drinking water problems
-
తాగునీటి సమస్యపై తస్మాత్ జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటి సరఫరా విషయంలో నీటి పారుదల శాఖ, తాగునీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో వేసవి తాగునీటి ప్రణాళిక, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.కలెక్టర్లు డ్యాష్ బోర్డు ద్వారా ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా సమ స్య తలెత్తితే పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలని చెప్పారు. పలు గ్రామాలకు తాగు నీటి సరఫరా పైపులైను వ్యవస్థ లేదని, పలు ఇళ్లకు నల్లాలు లేవని.. ఆయా ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. కోయగూడేలు, చెంచు పెంటలు, ఇతర గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. భూభారతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాల మెట్లు ఎక్కించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా విస్తృత అధ్యయనం తర్వాత తీసుకువచ్చిన భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రెవెన్యూ యంత్రాంగమే ఇకపై ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు, ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.ఈ చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలని, ప్రతి జిల్లా కలెక్టర్ మండల స్థాయి సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమ య్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ రెండింటినీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని, ఆయా మండల కేంద్రాల్లో సదస్సులకు కలెక్టర్లు కచ్చితంగా హాజరుకావాలని, ఆ మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. వీటికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారని తెలిపారు.ఇళ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలొగ్గొద్దు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపాలని.. ఇన్చార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖరారవుతుందని చెప్పారు. సరైన పర్యవేక్షణకు వీలుగా ప్రతి నియో జకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమి టీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని రేవంత్ వివరించారు.గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గ వద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి క మిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సూ చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూ పల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దాహం తీరాలంటే రాష్ట్రం దాటాలి..
అశ్వారావుపేట రూరల్: దాహం తీర్చుకోవడానికి ఆ రెండు గ్రామాల గిరిజనులు ఏకంగా.. రాష్ట్ర సరిహద్దు దాటాల్సి వస్తోంది. నెల రోజులుగా వారిని వేధిస్తున్న తాగునీటి సమస్య గురువారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొండరెడ్ల గ్రామాలైన గోగులపూడి, కొత్త కన్నాయిగూడెంల్లో నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.ఈ గ్రామాల్లో 50కి పైగా గిరిజన కుటుంబాలు నివసిస్తుండగా, ఒకే తాగునీటి పథకం ద్వారా నీరు అందేది. అయితే, బోరు నుంచి ట్యాంక్‌లోకి నీరు ఎక్కించే ప్రధాన పైపు విరగడంతో సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదు. దీంతో గ్రామస్తులు తాగునీటి అవవసరాల కోసం నిత్యం రెండు కిలోమీటర్లు ప్రయాణించి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు పొలంలోని బోర్ నుంచి ట్యాంకర్‌తో నీరు తెచ్చుకుని బిందెలు, బకెట్లలో పట్టుకుంటున్నారు. దీనిపై ఎంపీడీవో ప్రవీణ్‌ను వివరణ కోరగా సమస్య దృష్టికి రాలేదని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
తాగునీటి సమస్యకు ఫోన్‌కాల్ పరిష్కారం
