పవర్ లెస్.. | Power Less .. | Sakshi
Sakshi News home page

పవర్ లెస్..

Published Sun, May 4 2014 3:31 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

Power Less ..

ప్రజల దాహార్తిని తీర్చాల్సిన తాగునీటి ప్రాజెక్టులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి చేపట్టిన పనులు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. గ్రామీణ, తాగునీటి సరఫరా విభాగం, విద్యుత్ శాఖకు మధ్య సమన్వయలోపంతో జిల్లాలోని తాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ రెండు శాఖల అధికారులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ప్రజలు తాగునీటికి అరిగోస పడుతున్నారు.
 
 నల్లగొండ, న్యూస్‌లైన్  : జిల్లాలోని తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం.. వాటిని ప్రజాప్రతినిధులచే ప్రారంభించడంతో తమ పని అయిపోయిం దనుకుని చేతులు దులుపేసుకుంటున్నారు అధికారులు. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు చేపట్టిన ప్రాజెక్టులు కేవలం విద్యుత్ సౌకర్యం లేక వృథాగా ఉండిపోతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రాజెక్టు పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి.  
 
 యంత్రాంగం నిర్లక్ష్యం...
 గ్రామాలకు కృష్ణా జలాలు పంపిణీ చేసేందుకు నిర్మించిన ప్రాజెక్టులు (ఎస్‌వీఎస్), బోర్ల ద్వా రా నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు (ఎం వీఎస్) విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్‌కోకు డబ్బులు చెల్లిం చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ శాఖ ఏవిధమైన పను లు చేపట్టలేదు. విద్యుత్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల ఒప్పందం విషయంలో జాప్యం జరుగుతోందని, ఉన్న తస్థాయి అధికారుల అనుమతి వస్తే తప్ప, ప్రాజెక్టులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆ శాఖ తప్పించుకుంటోంది. దీనినే ఆర్‌డబ్ల్యూఎస్ సాకుగా చూపి సమావేశాల్లో సమీక్షల పేరుతో కాలం గడిపేస్తోంది. జిల్లాలో మొ త్తం 28 ప్రాజెక్టులకు గాను 20 ప్రాజెక్టులకు విద్యుత్ సౌకర్యం లేదు. ఈ ప్రాజెక్టులకు విద్యుత్ కనెక్షన్లు నిమిత్తం ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి 2012, 13 సంవత్సరాల్లోనే ట్రాన్స్‌కోకు డబ్బులు చెల్లించారు. కానీ ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు.
 
 పలు ప్రాజెక్టులకు కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి అసంపూర్తిగా వదిలేశారు. విద్యుత్ కనెక్షన్లు కావాలని కోరుతూ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ‘ఏ’ ఫారం ద్వారా మార్చి 11, 2012, జనవరి 21, 2013లో ట్రాన్స్‌కో దరఖాస్తు చే శారు. అదే ఏడాది నవంబర్ 30న డబ్బులు కూడా చెల్లించారు. కానీ ట్రాన్స్‌కో ఆ మొత్తం సొమ్ము నుంచి వచ్చే లాభాన్ని పొందుతుందే తప్ప పనులు చేసేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలేదు.
 పడకేసిన తాగునీటి పథకాలు...
 
 మూడో విడత కింద మేళ్లచెర్వు మండలం దొండపాడు, కిష్టాపురంలో రూ.120 కోట్లతో  పునరావాస గ్రామాల్లో నిర్మించిన తాగునీటి పథకాలకు ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు.
 
 నాలుగో విడత కింద గరిడేపల్లి మండలం సర్వారం, కాచవారిగూడెంలో రూ.30కోట్లతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు.
 
 మోతె మంచినీటి పథకాన్ని రూ.20 కోట్లతో పూర్తి చేశా రు. కానీ సిరికొండ గ్రామానికి నీళ్లు చేరడం లేదు. ఇక్క డ విద్యుత్ సౌకర్యం కల్పిస్తే నీటి సమస్య తీరుతుంది.
 పోచంపల్లిలోని జిబ్లక్‌పల్లిలో రూ.35 కోట్లతో నిర్మించిన పథకానికి విద్యుత్ పనులు అసంపూర్తిగా వదిలేశారు.
 
 బొమ్మలరామారం మంచినీటి పథకానికి రూ.50 కోట్ల ఖర్చు పెట్టారు. కానీ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా ఉండిపోయింది.
 
 దామరచర్ల మండలం బాలెంపల్లి మంచినీటి పథకాన్ని రూ. 48 కోట్లతో పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టులకు స్తంభాలు వేసి వదిలేశారు. ఇదే మండలంలో కాల్వక ట్ట వద్ద రూ.24 కోట్లు, గోన్యాతండా, ఇసుకబావిగూడెం వద్ద రూ.24కోట్లతో ఏర్పాటు చేసిన పథకాలకు విద్యుత్ సౌకర్యం లేదు.
 
 వేములపల్లిలోని ఎరకలిగుట్ట వద్ద రూ.11కోట్లతో నిర్మిం చిన పంపింగ్ స్టేషన్‌కు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు.
 
 పెద్దవూర మండలం చింతలపాలం పంపింగ్ స్టేషన్, చింతపాలెం హెడ్ వర్క్స్, నైనివానికుంట పథకాల వద్ద కరెంట్ స్తంభాలతోనే పనులు నిలిపేశారు.
 పెద్దవూరలో రూ.37 కోట్లతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకానికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు.
 
 నిడమనూరు మండలం మేఘ్యాతండా వద్ద రూ.16 కోట్లు, చివ్వెలం మండలం చందుపట్లలో రూ.71కోట్లతో మంచి నీటి పథకాలు చేపట్టారు. కానీ విద్యుత్ కనెక్షన్లు మాత్రం ఇవ్వలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement