్ మేనేజర్/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా తత్సమాన హోదాల్లో పనిచేసి ఉండాలి. నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్లకు మించరాదు. పదవీకాలం రెండేళ్లే.. నిబంధనల ప్రకారం డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలెక్షన్ కమిటీ సిఫార్సులతో ఏడాది చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించడానికి వీలుంది. ప్రస్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్కోలో ఏడుగురు, టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, ఎన్పిడీసీఎల్లో 8 మంది కలిపి మొత్తం 27 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు. వీరిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నుంచీ, మరికొందరు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరే డైరెక్టర్లుగా కొనసాగుతారంటూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇలా సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. కొందరి వయసు 85ఏళ్లకు చేరినా డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు. ట్రాన్స్‌కో కొత్త జేఎండీకి అందని బాధ్యతలు ఇటీవల ట్రాన్స్‌కో జేఎండీగా ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంస్థ సీఎండీ ముర్తుజా రిజ్వీ ఇంకా సందీప్‌కుమార్ ఝాకు అధికారికంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆయన విద్యుత్ సౌధలోని రెండో అంతస్తులో ఖాళీగా కూర్చుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో ట్రాన్స్‌కో జేఎండీగా ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన సి.శ్రీనివాసరావునే ఆ పోస్టులో కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరావు పదవీకాలం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలన్నీ శ్రీనివాసరావుకు తెలిసి ఉండటంతో.. ఆయనను పదవీకాలం ముగిసేవరకు కొనసాగించవచ్చనే అభిప్రాయం ఉంది. తర్వాత కూడా శ్రీనివాసరావును కొనసాగించాలని భావిస్తే.. కొత్త జేఎండీ సందీకుమార్ ఝాకు రెండో జేఎండీగా హెచ్ఆర్ వంటి విభాగాల బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. -
అప్పుల్లో ‘కరెంట్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ సర్కారు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆవిర్భవించే నాటికి రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పులు రూ.20,856.12 కోట్ల మేర ఉండగా.. 2022–23 నాటికి రూ.78,553.92 కోట్లకు పెరిగాయని అందులో పేర్కొంది. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, బకాయిలు (లయబిలిటీస్) కలిపి రూ.37,081.64 కోట్లుకాగా.. 2022–23 నాటికి రూ.1,37,571.4 కోట్లకు చేరాయని వివరించింది. అంటే ఏకంగా రూ.1,00,489 కోట్లకుపైగా పెరిగినట్టు పేర్కొంది. విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల్లో.. విద్యుదుత్పత్తి కోసం జెన్కో కొనుగోలు చేసిన బొగ్గు వ్యయం, డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి ఇంకా చెల్లించాల్సిన బిల్లుల వంటివి ఉంటాయి. అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడినప్పుడు.. పలు అంశాలను విడివిడిగా వివరించారు. విద్యుత్‌శాఖ మొత్తం అప్పులు రూ.81,516 కోట్లు అని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంలోని వివిధ శాఖలు/విభాగాలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు రూ.28,842.72 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వ శాఖలు బకాయిపడిన సొమ్ము రూ.720 కోట్లు. రూ.39,722 కోట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్లు డిమాండ్‌లో హెచ్చుతగ్గులు, విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోవడం, స్థిరత్వం లేని పునరుత్పాదక విద్యుత్ లభ్యత వంటి కారణాలతో 2014–24(నవంబర్ 2023) మధ్య సగటున యూనిట్‌కు రూ.5.03 ధరతో 78,970 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్ నుంచి డిస్కంలు కొనుగోలు చేశాయి. ఇందుకు రూ.39,722 కోట్లను ఖర్చు చేశాయి. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాకున్నా రూ.638 కోట్ల కారిడార్ చార్జీలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ రావాలి. కానీ 2022 ఏప్రిల్ నుంచి నిలిచిపోయింది. నిజానికి సర్కారు ఆదేశం మేరకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం డిస్కంలు 2,000 మెగావాట్ల సామర్థ్యమున్న కారిడార్‌ను బుక్ చేశాయి. 2017–22 మధ్య పాక్షికంగానే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరాకాగా.. పూర్తిస్థాయిలో 1,000 మెగావాట్ల కోసం కారిడార్ చార్జీలను చెల్లించాల్సి వచ్చింది. కారిడార్‌ను ఉపయోగించకపోయినా 2020 అక్టోబర్ వరకు రూ.638.5 కోట్ల చార్జీలను చెల్లించాల్సి వచ్చింది. సరఫరా అయిన విద్యుత్‌కు సంబంధించి మరో రూ.723 కోట్ల కారిడార్ చార్జీలను చెల్లించారు. పెరిగిన ఆస్తులు, నష్టాలు ► తెలంగాణ ఆవిర్భావం నాటితో పోల్చితే రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) స్థిరాస్తుల విలువ రూ.12,783 కోట్ల నుంచి రూ.40,454 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో అప్పులు రూ.7,662 కోట్ల నుంచి రూ.32,797 కోట్లకు పెరిగాయి. అంటే ఆస్తులు 3.16 రెట్లు పెరగగా, అప్పులు 4.28 రెట్లు పెరిగాయి. ► తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నష్టాలు రూ.62,461 కోట్లుగా ఉన్నాయి. 2022–23లోనే రూ.11,103 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ► పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) వార్షిక రేటింగ్స్‌లో 2015–16లో ‘బీ+’గ్రేడ్‌లో ఉన్న డిస్కంలు.. 2021–22 నాటికి ‘సీ–’గ్రేడ్‌కు పడిపోయాయి. ► రేటింగ్స్ నివేదిక ప్రకారం.. డిస్కంల నికర విలువ మైనస్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వాటి నికర విలువ ‘మైనస్ రూ.30,876 కోట్లు’. ► వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు సంబంధించి డిస్కంలు సమర్పించిన అంచనాలతో పోల్చితే తెలంగాణ ఈఆర్సీ ఆమోదించిన అంచనాలు తక్కువగా ఉన్నాయి. దీంతో డిస్కంలకు రావాల్సిన సబ్సిడీతో పోల్చితే ప్రభుత్వం తక్కువ సబ్సిడీ ఇచ్చింది. దీంతో డిస్కంలపై రూ.18,725 కోట్ల అదనపు భారం పడింది. ► తెలంగాణ ఈఆర్సీ 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,550 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు డిస్కంలకు అనుమతిచ్చింది. అయితే ఈ సొమ్మును తామే చెల్లిస్తామని, వినియోగదారుల నుంచి వసూలు చేయవద్దని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ చెల్లించలేదు. మరో రూ.2,378 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీ(ఎఫ్ఎస్ఏ)లనూ చెల్లించాల్సి ఉంది. ► భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఏడేళ్లు చేశారు. ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది. బొగ్గుగనులకు దూరంగా నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టడంతో బొగ్గు రవాణా అనవసర భారంగా మారనుంది. విద్యుత్ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టులు తీవ్ర భారంగా మారనున్నాయి. -
కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో తుపాను కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ తుపాను ప్రభావం తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలపై ఉంటుందని చెప్పారు. మిగతా జిల్లాల్లోను ఒక మాదిరి వర్షాలు పడే అవకాశముందన్నారు. కావున అధికారులు అంతా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడాలని సీఎస్ చెప్పారు. కోతకోసి పనలపై ఉన్నవారి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో కూడా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. వివిధ నిత్యావసర సరుకులను జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని.. ఎక్కడైనా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే వెంటనే వాటిని తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆర్ అండ్ బీ, విద్యుత్, టెలికం తదితర శాఖలను ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, గోపాలకృష్ణ ద్వివేది, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత వాతావరణ శాఖ అమరావతి డైరెక్టర్ స్టెల్లా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ హైఅలర్ట్ మరోవైపు.. మిచాంగ్ తుపానుపై విద్యుత్ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను పీడిత ప్రాంతాల్లోని మండలాల్లో 11కేవీ స్తంభాలు, లైన్లు, డీటీఆర్లు దెబ్బతింటే వాటిని పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇక తుపాను సమయంలో లైన్మెన్ నుంచి చైర్మన్ వరకు ఎవరికీ సెలవులు ఉండవని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబుతో మిచాంగ్ తుపాను సంసిద్ధతపై శనివారం ఆయన సమీక్ష జరిపారు. -
కరెంటు మీటరులో ఏదైనా సమస్య ఉందా.. బహుశా మీక్కూడా ఇలా జరుగుతుందేమో..!?
సాక్షి, కరీంనగర్: విద్యుత్‌శాఖలో మీటర్ల దందా నడుస్తోంది. వినియోగదారులకు తెలియకుండానే మీటర్లను ఇతర ప్రాంతాలకు మార్చుతూ కనెక్షన్ ఇస్తూ లైన్మెన్లు మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఇది తెలిసిన ఉన్నతాధికారులు మామూలుగా తీసుకుంటూ మెమోలతో సరిపెడుతున్నారు. ఇటీవల టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఆఫీసు పరిధిలోని చిగురుమామిడి సెక్షన్‌న్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన కరీంనగర్ రూరల్ డీఈకి వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిగురుమామిడి నివాసి అయిన సీహెచ్.రమేశ్‌కు చెందిన సర్వీసు నంబరు 3560ను అతని అనుమతి లేకుండానే అదే గ్రామంలో వేరొకచోట అమర్చారు. పంక్చర్ దుకాణానికి చెందిన కేటగిరి–2 మీటర్‌ను వేరే దుకాణంలో వినియోగదారుడి ప్రమేయం లేకుండా అమర్చడం వివాదాస్పదంగా మారింది. ఇది గమనించిన వినియోగదారుడు తన మీటర్‌ను ఇతరులకు ఎలా అమర్చారని లైన్మెన్పై కరీంనగర్ రూరల్ డీఈకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన డీఈ సదరు లైన్మెన్కు మెమోజారీ చేశారు. లైన్మెన్ సదరు వినియోగదారుడి మీటర్‌ను యధాస్థానంలో అమర్చేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను అధికారులకు ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోవాలంటూ వినియోగదారుడి నుంచి సంతకం తీసుకుని, మీటర్‌ను మార్చకుండా రేపు..మాపు అంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ సర్వీసుపై బిల్లు బకాయి ఉందని, కేసు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి మీటర్ల దందా సర్కిల్ పరిధిలో అనేక చోట్ల కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. కరీంనగర్లో సైతం విద్యుత్ మీటర్లు ఒకచోట..ఇంటి నంబర్లు మరోచోట ఉన్నట్లు సమాచారం. కొంతమంది లైన్మెన్లు చేస్తున్న తప్పిదాలతో విద్యుత్ శాఖలోని సిబ్బందికి అపవాదు వస్తోందని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెమో జారీ చేశాం.. చిగురుమామిడికి చెందిన రమేశ్ బిల్లు కట్టకపోవడంతో లైన్మెన్ విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అయితే ఈ సర్వీసును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్ చేశాడని వినియోగదారుడు కరీంనగర్ రూరల్ డీఈకి ఫిర్యాదు చేశాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా సర్వీసు వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసినట్లు తేలింది. వినియోగదారుడి అనుమతి లేకుండా లైన్మెన్ సర్వీసును షిఫ్ట్ చేయడం తప్పుగా భావించి ఉన్నతాధికారుల సూచన మేరకు లైన్మెన్కు మెమో జారీ చేసి విచారణ చేపడుతున్నాం. అయినప్పటికీ లైన్మెన్, వినియోగదారుడు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. – ప్రకాశ్, ఏఈ, చిగురుమామిడి -
వాస్తవాలు కనలేరా.!
సాక్షి, అమరావతి: పసలేని కథనాలకు ఈనాడు కేరాఫ్‌గా మారింది. లేని వాటిని ఉన్నట్లుగా అవాస్తవాల అచ్చుతో పబ్బం గడుపుకుంటోంది. అలాంటి పనికిరాని కథనాల్లో ఒకటి ఈ విద్యుత్ కోతల కథనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఏ విధమైన విద్యుత్ కోతలు అమలులో లేవు. అయినా ప్రతి రోజూ 2 – 3 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈనాడు పదే పదే అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలు నవ్వుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ విద్యుత్ కోతలే లేవని మరో అబద్ధం చెబుతోంది. వేసవి కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రోజూ రూ.కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్‌ను కొని మరీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సరఫరా చేస్తుంటే, కరెంటు కొనలేరా? అంటూ కళ్లుండీ గుడ్డిరాతలు అచ్చేసింది. అసలు వాస్తవాలను ఇంధన శాఖ ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఆరోపణ: డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో కొనాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ లేని కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం: ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.3059.4 కోట్లు వెచ్చించి 3,633.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వంద శాతం కరెంటు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 నుంచి 45 శాతం ఏపీజెన్కో నుంచే సమకూరుతోంది. రోజూ దాదాపు 105 మిలియన్ యూనిట్లు జెన్కో అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ విద్యుత్ కోతలు విధించాలి్సన అవసరమే రావడంలేదు. ఆరోపణ: షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నారు. వాస్తవం: విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే భారీగా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ యూనిట్ పది రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సర్దుబాటు అవసరమే లేదు. ఈనాడు చెబుతున్న 0.24 మిలియన్ యూనిట్లు, 0.19 మిలియన్ యూనిట్లు అనేది కేవలం గ్రిడ్ ఫ్రీక్వెన్సీని నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్ సర్దుబాటు మాత్రమే. విద్యుత్ కొరతో లేక కోతో కాదు. ఆరోపణ: రాత్రి వేళ అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్‌ను నియంత్రించలేని పరిస్థితి. ఆ సమయంలో కోతలకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవం: వేసవి కారణంగా రాత్రి వేళ అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగి 11 కె.వి. పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. 33 కె.వి. లైన్లపై, సబ్స్టేషన్లపై కూడా అధిక లోడు ప్రభావం ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ సంస్థ (డిస్కం)లలో క్షేత్ర స్థాయిలో 33/11 కె.వి. సబ్‌స్టేషన్ పరిధిలో 24 గంటలు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధిక లోడు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల గాలివానల వల్ల కొన్ని చోట్ల స్వల్పకాలం ఏర్పడే విద్యుత్ అంతరాయాలను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉందని ఈనాడు కట్టు కథలు అల్లుతోంది. ఆరోపణ: ప్రకాశం జిల్లాలో 2, 3 గంటలు, విజయనగరం జిల్లాలో 2 నుంచి 4 సార్లు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవం: వేసవి ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం జరుగుతోంది. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఆ ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతే తప్ప విద్యుత్ కోతలు విధిస్తున్నారనేది అవాస్తవం. ఆరోపణ: లోడ్ అంచనా వేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. కానీ డిస్కంలు అలా చేయలేకపోయాయి. వాస్తవం: వేసవి కాలంలో రాత్రి వేళ ఏసీలు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. తద్వారా పెరిగే డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో లోడును అంచనా వేసి దానికి తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాడుకునేలా మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నాయి. -
విద్యుత్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
AP: స్మార్ట్ మీటర్లపై ఇంధన శాఖకు అభ్యంతరం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఇంధన శాఖకు అభ్యంతరం లేదని, నిజానికి తామే ముందుండి ఈ ప్రాజెక్టును నడిపిస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టంచేశారు. కొన్ని నెలల క్రితం ఆర్థిక శాఖ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని తాను డిస్కంలకు అంతర్గతంగా రాసిన లేఖలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని, ఆ లేఖలు పూర్తిగా చదివితే వాస్తవాలు బోధపడతాయని తెలిపారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ స్మార్ట్ మీటర్లు అమర్చాలని కేంద్రం నిర్ణయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు మొదలైందని చెప్పారు. రాష్ట్రంలో తొలి దశలో 18.57 లక్షల వ్యవసాయ, 27.54 లక్షల వ్యవసాయేతర (నెలకు 200 యూనిట్లుపైన విద్యుత్ వినియోగం ఉన్నవి) సర్వీసులకు ఈ మీటర్లు అమర్చనున్నట్లు తెలిపారు. వ్యవసాయేతర సర్వీసుల్లో 4.72 లక్షలు మాత్రమే గృహ సర్వీసులని, అవి కూడా అమృత్ నగరాలు, జిల్లా కేంద్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. రెండో విడతలో 13.54 లక్షల సర్వీసులకు అమర్చాలని అనుకుంటున్నప్పటికీ, వాటికి ఇంతవరకు టెండర్లు పిలవలేదన్నారు. తొలి దశ ఫలితాలను బట్టి మిగతా వారికి మీటర్లు అందిస్తామన్నారు. కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పుడల్లా విద్యుత్ మీటర్లను మారుస్తున్నామని, దానికి వినియోగదారుల నుంచి చార్జీలు తీసుకోవడం కూడా సర్వసాధారణంగా జరిగేదేనని తెలిపారు. కానీ ఇప్పుడే కొత్తగా స్మార్ట్ మీటర్ల భారం వినియోగదారుల మీద వేస్తున్నట్లు, మీటర్లతో బిల్లులు పెరుగుతాయంటూ అసత్య ప్రచారం చేయడం తగదని, ప్రజలపై ఆర్థిక భారం పడదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా వ్యవసాయ, గృహ విద్యుత్ సర్వీసులు కలిపి ఉన్న ఫీడర్లు, ఓవర్‌లోడ్ అయిన ట్రా న్స్‌ఫార్మర్లలో తొలి విడతగా 9 వేలను తొమ్మిది నెలల్లో మార్చి, ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. దీనివ్ల నష్టాలు తగ్గుతాయన్నారు. ఈ పనులకు, స్మార్ట్ మీటర్లకు కలిపి రూ.13,252 కోట్లు ఖర్చవుతుందని, అందులో మీటర్లకు 22 శాతం, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల పనులకు 60 శాతం.. మొత్తం రూ.5,484 కోట్లను కేంద్రం గ్రాంట్‌గా ఇస్తుందని వెల్లడించారు. పాడైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరు గుతున్నాయన్నారు. ఇకపై విద్యుత్ ప్రమాదాలు జరగకూడదని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు కేంద్రం రూపొందించిన బిడ్ డాక్యుమెంట్‌తోనే టెండర్లు కేంద్రం రూపొందించిన ‘స్టాండర్డ్ టెండర్ బిడ్ డాక్యుమెంట్’నే స్మార్ట్ మీటర్ల టెండర్లలో అనుసరిస్తున్నామని విజయానంద్ చెప్పారు. దానిలో ఒక్క అక్షరం మార్చేందుకు తమకు అధికారం లేదన్నారు. టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు కూడా పంపించాకే టెండర్లు పిలిచామన్నారు. ఏ ఒక్కరికో, ఏ ఒక్క సంస్థకో ప్రయోజనం చేకూర్చేలా టెండర్ నిబంధనలు మార్చడం అసాధ్యమని గుర్తించాలన్నారు. బహిరంగ పోటీ ద్వారా అన్ని అర్హతలు ఉన్న సంస్థకే టెండర్లు ఇస్తామని, ఎలాంటి అపోహలకూ తావు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీట్రాన్స్కో సీఎండీ బి. శ్రీధర్, జేఎండీలు ఐ. పృధ్వితేజ్, బి.మల్లారెడ్డి, సెంట్రల్ డిస్కం సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి పాల్గొన్నారు. -
అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని ఆదేశించారు. 2 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తక్షణమే గుర్తించాలన్నారు. సమగ్ర అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: (మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ) -
Andhra Pradesh: దేశీయ బొగ్గు.. తగ్గొద్దు
సాక్షి, అమరావతి: విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే బొగ్గు సమకూర్చుకునేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా సులియారీ, మహానది కోల్ బ్లాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని, వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జగనన్న కాలనీలు పూర్తయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంధన శాఖపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. ఇంధన శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీటర్లపై విస్తృత అవగాహన.. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేలా అత్యంత మెరుగైన వ్యవస్థను తేవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మీటర్ల ఏర్పాటు వల్ల్ల కలిగే ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలని సూచించారు. ‘మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంట్ అవసరమో తెలుస్తుంది. దీనివల్ల సరిపడా విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది. వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఆ డబ్బు అక్కడ నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుంది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు రైతులకు జవాబుదారీగా ఉంటాయి. మోటార్లు కాలిపోయినా, నాణ్యమైన కరెంట్ సరఫరా కాకపోయినా డిస్కంలను రైతులు ప్రశ్నించగలుగుతారు. ఈ వివరాలన్నింటిపైనా వారికి నిరంతరం అవగాహన కల్పించాలి’ అని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు ద్వారా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని, దీనివల్ల చాలా విద్యుత్ ఆదా అయిందనే వివరాలతో సమగ్ర లేఖ ద్వారా విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 16.63 లక్షల మంది రైతుల అంగీకారం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతులు అంగీకరించారని అధికారులు తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్ వాడుతున్న ఘటనలను దాదాపుగా అడ్డుకోగలుగుతున్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్ పాడైన 24 గంటల్లోపే కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని, గత 90 రోజుల్లో 99.5 శాతం ట్రాన్స్ఫార్మర్లను 24 గంటల్లోపే రీప్లేస్ చేశామని వివరించారు. అయితే ఇది నూటికి నూరుశాతం జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. సాంకేతికతతో ముందడుగు.. విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో ధరలు తదితర అంశాలపై స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ)లో డేటా అనలిటిక్స్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందన్నారు. కచ్చితమైన డిమాండ్‌ను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వినియోగిస్తున్నామని, దీనివల్ల గతంలో 4 నుంచి 5 శాతం ఉన్న మీన్ యావరేజ్ పర్సంటేజ్ ఎర్రర్ (ఎంఓపీఈ) 2 శాతానికి తగ్గిందని వెల్లడించారు. అందుబాటులోకి కొత్త యూనిట్లు.. పోలవరంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే టర్బైన్ మోడల్ టెస్ట్ ముగిసిందని, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. పవర్ హౌస్‌లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. అప్పర్ సీలేరులో 1,350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ పూర్తైందని, టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి వచ్చిందని, ఈ ప్రాజెక్టును ఈ నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ థర్మల్ పవర్ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ రెండు యూనిట్లను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు. పంప్డ్ స్టోరేజీతో రాష్ట్రానికిæ ప్రయోజనం.. పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి చాలా ప్రయోజనాలున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ప్రాజెక్టులకు భూములిచ్చిన వారికి, అసైన్డ్ భూములున్న వారికి కూడా ఏడాదికి ఎకరాకు రూ.30 వేల చొప్పున ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలం ఈ ప్రయోజనాలు అందుతాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున ఈ ధర పెరుగుతుంది. భూములిచ్చే రైతులకు గరిష్ట ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టాం’ అని సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి భారీ ప్రతిపాదనలు.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలు అందాయని, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులను నెలకొల్పనున్నట్లు రెన్యూ కంపెనీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం విశాఖపట్నం, కాకినాడ పోర్టులకు సమీపంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించారని తెలిపారు. ఎన్టీపీసీ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. విశాఖ జిల్లా పూడిమడక సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ ఇ– మెథనాల్, గ్రీన్ అమ్మోనియా, ఆఫ్ షోర్ విండ్ పవర్, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ కేంద్రాలపై రూ.95 వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన ప్రతిపాదనల గురించి అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు కె.సంతోషరావు, జె. పద్మా జనార్ధనరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
Andhra Pradesh: థ్యాంక్యూ సీఎం సార్..!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లలో అర్హత సాధించిన దాదాపు 7 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. దీంతో వీరంతా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ‘థ్యాంక్యూ సీఎం సార్’ నినాదంతో అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నిజానికి.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా వీరిని విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అవసరమైన శిక్షణనివ్వడంతో వీరు పట్టణాలు, గ్రామాల్లో అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక్కో అసిస్టెంట్ 1,500 కనెక్షన్ల బాధ్యత మరోవైపు.. రాష్ట్రంలో 1.91 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 1.52 కోట్ల గృహ విద్యుత్ వినియోగదారులున్నారు. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30–40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను పర్యవేక్షించవచ్చు. 5–10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగుచేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా అతని పరిజ్ఞానం మేరకు బాగుచేస్తాడు. వీలుకాని పక్షంలో అధికారులకు వెంటనే సమాచారం అందించి నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తాడు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు కూడా వీరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించారు. విద్యుత్ సరఫరా ఇబ్బందులకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ లేదా నేరుగాగానీ గ్రామ/వార్డు సచివాలయానికి ఫిర్యాదు వసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరించేలా వీరికి విధులు నిర్ధేశించారు. భారీగా తగ్గిన అంతరాయాలు సచివాలయాల వ్యవస్థ రాకతో విద్యుత్ సమస్యలు భారీగా తగ్గుతున్నాయి. గతంలో రెండు, మూడు ఊళ్లకు ఒక లైన్మెన్ ఉండేవారు. సమస్య వస్తే వారు దూరం నుంచి వచ్చి సరిచేయడానికి సమయం పట్టేది. కానీ, ఇప్పుడు అలా కాదు. ఊరిలోనే అందుబాటులో ఎనర్జీ అసిస్టెంట్ ఉంటున్నారు. ఫిర్యాదు రాగానే వాలిపోతున్నారు. 2019లో విద్యుత్ అంతరాయాలపై 6,98,189 ఫిర్యాదులొస్తే.. 2020లో వీటి సంఖ్య 4,36,837గా నమోదైంది. 2021లో అయితే సగానికిపైగా తగ్గిపోయాయి. కేవలం 2,02,496 అంతరాయాలు మాత్రమే వచ్చాయి. 2019తో పోలిస్తే 2021 నాటికి దాదాపు 4.95 లక్షలు, 2020తో పోల్చితే 2.34 లక్షల ఫిర్యాదులు తగ్గాయి. -
ప్రభుత్వ ఆఫీసులో బిన్ లాడెన్ ఫొటో కలకలం.. ఎక్కడో తెలుసా..?
ఒసామా బిన్ లాడెన్.. ఈ ఉగ్రవాది పేరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద దాడికి పాల్పడిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అధినేత లాడెన్. ఈ దాడి తర్వాత అతడిని హతమార్చడానికి అమెరికాకు పదేళ్లు పట్టింది. ఎంతో కష్టపడి అమెరికా దళాలు లాడెన్‌ను మట్టుబెట్టాయి. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయలంలో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టడం అంతేకాకుండా లాడెన్‌ను ప్రపంచ అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్‌గా అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. యూపీలోని దక్షిణాంచల్ విద్యుత్ విత్రాన్ నిగమ్ లిమిటెడ్ (DVVNL)లో సబ్-డివిజినల్ ఆఫీసర్ (SDO)గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్.. ఒసామా బిన్ లాడెన్ ఫొటోను తన ఆఫీసులో పెట్టుకుని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజినీర్ అంటూ ప్రశంసించాడు. ఆ ఫొటోలో ‘గౌరవనీయులైన ఒసామా బిన్ లాడెన్, ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజినీర్’ అంఊ రాసుకొచ్చాడు. ఇక, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి యూపీలోని ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు అధికారి రవీంద్రను సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేశారు. కానీ, రవీంద్ర ప్రకాశ్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. బిన్ లాడెన్ కాపీలు తన వద్ద ఇంకా చాలానే ఉన్నాయని తెలిపారు. Picture of Osama Bin Laden in the office of power department SDO in UP's Farrukhabad district. "World's best junior engineer" is the title bestowed to him. Sources claim the photo has now been removed after the matter surfaced in media. pic.twitter.com/atae0kQbGF — Piyush Rai (@Benarasiyaa) June 1, 2022 -
విద్యుత్ ఆంక్షలకు మినహాయింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి పరిశ్రమలకు అమలుచేస్తున్న ఆంక్షలపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూనే పలు పరిశ్రమలు, హెచ్‌టీ వినియోగదారులకు వాటి నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమలపై అదనపు చార్జీలు విధించడానికి అనుమతిస్తూ, తద్వారా విద్యుత్ డిమాండ్‌ను సమతుల్యం చేసి, కోతలు పెరగకుండా చర్యలు చేపట్టింది. ఈనెల 22 వరకూ ఆంక్షలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత ప్రభావం రాష్ట్రంపైనా పడిన విషయం తెలిసిందే. రోజుకు సగటున 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఇందులో కనీసం 40 మిలియన్ యూనిట్లు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కానీ, అక్కడ తీవ్రపోటీతో విద్యుత్ దొరకడంలేదు. ఈ నేపథ్యంలో.. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు నివారించడానికి పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. ఇక నిరంతరం విద్యుత్ వాడే పరిశ్రమలు తమ వినియోగంలో 50 శాతం తగ్గించుకుని, మిగతా సగంతో నడుపుకునే అవకాశం కల్పించారు. అంతేకాక.. పగటిపూట నడిచే ఇతర పరిశ్రమలు వారాంతపు సెలవుతో పాటు ఈనెల 22 వరకూ మరోరోజు విద్యుత్ వినియోగించడం కుదరదు. ఈనెల 8 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా ఇలా డిస్కంలు తాము తీసుకున్న నిర్ణయాన్ని, అందుకు దారితీసిన పరిస్థితులను ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకువెళ్లాయి. వాటిని పరిశీలించిన మండలి.. పవర్ హాలిడే, ఇతర నిబంధలను సమర్థిస్తూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 22 విభాగాలకు మాత్రం వీటి నుంచి మినహాయించాలని సూచించింది. అదే విధంగా.. ఈ నిబంధనలను పరిశ్రమలు ఖచ్చితంగా పాటించేలా చేసేందుకు డిస్కంలు చేపట్టిన చర్యలకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఇకపై పరిశ్రమలు పవర్ హాలిడే, ఇతర నిబంధనలను అతిక్రమించి విద్యుత్ వినియోగిస్తే వాటిపై డిమాండ్ చార్జీలు విధిస్తారు. అవి ప్రస్తుత ధరలకు రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పవర్ హాలిడే రోజు విద్యుత్ వాడితే ఒకటిన్నర రెట్లు ఎనర్జీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్యలవల్ల పరిశ్రమలు నిబంధనల మేరకే విద్యుత్ వినియోగిస్తాయి. దీనివల్ల సగటున రోజుకు పరిశ్రమల నుంచి ఆదా అవుతున్న 20 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గృహ, వ్యవసాయ అవసరాలకు మళ్లించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మినహాయింపు పొందిన పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులు.. ► ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ► ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ► ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ► వార్తాపత్రికల ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ► పోర్టులు, ఏఐఆర్, దూరదర్శన్ ► విమానాశ్రయాలు, విమానయాన సంబంధిత సేవలు ► డెయిరీలు, మిల్క్ చిల్లింగ్ ప్లాంట్లు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు ► ఐస్‌క్రీమ్ తయారీ పరిశ్రమలు ► కేంద్ర ప్రభుత్వ ఆర్ అండ్ డీ యూనిట్లు ► నీటిపారుదల నిర్మాణ ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా ► నావల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం ► చమురు అన్వేషణ సర్వీస్ కనెక్షన్లు, చమురు శుద్ధి కర్మాగారాలు ► రైల్వే ట్రాక్షన్, రైల్వే వర్క్‌షాప్‌లు, గూడ్స్ షెడ్లు, రైల్వేస్టేషన్లు ► ఆసుపత్రులు ► పోలీస్స్టేషన్లు, అగ్నిమాపక స్టేషన్లు ► రక్షణ సంస్థలు ► వీధి దీపాలు ► తాగునీటి సరఫరా పథకాలు ► నీటి పనులు, నీటి పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు ► మతపరమైన ప్రదేశాలు ► యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ► మెడికల్ ఆక్సిజన్ తయారీ కర్మాగారాలు -
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి బ్యూరో: ఎండలతో పాటే విద్యుత్ వాడకం కూడా పెరిగిపోతోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే మండుటెండలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికంగా (40 డిగ్రీలకు పైగా) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో ఒకింత తగ్గినట్లు అనిపించినా పది రోజులుగా మళ్లీ సెగలు మొదలయ్యాయి. సరఫరాకు మించి డిమాండ్ నెలకొనడంతో పవర్ ఎక్చేంజ్‌లో యూనిట్ రూ.8–20 వరకు వెచ్చించి అత్యవసరంగా అప్పటికప్పుడు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వానికి ఎంతో భారమైనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెచ్చిస్తోంది. గత సంవత్సరం కోవిడ్ ప్రభావం వల్ల డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో కాస్త చౌకగానే విద్యుత్ లభ్యమైంది. లభ్యత ఇదీ.. రాష్ట్రంలో ఏపీ హైడెల్ నుంచి 1,728 మెగావాట్లు, ఏపీ థర్మల్ నుంచి 5,010, జాయింట్ సెక్టార్ నుంచి 34, సెంట్రల్ సెక్టార్ నుంచి 2,403, ప్రైవేటు సెక్టార్ (గ్యాస్) నుంచి 1,492, ప్రైవేటు సెక్టార్ (విండ్) నుంచి 4,179, ప్రైవేటు సెక్టార్ (సోలార్) నుంచి 3,800, స్టేట్ పర్చేజెస్ ద్వారా 631, ఇతరుల ద్వారా 585 వెరసి 19,862 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. ఈ సంవత్సరం 11,991 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని, సగటున మార్చిలో రోజుకు గ్రిడ్ డిమాండ్ 228 మిలియన్ యూనిట్ల వినియోగం అవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. గత ఏడాది మార్చి 26న పవర్ గ్రిడ్ డిమాండ్ 219.334 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈ ఏడాది మార్చి 26న 228.428 మిలియన్ యూనిట్లు ఉంది. వృథా నివారించాలి.. సరఫరాకు మించి డిమాండ్ పెరుగుతున్నందున వినియోగదారులు విద్యుత్ వృథా నివారించాలి. అత్యవసరమైనవి మినహా ఇతర విద్యుత్ ఉపకరణాలను వాడవద్దు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు విద్యుత్ వాడకంలో నియంత్రణ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. –జె.పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ ఏప్రిల్ 15 తర్వాత ఊరట! విద్యుత్ డిమాండ్‌కు ఏప్రిల్ 15 తర్వాత కాస్త ఉపశమనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అప్పటికి వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రోజుకు సగటున వినియోగం 223 మిలియన్ యూనిట్లకు తగ్గవచ్చని పేర్కొంటున్నారు. అయితే వేసవి తీవ్రత పెరిగితే మళ్లీ డిమాండ్ అధికమయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదంటున్నారు. -
ఆ ‘వెలుగు’ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాలపై జరుగుతున్న యుద్ధంలో తొలి అడుగు వేసిన ఏపీ సంస్కరణలు.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ అమలయ్యే దిశగా సాగుతున్నాయి. తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులతో జరిపిన సమావేశంలో ఏపీ తర హా చర్యలను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని సూచించింది. దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండటంతో దానిపై కేంద్రం దృష్టి సారించింది. విద్యుదుత్పత్తి రంగంలో మార్పులకు శ్రీకారం చుడుతూ.. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గించి, సౌర, పవన విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీని కోసం లక్ష్యాలనూ నిర్దేశించుకుంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని భావిస్తోంది. 2070 నాటికి దేశంలో కాలుష్యం అనేది జీరో స్థాయికి తీసుకురావాలన్నది అంతిమ లక్ష్యం. ఈ మేరకు రాష్ట్రాల మద్దతును కోరుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలే ఈ ప్రయత్నం లో ఉత్సాహంగా భాగమవుతున్నాయి. వాటిలో మన రాష్ట్రం ముందుందని కేంద్రం ప్రశంసించింది. పర్యావరణ పరిరక్షణలో ఏపీ ముందడుగు.. రాష్ట్రం ప్రభుత్వం వ్యవసాయానికి సౌర విద్యుత్‌ను వినియోగించాలని నిర్ణయించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్(సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకుని వ్యవసాయానికి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సెకీతో ఒప్పందానికి కేబినె7ట్ ఆమోదం కూడా తెలిపింది. అంతేకాకుండా రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం ప్రత్యేక విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇదే ప్రక్రియను మిగిలిన రాష్ట్రాలూ అనుసరించాలని కేంద్రం చెబుతోంది. 2024 నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు పునరుత్పాదక విద్యుత్‌నే వినియోగించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. దీని కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంది. మరోవైపు గృహ నిర్మాణంలోనూ ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని కూడా కేంద్రం చెప్పింది. దీనినీ ఏపీ ఇప్పటికే అమలు చేస్తోంది. జగనన్న కాలనీల్లో ఇంధన సామర్థ్యం గల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ తరహా ఇళ్ల నిర్మాణం ద్వారా విద్యుత్‌ను పొదుపు చేయడంతో పాటు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చవచ్చు. -
AP: ‘జవాద్’ను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధం
సాక్షి, అమరావతి: జవాద్ తుపాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి విద్యుత్ శాఖ సన్నద్ధమైంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఐదు జిల్లాల్లో సముద్ర తీరం వెంబడి గల 43 మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందన్న సమాచారం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని 15,35,683 (ఎల్టీ, హెచ్‌టీ) సర్వీసులకు విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. చదవండి: Cyclone Jawad: దూసుకొస్తున్న ‘జవాద్’.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం తుపాను ప్రభావిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ సామాగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా 30 వైర్లెస్ సెట్లను ఇప్పటికే తెప్పించగా, మరో 20 సెట్లను ఏలూరు, రాజమహేంద్రవరం సర్కిల్స్ నుంచి అవసరాన్ని బట్టి తెచ్చుకునేందుకు సిద్ధం చేశారు. ప్రైవేటు క్రేన్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 42,189 డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటిలో ఏవైనా దెబ్బతింటే.. వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు సిద్ధం చేశారు. హాస్పటళ్లు, వాటర్ వర్క్స్, కలెక్టరేట్లు, రెవెన్యూ కార్యాలయాలకు ముందస్తుగా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు సిద్ధం శ్రీకాకుళం జిల్లాలో 1,300 మందితో 108 బృందాలు, విజయనగరం జిల్లాలో 708 మందితో 30 బృందాలు, విశాఖపట్నం జిల్లాలో 810 మందితో 72 బృందాలు, తూర్పు గోదావరి జిల్లాలో 765 మందితో 53 బృందాలు, పశి్చమ గోదావరి జిల్లాలో 400 మందితో 35 బృందాలను ఏపీఈపీడీసీఎల్ సిద్ధంగా ఉంచింది. కార్పొరేట్, సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో 24 గంటలూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ మొత్తం ఆపరేషన్స్ పర్యవేక్షణకు నోడల్ ఆఫీసరనూ నియమించింది. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని డిస్కం సీఎండీ సంతోషరావు విజ్ఞప్తి చేశారు. -
ఏపీ: భారీ వర్షాలతో విద్యుత్ శాఖ అప్రమత్తం
సాక్షి, తిరుపతి(చిత్తూరు): తుఫాను ప్రభావంతో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాథ రావు ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం ఉదయం సీఎండి హరనాథ రావు 5 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించినట్లు సీఎండీ తెలిపారు. చదవండి: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సీఎం జగన్ వర్షాల కారణంగా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించినట్లు తెలియజేశారు. టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సీఎండీ హరనాథ రావు మాట్లాడుతూ..తుఫాను కారణంగా ఎదురయ్యే విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబరు: 94408 17412, కడప: 94408 17440, కర్నూలు: 73826 14308, అనంతపురం: 94910 67446, నెల్లూరు జిల్లా పరిధిలోని వినియోగదారులు మొబైల్ నెంబరు: 9440817468లకు కాల్ చేసి విద్యుత్ ప్రమాదాలు, సమస్యలపై సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. చదవండి: Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ తుఫాను దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. వినియోగదారుల సమస్యలపై తక్షణం స్పందించేందుకు వీలుగా ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ఐదుగురు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు ఒదిగిపోవడం తదితర ప్రమాదాలు సంభవించినట్లు అయితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా డ్రిల్లింగ్ యంత్రాలు, సామాగ్రిని, వాకిటాకీలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బలమైన గాలి, వర్షం ఉన్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపోవడం జరిగినట్లయితే తక్షణమే కంట్రోల్ రూమ్ లకు గానీ, సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు గానీ లేదా టోల్ ఫ్రీ నెంబరు; 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. -
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం అయ్యింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చేసేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశామని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో 24 గంటలపాటు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటికప్పుడు ఇంజినీర్లు, సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరెంటు స్తంభాలు, వైర్లు తెగిపడిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియాజేయాలని ప్రభాకర్ రావు సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలనీలు, రహదారుల వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలను తాకవద్దని ఆయన తెలిపారు. నగరాలు, పట్టణాల్లో అపార్ట్మెంట్ సెల్లర్లలోకి నీరు చేరితే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని ప్రభాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. -
వామ్మో.. ఇంటి కరెంటు బిల్లు రూ.6.69 లక్షలు
మంచిర్యాల అగ్రికల్చర్: ఓ ఇంటి యజమాని ఏకంగా రూ.6.69 లక్షలు కరెంట్ బిల్లు చూసి బెంబేలెత్తిపోయాడు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్‌కు చెందిన ముప్పుడి రాజేందర్ ఇంటికి సోమవారం బిల్ రీడర్ వచ్చాడు. మీటర్ నంబరు 63118–55668 రీడింగ్ నమోదు చేయగా.. ఇందులో 42 రోజుల వ్యవధికి 70,188 యూనిట్లు వినియోగానికి గాను రూ.6,69,117 బిల్లు అందజేసి వెళ్లిపోయాడు. దీన్ని చూసి రాజేందర్ నిర్ఘాంతపోయాడు. గత నెల 5న రూ.2,528 బిల్లు చెల్లించాడు. ఎలాంటి పెండింగ్ బిల్లూ లేదు. ఈ విషయమై సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాస్ స్పందిస్తూ.. అధికంగా బిల్లు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, మీటర్ రీడింగ్‌ను మరోసారి పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు రుణంపై ఎలక్ట్రిక్ స్కూటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలపై ఎలక్ట్రిక్ స్కూటర్లను అదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్టీపీసీ/ఈఈఎస్ఎల్ వంటి సంస్థలతో కలిసి నెడ్‌క్యాప్ ఒక పథకాన్ని రూపొందించినట్లు ఇంధన శాఖ తెలిపింది. రుణాన్ని 24 నెలల నుంచి 60 నెలల్లో తీర్చే విధంగా వివిధ సంస్థలతో చర్చిస్తున్నామని, వాహన ధర బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. నెలవారీ చెల్లించే రుణం కిస్తీ (ఈఎంఐ) రూ.2,000 నుంచి రూ.2,500 ఉండేలా చూస్తున్నామంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 40 కి.మీ. నుంచి 100 కి.మీ. వరకు తిరేగా వివిధ బ్రాండ్ల వాహనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తొలి దశలో లక్ష వాహనాలను సరఫరా చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను కోరామని, ఇప్పటికే 10కి పైగా సంస్థలు ముందుకొచ్చినట్లు నెడ్‌క్యాప్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ఐచ్చికమన్నారు. ఈ మేరకు ఇంధన శాఖ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు ప్రతిపాదన చేరింది. ఆయన కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈవీ పార్కులు ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల తయారీ కోసం ప్లగ్ అండ్ ప్లే విధానంలో పనిచేసుకునే విధంగా సుమారు 1,000 ఎకరాల్లో ఈవీ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే వారికి మూలధన పెట్టుబడిలో 50 శాతం సబ్సిడీతో పాటు ఇతర ఆర్థికప్రోత్సాహకాలను అందించనున్నారు. రాష్ట్రంలో ఈవీ వాహనాలకు చార్జింగ్ కోసం వినియోగించే విద్యుత్ యూనిట్ ధరను రూ.6.70గా నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో 80 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, కొత్తగా మరో 73 ప్రాంతాల్లో 400 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఈ కార్ల వినియోగం పెంచడంపై దృష్టిసారించామని, వివిధ విభాగాలకు 300 కార్లను అందచేసినట్లు ఇంధన శాఖ వెల్లడించింది. -
గ్రామ సచివాలయాలకు వీధి దీపాల బాధ్యత