నల్లగొండ: మీ గ్రామంలో తాగునీటి సరఫరాలో సమస్య వచ్చిందా? నీళ్లు రావటం లేదా? అయితే ఎందుకు ఆలస్యం..! ఫోన్ తీయండి.. ఒక్క కాల్ చేయండి... మీ సమ స్య పరిష్కారమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 18005 94007ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని ఏ గ్రామం నుంచి ఫోన్ చేసినా సరే.. మీ ఫిర్యాదును నమోదుచేసుకొని.. సంబంధిత జిల్లా అధికారులకు సమస్యను తెలిపి పరిష్కారానికి కృషిచేస్తారు. గత నెల 23న హైదరాబాద్‌లో పది మంది అధికారులతో రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. సమస్య పరిష్కారం ఇలా.. రాష్ట్రంలో ఏదైనా గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడితే స్థానిక అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. మీ ఫోన్‌కాల్ రాష్ట్ర కార్యాలయంలో రికార్డవుతుంది. తర్వాత అక్కడి అధికారులు ఆ సమస్యను సంబంధిత జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారికి తెలుపుతారు. ఆ అధికారి సంబంధిత అధికారిని క్షేత్రస్థాయికి పంపి సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు. సమస్య పరిష్కారమైన తర్వాత ఆ విషయాన్ని జిల్లా అధికారి తిరిగి రాష్ట్ర కార్యాలయానికి తెలుపుతారు. టోల్‌ఫ్రీ నంబర్ కార్యాలయం అధికారులు ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందా లేదా? అని ధ్రువీకరించుకుంటారు. ఇది మున్సిపాలిటీల ప్రజలకు వర్తించదు. -
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్‌లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నీటి ఎద్దడి నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు. ‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్ఆర్ఎస్పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్‌భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’ ‘కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’ మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే... ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి – విజయేంద్ర , మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్‌బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ కోర్‌సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్డీ, ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్డీ నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ అక్కడే హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్‌బోర్డు చెబుతోంది. -
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
రేగళ్ల గుంపునకు తాగునీటి ట్యాంకర్
అశ్వారావుపేట: రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యపై సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గొంతెండుతోంది..’ శీర్షికన ప్రచురితౖ మెన కథనానికి అధికారులు స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ పరిధి రేగళ్ల గుంపులో తాగునీటి సమస్య ‘ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం’ శీర్షికన ఫొటో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్ నివేదిక సమర్పించాలని దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్‌ను ఆదేశించారు. ఈమేరకు ఆయన అశ్వారావుపేట ఎంపీడీఓ శ్రీనివాస్‌తో మాట్లాడి బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించగా, మంగళవారం రేగళ్ల గుంపునకు ట్యాంకర్ పంపించారు. -
గొంతెండుతోంది!
వేసవికాలం మొదలైంది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావులు కూడా బోసిపోతుయి. దీనితో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా మంచినీటి సరఫరా తగ్గిపోయింది. ఊర్లలో నీటి ట్యాంకర్ల హడావుడి మొదలైంది. గ్రామాల్లో పంచాయతీలు, వార్డుల వారీగా ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. పట్టణాల్లో అయితే ప్రైవేటు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని వాడుకోవాల్సిన దుస్థితి మొదలైంది. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి వాగుల వద్దకు వెళ్లి చెలిమల నుంచి నీటిని మోసుకురావాల్సి వస్తోంది. మైదాన ప్రాంత గ్రామాల్లోనూ పలుచోట్ల నీటికి ఎద్దడి ఏర్పడటంతో శివార్లలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు నెలల పాటు ఎలా వెళ్లదీయాల్సి వస్తుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి నెట్వర్క్ మా‘నీరు’ తగ్గుతోంది కరీంనగర్‌తోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాంతాలకు ఆధారమైన లోయర్ మానే ర్ డ్యామ్‌లో నీటి నిల్వల పరిస్థితి ఇది. ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలైతే.. ప్రస్తుతం 7.4 టీఎంసీలే ఉన్నాయి. ఎండలు మండుతుండటంతో ఈ నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాహం కోసం.. దారి పట్టారు గిరిజన గ్రామాల్లో తడారిపోతున్న గొంతులకు గుక్కెడు నీళ్లు దొరకాలంటే దూరాలకు వెళ్లక తప్పని దుస్థితిని చూపే చిత్రమిది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సోలంగూడకు చెందిన గిరిజనులు ఇలా వ్యవసాయ పొలాల నుంచి డబ్బాలలో నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు. ట్యాంకర్ వస్తేనే దాహం తీరేది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం తాటిపర్తిలో గ్రామపంచాయతీ ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు. దాదాపు నెల రోజులుగా నల్లా నీటి సరఫరా నిలిచిపోయిందని, ట్యాంకర్ నీళ్లే దిక్కు అవుతున్నాయని వారు వాపోతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడిస్తేనే గొంతు తడిచేది నిర్మల్ జిల్లా పెంబి మండలం ధూమ్‌ధరి గ్రామపంచాయతీ పరిధిలోని చికమున్ వాగులో చెలిమ తోడుకుని నీళ్లు నింపుకొంటున్న గిరిజనులు వీరు. దీనికి ఇరువైపులా ఉన్న వస్పల్లి కొత్తగూడెం, గిరిజనగూడెం రెండు గ్రామాలవారికి ఈ వాగు చెలిమలలోని నీరే దిక్కు. బిందెల్లో నీళ్లు నింపుకొని కిలోమీటర్ల కొద్దీ మోసుకుంటూ వెళ్తేనే.. ఇంటిల్లిపాదీ గుక్కెడు నీళ్లు తాగే పరిస్థితి. ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల గుంపులో చెలిమ నీటిని తోడుకుంటున్న ఆదివాసీలు వీరు. జనవరిలోనే వాగులు ఎండిపోవడంతో చెలిమలో నీటి ఊట కూడా తక్కువగా ఉంటోందని, ఈసారి నీటి కష్టాలు ఎలా ఉంటాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్‌లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కృష్ణా’లో కరువు తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రధాన జలాశయాలకు శనివారం నాటికి వరద ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. ఆల్మట్టిలోకి కేవలం 900 క్యూసెక్కులు చేరుతుండగా, దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి ఎలాంటి వరద రావడం లేదు. జూరాల రిజర్వాయర్‌కు 3,000 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్‌లోకి 587 క్యూసెక్కులు చేరుతుండగా, శ్రీశైలానికి ఎలాంటి వరద రావడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు గత జూలై నెలాఖరు నాటికి నిండగా, తర్వాత కురిసే వర్షాలతో వచ్చే వరదను నేరుగా శ్రీశైలం జలాశయానికి విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఆగస్టు ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావం నెలకొని ఉండటంతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జలాశయాలకు ఎలాంటి వరద రాలేదు. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో 108 టీఎంసీల వరద రావాల్సి ఉంది. శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 107.194 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీళ్లను విడుదల చేస్తుండటం, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కాల్వలకు నీళ్లను తరలిస్తుండటంతో జలాశయంలో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌కు సైతం ఎలాంటి ప్రవాహం రావడం లేదు. సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 150.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయం నిండడానికి మరో 161 టీఎంసీల వరద రావాల్సి ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సాగు, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకుంటే వేసవిలో తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక జారీ చేసింది. త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 22 లేదా 23వ తేదీలకు వాయిదా వేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ రాష్ట్రం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ/ చెన్నై తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ/గాలేరు నగరి సుజల స్రవంతి అవసరాలకు 4 టీఎంసీలు, కేసీ కాల్వకు 2.5 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 4.5 టీఎంసీలు కలుపుకుని 16 టీఎంసీలను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలను సైతం తెలియజేయాలని కృష్ణా బోర్డు ఇక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 21న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు. -
సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను కౌన్సిలర్లు నిలదీయడంతో కౌన్సిల్ దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. చాలా వార్డుల్లో మిషన్ భగీరథ పథకం తాగునీరు సరిపోవడం లేదని, వీధిలైట్లు 24 గంటల పాటు వెలుగుతున్నాయని కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. వర్షాకాలం ఆరంభమైనందున పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎజెండాలోని వివిధ అంశాలపై వాడివేడీగా చర్చ సాగింది. ముందుగా 32వ వార్డు కౌన్సిలర్ సాదతుల్లా మాట్లాడుతూ చాలా గల్లీలలో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో హైమాస్ట్ లైట్లు సరిగా పనిచేయడం లేదన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని రసాయన మందులు పిచికారీ చేయించాలన్నారు. ఇవే విషయాలను 19వ వార్డు కౌన్సిలర్ షబ్బీర్ అహ్మద్ ప్రస్తావించారు. అంబేడ్కర్ చౌరస్తా సమీపంలోని ఎక్స్పో–ప్లాజా తొలగించినందున అక్కడి సామగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం రామయ్యబౌలిలో వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు పనులు అన్ని మహిళా సంఘాల గ్రూపులకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తికాకుండానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించాలన్నారు. అప్పన్నపల్లిలో రెండో ఆర్ఓబీ ప్రారంభమైనందున కింది భాగంలో అటు, ఇటువైపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అంతర్గత రోడ్లు దెబ్బ తిన్నాయని 21, 37వ వార్డు కౌన్సిలర్లు అనంతరెడ్డి, స్వప్న సమావేశం దృష్టికి తెచ్చారు. కొందరు ఇంటి యజమానులు రోడ్డును ఆనుకొని ర్యాంపులు నిర్మించడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని తొలగించాలని 13, 21వ వార్డు కౌన్సిలర్లు లక్ష్మీదేవి, అనంతరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనాలాలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని 33, 34వ వార్డు కౌన్సిలర్లు మునీరుద్దీన్, నర్సింహులు కోరారు. కొందరు వ్యక్తులు వాహనాల్లో కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు సమీపంలో అర్ధరాత్రి చికెన్ వ్యర్థ పదార్థాలను పడేసిపోతున్నారని సభ దృష్టికి తెచ్చారు. వీరితో పాటు కౌన్సిలర్లు సంధ్య, శ్రీనివాసులు, ముస్కాన్ సుల్తానా, రామాంజనేయులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.. – చైర్మన్, కమిషనర్ సభ్యులు ప్రస్తావించిన ఈ సమస్యలను వీలైనంతవరకు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ డి.ప్రదీప్‌కుమార్ బదులిచ్చారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా ఎజెండాలోని కొన్ని పద్దుల్లో తప్పులు దొర్లడంతో అధికారులపై చైర్మన్ మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ తాటి గణేష్‌కుమార్, టీపీఓ లక్ష్మీపతి, డిప్యూటీ ఈఈ బెంజిమన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, గురులింగం, ఏఓ ఉమాకాంత్, ఆర్ఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఆగమే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఆగం అవుతుందని, ఉద్యమనేత కేసీఆర్ చేతుల్లో ఉంటేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సాగునీరు, తాగునీరు వంటి సమస్యలకు కేసీఆర్ హయాంలోనే పరిష్కారం లభించిందని, దీన్ని అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా రూ.2,653 కోట్లతో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ఆయన బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగేదా? తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుందన్నారు. సింగూరు ప్రాజెక్టు కోసం మెదక్ రైతులు భూములు కోల్పోతే నీళ్లు హైదరాబాద్‌కు వెళ్లాయన్నారు. సింగూరు జలాలు మెదక్, నిజామాబాద్ జిల్లాలకే దక్కాలని సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో హైదరాబాద్ తాగునీటి కష్టాలు తీర్చారని వివరించారు. రైతులతో ముచ్చట...: సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులతో ముచ్చటించారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, హెచ్‌డీసీ రాష్ట్ర చైర్మన్ చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు బుధవారం రాత్రి సిద్దిపేటలో రంగనాయసాగర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించిన సాగునీటి దినోత్సవంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నది లేకుండా ఒక ప్రాజెక్ట్ ఉందంటే అది మానవ నిర్మితమైన మల్లన్నసాగర్ ఒక్కటే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఢిల్లీలో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీసుల చుట్టూ ఓపికగా తిరిగిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. -