సాక్షి, అమరావతి: పల్లెల్లోని ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగించబోతున్నారు. ఈ నెల 31న అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సేవలను ‘జగనన్న పల్లె వెలుగు’ పేరుతో ప్రజల ముంగిటకే తెస్తున్న సర్కారు.. రాత్రి వేళ ప్రతీ వీధి దీపం వెలగాలన్న లక్ష్యంతోనే కీలక అడుగువేసిందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ. చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీధి దీపాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్వహణ లోపాలతో.. కేంద్ర ఇంధన పొదుపు సంస్థ అయిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) 10,382 గ్రామ పంచాయతీల్లో 23.29 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేసింది. ఈ పథకం కిందలేని 2,303 గ్రామ పంచాయతీల్లోనూ అదనంగా 4 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకూ వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఈఈఎస్ఎల్ నియమించిన కాంట్రాక్టు సంస్థ పరిధిలో ఉండేది. కానీ, దీనివల్ల అనేక సమస్యలొస్తున్నాయి. వెలగని, కాలిపోయిన వీధి దీపాలను మార్చడంలేదన్న విమర్శలొస్తున్నాయి. ఫలితంగా పల్లెల్లో కారుచీకట్లు నెలకొంటున్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. వీటిపై ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. గ్రామ సచివాలయాల్లో 7 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థకు వీధి దీపాల నిర్వహణ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 48 గంటల్లోనే రిపేర్ వీధి దీపాల నిర్వహణకు అధికారులు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వెలగని వీధి దీపంపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు వీధి దీపాల పోర్టల్ లింక్ అయి ఉంటుంది. వీటిద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎనర్జీ అసిస్టెంట్లు, గ్రామ వలంటీర్లు పరిశీలించి తక్షణమే స్పందిస్తారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో దానిని రిపేర్ చేయాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది. ఇక కాలిపోయిన, చెడిపోయిన లైట్లను మార్చుకునేలా ప్రతీ పంచాయతీ పరిధిలో కొన్ని లైట్లు అందుబాటులో ఉంచనున్నారు. -
ప్రతి ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు
సాక్షి, అమరావతి: ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్థ్యం గల నాలుగు ఎల్ఈడీ బల్బులను విద్యుత్ శాఖ ప్రతి ఇంటికి అందించనుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ‘గ్రామ ఉజాలా’ పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి చేపట్టే ఈ పథకాన్ని దేశంలో ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకానికి ఈఈఎస్ఎల్ రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► తొలి విడత వారణాసి (ఉత్తరప్రదేశ్), వాద్నగర్ (గుజరాత్), నాగపూర్ (మహారాష్ట్ర), ఆరా (బీహార్), కృష్ణా (ఆంధ్రప్రదేశ్) జిల్లాలను ఎంపిక చేశారు. ► ఇంధన పొదుపులో భాగంగా గతంలో 9 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు అందించారు. ఇప్పుడు 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు అందిస్తారు. సాధారణ బల్బుతో పోలిస్తే 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బుల వల్ల 75 శాతం కరెంట్ ఆదా అవుతుంది. 25 శాతం మన్నిక ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించే సామర్థ్యం ఈ బల్బుకు ఉంది. ►ఏపీలో తొలి దశలో కృష్ణా జిల్లాలోని గుణదల, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ టౌన్, రూరల్‌లో ప్రతి ఇంటికి 12 ఓల్టుల ఎల్ఈడీ బల్బులు నాలుగు ఇస్తారు. వీటిని తీసుకునే ముందు సాధారణ బల్బులను (40, 60, 100 వాల్టుల బల్బులు ఏదైనా) విద్యుత్ అధికారులకు అందజేయాలి. ఈ జిల్లాలో 8.83 లక్షల ఇళ్లకు ఇంటికి నాలుగు బల్బుల చొప్పున పంపిణీ చేయనున్నారు. ► గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బల్బులు తీసుకోవచ్చు. ఈఈఎస్ఎల్ నేతృత్వంలో స్థానిక విద్యుత్ అధికారుల సమన్వయంతో పంపిణీ జరుగుతుంది. ఇందుకోసం విద్యుత్ కనెక్షన్ల ఆధారంగా డేటా రూపొందిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. -
విద్యుత్ పంపిణీ సంస్థల పటిష్టానికి రోడ్‌మ్యాప్
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్ తయారు చేసినట్టు ఇంధనశాఖ ప్రకటించింది. నిధులు సమకూర్చుకోవడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే దీని ముఖ్యోద్దేశమని తెలిపింది. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి నేతృత్వంలో రూపొందించిన రోడ్‌మ్యాప్ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. నష్టాలకు బ్రేక్ ► సాంకేతిక నష్టాలను కనిష్టంగా 12 శాతానికి తగ్గించాలని ఇంధనశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019–20లో ఇవి 13. 36 శాతానికి తగ్గించటం ద్వారా చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు తెలిపారు. నిజానికి 2018–19లో 16.36 శాతంమేర సాంకేతిక నష్టాలు ఉన్నట్టు వివరించారు. ► 2024–25 నాటికి ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసర నివేదికకు, వాస్తవ ఖర్చుకు తేడా లేకుండా చూడాలని నిర్ణయించారు. ఈ గ్యాప్ 2019 లో యూనిట్ కు రూ.2.26 ఉండగా, 2020లో రూ.1.45కి తగ్గించారు. దీనివల్ల రూ 4,783 కోట్లు ఆదా చేయగలిగారు. ఫీడర్ల విభజన ► గృహ, వ్యవసాయ ఫీడర్ల విభజన ద్వారా విద్యుత్ సరఫరాలో మరింత నాణ్యత పెంచనున్నారు. వ్యవసాయ విద్యుత్ లోడ్ ను గ్రీన్ ఎనర్జీ కిందకు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సోలార్ విద్యుత్‌తో వ్యవసాయ ఫీడర్లను అనుసంధానం చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. ► మౌలిక సదుపాయాల పెంపులో భాగంగా డిస్కమ్‌లు ఇప్పటికే 77 నూతన సబ్ స్టేషన్లు, 19,502. 57 కిలోమీటర్ల పొడవైన 33 కే వీ, 11 కే వీ ఎల్టీ లైన్లను పూర్తి చేశాయి. దీనికోసం రూ.524.11 కోట్లు ఖర్చు చేశాయి. ► విద్యుత్ ప్రసార పంపిణీ వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంలో భాగంగా ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ సేవల నిర్వహణకు ప్రత్యేకంగా ఐటీ క్యాడర్ ను ఏర్పాటు చేయనున్నారు. సూపర్వైజరి కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్, డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టంను అన్ని స్థాయిల్లోనూ తీసుకురాబోతున్నారు. -
చర్చించాకే విద్యుత్ చట్టంలో మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రాలతో మరోదఫా సంప్రదించిన తర్వాతే విద్యుత్ చట్టంలో మార్పులు తెస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. రాష్ట్రాల నుంచి అందిన అభ్యంతరాలపై లోతుగా చర్చిస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి ఇందులో పాల్గొన్నారు. అభిప్రాయాలు స్వీకరించాం విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రైవేట్ పోటీ, నియంత్రణ మండలి చైర్మన్, సభ్యుల నియామకాన్ని కేంద్ర పరిధిలోకి తేవడం, విద్యుత్ సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకే అందించే పలు సంస్కరణలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనివల్ల రాష్ట్ర ప్రాధాన్యతలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఏపీతో పాటు పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులతో సుదీర్ఘంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చించారు. ఇప్పటికే ఫీడ్ బ్యాక్ అందిందని, అందరి ఆమోదం తీసుకున్నాకే ముందుకెళ్తామని చెప్పారు. ఫీడర్లవారీగా సోలార్ ప్లాంట్లు ఫీడర్ల వారీగా సోలార్ ప్లాంట్లు నెలకొల్పే రాష్ట్రాలకు వ్యయంలో 30 శాతం సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఏపీలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలను నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. డిస్కమ్‌లను బలోపేతం చేయాలి కోవిడ్–19 నేపథ్యంలో నష్టపోయిన రాష్ట్రాలకు ఆత్మ నిర్భర్ భారత్ కింద సాయం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ప్రాధాన్యతపై చర్చించారు. డిమాండ్‌కు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏడాదిలోనే బకాయిలన్నీ చెల్లించాం: మంత్రి బాలినేని డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలపై భారం పడకుండా, విద్యుత్ సంస్థలను అప్పుల నుంచి బయట పడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. పాత బకాయిలన్నీ ఏడాది వ్యవధిలోనే చెల్లించామని తెలిపారు. -
గృహ విద్యుత్తుకు రూ. 1,707 కోట్ల సబ్సిడీ
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.10,060.63 కోట్ల సబ్సిడీ ఇస్తుండగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగదారులకు అత్యధికంగా రూ.1,707.07 కోట్లు అందచేస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రతి యూనిట్‌కు రూ.1.46 చొప్పున ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ఇంధనశాఖ గణాంక విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. వెంటాడుతున్న గతం ► 2015లో విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.24,969. 09 కోట్లు కాగా 2019 మార్చి నాటికి ఇది రూ.48110. 79 కోట్లకు చేరింది. టీడీ పీ హయాంలో ఐదేళ్లలోనే వ్యయం రూ.23,141. 07 కోట్లు పెరిగింది. మార్కెట్లో చౌకగా విద్యు త్ లభిస్తున్నా అత్యధిక రేట్లతో ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లకే గత ప్రభుత్వం ఆసక్తి చూపడంతో వ్యయం రెట్టింపైంది. ► నిర్వహణ వ్యయం పెరిగిన కొద్దీ విద్యుత్ టారిఫ్ పెరుగుతుంది. గత ప్రభుత్వం నిర్వహణ వ్యయాన్ని నియంత్రణ మండలికి స్పష్టం చేయకుండా ఐదేళ్ల తర్వాత (2019 జనవరిలో) ట్రూ–ఆప్ పేరుతో రూ.19,604 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు కమిషన్ అనుమతి కోరింది. నిజానికి ఏటా వాస్తవ లెక్కలు కమిషన్‌కు వెల్లడిస్తే నిర్వహణ వ్యయం మరింత పెరిగి ఉండేది. ► ఈ భారమంతా ప్రజలపై పడకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు భారీగా సబ్సిడీ ఇచ్చింది. 2015లో ప్రతి యూనిట్‌కు కేవలం 59 పైసలు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా ప్రస్తుతం రూ.1.46 చొప్పున ఇవ్వడం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ► 2019లో విద్యుత్ ఉత్పత్తి ఖర్చు యూనిట్‌కు రూ.8.82 ఉండగా దుబారాను అరికట్టడంతో ఈ ఏడాది రూ.7.75కి తగ్గింది. దీంతో పాటు ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు రూ.1.46 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. ఆర్థిక క్రమశిక్షణతో.. ► వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విద్యుత్ శాఖ ఆర్థిక క్రమ శిక్షణ దిశగా అడుగులేస్తోంది. ప్రజల పై విద్యుత్ భారం పడకుండా తొలుత నిర్వహణ వ్యయాన్ని అదుపు లోకి తెచ్చింది. ఇందుకోసం చౌక విద్యుత్ కొనుగోళ్లనే ఎంపిక చేసుకుంది. ► 2019లో గత సర్కారు వైదొలగేనాటికి విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.48,110.79 కోట్లు ఉండగా దీన్ని ప్రస్తుతం రూ.43,327.56 కోట్లకు తగ్గించారు. అంటే దాదాపు 4,783.23 కోట్ల మేర అనవసర వృథాను అరికట్టారు. -
రాష్ట్రాలకే ‘పవర్’!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2020పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్ఈఆర్సీ) చైర్మన్, సభ్యుల ఎంపిక విషయంలో ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రాష్ట్రం తమదైన ఎంపిక కమిటీ ద్వారా రాష్ట్ర ఈఆర్సీ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసుకోవచ్చని, ఈ కమిటీలో ప్రస్తుతం ఉన్నట్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సమాన సంఖ్యలో ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఈఆర్సీలో ఖాళీలు ఏర్పడిన ప్రతిసారీ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసే బదులు స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఈ ఎంపిక కమిటీకి అధ్యక్షత వహిస్తుండగా ఇకపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహించాల్సి ఉంటుందని కొత్త నిబంధన విధించింది. రాష్ట్రాల ఈఆర్సీల్లో ఏర్పడుతున్న ఖాళీలను సకాలంలో భర్తీ చేసేందుకు ఎంపిక కమిటీల ఏర్పాటులో కొన్ని రాష్ట్రాలు జాప్యం చేస్తున్నాయని, దీంతో ఈఆర్సీల కార్యకలాపాలు స్తంభిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌లో ప్రకటించిన కేంద్ర విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై వివిధ రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ముసాయిదా బిల్లుపై పలు అపోహలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంటూ గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన ఏర్పాటు చేసే ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)తోపాటు రాష్ట్రాల ఈఆర్సీలను నియమించాలని, ఈ కమిటీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతోపాటు రొటేషన్ పద్ధతిలో ఏదో ఒక రాష్ట్ర అధికారి సభ్యులుగా ఉంటారని గతంలో ప్రకటించిన ముసాయిదా బిల్లులో కేంద్రం పేర్కొంది. దీనిపై రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో తాజాగా వెనక్కి తగ్గింది. నగదు బదిలీతో నష్టం లేదు.. ప్రస్తుత విద్యుత్ రాయితీల విధానానికి స్వస్తిచెప్పి నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రాయితీలు అందించాలన్న ప్రతిపాదనలు వినియోగదారులు, రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని వస్తున్న ఆరోపణలను కేంద్ర విద్యుత్ శాఖ తోసిపుచ్చింది. రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించని పక్షంలో వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపేస్తారన్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 65 ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా సబ్సిడీలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ప్రతి వినియోగదారుడి పేరుతో డిస్కంలు నిర్వహించే ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ రూపంలో ఇకపై రాయితీలను జమ చేయాల్సి ఉంటుందని మాత్రమే ప్రతిపాదించామని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రాయితీలు చెల్లించకపోయినా లేక మూడు నాలుగు నెలలపాటు చెల్లించడంలో విఫలమైనా వినియోగదారుల కనెక్షన్లను కట్ చేయొద్దని త్వరలో తీసుకురానున్న కొత్త విద్యుత్ టారిఫ్ పాలసీలో పొందుపరుస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తుగా డిస్కంలకు రాయితీలు చెల్లించాలని ఆశిస్తూనే ఈ ప్రతిపాదనలను తీసుకొచ్చామని, దీని ద్వారా డిస్కంలతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడింది. రాష్ట్రాల ఈఆర్సీకే టారిఫ్ ఖరారు అధికారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రిటైల్ విద్యుత్ చార్జీలు (టారిఫ్) ఖరారు చేస్తోందని, ఇకపై ఈ అధికారం కేంద్రం పరిధిలోకి వెళ్లనుందంటూ జరుగుతున్న మరో ప్రచారం సైతం అపోహ మాత్రమేనని కేంద్ర విద్యుత్ శాఖ వివరించింది. ప్రస్తుతం విద్యుత్ టారీఫ్‌ను రాష్ట్రాల ఈఆర్సీలే ఖరారు చేస్తున్నాయని, ఈ విషయంలో ఎలాంటి మార్పులను ప్రతిపాదించలేదని స్పష్టం చేసింది. చార్జీల పెంపును ఈఆర్సీలు అడ్డుకోరాదు... విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేసే వ్యయం రాబట్టే విధంగా విద్యుత్ టారిఫ్‌ను ఈఆర్సీలు ఖరారు చేయాల్సిందేనని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. చేసిన ఖర్చును వసూలు చేసుకొనేలా విద్యుత్ చార్జీలను పెంచుకోవడానికి డిస్కంలకు కొన్ని ఈఆర్సీలు అనుమతించట్లేదని, ఇలా దేశవ్యాప్తంగా రూ. 1.4 లక్షల కోట్లను వసూలు చేసుకోలేక డిస్కంలు నష్టపోయాయని పేర్కొంది. ఈ ధోరణికి తెరదించేందుకే ‘కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్’నిబంధనను విద్యుత్ బిల్లులో ప్రతిపాదించినట్టు వివరణ ఇచ్చింది. క్రాస్ సబ్సిడీని తగ్గించాల్సిందే.. ‘పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీ, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై క్రాస్ సబ్సిడీల పేరుతో విధించే అధిక చార్జీలు సగటు విద్యుత్ సరఫరా వ్యయంలో 20 శాతానికి మించకుండా ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం వరకు క్రాస్ సబ్సిడీని విధిస్తున్నారు. దీంతో క్రాస్ సబ్సిడీలను భరించలేక పరిశ్రమలు పోటీతత్వాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అన్ని వర్గాలవారితో సంప్రదింపులు జరిపాక క్రాస్ సబ్సిడీలను నియంత్రించేందుకు కొత్త విద్యుత్ టారీఫ్‌ను తీసుకొస్తాం’అని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. ఒప్పందం అమలు చేయకుంటే అరెస్టు... విద్యుత్ ఒప్పందాల అమలు పర్యవేక్షణకు ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీని కేంద్ర విద్యుత్ శాఖ సమర్థించుకుంది. సివిల్ కోర్టు తరహాలో తమ ఆదేశాలను అమలు చేయించే అధికారం కేంద్ర, రాష్ట్రాల ఈఆర్సీలకు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల మధ్య జరిగే విద్యుత్ క్రయవిక్రయాలు, సరఫరాకు సంబంధించిన ఒప్పందాల అమలును పర్యవేక్షించే క్రమంలో ఆస్తులను అటాచ్ చేయడం, విక్రయించడం, అరెస్టు చేయడం, జైలు శిక్షలు విధించడం వంటి అధికారాలు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ అథారిటీకి ఉంటాయని ప్రకటించింది. విద్యుత్ రంగంలో పెట్టుబడులను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. నాణ్యత కోసమే ప్రైవేటీకరణ... విద్యుత్ రంగం ప్రైవేటీకరణలో భాగంగా ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీ, డిస్ట్రిబ్యూషన్ ఫ్రాంచైజీ విధానాన్ని కూడా కేంద్ర విద్యుత్ శాఖ సమర్థించుకుంది. డిస్కంలు తమ పరిధిలోని కొంత ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసే అధికారాన్ని సబ్ లైసెన్సీల పేరుతో ఎవరైనా వ్యక్తికి ఈఆర్సీ అనుమతితో అప్పగించవచ్చని తెలియజేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఫ్రాంచైజీలను చాలా రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారని గుర్తుచేసింది. విద్యుత్ సరఫరాలో నాణ్యత కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. ఎల్డీసీలకు చెల్లింపుల పర్యవేక్షణ అధికారం సబబే.. విద్యుదుత్పత్తి, సరఫరా (జెన్కో, ట్రాన్స్‌కో) కంపెనీలకు డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు 2019 మార్చి నాటికి రూ. 2.26 కోట్లకు పెరిగాయని, ఈ నేపథ్యంలో విద్యుత్ షెడ్యూలింగ్‌కు ముందే ఒప్పందం ప్రకారం డిస్కంలు.. జెన్కో, ట్రాన్స్‌కోలకు చెల్లింపులు జరిపేలా పర్యవేక్షించే అధికారాన్ని లోడ్ డిస్పాచ్ సెంటర్ల (ఎల్డీసీ)కు కల్పించామని కేంద్ర విద్యుత్ శాఖ సమర్థించుకుంది. డిస్కంలు సకాలంలో చెల్లించడంలో విఫలమవుతుండటంతో జెన్కో, ట్రాన్స్‌కోలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, దేశ విద్యుత్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉండటంతోనే చెల్లింపులకు భద్రత కల్పించే అధికారాన్ని ఎల్డీసీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. -
మరో 1,600 మెగావాట్ల విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్కో మరో రెండు కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తిలోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దీనివల్ల మరో 1,600 మెగావాట్ల మేర అదనపు విద్యుదుత్పత్తి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక చేయూతతో ఈ ప్లాంట్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఏపీ జెన్కో 4,500 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తుండగా కొత్తవి అందుబాటులోకి వస్తే జెన్కో ఉత్పత్తి సామర్థ్యం 6,100 మెగావాట్లకు పెరుగుతుంది. భవిష్యత్తులో డిమాండ్ పెరిగినా సొంతంగా విద్యుత్ సరఫరా చేసే స్థాయికి జెన్కో ఎదిగింది. ఈ ప్రాజెక్టుల పురోగతిని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గురువారం ‘సాక్షి’కి వివరించారు. ► రాష్ట్ర అవసరాల కోసం ఇబ్రహీంపట్నంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం 8వ యూనిట్ (800 మెగావాట్లు), నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో రెండోదశ (800 మెగావాట్లు)ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇవి 2018లోనే పూర్తవ్వాల్సినా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో వ్యయం పెరిగింది. ► గత ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ సంస్థల ఆస్తులను కుదువపెట్టి అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జెన్కోకు స్థాయికి మించి అప్పులున్నాయి. ఫలితంగా కొత్తగా అప్పు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం పనులు మందగించాయి. ► ఈ రెండు ప్లాంట్లకు ఒక్కోదానికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకు రావడంతో ఆరు నెలల్లో రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్లాంట్ల వ్యయం ఇలా రూ.కోట్లలో -
‘థర్మల్’కు డిమాండ్
సాక్షి, అమరావతి: ఏపీ జెన్కో ముందస్తు వ్యూహం ఇప్పుడు మంచి ఫలితాన్నిస్తోంది. పవన, సౌర విద్యుదుత్పత్తి పడిపోయినప్పటికీ విద్యుత్ సరఫరాలో జెన్కో కీలకపాత్ర పోషిస్తోంది. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలతో అన్ని యూనిట్లనూ క్రమంగా ఉత్పత్తిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందించేందుకు జెన్కో సన్నద్ధమవుతోంది. ఏం జరుగుతోంది? ► గత మూడు రోజులుగా వాతావరణం మారడంతో పవన, సౌర విద్యుదుత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఇవి రెండూ కలిపి 7 వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తుండగా మూడు రోజులుగా క్రమంగా తగ్గుతోంది. మంగళవారం 1,900 మెగావాట్లకే పరిమితమైంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల సౌరశక్తి, గాలి లేకపోవడం వల్ల పవన విద్యుదుత్పత్తి పడిపోయింది. ► రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 9 వేల మెగావాట్ల నుంచి 7 వేలకు తగ్గింది. అయితే విండ్, సోలార్ పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను ముందే ఊహించిన లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏపీ జెన్కోను అప్రమత్తం చేసింది. ► కొంతకాలంగా నిలిపివేసిన కృష్ణపట్నం, వీటీపీఎస్, ఆర్టీపీపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను క్రమంగా ఉత్పత్తిలోకి తెచ్చారు. ప్రస్తుతం ఏపీ జెన్కో 4,500 మెగావాట్లకుగానూ 2 వేల మెగావాట్ల వరకు ఉత్పత్తిలోకి తెచ్చింది. ఇతర విద్యుత్ లభ్యత తగ్గితే తక్షణమే ఉత్పత్తి పెంచగల సమర్థత జెన్కోకు ఉందని అధికారులు తెలిపారు. బొగ్గు నిల్వలు పుష్కలం.. ► ఏపీ జెన్కో వద్ద ప్రస్తుతం 15 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. అన్ని థర్మల్ ప్లాంట్లకు కలిపి రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. దీన్నిబట్టి మూడు వారాలకు సరిపడా బొగ్గు అందుబాటులో ఉంది. రోజూ గనుల నుంచి బొగ్గు అందుతోంది. ► లాక్డౌన్ కాలంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వాడకం పూర్తిగా ఆగిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ లభించింది. ఈ సమయంలోనే జెన్కో అప్రమత్తమైంది. ఉత్పత్తిని నిలిపివేసి బొగ్గు నిల్వలు పెంచుకుంది. ప్లాంట్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టింది. ముందుచూపుతో వ్యవహరించడం ఇప్పుడు కలసి వస్తోంది. ► మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. క్రమంగా వ్యవసాయ విద్యుత్ వాడకం పెరిగే వీలుంది. అయినప్పటికీ ఎక్కడా చిన్న అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు జెన్కో ముందస్తు వ్యూహాలు ఉపకరిస్తున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. వర్షాకాలంలో బొగ్గు వెలికితీత, రవాణా కష్టమైనప్పటికీ నిరంతరాయంగా విద్యుదుత్పత్తికి జెన్కో సిద్ధమైందని పేర్కొంటున్నారు. -
‘పవర్’ఫుల్.. పొదుపు
సాక్షి, అమరావతి: విద్యుత్తును ఆదా చేస్తే పొదుపు చేసినట్లే... మరి వృథా ఖర్చులను నియంత్రిస్తే ప్రజలపై భారాన్ని కూడా నివారించినట్లే! విద్యుత్తుశాఖ ఇదే సూత్రాన్ని పాటించి ఏడాదిలో ప్రజలపై రూ.4,783.23 కోట్ల మేర భారం పడకుండా చేయగలిగింది. తద్వారా బిల్లుల భారాన్ని తప్పించింది. రాష్ట్ర విద్యుత్ రంగం స్వీయ నియంత్రణతో ఏడాదిలోనే అద్వితీయ పురోగతి సాధించింది. విద్యుత్తు సంస్థల నిర్వహణ వ్యయంలో కొనుగోళ్లే అత్యంత కీలకం. గత సర్కారు అవసరానికి మించి ఖరీదైన ప్రైవేట్ విద్యుత్‌ను తీసుకోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చౌక విద్యుత్‌ను అన్వేషించడంతోపాటు దుబారాకు ఏమాత్రం తావివ్వడం లేదు. ► 2018–19లో రాష్ట్ర విద్యుత్ సంస్థల మొత్తం వ్యయం రూ.48,110.79 కోట్లు కాగా 2019–20లో దీన్ని రూ.43,327.56 కోట్లకు తగ్గించడం ద్వారా ప్రభుత్వం రూ.4,783.23 కోట్లను ఆదా చేసింది. గత సర్కారు చేసిన అప్పులకు ఈ ఏడాది కాలంలో అత్యధిక వడ్డీలు కట్టాల్సి వచ్చింది. లేదంటే ఆదా మరింత ఎక్కువగా ఉండేది. ► గత సర్కార్ అడ్డగోలుగా ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నియంత్రించింది. 2018–19లో రూ.39,262.81 కోట్లున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 2019–20లో రూ. 34,775.46 కోట్లకు కుదించారు. 2018–19లో వాస్తవానికి 7,629 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంది. కానీ గత సర్కార్ ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేందుకు 6,952 మిలియన్ యూనిట్లు అనవసరంగా కొనుగోలు చేసింది. ► టీడీపీ హయాంలో సౌర విద్యుత్ మార్కెట్లో యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా యూనిట్ రూ. 8.09 చొప్పున కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఫలితంగా 2019 డిసెంబర్ 31 నాటికి డిస్కమ్‌లకు రూ. 29 వేల కోట్ల మేర నష్టాలు వచ్చాయి. పవన విద్యుత్‌లోనూ ఇదే తంతు. ► గతంలో సగటున యూనిట్ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయగా ఈ ఏడాది యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80కి మించనివ్వలేదు. దీనివల్ల రూ.700 కోట్లు ఆదా అయ్యాయి. అండగా ప్రభుత్వం ► ప్రజాధనాన్ని ఆదా చేసిన విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20లో రూ. 17,904 కోట్లు అందించింది. 2019 డిసెంబర్ 31 వరకూ డిస్కమ్‌లకు ఉన్న రూ.13,391 కోట్ల సబ్సిడీలో రూ.8,655 కోట్లు విడుదల చేసింది. 2019–20లో మరో రూ.9,249 కోట్లు విడుదల చేసింది. ► గత సర్కారు ఉత్పత్తిదారులకు బకాయిపడిన రూ.34,384 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 2019–20లో బిల్లుల చెల్లింపు కోసం రూ. 20,384 కోట్లు విడుదల చేసింది. ► మెట్రిక్ టన్ను బొగ్గు గతంలో రూ.1,824 ఉండగా ఏపీ జెన్కోలో బొగ్గు రవాణాకు రివర్స్ టెండరింగ్ చేపట్టడం వల్ల ఇప్పుడు రూ.1,027కే అందుతోంది. కృష్ణపట్నంలో రూ.1,010కే వస్తోంది. విద్యుత్ రంగం పునరుజ్జీవం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం వల్ల ఏడాది కాలంగా విద్యుత్ రంగం పునరుజ్జీవం దిశగా పయనిస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఈమేరకు ప్రభుత్వానికి అందించనున్న నివేదికను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. విద్యుత్ కొనుగోళ్లలో అనవసర వ్యయాన్ని అరికట్టామని, చౌక విద్యుత్‌తో ప్రజలపై భారం పడకుండా నియంత్రించామని వివరించారు. ► రాష్ట్ర విద్యుత్ రంగం స్వీయ నియంత్రణతో ఏడాదిలోనే అద్వితీయ పురోగతి సాధించింది. ► గత సర్కారు అవసరానికి మించి ఖరీదైన ప్రైవేట్ విద్యుత్‌ను తీసుకోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లో కూరుకుపోయాయి. ► ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దుబారాకు ఏమాత్రం తావివ్వడం లేదు. దీంతో ఈ ఏడాదిలో ప్రజలపై రూ.4,783.23 కోట్ల మేర భారం పడకుండా చేయగలిగింది. తద్వారా బిల్లుల భారాన్ని తప్పించింది. ► గతంలో యూనిట్ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80కి మించనివ్వలేదు. ► దీని వల్ల దాదాపు రూ.700 కోట్లు ఆదా అయ్యాయి. -
చౌక విద్యుత్ వల్ల రూ.700 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో స్వీయ నియంత్రణ పాటించడం వల్ల ఏడాది కాలంలోనే డిస్కమ్‌లు రూ.700 కోట్లు ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇదో రికార్డుగా పేర్కొంది. ఏడాది కాలంలో సాధించిన పురోగతిని వివరిస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సబ్సిడీ బకాయిలు చెల్లింపుతో. ► గత ప్రభుత్వ హయాంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,391 కోట్లు ఉన్నాయి. ► వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక 2019–20లో రూ.8,655 కోట్లను డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించింది. ► విద్యుత్ సబ్సిడీ కింద మరో రూ.9,249 కోట్లను (మొత్తం రూ.17,904 కోట్లు) చెల్లించింది. ► విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం 2019–20లో రూ.20,384 కోట్లు విడుదల చేసింది. డిస్కమ్‌లు మరో రూ.14 వేల కోట్లను ఉత్పత్తిదారులకు చెల్లించాయి. రైతులకు ఉచిత విద్యుత్ ► రాష్ట్రంలోని 18.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు వచ్చే రబీ సీజన్ ప్రారంభం నాటికల్లా పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలని విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ► ఇప్పటికే 81 శాతం ఫీడర్ల పరిధిలో ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. మిగిలిన ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఆధునికీకరణ నిమిత్తం ప్రభుత్వం రూ.1,700 కోట్లు విడుదల చేసింది. ► విద్యుత్ సంస్థల పురోగతిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. వ్యవసాయానికి పగటి పూటే ఉచిత విద్యుత్ సరఫరా చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయం విప్లవాత్మకమైందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.8,353.58 కోట్లు కేటాయించిందన్నారు. -
వినియోగం మేరకే బిల్లు
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్, మే నెల విద్యుత్ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరిగిందని ఇంధనశాఖ సోమవారం వెల్లడించింది. సామాన్య, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వినియోగదారుల టారిఫ్ పెరిగిందనే ప్రచారంలో నిజం లేదని వివరించింది. కరోనా కారణంగా లాక్డౌన్ అమలు కావడం వల్ల ఏప్రిల్ నెలలో మీటర్ రీడింగ్ తీయలేదు. మార్చి నెలలో వచ్చిన బిల్లునే ఏప్రిల్‌లోనూ చెల్లించాలని అధికారులు ఆదేశించారు. తర్వాత మే నెలలో రీడిండ్ తీసినప్పటికీ మార్చి, ఏప్రిల్, మే నెలలో రోజులను విడివిడిగానే లెక్కించారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ రేట్లు పెరిగాయన్న వదంతులు వ్యాపించాయి. క్షేత్రస్థాయి వివరాలు సేకరించిన విద్యుత్ శాఖ ఇవన్నీ అపోహలేనని గణాంకాలతో పేర్కొంది. పెరిగిన వినియోగం మేరకే బిల్లులు వచ్చాయని రుజువు చేసే ప్రయత్నం చేసింది. -
బీజేపీని దింపితేనే.. విద్యుత్ శాఖ వివాదాస్పద ప్రకటన
భోపాల్ : మధ్యప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ శాఖ వివాదాస్పద మెసేజ్‌లతో వినియోగదారులు విస్తుపోతున్నారు. తనకు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తికి మీకు కరెంట్ బిల్లు తక్కువ (రూ. 100) రావాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి అనే సలహా ఎదురవడంతో సదరు ఫిర్యాదుదారు కంగుతిన్నారు. అగర్ మాల్వా జిల్లాకు చెందిన హరీష్ జాదవ్‌కు విద్యుత్ శాఖ నుంచి రూ 30,000కు పైగా బిల్లు రావడంతో మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ వెబ్సైట్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఐడీ వచ్చింది. మరుసటి రోజు తన దరఖాస్తు పరిస్థితిని ఆరా తీసేందుకు వెబ్సైట్లోకి వెళ్లగా ఫిర్యాదు వద్ద క్లోజ్డ్ అని రాసి ఉంది. ఇక క్లోజింగ్ రిమార్స్ వద్ద విద్యుత్ శాఖ వ్యాఖ్యలు చూస్తే మరింత దిగ్భ్రాంతికి గురిచేశాయి. మీకు బిల్లు తక్కువ రావాలంటే బీజేపీని గద్దెదింపి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురండని అక్కడ రాసివుండటంతో ఫిర్యాదుదారు విస్తుపోయారు. చదవండి : కొత్త జంటకు షాక్: వధువుకు కరోనా -
భగ భగలే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. శుక్రవారం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో వడగాడ్పులు హడలెత్తించాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం అల్లాడారు. రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, బాపట్ల, జంగమహేశ్వరపురంలలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉంపన్ పెను తుపాను కారణంగా.. గాలిలోని తేమంతా తుడిచిపెట్టుకుపోవడం వల్లే రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రానున్న రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఉంపన్ పూర్తిగా బలహీనపడింది. ఉత్తర బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. కాగా, విపరీతమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై విశాఖ జిల్లాలో శుక్రవారం ఒకరు మరణించారు. జిల్లాలోని బుచ్చెయ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన గరికి గాటీలు(60) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు. పవర్..హీట్! రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తాజా పరిస్థితిని శుక్రవారం సమీక్షించిన ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలపై కార్యాచరణ రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండు వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశించారు. ఉష్ణోగ్రతల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ► రాష్ట్రంలో చాలా చోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ట్రాన్స్ ఫార్మర్లను చల్లబరచే ఆయిల్‌ను తరచూ పరిశీలించాలి. కాలిపోయినా, వేడితో మొరాయించినా తక్షణమే మార్చాలి. ► ఉష్ణోగ్రతల పెరుగుదలతో విద్యుత్ తీగలు సాగుతుంటాయి. గాలి దుమారం సమయంలో తీగలు రాసుకుని ప్రమాదం సంభవించే వీలుంది. ఇలాంటి వాటిని గుర్తించి తక్షణమే జాగ్రత్తలు తీసుకోవాలి. ► లోడ్ పెరగడం వల్ల గ్రిడ్‌లో సమస్యలు తలెత్తకుండా లోడ్ డిస్పాచ్ సెంటర్ అప్రమత్తంగా ఉండాలి. ► పీక్ అవర్స్‌లో విద్యుత్తు వాడకం అత్యధికంగా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 9 వేల మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఏసీలు, కూలర్ల వినియోగమే దీనికి ప్రధాన కారణమని విద్యుత్ సిబ్బంది తెలిపారు. ► విద్యుత్ డిమాండ్ గత రెండు రోజులుగా వేగంగా పెరుగుతోంది. శుక్రవారం 187 మిలియన్ యూనిట్లు నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే ఇది 13 మిలియన్ యూనిట్లు ఎక్కువ. ఉత్పత్తి సంస్థలు, డిస్కమ్‌లు, ఎస్ఎల్డీసీల మధ్య సమన్వయం పెరగాలి. ► ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగమే పెరుగుతోంది. ఈ నెలాఖరులోగా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం పెరిగితే విద్యుత్ డిమాండ్ రోజుకు 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉంది. ► మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కుదరని పక్షంలో ధర్మల్ విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. జెన్కో ప్లాంట్ల వద్ద 15 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. వేసవిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెన్కో అధికారులు తెలిపారు. -
విద్యుత్ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం
సాక్షి, అమరావతి: విద్యుత్ బిల్లులపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రతీ వినియోగదారుడికీ సవివరంగా లేఖ రాయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. 1.45 కోట్ల విద్యుత్ వినియోగదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాసే బాధ్యతను విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలకు అప్పగించింది. మరోవైపు అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ బిల్లులను సగటు (ర్యాండమ్)గా పరిశీలన చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిస్కమ్‌ల సీఎండీలు, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వివరాలను ఇంధనశాఖ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► వినియోగదారుల్లో ఉన్న అపోహలను దూరం చేయడానికి బిల్లులను పారదర్శకంగా వారి సమక్షంలోనే తనిఖీ చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో బిల్లులు ఏ విధంగా తీశామో... వినియోగదారులకు భారం ఏ విధంగా తగ్గించామో వివరించాలి. ఇంకా అనుమానాలుంటే అధికారులు వారికి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. ► డిస్కమ్‌లు తమ వెబ్సైట్లో 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత రెండేళ్ల విద్యుత్ వినియోగ వివరాలు అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు తమ కస్టమర్ ఐ.డీ నంబరు ఫీడ్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునేలా విస్తృత ఏర్పాట్లు చేయాలి. ► 60 రోజులకు మీటర్ రీడింగ్ తీసినా.. ఏ నెలకు ఆ నెల విద్యుత్ వినియోగం మేరకే కరెంటు బిల్లు అందిస్తాం. ఎంత వాడితే అంతే కరెంటు బిల్లు వస్తుంది. శాస్త్రీయ పద్ధతిలోనే బిల్లులు రెండు నెలల వినియోగాన్ని విభజించి మార్చి నెల వినియోగానికి 2019–20 టారిఫ్ కేటగిరీ వర్తింప చేశామని, అలాగే ఏప్రిల్ వినియోగానికి 2020–21 నూతన టారిఫ్ ప్రకారం బిల్లులు జారీ చేశామని శ్రీకాంత్ స్పష్టం చేశారు. దీని వల్ల ఏప్రిల్‌లో విద్యుత్ బిల్లు కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మే నెలకు కూడా విడిగానే బిల్లులు తయారుచేస్తామని వివరించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. మే విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువును జూన్ 30 వరకు పెంచినట్టు తెలిపారు. విద్యుత్ బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీన్ని 45 రోజుల పాటు పొడిగించారు. అప్పటిదాకా ఎలాంటి అపరాధ రుసుములు ఉండవన్నారు. -
కష్టకాలంలో ‘పవర్’ రికార్డ్
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో ఏపీ విద్యుత్ సంస్థలు మరో రికార్డు సృష్టించాయి. ఏప్రిల్‌లో బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ కొనుగోలు చేసి రూ.132 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాయి. నిర్ధేశిత లక్ష్యం సాధించిన ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి అభినందించారు. విద్యుత్ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం... ► లాక్డౌన్ ప్రకటించిన వెంటనే చౌక విద్యుత్ కొనుగోళ్లపై ఇంధన శాఖ దృష్టి పెట్టింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగం తగ్గిన నేపథ్యంలో విద్యుత్ కొనుగోలులో కొంతైనా ఆదా చేయాలని భావించగా.. దీనికోసం ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు నేతృత్వంలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ► మార్కెట్ పరిస్థితుల్ని అంచనా వేస్తూ అధికారులు పీపీఏలున్న విద్యుత్, మార్కెట్లో లభించే విద్యుత్ ధరలను పోల్చుకుంటూ.. ఏది తక్కువగా ఉంటే దాన్నే కొనుగోలు చేశారు. ► ఏప్రిల్‌లో 824.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. ముందెన్నడూ లేనివిధంగా యూనిట్‌కు రూ.2.16 నుంచి రూ.2.66 మాత్రమే చెల్లించారు. ఏపీ ఈఆర్సీ అనుమతించిన ధర కంటే రూ.1.60 (యూనిట్‌కు) తక్కువకే కొన్నారు. దీనివల్ల ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.132 కోట్లు ఆదా చేయగలిగారు. ► చౌక విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు. దీంతో థర్మల్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి. నేడు సీఎం సమీక్ష సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విద్యుత్ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం చేపడుతున్న 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఈ సమీక్షలో చర్చించే వీలుంది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉందని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులు తగ్గిపోవడం.. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ పడిపోవడం తదితర పరిణామాలపై సీఎం ఆరా తీసే వీలుంది. ఇదే కృషి కొనసాగాలి కష్టకాలంలో రూ.132 కోట్ల ప్రజాధనం ఆదా చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడానికి ఇదే రకమైన కృషి జరగాలి. – బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
కరెంట్ పోతే కాల్ చేయండి
సాక్షి, అమరావతి: విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బంది వెళ్లి పరిష్కరిస్తున్నారని రాష్ట్ర ఇంధన శాఖ తెలిపింది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో విద్యుత్ శాఖకు సంబంధించి అందుతున్న ఫిర్యాదులపై ఆయన సమీక్ష జరిపారు. వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కేంద్రీకృత కాల్ సెంటర్లు ► విద్యుత్ అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కేంద్రీకృత కాల్ సెంటర్ ఏర్పాటు. ఎక్కడైనా సమస్య తలెత్తితే 1912 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. ► స్థానికంగా కేటాయించిన నంబర్లను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. సమస్య తలెత్తినప్పుడు ఎన్ని గంటల్లో పరిష్కరించారనే విషయం నమోదవుతుంది. ► ప్రజలు ఫోన్, విద్యుత్ శాఖ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ప్రత్యేక ఏర్పాట్లు ► ఈదురు గాలులు, వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో అదనంగా పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం. ► కోవిడ్ క్వారంటైన్ సెంటర్లు, ఆస్పత్రుల వద్ద ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎక్కడా విద్యుత్ అంతరాయం ఏర్పాట్లు. ► గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యుత్ శాఖ అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఊరట
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కాలంలో మూతపడిన పరిశ్రమలు, తెరుచుకోని వాణిజ్య సంస్థలకు విద్యుత్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వాస్తవ వినియోగానికి సంబంధించి మీటర్ రీడింగ్ తీసే వరకు పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు ఉన్నతాధికారులు బుధవారం సంకేతాలు పంపించారు. వాస్తవ రీడింగ్ తీసే వరకూ.. ► లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలు చాలా వరకూ మూతపడ్డాయి. వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, హోటళ్లు వంటివి కూడా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ► లాక్డౌన్ కారణంగా రీడింగ్ తీసే సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫిబ్రవరిలో వినియోగించిన యూనిట్ల ఆధారంగా మార్చి నెలకు ఇచ్చిన బిల్లులనే చెల్లించాలని వినియోగదారులకు మెసేజ్‌లు వెళ్లాయి. ► మార్చి నెలలో కొన్ని రోజులు విద్యుత్ వినియోగించ లేదని, అయినా బిల్లులు ఎలా చెల్లిస్తామని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు అభ్యంతరం లేవనెత్తాయి. ► దీనిపై స్పందించిన ఇంధన శాఖ వాటికి బిల్లులు ఇచ్చినా వాస్తవ రీడింగ్ తీసే వరకూ చెల్లింపుల కోసం ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశాలిచ్చింది. ► ఈ నిర్ణయం వల్ల పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు రూ.వెయ్యి కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ► ఏప్రిల్‌లో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి ఇదే తరహా మినహాయింపు ఉంటుందని అధికారులు అంటున్నారు. వసూళ్లు నిలిపేశాం విద్యుత్ వాడనప్పుడు బిల్లులు వసూలు చేయడం సరికాదని ఇంధన శాఖ భావించింది. ఈ దృష్ట్యా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు జారీ అయిన బిల్లుల వసూలుకు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని కచ్చితమైన ఆదేశాలిచ్చాం. తదుపరి ఉత్తర్వులు అందే వరకూ డిస్కమ్‌లు ఈ ఆదేశాల్ని పాటిస్తాయి. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి రాష్ట్ర ప్రజల కు విజ్ఞప్తి చేశారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని 45శాతం వినియోగదారులు ఇప్పటికే ఆన్లైన్లో ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నారని, గత మార్చిలో 55 శాతం వినియోగదారులు ఆన్లైన్లోనే చెల్లించారన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువు పొడిగించి మూతపడిన పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలకు ఉపశమనం కల్పించే అంశంపై విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకోలేవని, కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులు జారీ చేస్తే కరోనా వ్యాప్తికి అవకాశాలుంటాయని, ప్రత్యామ్నాయంగా ఈఆర్సీ అనుమతితో తాత్కాలిక బిల్లులను ప్రస్తుత ఏప్రిల్ లో వినియోగదారులకు ఎస్ఎంఎస్ల రూపంలో జారీ చేశామని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో జారీ చేసిన బిల్లులకు సమానంగా ఈ ఏప్రిల్‌లో బిల్లులు జారీ చేశామన్నారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రెండు నెలల కాలానికి మీటర్ రీడింగ్ తీసి ఏప్రిల్, మే నెలలకు చెరి సగం చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్‌లో వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులు సర్దుబాటు చేస్తామన్నారు. -
ఆదాయం లేని వేళ ఆదా
సాక్షి, అమరావతి: సంక్షోభంలోనూ ప్రజాధనం ఆదా చేయడంపైనే దృష్టి పెట్టినట్లు విద్యుత్ శాఖ తెలిపింది. మార్చి నెలలో మార్కెట్లో చౌక ధరకు లభించే విద్యుత్ కొనుగోలు చేసి రూ.56 కోట్లు మిగిల్చినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చి నెలలో సంస్థ పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. ► దేశవ్యాప్తంగా విద్యుత్ ధరలు తగ్గడాన్ని గుర్తించిన అధికారులు మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌నే తీసుకున్నారు. ► మార్చి నెలలో మొత్తం 357.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొన్నారు. యూనిట్‌కు గరిష్టంగా రూ.2.64 వరకూ చెల్లించారు. ► విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన కొనుగోలు ధర కన్నా ఇది యూనిట్‌కు రూ.1.57 తక్కువ. కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్‌పై రూ.56 కోట్లు ఆదా అయింది. ప్రతికూలతల్ని అధిగమించి.. ► లాక్డౌన్ ప్రకటించిన వెంటనే ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి అప్రమత్తమయ్యారు. ► సమన్వయం, వాణిజ్య, సాంకేతిక విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబుకు అప్పగించి, అనుభవజ్ఞులతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. ► గ్రిడ్ నిర్వహణ, రాష్ట్రంలో డిమాండ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు, మార్కెట్లో విద్యుత్ లభ్యత, ఎంత చౌకగా ఏ సమయంలో దాన్ని తేవచ్చనే నిరంత విశ్లేషణలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలొచ్చాయి. ► మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి. ► ప్రస్తుతం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి లాక్ డౌన్ సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకుని విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు ఏపీ ట్రాన్స్‌కో చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ప్రజాధనాన్ని ఆదా చేయటంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది సరైన రుజువు. అధికారులు ఇదే స్పూర్తితో ముందుకెళ్లాలి. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ మంత్రి -
కరెంటుపై కరోనా ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగంపైనా కరోనా ప్రభావం పడింది. గృహ విద్యుత్ వినియోగంలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. శీతల ప్రాంతాల్లో ఉంటే వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం నేపథ్యంలో ఏసీల వాడకం చాలా వరకూ తగ్గించారు. గ్రామీణ ప్రజలైతే మిట్ట మధ్యాహ్నం తప్ప మిగిలిన సమయాల్లో ఇంటి ఆవరణలో చెట్ల కిందే ఉంటున్నారని అనంతపురం జిల్లా ఎలక్ట్రికల్ ఏఈ చక్రధర్ తెలిపారు. అక్కడక్కడా ఫ్రిజ్‌లు కూడా ఆపేశారు. చల్లటి పదార్థాలు, కూలింగ్ వాటర్‌కు సైతం దూరంగా ఉంటున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ నాటి నుంచీ.. ► రాష్ట్రంలో విద్యుత్ వినియోగం సాధారణంగా రోజుకు 170 మిలియన్ యూనిట్లు కాగా.. ఏప్రిల్, మే నెలల్లో గరిష్టంగా 210 మిలియన్ యూనిట్లు దాటుతుందని అంచనా. ► కానీ.. ప్రస్తుతం రోజుకు సగటున 160 మిలియన్ యూనిట్లు దాటడం లేదు. గృహ వినియోగం 20 శాతం పైగా తగ్గింది. ► రాష్ట్రంలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో 92.24 లక్షల మంది గృహ వినియోగదారులే. ► గృహ విద్యుత్ వినియోగం రోజుకు 58 మిలియన్ యూనిట్లు ఉంటుంది. ఇందులో చాలా ఇళ్లల్లో నెలవారీ విద్యుత్ వినియోగం 100 యూనిట్ల లోపే. ► నెలకు 225 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు 43.56 లక్షల వరకు ఉండగా.. కుటీర పరిశ్రమలు సైతం ఇందులోనే ఉన్నాయి. ► కుటీర పరిశ్రమలు కూడా నడవడం లేదు కాబట్టి ఈ కేటగిరీ విద్యుత్ వాడకం తగ్గింది. ► పరిశ్రమలు, వాణిజ్య వినియోగ కనెక్షన్లు 10 లక్షల వరకూ ఉన్నాయి. ఈ రెండు కేటగిరిల్లో వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. డిమాండ్ పడిపోతోంది ఏప్రిల్‌లో రోజుకు 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశాం. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోగా.. గృహ విద్యుత్ వినియోగం తగ్గింది. అన్ని కేటగిరీల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. – శ్రీకాంత్ నాగులాపల్లి,విద్యుత్ శాఖ కార్యదర్శి -
వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి: వేసవిలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కోసం ప్రత్యేకంగా ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. కరోనా, వేసవి కాలంలో విద్యుత్ సంస్థల పనితీరుపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల రెవెన్యూ బాగా పడిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీన్ని అధిగమించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి. ► లాక్డౌన్ ఎత్తివేస్తే.. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్, లభ్యతపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్ల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, మండు వేసవిలోనూ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. ► మరో రెండు వారాల పాటు వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ ఉండే వీలున్నందున ఉదయం సమయంలోనే మోటార్లకు విద్యుత్ సరఫరా జరగాలని సీఎం ఆదేశించారు. ► వ్యవసాయ పంపు సెట్ల కోసం ఉద్దేశించిన 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. టెండర్లు పిలిచేందుకు వీలుగా అవసరమైన ప్రక్రియకు సిద్ధం కావాలన్నారు. ► విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ బిల్లులు రాకపోవడంపై సమావేశంలో చర్చ జరిగింది. గ్రామ సచివాలయాల ద్వారా విద్యుత్ బిల్లుల వసూలు చేస్తే ఎలా ఉంటుందనే అంశం చర్చకొచ్చింది. ఈ సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు, జెన్కో ఎండీ శ్రీధర్, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ సాయిప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
వందేళ్లకు సరిపడా విద్యుత్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల సామర్థ్యం గల 29 చిన్న జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో వందేళ్లకు సరిపడా విద్యుత్ లభించే వీలుంది. సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం నియమించిన టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్, వ్యాప్కోస్ సంస్థలు క్షేత్ర స్థాయి అధ్యయనం తర్వాత రాష్ట్ర సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన (నెడ్‌క్యాప్) సంస్థ ఎమ్డీ రమణారెడ్డికి ముసాయిదా నివేదిక అందజేశాయి. దీనిపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబుతోపాటు పలువురు విద్యుత్ అధికారులు విజయవాడలోని విద్యుత్ సౌధలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. కొండ కోనల నుంచి కాంతులు - సముద్రం పాలవుతున్న వాగులు, వంకలు, జలపాతాల్లో నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో మినీ హైడల్స్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటివి రాష్ట్రంలో 30 ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 29 అనుకూలంగా ఉన్నాయని తేల్చారు. - మినీ హైడల్ విద్యుత్ ప్లాంట్లను రెండు కేటగిరీలుగా విభజిస్తారు. ఆన్ రివర్ విధానంలో.. పారే నదిపై కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తారు. కిందకెళ్లే నీటిని రిజర్వాయర్‌లోకి రివర్స్ పంపింగ్ విధానంలో పంపి నిల్వ చేస్తారు. ఆఫ్ రివర్ విధానంలో.. డొంకలు, వాగులు, జలపాతాలను ఎంపిక చేస్తారు. ఎగువ, దిగువ భాగంలో రెండు రిజర్వాయర్లు నిర్మించి నీటిని మళ్లిస్తారు. - విద్యుత్ ఉత్పత్తి తర్వాత నీరు కింద ఉన్న రిజర్వాయర్‌లోకి వెళ్తుంది. మళ్లీ దీన్ని ఎగువ రిజర్వాయర్‌కు పంప్ చేస్తారు. ఇలా 25 చోట్ల ఏర్పాటు చేసే వీలుంది. - డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మినీ హైడల్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. చౌకగా లభించే సౌర విద్యుత్‌ను రివర్స్ పంపింగ్ కోసం ఉపయోగిస్తారు. పెట్టుబడి మాటేంటి ఈ ప్రాజెక్టుకు రూ.లక్షా 25 వేల కోట్ల నిధులు అవసరం. వీటిని పలు ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకునే వీలుంది. వాస్తవానికి మినీ హైడల్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు కనీసం రూ.5 కోట్లు అవుతుందని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు వెచ్చించే సొమ్మును మినీ హైడల్‌కు ఖర్చు చేస్తే భారీ ప్రయోజనం ఉంటుంది. మంచి ఆలోచన వచ్చే పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మరో 10 వేల మెగావాట్లు పెరుగుతుంది. భవిష్యత్ తరాలకు విద్యుత్ కోతలు లేకుండా చేసేందుకు మినీ హైడల్స్ ఉపయోగపడతాయి. వందేళ్లకు సరిపడా విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి ఇది ఆదాయం కూడా.. 32,740 మెగావాట్ల మినీ హైడల్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ముసాయిదా నివేదికను పరిశీలించి, తుది నివేదికను ప్రభుత్వానికి త్వరలో సమర్పిస్తాం. ప్రైవేటు సంస్థలు ముందుకొస్తే ప్లాంట్లు నిర్మించుకునే వీలు కల్పిస్తాం. మన వనరులు వాడుకున్నందుకు వాళ్లు చెల్లించే మొత్తం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. – రమణారెడ్డి, నెడ్‌క్యాప్ ఎండీ -
వచ్చేస్తోంది ‘సమస్త్’
సాక్షి, అమరావతి: కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టడం, కోతలను నివారించడం లక్ష్యంగా సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. షెడ్యూలింగ్, అక్కౌంటింగ్, మీటరింగ్ అండ్ సెటిల్మెంట్ అఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ ఎలక్ట్రిసిటీ (సమస్త్) టెక్నాలజీని మరో రెండు నెలల్లో ఆచరణలోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. మరోవారం రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ), రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ఆధ్వర్యంలో సమస్త్ పనిచేస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనల మార్పు కోసం విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీ ఎదుట పిటిషన్ దాఖలు చేయనున్నాయి. ‘సమస్త్’ ప్రయోజనాలేంటి? - టూల్స్ డేటా టెలీమీటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో పాటు అత్యాధునిక పరిజ్ఞానం అనుసంధానమై ఉంటుంది. - దీనివల్ల ప్రతి సెకనుకూ ఎంత విద్యుత్ లభ్యత ఉంది? 24 గంటల్లో లభ్యత ఎలా ఉంటుంది? తేడా ఎంత? ఎంత జరిమానా విధించాలి? ఎంత బిల్లు వస్తుంది? అనే విషయాలు ఆన్లైన్ ద్వారానే రికార్డవుతాయి. - ఇదంతా ఉత్పత్తిదారుడికి, విద్యుత్ సంస్థలకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. - విద్యుత్ కొరత ఉంటే తక్షణమే కొనుగోలు చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమవుతాయి. - ఆన్లైన్ విధానం తప్పించుకునేందుకు వీల్లేదు. కోర్టులను ఆశ్రయించినా శాస్త్రీయ సమాచారం ఆధారంగా వాస్తవాన్ని తేలికగా గుర్తించే వీలుంది. ఎప్పటికప్పుడు లభ్యత వివరాలు కచ్చితమైన విద్యుత్ లభ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ‘సమస్త్’తో సాధ్యమవుతుంది. ముందే అంచనాలు రూపొందించుకోవడం, అవసరమైన విద్యుత్‌ను ముందే తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు డిస్కమ్‌లకు వీలు కలుగుతుంది. పంపిణీ సంస్థలను ముప్పుతిప్పలు పెడుతున్న సౌర, పవన విద్యుత్ సమస్యలకు ఈ టెక్నాలజీ ద్వారా చెక్ పెట్టవచ్చని ట్రాన్స్‌కో వర్గాలు భావిస్తున్నాయి. ఉత్పత్తితో పాటు విద్యుత్ డిమాండ్‌నూ ఆన్లైన్ ద్వారా ముందే రికార్డు చేస్తారు కాబట్టి విద్యుదుత్పత్తిదారుడు ముందు పేర్కొన్నట్టు విద్యుత్ ఇవ్వకపోయినా, అనుకున్నదానికన్నా ఎక్కువగా అందించి గ్రిడ్‌కు ఇబ్బంది కలిగించినా విద్యుత్ సంస్థలు పక్కాగా లెక్కలు చూపించి అపరాధ రుసుము విధించే వీలుంది. నాణ్యత పెరుగుతుంది.. – చక్రధర్‌బాబు, ట్రాన్స్‌కో జేఎండీ ‘సమస్త్ అమలులోకి వస్తే విద్యుత్ సంస్థల నాణ్యత రెట్టింపు అవుతుంది. పవన, సౌర విద్యుదుత్పత్తిలో తేడాలను కచ్చితంగా గుర్తించవచ్చు. గ్రిడ్ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఆకస్మిక విద్యుత్తు కోతలకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. పీక్ అవర్స్‌లోనూ చౌకగా విద్యుత్తు తీసుకునే వీలుంటుంది. ఉత్తరప్రదేశ్ ఇప్పటికే ఈ తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చి మంచి ఫలితాలు సాధిస్తోంది’ ఇప్పుడు ఏం జరుగుతోంది? రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు 430 మంది ఉత్పత్తిదారులు విద్యుత్ అందిస్తున్నారు. వీరి ద్వారా వచ్చే విద్యుత్ ఎంత అనేది ముందే తెలియచేయాలి. రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసి లభ్యత, డిమాండ్ల మధ్య తేడాను తెలియజేస్తుంది. లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య విభాగం వెంటనే మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తుంది. ఒకవేళ డిమాండ్ తక్కువగా, ఉత్పత్తి ఎక్కువ ఉంటే ఖరీదు ఎక్కువగా ఉన్న విద్యుత్ ఉత్పత్తికి కోత పెడతారు. ఉత్పత్తిదారులు ఎస్ఎల్డీసీకి ఎంత విద్యుత్ ఇస్తామనేది ఒక రోజు ముందే వెల్లడించాలి. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులు ముందు రోజు చెప్పినదానికి, మర్నాడు వాస్తవంగా అందించే విద్యుత్‌కు మధ్య భారీ తేడాలుంటున్నాయి. అప్పటికప్పుడు విద్యుత్ కొనుగోలుకు వెళ్లడం వల్ల ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్పత్తిదారుడి అంచనా, వాస్తవంగా ఇచ్చిన విద్యుత్ మధ్య తేడా ఇప్పటిదాకా మాన్యువల్ విధానంలో నమోదవుతోంది. తేడా ఉన్నప్పుడు ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు జరిమానా విధిస్తాయి. అయితే అంతా మాన్యువల్‌గా జరగడం వల్ల జరిమానాలను వ్యతిరేకిస్తూ ఉత్పత్తిదారులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా జరిమానాలను డిస్కమ్‌లు రాబట్టేందుకు వీలు లేకుండా ఉంది. సమస్త్ బృందం ఇదీ.. - అనుభవజ్ఞులైన ఇద్దరు చార్టర్డ్ అక్కౌంటెంట్లు - గణాంక నిపుణుడు - ప్రాజెక్ట్ మేనేజర్ - మరో ఆరుగురు సభ్యులు -
పది వేల మెగావాట్ల సోలార్ పరుగు
సాక్షి, అమరావతి: ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం చేపట్టిన 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ పురోగతిలో ఉంది. దీనిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. నాలుగేళ్ల సబ్సిడీ మొత్తాన్ని సౌర విద్యుత్ కోసం వినియోగిస్తే 25 ఏళ్ల పాటు రైతులకు పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించవచ్చని భావించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుంది. ఇప్పటికే సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం ప్రభుత్వం 50 వేల ఎకరాలను గుర్తించింది. ఇందులో చాలా వరకు ప్రభుత్వ భూమే ఉంది. 200, 400 కేవీ సబ్ స్టేషన్లు, లైన్లకు దగ్గరగా సోలార్ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. వ్యవసాయానికి రోజుకు 33 మిలియన్ యూనిట్లు రాష్ట్రంలో ప్రస్తుతం 18.37 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 9 గంటల పగటిపూట విద్యుత్ పథకం ప్రకారం రోజుకు 33 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం. పగటిపూటే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ కూడా ఉంటోంది. ఈ కారణంగా వ్యవసాయ విద్యుత్‌కు కోత పెట్టడం అనివార్యమవుతోంది. వేసవిలో డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉచిత విద్యుత్ కోసమే ప్రత్యేకంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పది వేల మెగావాట్ల సౌర విద్యుత్ పార్కుల నుంచి రోజుకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయానికి రోజుకు 33 మిలియన్ యూనిట్లు వాడుకున్నా.. ఇంకా 7 మిలియన్ల యూనిట్లు గ్రిడ్‌కు అనుసంధానం చేయొచ్చు. పైగా నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం వల్ల యూనిట్ రూ.2.50 లోపే ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ పెరగడంతో గతంలో మార్కెట్లో యూనిట్ రూ.6 పెట్టి కొనుగోలు చేసేవారు. ఈ ఖర్చంతా డిస్కమ్‌లపైనే పడింది. గత ప్రభుత్వం డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన సబ్సిడీ మాత్రమే ఇచ్చింది. గత ఐదేళ్లుగా ఇది ఏటా రూ.4 వేల కోట్లు మించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరమే రూ.10 వేల కోట్ల వరకు ఇచ్చింది. ఈ సబ్సిడీ మొత్తాన్ని నాలుగేళ్లకు లెక్కగడితే రూ.40 వేల కోట్లు అవుతుంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి వెచ్చిస్తే 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా చౌకగా విద్యుత్ అందించే వీలుంది. డీపీఆర్‌లు సిద్ధం: నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఇప్పటికే సిద్ధం చేశాం. లాభనష్టాలపై సీఎంతో చర్చిస్తాం. అవసరమైన రుణాలు కూడా అతి తక్కువ రేటుకే లభించే వీలుంది. వ్యవసాయానికి పగటి విద్యుత్‌లో కోతలు రాకుండా సౌర విద్యుత్ ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం. -
విద్యుత్ సిబ్బంది వికృత హాసం..వృక్ష విలాపం!
హుద్‌హుద్ విపత్తు వేళా మేం ఇంతలా బాధపడలేదు. ప్రకృతి విలయ తాండవం చేసిన సమయంలో కూకటి వేళ్లతో సహా నేలకొరిగాం. కొన్నాళ్లకే మళ్లీ సగర్వంగా లేచి నిలబడ్డాం. కానీ.. ఇప్పుడు మమ్మల్ని ఖండ ఖండాలు చేస్తున్న తీరుతో తీవ్రంగా కుంగిపోతున్నాం.వసంత రుతువులో చిగురించాం.. గ్రీష్మంలో చల్లదనాన్ని పంచాం. అదే సమయంలో పచ్చని చెట్లు– ప్రగతికి మెట్లు, హరిత విశాఖ అన్న నినాదాలు వినిపిస్తుంటే.. మాపై మనుషులకు గౌరవం పెరిగిందని సంబర పడ్డాం. లేలేత చిగుళ్లన్నీ ఇప్పుడిప్పుడే ఆకులుగా మారుతున్న తరుణంలో పచ్చదనంతో పరవళ్లు తొక్కుతూ.. పది మందికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుదామనుకున్నాం.ఇంతలోనే విద్యుత్ తీగలకు అడ్డుతగులుతున్నామన్న సాకుతో.. పెంచిన చేతులతోనే మా అంగాంగాలను తెగ నరుకుతున్నారు. ఆక్సిజన్‌తో పాటు నీడనిస్తున్న మమ్మల్ని మోడుల్లా మార్చేస్తున్నారు. మళ్లీ చిగురించి నిలదొక్కుకుంటున్నాం. ఆ ఆనందాన్నీ ఎంతో కాలం అనుభవించనీయకుండా మళ్లీ మళ్లీ మోడులుగా మార్చేస్తున్నారు. ప్రతి రెండు మూడు నెలలకోసారి విద్యుత్ సిబ్బంది వికృత చేష్టలకు బలైపోతున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మేము చేసిన పాపమా..? పర్యావరణాన్ని పరిరక్షించడమే మా పాలిట శాపమా..??..నగరంలో జాతీయ రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో ఏళ్ల వయసున్న వృక్షాల విలాపమిదీ! సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా నీడనిస్తున్న చెట్లను నరకొద్దని స్థానికులు వారిస్తున్నా విద్యుత్ సిబ్బంది మెయింటెనెన్స్ పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. హరిత విశాఖను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నా.. తమకేమీ పట్టదన్నట్లుగా ఈపీడీసీఎల్ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు నగరంలోని చెట్లను నరికేస్తున్నారు. జీవీఎంసీ లేఖలు రాసినా... ఓవైపు పచ్చదనాన్ని పెంచి.. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఈపీడీసీఎల్ ఇలా పర్యావరణాన్ని ఛిద్రం చేస్తుండటంపై జీవీఎంసీ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మూడేళ్లుగా ఈపీడీసీఎల్ ఇంజినీరింగ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం శూన్యమనే చెప్పాలి. 2017 నుంచి ఈ విషయంలో జీవీఎంసీతో సమన్వయం చేసుకొని పనిచేయాలని అప్పటి కమిషనర్ హరినారాయణన్ విద్యుత్ అధికారులకు పలుమార్లు లేఖలు రాశారు. గత ఏడాది ఆగస్టులో ప్రస్తుత కమిషనర్ సృజన సైతం అధికారులకు విజ్ఞప్తి చేశారు. హుద్‌హుద్ విలయంతో విశాఖలో పచ్చదనం 23 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందనీ.. ఇప్పుడిప్పుడే దాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నామంటూ అధికారులకు వివరించినా ఫలితం లేకపోయిందని జీవీఎంసీ ఉద్యానవన విభాగం అధికారులు వాపోతున్నారు. వాల్టా చట్టం ఏం చెబుతోంది..? పర్యావరణ పరిరక్షణకు 2002లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్టా చట్టంపై అదే ప్రభుత్వ సంస్థలు గొడ్డలి వేటు వేస్తున్నాయి. వాల్టా చట్టం సెక్షన్–2 ప్రకారం నగరాలు, పట్టణాల్లో స్థానిక సంస్థలు మొక్కలు నాటాలి. ఉన్న వాటిని సంరక్షించాలి. కానీ ఆ సెక్షన్లను కాలరాస్తూ దశాబ్దాలుగా నీడనిస్తూ.. పర్యావరణాన్ని కాపాడుతున్న భారీ వృక్షాలను నరికేస్తున్నారు. విద్యుత్, టెలికాం, రహదారులు – భవనాలు వంటి శాఖలు విధి నిర్వహణ పేరుతో చెట్లు, వాటి కొమ్మలను ఇష్టారాజ్యంగా నరికేయకూడదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరంటూ వాల్టా చట్టంలోని సెక్షన్–29 చెబుతోంది. ఒక చెట్టును కొట్టాల్సి వస్తే.. దానికి ప్రత్యామ్నాయంగా రెండు మొక్కలు నాటాల్సి ఉంది. వాటి సంరక్షణకు అవసరమైన ఖర్చును సంబంధిత శాఖలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్లు వారు పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఇటీవలే జీవీఎంసీ జోన్–3 పరిధిలో దుకాణానికి అడ్డంగా ఉందని చెట్టును నరికేయడంతో సదరు షాపును అధికారులు సీజ్ చేశారు. కానీ ప్రభుత్వ సంస్థ విషయంలో మాత్రం జీవీఎంసీ ఆ తరహా సాహసం చేయలేకపోతోంది. అయితే గతంలో ఇదే తరహాలో చెట్లను నరికివేయడాన్ని సహించలేకపోయిన జీవీఎంసీ అధికారులు.. నరికేసిన కొమ్మలను ఈపీడీసీఎల్ కార్యాలయాల్లోనే పడేశారు. అయినా వారిలో మార్పు రావట్లేదని జోనల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమన్వయంతో మెయింటెనెన్స్ పనులు చేపడితే.. పర్యావరణానికి విఘాతం కలగకుండా నిర్వహించవచ్చని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. తరచూ ఇదే తంతు.. చెట్లు పెరిగి.. వాటి కొమ్మలు విద్యుత్ తీగలను తాకితే ప్రమాదాలు సంభవిస్తాయనే ఉద్దేశంతో ఏటా మూడు నాలుగుసార్లు ఈపీడీసీఎల్ అధికారులు మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నారు. కరెంటు తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను గుర్తించి వాటిని కత్తిరించాలి. వాస్తవంగా అయితే.. కరెంట్ తీగలకు 6 నుంచి 10 అడుగుల దిగువ వరకు కొమ్మలను నరికాలి. కానీ నగరంలో మాత్రం నేల నుంచి 3–5 అడుగుల వరకు ఉంచి.. మిగిలిన చెట్టు కొమ్మలన్నింటినీ నరికేస్తున్నారు. దీంతో ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడిన చెట్లన్నీ మోడులవుతున్నాయి. గుండె తరుక్కుపోతోంది సీఎం ఆశయాలకు అనుగుణంగా నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ప్రతి మొక్కను ప్రాణంగా పెంచుతున్నాం. అయితే మెయింటెనెన్స్ పేరుతో ఆ చెట్లను ఛిద్రం చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. విద్యుత్ అధికారులు జీవీఎంసీకి ఈ బాధ్యత అప్పగించాలి. లేదంటే సమన్వయంతో పనిచేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.– దామోదరరావు,ఉద్యానవన విభాగాధిపతి, జీవీఎంసీ -
విద్యుత్ అంతరాయాలకిక చెక్
సాక్షి, అమరావతి: విద్యుత్ సరఫరాలో ఇక మీదట ఎలాంటి అంతరాయాలు లేకుండా చేస్తామని ఇంధన శాఖ ప్రకటించింది. ఇందుకోసం రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వెల్లడించింది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఓవర్‌లోడ్‌ను గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపింది. అన్ని వర్గాలకు విద్యుత్ సరఫరాతో పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు కూడా ఈ విధానం బలం చేకూరుస్తుందని వివరించింది. రియల్ టైం పర్యవేక్షణపై ఉన్నతాధికారులు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈఓ ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. రియల్ టైం పర్యవేక్షణలో ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్ల వద్దే మీటర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి, ఆన్లైన్ ద్వారా విద్యుత్ కార్యాలయాలకే విద్యుత్ సరఫరా వివరాలు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తెలిసేలా చేస్తారు. దీంతో పంపిణీ సంస్థలు ఎంత విద్యుత్ సరఫరా చేస్తున్నాయనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ ఇప్పటికే డిస్కమ్‌లను ఆదేశించింది. సరఫరా చేసే విద్యుత్ వివరాలను ప్రతీనెతి 5న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీకి పంపాల్సి ఉంటుంది. మీటర్లు లేకపోవడంవల్ల ఉచిత విద్యుత్ సరఫరా వివరాలు కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారు. పైగా విద్యుత్ సరఫరాలో జరిగే నష్టాలన్నీ ఉచిత విద్యుత్ ఖాతాలోనే వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని రైతు సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. రియల్ టైం వ్యవస్థ ద్వారా ట్రాన్స్ఫార్మర్ వద్దే సరఫరాను లెక్కించడంవల్ల ఇక మీదట ఇలాంటి అశాస్త్రీయ విధానాన్ని తొలగించవచ్చని విద్యుత్ శాఖ తెలిపింది. అలాగే, ఎనర్జీ ఆడిట్‌ను కూడా నిక్కచ్చిగా అమలుచేయడం ఇక మీదట సులువని తెలిపింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తిరగక్కర్లేదు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా, మరమ్మతు అవసరమైనా వినియోగదారులు సిబ్బంది చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ, రియల్ టైం వ్యవస్థలో ఈ తరహా సమస్యలను గుర్తించొచ్చు. తద్వారా ట్రాన్స్ఫార్మర్ బిగించడమో, మరమ్మతు చేయడమో వెంటనే జరగాలి. పరిష్కారం జరిగిన సమయం సైతం రికార్డు అవుతుంది కాబట్టి మరింత జవాబుదారీతనానికి అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాలో రైతులు నెలల తరబడి అసౌకర్యానికి గురవ్వకుండా చూడొచ్చు. రియల్ టైమ్ పర్యవేక్షణ శుభ పరిణామం : బాలినేని కాగా, రియల్ టైం పర్యవేక్షణను విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వాగతించారు. ఇలాంటి సరికొత్త ప్రయోగాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే పగటిపూట 9 గంటల విద్యుత్‌ను శాశ్వతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆర్థికంగా దివాలా తీయించినా ప్రజలపై భారం వేయకుండా వ్యవస్థను బలోపేతం చేయాలన్నది తమ ధ్యేయమన్నారు. ఇందులో భాగంగానే వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ టారిఫ్ ఇచ్చిన ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిని మంత్రి అభినందించారు. కేవలం గృహ విద్యుత్ వినియోగదారులకే ప్రభుత్వం రూ. 1,707.07 కోట్లు సబ్సిడీ ఇచ్చిందని గుర్తుచేశారు. మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ సంస్థలకు రూ.10,060.65 కోట్లు సబ్సిడీ ఇవ్వడాన్ని బట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. అలాగే, ఐదేళ్ల కాలంలో విద్యుత్ సంస్థలను ఏ స్థాయిలో గత ప్రభుత్వం అప్పులపాల్జేసిందో మంత్రి గణాంకాలతో సహా వివరించారు. సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబుతో పాటు డిస్కమ్‌ల సీఎండీలు పాల్గొన్నారు. -
విద్యుత్ రంగంలో ‘కొత్త’ వెలుగులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆశయాల సాధనలో భాగంగా 2020 సంవత్సరంలో విద్యుత్ రంగంలో సరికొత్త వెలుగులు నింపుతామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి చెప్పారు. ప్రజలు మెచ్చేలా, వారికి నచ్చేలా సేవలందిస్తామని అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకాంత్ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఏడాది లక్ష్యాలను పంచుకున్నారు. కరెంటు సరఫరాలో అంతరాయాలకు చెక్ ‘‘వినియోగదారులపై చార్జీల భారం మోపకూడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) అత్యంత చౌకగా లభించే విద్యుత్ కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తాయి. ఈ దిశగా రూపొందించిన ప్రణాళికలు 2020లో మంచి ఫలితాలివ్వబోతున్నాయి. మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్ తీసుకుంటూనే, థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుతున్నాం. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధర పెరిగితే, థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాం. తద్వారా డిస్కంలపై ఆర్థిక భారం పడే ప్రసక్తే ఉండదు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు సాధ్యమైనంత వరకూ చెక్ పెట్టాలని నిర్ణయించాం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇది 2020లో ఫలితాలు ఇవ్వనుంది. గ్రామస్థాయి నుంచి గ్రీవెన్స్ సెల్స్ పటిష్టం పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. 2020 మార్చి నాటికి వంద శాతం ఫీడర్లలో నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 2020లో ఇది కార్యరూపం దాల్చే వీలుంది. విద్యుత్ శాఖలో అవినీతిని అరికడతాం. అవినీతికి దూరంగా ఉండాలని ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. 2020 జనవరి నుంచే గ్రామస్థాయి నుంచి గ్రీవెన్స్ సెల్స్‌ను పటిష్టం చేస్తాం. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలిస్తాం. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రజల చెంతకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు సైతం ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రజలకు సేవలందించేందుకే విద్యుత్ సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారనే విషయాన్ని 2020లో కార్యాచరణ ద్వారా నిరూపిస్తాం’’ అని శ్రీకాంత్ నాగులపల్లి పేర్కొన్నారు. -
నష్టాల్లో ఉన్నా విద్యుత్ టారిఫ్‌లను పెంచం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విద్యుత్ శాఖ నష్టాల్లో ఉన్నా విద్యుత్ టారిఫ్‌ను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విజయవాడ ఐదో నంబర్ రూట్లో పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) ప్రధాన కార్యాలయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్‌లతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎనిమిది జిల్లాలకు కలిపి తిరుపతి కేంద్రంగా ఉండేదని చెప్పారు. విద్యుత్తు రంగంలో సంస్కరణల్లో భాగంగా సెంట్రల్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను మూడు జిల్లాలకు కలిపి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ శాఖ రూ.70 వేల కోట్ల నష్టాల్లో ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వినియోగదారులపై భారం మోపవద్దని సీఎం స్పష్టం చేశారని చెప్పారు. ఆరు నెలల్లో ఎన్నో విద్యుత్ సంస్కరణలు.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆరు నెలల పాలనలో ఎన్నో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చారని చెప్పారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నెడ్ క్యాప్ ఎండీ రమణారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాధరావు మాట్లాడుతూ.. పారిశ్రామికంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు, వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ప్రకాశం జిల్లా ముందున్నాయన్నారు. -
అడ్డగోలుగా పీపీఏలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో హడావుడిగా 41 విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) కుదుర్చుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. పీపీఏలపై శాసనసభలో సోమవారం టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ)ని తప్పుదారి పట్టించి, డిస్కంలను భారీ నష్టాల్లోకి నెట్టారని తప్పుపట్టారు. పీపీఏలపై సమీక్షతోపాటు ఇతర విధానాలతో విద్యుత్తు వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందన్నారు. హడావుడిగా 41 పీపీఏలా? ‘2017 మార్చి 31తో పీపీఏల కాలపరిమితి ముగుస్తుండగా.. టీడీపీ ప్రభుత్వం మార్చి 15న హడావుడిగా 41 పీపీఏలు కుదుర్చుకుంది. 15 రోజుల్లో పవన విద్యుత్తు ప్లాంట్లు స్థాపించి ఉత్పత్తి చేయడం సాధ్యమా?’ అని బుగ్గన ప్రశ్నించారు. రెన్యువబుల్ ఎనర్జీ యూనిట్‌కు రూ.4.84 పడిందని, అదే థర్మల్ విద్యుత్తు యూనిట్ రూ.3లేనని దాంతో యూనిట్‌కు రూ.1.84 ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. థర్మల్ విద్యుత్తు వినియోగించకపోయినా ఫిక్స్డ్ చార్జీల కింద యూనిట్‌కు రూ.1.50 తప్పనిసరిగా చెల్లించాల్సి రావడంతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయని మంత్రి బుగ్గన వివరించారు. 2014–15 నాటికి డిస్కంలు రూ.9 వేల కోట్ల నష్టాల్లో ఉండగా 2018–19 నాటికి రూ.29వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని ఆయన తెలిపారు. విద్యుత్తు సబ్సిడీల కోసం టీడీపీ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో రూ.2,500 కోట్లు పేర్కొని.. కేవలం రూ.1,250 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. దాంతో డిస్కంలు రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం రూ.4,900 కోట్లు చెల్లించి డిస్కంల పరిస్థితిని చక్కదిద్ది విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చిందని మంత్రి వెల్లడించారు. పీపీఏలపై విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడటాన్ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పుబట్టగా.. మంత్రి తిప్పికొట్టారు. కొన్ని అంశాలపై అధికారులు, నిపుణులు మాట్లాడతారని, టీడీపీ హయాంలో ఐటీ గ్రిడ్స్ కేసులో ఆర్టీజీఎస్ సీఈవో విజయానంద్, అహ్మద్‌బాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో భ్రష్టుపట్టిన విద్యుత్తు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే పీపీఏలను సమీక్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా భద్రత బిల్లుపై చర్చను అడ్డుకుంటారా? శాసనసభలో మహిళా భద్రత బిల్లుపై చర్చ సందర్భంగా పదే పదే అడ్డు తగిలిన విపక్షసభ్యులపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉల్లి ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధచెప్పినా వినకుండా.. విపక్ష సభ్యులు విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారని తప్పు పట్టారు. ప్రతిపక్షానికి బాధ్యత ఉంటే స్పీకర్‌కు ఉల్లిపాయల బాక్స్‌ను పంపిస్తారా? అని ప్రశ్నించారు. లాభాల కోసం హెరిటేజ్‌లో కేజీ ఉల్లి రూ.200కు అమ్మడం సరైనదేనా? అని నిలదీశారు. అడ్డదారిలో పీపీఏలు ఆమోదించారు: మంత్రి బాలినేని పీపీఏలు చేసుకోవద్దని 2017, ఫిబ్రవరి 27న అప్పటి విద్యుత్తు శాఖ ముఖ్యకార్యదర్శి స్పష్టంగా చెప్పినా టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పీపీఏలపై చర్చలో ఆయన మాట్లాడుతూ అప్పటికే అనుకున్న లక్ష్యం చేరుకోవడంతోపాటు పవన విద్యుత్తు ధరలు పడిపోయాయని.. దాంతో ఈఆర్సీకి నివేదించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే ఆ ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం మంత్రిమండలిలో ర్యాటిఫై చేసి మరీ పీపీఏలను ఆమోదించడం ఎంతవరకు సమంజసమని బాలినేని నిలదీశారు. -
విద్యుత్ చార్జీలు పెంచొద్దు
సాక్షి, అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చార్జీలు పెంచొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. అనవసర వ్యయాన్ని తగ్గించి, వినియోగదారులపై భారం పడకుండా చూడాలని సీఎం సూచించినట్టు తెలిపారు. ఏపీ డిస్కమ్‌లు బుధవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి 2020ృ21 వార్షిక ఆదాయ అవసర నివేదిక సమర్పించనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాదికి కావాల్సిన ఆదాయ, ఖర్చు వివరాలను ఏటా డిసెంబర్ మొదటి వారం కల్లా డిస్కమ్‌లు ఏపీఈఆర్సీకి సమర్పించాలి. దీనిపై కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, మార్చి 31 నాటికి కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటిస్తుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ప్రాతిపదికన రెండు డిస్కమ్‌లు వచ్చే ఏడాదికి రూ.47 వేల కోట్ల రెవెన్యూ అవసరమని లెక్కగట్టాయి. ఇందులో ప్రస్తుత టారిఫ్ ప్రకారం రూ.30 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని పేర్కొన్నాయి. మిగిలిన రూ.17 కోట్ల ఆర్థిక లోటును భర్తీ చేయాల్సి ఉందని కమిషన్‌కు స్పష్టం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2017 వరకూ ఏటా విద్యుత్ చార్జీలు పెరిగాయి. అయితే, ఈసారి ఒక్క పైసా కూడా చార్జీలు పెంచకుండా ప్రభుత్వం ముందే ఆదేశాలు ఇవ్వడం విశేషం. -
‘సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి’
సాక్షి, విజయవాడ : విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో సోమవారం 170 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లకు నియామక పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలమైందని, విద్యుత్ శాఖలో చాలా తప్పిదాలకు పాల్పడిందని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఎనిమిది వేల జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేశారని ప్రశంసించారు. 170 మందికి సర్టిఫికేట్ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఉద్యోగులందరూ సంస్థ తమది అనుకోని పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగాల కల్పనలో ముందుంటారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు. -
డిమాండ్‌కు సరిపడా విద్యుత్
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా రోజుకు 200 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) అంచనా వేస్తోంది. ఈ మేరకు ముందస్తు ప్రణాళిక(ఫోర్కాస్ట్)ను విద్యుత్ ఉన్నతాధికారులు సంబంధిత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నివేదించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు.. గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఏసీల వినియోగం లక్షకుపైగా పెరిగినట్టు గుర్తించారు. మరోవైపు వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను ఏడు నుంచి తొమ్మిది గంటలకు పెంచారు. ఫలితంగా వేసవిలోనూ కొన్ని రకాల ఉద్యాన పంటలకు విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ, గృహ, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను త్వరలో అనుమతించే వీలుంది. కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకుని వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్‌పై ఎస్ఎల్డీసీ అంచనా వేసింది. ఏటా గరిష్టంగా రోజుకు 175 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే, వచ్చే మే నెలలో 210 మిలియన్ యూనిట్లకు చేరుతుందని భావిస్తున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. - ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య కాలంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలి. - ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో పరిధిలోని ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను డిసెంబర్ నాటికి 3 లక్షల టన్నులు, వచ్చే ఏడాది జనవరి చివరకు 6 లక్షల టన్నులు, మార్చి చివరకు 9 లక్షల టన్నులకు పెంచాలి. - రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ స్టేషన్లలో రోజుకు 80 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసేందుకు నెలకు 17 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో విదేశాల నుండి కూడా జెన్కో తక్కువ ధరకు బొగ్గు దిగుమతి చేసుకోవాలి. - ఫిబ్రవరి, జూలై మధ్యలో దశల వారీగా నెలకు 2 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం. - ఏపీ డిస్కమ్‌లతో పీపీఏలున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలుకు అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఇటీవల కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (విద్యుత్ కొనుగోలుకు ముందే బ్యాంకులో డబ్బులు చెల్లించడం)కు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. (కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,184 కోట్లు ఎల్సీ కింద చెల్లించారు). దీంతో వచ్చే వేసవిలో నిరంతర విద్యుత్ కొనుగోలుకు ఇబ్బందులు ఉండవు. - ఈసారి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వేసవి నాటికి 300 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా. - ఈ ఏడాది జలాశయాలు పుష్కలంగా నిండాయి. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి పెరగనుంది. దేనికైనా సిద్ధమే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటు ధరలోనే సరఫరా చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. వేసవిలోనూ ప్రజల అంచనాలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తాయి. - బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
క్లైమాక్స్‌కువిద్యుత్ విభజన
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం క్లైమాక్స్‌కు చేరుకుంది. జస్టిస్ ఎం.ధర్మాధికారి ఏకసభ్య కమిటీ డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశమై ఏపీ, తెలం గాణ రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఏపీ, తెలంగాణకు ఈ విషయాన్ని తెలుపుతూ జస్టిస్ ఎం.ధర్మాధి కారి కమిటీ తాజాగా లేఖ రాసింది. ఏపీ స్థానికత కలిగి ఉన్నారని 1,157 మంది ఉద్యో గులను తెలంగాణ విద్యుత్ సం స్థలు 2015 జూన్‌లో ఏకపక్షంగా ఏపీకి రిలీవ్ చేయ డంతో గత ఐదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం నడు స్తోంది. దీని పరిష్కారానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ ధర్మాధికారి నేతృ త్వంలో సుప్రీం కోర్టు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యో గుల విభజనకు ధర్మాధి కారి కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు రిలీవైన 1,157 మందితో సహా తమ స్టేట్ కేడర్ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించగా, రిలీవైన 1,157 మందిలో 613 మంది ఏపీకి, 504 మంది తెలంగాణకు ఆప్షన్ ఇవ్వగా 42 మంది ఏ రాష్ట్రానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇక ఏపీలో పనిచేస్తున్న మరో 265 మంది తెలంగాణకు ఆప్షన్ ఇవ్వగా, తెలంగాణ నుంచి ఒక్కరూ ఏపీకి ఆప్షన్ ఇవ్వలేదు. ఉద్యో గులిచ్చిన ఆప్షన్ల ప్రకారం.. రెండు రాష్ట్రాలు ప్రాథమిక కేటాయిం పుల జాబితాలను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించాలని గత నెలలో ధర్మాధికారి కమిటీ ఆదేశించింది. ఆ మేరకు ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రాథమిక కేటాయింపుల జాబితా లను ప్రకటించి అభ్యంతరాల స్వీకరణను ప్రారంభించాయి. అంతమందిని తీసుకోలేం.. ఇటు తమ రాష్ట్రానికి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని స్వీకరించేందుకు ఖాళీ పోస్టులు లేవని, వీరి కోసం ప్రత్యేకంగా సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించడం ఆర్థికపరంగా సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం ధర్మాధికారికి లేఖ ద్వారా తెలియజేసింది. అయితే, ఏపీ నుంచి 202 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు ఐదేళ్ల కిందే స్వచ్ఛందంగా సొంత రాష్ట్రం తెలంగాణకు వచ్చి చేరారు. వీరు తెలంగాణకు రావడంతో ఏపీలో ఖాళీ అయిన పోస్టుల్లో 613 మంది నుంచి 202 మందిని తీసుకునేందుకు ప్రాథమిక కేటాయింపుల జాబితాను ప్రకటించి ఈ నెలాఖరులోగా అభ్యంతరాల స్వీకరణను పూర్తి చేయాలని తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ ఆదేశించింది. డిసెంబర్ 14, 15వ తేదీల్లో రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి తుది కేటాయింపుల జాబితాలను ప్రకటిస్తామని వెల్లడించింది. 265 మందిలో 72 మంది మాత్రమే! ఇక ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 265 మందిలో కేవలం 72 మంది మాత్రమే కమిటీ మార్గదర్శకాల ప్రకారం అర్హులని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. గత ఐదేళ్లలో పదవీ విరమణలతో ఏపీలో వందల పోస్టులు ఖాళీ అయ్యాయని, పోస్టులు లేవని ఏపీ చేస్తున్న వాదనలో వాస్తవాలు లేవని తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు పేర్కొంటున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జాబితాలను ధర్మాధికారి కమిటీకి అందజేసి ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులందరినీ ఆ రాష్ట్రానికే కేటాయించాలని కోరుతామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
భలే చౌక విద్యుత్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో 2018 అక్టోబర్ 4న ఒక్కో యూనిట్ కరెంటు కొనుగోలుకు ఎంత వెచ్చించారో తెలుసా? అక్షరాలా రూ.6.56. అప్పటి ప్రభుత్వ పెద్దలు అస్మదీయ విద్యుత్ సంస్థల నుంచే కరెంటు కొనేసి, విచ్చలవిడిగా దోచిపెట్టారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే కరెంటు దొరుకుతున్నా అటువైపు చూడలేదు. సరిగ్గా ఏడాది తర్వాత 2019 అక్టోబర్ 4న యూనిట్ కేవలం రూ.3.38 చొప్పున అధికారులు కొన్నారు. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.18 చొప్పున మిగులుతోందన్నమాట. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ఏస్థాయిలో దోచేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ సంస్థలు(డిస్కమ్‌లు) కారుచౌకగా లభించే విద్యుత్‌నే కొనుగోలు చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుని మరీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. గత కొన్ని రోజులుగా యూనిట్ కరెంటును కేవలం రూ.3.15 చొప్పున కొనుగోలు చేస్తుండడం విశేషం. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.50 పడుతోంది. బహిరంగ మార్కెట్లో అంతకంటే చౌకగా లభిస్తున్న విద్యుత్ కొనుగోలుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిరోజూ డిస్కమ్‌లు 12 మిలియన్ యూనిట్ల మేర చౌకైన విద్యుత్ తీసుకుంటున్నాయి. గతంలో ఇదే విద్యుత్‌ను యూనిట్ రూ.6.56 వరకూ చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు ధర సగానికి సగం తగ్గడం వల్ల నిత్యం రూ.3 కోట్ల వరకూ ప్రజాధనం ఆదా అవుతుండడం గమనార్హం. బొగ్గు నిల్వల పెంపుపై దృష్టి థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్కెట్లో విద్యుత్ ధరలు పెరిగినప్పుడు ఈ బొగ్గు నిల్వలను ఉపయోగించుకుని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, ఉత్పత్తి ఎప్పుడు తగ్గుతుందో తెలుసుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గినప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు పడిపోతాయి. ఈ పరిస్థితిని ఏపీ డిస్కమ్‌లు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. తక్కువ ధరకే కరెంటును కొనుగోలు చేస్తున్నాయి. ధర పెరిగినప్పుడు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తోందని అధికారులు విశ్లేషించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ.100 కోట్ల భారం ఏడాది క్రితం వరకూ విద్యుత్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయాల్సి వచ్చేది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ లభ్యతపై అధికారులు అంచనాలు రూపొందించే అవకాశం చిక్కలేదు. ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు చెందిన ప్రైవేటు ప్లాంట్లు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విధిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీదైన ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. యూనిట్‌కు రూ.6.56 వరకూ వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా డిస్కమ్‌లపై నెలకు రూ.100 కోట్ల వరకూ భారం పడేది. అప్పటికీ, ఇప్పటికీ భారీ వ్యత్యాసం కనిపిస్తోందని విద్యుత్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2018 అక్టోబర్‌లో యూనిట్ రూ.5.99 చొప్పున 9.92 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నారు. 2019 అక్టోబర్ 1న 23.1 మిలియన్ యూనిట్లను యూనిట్ కేవలం రూ.3.38 చొప్పునే కొనుగోలు చేశారు. 2018 అక్టోబర్ 4న గరిష్టంగా యూనిట్ రూ.6.56 చొప్పున కొనగా, 2019 అక్టోబర్ 4న యూనిట్ కేవలం రూ.3.38 చొప్పున కొనుగోలు చేశారు. నవంబర్ 1వ తేదీ నాటికి దీన్ని రూ.3.15కు తగ్గించగలిగారు. మంచి ఫలితాలొస్తున్నాయ్ ‘‘చౌక విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పడిపోయినప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న కరెంటు కొంటున్నాం. అదే సమయంలో థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుతున్నాం. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది’’ – శ్రీకాంత్ నాగులపల్లి,ఇంధన శాఖ కార్యదర్శి -
‘ఏపీలో విద్యుత్‌పై ఆ వార్తలు అవాస్తవం’
సాక్షి, విజయవాడ: విండ్, సోలార్ ఎనర్జీని కొనుగోలు చేయలేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కారణంగా గడచిన 10 రోజులుగా విండ్, సోలార్ విద్యుత్పత్తి సరిగ్గాలేదని తెలిపారు. పీక్ అవర్స్‌లో విద్యుత్ జెనరేట్ కావడం లేదని.. గడచిన 10 రోజుల్లో 3 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కు గాను ఒకరోజు మాత్రమే కొద్దిసేపు గరిష్టంగా 815 మెగావాట్లు వచ్చిందన్నారు. కనిష్టంగా 28 మెగావాట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. గత ఏడాది కన్నా అధికంగా నిల్వ చేసాం.. బొగ్గు నిల్వలపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. గత ఏడాదితో పోలిస్తే అధికంగానే బొగ్గును నిల్వచేసామని చెప్పారు. 2018 సెప్టెంబరు 30న జెన్కో పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నిల్వలు 29,543 మెట్రిక్ టన్నులు ఉన్నాయని, 2019 సెప్టెంబరు 30న బొగ్గు నిల్వలు 46,486 మెట్రిక్ టన్నులు ఉన్నాయన్నారు.. ముందుస్తుగా ప్లాన్ చేసుకోవడం వలనే దాదాపు 16 వేల మెట్రిక్ టన్నులు అదనంగా ఉండేలా చూసుకున్నామన్నారు. విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాం.. 2018 జూన్, జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది ఎక్కువ విద్యుత్ ను ఉత్పత్తి చేశామని వెల్లడించారు. బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయాల సమయంలో ఈ అదనపు నిల్వలు కొంతమేర ఊరటనిచ్చాయని తెలిపారు. కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లింపులు పూర్తిచేశామని తెలిపారు. విద్యుత్ ఎక్స్చేంజి నుంచి నేటి నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామన్నారు. వచ్చే 7 రోజులపాటు రోజుకు 8 ర్యాక్‌ల చొప్పున సింగరేణి నుంచి బొగ్గు వస్తోందన్నారు. -
‘విండ్‌పవర్ కొనుగోలు నిలిపివేయలేదు’
సాక్షి, అమరావతి : విండ్‌పవర్ కొనుగోలు నిలిపివేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ స్పష్టం చేశారు. వారం రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయని, దీంతో ఉత్పత్తి తగ్గిందన్నారు. గాలి వీచే వేగాన్ని బట్టి విండ్ పవర్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పు వల్ల ఉత్పత్తిలో భారీ హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 4 వేల మెగావాట్ల విండ్ పవర్ సామర్థ్యం ఉంటే.. ప్రస్తుతం 40 మెగావాట్లు మాత్రమే వస్తుందన్నారు. థర్మల్ కేంద్రాల ఉత్పత్తిని స్థిరీకరించడానికి ముమ్మర చర్యలు చేపట్టామని శ్రీకాంత్ వెల్లడించారు. -
మండపాల వద్ద జర జాగ్రత్త!