దర్శి దాహార్తి తీరేలా.. ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్
దర్శి పట్టణవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రూ.121 కోట్లు మంజూరు చేశారు. రానున్న 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక టెండర్లు పిలవడమే తరువాయి. దీనిపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శి(ప్రకాశం జిల్లా): దర్శి పట్టణంలో 33,500 మంది జనాభా నివశిస్తున్నారు. అధికారికంగా పన్ను చెల్లిస్తున్న నివాసాలు 8,800 ఉండగా అనధికారికంగా 10 వేలకు పైగానే ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఉన్న నిమ్మలబావి కనెక్షన్లు 600, ఆర్డబ్ల్యూఎస్ కనెక్షన్లు 60, వీధి కుళాయిలు మరో 960 ఉన్నాయి. ప్రస్తుతం మూడు రోజులకు ఒక సారి నీరు అందుతోంది. 50 ఏళ్లు నీటి ఇబ్బందులు అధిగమించేలా: మరో 50 ఏళ్లు ఇంటింటికీ కుళాయి నీరు ఇచ్చి నీటి ఇబ్బందులు అధిగమించేలా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఈ ఎస్ఎస్ ట్యాంక్‌లో 1600 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. రోజుకు 9 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేలా ప్రణాళికలు చేశారు. రోజుకు ఒక వ్యక్తికి 135 లీటర్ల నీరు సరఫరా చేస్తారు. కేటాయింపు ప్రణాళికలు ఇలా.. ఈ ప్రాజెక్ట్‌కు రూ.121 కోట్లు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేశారు. నాలుగు విభాగాలుగా పనులకు ప్రణాళికలు రూపొందించారు. సాగర్ కాలువ నుంచి ఎస్ఎస్ ట్యాంక్ (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్)కు నీరు రావడానికి, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్, ఫుట్ బ్రిడ్జి, ఇంటేక్ వెల్ ల నిర్మాణానికి, నీటి సరఫరా లైన్లకు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాలకు రూ.8938.67 లక్షలు కేటాయించారు. రెండో విభాగంలో 7 సంవత్సరాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు రూ.660.85 లక్షలు కేటాయించారు. మూడో విభాగంలో జీఎస్టీ ఇతర చార్జీలు రూ.1752.64 లక్షలు కేటాయించగా నాలుగో విభాగంలో ఏపీఎస్పీ డీసీఎల్, ప్రైజ్ వేరియేషన్స్, కన్సల్టెన్సీ చార్జెస్, ల్యాండ్ కేటాయింపునకు, ఇతర అవసరాలకు రూ.747.84 లక్షలు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను దర్శి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ముండ్లమూరు మండలం పులిపాడు చెరువు వద్ద నిర్మిస్తారు. ఆ చెరువుకు మొత్తం 250 ఎకరాలు భూమి ఉంది. చెరువు నిండితే 120 నుంచి 150 ఎకరాల భూమిలో నీరు నిల్వ ఉంటుంది. 100 ఎకరాల నుంచి 130 ఎకరాల వరకు చెరువుకు మిగులు భూమి ఉంది. అందులో 96 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్‌కు సేకరించారు. ప్రత్యేకంగా రావాటర్ స్టోరేజ్ ట్యాంక్, నీటి శుద్ది కర్మాగారాలు, స్టాఫ్ క్వార్టర్స్ వంటి సౌకర్యాలకు భూమిని ఉపయోగిస్తారు. సాగర్ కుడి కాలువ నుంచి నేరుగా చెరువులోకి నీరు వచ్చేలా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ నీటిని శుద్ధి ప్లాంట్‌లో శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా పట్టణంలోని ఇంటింటికీ నీటి సరఫరా చేస్తారు. వీధి పంపులకు చెక్: ప్రస్తుతం మంజూరైన ప్రాజెక్ట్ పూర్తయితే మహిళలు వీధి కుళాయిల వద్ద లైన్లో నిలబడి నీరు పట్టుకోవాల్సిన పని లేదు. నేరుగా ఇంట్లోకే తాగు నీరు పైప్ లైనుల ద్వారా చేరేలా ప్రణాళికలు చేశారు. వారి సమయం కూడా వృథా కాదు. పాత పైప్ లైనులు బాగున్న చోట అవే లైన్లు ఉంచి, నీరు అందని ఎత్తు పల్లాల వద్ద నూతన పైప్ లైన్లు వేస్తారు. దీంతో ప్రతి ఇంటికి నీరు కచ్చితంగా చేరుతుంది. పరోక్షంగా పట్టణ అభివృద్ధి: తాగునీటి ఇబ్బందులు అధిగమిస్తే నివాసాలు ఉండేవారు ఎక్కువ చొరవ చూపుతారు. దీంతో దర్శిలో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా పట్టణం కూడా వ్యాప్తి చెందుతుంది. శిథిలావస్థలో నెదర్లాండ్ చెరువు 35 సంవత్సరాల క్రితం సాగర్ కాలువ నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన తాగునీటి రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉంది. అప్పటి జనాభా ప్రకారం ప్రణాళికలతో నిర్మించిన నిర్మాణాలు, పైపులైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పట్టణం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రాజెక్ట్ పూర్తయితే ఇబ్బందులను అధిగమించవచ్చు. -
కాలమేదైనా కాలినడకే..
ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోని ‘గోవెన’గూడేలు తాగునీటికి నీటి చెలిమలే ఆధారం.. కరెంటు లేదు.. రోడ్డు లేదు.. బడి లేక పిల్లలు చదువులకు దూరం తిర్యాణి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యా ణి మండలం గోవెన గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పంచాయతీ పరిధిలో ఐదు గూడేలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి గోవెనగా పిలుస్తారు. 361 మంది జనాభా ఉన్నారు. దశాబ్దాలుగా ఈ గూడేలు ఉనికిలో ఉన్నా.. ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలులేవు. కరెంటు సౌకర్యం లేదు. నాయకపుగూడ, కుర్సిగూడ గ్రామాలైతే అత్యంత వెనుకబడి ఉన్నాయి. పదేళ్ల క్రితం ఐటీడీఏ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా.. నిర్వహణ లేక ఐదేళ్ల క్రితం చెడిపోయాయి. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన నాలుగు సోలార్ లైట్లు మాత్రమే ప్రస్తుతం వీరికి వెలుగునిస్తున్నాయి. ఈ గూడేలకు తాగునీటి సౌకర్యం లేదు. కనీసం ఒక్క చేతిపంపు కూడా వేయలేదు. మిషన్ భగీరథ ట్యాంకులు అలంకారప్రాయంగా మిగిలాయి. నాయకపుగూడ వాసులు సమీపంలోని వాగులో చెలిమ తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వానాకాలంలో వాగు లో ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు చెలిమ నీరు కూడా దొరకదు. మిగతా నాలుగు గూ డేల వారు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కాలినడకనే ప్రయాణం ఐదు గూడేల ప్రజలు ఏ అవసరమున్నా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. ప్రతినెలా రేషన్, పింఛన్, ఆస్పత్రి, సామగ్రి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు వాగులను దాటుకుంటూ.. ఐదు కిలోమీటర్లు నడిచి ఆసిఫాబాద్ మండలం బలాన్పూర్కు చేరుకుంటారు. లేదా ఆరు కిలోమీటర్లు నడిచి లింగాపూర్ మండలం రాఘవపూర్‌కు వెళ్లి.. అక్కడి నుంచి వాహనాల ద్వారా తిర్యాణికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో పోలీసులు బలాన్పూర్ మీదుగా గోవెనకు మట్టిరోడ్డు నిర్మించినా.. వరదలతో నామరూపాల్లేకుండా పోయింది. అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లడానికి 108 వాహనం రాలేని పరిస్థితి. పంచాయతీ పరిధిలో అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. నాయకపుగూడలో తలపెట్టిన పాఠశాల భవనం నేటికి అసంపూర్తిగానే ఉంది. ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మాగోస ఎవరికీ రావొద్దు: ముత్తినేని రాజమ్మ, నాయకపుగూడ మాకు సర్కారు నుంచి రేషన్ బియ్యం తప్ప ఎలాంటి లబ్ధి జరగడం లేదు. తాగడానికి నీళ్లు, కరెంటు, రోడ్డు లేవు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చెలిమ నీళ్లే తాగుతున్నం. ఆపద వస్తే కిలోమీటర్ల దూరం నడిచి ఆస్పత్రులకు పోతున్నాం. కరెంటు కోసం అధికారులను అడిగితే ఫారెస్టు అనుమతులు రావట్లేదని చెప్తున్నారు. మా గోస ఎవరికీ రావొద్దు. చేతి పంపులైనా వేయాలె.. మా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేదు. పిల్లలకు పౌష్టికాహరం కోసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. కనీసం తాగునీటి కోసం గ్రామంలో చేతి పంపు అయినా వేయాలి. రోడ్డు సౌకర్యం కల్పించాలి. – కొడప లచ్చుబాయి, గోండుగూడ ఈ ఫొటోలో కంకర రాళ్ల కుప్పలా కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? ఓ గ్రామానికి వెళ్లే రోడ్డు! ఇది నిజమే.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన పంచాయతీకి వెళ్లేందుకు దారి ఇదే. రాత్రిపగలు.. ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా.. ఈ దారి మీదుగా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. -
గిరిజన ఆవాసాల్లో తాగునీటి సమస్యలుండొద్దు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆవాసాల్లో అసలు తాగునీటి సమస్య తలెత్తొద్దని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో 99 శాతం గ్రామాలు మిషన్ భగీరథ పథకంతో అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. మిగతా ఒక్క శాతాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. మిగిలిపోయిన 105 గ్రామాలన్నీ గిరిజన ఆవాసాలే అని తెలిపారు. ఆయా గ్రామాలు సుదూరంగా ఉండడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం ఇతర మౌలిక వసతుల సమస్యతో మిషన్ భగీరథ పనులు పూర్తికాలేదన్నారు. అత్యవసర అవసరాల కోసం ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి వసతి కలి్పంచాలని మంత్రి ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లేడుబండ రిజర్వాయర్‌కు టెండర్లు