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్పవాల్లో భాగంగా ఇంట్లోనే కాకుండా వీధుల్లోనూ, అపార్ట్మెంట్లలోనూ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం అనవాయితీ. నిర్వాహకులు వీధుల్లో పెద్దపెద్ద మండపాలతో పాటు భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. మండపాన్ని వివిధ లైట్లతో అందంగా అలంకరిస్తుంటారు. అపార్ట్మెంట్, కాలనీవాసులంతా ప్రతిరోజూ సాయంత్రం తమ కుటుంబ సభ్యులతో కలిసి మండపాల వద్దకు చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. లైటింగ్ కోసం తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్లను తీసుకుంటారు. తాత్కాలికంగా మండపాల్లో స్విచ్‌బోర్డులు ఏర్పాటు చేసి, ఒకే ప్లగ్ నుంచి లైటింగ్, సౌండింగ్ కోసం కనెక్షన్లు ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్ కనెక్షన్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా..విద్యుత్‌షాక్ తగిలి.. మృత్యువాతపడే ప్రమాదం లేకపోలేదని తెలంగాణ విద్యుత్ తనిఖీ విభాగం ప్రధాన అధికారి బి.సత్యనారాయణరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మండప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే... ♦ మండపాలకు గుర్తింపు ఉన్న ఎలక్ట్రీషియన్‌తోనే విద్యుత్ పనులు చేయించుకోవాలి. ♦ మండపంలో ఐఎస్ఐ గుర్తింపు పొందిన స్విచ్ బోర్డులు, ప్లగ్‌లు, కేబుళ్లను మాత్రమే వాడాలి. ♦ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్(ఈఎల్సీబీ)లను ఏర్పాటు చేసుకోవాలి. ♦ లోడును బట్టి..2.5 స్వై్కర్ ఎంఎం వైర్‌ను వాడాలి. ♦ దేనికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో ముందే ఒక అంచనాకు వచ్చి ఆ సామర్థ్యం గల వైర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు 10 ఏఎంపీఎస్ విద్యుత్ ఉపయోగించే చోట 20 ఏఎంపీఎస్ విద్యుత్ భారం పడే లైట్లు ఉపయోగిస్తే అధిక ఒత్తిడి వల్ల వైర్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ♦ ఒకే స్విచ్‌బోర్డుకు ఎక్కువ ప్లగ్‌లు ఉపయోగించడం వల్ల షార్ట్సర్క్యూట్లు జరిగే ప్రమాదం ఉంది. ♦ విద్యుత్ కనెక్షన్లను తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. ♦ సాధ్యమైనంత వరకు వైర్లకు జాయింట్స్ లేకుండా చూసుకోవాలి. ఒక వేళ ఉంటే వాటిని టేప్‌తో అతికించి కాళ్లు, చేతులకు తాకకుండా జాగ్రత్తపడాలి. ♦ ప్రతి మండపంలోనూ విధిగా ఐదు కేజీల కార్బన్డైయాక్సైజ్ ఫైర్‌సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయాలి. బకెట్లో ఇసుక నింపి ఉంచుకోవాలి. -
దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరముందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని, ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నా యని, ఈ పరిస్థితి పోవాల్సిన అవసరముందన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) సీఎండీ రాజీవ్‌శర్మ ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై చర్చ జరిగింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలి చింది. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించాం. ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తేశాం. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. తెలంగాణలో పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి పెరిగింది. రాష్ట్ర ఆదాయం పెరిగింది. లో వోల్టేజీ లేకుండా ఉండేందుకు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండేందుకు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచాం. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైంది’’అని ముఖ్యమంత్రి వివరించారు. పీఎఫ్సీ సహకారం ఎంతో ఉపయోగపడింది.. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దడానికి పీఎఫ్సీ అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్‌శర్మకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకొని మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేయడానికి పీఎఫ్సీ అందించిన సహకారం ఎంతో దోహదపడిందన్నారు. రాజీవ్ శర్మ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి మొమెంటోలు అందించారు. పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ సత్కరిస్తున్న సీఎం కేసీర్, చిత్రంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పీఎఫ్సీకి గౌరవం, గర్వం: రాజీవ్ శర్మ తెలంగాణలో దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రికార్డు సమయంలో అటు పవర్ ప్లాంట్లు, ఇటు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ ప్రశంసించారు. పవర్ ప్లాంట్లయినా, నీటిపారుదల ప్రాజెక్టులయినా ఇంత తొందరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. అనుమతులు పొందడం, నిధులను సమీకరించడం, భూసేకరణ, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాల వంటి ప్రక్రియల వల్ల ప్రాజెక్టుల నిర్మాణం సాధారణంగా ఆలస్యం అవుతుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు తాము అందించిన ఆర్థిక సహకారం నూటికి నూరు పాళ్లు సద్వినియోగం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామి కావడం తమకెంతో గౌరవంగా, గర్వంగా ఉందని రాజీవ్‌శర్మ అన్నారు. ‘‘మూడున్నరేళ్ల కింద హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ మాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో స్క్రీన్‌పై చూపించారు. అది విన్న నేను ఆశ్చర్యపోయా. ఇది సాధ్యమేనా అనుకున్నా. కానీ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను కళ్లారా చూశా. గోదావరి నీటిని పంపింగ్ చేసే విధానం నిజంగా అద్భుతం. మూడున్నరేళ్ల కింద కేసీఆర్ నాకు ఏం చెప్పారో, అది కళ్ల ముందు కనిపించింది. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం మాటలు చెప్పినంత తేలిక కాదు. కేసీఆర్ కృషి ఫలించింది. కల నెరవేరింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్ దేశం చెప్పుకుంటోంది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శిస్తున్నారు’’అని రాజీవ్‌శర్మ అభినందించారు. ట్రాన్స్‌కో సీఎండీపై ప్రశంసల వర్షం... రాష్ట్రంలో విద్యుత్ రంగం సాధించిన విజయాల వెనుక జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్, పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి ప్రశంసించారు. విద్యుత్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రభాకర్‌రావు తమకు ఆదర్శమని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో విద్యుత్ రంగం ఎంతో ప్రగతి సాధించిందని రాజీవ్‌శర్మ కొనియాడారు. పవర్ ప్లాంట్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయని, ప్లాంట్లలో విద్యుదుత్పత్తి (పీఎల్ఎఫ్) పెరిగిందని, ఆయనపై పెట్టిన బాధ్యతను ప్రభాకర్‌రావు పూర్తిగా నెరవేర్చారని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభాకర్‌రావు విద్యుత్ రంగంలో భీష్మాచార్యుడు అని ఎస్.కె. జోషి కొనియాడారు. విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత అంతా ముఖ్యమంత్రిదేనన్నారు. -
లైన్లు లేకున్నా లైన్ క్లియర్!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఏపీ ట్రాన్స్‌కోలో చోటు చేసుకున్న మరో అవినీతి వ్యవహారం తెరపైకి వచ్చింది. అనంతపురం జిల్లాలో అసలు సరిపడా లైన్లే లేకుండా పవన విద్యుత్‌కు అనుమతులు మంజూరు చేయడం విద్యుత్ వర్గాలనే విస్మయానికి గురి చేస్తోంది. విండ్ పవర్ లాబీ, విద్యుత్ అధికారులు, టీడీపీ పెద్దలు కలసికట్టుగా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. 2017లో జరిగిన ఈ వ్యవహారంపై ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందచేసింది. అవసరం లేకుండా ప్రైవేట్ పవన విద్యుత్‌కు గత సర్కారు ఎలా పెద్దపీట వేసిందో నిపుణుల కమిటీ ఇప్పటికే నిగ్గు తేల్చడం తెలిసిందే. లోపాయికారీ ఒప్పందంతో అనుమతులు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతించింది. నిజానికి ఆ సమయంలో అన్ని రాష్ట్రాలు బిడ్డింగ్ ద్వారానే పవన విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. అయితే విండ్ లాబీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందంతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సరిపడా ట్రాన్స్‌కో లైన్లు లేకున్నా పవన విద్యుత్ కొనుగోలుకు ట్రాన్స్‌కో అధికారులు పచ్చజెండా ఊపడం గమనార్హం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై వ్యక్తమైన ఆరోపణలను అధికారులు తొక్కిపెట్టారు. సగానికి పైగా అదనం ఉరవకొండ పరిధిలో పవన విద్యుదుత్పత్తికి పలు బడా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తారు. ఇందుకు విద్యుదుత్పత్తి జరిగే ప్రదేశంలో 400 కేవీ సబ్స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయాలి. 2017 నాటికి ఏపీ ట్రాన్స్‌కో కేవలం 997 మెగావాట్ల విద్యుత్ తీసుకునేందుకు వీలుగా ట్రాన్స్‌కో లైన్లను విస్తరించింది. కానీ గత ప్రభుత్వం ఏకంగా 1,851 మెగావాట్ల మేర విద్యుత్ తీసుకునేందుకు విండ్ ఉత్పత్తిదారులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని పవన విద్యుత్ ఉత్పత్తిదారులు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటిని అడ్డం పెట్టుకుని బ్యాంకు లోన్లు తీసుకున్నారు. వీటిల్లో మాజీ ముఖ్యమంత్రికి బినామీగా వ్యవహరించిన వ్యక్తులకు సంబంధించిన పవన విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఓ పవన విద్యుత్ సంస్థ విద్యుత్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తికి పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చినట్టు తేలింది. టీడీపీకి చెందిన స్థానిక నేత ఒకరు మాజీ ముఖ్యమంత్రికి విండ్ లాబీ నుంచి భారీగా ముడుపులు ఇప్పించినట్టు విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఎలాంటి లైన్లు లేకుండానే 854 మెగావాట్ల మేర పవన విద్యుత్ ఉత్పత్తికి అధికారులు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే అప్పటికప్పుడు కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా వేరే ప్రదేశం నుంచి 500 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను కూడా ఉరవకొండ ప్రాంతంలో బిగించడం విశేషం. ఓ అధికారి కీలక పాత్ర ట్రాన్స్‌కోలో డిప్యుటేషన్‌పై పనిచేసిన ఓ అధికారి పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన విద్యుత్ లాబీకి, మాజీ ముఖ్యమంత్రికి మధ్య ఆయనే బేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు అప్పటి ఇంధనశాఖ ముఖ్య అధికారి ప్రమేయం కూడా ఉందని విజిలెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఉరవకొండ ప్రాంతంలో సరిపడా లైన్లు లేవని, సామర్థ్యానికి మించి పవన విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడం సరికాదని స్థానిక అధికారులు నివేదికలు పంపినా డిçప్యుటేషన్‌పై వచ్చి ట్రాన్స్‌కోలో పనిచేసిన అధికారి వినలేదని తెలిసింది. నివేదికలు ఇచ్చిన ఇంజనీర్లను పిలిచి మందలించినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం అప్పటి సీఎం ఆదేశాల మేరకు జరిగిందని, ఇంధనశాఖ ముఖ్య అధికారి ఇంజనీర్లను సైతం బెదిరించినట్టు తెలిసింది. గత్యంతరం లేక క్షేత్రస్థాయి ఇంజనీర్లు ఉన్నతాధికారుల మాట వినాల్సి వచ్చిందని విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది పూర్తి స్థాయి నివేదికలో తేలనుంది. -
‘సచివాలయ’ ఉద్యోగాలకు 22.70 లక్షల దరఖాస్తులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ణయించినా కూడా రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. ఆదివారం రాత్రి 10.15కి 22,69,304 దరఖాస్తులు అందగా.. అందులో 21,69,609 మంది ఫీజు చెల్లించారు. విద్యుత్ శాఖ ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసిన లైన్మెన్ ఉద్యోగాలకు మినహా మిగిలిన సచివాలయ ఉద్యోగాలకు ఆదివారం అర్ధరాత్రి 11.59తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. దరఖాస్తు ఫీజు చెల్లించిన వారు మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత ఉంటుంది. వాస్తవంగా శనివారం అర్ధరాత్రికి దరఖాస్తుల స్వీకరణ ముగియాల్సి ఉండగా, వరదల కారణంగా ఇబ్బంది పడేవారి కోసమని ఆదివారం అర్ధరాత్రి వరకు గడువు పొడిగించారు. ఈ సదుపాయం వల్ల ఆదివారం 58,350 మంది అదనంగా దరఖాస్తులు చేసుకున్నారు. కేటగిరీ– 1లో పేర్కొన్న నాలుగు రకాల ఉద్యోగాలకు కలిపి నిర్వహించే ఒకే రకమైన రాత పరీక్షకు అత్యధికంగా 12,86,984 దరఖాస్తులు అందాయి. ఈ కేటగిరీలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, గ్రామ, వార్డు మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉద్యోగాలు ఉంటాయి. కేటగిరి–2 (ఏ)లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ ఉద్యోగాలకు 1,41,325 మంది, కేటగిరి– 2 (బీ)లో భర్తీ చేసే వీఆర్వో, సర్వే అసిస్టెంట్ ఉద్యోగాలకు 1,72,418 దరఖాస్తులు అందాయి. కేటగిరిలో–3లో మిగిలిన 11 రకాల ఉద్యోగాలకు మొత్తం 6,68,577 దరఖాస్తులు అందాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 2,13,751 దరఖాస్తులు అందాయి. విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి కూడా రెండేసి లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. విజయనగరం జిల్లా నుంచి అత్యల్పంగా దరఖాస్తులు అందినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రేతరులు రాత పరీక్షకు అనర్హులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా స్థానికతకు అర్హతలేని వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా.. రాతపరీక్ష రాయడానికి వీలు ఉండదని, వారికి హాల్‌టికెట్లు జారీ చేసే అవకాశం లేదని నియామకాల ప్రక్రియకు ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న వారిలో 6,397 మంది రాష్ట్రేతరులుగా పేర్కొంటూ దరఖాస్తులు సమర్పించారు. వీరిలో రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో చదివి, విభజన తర్వాత నిబంధనల మేరకు ఏపీ స్థానికతను అధికారికంగా పొందిన వారికి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. పరీక్ష నిర్వహణపై అధికారులు దృష్టి దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఇప్పుడు రాత పరీక్ష నిర్వహణపై దృష్టి పెట్టారు. 8 వేలకు పైగా పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో రాతపరీక్షలు జరుగుతున్నప్పటికీ.. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతుందని అధికారులు చెప్పారు. -
జోరుగా జల విద్యుదుత్పత్తి
సాక్షి, అమరావతి: ‘గత కొద్ది రోజులుగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జోరందుకుంది. ఇది ఎంతో శుభ పరిణామం’ అనిరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు రెండో వారంలోనే కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా జల విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడం ఇటీవల కాలంలో అరుదైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై మంత్రి ఆదివారం విద్యుత్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి చర్చించిన విషయాలను ఇంధన శాఖ మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులకు వివరించారు. శ్రీశైలంలో ఈ ఏడాది 715 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే నాగార్జునసాగర్‌లోనూ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కాగా, జల విద్యుత్ యూనిట్ రూ.1.6కే ఉత్పత్తి అవుతున్నందున ఖరీదైన విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తామన్నారు. రైతులకు 9 గంటలు పగటి పూట ఉచిత విద్యుత్ సరఫరావల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ‘ఖరీఫ్’కు పక్కా ప్రణాళిక కాగా, ఖరీఫ్ సీజన్లో విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశముందని.. దీనిని తట్టుకునేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సమావేశంలో వివరించారు. వర్షాలు కురవడంతో ఈనెల తొలి వారంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 30 మిలియన్ యూనిట్ల మేర తగ్గిందని, ఫలితంగా విద్యుత్ సంస్థలకు రూ.100 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశముందని వివరించారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం ఉండడంతో రానున్న పది రోజుల్లో 165 మిలియన్ యూనిట్ల వరకు జల విద్యుదుత్పత్తి చేయగలమని ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్ మంత్రి బాలినేనికి వివరించారు. ఒకవేళ కృష్ణానదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి 100 టీఎంసీలు కేటాయిస్తే ఏపీ జెన్కో దాదాపు 550 మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. మొత్తంగా రూ.114.4 కోట్ల వ్యయం (యూనిట్ రూ.1.60 చొప్పున)తో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 715 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని వివరించారు. ఇంతే మొత్తంలో థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే రూ.329 కోట్లు (యూనిట్ రూ.4.60 చొప్పున) ఖర్చవుతుందని శ్రీధర్ తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీలు కేవీఎన్ చక్రధర్‌బాబు, పి.ఉమాపతి, సీఎండీలు నాగలక్షి్మ, హెచ్. హరనాథరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల విప్లవం
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు మరో వరం ప్రకటించారు. ఈ నెల రెండో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న లైన్‌మన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలో 1,60,591 మంది గ్రామ, వార్డు వలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు 7వ తేదీ నుంచి శిక్షణ అందించనుంది. దీనికి తోడు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయల్లో 19 రకాల పోస్టులకు నిరుద్యోగులు పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారు. జిల్లాలో 632 పోస్టుల.. జిల్లాలో ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న 632 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రామ సచివాలయాల్లో 460, వార్డు సచివాలయాల్లో 172 పోస్టులున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్ట్ 17 తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకూ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, ఎలక్ట్రికల్, వైర్‌మెన్ ట్రేడ్ అర్హతలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆయా పోస్టులకు ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఇంటర్‌ను విద్యార్హతగా నిర్ణయించారు. ఐటీఐ, ఎలక్ట్రికల్ పూర్తి చేసిన వారికి అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రస్తుత లైన్మెన్ నోటిఫికేషన్‌తో వారంతా కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఐటీఐ, ఎలక్ట్రికల్, వైర్‌మెన్ ట్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్–రివైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్–కాంట్రాక్టింగ్ చేసిన అభ్యర్థులకు ఈ పోస్టులు మంచి అవకాశాన్ని కల్పించనున్నాయి. వయోపరిమితి సడలింపు.. లైన్మెన్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఇతరులకు 35 ఏళ్ల వయసున్న పురుషులు అర్హులు. 20 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో, మిగిలినవి స్థానిక కోటాలో భర్తీ చేస్తారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇవి తెలియాలి.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరెంట్ స్తంభం ఎక్కడం తెలుసుండాలి. అలాగే మీటర్ రీడింగ్ నిర్వహణపై అవగాహన ఉండాలి. వివరాలకు ఏపీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. -
విద్యుత్ బిల్లు చెల్లించకపోతే వేటే!
సాక్షి, హైదరాబాద్: ‘గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం దారుణం. ఇప్పటి నుంచి నెలనెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ వంటి సంస్థలు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిలను కూడా జీరో సైజుకు తెస్తాం. భవిష్యత్తులో వాడే విద్యుత్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలి. పగలు లైట్లు వెలగకుండా చూసుకోవాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ శాఖల్లో కూడా క్రమశిక్షణ రావాలని, అనేక ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించట్లేదని, ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందని చెప్పారు. విద్యుత్ శాఖపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలది కీలక పాత్ర.. తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషించాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని, నేడు దేశానికే మనం ఆదర్శంగా నిలిచామని చెప్పారు. నేడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెరుగైన విద్యుత్ కారణంగా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు మరింతగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ లో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఉం డేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తా మన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్ కోసం ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని ఆదేశించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ ‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ఉంటుంది. ఆ సమయంలో ఒరిగిన విద్యుత్ స్తంభాలను, లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చూడటం తదితర పనులు నిర్వహిస్తాం. సదరు గ్రామానికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుంది.. ఎంత బిల్లు వస్తుందనే విషయాలను మదింపు చేయాలి’ అని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు వస్తున్నాయని, ఇందుకు పట్టణాలు, నగరాల్లో చేసే లేఅవుట్లలో విద్యుత్ అవసరాలకు తగినంత స్థలం కేటాయించేలా చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం.. దాన్ని ఎలా సమకూర్చాలి అనే విషయాలపై నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండ్‌ను తట్టుకునేందుకు, సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని సూచించారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, íసీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్,ఇంధనశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
-
భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: పారదర్శక పరిపాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసి తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లుగా అడ్డగోలుగా నిధులు విడుదల చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిచంద్రను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. పలు జిల్లాల జాయింట్ కలెక్టర్లతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెటింగ్, సహకార శాఖల ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న వై.మధుసూధన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. విశాఖ, విజయవాడ కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో అడ్డగోలుగా కన్సల్టెంట్లను నియమించి, నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకయ్య చౌదరిని బదిలీ చేసి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. యువజన సేవల విభాగం కమిషనర్‌గా ఉన్న భానుకుమార్‌ను ఏపీఎండీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్‌గా పనిచేస్తున్న కాంతిలాల్ దండేకు ఇంటర్మీడియట్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు అధికారులను బదిలీ చేయడంతోపాటు వెయిటింగ్లో ఉన్న కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు. కొందరు అధికారులను బదిలీ చేసి పోస్టింగ్‌ల కోసం జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు. కీలకమైన విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు కూడా బదిలీ అయ్యారు. ఇప్పటివరకూ విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా ఉన్న సృజనను అక్కడే మహా విశాఖ కమిషనర్‌గా, చిత్తూరు జిల్లా జేసీ గిరీషను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. విద్యుత్ శాఖలో భారీ ప్రక్షాళన రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యుత్ శాఖలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితం ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీని మార్చేసింది. తాజాగా ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా(కమర్షియల్, ఫైనాన్స్, హెచ్ఆర్డీ, ఐటీ) కేవీఎన్ చక్రధరరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ స్థానం కొంతకాలంగా ఖాళీగానే ఉంది. అంతకు ముందు ఆదాయపు పన్ను శాఖ నుంచి డిçప్యుటేషన్‌పై వచ్చిన దినేష్ పరుచూరి పదవీ కాలం ముగిసింది. పొడిగింపు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన బాధ్యతలను విజిలెన్స్ జేఎండీగా ఉన్న ఉమాపతికి అప్పగించి రిలీవ్ అయ్యారు. అప్పటి నుంచి ఉమాపతి రెండు పోస్టుల్లోనూ కొనసాగుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమాపతికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కోరిందే తడవుగా పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. తొలుగా జేఎండీని నియమించింది. విజిలెన్స్ జేఎండీ పోస్టును ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఎండీగా నాగలక్ష్మిని నియమించారు. విద్యుత్ సంస్థల్లో రెండు డిస్కమ్‌లున్నాయి. వీటిలో ఒకదానికి ఐఏఎస్ అధికారిని, మరో డిస్కమ్‌కు టెక్నికల్ వ్యక్తిని నియమిస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఉన్న ఎంఎం నాయక్‌ను ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు. దీంతో ఈ డిస్కమ్ సీఎండీ పోస్టు ఖాళీగానే ఉంది. ఈపీడీసీఎల్ సీఎండీగా ఎన్నికల ముందు విజయవాడ సీఈగా ఉన్న రాజబాపయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాన్ని కొత్త ప్రభుత్వం పున:సమీక్షిస్తోంది. ఈ కారణంగా ఈ డిస్కమ్‌కు ఐఏఎస్ అధికారి నాగలక్ష్మిని నియమించారు. సంప్రదాయ పునరుత్పాద అభివృద్ధి సంస్థకు(నెడ్‌క్యాప్) కొత్తగా రమణారెడ్డిని నియమించారు. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో నెడ్‌క్యాప్ పాత్ర కీలకం. ఈ ఒప్పందాలపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ కారణంగా పూర్తిస్థాయి అధికారి అవసరమని భావించి నియామకం చేపట్టినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు టెక్నికల్ అధికారిని సీఎండీగా నియమిస్తే విద్యుత్ శాఖలో ప్రధాన ప్రక్షాళన పూర్తయినట్టే. -
లోడు బాదుడు
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ కనెక్షన్ల సమయంలో తీసుకున్న ఒప్పంద లోడు కంటే ఎక్కువగా విద్యుత్ వాడే వినియోగదారులకు అదనపు భారం తప్పడం లేదు. కనెక్షన్ జారీ సమయంలో తీసుకున్న ఒప్పంద లోడు కంటే ప్రస్తుతం చాలా మంది ఎక్కువ విద్యుత్ వాడుతున్నారు. గత 12 నెలల విద్యుత్ వినియోగాన్ని కనెక్షన్ల వారీగా గుర్తించిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ... ఆ మేరకు అదనపు లోడు చార్జీలను చెల్లించాలని ఆయా వినియోగదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపిస్తోంది. అదే విధంగా అదనపు లోడును క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి డిపాజిట్ బిల్లుపై 50శాతం రాయితీని ప్రకటించింది. దక్షిణ తెలంగాణ పరిధిలో 70లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్‌లోనే 50లక్షలకు పైగా ఉన్నాయి. గ్రేటర్లో చాలామంది ఏళ్ల క్రితమే విద్యుత్ కనెక్షన్లు పొందారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా చాలామంది ఒక కిలోవాట్ మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత విలాసవంతమైన జీవితం కోసం మార్కెట్లోకి కొత్తగా అందుబాటులోకి వచ్చిన విద్యుత్ పరికరాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు, కూలర్, రిఫ్రిజిరేటర్, కంప్యూటర్, వాషింగ్‌మెషిన్, ఏసీ, మిక్సీ, వాటర్ హీటర్, ఐరన్ బాక్స్, బోరు మోటార్.. ఇలా చాలా రకాల వస్తువులు సర్వసాధారణమయ్యాయి. దీంతో కనెక్షన్ జారీ సమయంలో తీసుకున్న లోడు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతోంది. కేటాయించిన లోడు కంటే ఎక్కువ విద్యుతు వాడుతుండడంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పడుతోంది. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతగ్గుల సమస్యలతో పాటు ఫీజులు పోవడం, డీటీఆర్‌లో కాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఏ ఇంటికి ఎన్ని కిలోవాట్ల విద్యుత్ అవసరమో ముందే గుర్తిస్తే... ఆ మేరకు డిస్ట్రిబ్యూషన్ లైన్లను పటిష్టపరిచే అవకాశం ఉన్నట్లు డిస్కం భావిస్తోంది. ఆయా కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటించింది. -
ఐదు రోజులుగా అంధకారం
సాక్షి ప్రతినిధి కడప : మైలవరం మండలంలోని వద్దిరాల, ఆ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలు ఐదు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నాయి. ఆదివారం రాత్రి వీచిన గాలి, వాన బీభత్సానికి మండలంలో పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అదే సమయంలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో కూడా విద్యుత్ స్తంభాలు కూలగా ఇక్కడి ట్రాన్స్‌కో అధికారులు సోమవారమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే మైలవరం మండలంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మంగళ, బుధ వారాలకు మండలంలో సగం గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. గురువారం మరికొన్ని గ్రామాలకు విద్యుత్తును అందించారు. అయితే వద్దిరాల, ఆ చుట్టు పక్కల ఉన్న పది గ్రామాలకు గురువారం రాత్రి వరకు విద్యుత్‌ను పునరుద్ధరించలేకపోయారు. పాత రాతి యుగంలోకి ప్రజలు ఇప్పటి యువతరానికి గుర్తు వచ్చినప్పటి నుంచి వరుసగా ఇన్ని రోజులు అంధకారంలో మగ్గిన సందర్భం లేదని వద్దిరాల ప్రజలు వాపోతున్నారు. అసలే ఎండాకాలం.. ఆపై మండుతున్న ఎండలు.. ఓవైపు ఉక్కపోత....మరోవైపు నీటి కొరత.. పనిచేయని ఫ్రిడ్జ్‌లు...తడారుతున్న గొంతులు...చల్లని తాగునీరు సైతం దొరకని పరిస్థితి. ఇన్వర్టర్లు ఉన్న ఇళ్లలో మొదటి రెండు రోజులు సెల్‌ఫోన్ ఛార్జింగ్ అయినా పెట్టుకునే వారు. మొబైల్ ఫోన్లు సైతం మూగబోయాయి. ఎన్నో ఆశలతో ఎదురు చూసినప్పటికీ గురువారం ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కనీసం టీవీల్లో కూడా వీక్షించలేకపోయామని వద్దిరాల యువత చెబుతోంది. నీటి కోసం తప్పని తిప్పలు వద్దిరాల, ఆ పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో బోర్లు అస్సలు పనిచేయడం లేదు. దీంతో తాగునీటి కోసం ట్యాంకర్లలో ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలు జిల్లా ఎర్రగుడి, హనుమంతగుండం గ్రామాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆ నీటి కోసం ఇక్కడి గ్రామాల్లో ప్రజలు గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. కొన్ని గ్రామాల్లో అయితే నేతలు తమ సొంత ఖర్చులతో జనరేటర్లను తెప్పించి బోరు బావుల నుంచి నీటిని తోడుతున్నారు. ఈ నాలుగు రోజులు వివాహాల ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో వారు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరేటర్లకు అధిక డిమాండ్ ఉండడంతో 12 గంటల కాలానికి రూ. 1500 చొప్పున బాడుగ వసూలు చేస్తున్నారు. ట్రాన్స్‌కోలో కొరవడిన సమన్వయం మైలవరం ట్రాన్స్‌కో సిబ్బందికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం పూర్తిగా కొరవడినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకోనట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉన్నారని కర్నూలు జిల్లా నుంచి అదనపు సిబ్బందిని తెప్పించుకుని విద్యుత్ పునరుద్ధరణ పనులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ప్రజలు మాత్రం ఐదు రోజులుగా అం«ధకారంలోనే మగ్గుతున్నారు. తిత్లి తుఫాను, హుద్‌హుద్ తుఫాను లాంటి పెద్ద తుఫాన్లు వచ్చిన సందర్భంలో కూడా కోస్తా ప్రాంతంలో రెండు, మూడు రోజులకే విద్యుత్ పునరుద్ధరణ పనులు జరిగినప్పటికీ చిన్న గాలివానకే ఐదు రోజులపాటు పల్లెలను అంధకారంలో ముంచెత్తిన ఘనత మైలవరం ట్రాన్స్‌కో అధికారులకు దక్కుతుందని వద్దిరాల పరిసర గ్రామాల ప్రజలు అంటున్నారు. కాగా, మైలవరం ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసులును ఈ విషయమై వివరణ కోరేందుకు సాక్షి ప్రతినిధి ప్రయత్నించగా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
విద్యుత్ గోదాములో దొంగలు పడ్డారు
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ‘స్టోర్స్’ అవినీతికి ఆలవాలంగా మారింది. ఇక్కడ ఇంటి దొంగలు కొందరు గుట్టుచప్పుడు కాకుండా ‘దోచుకుంటున్నారు’. కమీషన్లు ఇచ్చిన వారికే విద్యుత్ పరికరాలు పంపిణీ చేస్తున్నారు. కేబుళ్లు మొదలు ట్రాన్స్ఫార్మర్లు, సీటీమీటర్ బాక్సులు, ప్యానల్ బోర్డులు, కండక్టర్లు, డిస్కులు, ఇన్సులేటర్ల వరకు ఏది కావాలన్నా అడిగినంత కమీషన్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే రోజుల తరబడి కాంట్రాక్టర్లు స్టోర్ల చుట్టూ తిరగాల్సిందే. ఈ అంశంపై ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు ఆ శాఖ డైరెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. తాజాగా గురువారం రాత్రి సిటీస్టోర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఖరీదైన మెటీరియల్‌ను ఓ ప్రైవేటు డీసీఎంలో బయటకు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొందరు కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి విద్యుత్ స్టోర్స్(విద్యుత్ పరికరాల నిల్వ, పంపిణీ కేంద్రాలు)అవినీతికి నిలయంగా మారాయి. కేబుళ్లు మొదలు ట్రాన్స్ఫార్మర్లు, సీటీమీటర్ బాక్సులు, ప్యానల్ బోర్డులు, కండక్టర్లు, కాసారాలు, మెటల్పార్ట్స్, డిస్కులు, ఇన్సులేటర్ల వరకు ఏదీ కావాలన్నా అడిగినంత కమీషన్ ఇచ్చుకోవాల్సిందే. లేదంటే సదరు కాంట్రాక్టర్లు స్టోర్ల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఎస్టిమేషన్ ప్రకారం డీడీ రూపంలో బిల్లు చెల్లించినా స్టోర్ నుంచి మెటీరియల్ తీసుకునేందుకు భారీగా ముడుపులు సమర్పించాల్సి వస్తోంది. ఇదే అంశంపై ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు పీ అండ్ ఎంఎం డైరెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఆయన సంబంధిత ఏడీఈని తీవ్ర స్థాయిలో మందలించారు. తాజాగా గురువారం రాత్రి సిటీస్టోర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఖరీదైన మెటీరియల్‌ను ఓ ప్రైవేటు డీసీఎంలో బయటికి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొందరు కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించడం గమనార్హం. ప్రాథమిక విచారణ అనంతరం స్టోర్ ఏఈ యాదయ్యను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత పేరుతో ఆంక్షలు... గ్రేటర్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వాటి పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల నగరశివార్లలో కొత్తగా వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు, వెంచర్లు, పారిశ్రామిక వాడలకు కరెంట్ సరఫరా చేసేందుకు కొత్తగా లైన్లు వేయాల్సి వస్తుంది. కొత్త లైన్లు, భూగర్భకేబుళ్లు, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు వంటి ప్రభుత్వ పనులే కాకుండా, ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, అపార్ట్మెంట్లకు సంబంధించిన వర్కులను ప్రైవేటు కాంట్రాక్టర్లే ఎక్కువగా చేస్తుంటారు. ఇందుకు అవసరమైన మెటీరియల్‌ను గతంలో కాంట్రాక్టరే స్వయంగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేవారు. అయితే కొందరు నాశిరకం మెటీరియల్ వాడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ట్రాన్స్‌కో, బయటి మెటీరియల్‌పై ఆంక్షలు విధించింది. వర్క్ ఎస్టిమేషన్ తర్వాత అందుకయ్యే ఖర్చు మొత్తాన్ని సదరు కాంట్రాక్టర్ డీడీ రూపంలో సంస్థకు చెల్లిస్తేవారికి అవసరమైన మెటీరియల్‌ను డిస్కమే సరఫరా చేస్తుంది. ఇందుకుగాను ఎర్రగడ్డలోని హైదరాబాద్, రంగారెడ్డి స్టోర్లను ఏర్పాటు చేసింది. ఒక్కో మెటీరియల్‌కు ఒక్కో రేటు... ఇలా కొత్తలైన్లకు సంబంధించి ఎలాంటి విద్యుత్ మెటీరియలైనా ఇక్కడి నుంచి సరఫరా కావాల్సిందే. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ఇంజనీర్లు ఒక్కో మెటీరియల్‌కు ఒక్కో రేటు నిర్ణయించారు. ఎవరైనా కాంట్రాక్టర్ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎలక్ట్రిక్ స్టోర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ తీసుకువెళ్లాలంటే...ఎస్టిమేషన్ ఖర్చులు మొత్తం డీడీ రూపంలో చెల్లించిన తర్వాత కూడా స్టోర్ ఇంజినీర్లకు అదనంగా ముడుపులు చెల్లించాల్సి వస్తుంది. ఏడీఈకి రూ.1000, ఏఈకి రూ.500, హమాలీకి రూ.500 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఇక ట్రాన్స్‌ఫోర్ట్ ఛార్జీలు అదనం. ఒక ట్రాన్స్ఫార్మర్ పొందాలంటే అదనంగా రూ.7నుంచి రూ.10వేల వరకు ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తుంది. దీనికితోడు తూకంలోనూ మోసాలు తప్పడం లేదు. 100కేజీల కండక్టర్‌కు డీడీ చెల్లిస్తే...90 కేజీలే ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక చిన్నచిన్న ఫిన్ ఇన్సులేటర్లు, డిస్క్‌లు, వాటికి అమర్చే మెటల్ పార్ట్స్‌ను కూడా ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారు. ఇలా మిగిల్చిన మెటీరియల్‌ను గుట్టుచప్పుడు కా కుండా బయటికి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటి దొంగల పనే.. అమీర్‌పేట: ఎర్రగడ్డ జీటీఎస్ కాలనీలోని ఎలక్ట్రికల్ స్టోర్స్ పనిచేసే ఉద్యోగి రూ.లక్షల విలువైన సామాగ్రిని కాజేసేందుకు యత్నించాడు. దీనిని గుర్తించిన మరో ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమై ఆయన బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సామగ్రిని తరళిస్తున్న వాహనాన్ని పట్టుకుని ఎస్ ఆర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కాగా అక్రమంగా మెటీరియల్ తరలిస్తున్న డీసీఎంపై టీఎస్ఎస్పీడీ సీఎల్ అని రాసి ఉండగా సదరు వాహనానికి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తేలడం గమనార్హం. సిటీ ఎలక్ట్రికల్ స్టోర్స్‌లో డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏడీ)తో పాటు మరో ఇద్దరు ఏఈలు కిందిస్థాయి సిబ్బంది పనిచేస్తుంటారు. ఏఈ యాదయ్య గురువారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా డీసీఎంలో సుమారు రూ.3 లక్షల విలువైన మెటీరియల్‌ను ఎలాంటి పేపర్లు లేకుండానే బయటికి తరలించాడు. దీనిని గుర్తించిన మరో ఉద్యోగి ఉన్నత అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో సదరు డీసీఎం బాలానగర్ వైపు వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు దానిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్టోర్స్ ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదలీ చేశారు. ఏడీ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ అజేయ్‌కుమార్ తెలిపారు. ఏఈ యాదయ్యతో పాటు ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. వాహనం డ్రైవర్ నర్సింహ, మరో వ్యక్తి వెంకటేష్‌లను అదుపు లోకి తీసుకున్నట్లు తెలిపారు. -
కట్టె పూడ్చుకో.. కనెక్షన్ తీసుకో!
అనంతపురం సిటీ: పేదవారు విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారు. అదే బడా బాబులు దరఖాస్తు చేసుకుంటే మాత్రం మామూళ్లు తీసుకుని యథేచ్ఛగా కనెక్షన్లు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్టిమేషన్ లేకపోయినా ఏకంగా కట్టెలు పూడ్చి కనెక్షన్లు ఇచ్చేస్తున్నారంటే విద్యుత్‌శాఖలో ఈ దందా ఏ మేరకు సాగుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ దందా ద్వారా జిల్లా వ్యాప్తంగా సంవత్సరానికి ఏకంగా రూ.50 నుంచి రూ.60 కోట్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కిందిస్థాయి నుంచి ఉన్నత స్ధాయి వరకూ వాటాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో ఏడీ స్థాయి అధికారులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. చేయాల్సింది ఇలా... సాధారణంగా ఒక ఇంటికి గానీ షాపింగ్ కాంప్లెక్స్‌కి గానీ విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటికి అయితే రూ.1,450, షాపింగ్ కాంప్లెక్స్‌కి అయితే రూ.3,200 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగానే దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ను తయారు చేయాలని ఏఈని ఆదేశిస్తారు. ఏఈ గానీ, లైన్ ఇన్స్పెక్టర్ గానీ వెళ్లి దరఖాస్తుదారుని ఇంటికి ఎన్ని స్తంభాలు పడతాయి? కేబుల్ వేయాలా, కండెక్టర్ వేయాలా అన్న విషయాన్ని ఎస్టిమేషన్ వేసి ఏడీకి అందజేయాల్సి ఉంటుంది. ఏడీ తిరిగి దాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుని అనుమతి నిమిత్తం దాన్ని డీఈ, ఎస్ఈలకు పంపాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ అనంతరం దరఖాస్తుదారుడు డీడీ రూపంలో డబ్బు చెల్లించిన తర్వాత కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నిబంధనలను తుంగలో తొక్కి మామూళ్లు తీసుకుని బడా బాబులకు ఇష్టారాజ్యంగా కనెక్షన్లు ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కోచోట కొద్ది కొద్ది దూరంలో ఆరేడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఇక అధికారులకు పండగే. ఆయా ఇళ్ల యజమానులను పిలిపించి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లేకుంటే పని జరగదని అందుకు కాస్త ఆలస్యమవుతుందని, కాబట్టి నలుగురూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని చెబుతున్నట్లు తెలిసింది. అయితే డీడీ కట్టే సమయంలో సైతం ఎస్టిమేషన్ ఎక్కువ అవుతుందని... ఇక మీరే తేల్చుకోండని నిర్ణయాన్ని ఇంటి యజమానులకే వదిలేస్తారు. ఎక్కువ ఎస్టిమేషన్ చూపి ఇంటి యజమానుల ద్వారా లంచాలు తీసుకుని కట్టెలతో పని కానిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఏడాదికి దాదాపు రూ.50 నుంచి 60 కోట్లు మామూళ్లుగా అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు ఇలా ఇచ్చిన కనెక్షన్ల కారణంగా జిల్లాలో ఇప్పటి వరకూ దాదాపు 62 శాతానికి ఎస్టిమేషన్లే లేవని ఆ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికైనా కలెక్టర్ చర్య తీసుకుని ఈ మామూళ్ల దందాకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. నీటి సాకుతో బేరం షురూ... గతంలో ఇంటి యజమాని దగ్గరుండి నిర్మాణాలను చేపట్టేవారు. ప్రస్తుతం కొంత సొమ్మును కాంట్రాక్టరుకు చెల్లించి నిర్ణీత కాల వ్యవధిలో ఇంటిని నిర్మించి ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు నీరు అవసరం గనుక వెంటనే విద్యుత్ కనెక్షన్ వేయించాలని యజమానిని కోరుతాడు. ఇక్కడి నుంచే అసలు దందా మొదలవుతోంది. యజమాని దరఖాస్తు చేసుకోగానే లైన్ ఇన్స్పెక్టర్ లేదా ఏఈ వెళ్లి ఎస్టిమేషన్ వేసి ఏడీ పరిశీలన, డీఈ, ఎస్ఈల అనుమతికి కావాల్సిన స్తంభాలు రావడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని బెదరగొడుతున్నట్లు సమాచారం. దీంతో విద్యుత్ కనెక్షన్ లేని కారణంగా నీరు లేకపోతే నిర్ణీత సమయానికి ఇంటి నిర్మాణం పూర్తి కాదని భావించి యజమాని ఎంతైనా చెల్లించడానికి సిద్ధపడతాడు. దీన్ని అవకాశంగా తీసుకుని అధికారులు ఒక్కొక్కరి నుంచి రూ.40 నుంచి రూ.లక్ష వరకూ తీసుకుని బడాబాబుల ఇళ్లకు నిబంధనలకు విరుద్ధంగా కట్టెలను పూడ్చి కనెక్షన్‌ను ఇచ్చేస్తున్నారని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అధికారులు ఈ తంతును కొనసాగిస్తున్నట్లు సమాచారం. -
అకాల వర్షం..పంటకు నష్టం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ.. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులతో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఈదురు గాలులకు మామిడి, జీడిమామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలు చోట్ల కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్క జొన్న పంట తడిసి ముద్దయ్యింది. ఈదురు గాలులకు కొన్ని గ్రామాల్లోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిడదవోలు–బ్రాహ్మణగూడెం రహదారిలో తాటిచెట్టు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చాగల్లులో ఐదు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలగా..కొవ్వూరు మండలంలోని పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆరికిరేవుల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ఈదురు గాలులకు నేలకూలింది. కృష్ణా జిల్లాలో.. పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జాతీయ రహదారి పక్కనే చెట్లు కూలిపడ్డాయి. నందిగామ శివారు అనాసాగరంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మామిడికాయలు రాలిపోయాయి. దాళ్వా రైతులు ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మైలవరం, మచిలీపట్నంలో కొద్ది పాటి వర్షం పడింది. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ, మాచర్ల, రెంటచింతల, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. పల్నాడు ప్రాంతంలో కల్లాల్లో మిర్చి ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. మాచర్ల ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పాలకొండలో వడగళ్ల వాన.. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వడగళ్ల వాన కురిసింది. కాగా, ఇప్పటి వరకు మండుటెండలతో విలవిల్లాడిన జనాలు ఈ వర్షంతో కొంతమేర ఊరట చెందారు. -
తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. టీఎస్ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేయడంలో దేశంలోనే ఇతరులకన్నా ముందున్న తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం మింట్ కాంపౌండ్‌లో ఆ విభాగం ప్రధాన అధికారి ఏజీ రమణప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. ‘నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లైసెన్స్’ను పొంది న తొలి రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి చేతుల మీదుగా ఇటీవలే ఈ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ఈ తరహా లైసెన్స్ తెలంగాణలోని ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇప్పటి వరకు పొందలేదన్నారు. కేవలం ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయానికే కాకుండా నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌సిటీ, నిజామాబాద్ కార్యాలయాలకు కూడా ఈ గుర్తింపు దక్కిందని స్పష్టం చేశారు. తెలం గాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆన్లైన్ విధానం అమలు చేయడం, టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సకాలంలో అనుమతులు జారీ చేయడం, విద్యుత్ వినియోగం, ప్రమాదాల నివారణ, నిర్దేశిత సమయంలోనే పరిశ్రమలకు కనెక్షన్లు మంజూరు చేయడం, ధ్రువీకరణ పత్రాల జారీ వంటి విషయంలో దేశంలోనే తెలంగాణ విద్యుత్ తనిఖీశాఖ ముందుందని, సీఎం కేసీఆర్ చొరవ, ఉద్యోగుల సమష్టికృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సమర్థంగా పరిశీలించినందుకు గుర్తింపుగా గతేడాది జనవరిలో అత్యుత్తమ ప్రదర్శన అవార్డు దక్కిందని, ఎత్తైన భవనాల్లో భద్రతను పెంచడంలో కృషిచేసినందుకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇటీవలే బహుమతిని ఇచ్చి సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
ముగిసిన గడువు..నెరవేరని లక్ష్యం
నల్లగొండ: గడువు ముగిసింది... కానీ లక్ష్యం నెరవేరలేదు. ఓ పక్క నిధుల కోసం ఆరాటపడుతుంటే.. మరోపక్క వచ్చిన నిధులను కూడా సవ్యంగా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో జిల్లా విద్యుత్‌శాఖ ఉంది. కేంద్రప్రభుత్వం గత ఏప్రిల్ మాసంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో లోఓల్టేజీ సమస్యతోపాటు పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త లైన్ల ఏర్పాటు, పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఐపీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం) కింద రూ. 32కోట్లను మంజూరు చేసింది. గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో నిధులు మంజూరు చేసి వాటిని అదే ఏడాది 2018 నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది. గడువు ముగిసినా పనులు పూర్తి కాలేదు. పట్టణీకరణ పెరుగుతుండడంతో అందుకనుగుణంగా విద్యుత్పనులు మెరుగుపర్చడం, లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు కొత్త సబ్ స్టేషన్లు, పెరిగిన కాలనీల్లో కొత్త లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఐపీడీ పథకాన్ని చేపట్టింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల్లో వివిధ పనులు చేపట్టేందుకు రూ. 32 కోట్లు మంజూరు చేసింది. గత ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా అవి నేటికీ పూర్తి కాలేదు. నల్లగొండ టౌన్లో... నల్లగొండ పట్టణంలో మొత్తం 13 పనులు మంజూరయ్యాయి. అందుకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ ఒకటి మంజూరు కాగా దాన్ని పూర్తి చేశారు. 33 కేవీ లైన్లు పట్టణంలో మూడు మంజూరైతే అవి ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. మూడు లైన్లు, 33 కేవీ బ్రేకర్లు ఒకటి మంజూరు కాగా, వాటిని నేటి వరకు పూర్తి చేయలేదు. బైఫరికేషన్ ఆఫ్ 11 కేవీ ఫీడర్స్ ఆరు పనులు మంజూరు కాగా, ఇప్పటికి రెండు మాత్రమే పూర్తయ్యాయి. మరో 4 పనులు కొనసాగుతున్నాయి. ఎక్స్టెన్షన్ 11 కేవీ బ్రేకర్ 1, 11 కేవీ ఫీడర్స్ ఆగ్మెంటేషన్ పనులు కొనసాగుతున్నాయి. 160 కేవీ పనులు 10లో సగం పూర్తయి, సగం కొనసాగుతున్నాయి. డీ 100 కేవీఏ పనులు 80 పూర్తి కాగా, 100 నుంచి 160 కేవీ మార్పు పనులు పూర్తయ్యాయి. డీ63 నుంచి 100 కేవీఏ పనులు 20 మంజూరు కాగా, 3 మాత్రమే పూర్తయ్యాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 3ఫేస్ 5 వాల్ట్లైన్లు 50 మంజూరైతే 15 మాత్రమే పూర్తయ్యాయి. ఎల్టీ లైన్ల బైఫరికేషన్ 15 మంజూరు కాగా 5 పూర్తయ్యాయి. ఎల్టీ లైన్ల ఆగ్మెంటేషన్ 5 పనులకు 5 ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్టీ లైన్లు 1ఫేజ్ 2వాల్ట్స్ నుంచి 3ఫేజ్ 5వాల్ట్స్ పనులు 15 పనులకు 15 పనులు పూర్తి చేశారు. కెపాసిటర్ బ్యాంకులు 5, 11 కేవీ ఎక్ఎల్పీఈ ఏరియల్ బంచ్డ్ కేబుల్ 10, ఎల్టీఎల్పీఈ ఏరియల్ బంచ్డ్ కేబుల్ 70 ఎస్‌క్యూఎంఎం, 150 రూఫ్ సోలార్ ప్రాజెక్టులు, మీటరింగ్ ఫీడర్స్ 10, మీటరింగ్ డీటీఆర్‌ఎస్ 200, మీటరింగ్ కంజ్యూమర్స్ 2వేలు మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు 265 మంజూరు కాగా వాటిని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించని పరిస్థితి. దేవరకొండలో... దేవరకొండ పట్టణంలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ బ్రేకర్లు, కొత్తగా 33 కేవీ లైన్లు 5, 11కొత్తగా 11 కేవీ ఫీడర్లతో పాటు 11 కేవీ బ్రేకర్లను ఎక్స్టెన్షన్ చేసేందుకు మరో రెండు మంజూరు చేసినా అవి పురోగతిలోనే ఉన్నాయి. 11 కేవీ ఫీడర్స్ ఆగ్మెంటేషన్ పనులు ఐదు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా ఎల్టీ లైన్లు 30 మంజూరు కాగా 22 పూర్తయి 8 పురోగతిలో ఉన్నాయి. 20ఎల్టీ లైన్ల బైఫరికేషన్‌లో 5 పనులు మాత్రమే పూర్తి కాగా ఆగ్మెంటేషన్ ఆఫ్ ఎల్టీ లైన్ 5, కన్వర్షన్ ఆఫ్ ఎల్టీలైన్ ఫేజ్ 2 నుంచి 5ఫేజ్ 5వాల్ట్స్ పనులకు మార్పు పనులు పురోగతిలో ఉన్నాయి. ఎల్టీఎస్పీఈ ఏరియల్ బంచ్డ్ కేబుల్ 70ఎస్‌క్యూఎంఎం పనులు 5, 11 కేవీ అండర్‌గ్రౌండ్ పనులు రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులు 40 ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మిగిలిన పనులు 80 శాతం పూర్తయ్యాయి. మిర్యాలగూడలో.. మిర్యాలగూడ పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 2 మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 33 కేవీ లైన్లు 10 మంజూరైతే మూడే పూర్తయ్యాయి. 10 బైఫరికేషన్ ఆఫ్ 11 కేవీ ఫీడర్స్ మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అదే విధంగా ఎక్స్టెన్షన్ విత్ 11 కేవీ బ్రేకర్లు 2, 11 కేవీ ఫీడర్స్ ఆగ్మెంటేషన్ పనులు 5 ఏవీ కూడా పూర్తి కాలేదు. డీ100 కేవీఏ పనులు 30, ఎ100 నుంచి 160 కేవీఏ పనులు 90 శాతం పూర్తయ్యా యి. అందులోని మరికొన్ని పనులు 20శాతం కూ డా పూర్తి కాలేదు. ఎల్టీ లైన్లకు సంబంధించి కొత్త ఎల్టీ లైన్లు, బైఫరికేషన్ ఎల్టీ లైన్లు, ఆగ్మెంటేషన్ ఆఫ్ ఎల్టీ లైన్లు, కన్వర్షన్ ఆఫ్ ఎల్టీ లైన్లు, 1 ఫేజ్ 2వాల్ట్స్ నుంచి 3ఫేజ్ 5వాల్ట్స్కు సంబంధించిన 10 పనులు ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. కెపాసిటర్ బ్యాంక్ పనులు 5, 11 కేవీ ఎక్స్ఎల్పీఈ ఏరియల్ బంచ్డ్ కేబుల్ 10, అందులోనే బంచ్డ్ కేబుల్ 70 ఎస్క్యూ ఎంఎం పనులు 10, 11 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులు 2, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులు 30, 89 ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపు పనులు కూడా కాలేదు. కొన్ని ప్రారంభమై పనులు కొనసాగుతుండగా, మరికొ న్ని నేటికీ ప్రారంభంకాని పరిస్థితి నెలకొంది. ఇచ్చిన నిధులు ఖర్చు చేస్తేనే... కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాల అభివృద్ధికి అయితే నిధులు కేటాయిస్తుందో వాటిని గడువులోగా పూర్తి చేయాలి. అప్పుడే తిరిగి ఆ రాష్ట్రాలకు కొత్తగా వచ్చే స్కీములను ఇచ్చేందుకు సుముఖత చూపుతారు. అధికారులు జిల్లాకు మంజూరైన వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అసంపూర్తిగా ఉన్న పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ గడువులోపు పూర్తవుతాయో..లేవో చూడాలి. -
మరో హామీ కాపీ!
సాక్షి, అమరావతి: రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు హామీని అమలు చేయకుండా కాలయాపన చేసిన టీడీపీ సర్కారు రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో మరో మోసానికి తెర తీసింది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అందించే కరెంట్ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని జీవోలో పేర్కొనలేదు. ఏడాదిన్నర క్రితమే హామీ ఇచ్చిన జగన్ తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతులందరికీ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తామని ఏడాదిన్నర కిత్రమే వైఎస్సార్ సీపీ ప్లీనరీ సందర్భంగా ప్రకటించిన నవరత్నాల పథకాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 2009 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు కొత్తగా రెండు హామీలు మాత్రమే ఇచ్చి తిరిగి అధికారంలోకి రావడం తెలిసిందే. అప్పట్లో ఆయన ఇచ్చిన రెండు కొత్త హామీల్లో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఒకటి. అయితే ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే ఆయన అకాల మరణం చెందడంతో ఆ హామీని అమలు చేయలేకపోయారు. తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ముఖ్యమంతులు ఆ హామీని నెరవేర్చలేదు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈమేరకు ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న లక్ష్యంతో 2017 జూలైలో వైఎస్సార్ సీపీ ప్లీనరీ సందర్భంగా రైతులకు 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత ప్రకటన చేసిన తర్వాత ఏడాదిన్నర దాని గురించి ఏమాత్రం ఆలోచించని టీడీపీ సర్కారు ఎన్నికలు రావడంతో హడావుడి చర్యలకు ఉపక్రమించింది. ఎంబీసీలకు వంద యూనిట్లు ఉచితం దారిద్రరేఖకు దిగువన ఉండే అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ)కు చెందిన కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు ఆమోదం తెలుపుతూ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక మరో ఉత్తర్వు జారీ చేశారు. రజకుల లాండ్రీ షాపులకు 150 యూనిట్ల వరకు, నగల తయారీ వృత్తిదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను బీసీ సంక్షేమ శాఖ విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. -
గ్రేటర్లో వీధిదీపాల వెలుగులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ వెలిగిపోతోంది. నగరంలో గల 4,19,500 ఎల్ఈడీ లైట్లన్నింటిని పూర్తిస్థాయిలో వెలిగేలా జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ సత్ఫలితాలిచ్చింది. దాదాపు 98 శాతం వీధిలైట్లు వెలుగుతున్నాయి. నగరంలో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని ఫిర్యాదులను జీహెచ్ఎంసీ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీలో కూడా ఇదే సమస్యను సభ్యులు లేవనెత్తారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 4,19,500 స్ట్రీట్ లైట్లన్నింటిని తనిఖీ చేసి ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో, ఎన్ని వెలగలేదో అనే అంశంపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం, ఎల్ఈడీ లైట్లను చేపట్టిన ఈఈఎస్ఎల్ సంస్థను కమిషనర్ ఎం.దానకిషోర్ ఆదేశించారు. గత వారం జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం ఇంజనీర్లు, ఈఈఎస్ఎల్ అధికారులు సంయుక్తంగా నగరంలోని విద్యుత్ దీపాలపై సునామీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 20,450 లైట్లు వెలగడంలేదని గుర్తించారు. స్ట్రీట్ లైట్లను మానిటరింగ్ చేసేందుకు 26,000 కమాండ్ కంట్రోల్ స్విచ్ సిస్టమ్ (సీసీఎంఎస్)లకుగాను 25,860 పనిచేస్తున్నట్టు గుర్తించారు. నగరంలో 35 వాట్స్, 75 వాట్స్, 110 వాట్స్, 190 వాట్స్ గల వీధిదీపాలు ఉన్నాయి. వంద శాతం... నగరంలో వంద శాతం స్ట్రీట్ లైట్లు వెలిగేలా చర్య లు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, అడిషనల్ కమిషనర్ శృతిఓజాలు జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ఇంజనీర్లు, ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, కాంట్రాక్టర్లతో ఇటీవల సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ వెలగని 20,450 స్ట్రీట్ లైట్లను గుర్తించి సోమ, మంగళ, బుధవారాల్లో కొత్త లైట్ల ఏర్పా టు, విద్యుత్ లైన్లలో లోపాలను సవరించడం, స్ట్రీట్ లైట్ల మానిటరింగ్ చేసే సీసీఎంఎస్ బాక్స్‌లను పునరుద్ధరించడం, ప్రతిరోజు జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం సిబ్బంది, ఇంజనీర్లు తనిఖీలు చేపట్టడంతో రికార్డు స్థాయిలో 98 శాతం దీపాలు గ్రేటర్ హైదరాబాద్‌లో వెలుగులు పంచుతున్నా యి. కేవలం అధికారులు అందించిన లెక్కలపైనే ఆధారపడి ఉండకుండా తమ ప్రాంత ంలో లైట్లన్నీ పూర్తిస్థాయిలో వెలుగుతున్నాయని, సంబ ంధిత వార్డుకు చెందిన కార్పొరేటర్ చే లిఖితపూర్వకంగా లేఖలను స్వీకరిస్తున్నారు. సీసీఎం ఎస్ బోర్డులు కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం తో హైదరాబాద్ నగరంలో వెలిగే లైట్ల వివరాలన్నిం టిని నగరవాసులు తమ మొబైల్లో కూడా స్వయ ంగా తెలుసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎల్ఈడీ లైట్ల అతిపెద్ద కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్‌లో సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో 4.20 లక్షల ఎల్ఈడీ లైట్లను అమర్చే అతిపెద్ద ప్రక్రియ 2017 జూలై మాసంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా జీహెచ్ఎంసీ చేపట్టింది. స్ట్రీట్ లైట్లు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 4,20,000 విద్యుత్ దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చడం ద్వారా సంవత్సరానికి 162.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.115.13 కోట్ల విద్యు త్ బిల్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. దీంతో పాటు సంవత్సరానికి 1,29,719 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కూడా తగ్గనుంది. -
‘పవర్’పై పన్ను!
ఖమ్మంమయూరిసెంటర్: విద్యుత్ వినియోగదారులపై పిడుగు పడింది. వస్తు సేవా పన్ను(జీఎస్టీ) రూపంలో ప్రభుత్వం భారం మోపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీని విద్యుత్ మీటర్లపై కూడా వసూలు చేస్తోంది. పల్లె, పట్నం, పేద, ధనిక తారతమ్యం లేకుండా అన్ని వర్గాలకు 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. కొత్త మీటర్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగానే 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే.. లేదంటే వారి దరఖాస్తుకు మోక్షం కలగదు. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి వినియోగదారులపై వస్తు సేవా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి నెల నుంచి వినియోగదారులకు వేసే విద్యుత్ బిల్లులో వస్తు సేవా పన్నును కలుపుతున్నారు. అలాగే కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వారికి ఫిబ్రవరి బిల్లులో జీఎస్టీని కూడా కలిపి వడ్డించారు. ఇన్నాళ్లూ విద్యుత్ శాఖకు మినహాయింపు ఉందనుకుని జీఎస్టీ వసూలు చేయని విద్యుత్ సంస్థ.. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి వసూలు చేయబోతోంది. జీఎస్టీ అమలైన సమయంలో విద్యుత్ శాఖకు మినహాయింపు అవకాశం ఉంటుందనే సమాచారంతో విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేయలేదు. జిల్లావ్యాప్తంగా 2017, జూలై 1 నుంచి 2018, డిసెంబర్ 31వ తేదీ వరకు కొత్తగా 18,322 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. వారికి ఇన్నాళ్లూ కొత్త కనెక్షన్లు తీసుకోవడంపై జీఎస్టీ విధించలేదు. వాళ్లందరికీ ఫిబ్రవరి నెల విద్యుత్ బిల్లులో జీఎస్టీని జమ చేశారు. బిల్లుతోపాటు మరో 18 శాతం పన్ను వసూలు చేయబోతున్నారు. పన్ను ఇలా.. గృహ వినియోగం కోసం తీసుకున్న 240 వాట్స్ సామర్థ్యానికి రూ.108, వెయ్యి కిలోవాట్స్ సామర్థ్యమున్న వాటికి రూ.216, వాణిజ్య కనెక్షన్లలో కిలో(1000) వాట్స్ సామర్థ్యమున్న వాటికి రూ.225 చొప్పున అదనంగా ఈ నెల బిల్లులో వేశారు. మీటరు సామర్థ్యం పెరిగేకొద్దీ రుసుము పెరుగుతూ పోతుంది. జిల్లావ్యాప్తంగా రూ.75,17,000 వినియోగదారులపై సేవా పన్ను భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద నామమాత్రపు రుసుముతో ఇస్తున్న కనెక్షన్లకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. 2017, జూలై 1వ తేదీ నుంచి 2018, డిసెంబర్ 31 వరకు జిల్లాలో వినియోగదారులు 18,322 కొత్త కనెక్షన్లు తీసుకున్నారు. ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫిబ్రవరి విద్యుత్ బిల్లులో జీఎస్టీని జమ చేశాం. ఇందులో శాఖాపరంగా ఎలాంటి ప్రమేయం లేదు. వినియోగదారులు ఉపయోగిస్తున్న విద్యుత్ సామర్థ్యాన్నిబట్టి జీఎస్టీ ఉంటుంది. జూలై 2017 నుంచి కొత్త కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ఫిబ్రవరి బిల్లులో జీఎస్టీని కలిపి బిల్లు వేస్తాం. – కె.రమేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ, ఖమ్మం సర్కిల్ -
ఏ జంతువు వేటకు బలి కావొద్దు..
సాక్షి, హైదరాబాద్: అటవీప్రాంతాల్లో విద్యుత్ తీగలను అమర్చి జంతువులను వేటాడటం ఎక్కువవుతున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో అక్రమ విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపేయాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించింది. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పోలీ సు, అటవీ, ఎక్సైజ్, విద్యుత్ శాఖాధికారులు ఉమ్మడి పరిశీలన చేసి, అక్కడి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అటవీ, జంతు సంరక్షణ, పోలీసు, ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్ తదితర చట్టాలు అమలవుతున్నాయా.. లేదా... అన్న విషయాన్ని పర్యవేక్షించే నిమిత్తం ఓ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ ప్రాంతంలో ఏ జంతువు కూడా అక్రమ వేటకు బలి కాకుండా చూడాలని తేల్చి చెప్పింది. ఆ దిశగా ఆలోచించండి.. కవ్వాల్, ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేం ద్రాల్లో స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పా టు, ఆయుధాలు ఉపయోగించడంలో కేంద్రం తగిన సహకారాన్ని అందించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా శిక్షణ పొందిన ఫారెస్ట్ గార్డులు, ఇతర అటవీ సిబ్బంది ఆయుధాలను ఉపయోగించేందుకు అనుమతినిచ్చే విషయా న్ని హైకోర్టు పరిశీలించాలంది. ఈ వ్యాజ్యంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎక్సైజ్ కమిషనర్, టీఎస్‌ఎన్‌పీడీసీ ఎల్ చైర్మన్, ఎండీలను ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై కేంద్ర అటవీ శాఖ, జాతీయ పులుల సంరక్షణ సంస్థ అభిప్రాయాలను రెండు వారా ల్లో తమ ముందుంచాలని అసిస్టెంట్ సొలి సిటర్ జనరల్(ఏఎస్జీ)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కవ్వాల్ కేంద్రంలో పులుల సంరక్షణ పథకాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాగిర్ దియా సుర్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విద్యుత్లైన్లకు ఇన్సులేషన్ మేలు.. ధర్మాసనం గత ఆదేశాల మేరకు.. ఈ కేసులో సహకరించేందుకు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా, కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఫీల్డ్ డైరెక్టర్ సి.శరవణన్ కోర్టు ముందు హాజరయ్యారు. జంతువుల అక్రమ వేటకు విద్యుత్ తీగలను ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టే విషయంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. విద్యుత్ సరఫరా లైన్లకు ఇన్సులేషన్ చేయడం వల్ల ఫలితం ఉంటుందని అటవీ శాఖాధికారులు సూచించగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖా ధికారులను కోర్టు ఆదేశించింది. కవ్వాల్ పులుల సంరక్షణ విషయంలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ ఇప్పటికే తగిన సహాయ, సహకారాలు అందిస్తోందని ఏఎస్జీ కె.లక్ష్మణ్ చెప్పారు. డ్రోన్ల సాయం తో జంతువుల వేటను అడ్డుకోవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కోర్టుకు చెప్పారు. కవ్వాల్, ఇతర వ్యవహారాలను ఫీల్డ్ డైరెక్టర్ పరిధిలోకి తీసుకు రావాలని కోర్టు స్పష్టం చేసింది. -
50 ఏళ్లుగా వెలుగులు పంచుతూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారంతో విద్యుత్ శాఖలో 50 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. 1969 జనవరి 10న ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్ఈబీ)లో ఉద్యోగప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కీలక హోదాల్లో సేవలందించారు. విద్యుత్ రంగంలో ఆయన సేవలు, విశేషానుభవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో.. రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ అధికారులు కాదని ఈ పదవిని ఏరికోరి ప్రభాకర్ రావుకు కట్టబెట్టారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను అధిగమించి 24 గంటల విద్యుత్ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యవసాయానికి తొలుత 9 గంటల నిరంతర విద్యుత్, ఆ తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా వంటి కేసీఆర్ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయడంలో సఫలమయ్యారు. రాష్ట్రంలో కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు మొత్తం విద్యుత్ శాఖను పరుగులు పెట్టించారు. రికార్డు సమయంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు, సబ్–స్టేషన్లు, లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పీజీసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రశంసలు అందుకున్నారు. విద్యుత్ రంగంలో చేసిన విశేష కృషికి గానూ.. గతేడాది ఎకనమిక్ టైమ్స్, సీబీఐపీ, స్కోచ్ పురస్కారాలను అందుకున్నారు. 2017లో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఫర్ ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుత్ రంగంలో విశేష కృషికి గానూ 2016లో బూర్గుల రామకృష్ణారావు పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ పవర్ యుటిలిటీస్ 2013లో ఆయనకు ఇండియా పవర్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ కేక్‌ను ఆయనతో కట్ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొని ఆయన్ను అభినందించారు. -
భవనాలపై ‘విద్యుత్’ నిఘా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ముప్పై ఏళ్ల క్రితమే అపార్ట్మెంట్ కల్చర్ మొదలైంది. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి . విద్యుత్ భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు ఓ స్పష్టమైన విధివిధానాలు అంటూ ఏమీ లేకపోవడం, నాసిరకం వైరింగ్ పనులతో కొనుగోలు దారులు నష్ట పోవాల్సి వస్తుంది. తరచూ షార్ట్సర్క్యూట్లు వెలుగు చూడటమే కాకుండా ఇంట్లో విలువైన గృహోపకరణాలు, వాణిజ్య సముదాయాల్లోని విలువైన వస్తువులు దగ్ధం అవుతుండటంతో పాటు ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి నష్టాలకు చెక్ పెట్టాలని తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టరేట్ భావించింది. ఆ మేరకు విద్యుత్ భద్రత కోసం పలు విధివిధానాలు కూడా రూపొందించింది. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తు, 650 ఓల్టేజ్‌ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్ మంజూరు విషయంలో ఈ విధివిధానాలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తనిఖీల బాధ్యత చార్టెడ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇంజనీర్స్కు ప్రస్తుతం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న గృహ, వాణిజ్య సముదాయాలు...650 వోల్టేజ్ కన్న ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్న భవనాల్లో విద్యుత్ భద్రతను తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ పరిశీలిస్తుంది. విద్యుత్ డిమాండ్, ఎంపిక చేసుకున్న లోడు, విద్యుత్ లైనింగ్, వైరింగ్ కోసం ఉపయోగించిన కేబుల్స్, స్విచ్ బోర్డుల ఎంపిక, ఫీజు బాక్స్‌లు, ఎర్తింగ్ వంటి అంశాలను పరిశీలించి...పూర్తి భద్రత ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ఆయా భవనాలకు నో అ బ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ జారీ చేసిన ధృవీకరణ పత్రం ఆధారంగానే డిస్కం ఆయా భవనాలకు విద్యుత్ మీటరు జారీ చే స్తుంది. 650 కంటే తక్కువ ఓల్టేజ్ వాడే మధ్య తరహా భవనాలను తనిఖీ చేయకపోవడంతో బిల్డర్లు నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు నాసిరకం కేబుళ్లను వాడుతున్నారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోకపోవడం....సామర్థ్యానికి మించిన విద్యుత్ వాడుతుండటం వల్ల విద్యుత్ వేడికి కేబుళ్లు దగ్ధమవుతున్నాయి. షార్ట్‌సర్క్యూట్‌లకు కారణమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని భారీ నష్టాలు వాటిళ్లుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇ వ్వకూడదని తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ భావించింది. ఆ మేరకు తక్కువ ఎత్తులో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లో తనిఖీ బాధ్యతను చార్టె డ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇంజనీర్స్కు అప్పగించడం ద్వారా విద్యుత్ భద్రతను మెరుగుపర్చవచ్చని యోచిస్తుంది. షార్ట్సర్క్యూట్లు నివారించేందుకే నగరంలో లక్షల సంఖ్యలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలను తనిఖీ చేయడం కేవలం ఒక చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కావడం లేదు. ఇక్కడ అవసర మైన సిబ్బంది లేకపోవడం కారణం. ఉన్నవాళ్లపై కూడా పని భారం పెరుగుతోంది. తక్కువ ఎత్తులో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల తనిఖీ బాధ్యతను చార్టెడ్ సేఫ్టీ ఇంజనీర్ ఏజెన్సీకి అప్పగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. వైరింగ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పెంచడం ద్వారా విద్యుత్ షార్ట్ స ర్క్యూట్‌ల జరిగే అగ్నిప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు అవకాశం ఉంది. ఒక వేళ ఈ పత్రాలు జారీ చేసే విషయంలో ఎవరైనా చార్టెడ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇంజనీర్ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే..అట్టి ఇంజనీరు లైసెన్సును రద్దు చేసే అధికారం చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ కు ఉంటుంది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఇది ఒక ప్రైవేటు ఏజెన్సీ మాత్రమే. వీరు ఇచ్చిన సర్టిఫికెట్‌పై విద్యుత్ అధికారులు సంతృప్తి చెందిన తర్వాతే కనెక్షన్ జారీచేస్తా రు. – ఏజీ రమణప్రసాద్,చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ -
విద్యుత్‌శాఖలో ఆకలి కేకలు
విజయనగరం మున్సిపాలిటీ: విద్యుత్ శాఖలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చేసిన పనికి జీతాలు అందక అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 6,49,405 సర్వీసులకు సేవలందించడంలో తమ వంతు పాత్రపోషిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా జీతాలు అందడంలేదు. ప్రశ్నిస్తే విధుల నుంచి తొలగిస్తారన్న భయంతో ఎవ్వరికీ చెప్పుకోలేక ఆత్మక్షోభ అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కాలంగడుపుతున్నారు. మరో నాలుగు రోజుల వ్యవధిలో ప్రారంభం కానున్న వరుస పండుగల నేపథ్యంలో ఈ నెలైనా జీతాలు అందుతాయో లేదో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదీ పరిస్థితి... ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషషన్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో 32 మంది కంప్యూటర్ ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వి«ధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ సంస్థపరిధిలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఏజేన్సీ నుంచి ప్రతి నెలా జీతాలు చెల్లిస్తుంటారు. అయితే, అక్టోబర్ నుంచి జీతాలు రాకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. సకాలంలో జీతాలు రాకున్నా ఉన్న ఉద్యోగాన్ని వదులకోలేక విధుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు సంస్థ పరిధిలో ఒకే ఏజెన్సీ కింద పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్లను జిల్లాల వారీగా ఏజెన్సీలకు అప్పగించారు. అంతేకాకుండా నవంబర్ నుంచి అన్ని డిస్కం, ట్రాన్స్‌కో సంస్థల పరిధిలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు వీరికి జీతాలు పెంచారు. ఈ లెక్కన అక్టోబర్ నెలకు రూ.11,200తో పాటు నవంబర్ నుంచి పెంచిన వేతనం రూ.18,300 రావాల్సి ఉంది. మరో పది రోజుల వ్యవధిలో డిసెంబర్ నెల ముగియనుండటంతో మూడు నెలలు పూర్తి కావస్తోంది. దీంతో 32 మంది కంప్యూటర్ ఆపరేటర్లు జీతలు లేక, కుటుంబ షోషణ కోసం ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించింది. సమస్య ఎక్కడంటే.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రతీనెలా ఏపీఈపీడీసీఎల్ సంస్థ పరిధిలో ఉన్న ఓ ఏజెన్సీ ద్వారా అందించేవారు. అయితే, పాలనాపరమైన సౌలభ్యం మేరకు ఈ విధానాన్ని మార్పు చేస్తూ సర్కిల్ పరిధిలో ఏజెన్సీలకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంలో సర్కిల్లోని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సదరు ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు చెల్లింపులు జరిగేలా చూడాల్సి ఉంది. అయితే, గడిచిన మూడు నెలల కాలంలో సంభవించిన తిత్లీ, పెథాయ్ తుపానులు కారణాలుగా చెబుతూ ఈ ప్రక్రియను నిర్వహించడం లేదు. దీంతో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు జీతాలకు నోచుకోవడం లేదు. ఇదే సమస్యను పలుమార్లు విశాఖలో ఉన్న ఏపీఈపీడీసీఎల్ సంస్థ కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పట్టించుకోవటం లేదని , కార్పొరేట్ కార్యాలయానికి వెళ్తే సర్కిల్ కార్యాలయానికి వెళ్లి అడగాలంటూ కుంటి సాకులు చెప్పుకుంటూ వస్తున్నారని వాపోతున్నారు. ఇదే విషయాన్ని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ వై.విష్ణు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. సెక్షన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు అందకపోవడంతో టెండర్లలో జాప్యం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ఏ ఒక్కరు తన దృష్టికి ఈ సమస్యను తీసుకురాలేదని, టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బకాయి జీతాలు కలిపి చెల్లించేస్తామన్నారు. -
ఆర్ఈసీలో వాటా విక్రయానికి ఓకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరిన్ని సంస్థల విలీనాలకు తెరతీస్తూ ఆర్ఈసీలో వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకా రం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)కు మొత్తం 52.63% వాటాలను విక్రయించనుంది. గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ డీల్ ద్వారా ఖజానాకు సుమారు రూ.15,000 కోట్లు దఖలు పడనున్నాయి. వాస్తవానికి ఆర్‌ఈసీకే పీఎఫ్‌సీలో వాటాలను విక్రయించాలని ముందుగా భావించినప్పటికీ... విద్యుత్ శాఖ జోక్యంతో ప్రతిపాదన మారింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి కేంద్రానికి ఆర్ఈసీలో 57.99 శాతం, పీఎఫ్‌సీలో 65.64 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, ఈటీఎఫ్ ద్వారా కొన్ని వాటాలను విక్రయించడంతో ఆర్ఈసీలో కేంద్రం హోల్డింగ్ 52.63 శాతానికి తగ్గింది. మరోవైపు, 2022 నాటికి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను రెట్టింపు స్థాయిలో 60 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంలో భాగంగా కొత్త వ్యవసాయ ఎగుమతి విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టీ, కాఫీ, బియ్యం వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను పెంచుకోవడానికి, అంతర్జాతీయ అగ్రి–ట్రేడ్‌లో మరింత వాటా దక్కించుకునేందుకు ఇది దోహదపడగలదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ఉత్పత్తులకు ప్రమాణాలు నెలకొల్పడం, నిబంధనలను క్రమబద్ధీకరించడం, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించడం వంటి అంశాలకు ఈ విధానం కింద ప్రాధాన్యం లభించనున్నట్లు ఆయన వివరించారు. -
కంభంపాటి షోరూం మూతకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్ల వర్క్ షాప్ నిర్వహిస్తున్న మాజీ ఎంపీ కంభంపాటి రాంమోహన్‌రావుకు చెందిన జయలక్ష్మీ ఆటోమోటివ్స్(లక్ష్మీ హ్యుందాయ్) మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ కూడా కనెక్షన్ తొలగించినా ఆదివారం జనరేటర్ సహాయంతో పనులు చేస్తున్న సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాలనీ వాసులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14, భాగ్యనగర్ స్టూడియోస్ ఆవరణలోని ఇంటి నంబర్ 8–2–287/ హెచ్/ఏ లో టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటికి చెందిన జయలక్ష్మి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్(లక్ష్మీ హ్యుందాయ్) వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆ ఏరియా నివాస ప్రాంతమైనప్పటికీ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వైనంపై గతంలోనే స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థను మూసి వేయాల్సిందిగా ఈనెల 24న క్లోసర్ ఆర్డర్స్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆర్. రవీందర్‌రెడ్డి జారీ చేశారు. దీంతో విద్యుత్ శాఖ కనెక్షన్‌ను సైతం తొలగించింది. ఆదేశాలు ధిక్కరించి: కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను ధిక్కరిస్తూ లక్ష్మీ హ్యుందాయ్ ఆవరణలో యథేచ్ఛగా కార్ల వర్క్‌షాప్ కొనసాగుతున్నదని వారిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం భాగ్యనగర్ స్టూడియోస్ అధినేత బాదం బాల కృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ ఆదేశాలకు విరు ద్ధంగా వర్క్‌షాప్ కొనసాగుతున్నట్లు తెలుసుకొని పనులు నిలిపివేయాల్సిందిగా బంజారాహిల్స్ ఎస్ఐ రాంరెడ్డి శనివారం సూచించారు. పోలీసుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ జనరేటర్‌తో ఆదివారం తిరిగి వర్క్‌షాప్ నడుపుతుండటమే కాకుండా జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాలకృష్ణ ఆదివారం మరోసారి బంజారాహిల్స్ పీఎస్‌లో మరో ఫిర్యాదు అందజేశారు. మరోవైపు ఇదే ఆవరణలో డీఏవీ పబ్లిక్ స్కూల్ కొనసాగుతుండగా ఇక్కడి విద్యార్థులకు కూడా ఈ వర్క్‌షాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రిన్సిపాల్ పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో రోజూ 300 కార్లకు మరమ్మతులు జరుగుతుంటాయని 250 మంది సిబ్బంది పని చేస్తుం టారని వందలాదిగా ఆయిల్ డబ్బాలు ప్రమాదకరస్థితిలో నిల్వ చేస్తుంటారని ఫిర్యా దులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఆరు అక్రమ షెడ్లు నిర్మించిన విషయాన్ని కూడా తెలిపారు. ఇదే విషయమై కంభంపాటి రాంమోహన్‌రావుపై రెండు సార్లు కేసులు కూడా నమోదయ్యాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. -
పైసలుంటేనే పవర్!
నల్లగొండ : పైసలుంటేనే పవర్. లేదంటే చీమ్మ చీకట్లే. ఇకనుంచి విద్యుత్‌శాఖ కొత్త విధానాలను అవలంబించబోతుంది. నెలంతా విద్యుత్ సరఫరా చేసిన తదుపరే వినియోగదారులు వాడుకున్న దానికి సంబంధించి బిల్లు వసూలు చేస్తుండేవారు. కానీ కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇకనుంచి ముందు పైసలు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తారు. లేదంటే చీకట్లో ఉండాల్సిందే. అందులో భాగంగానే మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్‌మీటర్లను అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ విషయంలో మొదటినుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో బకాయిలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపులో ఆయా శాఖల్లో అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు పెడితే బకాయిల భారం నుంచి తప్పించుకోవచ్చని భావించి వెంటనే బిగించాలని నిర్ణయించింది. మొదటి విడతగా కొన్ని మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల్లో మీటర్లు బిగిస్తున్నారు. అతి ఎక్కువగా బకాయిలు గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.18,419.03 లక్షలు బకాయి పడ్డాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు జిల్లా వ్యాప్తంగా 27 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సంబంధించి రూ.192.48 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో మొదటి విడత పూర్తి కావస్తుండగా, నల్లగొండ జిల్లాలో మాత్రం అలస్యమవుతోంది. విద్యుత్ చౌర్యానికి చెక్.. కొందరు వినియోగదారులు మీటర్లో వైర్లు పెట్టి విద్యుత్‌చౌర్యానికి పాల్పడుతున్నారు. దాంతో దొడ్డి దారిన విద్యుత్ వాడుకొని బిల్లు తప్పించుకుంటున్నారు. అ«ధికారులు మాత్రం డిమాండ్‌కు తగట్లుగా బిల్లులు వసూలు చేస్తున్నారు కానీ, అది ప్రభుత్వ కార్యాలయాలపై మాత్రమే అదనంగా భారం పడే అవకాశం ఉంది. దానిని అరికట్టేం దుకు ప్రీపెయిడ్ మీటర్లు ఎంతగానో దోహదపడుతాయి. గతంలో ముందుగా కరెంటు వాడుకొని నెల తర్వాత మీటర్లలో తిరిగిన యూనిట్ల ఆధారంగా బిల్లును వసూలు చేస్తూ వస్తున్నారు. ఇక నుం చి ప్రీపెయిడ్ మీటర్లతో ముందే నెలకు సరిపడా విద్యుత్‌ను డబ్బులు పెట్టి కొనుకోవాల్సి ఉంది. బకాయిలు బాధలు ఉండవు.. విద్యుత్ అధికారులకు కూడా బకాయిల వసూళ్ల బాధలు కూడా ఉండవు. ముందే ప్రీపెయిడ్ మీటర్లలో చిప్ కొనుకుంటేనే విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో తర్వాత బిల్లు వసూలు అనే పని అధికారులకు ఉండదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు ముందస్తుగానే వారు వినియోగించే విద్యుత్ కొనుగోలు చేసుకోనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పలే... కొన్ని ప్రభుత్వ శాఖలకు నిధులే ఉండవు. విద్యుత్ బిల్లులు సంవత్సరాల తరబడి చెల్లించని శాఖలు కూడా ఉన్నాయి. అలాంటి శాఖలకు ప్రీపెయిడ్ మీటర్లతో తిప్పలు తప్పవు. కచ్చితంగా ఆయా శా ఖాధికారులు ముందస్తుగానే విద్యుత్‌కు సంబం ధించి బిల్లులు అనుమతి కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి రానుంది. వద్దంటున్న కొన్ని శాఖల అధికారులు... కొన్ని ముఖ్యమైన అత్యావసరమైన ప్రభుత్వ శాఖల అధికారులు ప్రీపెయిడ్ మీటర్లను బిగిం చొద్దంటూ విద్యుత్ సిబ్బందికి సూచిస్తున్నారు. దీంతో ఆ కార్యాలయాలకు మీటర్లు బిగించలేకపోతున్నారు. అత్యవసరమైన శాఖలు కావడంతో విద్యుత్ అధికారులు కూడా వారి విషయంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. కార్యాలయాల తర్వాత గృహాలకు.. ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి విడతగా ప్రీపెయిడ్ మీటర్లను వినియోగిస్తున్నారు. అ తదుపరి అందులోనే లోటుపాట్లను సరి చేసుకొని గృహాలకు కూడా అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మొదటి విడత జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్మీటర్లను బిగిస్తున్నట్లు జిల్లా టాన్స్‌కో ఎస్ఇ కృష్ణయ్య తెలిపారు. మొదటి విడతగా 963 మీటర్లు.. మొదటి విడతగా జిల్లాలో 963 మీటర్లను మంజూరు చేశారు. నెల పదిహేను రోజులనుంచి ఇప్పటి వరకు 483 మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించారు. కార్యక్రమం కొంత ఆలస్యమే అవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖల విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.192.48 కోట్లు వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ, బీసీ సంక్షేమ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ శాఖ, పౌర సరఫరాల తదితర రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని శాఖలకు సంబంధించి విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. -
తప్పు మీద తప్పు..!