సాక్షి, అమరావతి: రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా 2.41 టీఎంసీల సామర్థ్యంతో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.609.14 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్(లంప్సమ్–ఓపెన్) విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. షెడ్యూళ్లు దాఖలుకు అక్టోబర్ 7ను తుది గడువుగా నిర్ణయించింది. అదే రోజున నిర్వహించే ప్రీ–బిడ్ సమావేశంలో షెడ్యూళ్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూపంలో రూ.6.09 కోట్ల చొప్పున తీసిన డీడీలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎస్ఈ–2కు అందించాలి. అక్టోబర్ 11న ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థ కోట్‌చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదేరోజు ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో అతి తక్కువ ధరకు కోట్‌చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి ప్రతిపాదనలు పంపుతారు. హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా.. హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా జిల్లేడుబండ రిజర్వాయర్‌ను ప్రభుత్వం చేపట్టింది. హంద్రీ– నీవా ప్రధాన కాలువ 377.1 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి.. అక్కడి నుంచి తవ్వే కాలువ ద్వారా కొత్తగా నిర్మించే జిల్లేడుబండ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ కింద తవ్వే పిల్ల కాలువల ద్వారా బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. -
3 ఏళ్లు.. రూ.15,989 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. ప్రాధాన్యత క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించింది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తొలి విడతలో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతోపాటు ఇతర తాగునీటి వసతి సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ.15,989 కోట్ల ఖర్చు చేసేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.3,720 కోట్లు, 2022–23లో రూ.8,089 కోట్లు, 2023–24లో రూ.4,180 కోట్లు వెచ్చించనున్నారు. పనిచేయని మంచినీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావడానికి, జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కొత్త మంచినీటి పథకాల నిర్మాణానికి మొదటి విడతలో రూ.3,090 కోట్లు వెచ్చిస్తారు. ప్రభుత్వం ఇటీవల పేదలకు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు పంపిణీ చేసిన నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో తాగునీటి వసతుల కల్పన ప్రాధాన్యత అంశంగా నిర్ధారించారు. ఇప్పటికే పనులు మొదలైన 3 జిల్లాలకు తోడు.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. అక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా డోన్, వైఎస్సార్ జిల్లా పులివెందుల ప్రాంతాల్లో రూ.684 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు ప్రాంతాలతో కూడిన పశ్చిమ ప్రాంతంతో పాటు చిత్తూరు జిల్లా ఉత్తర ప్రాంతంలో వాటర్‌గ్రిడ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రొయ్యల చెరువులు, సముద్రజలాల ఉప్పునీటితో ఇబ్బందులు పడుతున్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలో రూ.7,840 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఏపీలోని 13 జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మంచినీటి వసతుల కల్పనకు రూ.3,250 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
మండు వేసవిలోనూ మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెరువుల నిండా సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలాల అందుబాటుతో తాగునీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. భూగర్భ జలాలు పైపైకి ఉబికి రావడంతో రెండేళ్ల క్రితం వరకు పనిచేయని బోర్లు సైతం నిండు వేసవిలోనూ నీటి ధారలు కురిపిస్తున్నాయి. 2019 ఏప్రిల్ మొదటి వారంలో 3,422 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తగా ప్రస్తుత వేసవిలో 285 గ్రామాల్లోనే సమస్య కనిపిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.08 లక్షల మంచి నీటి బోర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా 2,08,094 మంచినీటి బోర్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు వేసవి వస్తే 60–70 వేల వరకు బోర్లు పనిచేసేవే కాదు. ఇప్పుడు 5–6 వేలు మినహా మిగిలిన అన్ని బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో 26,007 బోర్లు ఉంటే.. రెండేళ్ల క్రితం వరకు వేసవి సీజన్లో 10 వేల బోర్లు పనిచేసేవి కావు. 