సాక్షి, గుంటూరు: చీకట్లో నల్లపిల్లిని వెతుకుతున్నారన్న హైకోర్టు వ్యాఖ్యలను మైనింగ్ అధికారులు నిజం చేస్తున్నారు. గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి నోటీసులు జారీ చేశారు. పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగిన అక్రమ మైనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలతో చేయిస్తున్న విచారణ తీరే ఇందుకు నిదర్శనం. హైకోర్టు మొట్టికాయలు మొట్టడంతో తామేదో పొడిచేస్తాం.. అక్రమాలను నిగ్గుతేలుస్తాం అన్నట్టుగా ఫోజు పెట్టి విచారణ మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తీరు హాస్యాస్పదంగా మారింది. ఉండటానికి సరైన నివాసం కూడా లేని వాళ్లు వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించి రూ.కోట్లు సంపాదించారని, అలాగే 1998లో మరణించిన వ్యక్తి 2013లో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడంటూ నోటీసులిచ్చి, కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విచారణ పేరుతో మైనింగ్ అధికారులు ఇంకో అడుగు ముందుకేసి స్వామిభక్తి చాటుకోవడంలో భాగంగా పత్తి, బియ్యం, మైదాపిండి మిల్లుల వారికి కూడా తెల్లరాయి అక్రమ తవ్వకాలతో సంబంధం ఉందని నోటీసులిచ్చి, మిల్లులను మూతవేయించారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టుకు ఈ జాబితాను కూడా నివేదించడం గమనార్హం. తమ ఎమ్మెల్యేను కాపాడేందుకే... గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి పిడుగురాళ్ళ మండలం కోనంకి గ్రామాల్లో గత నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, ఇతర అధికార పార్టీ పెద్దలను తప్పించే యత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణను సీబీసీఐడీకి అప్పగించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చేస్తున్న విచారణ తీరు ఈ ఆరోపణలను బలపరుస్తోంది. అక్రమ మైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన వారిని వదిలేసి సంబంధంలేని ముగ్గురాయి మిల్లుల యజమానులను, అమాయక కూలీలు, టిప్పర్, ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లకు సైతం నోటీసులు జారీచేస్తున్నారు. పైగా వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. రైస్‌మిల్లులు, కాటన్ మిల్లులకు అక్రమ మైనింగ్‌కు సంబంధం ఏంటనేది మైనింగ్ అధికారులు, సీబీసీఐడీ అధికారులకే తెలియాలి. మైనింగ్ మాఫియా నుంచి తెల్లరాయి కొనుగోలు చేసి ముగ్గు, చిప్స్ తయారు చేసే మిల్లులకు నోటీసులు ఇస్తే పర్వాలేదు. నిజంగా ముగ్గు, పల్వరైజింగ్ మిల్లులు నడుస్తున్నప్పటికీ ఆ పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఆ బిల్డింగ్‌లో రైస్ మిల్లు, కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, ఇతర పరిశ్రమలు నడిచాయనే అవగాహన కూడా లేకుండా ఆ పేర్లతో నోటీసులు జారీ చేశారు. తాము తప్పించుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేత ఏస్థాయిలో తన పరపతిని ఉపయోగించారో అర్థం చేసుకోవచ్చు. నోటీసులు ఇచ్చాం విద్యుత్ శాఖ అధికారుల నుంచి సేకరించిన మీటర్ల ఆధారంగా మిల్లులకు నోటీసులిచ్చాం. గతంలో కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లులు, రైస్‌మిల్లులు ఇలా ఏ పరిశ్రమ పేరుతో అయితే కరెంటు మీటరు తీసుకున్నారో ఆ పేరుతో నోటీసులిచ్చాం. ఆపేరుతో అక్కడ పరిశ్రమ నడవకపోతే యజమానులు మాకు తెలియజేయాలి. వెంటనే మా అధికారులను పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాత వారు చెప్పినట్లు మైనింగ్‌కు సంబంధం లేని పరిశ్రమ అయితే నోటీసులు వెనక్కు తీసుకుంటాం. – విష్ణువర్ధన్, మైనింగ్ ఏజీ -
పొలాల్లో హై‘టెన్షన్’
తాడేపల్లి రూరల్: రాజధానికోసం భూములివ్వని రైతులపై ప్రభుత్వ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ఉండవల్లిలో రైతుల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ అధికారులు భారీగా పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. ఆందోళన చెందిన రైతులు హడావుడిగా పంటపొలాలకు చేరుకుని వైర్లు లాగడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులు తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లను బయటకు తీయగా.. వారిని పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైర్లు లాగుతాం.. ఏం చేస్తారు? గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలను ప్రభుత్వం రాజధానిగా ప్రకటించినప్పటినుంచి భూములివ్వని రైతులను ఏదోవిధంగా బెదిరిస్తూ దమనకాండకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉండవల్లిలో రైతులకు చెందిన ఎనిమిది ఎకరాల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ అధికారులు భారీగా పోలీసు బలగాలను వెంటపెట్టుకుని వచ్చారు. ఇది తెలుసుకున్న ఆయా పొలాలకు చెందిన 18 మందికిపైగా రైతులు హడావుడిగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడుతుండగానే.. కాంట్రాక్టరు హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమవడంతో ఆగ్రహానికి లోనైన రైతులు అడ్డుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే.. విద్యుత్ అధికారులు మళ్లీ వైర్లు లాగే ప్రయత్నం చేశారు. అంతేగాక.. వైర్లు లాగుతాం, ఏం చేస్తారో చెయ్యండంటూ రైతులపై విరుచుకుపడ్డారు. దీనిపై రైతులు.. అన్నం పెట్టే అన్నదాతలు మిమ్మల్నేం చేయగలరు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన తహసీల్దార్.. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. వైర్లు వెళ్లే స్థలాలకు కూడా జిల్లా కలెక్టర్ నష్టపరిహారం ఇస్తారంటూ చెప్పగా.. ఎలా ఇస్తారంటూ రైతులు ప్రశ్నించారు. దానికి అధికారులు సమాధానం చెప్పకుండా వైర్లు లాగుతామంటూ ముందుకెళ్లారు. దాంతో రైతులు తమ జేబుల్లోనుంచి పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లు బయటకు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆరుగురు రైతులను పోలీసులు బలవంతంగా జీపులో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మహిళా రైతులను పంటపొలాలనుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం హైటెన్షన్ వైర్లను లాగే ప్రక్రియ చేపట్టారు. అదుపులోకి తీసుకున్న రైతులను గురువారం సాయంత్రం పూచీకత్తుపై వదిలిపెట్టారు. -
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం..నిండు గర్భిణి బలి
కర్నూలు, కౌతాళం రూరల్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలైంది. ఈ ఘటన కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలో ఇళ్లను ఆనుకుని 11 కేవీ విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. వీటిని తొలగించాలని గ్రామస్తులు అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. వారు ఏమాత్రమూ పట్టించుకోలేదు. గురువారం ఉదయం వడ్డే మహదేవి(33) అనే గర్భిణి శ్రావణ మాసం సందర్భంగా ఇంటికి సున్నం వేసేందుకు మిద్దెపైకి వెళ్లింది. గోడలకు సున్నం కొడుతుండగా ఇంటిపై వేలాడుతున్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు ఆమె మెడకు తగలడంతో షాక్‌కు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి మిద్దెపైకి వెళ్లి చూసేలోపే ఆమె చనిపోయింది. మహదేవికి ఇప్పటికే ముగ్గురు సంతానం కాగా.. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. ఆమె భర్త వడ్డే రామాంజులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామస్తుల ఆందోళన గర్భిణి మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్థానిక ఆదోని ప్రధాన రహదారిపై మూడు గంటలకు పైగా రాస్తారోకో చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రావణమాస ఉత్సవాలకు వచ్చిన ఉరుకుంద ఈరన్న స్వామిభక్తుల వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదోని తాలూకా సీఐ మురళీ, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ తిమ్మయ్య తమ సిబ్బందితో వచ్చి గ్రామస్తులతో చర్చించారు. నిండు ప్రాణాలు పోవడానికి కారణమైన విద్యుత్ శాఖ ఏఈ మద్దిలేటి వస్తే గానీ రాస్తారోకో విరమించేది లేదని వారు తెగేసి చెప్పారు. ఏఈని రప్పిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ఏఈపై కేసు నమోదు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి నిండు గర్భిణి ప్రాణాలు పోవడానికి కారణమైన విద్యుత్‌శాఖ ఏఈ మద్దిలేటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమ్మయ్య తెలిపారు. -
స్తంభం మీదే ప్రాణాలొదిలాడు
మర్పల్లి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. వీధిలైట్లు అమర్చే క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ శాఖ దినసరి కూలీ గోపాల్ విద్యుదాఘాతంతో స్తంభం మీదే మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోటమర్పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. కోటమర్పల్లి గ్రామానికి చెందిన తుడుము గోపాల్(19) విద్యుత్ శాఖలో క్యాజువల్ లేబర్ ప్రభాకర్‌రెడ్డి వద్ద దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతడు గ్రామంలో వీధిలైట్లు బిగించి విద్యుత్ సరఫరా చేయాలని ప్రభాకర్‌రెడ్డికి చెప్పాడు. దీంతో ఆయన సబ్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అంతలోనే గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు తాకడంతో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ట్రిప్ అయింది. ఈ క్రమంలో ఎల్సీ కావాలని గోపాల్ కోరగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో స్తంభంపై ఉన్న గోపాల్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబీకులు, గ్రామస్తులు మర్పల్లి చౌరస్తా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఘటనాస్థలానికి చేరుకొని మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
నేటి నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్(ఆర్టిజన్లు) కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. విద్యుత్ శాఖలో తమను విలీనం చేసుకోవాలనే ప్రధానమైన డిమాండ్‌తో పాటు 16 రకాల డిమాండ్లపై తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గత నెలలో సమ్మె నోటీస్ ఇచ్చింది. శుక్రవారం ఈ డిమాండ్లపై యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ గౌడ్, సాయిలుతో కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపారు. కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి గంగాధర్ సమక్షంలో జరిగిన చర్చలకు ట్రాన్స్‌కో సంయుక్త కార్యదర్శి శోభరాణి , ఎస్పీడీసీఎల్ ప్రతినిధి లోక్యానాయక్లు హాజరయ్యారు. డిమాండ్లు పరిష్కరించలేం... కోర్టులో ఈ వివాదం ఉన్నందున డిమాండ్లను ఆమోదించడం కోర్డు ధిక్కారమే అవుతుందని, న్యాయ వివాదం తేలేదాకా డిమాండ్లను పరిష్కరించలేమని డిస్కమ్‌ల ప్రతినిధులు స్పష్టం చేశారు. డిమాండ్లేవీ పరిష్కారం కాకపోవడంతో శనివారం నుంచి ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్లలోని 18 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్తారని, సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టం–1947 ప్రకారం ఆర్టిజన్లకు సమ్మె చేసే అధికారం లేదని చేప్పే అధికారులు, ఆ చట్టంలోని ఎస్మా ఏ విధంగా అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. సమ్మె చట్ట విరుద్ధం:ట్రాన్స్‌కో జేఎండీ జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్లో ఆర్నెల్ల పాటు సమ్మెపై నిషేధం ఉందని, కార్మికులు సమ్మెలో పాల్గొంటే ఎస్మా అమలు చేస్తామని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు హెచ్చరించారు. 18 వేల మంది సమ్మెలోకి... డిస్కమ్‌లలో 23 వేల మంది ఉండగా, 18 వేల మంది సమ్మెలోకి వస్తున్నారని, సబ్స్టేషన్లలో విధులు, కరెంట్ స్తంభాలు, ఎమర్జెన్సీ సర్వీసులకు దూరంగా ఉంటా మన్నామని అధ్యక్షడు శ్రీధర్‌గౌడ్ తెలిపారు. డిమాండ్లను పరిష్కరించే దాకా సమ్మె కొనసాగుతుందన్నారు. కార్మికులను శాంతింపచేయడానికి శనివారం రాత్రి ఎస్పీడీసీఎల్ సీంఎడీ రఘుమారెడ్డి రంగంలోకి దిగారు. డిమాండ్లు పరిష్కరించలేని అనివార్య స్థితిలో ఉన్నామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. డిస్కమ్‌లో గ్రేడ్–4 ఆర్టిజన్లు సాంకేతిక విధులు నిర్వహిస్తుంటే వారి విదార్హతల ఆధారంగా ప్రత్యేక అలవెన్సు వర్తింపచేస్తామని హామీ ఇవ్వగా.. విలీనంపై స్పష్టత ఇచ్చేదాకా సమ్మె కొనసాగుతుందని కార్మికులు తేల్చి చెప్పారు. -
లైన్మన్లు.. స్తంభం ఎక్కాల్సిందే!
ఒంగోలు సెంట్రల్: విద్యుత్ సంస్థలో పనిచేసే జూనియర్ లైన్మన్లు, సహాయ లైన్మన్లు, లైన్మన్లు ఇక నుంచి విద్యుత్ స్తంభం ఎక్కాల్సిందేనని సదరన్ డిస్కం ముఖ్య ఇంజినీరు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత డివిజినల్ ఇంజినీరు వారానికి ఒక సెక్షన్‌కు వెళ్లి ప్రతి ఉద్యోగి స్తంభం ఎక్కగల సామర్థ్యం ఉందో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ, క్షేత్రస్థాయిలో ఎక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు మార్చాలన్నా, గడువులోపు బిల్లులు చెల్లించని వినియోగదారులకు విద్యుత్ సరఫరాను నిలిపేయడం, పునురుద్ధరణ తదితర పనుల్లో స్తంభాలు ఎక్కేందుకు కొందరు శాశ్వత ఉద్యోగులు ఇష్టపడటం లేదని, మరికొందరికి స్తంభాలు ఎక్కే నైపుణ్యం లేదని తిరుపతిలోని సదరన్ డిస్కిం ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులతో ఆ పనులు చేయిస్తున్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందింది. నైపుణ్యం లేనందున పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు జాప్యం జరుగుతోందని గుర్తించారు. పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా నివారించేందుకు సిబ్బందిలో జవాదుదారీతనం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించకుండా శాశ్వత ఉద్యోగులే అన్ని పనులు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని తక్షణం అమలు చేయాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం విద్యుత్ స్తంభాలు ఎక్కలేని వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. 50 ఏళ్లు దాటిన లైన్మన్లు చాలామంది ప్రస్తుతం స్తంభాలు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయో ఆదేశాల్లో స్పష్టం చేయలేదు. జిల్లాలో జూనియర్ లైన్మన్లు–305 మంది. అసిస్టెంట్ లైన్మన్లు–380 మంది, లైన్మన్లు–365 మంది వరకు ఉన్నట్లు ఆ శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. -
ప్రాణాలు మింగిన కరెంటు తీగలు
గుడిహత్నూర్(బోథ్) : విద్యుత్‌శాఖ నిర్లక్ష్యానికి ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. గంట వ్యవధిలో ఇంటికి రావాల్సిన వ్యక్తి కరెంట్ తీగలకు బలికావడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. మండల కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన సానప్ అర్జున్ (38) కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. డ్రైవర్‌గా కూడా పని చేస్తూనే మేకలు పెంచుకుంటున్నాడు. ఈ ఏడాది ముత్నూర్ శివారులో నాలుగు ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని సాగుకు సిద్ధం చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన అబ్బాయి మేకలను మేతకు తీసుకెళ్లడంతో వాటిని ఇంటికి కొట్టుకు రావడానికి అర్జున్ వెళ్లాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వంగిన స్తంభాల తీగలు నేలకు అంటుకున్నాయి. ఓ మేక తీగలవైపు పరుగెత్తడంతో దానిని మరలించే క్రమంలో మేకతోపాటు అర్జున్ కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆయన ముందు వెళ్తున్న అబ్బాయి ప్రమాదాన్ని గమనించి వెంటనే ఇంటికి చేరి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు చేరుకొని బోరున విలపించారు. అర్జున్‌కు భార్య ఉష, కూతురు నందిని, కుమారుడు భగవాన్ ఉన్నారు. విద్యుత్‌శాఖ అధికారులపై కాలనీవాసుల ఆగ్రహం సమాచారం అందుకున్న కాలనీవాసులు, అతడి మిత్రులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్‌శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగి రెండు గంటలు కావస్తున్న అధికారుల ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదని మండిపడ్డారు. ఆలస్యంగా అయినా చేరుకుని ఏఎస్సై అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. అనంతరం ఎస్సై ప్రమాద స్థలంలో వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు మృతి చెందిన అర్జున్, మేక -
త్వరలో విద్యుత్ వివాదాలను పరిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటా మని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలి పారు. సదరన్ రీజినల్ పవర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం సహకరిస్తుందన్నారు. రాష్ట్రాల పునర్విభజన వివాదాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంపకాల వివాదంపై దాదాపు మూడున్నరేళ్ల కింద కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అప్పటి కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) చైర్మన్ నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిందా? లేదా? అన్న సమాచారం తన వద్ద లేదన్నారు. వివాదం నా దృష్టికి రాలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్‌కు సంబంధించి విభజన వివాదాలు నెలకొని ఉన్నాయన్న విషయం తన దృష్టికి రాలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విద్యుత్ రంగం సాధించిన విజయాలపై మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర నగరాల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతులకు సౌర విద్యుత్ పంప్ సెట్లను సరఫరా చేసేందుకు కుసుమ్ (కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తమ్ మహాభియాన్) పేరుతో కొత్త పథకా న్ని అమల్లోకి తీసుకురానున్నామన్నారు. దీనిద్వా రా దేశ వ్యాప్తంగా 27.5 లక్షల సోలార్ పంప్సెట్ల ను పంపిణీ చేస్తామని, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో 17.5 లక్షల పంప్సెట్లు ఇస్తామన్నారు. త్వరలో కొత్త టారిఫ్ విధానం విద్యుత్ ధరలను నిర్ణయించే టారిఫ్ విధానంలో సమూల సంస్కరణల కోసం ముసాయిదా టారిఫ్ విధానాన్ని ప్రకటించామని ఆర్కే సింగ్ పేర్కొన్నా రు. త్వరలో అమల్లోకి వచ్చే ఈ విధానం ప్రకారం పలు కేటగిరీల వినియోగదారుల మధ్య క్రాస్ సబ్సిడీ 25 శాతానికి మించరాదన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు 15 శాతం లోపు ఉండాలన్నారు. -
ఎత్తిపోతలకు 3,234 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చాలని విద్యుత్ శాఖను నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన అన్ని ప్రాజెక్టుల పంపుహౌజ్‌లకు ఈ వర్షాకాలం నుంచి విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్ల వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. కంతనపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా జల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో జరిగిన నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ సమావేశంలో జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, జెన్కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, ఎస్ఈ సురేశ్, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఎత్తిపోతల పథకాలకు గరిష్టంగా 3,234 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుందని ఈ భేటీలో తుది అంచనాకు వచ్చారు. ఆ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న ఎత్తి్తపోతల పథకాలకు 1,028.40 మెగావాట్లు, కాళేశ్వరంతోపాటు ఈ ఏడాది ప్రారంభమయ్యే ఇతర ఎత్తిపోతల పథకాలకు 2,206 మెగావాట్ల విద్యుత్ అవసరమని తేల్చారు. అలాగే పలు ప్రాజెక్టుల పరిధిలోని పంప్‌హౌజ్‌లలో ఈ ఏడాదిలో ఎప్పటి నుంచి నీటి పంపింగ్ ప్రారంభమవుతుంది, ఎన్నిరోజులపాటు పంపింగ్ చేసే అవకాశం వుంది, ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది, ఏయే సమయాల్లో ఏయే పంప్ స్టేషన్లు పనిచేయాలి.. తదితర అంశాలపై నిర్ధారణకు వచ్చారు. కాళేశ్వరానికి 1,916 మెగావాట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ పంపింగ్ ఈ ఏడాది జూలై–ఆగస్టులోనే ప్రారంభం అవుతుందని, దీనికి గరిష్టంగా ఈ ఏడాది 1,916 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనాకు వచ్చారు. ఈ పంప్‌హౌజ్‌లకు నిరాటంకంగా సరఫరా చేసేందుకు విద్యుత్‌ను సమకూరుస్తామని, సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభాకర్ రావు తెలిపారు. కంతనపల్లి (తుపాకుల గూడెం) ప్రాజెక్టు వద్ద గోదావరి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని హరీశ్‌రావు సూచించారు. జల విద్యుత్ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
మనోహరా.. లాటరీ నీదేరా..!
ఒక్కసారైనా లాటరీ గెలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఎక్కడైనా లాటరీ వేస్తున్నారనగానే అక్కడికి వెళ్లి వెంటనే ఓ కూపన్ తీసేసుకుంటారు. కొందరికి ఇదో సరదా.. కొందరికి ఇదో పిచ్చి.. మరికొందరికి ఇదో వ్యసనం.. ఏదైతేనేమి ఒక్కసారి లాటరీ తగిలితే దశ దిశ మారినట్లే. మరి అలాంటిది మూడు సార్లు లాటరీ తగిలితే.. దాన్నేమనాలి.. ఎక్కడో సుడి ఉందనుకోవాలి.. ఆయనే కేరళకు చెందిన ఆర్పీ మనోహరన్.. ఈయన కేరళ విద్యుత్ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. ఇప్పటివరకు వరుసగా మూడేళ్లుగా మూడు లాటరీలు గెలుచుకున్నాడు. తొలిసారిగా కేరళ ప్రభుత్వం నిర్వహించిన లాటరీని 2016 ఆగస్టులో గెలుచుకున్నాడు. అప్పుడు మనోహరన్ రూ.70 లక్షలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2017 నవంబర్‌లో నిర్మల్ లాటరీని గెలుచుకున్నాడు. అప్పుడు కూడా రూ.65 లక్షల నగదును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మరోసారి లాటరీలో గెలిచి ముచ్చటగా మూడోసారి రూ.70 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకుముందు కూడా చాలా చిన్న చిన్న మొత్తాల్లో లాటరీ గెలుచుకునేవాడినని, కానీ మూడేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు. అసలు ఇదంతా నిజమో కలనో కూడా అర్థం కావట్లేదని చెబుతున్నాడు. -
‘షాక్’ కొడుతున్నా చలనం లేదు..
రంపచోడవరం: విరిగిన ఎముకను అతికించడానికి కట్టుకట్టినట్టు..ఫొటోలో అట్టపెట్టెల్ని మడిచి, కట్టి ఉన్నది ఓ కరెంటు స్తంభం. ఆ స్తంభం పటిష్టంగా లేదని, అందుకే అలా అట్టపెట్టెల్ని కట్టారని ఎవరైనా అనుకోవచ్చు. నిజానికి విద్యుత్ స్తంభం బలహీనంగా ఉంటే.. అట్టపెట్టెలతో పటిష్టంగా ఉంటుందనుకుంటే అంతకన్నా తింగరితనం ఉండదు. అయితే.. ఆ స్తంభానికి అట్టపెట్టెల్ని కట్టడంలో ఉన్నది అలాంటి తెలివితక్కువతనం కానేకాదు. ఎవరికీ ప్రాణాపాయం జరక్కుండా అడ్డుకోవాలనే తపనతో తోచిన తరుణోపాయం. అంతేకాదు.. ఆ అట్టకట్లు..జనం ప్రాణాలను తృణప్రాయంగా చూసే విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి సాక్ష్యం. రంపచోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులోని ఈ విద్యుత్ స్తంభానికి విద్యుత్ ప్రవహిస్తూ.. తాకిన వారికి షాక్ కొడుతోంది. ఈ విషయమై ఆ శాఖ కార్యాలయానికి పలువురు పలుమార్లు ఫోన్ చేసి చెప్పినా అధికారుల్లో చలనం లేదు. ఆ స్తంభానికి విద్యుత్ ప్రవహించడం మొదలై పది రోజులు గడిచింది. అయినా ఆ శాఖ సిబ్బంది, అధికారులు అటు తొంగి చూడలేదు. ప్రస్తుతం స్తంభం కొద్దిపాటి షాక్ కొడుతున్నా.. అది తీవ్రతరమైతే ప్రాణాంతకమవుతుందన్న భయంతో స్థానికులు.. తోచింది చేశారు. స్తంభానికి దాదాపు ఏడడుగుల ఎత్తు వరకూ అట్టపెట్టెల్ని మడిచి కట్టారు. అయినా అదే రోడ్డులో తిరిగే విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోలేదు. జరగరానిది జరగకముందే కదలిక వచ్చేందుకు..విద్యుత్ శాఖకూ ఓ మోస్తరు షాక్ అవసరమయ్యేలా ఉంది. -
విద్యుత్ శాఖలో నకిలీ కలకలం
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలంకలం సృష్టిస్తోంది. ఇందులో కొందరు లైన్మ్యాన్లు ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో బహిర్గతం కావడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరి అర్హులకు అన్యాయం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విచారణ నివేదిక ఉన్నతాధికారులకు పంపినా చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ శాఖకే ఝలక్.. నిత్యం వినియోగదారులకు షాక్ ఇచ్చే విద్యుత్ శాఖకు నకిలీ వీరులు ఝలక్ ఇచ్చారు. ఐటీఐ చదవకపోయినా బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కొత్తేమీ కాకపోయినా తాజాగా బయటపడిన భాగోతం మాత్రం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జిల్లా వ్యాప్తంగా నలుగురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తేలింది. వీరిలో కర్నూలు డివిజన్లో ముగ్గురు, డోన్ డివిజన్లో ఒకరు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా వీరంతా 2003 బ్యాచ్‌కు చెందిన వారని, 69 మంది ఉన్న ఆ బ్యాచ్‌లో మరికొంత మంది నకిలీలు ఉన్నారని సమాచారం. సీజేఎల్‌ఎంగా చేరి జేఎల్ఎం, ఏఎల్ఎం, లైన్‌మ్యాన్లుగా పదోన్నతులు పొంది నెలకు రూ.40 వేల వరకు వేతనం పొందుతున్నట్లు తెలుస్తోంది. డబ్బివ్వండి.. నేను చూసుకుంటా ‘నాకు డబ్బివ్వండి.. అంతా నేను చూసుకుంటా’ అని జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఓ అధికారి నకిలీ లైన్‌మ్యాన్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. ‘నాకు పైన అంతా తెలిసిన వాళ్లే.. మీపై చర్యలు లేకుండా చూస్తా’ అంటూ రూ. లక్షల్లో వసూలు చేసినట్లు ఆశాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. బయటపడింది ఇలా.. ఓ అజ్ఞాత వ్యక్తి ‘విద్యుత్ శాఖలో పనిచేసే ఓ లైన్‌మన్ చిన్నప్పటి నుంచి తనతోపాటు చదివాడని, అతడు ఐటీఐ చేయలేదని, అతడిది బోగస్ సర్టిఫికెట్ అని, దీనిపై విచారణ జరపాలి’ అంటూ ఉన్నతాధికారులకు పిటిషన్ పెట్టాడు. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విచారణలో అతడితోపాటు మరో ముగ్గురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విజిలెన్స్ ఎస్ఐ స్థాయి అధికారి సంబంధిత కళాశాలలకు వెళ్లి ఆరా తీయగా బోగస్ సర్టిఫికెట్లుగా తేలినట్లు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు రిపోర్టును చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌కు పంపగా ఆయన వాటిని జేఎండీకి, ఆక్కడి నుంచి ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమచారం. బోగస్ అని తేలాకా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇందుకు అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. -
వాడీవేడిగా ‘దిశ ’
నల్లగొండ :జిల్లా అభివృద్ధి–సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం వాడీవేడిగా సాగింది. జిల్లా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం (డీడీయూజీజైవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం (ఐపీడీఎస్) పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలోని డ్వామా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి గుత్తా అధ్యక్షత వహించారు. రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న డీడీయూజీజైవై, ఐపీడీఎస్, మిషన్ భగీరథ ఇంట్రా, ఉపాధి హామీ పథకం పనులపై చర్చించారు. విద్యుత్ పథకాల పనులపైన సమీక్షించిన చైర్మన్ ఆ శాఖ అధికారులను నిలదీశారు. పథకాలు మంజూరై మూడేళ్లయినా ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ‘మీ శాఖ చేస్తున్న పనేంటి?.. వెరీ బ్యాడ్’ అంటూ అధికారులను మందలించారు. కొత్త సబ్స్టేషన్లు నిర్మించి, 11 కేవీ, 33 కేవీ లైన్లు పూర్తయి, డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేశాక కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నది పథకం ప్రధాన ఉద్దేశం.. కాగా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారుల పనితీరులో మార్పు కనిపించడం లేదని ఎంపీ మండిపడ్డారు. దీన్‌దయాళ్ కింద ఏడు సబ్స్టేషన్లకుగాను రెండు సబ్స్టేషన్లు మాత్రమే పూర్తికాగా 33 కేవీ లైన్లు 31 కి. మీ, 11 కేవీ లైన్లు 11 కి.మీలు, ఎల్టీ లైన్లు 26 కి.మీ, 1240 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఐపీడీఎస్ కింద మిర్యాలగూడకు మంజూరైన సబ్‌స్టేషన్ పనులు పూర్తికాలేదని, దేవరకొండలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు పనులు జరగడం లేదని, నల్లగొండ మండలంలో స్తంభాలు పాతి వదిలేశారని అన్నారు. రూ.125లకే విద్యుత్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రచారం చేయడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారని చైర్మన్ విచారం వ్యక్తం చేశారు. నీళ్లు నమిలిన అధికారులు.. 2014–15లో డీపీఆర్‌లు పంపిస్తే 2015–16లో పనుల ఆమోదం జరిగింది. ఇప్పటికీ మూడేళ్లయినా పనులు ఎందుకు సాగడం లేదని చైర్మన్ నిలదీశారు. దీనిపై స్పందించిన అధికారులు జీఎస్టీ కారణంగా పనులు ఆలస్యమయ్యాయని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయ్యారని మిర్యాలగూడెం, దేవరకొండ ఎమ్మెల్యేలు ఆరోపించినా అధికారులు నోరుమెదపలేదు. జూన్ నెలాఖరు నాటికి మొత్తం పనులు పూర్తిచేస్తామనే సమధానం తప్ప అధికారుల వైపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జోక్యం చేసుకుని అధికారుల తరపున వివరణ ఇవాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని రెండు రోజుల్లోగా తన వద్దకు రావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తప్పుదోవ పట్టిస్తున్నారు.. మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పనుల్లో కలెక్టర్‌ను, ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టిస్తున్నారని చైర్మన్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో 10 శాతం ట్యాంకుల నిర్మాణం కూడా జరగలేదని, కానీ కాగితాల్లో మాత్రం 80 శాతం వృద్ధి సాధించినట్లు చూపిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. దేవరకొండ, మిర్యాలగూడెంలో ట్యాంకుల నిర్మాణం నత్తనకడన సాగుతుంటే ఎజెండాలో మాత్రం వందల సంఖ్యలో ట్యాంకులు కట్టినట్లు చూపెడుతున్నారని, పనులు ఎక్కడ జరిగాయో చూపించాలని అధికారులను నిలదీశారు. డిండి మండలంలో రూ.10 లక్షలతో పైపులైన్లు వేయడం ఎలా సాధ్యమవుతుందని, రివైజ్డ్ ఎస్టిమేట్లు వేయాలని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు బాధ్యతరాహిత్యంగా వ్యవహారించడం వల్లే∙పీఏపల్లి మండలం పడమటి తండాలో ట్రాక్టర్ ప్రమాదం జరిగిందని, ఆ సంఘటనకు అధికారులే బాధ్యత వహించాలని చైర్మన్ అన్నారు. పీఏపల్లి మండలం తూర్పుపల్లి గ్రామంలో పీహెచ్సీ భవనం నిర్మాణం జరిగినా వైద్యులు, సిబ్బంది లేక నిరుపయోగంగా మారిందని, వైద్య సిబ్బందిని త్వరగా నియమించాలని ఆరోగ్యశాఖ అధికారులను చైర్మన్ ఆదేశించారు. సమావేశానికి డీఆర్డీఓ రింగు అంజ య్య, సభ్యులు పాశం రాంరెడ్డి, స్వామి గౌడ్, రజితారెడ్డి, జేడీఏ నర్సింహారావు, డీటీడబ్ల్యూఓ నరోత్తమ్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు, ఐసీడీఎస్ పీడీ పుష్పలత, డీఎంహెచ్ఓ భానుప్రకాష్ తదితరులు హాజరయ్యారు. -
చార్జింగ్ స్టేషన్లకు లైసెన్సులు అక్కర్లేదు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా లైసెన్సు అవసరం లేకుండానే ఈ–వాహనాల చార్జింగ్ స్టేషన్లను నిర్వహించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ, ట్రేడింగ్ మొదలైన వాటికి ఎలక్ట్రిసిటీ చట్టం కింద లైసెన్సు తీసుకోవడం తప్పనిసరి. ఆ ప్రకారంగా చూస్తే వినియోగదారులకు విద్యుత్‌ను విక్రయించే సంస్థలన్నీ కూడా లైసెన్సులు తీసుకోవాల్సిందే. అయితే, బ్యాటరీల చార్జింగ్‌ను సేవల విభాగం కింద వర్గీకరించడం ద్వారా కేంద్రం ఈ మేరకు నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించింది. బ్యాటరీలను చార్జింగ్ చేయడంలో సదరు చార్జింగ్ స్టేషన్.. ఎటువంటి సరఫరా, పంపిణీ, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించదు కనుక లైసెన్సు అవసరం ఉండదని విద్యుత్ శాఖ తెలిపింది. ఇది పురోగామి చర్యగా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సొసైటీ (ఎస్ఎంఈవీ) డైరెక్టర్ సొహిందర్ గిల్ అభివర్ణించారు. ప్రధాన సవాలైన చార్జింగ్ వ్యవస్థకు సంబంధించి ఆటంకాలు తొలగించిన విధం గానే, ఇతరత్రా స్థల సమీకరణ మొదలైన సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. త్వర లో ఎలక్ట్రిక్ వాహనాల నియంత్రణ, సాంకేతిక ప్రమాణాలు మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అర్కే సింగ్ గత నెలలో వెల్లడించారు. బ్యాటరీల చార్జింగ్కు టారిఫ్ ప్రతి యూనిట్‌కు రూ. 6 చొప్పున అందుబాటు స్థాయిలో ఉంచే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2030 నాటికల్లా దేశీయంగా 100% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఉసురుతీసింది. కనెక్షన్ ఇవ్వడానికి స్తంభం ఎక్కిన చిరుద్యోగి దానిపైనే ప్రాణాలు విడిచాడు. ఇందులో కుట్ర దాగి ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ కింగ్‌కోఠి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్వాన్ ప్రాంతానికి చెందిన పోగుల భూమయ్య (42) విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి. మంగళవారం కింగ్‌కోఠిలోని పర్దాగేట్ సమీపంలో ఓ దుకాణంలో కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు వెళ్ళాడు. 11 గంటల ప్రాంతంలో వి ద్యుత్ సరఫరా నిలిపేసి, స్తంభంపైకి ఎక్కి కనెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఒక్కసారిగా విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు కిందికి దింపి స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే భూమయ్య మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నారాయణగూడ ఎస్సై దయాకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భూమయ్య మరణించిన విషయం తెలుసుకున్న బంధువులు పెద్దసంఖ్యలో గాంధీ మార్చురీకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అధికారుల ప్రమేయం ఉంది భూమయ్య మృతి పట్ల తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. చైర్మన్ ఈశ్వరరావు, కన్వీనర్ నాగరాజ్‌లు మాట్లాడుతూ..ఒకే ఇంటికి రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉండటంతో కరెంట్ రిటర్న్ సరఫరా జరిగి భూమయ్య చనిపోయాడన్నారు. దీని వెనుక అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తక్షణమే మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
కరెంట్ లైన్ ఉమెన్లు వస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ చరిత్రలో జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం)గా మహిళలను సైతం నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో భాగంగా కనీసం 20 అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్ స్తంభాలను అలవోకగా ఎక్కి మరమ్మతులు చేయడం జేఎల్‌ఎంల ప్రధాన బాధ్యత. కఠోర శారీరక శ్రమతో కూడి ఉండటంతో పాటు ప్రమాదకరమైన బాధ్యతలు గల ఈ వృత్తిని స్వీకరించేందుకు ఒకప్పుడు పురుషులూ ముందుకు రాకపోయేవారు. విద్యుత్ సంస్థలు ఇప్పటివరకు జేఎల్‌ఎంలుగా పురుష అభ్యర్థులనే నియమిస్తూ వస్తున్నాయి. తాజాగా జేఎల్ఎం పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించడం విద్యుత్ సంస్థల యాజమాన్యాలను పునరాలోచనలో పడేసింది. 2,553 జేఎల్ఎం పోస్టుల భర్తీకి ఉత్తర టీఎస్ఎన్పీడీసీఎల్ గత నెల 16న నోటిఫికేషన్ జారీ చేయగా, దరఖాస్తు గడువు ఈ నెల 19తో ముగియనుంది. 50 వరకు దరఖాస్తులు.. జేఎల్ఎం పోస్టులకు సుమారు 50 మంది వరకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తిరస్కరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుమేరా అంజుమ్‌తోపాటు మరో ఆరుగురు మహిళలు దరఖాస్తుల తిరస్కరణను వ్యతిరేకిస్తూ హై కోర్టును ఆశ్రయించారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను విడుదల చేయరాదని కోరింది. హైకోర్టు ఆదేశాలతో నియామక ప్రక్రియలో మహిళా అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోల్ క్లైంబింగ్లో విజయం సాధిస్తేనే.. నియామక ప్రక్రియలో భాగంగా తొలుత నిర్వహించే రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరిగా విద్యుత్ స్తంభాలను ఎక్కడంలో ఉన్న నైపుణ్యాన్ని పరీక్షించేందుకు శారీరక పరీక్షనూ నిర్వహించనున్నారు. పోల్ క్లైంబింగ్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులనే జేఎల్ఎం పోస్టులకు అర్హులుగా పరిగణిస్తారు. జేఎల్ఎం పోస్టుల భర్తీలో మహిళా అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. విద్యుత్ సంస్థలు నియామక నిబంధనలను మార్చుకుని జేఎల్ఎం పోస్టుల భర్తీలో 33 1/3 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తాయా? అమలు చేస్తే పోస్టుల నియామకంలో భాగంగా మహిళా అభ్యర్థులు విద్యుత్ స్తంభం ఎక్కి అర్హతను నిరూపించుకోవాల్సిందేనా? లేక మినహాయింపు ఇస్తారా? అనే అంశాలపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టు తీర్పు ఆధారంగానే.. కోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ఏడుగురు పిటిషనర్ల దరఖాస్తులే స్వీకరించి నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. జూనియర్ లైన్మెన్లు విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ స్తంభాలను ఎక్కాల్సి వస్తుందని, అందుకే మహిళా అభ్యర్థులను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ఎప్పటిలాగా ఈ పోస్టుల భర్తీలో నిబంధనలను అనుసరిస్తున్నామని, హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని తెలిపారు. -
హైకోర్టు జోక్యంతో కార్మికుడికి న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఓ కాంట్రాక్టర్ కింద విద్యుత్ శాఖలో పనిచేస్తూ ప్రమాదంలో చేయి కోల్పోయిన ఓ కార్మికునికి హైకోర్టు ఆదేశాలతో గౌరవప్రదమైన వేతనం దక్కింది. మొదట ఆ కార్మికునికి నెలకు రూ.5 వేలు చెల్లిస్తామని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రతి పాదించగా, దానికి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అతనికి కనీస వేతనం ఇచ్చే విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు ఆ కార్మికునికి నెలకు రూ.12 వేల వేతనాన్ని చెల్లిస్తామని కోర్టుకు నివేదించారు. సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, అధికారులపై ఆ కార్మికుడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేసింది. శుక్రవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పి.వెంకటేశ్వర్లు ఓ కాంట్రాక్టర్ కింద విద్యుత్ సంస్థలో కార్మికునిగా పనిచేస్తూ, విధి నిర్వహణలో 2011లో కుడిచేతిని పూర్తిగా కోల్పోయాడు. తనకు ఉపాధి చూపాలని కోరి నా అధికారులు స్పందించకపోవడంతో 2013 లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వెంకటేశ్వర్లు పిటిషన్‌ను కొట్టేశారు. వెంకటేశ్వర్లు ధర్మాసనం ముందు అప్పీల్ చేయగా.. జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అతని పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని టీఎస్ఎస్పీడీసీఎల్కు స్పష్టం చేసింది. అయితే అధికారులు స్పందించడం లేదని వెంకటేశ్వర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశాడు. -
సొంత కార్లు.. బినామీ బిల్లులు
సాక్షి, హైదరాబాద్: అద్దె వాహనాలు.. రాష్ట్ర ఖజానాకు భారీగా కన్నం వేస్తున్నాయి. అవసరానికి మించి వాహనాలు తీసుకోవడం.. సొంత వాహనాలను కూడా అద్దెవాహనాలుగా పెట్టడం.. ఆటో, మోటార్ సైకిళ్ల నంబర్లతో తప్పుడు బిల్లులు పెట్టి సొమ్ము స్వాహా చేయడం యథేచ్ఛగా సాగిపోతోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఈ తతంగం కొనసాగుతున్నట్లు ప్రభుత్వ విచారణలోనే వెల్లడైంది. దీంతో అక్రమాల నియంత్రణకు సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని వివిధ కార్యాలయాల్లో 500 వాహనాలు, వాటి బిల్లులను తనిఖీ చేయించింది. అందులో 173 మంది అధికారులు అద్దె వాహనాల పేరుతో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది. ‘అద్దె’వెసులుబాటుతో దందా రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం అమల్లో ఉంది. అవసరమైతే అన్ని విభాగాలు, అన్ని శాఖలు, కార్యాలయాల అధికారులు అద్దె వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణిస్తే జిల్లాల్లో నెలకు రూ.33 వేలు, హైదరాబాద్‌లో రూ.34 వేలు చెల్లించేలా నిబంధనలను విధించింది. 2,500 కిలోమీటర్లకు మించి తిరిగితే ఆర్థిక శాఖ అనుమతితో అదనపు బిల్లులు చెల్లించేలా షరతులు విధించింది. ఈ వెసులుబాటును అధికారులు దందాగా మార్చుకున్నారు. ఇలా వేలాది వాహనాలు చేరి, ఖర్చు కోట్లలోకి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తల పట్టుకుంటోంది. ఇక ఎలాగూ ప్రభుత్వానికే నడుపుతున్నామనే ఉద్దేశంతో అద్దె వాహనాల యజమానులు ట్యాక్సీ పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఆర్టీఏకు కట్టాల్సిన పన్నులు చెల్లించడం లేదు. దాంతో ఖజానాకు గండి పడుతోంది. ఆన్లైన్లోనమోదుతో అడ్డుకట్ట అద్దె వాహనాల బాగోతంపై ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. దీనికి కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యాలయాల వారీగా ప్రస్తుతమున్న వాహనాలు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటికి చెల్లిస్తున్న అద్దె వివరాలను సేకరిస్తోంది. వాటిని ఆన్లైన్లో నమోదుచేసి.. అలా నమోదైన వాహనాలకు సంబంధించి మాత్రమే బిల్లులు చెల్లించేలా ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఎన్నెన్నో అక్రమాలు - హైదరాబాద్‌లోని అత్యధిక కార్యాలయాల్లో టెండర్లు పిలవకుండానే వాహనాలను అద్దెకు తీసుకున్నారు. - రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది అధికారులు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపి, బినామీ పేర్లతో బిల్లులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. - రెగ్యులర్ పోస్టుతో పాటు అదనంగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు అధికారులు.. రెండు పోస్టుల పేరుతో రెండు అద్దె వాహనాలు చూపుతూ, రెండు చోట్లా బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. - విద్యుత్ శాఖ, హైదరాబాద్ వాటర్ సప్లై విభాగాల్లో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ ఇంజనీర్లు, డీజీఎం స్థాయి అధికారులు నిర్ణీత రూ.33 వేల కంటే అధికంగా బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారు. - ఇక కొందరు అధికారులైతే కార్లు వినియోగించినట్లుగా చూపుతూ ఏకంగా బైకులు, ఆటోల నంబర్లు వేసి తప్పుడు బిల్లులు పెట్టారు. మరికొందరు ప్రైవేటు ట్రావెల్స్, అద్దె కార్ల ఓనర్లకు డబ్బులిచ్చి వారి కార్ల పేరిట తప్పుడు బిల్లులు తీసుకుని.. సొమ్ముచేసుకుంటున్నారు. - ఇలా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు.. జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆఫీసుల్లో సిబ్బందిని మామూళ్లతో మభ్యపెట్టి.. బిల్లులు పాస్ చేయించుకుంటున్నట్లు తేలింది. - పాత మహబూబ్‌నగర్ జిల్లాలో హౌజింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఇంజనీరింగ్ అధికారి బినామీ పేరుతో సొంత వాహనాన్ని అద్దెకు పెట్టడంతో పాటు.. దానికి అవసరమయ్యే డీజిల్‌ను సైతం కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. -
నెల జీతం రూ.5 వేలేనా!
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో చేయి కోల్పోయిన విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికునికి కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలిక ఉద్యోగమిచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్.. అతనికి రూ.5 వేలు వేతనం నిర్ణయించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5 వేలతో కుటుంబాన్ని పోషించడం ఎలా సాధ్యమవుతుందని సంస్థ అధికారులను ప్రశ్నించింది. ఆ కార్మికుడు సంస్థ కోసం పనిచేస్తూ చేయి కోల్పోయిన విషయం మర్చిపోవద్దని, కనీస వేతనమైనా ఇచ్చే విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మానవతా దృక్పథంతో మన్నించండి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన పి.వెంకటేశ్వర్లు ఓ కాంట్రాక్టర్ కింద విద్యుత్ సంస్థలో కార్మికునిగా పనిచేస్తూ 2011లో విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో కుడిచేతిని కోల్పోయారు. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని అధికారులను కోరినా స్పందించకపోవడంతో 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. టీఎస్ఎస్పీడీసీఎల్, వెంకటేశ్వర్లు మధ్య యజమాని, ఉద్యోగి సంబంధం లేనందున ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలివ్వలేమని 2016 జూలైలో తీర్పునిచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు వెంకటేశ్వర్లు అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్‌పై విచారణ జరిపిన జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం.. వెంకటేశ్వర్లు విద్యుత్ సంస్థ కోసం పనిచేస్తూ ప్రమాదం బారిన పడ్డారని, మానవతా దృక్పథంతో అతని అభ్యర్థనను మన్నించాల్సిన బాధ్యత టీఎస్ఎస్పీడీసీఎల్పై ఉందని పేర్కొంది. టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రకటించిన రూ.లక్ష నష్టపరిహారం తీసుకోవాలని వెంకటేశ్వర్లును ఆదేశించింది. అయితే ఉద్యోగం విషయంలో అధికారులు స్పందించకపోవడంతో వెంకటేశ్వర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. టీఎస్ఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వెంకటేశ్వర్లును తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్‌గా నియమించామని, నెలకు రూ.5 వేలు వేతనంగా నిర్ణయించామని చెప్పారు. వెంకటేశ్వర్లు తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రూ.5 వేలతో బతకడం కష్టసాధ్యమన్నారు. ఆ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, కనీస వేతనం విషయంలో పునరాలోచించాలని టీఎస్ఎస్పీడీసీఎల్ను ఆదేశించింది. -
విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించడం మూడున్నరేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత విజయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గట్టెక్కించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా తీర్చిదిద్దిన ఘనత విద్యుత్ సంస్థల ఉద్యోగులకే దక్కుతుందని సీఎం కితాబునిచ్చారు. దేశమంతా తెలంగాణవైపు చూసే విధంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించారని అభినందించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత గొప్ప ఖ్యాతిని సముపార్జించి పెట్టిన విద్యుత్ ఉద్యోగులకు అభినందనపూర్వకంగా ఈ నెల నుంచి వర్తించేలా ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజలంతా విద్యుత్‌శాఖ పనితీరుపట్ల తృప్తిగా, ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్న నేపథ్యంలో జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఇతర విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ప్రభాకర్‌రావును ఆలింగనం చేసుకుని అభినందించారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులను పేరు పేరునా పలకరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాష్ట్రంలోని రైతులతోపాటు అన్ని వర్గాల నూతన సంవత్సర ఆనందాన్ని రెట్టింపు చేశారని, అందుకోసం విద్యుత్ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు విద్యుత్ అధికారుల హర్షధ్వానాల మధ్య íసీఎం ప్రకటించారు. ‘‘వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. దశాబ్దాలపాటు రైతులు అనుభవించిన కరెంటు కష్టాలకు శాశ్వత విముక్తి కలిగించాలనే లక్ష్యంతో వ్యయ, ప్రయాసలకోడ్చి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించాం. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వలేదు. అయినా రైతులకు అత్యంత అవసరమని భావించి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించాం. 2018 ఫిబ్రవరి లేదా మార్చి నుంచి 24 గంటల సరఫరా చేయాలని మొదట భావించినా జనవరి 1 నుంచే యాసంగి పంటలు చేసుకునేలా 24 గంటల సరఫరా ప్రారంభించడం సంతోషకరం. సాగుకు 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరేదీ లేదు. పక్కా ప్రణాళికతో, పకడ్బందీ కార్యాచరణతో ముందుకుపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది.’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎంను కలసిన వారిలో టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు అశోక్ కుమార్, వెంకటరాజం, లలిత్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కమాలుద్దీన్ అలీఖాన్, ట్రాన్స్‌కో డైరెక్టర్ జి.నర్సింగ్‌రావు, పీజీసీఎల్ ఈడీ వి.శేఖర్, జీఎం ఎస్.రవి తదితరులున్నారు. సీఎం కేసీఆర్‌కు ట్రాన్స్‌కో సీఎండీ కృతజ్ఞతలు విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికీ ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నిర్ణయం విద్యుత్‌శాఖ ఉద్యోగుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని, వారంతా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దార్శనికత, మార్గదర్శకంలో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపరచగలిగాయన్నారు. -
స్వీపర్‌కు విద్యుత్ శాఖ ఏఏవో వేధింపులు
సత్తెనపల్లి: స్వీపర్‌పై విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) వేధింపులకు పాల్పడుతున్న వైనంపై బాధితురాలు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ దొరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన లేఖ ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉద్యోగుల సెల్ఫోన్లలోని వాట్సప్‌లో హల్ చల్ చేస్తోంది. వివరాలు ఇలా... పట్టణంలోని విద్యుత్ శాఖలో లైన్మెన్గా పని చేస్తూ రమేష్ నాయక్ మృతి చెందాడు. దీంతో ఆయన భార్యకు పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల ఈఆర్వో కార్యాలయంలో స్వీపర్‌గా ఏడాదిన్నర క్రితం ఉద్యోగమిచ్చారు. కార్యాలయంలో ఏఏవోగా పని చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి ఎనిమిది నెలలుగా తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 2017 నుంచి కార్యాలయం సమయం దాటిన తరువాత ఫోన్ చేస్తూ అభ్యకరంగా మాట్లాడుతున్న చెప్పింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని పేర్కొంది. ఈ నెల 3న సాయంత్రం 4.30 గంటలకు జేఏవో అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లినా మరుసటి రోజు వేధింపులకు గురి చేశాడని తెలిపింది. ఏఏవోతో తనకు ప్రాణ హాని ఉంటుందని ఎనిమిది నెలలుగా వేధింపులు భరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఓపిక పట్టలేక ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆయన జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విచారణ నిమిత్తం ఇద్దరు ఉన్నతాధికారులను నియ మించారు. అధికారులు మంగళవారం సత్తెనపల్లి చేరుకుని ఏఏవో విచారణ చేపట్టారు. తొలుత బాధితురాలిని విచారించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. మరో వైపు స్వీపర్‌తో రాజీ చేసేందుకు కొందరు ఉద్యోగులు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. జరిగిందేదో జరిగింది ఇకపై నీ జోలికి రాకుండా చూస్తామని, ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని కోరుతున్నారు. కాగా రాజీ చర్చలు ఫలించలేదు. ఈ వ్యవహారం విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. -
పదోన్నతుల పాకులాట
కొందరు పోస్టింగ్ కోసం వేచిచూస్తున్నారు. మరికొందరు పదోన్నతి కోసం పైరవీలు చేస్తున్నారు. వెరసి విద్యుత్ శాఖలో పనులు మాని పదోన్నతులు, పోస్టింగుల కోసం పాకులాడుతున్నారు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే శాఖలో అర్హులకు న్యాయం జరుగుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. నిజామాబాద్‌నాగారం: విద్యుత్‌శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతోంది. యూనియన్ల నాయకులు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం నిర్వహించే యూడీసీ నుం చి జూనియర్ అకౌంట్ ఆఫీసర్(జేఏవో) సంబంధించి 32 పోస్టులకు పదోన్నతులు కల్పించి మూన్నెళ్లు అయ్యింది. పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. దీంతోపాటు ఏఈ నుం చి ఏడీఈ పదోన్నతుల కోసం ఇప్పటికే జాబితాలో పేర్లు ఉన్నవారు పైరవీలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇది వరకే వరంగల్‌లో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు 48 జేఏవో నుంచి అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్(ఏఏవో)గా పదోన్నతులు కల్పించారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా పారదర్శంగా పదోన్నతులు పోస్టింగ్‌లిచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఆయన బుధవారం ఇక్కడికి రానున్నారు. దీంతో ఇక్కడ ఎలా జరుగుతుందోనన్న సందిగ్ధం నెలకొంది. 29 మందికి పదోన్నతులు నిజామాబాద్ విద్యుత్‌శాఖ సర్కిల్ పరిధిలో 29 మందికి పదోన్నతులు కల్పించారు. కామారెడ్డి, నిజామాబాద్ రెండు జిల్లాలకు కలిపి మొత్తం 29 మంది ఎల్డీసీ నుంచి యూడీసీ పదోన్నతులు ఎస్ఈ కల్పించారు. సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి ఈ పదోన్నతులవారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ నేత కోసమే.. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో మొత్తం 32 జేఏవో పదోన్నతులకు యూడీసీ వారికి జిల్లాశాఖ అధికారి ప్రభాకర్ డీపీసీ ద్వారా కల్పించారు. అయితే పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. ఇందుకు ప్రధాన కారణం జేఏవో పోస్టుల్లోనివారికి ఏఏవోగా పదోన్నతి కల్పిండంలో సీనియారిటీ దెబ్బతింటుందని. ఇవి మూన్నెళ్ల క్రితమే ఇ వ్వడంతో ఓ ప్రధాన కార్మిక సం ఘం నేతకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ పదోన్నతులు కేవలం ఆ సంఘం నేత కోసమే జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. త్వరలోనే ఏఈలకు పదోన్నతులు రెండు నెలలుగా ప్రధాన పోస్టుల కోసం పైరవీలు చేస్తూనే ఉన్నారు. వరంగల్ పరిధిలో మొత్తం 5 సర్కిళ్లలో 160 ఏడీఈ పోస్టులకు పదోన్నతులు రానున్నాయి. వీరిలో ఆంధ్రవారికి 43 పోగా మిగతా 117 పోస్టులకు పదోన్నతులు కల్పించాలి. ఏఈ నుంచి ఏడీఈగా మారేందుకు ఎవరికి వారే పనులు పక్కనబెట్టి పైరవీలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వరంగల్ ఉన్నతాధికారుల దగ్గరికి చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో టౌన్–2 సెక్షన్ ఏర్పడనుండడంతో అదనంగా ఏడీఈ పోస్టు రానుంది. దీని కోసం జిల్లాలో సుమారుగా 15మంది ఏఈలు తీవ్రంగా పైరవీలు చేస్తున్నారు. -
రెండేళ్లలో ఎల్ఈడీ కాంతులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంపిక చేసిన 60 మంది సర్పంచ్‌లకు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. 2019 మార్చి 31 నాటికి ప్రతి గ్రామానికి ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో 60 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామన్నారు. ఇందుకోసం కేంద్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఎఫ్‌ఎస్‌ఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ బల్బులు అమర్చడం వల్ల గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడదని, పెట్టుబడి లేకుండా పంచాయతీలు విద్యుత్ ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. థర్డ్ వైర్ సౌకర్యం ఉన్న పంచాయతీలు ముందుకు వస్తే ఈఎఫ్‌ఎస్‌ఎల్.. ఆయా గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. పంచాయతీలు సొంతంగా లేదా విద్యుత్ శాఖ ద్వారా లేదా 14వ ఫైనాన్స్ నిధుల నుంచి థర్డ్ వైర్ సౌకర్యం కల్పించుకోవచ్చన్నారు. 72 గంటల్లో పునరుద్ధరణ బల్బుల పనితీరును ఆన్లైన్ ద్వారా ఈఎఫ్‌ఎస్‌ఎల్ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వెలగని బల్బులను 72 గంటల్లో తిరిగి పునరుద్ధరిస్తారని, అలా పునరుద్ధరించకుంటే.. రోజుకి బల్బుకి రూ.5 చొప్పున పంచాయతీకి కంపెనీ చెల్లిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు సంస్థతో 5, 7, 10 ఏళ్లు ఒప్పందం కుదుర్చుకోవచ్చని తెలిపారు. ఒప్పందాన్ని బట్టి ఆదా అయిన డబ్బులో 80 శాతం సంస్థకు, 20 శాతం పంచాయతీకి దక్కుతుందన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు ఉపయోగించుకోవాలన్నారు. -
కబళించిన కరెంట్ తీగ
స్తంభంపైనే కాంట్రాక్టు ఉద్యోగి మృతి నారాయణఖేడ్: విద్యుదాఘాతంతో ఓ విద్యుత్‌శాఖ కాంట్రాక్టు ఉద్యోగి మరణించారు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం గంగాపూర్ శివారులో శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ నరేందర్ కథనం ప్రకారం.. మండలంలోని తుర్కవడ్‌గాం గ్రామానికి చెందిన విఠల్, నిర్మల దంపతుల కుమారుడు లడ్డ జనార్దన్ (22) ఐటీఐ పూర్తి చేశాడు. విద్యుత్‌శాఖలో కాంట్రాక్టు పద్ధతిన స్పాట్ బిల్లింగ్ చేసే విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ర్యాకల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని గంగాపూర్ శివారులో 11 కేవీ లైన్ మరమ్మతుల విషయమై లైన్‌మన్ వెంకటయ్య.. జనార్దన్‌ను స్తంభం ఎక్కించి పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా జరిగి అతను అక్కడికక్కడే మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జనార్దన్ మరణించాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ వివరించారు. -
బదిలీ బంతాట..!
♦ విద్యుత్ శాఖలో వింతలు ♦ ఒకే ప్రాంతంలో 23 ఏళ్లున్నా బదిలీ లేదు ♦ జూనియర్లను బదిలీ చేసిన అధికారులు ♦ సీనియారిటీ కోసం మూడు జాబితాల రూపకల్పన ♦ పట్టించుకోని ఉద్యోగ సంఘాలు ♦ ఆవేదన వ్యక్తం చేస్తున్న బదిలీ అయిన జూనియర్లు సాక్షి, రాజమహేంద్రవరం :ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో జరిగిన బదిలీల్లో అనేక చిత్రాలు చోటుచేసుకున్నాయి. సీనియర్లను బదిలీ చేయాల్సిన ఈపీడీసీఎల్ జూనియర్లను బదిలీ చేసింది. బదిలీల్లో పారదర్శకత లోపించే విధంగా సీనియారిటీ నిర్ధారణకు అధికారులు మూడు జాబితాలను రూపొందించారు. చివరి రోజు వరకు ఏ జాబితా ప్రకారం బదిలీ చేస్తారో తెలియక ఉద్యోగులు తికమక పడ్డారు. బదిలీ ప్రక్రియ ముగిసినా తర్వాత చూస్తే 23 ఏళ్లు ఒకే స్టేషన్లో పని చేస్తున్నా ఉద్యోగులను బదిలీ నుంచి తప్పించుకున్నారు. వారికన్నా జూనియర్లు మాత్రం బదిలీ అయ్యారు. విద్యుత్ శాఖలో ఒకే స్టేషన్లో ఐదేళ్లు, పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న వారిని బదిలీ చేయాలి. అదేవిధంగా మొత్తం పోస్టుల్లో బదిలీలు 20 శాతానికి మించకూడదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలు తమ తమ పరిధిలో బదిలీలు చేపట్టాయి. సీనియారిటీ నిర్ధారణ కోసం ఏపీఈపీడీసీఎల్ మూడు జాబితాలు తయారు చేయడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ మాత్రం ఒకే జాబితా తయారు చేసి సీనియారిటీ ప్రకారం బదిలీ చేసింది. మూడు జాబితాలతో నష్టపోయిన జూనియర్లు... స్టేషన్లో ఐదేళ్లుకుపైగా, పోస్టులో మూడేళ్లకుపైగా ఉన్న ఉద్యోగులతో మొదటి జాబితా, పోస్టులో మూడేళ్లకు పైగా ఉన్న ఉద్యోగులతో రెండో జాబితా, స్టేషన్లో ఐదేళ్లకుపైగా ఉన్న ఉద్యోగులతో మూడో జాబితాను ఏపీఈపీడీసీఎల్ తయారు చేసింది. మొదటి జాబితా ప్రకారం రాజమహేంద్వరం సర్కిల్లో బదిలీలు చేపట్టింది. ఇక్కడే జూనియర్లకు అన్యాయం జరిగింది. ఏపీఎస్పీడీసీఎల్ తయారు చేసిన లిస్టులో స్టేషన్లో సీనియారిటీ, తర్వాత పోస్టులో ఎంత కాలం ఉన్నారో (మూడేళ్లకు తక్కువగా ఉన్నా) సీనియారిటీ ప్రకారం తయారు చేసింది. కానీ ఏపీఈపీడీసీఎల్‌లో మాత్రం మొదటి లిస్టులో స్టేషన్లో ఐదేళ్ల సీనియారిటీ, పోస్టులో మూడేళ్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది. ఇక్కడ ఒకే స్టేషన్లో 23 ఏళ్లుగా పని చేస్తున్న వారు పోస్టులో మూడేళ్ల పూర్తి కాలేదని మొదటి లిస్టులో చేర్చలేదు. వీరిని స్టేషన్లో సీనియారిటీ ప్రకారం మూడో జాబితాలో చేర్చారు. ఇక రెండో లిస్టును పోస్టులో సీనియారిటీ ప్రకారం సిద్ధం చేశారు. ఇవిగో బదిలీ ‘చిత్రాలు’... ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి చిత్రాలు చోటుచేసుకున్నాయో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ల(జేఏఓ) ఉద్యోగుల బదిలీల తీరును పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతాయి. రాజమహేంద్రవరం సర్కిల్ (జిల్లా మొత్తం)లో మొత్తం 17 మంది జూనియర్ అకౌంట్ ఆఫీసర్లున్నారు. ఇందులో మొదటి లిస్టు (స్టేషన్, పోస్టు సినియారిటీ)లోకి కేవలం 9 మందే వచ్చారు. వీరిలో 13 ఏళ్ల ఏడు నెలల 26 రోజుల స్టేషన్ సీనియారిటీ, మూడేళ్ల 9 నెలల 29 రోజులతో జి.కృష్ణారావు అనే ఉద్యోగి మొదటి స్థానంలో ఉండగా కె.వరప్రసాద్‌రావు అనే ఉద్యోగి స్టేషన్, పోస్టులు రెండింటిలోనూ ఐదేళ్ల 4 నెలల 29 రోజులతో చివరి స్థానంలో ఉన్నారు. మొత్తం 17 మంది జేఏఓలలో ఒకే స్టేషన్లో వివిధ క్యాడర్లలో 23 ఏళ్ల ఐదు రోజులతో వి.సుజాత అనే ఉద్యోగి మొదిటి స్థానంలో ఉన్నారు. ఆమె తర్వాత కె.ఎస్.వి.విజయలక్ష్మి 22 ఏళ్ల 9 నెలల 10 రోజులు, కె.మోహనరావు 22 ఏళ్ల 18 రోజులు, నక్కా రాజేశ్వరి 21 ఏళ్ల 11 నెలల 31 రోజులు, జి. కృష్ణారావు 13 ఏళ్ల 7 నెలల 26 రోజులు, సీహెచ్.అగస్థేశ్వరరావు 10 ఏళ్లు, కె.రవీంద్రబాబు 9 ఏళ్ల 9 నెలల 29 రోజులు, ఎం. సాల్మన్‌రాజు ఆరేళ్ల 3 నెలల 31 రోజులు, వి.సత్యనారాయణ మూర్తి 5 ఏళ్ల 11 నెలల 22 రోజులుగా పని చేస్తున్నారు. అయితే వీరందరినీ బదిలీల ప్రక్రియలోకి తీసుకోని అధికారులు పోస్టులో ఐదేళ్ల సీనియారిటీ ఉన్న ఎనిమిది మందిని బదిలీ చేశారు. ఒకటో జాబితాలో మొదటి స్థానంలో ఉన్న జి.కృష్ణారావు అనే ఉద్యోగిని కూడా బదిలీ చేయని అధికారగణం తర్వాత ఉన్న ఎనిమిది మందిని బదిలీ చేసింది. వీరందరూ స్టేషన్, పోస్టులలో ఒకే సీనియారిటీ ఉన్న వారు కావడం గమనార్హం. ఒకే స్టేషన్లో 23 ఏళ్లుగా ఉన్న ఉద్యోగులను బదిలీ చేయని ఉన్నతాధికారులు ఆ స్టేషన్లో ఐదేళ్లు అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న జూనియర్ అధికారులను బదిలీ చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యోగుల సంఘాలు కూడా మిన్నకుండిపోవడంతో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. -
పైసలిస్తారా? పవర్ ఆపేయాలా?
తెలంగాణకు ఏపీ జెన్కో ఎండీ లేఖ.. సాక్షి, అమరావతి: విద్యుత్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ తెలంగాణకు ఏపీ జెన్కో ఎండీ బుధవారం లేఖ రాశారు. బకాయిలు నెలా ఖరులోగా చెల్లించాలని, లేకుంటే విద్యుత్‌ను నిలిపివేస్తామని హెచ్చరించారు. అవసరమైతే చట్టపరమైన చర్యలకూ వెనుకాడేది లేదన్నారు. రోజూ పది మిలియన్ యూనిట్లు ఏపీ నుంచి తెలంగాణకు అదనంగా విద్యుత్ వెళ్తోంది. దీనికి తెలంగాణ సంస్థలు 2014 నుంచి ఇప్పటి వరకు రూ.4,800 కోట్లు చెల్లించాలని ఏపీ లెక్కతేల్చింది. ఇందుకు తెలంగాణ అభ్యంతరం తెలపగా.. సంప్రదింపుల తర్వాత తెలంగాణ రూ.3,200 కోట్లు ఇవ్వాలని నిర్ణయానికొచ్చారు. అయినా చెల్లించకపోవడంతో ఈనెల 31 వరకు గడువిచ్చి.. తర్వాత సరఫరా నిలిపివేయాలని ఏపీ సంస్థలు నిర్ణయించాయి. -
బయటి విద్యుత్ కొంటే అదనపు సర్‌చార్జి
- యూనిట్‌పై రూ.1.50–రూ.2 వరకు విధిస్తాం - పరిశ్రమలకు తేల్చిచెప్పిన విద్యుత్ శాఖ - జూలై నుంచి అమల్లోకి? సాక్షి, హైదరాబాద్: తాము సరఫరా చేస్తున్న విద్యుత్‌ను కాదని బహిరంగ మార్కెట్ నుంచి నేరుగా విద్యుత్ కొనుగోలు చేసే పరిశ్రమలపై యూనిట్‌కు రూ.1.50 నుంచి రూ.2 వరకు అదనపు సర్‌చార్జి విధిస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) స్పష్టం చేసింది. ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుత్ కొంటున్న వినియోగదారులపై ఇప్పటి కే దేశంలోని ఏడు రాష్ట్రాల్లో అదనపు సర్‌చార్జీ విధిస్తుండగా, త్వరలో రాష్ట్రంలో అమలు చేస్తా మని వెల్లడించింది. ఓపెన్ యాక్సెస్‌లో విద్యు త్ కొనుగోలు చేస్తున్న 42 పరిశ్రమల యాజ మాన్యాలతో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు బుధవారం సమావేశమై ఈ విషయాన్ని తెలియజేశారు. గత ఆర్థిక సంవత్స రంలో ఈ పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ విధా నంలో 3,018 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ప్రైవేటు విద్యుదుత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలు రాత్రివేళ తక్కువ ధరకు విద్యుత్ ఎక్సేS్చంజీల నుంచి కొనుగోలు చేసి పగటి పూట మాత్రం డిస్కంల నుంచి విద్యుత్ కొంటున్నాయి. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా పలు విద్యుదు త్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు సమీకరించిన విద్యుత్ రాత్రి పూట నిరుపయోగంగా ఉండిపో తోంది. పలు పరిశ్రమలు ఓపెన్ యాక్సెస్ విధా నంలో బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండడంతో డిస్కంల విద్యుత్ సరఫరా డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో పీపీఏల్లోని నిబంధనల మేరకు డిస్కంలు రూ. 400 కోట్ల వరకు స్థిర చార్జీలను విద్యుదుత్పత్తి కంపెనీల కు చెల్లించాల్సి వచ్చింది. ఉత్తర– దక్షిణ విద్యు త్ గ్రిడ్లను అనుసంధానం చేస్తూ వార్ధా–డిచ్ పల్లి–మహేశ్వరం 765 కేవీ విద్యుత్ లైన్ అందుబాటులోకి రావడంతో ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లే వినియోగదారుల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చట్టంలోని నింబంధనల ప్రకారం ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై అదనపు సర్‌చార్జి విధించనున్నామని రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓపెన్ యాక్సెస్‌పై అదనపు సర్‌చార్జి విధిస్తున్నారన్నారు. ఈఆర్సీ ఆమోదంతో జూలై నుంచి దీన్ని అమలు చేసే అవకాశముందన్నారు. -
రేపటి నుంచి ఎల్ఈడీ బల్బుల మార్పిడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. పాడైన ఎల్ఈడీ బల్బుల స్థానం లో కొత్త బల్బులను ఉచితంగా పంపిణీ చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. బుధవారం నుంచి రోజుకు రెండేసి మండలాల్లో బల్బుల పంపిణీకి సమాయత్తం చేశారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్ అధికారులు అవసరమైన మేర కొత్తబల్బులు సిద్ధం చేశారు. గత మార్చి, ఏప్రిల్ మాసాల్లో అధికారులు ఈఈఎస్ఎల్ సంస్థకు చెందిన ఎల్ఈడీ బల్బులను ఇంటికి రెండేసి చొప్పున పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 14.80 లక్షల బల్బులను అప్పట్లో పంపిణీ చేయగా ఇందులో 10 శాతం బల్బులు పాడయ్యాయి. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనార్థం పాడైన బల్బుల స్థానంలో కొత్త బల్బులను పంపిణీ చేయడానికి ఈఈఎస్ఎల్ అంగీకరించింది. దీంతో బుధవారం నుంచి పంపిణీకి వాహనాలు బయలుదేరుతున్నాయని ఎస్ఈ హరనాథరావు సోమవారం సాయంత్రం తెలిపారు. ఏ రోజు ఎక్కడంటే... ఒక వాహనంలో ఈ నెల 23న తిరుపతి బాలాజీకాలనీ, రాజీవ్‌నగర్, 24న తిరుపతి ఉత్తరం, పశ్చిమం, 25న తిరుపతి దక్షిణం, తిరుపతి రూరల్, 26న తిరుచానూరు, సబ్‌స్టేషన్, 28న మంగళం, మంగళం రూరల్ 29న కొర్లకుంట, దామినేడు ప్రాంతాల్లో పర్యటించి, బల్బులు పంపిణీ చేస్తారు. అలాగే మరో వాహనంలో 23న ఏర్పేడు, శ్రీకాళహస్తి రూరల్, 24న కేవీబీ పురం, పాపానాయుడు పేట, 25న బుచ్చినాయుడు కండ్రిగ, తొట్టంబేడు, 26న పాకాల ఆపరేషన్, పాకాల రూరల్, 28న చంద్రగిరి, చంద్రగిరి రూరల్, 29న తిరుపతి రూరల్, కల్లూరు 30న శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి సీసీఓ వద్ద పంపిణీ చేస్తారు. అలాగే మూడో వాహనంలో 23న చిన్నగొట్టిగల్లు, ఎర్వ్రారిపాళెం, 24న రొంపిచెర్ల, పీలేరు రూరల్, 25న పీలేరు, గర్నిమిట్ట 26న సదుం, సోమల 28న కలికిరి, కలకడ, 29న వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో పంపిణీ చేస్తారు. నాలుగో వాహనంలో 23న రాయలచెరువు, వెదురుకుప్పం, 24న వడమాలపేట, పుత్తూరు 25న పుత్తూరు రూరల్, నారాయణవనం 26న నిండ్ర, పిచ్చాటూర్, 28న నగరి, నగరి రూరల్ 29న కార్వేటినగరం, ఎస్ఆర్పురం, 30న వరదయ్యపాలెం, చెరివి ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నాగలాపురం, పన్నూరు, 2న సత్యవేడు మండలాల్లో పంపిణీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్లో.. అలాగే చిత్తూరు డివిజన్లో డిసెంబరు ఒకటో తేదీన పూతలపట్టు, మిట్టూరు, 2న సంతపేట, గిరింపేట, 3న కొంగారెడ్డిపల్లి, చిత్తూరు రూరల్, 5న పెనుమూరు, గంగాధర్‌నెల్లూరు 6న ఆవల్కొండ, పాలసముద్రం, 7న రొంపిచెర్ల, పీలేరు రూరల్ 8న కొత్తపల్లి, రెడ్గిగుంట మండలాల్లో పంపిణీ చేస్తారు. రెండో వాహనం ద్వారా డిసెంబరు ఒకటిన అరగొండ, పైపల్లి, 2న ఐరాల, ఐరాల రూరల్, 3న బంగారుపాళెం, యాదమర్?ర, 5న బంగారుపాళెం, రూరల్, గంగవరం, 6న పలమనేరు, పలమనేరు రూరల్ 7న బెరైడ్డిపల్లి, వీ.కోట మండలాల్లో పంపిణీ చేస్తారు. మూడో వాహనం ద్వారా నబంబరు 30న నిమ్మనపల్లి, చౌడేపల్లి, డిసెంబరు ఒకటో తేదీన పెద్దపంజాణి, పుంగనూరు, 2న పుంగనూరు, రామసముద్రం, 3న మదనపల్లి ఈస్ట్, మదనపల్లి నార్త్, 5న మదనపల్లి వెస్ట్, మదనపల్లి టౌన్, 6న కురబలకోట, బీ. కొత్తకోట, 7న పెద్ద తిప్పసముద్రం, ములకలచెరువు, 8న తంబళ్లపల్లి, పెద్దమండ్యం, 9న సీటీఎం మండలాల్లో పాడైన బల్బులకు కొత్త బల్బులు పంపిణీ చేయనున్నారు. -
సిటీపై వాన వేటు
-
సిటీపై వాన వేటు
- మూడు గంటల వర్షానికి అతలాకుతలమైన భాగ్యనగరి - వర్ష విలయానికి ఏడుగురు మృత్యువాత సాక్షి, హైదరాబాద్: మహానగరం మరోసారి ముంపునకు గురైంది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన జడివాన దాటికి భాగ్యనగరం కాస్తా.. అభాగ్య నగరంగా మారిపోయింది. మూడు గంటల వర్షవిలయానికి ఏడు నిండు ప్రాణాలు బలయ్యాయి. రామంతాపూర్ ప్రగతి నగ ర్లో గోడ కూలి గుడిసెపై పడడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్ కాలనీలో పురాతన ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు తనువు చాలించారు. గ్రేటర్ పరిధిలో బుధవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు సగటున 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అంబర్‌పేట్‌లో 12.1 సెం.మీ వర్షపాతం రికార్డయ్యింది. వర్షవిలయానికి 150కిపైగా బస్తీలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోవడంతో నగరవాసులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. చెరువులను తలపించేలా రహదారులు.. నోళ్లు తెరచిన నాలాలు భయభ్రాంతులకు గురిచేశాయి. దీంతో ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఉద్యోగులు మధ్యాహ్నానికి ఆఫీసులకు చేరుకున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రూ.కోట్లలో ఆస్తినష్టం సంభవించినట్లు జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. భారీ వర్షానికి నగరంలో పది ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సిటీ బస్సులు సైతం ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోయాయి. నగరంలో మూడు వేల బస్సు ట్రిప్పులు రద్దవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడం.. పలు సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. భోలక్‌పూర్‌లో తల్లి సహా చిన్నారుల మృతి భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్ కాలనీలో నదీమ్ జానీ సెల్‌ఫోన్ రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య బిల్కిస్ బేగం(25) ఇద్దరు కుమార్తెలు జయభా ఫాతిమా(5), మార్య(3)తో కలసి వందేళ్ల క్రితం నిర్మించిన పురాతన ఇంట్లో నదీమ్ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో భారీ వర్షానికి ఇంటి పైకప్పు నుంచి మట్టి రాలి పడుతుండటంతో.. అనుమానం వచ్చి నదీమ్ ఇంటి బయటకు వచ్చి పరిశీలించసాగాడు. ఇదే సమయంలో ఒక పక్కన ఉన్న గోడ కూలి భార్య, ఇద్దరు కుమార్తెలపై పడింది. పై కప్పు కూడా ఒక్కసారిగా పడటంతో ముగ్గురూ విగతజీవులయ్యారు. పెద్ద కూమార్తె పప్పా...పప్పా... అంటూ అరవడంతో ఆమెను రక్షించేందుకు నదీమ్ ప్రయత్నించినా విద్యుత్ తీగలు అడ్డంకిగా మారాయి. విద్యుత్ సరఫరాను నిలిపేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా ఎవ్వరూ స్పందించకపోవడంతో కళ్ల ముందు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ వారిని కాపాడే సాహసం ఎవరూ చేయలేపోయారు. చాలా సేపటి తర్వాత శిథిలాలు తొలగించి చికిత్స నిమిత్తం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బిల్కిస్ బేగం, ఓ కూతురు చనిపోయారని వైద్యులు తెలిపారు. మరికొద్దిసేపటికి చికిత్స పొందుతూ మరో కూమార్తె కూడా మరణించింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం.. నగరంలో చిలకలగూడలోని పురాతన భవనం కూలిన దుర్ఘటన అనంతరం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు హడావిడిగా సర్కిల్-9ఏలో పలు పురాతన భవనాలకు నోటీసులు జారీ చేసి కొన్నింటిని కూల్చేశారు. అయితే భోలక్‌పూర్‌లో ఘటన జరిగిన భవనానికికూడా నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారి జగన్మోహన్ తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని చెప్పినా ఖాళీ చేయలేదన్నారు. అయితే తమకెవరూ నోటీసులు జారీ చేయలేదని ఇంటి యజమాని చెప్పారు. రామంతాపూర్‌లో గోడ కూలి.. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం మూలచింతపల్లి గ్రామానికి చెందిన గంగా బాలస్వామి(48), అతని భార్య చెన్నమ్మ(45) 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి రామంతాపూర్ ప్రగతినగర్‌లో నివసిస్తున్నారు. వీరి కూతురు పార్వతి(16) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, కొడుకు శేఖర్(11) రామంతాపూర్ చర్చి స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రగతినగర్ పెద్ద చెరువు కట్ట కింద ఉన్న ఇందిరా ఇంపీరియా భవనం ప్రహరి గోడను ఆనుకుని గుడిసె వేసుకుని వీరు నివాసముంటున్నారు. బుధవారం ఉదయం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా వీరంతా ఇంట్లోనే ఉన్నారు. 9 గంటల సమయంలో ఇందిరా ఇంపీరియా భవన ప్రహరి గోడ పునాది పటిష్టంగా లేని కారణంగా పెద్ద శబ్దంతో గుడిసెపైన కూలింది. ఆ సమయంలో గుడిసెలో టీ తాగుతున్న బాలస్వామి కుటుంబంపై రాళ్లు, మట్టి పెళ్లలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. ఏం జరుగుతుందో ఊహించేందుకు కూడా వారికి అవకాశం లేకపోయింది. కాపాడండి అంటూ పెద్దపెట్టున వారంతా ఆర్తనాదాలు చేశారు. అయితే వారి ఆర్తనాదాలు స్థానికులకు చేరులోపే శిథిలాల కింద చిక్కుకుపోయిన బాలస్వామి, కూతురు పార్వతి అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చెన్నమ్మ, కుమారుడు శేఖర్‌ను 108 వాహనంలో మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. బంధువుల నిరసన.. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేవరకు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించొద్దని బంధువులు ఆంబులెన్ ్సకు అడ్డుపడ్డారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. ససేమిరా అనడంతో మృతదేహాలను బలవంతంగా గాంధీ మార్చురీకి తరలించారు. కాగా, ప్రహారీ గోడ కూలిన ఘటనలో భవన యజమాని ఇందిరారెడ్డిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆ ఊరంతా సోలార్ వెలుగులే!
భువనేశ్వర్: ఎవరో వస్తారని, ఊరికి కరెంట్ ఇస్తారని ఇన్నాళ్లు మోసపోయారు బారిపత గ్రామస్థులు. చివరకు చైతన్యవంతులై ఒక దండుగా కదిలి సోలార్ విద్యుత్‌ను స్వయంగా తెచ్చుకున్నారు. 61 ఇళ్లు, 350 మంది జనాభా కలిగిన బారిపత గ్రామాన్ని విద్యుత్ శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. భువనేశ్వర్‌కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ కుగ్రామానికి కరెంటా? అంటూ అధికారులు కూని రాగాలు తీస్తూ వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి జాయ్ దీప్ నాయక్ రగిల్చిన చైతన్యంతో గ్రామస్థులంతా ఒకటిగా కదిలారు. నాల్కో, ఎకో సోలార్, జాన్సన్ సోలార్ తదితర అందుబాటులోవున్న అన్ని సోలార్ కంపెనీల వద్దకు తిరిగారు. చివరకు పలు కంపెనీల సహకారంతో ఊరి మొత్తానికి సోలార్ వెలుగులను తెచ్చుకున్నారు. అక్టోబర్ రెండు, గాంధీ జయంతి రోజున విద్యుత్ ప్లాంట్‌ను ఆవిష్కరించుకున్నారు. మొత్తం సోలార్ ప్లాంట్‌కు ఏడు లక్షల రూపాయలు ఖర్చుకాగా, అందులో సగం సొమ్మును గ్రామస్థులు భరించగా మిగతా సొమ్మును సోలార్ కంపెనీలే భరించాయి. ఊరి కూడలిలో పెద్ద సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, దాని నుంచి 61 ఇళ్లకు కరెంట్ ఇచ్చారు. ప్రతి ఇంటికి రెండు లైట్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి ఇంట్లో మొబైల్ చార్జర్లకు వీలుగా ప్లగ్‌లు ఏర్పాటు చేశారు. ఊరిలో ఎనిమిది వీధి లైట్లను, కమ్యూనిటీ హాలులో ఎల్సీడీ టీవీని ఏర్పాటు చేసుకున్నారు. ఊరందరికి నీటిని సరఫరాచేసే బోరింగ్‌కు కూడా సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ ప్యానెల్ వ్యవస్థ పూర్తిగా గ్రామం ఆధీనంలోనే కొనసాగుతుంది. సోలార్ ప్యానెళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడిచేందుకు, బ్యాటరీల్లో నీటి లెవళ్లను పర్యవేక్షించే బాధ్యతలను గ్రామానకి చెందిన ఐటీఐ డిప్లొమా హోల్డర్ ఎపిల్ కుమార్‌కు అప్పగించారు. -
మోత
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అపార్టుమెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే ట్రాన్స్ఫార్మర్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు బిగించుకోవాలని విద్యుత్‌శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కెపాసిటర్లు ఏర్పాటు చేసుకునేందుకు సామర్థ్యాన్ని బట్టి సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు భారం పడనుంది. అయితే, విద్యుత్ వృథాను అరికట్టేందుకే ఈ రకమైన చర్యలను చేపడుతున్నామని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం అపార్టుమెంట్ వాసులే కాకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కెపాసిటర్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు సరఫరాలో హెచ్చుతగ్గులను నివారించి.. తద్వారా ట్రాన్స్ఫార్మర్లు పదే పదే ట్రిప్ కాకుండా అరికట్టేందుకు కెపాసిటర్లు ఉపయోగపడతాయనేది విద్యుత్ శాఖ అధికారుల భావన. ఇందులో భాగంగా కేవలం అపార్టుమెంట్లకే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కెపాసిటర్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి విద్యుత్‌శాఖ సూచనలు చేసింది. కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గడంతో పాటు సమర్థవంతంగా విద్యుత్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మునిసిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలోని తాగునీటి పథకాలకూ వీటిని బిగించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా మునిసిపాలిటీలు, పంచాయతీ లుచర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యవసాయ మోటార్లకూ ఏర్పాటు కెపాసిటర్ల వినియోగాన్ని వ్యవసాయ మోటార్లకూ తప్పనిసరి చేయాలని ఇప్పటికే విద్యుత్‌శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతివ్వాలంటూ ఉన్నతాధికారులకు జిల్లా విద్యుత్‌శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే, కెపాసిటర్లకు అయ్యే మొత్తాన్ని రైతులు భరించుకోవాల్సి ఉంటుందా? విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లే భరిస్తాయా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
వెలుగును మింగేసిన అక్రమాల చీకట్లు!
విజయనగరం కంటోన్మెంట్: గ్రామీణ ప్రాంతాల్లో వెలుగుల కోసం లోక్ సభ, రాజ్య సభ సభ్యులు తమకు కేటాయించిన నిధుల నుంచి జిల్లాకు కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ బల్బుల ఏర్పాటులో నాసిరకం పరికరాలను వినియోగించడంతో ప్రయోజనం లేకుండా పోయింది. తరుచూ వీధిదీపాలు పాడైపోతున్నాయి. వాటిని మార్చలేక సర్పం చ్‌లు అవస్థలుపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సభ్యులు జిల్లాకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రత్నాబాయి కూడా వీధిలైట్ల ఏర్పాటుకు జిల్లాకు రూ.1.25 కోట్లు కేటాయించారు. ఇందులో రామభద్రపురం మండలంలోని 22 గ్రామాలకు రూ.20 లక్షలు, గజపతినగరం, బాడంగి, దత్తిరాజేరు మండలాల్లోని 44 గ్రామాలకు రూ.30 లక్షలు, సాలూరు మండలంలోని 16 గ్రామాలకు రూ.25 లక్షలు కేటాయించారు. జామి, గంట్యాడ, మెంటాడ మండలాల్లోని 32 గ్రామాలకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ సొమ్ముతో ఆయా మండలాల్లో వీధిదీపాలు ఏర్పాటు చేశారు. ఈ నిధులతో చాలా వరకూ ట్యూబ్ లైట్లను వేయగా, చివర్లో కొన్ని గ్రామాలకు మాత్రం ఇటీవలే ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. అయితే నాసిరకం పరికరాలను వినియోగించడం వల్ల అవి నిత్యం పాడైపోతున్నాయి. ఆయా మండలాల అధికారుల పర్యవేక్షణాలోపం, కాంట్రాక్టర్ల చేతివాటం వల్ల తాము ఇప్పుడు ఇబ్బందులకు గురికావలసి వస్తోందని పలు గ్రామాల సర్పంచ్‌లు వాపోతున్నారు. ఏర్పాటు చేసిన కొత్తలోనే లైట్లు పాడైపోయాయని వారు తెలిపారు. పాడైన పరికరాలకు మరమ్మతులు చేసి మళ్లీ వేస్తున్నా.... అవి ఎక్కువ కాలం పనిచేయడం లేదని, దీంతో గ్రామాల్లో తరచూ అంధకారం అలముకుంటోందని వారు వాపోతున్నారు. నిధులున్నా ప్రయోజనం శూన్యం: ఎంపీలు వీధిలైట్లకు ఇచ్చే నిధుల్లో ఈ సారి గ్రామ పంచాయతీల నిధులతో లింకు పెట్టారు. అయితే పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా అవి ముందుకురావడం లేదు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జిల్లాలోని పూసపాటి రేగ,భోగాపురం, చెరకుపల్లి, డెంకాడ, మెరకముడిదాం,దేవుని కణపాక తదితర గ్రామాలకు రూ.37.77లక్షలు కేటాయించారు. వీటితో ఆయా గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ నిధులకు గ్రామ పంచాయతీలు 50 శాతం నిధులు జత చేసి ఖర్చు చేయాల్సిందిగా ముందుగానే ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే పంచాయతీలు 50 శాతం నిధులు సమకూర్చలేకపోతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు కేటాయించిన ఎంపీ నిధులు వినియోగం కావడం లేదు. దీంతో నిధులు మంజూరైనా ప్రయోజనం చేకూరడం లేదు. -
విద్యుత్ శాఖలో భారీగా బదిలీలు
విజయనగరం మున్సిపాలిటీ: ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని పలువురు ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. ఈ మేరకు సంస్థ చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సర్కిల్ పరిధిలోని పలువురు ఏఈలు, ఏఈడీలకు స్థానం చలనం తప్పలేదు. గతంతో పోలిస్తే ఈసారి నిర్వహించిన బదిలీలు పారదర్శకంగా జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ సిఫార్సులు, విద్యుత్ ఉద్యోగుల సంఘాల సిఫార్సులకు తావులేకుండా బదిలీలు జరిగినట్లు సమాచారం. బదిలీ అయిన వారిలో విజయనగరం పట్టణ పరిధిలో ఏఈలుగా విధులు నిర్వహిస్తున్న వారు అధికంగా ఉన్నారు. ఇక్కడ డి-3 ఏఈగా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్‌కు ఇచ్ఛాపురం బదిలీ చేయగా ఆయన స్థానంలో విశాఖ గాజువాకలో గల ఎన్ఎస్టీఎల్ నుంచి డి.వి.ఎల్.కుమార్‌ను నియమించారు. నెల్లిమర్ల స్టోర్స్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న రామారావును గాజువాక పరిధిలోని మిందికి బదిలీ చేయగా విజయనగరం పట్టణంలోని డి-1 ఏఈగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తికి రాజమండ్రి సర్కిల్‌కు బదిలీ అయింది. డి-5 ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న భీమరాజుకు శ్రీకాకుళం జిల్లా పోలాకి ఏఈగా నియమించగా ఆయన స్థానంలో డెంకాడ మండల ఏఈగా విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ను నియమించారు. డెంకాడ మండల ఏఈగా విశాఖ జిల్లా రావికమతం ఏఈని నియమించారు. పార్వతీపురం రూరల్ ఏఈ గేదెల సూర్యనారాయణ రాజమండ్రి సర్కిల్‌కు బదిలీ అయ్యారు. జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం ఏఈల్లో ఒకరిని నెల్లిమర్ల ట్రాన్స్ఫార్మర్స్ ఏఈగా, మరొకరిని కనస్ట్రక్షన్ విభాగంలో టెక్నికల్ ఏఈగా నియమించారు. విజయనగరం సర్కిల్ ఆఫీసులో ఏఈగా విధులు నిర్వహిస్తున్న నళినిని కనస్ట్రక్షన్గా ఏఈగా బదిలీ చేశారు. ఇప్పటివరకు టెక్నికల్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న కె.ఎస్.పి.కుమార్‌ను సర్కిల్ పరిధిలోనే సిటీ మీటర్స్ ఏడీఈగా నియమించారు. సిటీ మీటర్స్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న జి.యజ్ఞేనేశ్వరరావును సింహాచలంలోని స్టోర్స్ ఏడీఈగా బదిలీ చేశారు. డీపీఈ విభాగంలో ఏడీఈగా పనిచేస్తున్న మురళీకృష్ణను విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం డీపీఈ విభాగానికి, నెల్లిమర్ల ఏడీఈ ఎం.సుదర్శనరావును విశాఖపట్నం ప్లానింగ్ ఏడీఈగా బదిలీ చేశారు. సింహాచలం స్టోర్స్ ఏడీఈ కె.వెంకటరామ్గోపాల్రెడ్డిని విజయనగరం కమర్షియల్ ఏడీఈగా, గాజువాగ ఈపీఐ విభాగంలో విధులు నిర్వహిస్తున్న విడివి.రామకృష్ణరావును నెల్లిమర్ల ఎస్పీఎం ఏడీఈగా బదిలీ చేశారు. శ్రీకాకుళం ఏడీఈ కె.విష్ణుమూర్తిని విజయనగరం డీపీఈ ఏడీఈగా నియమించారు. ఉద్యోగుల బదిలీలు పూర్తి విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రక్రియకు ఎట్టకేలకు అధికారులు ముగింపు పలికారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సంస్థ సీఎండీ రేవు ముత్యాలరాాజు నియమించిన కమిటీ సభ్యులు బదిలీల జాబితాను ప్రకటించారు. కమిటీ అధ్యక్షునిగా చీఫ్ జనరల్ మేనేజర్ ఓ.సింహాద్రి, సభ్యులుగా సర్కిల్ ఎస్ఈ జి.చిరంజీవిరాావు, టెక్నికల్ డీఈ ఎల్.దైవప్రసాద్, సీనియర్ అకౌంట్స్ అధికారి జి.వెంకటరాజు వ్యవహరించారు. వీరు 8 మంది జూనియర్ అకౌంట్స్ అధికారులు, 16 మంది సీనియర్ అసిస్టెంట్లు 21 మంది జూనియర్ అసిస్టెంట్లు, 16 మంది సబ్ఇంజినీర్లను బదిలీ చేశారు. విజయనగరం డివిజనల్ ఇంజినీర్ ప్రసాద్ ఆరుగురు లైన్ఇన్స్పెక్టర్లు, 21 మంది లైన్మెన్లు, 12 మంది అసిస్టెంట్ లైన్మెన్లు, ఐదుగురు జూనియర్లైన్మెన్లను బదిలీ చేశారు. అలాగే బొబ్బిలి డివిజనల్ ఇంజినీర్ పలువురు లైన్ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, అసిస్టెంట్లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లను బదిలీ చేశారు. -
విద్యుత్ శాఖలో 1,919 పోస్టులు
అదనంగా ఏఈ, ఎస్ఈ పోస్టులు జెన్కో ఫైలుకు సర్కారు ఆమోదం హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ విభాగంలో కొత్తగా 1,919 ఇంజనీర్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విభాగాల్లో 1,492 అసిస్టెంట్ ఇంజనీర్, 427 సబ్ ఇంజనీర్ పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం జెన్కో ఆధ్వర్యంలో అదనంగా 6,280 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే కార్యాచరణకు నడుం బిగించింది. ఇందుకు అవసరమయ్యే ఇంజనీర్లు, సిబ్బంది కోసం ఖాళీగా ఉన్న 456 అసిస్టెంట్ ఇంజనీర్, 306 సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని, కొత్తగా 1,919 పోస్టులు మంజూరు చేయాలని జెన్కో సీఎండీ ప్రభాకరరావు సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని, భర్తీ చేసే ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని సూచించింది. విభాగాల వారీగా కొత్త పోస్టులు, పేస్కేళ్ల వివరాలను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. అసిస్టెంట్ ఇంజనీర్లకు రూ.41,155-రూ.63,600, సబ్ ఇంజనీర్లకు రూ.20,535- రూ.41,155 స్కేల్ ఆఫ్ పేగా ప్రకటించింది. ప్రభుత్వ ఆమోదం లభించిన పోస్టులు.. విభాగం ఏఈలు ఎస్ఈలు టీఎస్ జెన్కో 788 16 టీఎస్ ట్రాన్స్‌కో 62 42 టీఎస్ ఎస్పీడీసీఎల్ 376 139 టీఎస్ ఎన్పీడీసీఎల్ 266 230 మొత్తం 1492 427 -
పదండి ముందుకు..
కర్నూలు(రాజ్‌విహార్): ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాయడం తగదని యునెటైడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రీజినల్ కార్యదర్శి నాగరాజు అన్నారు. నాలుగు రోజులుగా విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ భవన్ నుంచి కొత్త బస్టాండ్, బంగారుపేట, రాజ్‌విహార్, బుధవారపేల మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు యూఈఈయూ రీజినల్ కార్యదర్శి నాగరాజు మద్దతు తెలిపి మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్లోబల్ టెండర్లను రద్దు చేయాలన్నారు. థర్డ్ పార్టీ విధానాన్ని ఎత్తేసి సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అప్పటి వరకు పనికి తగిన వేతనం చెల్లించాలన్నారు. ధర్నాలో కాంట్రాక్టు కార్మికుల సంఘం జిల్లా నాయకులు చంద్రశేఖర్, శరత్‌కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరును తీర్చిదిద్దుతాం
కొత్తూరు : వలసల జిల్లాగా మారిన పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు తెలిపారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వారు బుధవారం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కొత్తూరు మండలం తిమ్మాపూర్ చెక్‌పోస్టు వద్ద షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వీర్లపల్లి శంకర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పలు గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని.. దానిని నేరవేర్చడానికే మంత్రివర్గంలో జిల్లాకు ప్రాధాన్యం కల్పించినట్లు చెప్పారు. జిల్లాను అభివృద్ధి పరిచే అంశంలో తాము ప్రతిపక్షాల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటామని.. వారు కూడా తమకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు. అంతేకాకుండా జిల్లాలో మరిన్ని బహుళజాతి పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్థానికులందరికీ ఉద్యోగాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు విద్యారంగంలో మార్పులు తేనున్నట్లు వివరించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు వివరించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ ఎన్నో ఏళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోని చెరువులకు మరమ్మతులు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, నాయకులు వీర్లపల్లి శంకర్, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఆర్డీఓ హన్మంతరెడ్డి, కోస్గి శ్రీనివాస్, ఏనుగు మహేందర్ రెడ్డి, అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పాలమూరుపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి
పాలమూరు : పాలమూరు జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక దృష్టి ఉందని పరి శ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యు త్ శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి, పార్లమెంటరీ కా ర్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఎం తో ఖనిజ సంపద ఉందని, రెండు నదులు ప్రవహిస్తున్నాయని, వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి జిల్లాలో 6లక్షల ఎకరాల కు సాగునీటిరందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో తలపెట్టిన అన్ని ప్రా జెక్టులను పూర్తి చేసేందుకు శక్తి వంచన లేకుం డా కృషి చేస్తామన్నారు. జాతీయ ప్లానింగ్ కమిషన్ జరిపిన అధ్యయనంలో దేశవ్యాప్తంగా 10 జిల్లాలు వెనుకబాటుకు గురయ్యాయని గుర్తిం చగా.. అందులో 8 జిల్లాలు తెలంగాణలోనే ఉ న్నట్లు వెల్లడైందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పాపాల కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిం దని, దానిని కడిగేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పాటుడపతుందన్నారు. పాలమూ రు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని, ఇక్కడి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత విద్యుత్ కేటాయింపును పెంచేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో అవసరమైన చోట విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, విద్యుత్ కనెక్షన్లకోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు అవసరాన్ని బట్టి వ్యవసాయ కనెక్షన్లు ఇప్పిస్తామన్నారు. జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకొని చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల స్థాపనకు కృషిచేస్తామని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి తెలంగాణ సర్కారు అమలు చేసే మొదటి ఎత్తిపోతల పథకమన్నారు. దీని నిర్మాణానికి శిలాఫలకం వేసేం దుకు త్వరలోనే కేసీఆర్ జిల్లాకు వస్తారన్నారు. జిల్లాలో దాదాపు 18.50 లక్షల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలలో సాగు చేపట్టి వ్యవసాయ హబ్‌గా ఏర్పాటు చేయనున్నట్లు తె లిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరి షత్ ఛైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బెక్కెం జనార్దన్, పెద్దిరెడ్డి సా యిరెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పీపీఏలపై భేటీకి హిందూజా డుమ్మా
* సవరణలపై కంపెనీ అభ్యంతరాలు * కన్సల్టెంట్లతో డిస్కం అధికారుల చర్చలు * తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ ఇవ్వాల్సిందేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిస్కంతో మంగళవారం జరిపే సంప్రదింపులకు హిందూజా కంపెనీ డుమ్మా కొట్టింది. ఆకస్మిక పనులు ఉన్నందున రాలేకపోతున్నామని ఈ మెయిల్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం పంపించింది. డిసెంబర్ మొదటి వారంలో చర్చలకు వచ్చేందుకు కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని టీఎస్ ఎస్పీడీసీఎల్ ఛైర్మన్, ఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దీంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఆ కంపెనీ లేవనెత్తిన అభ్యంతరాలను కన్సల్టెంట్లు డిస్కం అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో కన్సల్టెంట్లతోనే అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఒప్పందాలు, సవరణలు, కంపెనీ ప్రస్తావించి న అభ్యంతరాలపై చర్చలు జరిపారు. గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మేరకు, తెలంగాణకు రావాల్సిన వాటాను ఆ కంపెనీ సమకూర్చాల్సి ఉంటుందని కన్సల్టెంట్లకు తేల్చిచెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హిందూజా కంపెనీ నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ (280 మెగావాట్లు) రావాలి. ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడే 1994లో హిందూజా కంపెనీతో అప్పటి ఏపీఎస్ఈబీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. మారిన నిబంధనల ప్రకారం 1998లో పీపీఏను సవరించుకుంది. ఆ కంపెనీ విద్యుత్‌ప్లాంట్ నిర్మాణం నిదానంగా సాగడంతో ఒప్పందాలు అమల్లోకి రాలేదు. ఈలోగా కేంద్ర ప్రభుత్వ 2003 విద్యుత్ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో పాత పీపీఏల్లో కొన్ని నిబంధనలు సవరించుకోవాలని డిస్కం అధికారులు తెలిపారు. కానీ చర్చలకు రాకుండానే హిందూజా కంపెనీ షరతులపై అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో డిస్కం ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లనుంది. -
ప్రాణాలు హరీ
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో విద్యుత్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 2012-13 సంవత్సరంలో 113 మంది మృత్యువాతపడగా 27 పశువులు చనిపోయాయి. 2013-14లో 112 మంది ప్రాణాలు కోల్పోగా, 10పశువులు, ఇతర జంతువులు మృతిచెందాయి. ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు 45 మందికి పైగా విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. దశాబ్దాల కాలం నాటి విద్యుత్లైన్లు, వైర్లను మార్చకపోవడం, ఇళ్లమధ్యనే విద్యుత్లైన్లు ఉంచడం, పాతకాలం నాటిస్తంభాలు ఒరిగిపోవడం, సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ సక్రమంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జిల్లాలో 130కేవీ సామర్థ్యం కలిగినవి 20 విద్యుత్ సబ్‌స్టేషన్ స్టేషన్లు ఉన్నాయి. 220 కేవీ కలిగిన స్టేషన్లు ఐదు, 400 కేవీ సామర్థ్యం కలిగిన ఒక సబ్‌స్టేషన్ ఉంది. వీటికింద 33/11 కేవీ విద్యుత్ వాడకం కలిగిన 269 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ట్రాన్స్ఫార్మర్లు 55,232 ఉన్నాయి. ఇందులో త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 36,176 కాగా, గృహఅవసరాల కోసం ఏర్పాటుచేసిన సింగల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు సుమారు 19,056 వరకు ఉన్నాయి. జిల్లాలో 51వేల కిలోమీటర్ల పొడవు విద్యుత్‌లైన్ ఉంది. నిధులున్నా నిరూపయోగమే..! ఇందులో 30, 40 ఏళ్ల నాటి విద్యుత్‌లైన్, వైర్లను మార్చాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ ఏటా పెండింగ్‌లోనే ఉంటోంది. జిల్లాలో విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలు తీర్చేందుకు విద్యుత్ కార్పొరేషన్ రూ.100 కోట్లు విడుదలచేసింది. వీటిలో 33 కేవీ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.15.26కోట్లు, గ్రామ, మండల కెపాసిటర్లు పెంచుకోవడం, అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.31.33కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఓవర్‌లోడ్ , పాతబడిన లైన్లను పునరిద్ధంచడం కోసం రూ.16 కోట్లు, కెపాసిటర్లు అమర్చుకోవడానికి రూ.4.73కోట్లు, సబ్స్టేషన్ల నిర్వహణ కోసం మరో రూ.15కోట్లు మంజూరయ్యాయి. అయితే ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులను నత్తనడకన కొనసాగుతున్నాయి. దీనికితోడు చాలా గ్రామాల్లో కొక్కెలు తగిలించుకోవడం, ఎర్తింగ్ లేకపోవడంతో హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ క్రమంలో నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీధిన పడుతున్న కుటుంబాలు.. తరుచూ విద్యుత్ ప్రమాదాలతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. ఈ క్రమంలో వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ ఇంట్లో బట్టలు ఆరవేయబోయి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచింది. దీంతో ఆ ఇంటికి ఉన్న ఏకైక పెద్దదిక్కును కోల్పోయారు. అలాగేనాగర్‌కర్నూల్ మండలం చందుబట్ల గ్రామానికి చెందిన కాకునూరు బాలనాగయ్య కొత్త ఇంటికి నీళ్లు పట్టేందుకు మోటర్ ఆన్‌చేయబోగా కరెంట్‌షాక్‌కు గురై మృతిచెందాడు. దీంతో ఆయన ఇద్దరు పిల్లలు, భార్య పెద్దదిక్కును కోల్పోయారు. ఇలా ఎన్నోమంది రోడ్డునపడ్డారు. ఇంత జరిగినా ట్రాన్స్‌కో మాత్రం అరకొర సాయంతోనే సరిపెట్టుకుంటోంది. అరకొర సాయం అందించి చేతు లు దులుపుకుంటోంది. ఇలా చాలామేరకు కేసు లు పెండింగ్‌లో ఉన్నా యి. విద్యుత్‌షాక్‌కు గు రై మరణిస్తేనే రూ.లక్ష పరిహారం ఇస్తున్నారు. అదే అంగవైకల్యం కలిగిన వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదు. -
ఆపసోపాలు
సాక్షి, ఏలూరు:విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఎంపిక పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు 214 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పరీక్షలో భాగంగా సిమెంట్, ఐరన్ విద్యుత్ స్తంభాలు ఎక్కాల్సి రావడంతో అభ్యర్థులు ఆపసోపాలు పడ్డారు. మీటర్ రీడింగ్, సైక్లింగ్ వంటి పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసిన వారిలో కొం దరు స్తంభాలు ఎక్కడంలో విఫలమై ఉద్యోగానికి అర్హత కోల్పోయారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)లో జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి తుది పరీక్షలు బుధవారంనుంచి ఆగస్టు 13 వరకూ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 310 జేఎల్ఎం పోస్టులు ఉండగా, 3,539 మందికి కాల్ లెటర్స్ పంపించారు. వట్లూరులోని ఈపీడీసీఎల్ జిల్లా స్టోర్స్ పక్కన గల పోల్ తయారీ సెంటర్లో ఎంపిక పరీక్ష ప్రారంభమైంది. 12 వీడియో కెమెరాలతో ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించారు. అభ్యర్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ మెషిన్ ఉపయోగించారు. ఎంపికలో భాగంగా అభ్యర్థులు 8మీటర్ల సిమెంట్ స్తంభం, 30 అడుగుల ఇనుప స్తంభం ఎక్కాలి. సైకిల్ తొక్కి చూపించాలి. ఎలక్ట్రానిక్ మీటర్, మెకానికల్ మీటర్లలో రీడింగ్ తీయాలి. సైకిల్ తొక్కడం, మీటర్ రీడింగ్ తీయడం వరకూ అందరూ బాగానే చేయగలిగినప్పటికీ స్తంభాలు ఎక్కాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆపసోపాలు పడ్డా రు. కొందరు మధ్యవరకూ వెళ్లి దిగిపోయారు. మరి కొందరు కిందకు దిగేందుకు ఇబ్బందిపడ్డారు. ఐరన్ స్తంభాన్ని సులభంగా ఎక్కగలిగినవారు సిమెంట్ స్తంభం విషయంలో ఇబ్బంది పడ్డారు. ఫలితాలు చివరి రోజునే : మొదటి రెండు రోజులు రోజు కు 250 మంది చొప్పు న ఎంపికకు పిలిచామని, 36 మంది గైర్హాజరయ్యారని ఏలూరు (ఆపరేషన్స్) సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ తెలిపారు. మూడో రోజు నుంచి రోజుకు 300 మందికి పరీక్షలు నిర్వహిస్తామని, చివ రి రోజు పరీక్షలు ముగిసిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈపీడీసీఎల్ డెరైక్టర్ (ఆపరేషన్స్) పి.రామ్మోహన్, సీజీఎం (ఎనర్జీ ఆడిట్) ఓ.సింహాద్రి పరిశీలకులుగా వ్యవహరించారు. -
భార్య కళ్లెదుటే...
పూసపాటిరేగ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఓ రైతు ప్రాణాన్ని బలిగొంది. నేలకూలిన స్తంభాన్ని పునరుద్ధరించకపోవడం.. ఇది గమనించని రైతు వేలాడుతున్న వైర్లను పొరపాటున తగలడం.. వెరసి భార్య కళ్ల ముందే ఆ భర్త విగతజీవిగా మారాడు. మండలంలోని చల్లవానితోట పంచాయతీ పరిధి లక్ష్మీదేవితోట కల్లాలులో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పతివాడ ప్రకాశరావు(45)తోపాటు అతని భార్య అన్నపూర్ణ నువ్వుసాగు గొప్పుకు వెళ్లారు. ఇద్దరూ గొప్పు తవ్వుతుండగా.. సమీపంలో విరిగిన విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లు ప్రకాశరావుకు తగిలాయి. వైర్లలో విద్యుత్ ప్రవహిస్తుండడంతో ఆయన షాక్‌కు గురయ్యూడు. సమీపంలోనే గొప్పు తవ్వుతున్న భార్య.. అతనిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యంకాలేదు. ఆమె కళ్ల ముందే గిలగిలా కొట్టుకుంటూ ప్రకాశరావు విగతజీవిగా మారాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారం రోజుల క్రితం స్తంభం నేలకొరిగినా... వారం రోజుల క్రితం వచ్చిన గాలులకు తాడిచెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో స్తంభం నేలకూలింది. అప్పటి నుంచి ఈ స్తంభానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, బుధవారం ఉదయం నేలమీద ఉన్న స్తంభానికి విద్యుత్ సరఫరా అవడంతో ప్రకాశరావు విద్యుదాఘాతానికి గురై, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం గాలిలో కలిసిపోయిందని మృతుని బంధువులతోపాటు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, మాజీ ఎంపీపీ మహంతి చిన్నంనాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, ఇజ్జరోతు ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎంవీజీ శంకరరావు, గ్రామ వైస్ సర్పంచ్ అప్పలనాయుడు పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి, పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీజేపీ నేత యశ్వంత్ సిన్హా జైలుకు
హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో విద్యుత్ శాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. బెయిల్ కోరడానికి నిరాకరించడంతో సిన్హాతోపాటు మరో 54 మందికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆర్బీ పాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ కొరతకు నిరసనగా సిన్హా ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు సోమవారం హజారీబాగ్‌లోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తన చేతులు కట్టేసి దౌర్జన్యం చేసినట్లు జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్‌జా ఫిర్యాదు చేయడంతో సిన్హాతో పాటు మరో 300 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
పంచాయతీలకు షాక్
పంచాయతీలకు సంబంధించి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ముక్కు పిండి వసూలు చేసేందుకు ఆ శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే నిధులు లేక నీరసించిన స్థానిక సంస్థల మెడకు ఇది గుదిబండగా మారనుంది. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోని పక్షంలో జిల్లాలోని వందలాది పంచాయతీల్లో చీకట్లు అలుముకోనున్నాయి. మరోవైపు మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌లోనూ అదే పరిస్థితి నెలకొననుంది. నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : జిల్లాలో 40 మేజర్, 900 మైనర్ గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీ వీధిదీపాలు, మంచినీటి పథకాల నిర్వహణకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యుత్ బిల్లులను ఐదేళ్ల క్రితం వరకు పంచాయతీల తరఫున ప్రభుత్వమే చెల్లించేది. అనంతరం ఆ బాధ్యతను పాలకమండళ్లకే వదిలేసింది. మొదట్లో కొంతకాలం బిల్లులను సక్రమంగా చెల్లించినా చాలా పంచాయతీలు తర్వాత కట్టడం మానేశాయి. ఎప్పటికైనా ప్రభుత్వం చెల్లించికపోతుందా..అనే ధీమాతోనే బకాయిలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా బకాయిలు రూ.45.22 కోట్లకు చేరుకున్నాయి. వీటి వసూలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే సరఫరా అయినా నిలిపేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి విద్యుత్ శాఖ అధికారులు సూచించినట్లు సమాచారం. ఇదే జరిగితే జిల్లాలోని అనేక గ్రామాలు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం నెలకొంది. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు వీధిలైట్లు వెలగక వీధులు చిమ్మచీకట్లో చిక్కుకోనున్నాయి. మరోవైపు ఇప్పటికప్పుడు ఈ బిల్లులు చెల్లించే పరిస్థితిలో కూడా పంచాయతీలు లేవు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు ప్రభుత్వం నుంచి పలు రకాల నిధుల విడుదల నిలిచిపోయింది. కొన్ని నెలల క్రితం ఏర్పడిన పాలకవర్గాలు ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెడుతున్నాయి. ఈ సమయంలోనే విద్యుత్ బకాయిల సమస్య సర్పంచ్‌లకు పెద్ద సవాల్‌గా మారింది. కాలిపోయిన మోటార్ల మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు నూతన ప్రభుత్వ సహకారం కోసం పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి. అన్ని స్థానిక సంస్థలది అదే పరిస్థితి పంచాయతీలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కూడా విద్యుత్ బకాయిల సమస్యను ఎదుర్కొంటున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ ఇప్పటికే రూ.21.4 కోట్ల బకాయి పడడంతో పదిహేను రోజుల క్రితం కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. వెంటనే స్పందించకుంటే వీధిలైట్లు, మంచినీటి పథకాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. మరోవైపు మున్సిపాలిటీలు కూడా విద్యుత్ శాఖకు రూ.2.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2009 నుంచి పెండింగ్ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిల చెల్లింపు 2009 నుంచి నిలిచిపోయింది. అంతకుముందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ జీఓ విడుదల చేశారు. పంచాయతీలను విద్యుత్ బిల్లుల నుంచి మినహాయించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందులో భాగంగా 2009 వరకు ప్రభుత్వమే విద్యుత్ బిల్లులను చెల్లించేది. మహానేత మరణానంతరం అధికారం చేపట్టిన వారు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో పంచాయతీలకు భారం పెరిగిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు వరకు సీఎంగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి బకాయిలు చెల్లిస్తామని, బిల్లులను ప్రభుత్వమే కట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఒక్క రూపాయి విదల్చలేదు. త్వరలో ఏర్పడబోతున్న ప్రభుత్వమైనా ఈ విషయంలో తగిన నిర్ణయం వెంటనే తీసుకోవాలని పంచాయతీ పాలకమండళ్లు కోరుతున్నాయి. -
సెంట్రల్ ‘పవర్’కు విభజన షాక్
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(సీపీడీసీఎల్)లో సమస్యలు తలెత్తనున్నాయి. ఆ సంస్థ పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాల ఉద్యోగుల పరిస్థితి అయోమయంలో పడింది. దీంతో సీనియారిటీ, పదోన్నతులు వంటివి అందుతాయోలేదోనని ఆందోళన మొదలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో అన్ని ప్రభుత్వ శాఖలు రెండుగా చీలిపోనున్నాయి. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ కూడా వీడిపోనుంది. సమైక్య రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. అందులో హైదరాబాదు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(సీపీడీసీఎల్), తిరుపతి కేంద్రంగా సౌథ్రెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎస్పీడీసీఎల్), వరంగల్ కేంద్రంగా నేషనల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్), విశాఖపట్నం కేంద్రంగా ఈస్ట్రెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఈపీడీసీఎల్) సంస్థలు తమ పరిధిలోని జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. జెన్కో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ట్రాన్స్‌కో కొలుగోలు చేసి ఈ నాలుగు పంపిణీ సంస్థలకు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమయ్యే విద్యుత్‌లో 40 శాతానికి పైగా విద్యుత్ కేవలం సీపీడీసీఎల్ సంస్థే వినియోగిస్తుండగా మిగతా 60 శాతం విద్యుత్ మిగిలిన మూడు సంస్థలు పొందుతున్నాయి. అన్ని సంస్థల పరిస్థితి బాగానే ఉన్నా సీపీడీసీఎల్లోని సీమ జిల్లాల పరిస్థితి ఆందోళన కరంగా మారింది. అతిపెద్ద సంస్థ అయిన సీపీడీసీఎల్‌లో మొత్తం 11 ఆపరేషన్స్ సర్కిళ్లు (ఎస్ఈ స్థాయి హోదా కలిగినవి) ఉన్నాయి. ఇందులో హైదరాబాదు సెంట్రల్, సౌత్, నార్త్, రంగారెడ్డి నార్త్, సౌత్, ఈస్టు, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలతోపాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం కూడా ఉన్నాయి. అందులో కర్నూలు, అనంతపురం తప్ప మిగిలినవి తెలంగాణలోనివే. దీంతో రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు, అనంతపురం సర్కిళ్లను సీపీడీసీఎల్ నుంచి విడగొట్టి తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్లో విలీనం చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంమైనా ఎన్నికలు, కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో చర్యలు వేగవంతం అయ్యాయి. అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీ నుంచి అధికారాలు బదలాయించనున్నారు. దీంతో ఈ నెల వేతనాలు 24వ తేదీనే చెల్లించనున్నారు. ఉద్యోగుల సీనియారిటీపై గందరగోళం సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను ఎస్పీడీసీఎల్లో కలపనుండడంతో ఈ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు సీనియారిటీ, పదోన్నతులు, ఇతర అంశాలపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఆప్షన్లు ఇస్తామని, సర్దుబాటు చేస్తామని చెబుతున్నా పూర్తి స్థాయి స్పష్టత కరువైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 2 వేల మందికి పైగా ఉద్యోగులు, మరో 500 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వారిలో ఒక చీఫ్ జనరల్ మేనేజరుతోపాటు ఎస్ఈ, 9 మంది డీఈలతోపాటు ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు మొత్తం 500 ఇంజినీరింగ్ అధికారులున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం 2500 మందికి పైగా ఉద్యోగులతోపాటు 600కి పైగా కాంట్రాక్టు కార్మికులున్నారు. ఎస్పీడీసీఎల్లో ప్రస్తుతం తిరుపతి (చిత్తూరు)తోపాటు కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ (విజయవాడ), గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలను అందులో కలిపితే తమ సర్వీసు, సీనియారిటీ సమస్యలొస్తాయని ఆ సంస్థలోని ఉద్యోగులు సైతం ఆందోళనకు గురవుతున్నారు . కాగా కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలను కలిపి జోన్ ఏర్పాటు చేసి చీఫ్ జనరల్ మేనేజరు(చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి) నియమించారు. కర్నూలులోనే జోనల్ కార్యాలయాన్ని ఉంది. రెండు జిల్లాలను ఎస్పీడీసీఎల్కు బదలాయిస్తే ఇక్కడ ఉన్న సీజీఎం పోస్టు రద్దయ్యే ప్రమాదముంది. అధికారులు స్పందించి ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతుల విషయంలో సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.ఉమాపతి కోరుతున్నారు. -
పవర్ లెస్..
ప్రజల దాహార్తిని తీర్చాల్సిన తాగునీటి ప్రాజెక్టులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి చేపట్టిన పనులు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. గ్రామీణ, తాగునీటి సరఫరా విభాగం, విద్యుత్ శాఖకు మధ్య సమన్వయలోపంతో జిల్లాలోని తాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ రెండు శాఖల అధికారులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ప్రజలు తాగునీటికి అరిగోస పడుతున్నారు. నల్లగొండ, న్యూస్‌లైన్ : జిల్లాలోని తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం.. వాటిని ప్రజాప్రతినిధులచే ప్రారంభించడంతో తమ పని అయిపోయిం దనుకుని చేతులు దులుపేసుకుంటున్నారు అధికారులు. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు చేపట్టిన ప్రాజెక్టులు కేవలం విద్యుత్ సౌకర్యం లేక వృథాగా ఉండిపోతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రాజెక్టు పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. యంత్రాంగం నిర్లక్ష్యం... గ్రామాలకు కృష్ణా జలాలు పంపిణీ చేసేందుకు నిర్మించిన ప్రాజెక్టులు (ఎస్వీఎస్), బోర్ల ద్వా రా నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు (ఎం వీఎస్) విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్‌కోకు డబ్బులు చెల్లిం చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ శాఖ ఏవిధమైన పను లు చేపట్టలేదు. విద్యుత్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల ఒప్పందం విషయంలో జాప్యం జరుగుతోందని, ఉన్న తస్థాయి అధికారుల అనుమతి వస్తే తప్ప, ప్రాజెక్టులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆ శాఖ తప్పించుకుంటోంది. దీనినే ఆర్డబ్ల్యూఎస్ సాకుగా చూపి సమావేశాల్లో సమీక్షల పేరుతో కాలం గడిపేస్తోంది. జిల్లాలో మొ త్తం 28 ప్రాజెక్టులకు గాను 20 ప్రాజెక్టులకు విద్యుత్ సౌకర్యం లేదు. ఈ ప్రాజెక్టులకు విద్యుత్ కనెక్షన్లు నిమిత్తం ఆర్డబ్ల్యూఎస్ నుంచి 2012, 13 సంవత్సరాల్లోనే ట్రాన్స్‌కోకు డబ్బులు చెల్లించారు. కానీ ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. పలు ప్రాజెక్టులకు కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి అసంపూర్తిగా వదిలేశారు. విద్యుత్ కనెక్షన్లు కావాలని కోరుతూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ‘ఏ’ ఫారం ద్వారా మార్చి 11, 2012, జనవరి 21, 2013లో ట్రాన్స్‌కో దరఖాస్తు చే శారు. అదే ఏడాది నవంబర్ 30న డబ్బులు కూడా చెల్లించారు. కానీ ట్రాన్స్‌కో ఆ మొత్తం సొమ్ము నుంచి వచ్చే లాభాన్ని పొందుతుందే తప్ప పనులు చేసేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలేదు. పడకేసిన తాగునీటి పథకాలు... మూడో విడత కింద మేళ్లచెర్వు మండలం దొండపాడు, కిష్టాపురంలో రూ.120 కోట్లతో పునరావాస గ్రామాల్లో నిర్మించిన తాగునీటి పథకాలకు ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. నాలుగో విడత కింద గరిడేపల్లి మండలం సర్వారం, కాచవారిగూడెంలో రూ.30కోట్లతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. మోతె మంచినీటి పథకాన్ని రూ.20 కోట్లతో పూర్తి చేశా రు. కానీ సిరికొండ గ్రామానికి నీళ్లు చేరడం లేదు. ఇక్క డ విద్యుత్ సౌకర్యం కల్పిస్తే నీటి సమస్య తీరుతుంది. పోచంపల్లిలోని జిబ్లక్పల్లిలో రూ.35 కోట్లతో నిర్మించిన పథకానికి విద్యుత్ పనులు అసంపూర్తిగా వదిలేశారు. బొమ్మలరామారం మంచినీటి పథకానికి రూ.50 కోట్ల ఖర్చు పెట్టారు. కానీ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా ఉండిపోయింది. దామరచర్ల మండలం బాలెంపల్లి మంచినీటి పథకాన్ని రూ. 48 కోట్లతో పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టులకు స్తంభాలు వేసి వదిలేశారు. ఇదే మండలంలో కాల్వక ట్ట వద్ద రూ.24 కోట్లు, గోన్యాతండా, ఇసుకబావిగూడెం వద్ద రూ.24కోట్లతో ఏర్పాటు చేసిన పథకాలకు విద్యుత్ సౌకర్యం లేదు. వేములపల్లిలోని ఎరకలిగుట్ట వద్ద రూ.11కోట్లతో నిర్మిం చిన పంపింగ్ స్టేషన్‌కు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. పెద్దవూర మండలం చింతలపాలం పంపింగ్ స్టేషన్, చింతపాలెం హెడ్ వర్క్స్, నైనివానికుంట పథకాల వద్ద కరెంట్ స్తంభాలతోనే పనులు నిలిపేశారు. పెద్దవూరలో రూ.37 కోట్లతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకానికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. నిడమనూరు మండలం మేఘ్యాతండా వద్ద రూ.16 కోట్లు, చివ్వెలం మండలం చందుపట్లలో రూ.71కోట్లతో మంచి నీటి పథకాలు చేపట్టారు. కానీ విద్యుత్ కనెక్షన్లు మాత్రం ఇవ్వలేదు. -
విద్యుత్ శాఖను వేధిస్తున్న లైన్మెన్ల కొరత
పాలకోడేరు రూరల్, న్యూస్‌లైన్: విద్యుత్ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా తగినంతమంది లైన్మెన్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అటు వినియోగదారులు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. దీంతో కొందరు అధికారులు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లచే పనులు చేయిస్తున్నారు. హైకోర్టులో పోస్టుల భర్తీ వ్యవహారం జిల్లాలో సూమారు 400 గ్రామాలకు జూనియర్ లైన్మెన్లు లేక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 360 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ విషయం హైకోర్టులో నలుగుతుంది. లైన్మెన్ పోస్టులు తమకు కేటాయించాలంటూ విద్యుత్ సబ్స్టేషన్లలో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నేరుగా నియామకాలు చేపట్టాలంటూ పలువురు నిరుద్యోగులు కూడా పిటిషన్లు వేశారు. దీంతో ఆ వ్యవహారం కోర్టులో నలుగుతోంది. అది తేలితే గాని పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర విభజన అంశం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే లైన్మెన్ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
అమలుకు నోచుకోని పథకం
నిధులున్నాయి. వారి దరికి చేరవు. పథకాలుంటాయి ఆచరణలో పడకేస్తాయి. ఇదీ ఏళ్లుగడుస్తున్నా మారని బడుగువర్గాల బతుకులు. వారికోసం రూపొందించిన ఆర్జీజీవై (గ్రామీణ విద్యుద్దీకరణ యోజన) పథకం ఎందుకో తెలియని దుస్థితి. పాలకుల కరుణకు నోచుకోని దుర్గతి. అడవి తల్లి ఒడిలో విసిరేసినట్లున్న చెంచు గూడేలను ఇరవైనుంచి ఏభై వంతున ఒక చోటకు చేర్చి విద్యుద్దీకరణకు అనువుగా మార్చాలని కాగితాల్లో రాసుకున్నా ఆచరణలో చెల్లుచీటీ అవుతోంది. పాలమూరు, న్యూస్‌లైన్ : చెంచు గూడేల్లో చీకట్లు తొలగడం లేదు. తమ బతుకుల్లో వెలుగు నింపాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు వారు మొరపెట్టుకున్నా.. అది అరణ్య రోదనగానే మారుతోంది. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, బీసీ కాలనీలు, గిరిజన తండాలు చీకట్లోనుంచి వెలుతురులోకి రాలేకపోతున్నాయి. పాలకుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఆర్జీజీవై పథకానికి శాపమవుతోంది. ఆర్జీజీవై అమలులో భాగంగా.. విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన అంచనాల ప్రకారం జిల్లాలోని 936 గిరిజన తండాలు, ఎస్సీ, వెనుకబడిన తరగతుల కాలనీలు విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ.. గృహ వినియోగానికి ఇచ్చే కనెక్షన్లు కాకుండా వ్యవసాయ విద్యుత్ లైన్ (హెచ్‌టీ లైన్)ల నుంచి అనధికారింగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా గిరిజనులు తండాలు, కాలనీల్లో ఏళ్లతరబడి చీకట్లోనే మగ్గుతున్నారు. గిరిజన ఆవాస ప్రాంతాల్లో నివసించే ప్రజలు రాత్రయిందంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. నిధులు కొరవడి... రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన (ఆర్జీజీవై) పథకాన్ని 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం దారిద్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతోపాటు అన్ని గ్రామాలకు, ఆవాసాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇవ్వగా మిగిలిన 10 శాతం డిస్కమ్‌లు భరిస్తాయి. ఈ పథకాన్ని 2011 వరకు కొనసాగించాల్సి ఉండగా, మహానేత మరణానంతరం 2010 డిసెంబర్లో ఆర్జీజీవై పథకానికి ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, జడ్చర్ల, నాగర్‌కర్నూల్ డివిజన్లకు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ పథకం ద్వారా కేవలం 1,17,025 మంది లబ్ది పొందినట్లు రికార్డులే సాక్ష్యమిస్తున్నాయి. తండాలు...తంటాలు మహబూబ్‌నగర్, జడ్చర్ల, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ విద్యుత్ డివిజన్లకు సంబంధించి చాలాచోట్ల విద్యుత్ సౌకర్యంలేక జనం ఇబ్బంది పడుతున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజక వర్గాలలోని చెంచుల పెంటలు చీకట్లోనే మగ్గుతున్నాయి. నల్లమల అడవుల్లోని కండ్లకుంట, గీచుగండి, పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, ఆగర్లపెంట, రాంపూర్, అప్పాపూర్, బౌరాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, సంగడిగుండాలు, తాటిగుండాలు, పందిబొర్రె తదితర చెంచుపెంటలకు కరెంటు సౌకర్యం అంటే ఏంటో తెలియదు. ఒక్కో దగ్గర 20 నుంచి 50 వరకు బొడ్డు గుడిసెలతో ఉండే పెంటలన్నింటినీ అప్పాపూర్ దగ్గరికి చేర్చి ఓ గ్రామంగా మార్చి వారికి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో ఆగిపోయింది. ఇటూ ఒక దగ్గరకు రాక... కరెంటు లేక వీరి పరిస్థితి ఆగమ్యగోచరమవుతోంది. రాత్రివేళ చెంచులు బొడ్డు గుడిసెలో కట్టెల మంటలు(నెగడు) పెట్టి కాలం వెల్లదీస్తున్నారు. -
మళ్లీ విద్యుత్ చార్జీల మోత
-
ఇక మరిన్ని షాక్‌లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మరిన్ని షాక్‌లు తప్పవు. ఇకపై ఏటా విద్యుత్ చార్జీ లు భారీగా పెరగనున్నాయి. కరెంటు చార్జీలను ఏటా బాదేయాల్సిందేనని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, పంపిణీ చేసేవరకు అయ్యే మొత్తం వ్యయాన్ని వినియోగదారుల నుంచే రాబట్టాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ వాస్తవిక సగటు వ్యయానికి, వాస్తవిక సగటు వసూలుకు మధ్య తేడా భారీగా ఉందని పేర్కొంది. ఈ అంతరాన్ని వచ్చే 3 నుంచి 5 ఏళ్లలోగా భర్తీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ నిర్వహణ బాధ్యత బిల్లు-2013ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ తీసుకొస్తోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలకు పంపించింది. దీనిపై తగిన సూచనలు చేయాలని పేర్కొంది. తర్వాత ఈ బిల్లును ఆయా రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లో ఆమోదించాలని ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెరగనున్నాయని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏటా బాదుడే బాదుడు: రాష్ట్రంలో ఒక యూనిట్ విద్యు త్ను ఉత్పత్తి చేసి, వినియోగదారులకు సరఫరా చేసేందుకు అవుతున్న సగటు వ్యయం రూ.5.23గా ఉంది. అయితే, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న మొత్తం రూ. 3.57 మాత్రమే. వైఎస్సార్ హయాంలో ఒక్క పైసా విద్యుత్ చార్జీలు పెంచకపోవడమే ఇందుకు కార ణం. చార్జీలు పెంచకుండా.. సబ్సిడీ రూపం లో ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరిం చింది. అయితే వైఎస్ మరణం తర్వాత ఏటా విద్యుత్ చార్జీలు పెంచుతూ వచ్చారు. రోశయ్య ప్రభుత్వం, కిరణ్ సర్కారు ఇప్పటివరకు రెగ్యులర్, సర్దుబాటు చార్జీల రూపం లో దాదాపు రూ.22 వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై మోపాయి. తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలవల్ల రాష్ర్ట ప్రజలపై మరోసారి విద్యుత్ భారం పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, పంపిణీ చేసేందుకవుతున్న మొత్తానికి... వినియోగదారుని నుంచి వసూలు చేస్తున్న మొత్తానికి రూ.1.66 తేడా ఉంది. ఈ అంతరాన్ని వచ్చే 3 నుంచి 5 ఏళ్లలోగా భర్తీ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో వచ్చే ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రజలకు విద్యుత్ షాక్‌లు తగులుతూనే ఉంటాయన్నమాట. అలాగే ఏటా విద్యుత్ పంపిణీకవుతున్న మొత్తాన్ని వినియోగదారుని నుంచే రాబట్టుకోవాల్సిందేననీ కేంద్రం స్పష్టంచేసింది. వాస్తవానికి ఏటా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ఖర్చు పెరుగుతుంది. ఉత్పత్తికయ్యే ఇంధనం ధరలతోపాటు ఇతర ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం. ఫలితంగా ప్రస్తుతమున్న అంతరాన్ని పూడ్చడంతోపాటు ఏటా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి అయ్యే వ్యయం పెరుగుదల కూడా వినియోగదారులపై పడనుంది.