8 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ప్రకాశం జిల్లాలో గతంలో 16.09 మీటర్ల లోతున అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది ఏప్రిల్ 10 నాటికి 8 మీటర్ల లోతులోనే ఉన్నాయని అధికారులు గ్రామీణ నీటి సరఫరా శాఖకు నివేదించారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో 17.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ జలాలు ఇప్పుడు సరాసరిన 7 మీటర్ల లోతుకే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం వేసవిలో ముందు జాగ్రత్తగా మార్చి నెలాఖరులోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపింది. నీటి ఇబ్బందులు తప్పాయి రెండేళ్ల క్రితం వరకు మా గ్రామంలో నీళ్ల కోసం ఇబ్బంది పడేవాళ్లం. ట్యాంకర్ నీళ్ల కోసం పనులన్నీ మానుకొని ఇళ్లకాడ వేచి చూసేవాళ్లం. ట్యాంకర్ రాకుంటే పొలాలకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. మా ఊరిలో చెక్‌డ్యామ్ కట్టడంతో ఇప్పుడు చెరువు నిండా నీళ్లున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తోంది. – కుమారుల చెన్నక్రిష్ణమ్మ, బాదినేనిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా -
పట్టణాల్లో నీటి ఎద్దడికి రూ.8,217 కోట్లతో చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం అమృత్, ఏఐఐబీ నిధులు, ప్లాన్ గ్రాంట్ నిధులు.. మొత్తం మీద రూ.8,216.95 కోట్లను వెచ్చిస్తోంది రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు కలిపి 125 ఉండగా.. 59 పట్టణాల్లో రోజుకు ఒకసారి, 34 పట్టణాల్లో రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా చేయగలుగుతున్నారు. 13 పట్టణాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖ ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టింది. నగరాలు, పట్టణాల్లో రోజుకు 1,750 మిలియన్ లీటర్ల (ఎంఎల్) తాగునీరు అవసరం కాగా ప్రస్తుత తాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం రోజుకు 1,678 మిలియన్ లీటర్లు. 72 మిలియన్ లీటర్ల నీటిని ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నారు. 2035 నాటికి రోజుకు 2,700 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని పురపాలకశాఖ అంచనా వేసింది. అంటే ప్రస్తుత వ్యవస్థీకృత సామర్థ్యం కంటే 1,022 మిలియన్ లీటర్లు ఎక్కువ అవసరం. ఆ మేరకు వ్యవస్థీకృత సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 32 మునిసిపాలిటీల్లో ‘అమృత్’ధారలు లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో అమృత్ పథకం కింద తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లు. దీన్లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1,056.62 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.436.97 కోట్లు, మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.180.77 కోట్లు సమకూరుస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లలో తాగునీటి సరఫరాకు రూ.2,526.33 కోట్లు వెచ్చించనున్నారు. ఆ 32 మునిసిపాలిటీల్లో అదనంగా రోజుకు 307 మిలియన్ లీటర్ల తాగునీరు అందించనున్నారు. దీనికోసం కొత్తగా 4,36,707 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇస్తారు. ఏఐఐబీ నిధులతో 50 మునిసిపాలిటీలకు.. ఆసియన్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో మరో 50 మునిసిపాలిటీల్లో ప్రాజెక్టులు చేపట్టారు. మొత్తం 33 లక్షల జనాభాకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని మొత్తం వ్యయం రూ.5,350.62 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.3,487.67 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,494.72 కోట్లు కాగా మునిసిపాలిటీల వాటా రూ.368.23 కోట్లు. మొదటిదశ కింద ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, రెండో దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు చేపడతారు. ప్లాన్ గ్రాంట్ నిధులతో రాయచోటిలో రోజుకు 35 మిలియన్ లీటర్ల తాగునీరు అందించడంతోపాటు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.340 కోట్ల ప్రాజెక్టును చేపట్టారు. -
భద్రాద్రిలో మొదలైన త్రాగునీటి సమస్యలు
-
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
సాక్షి, కామారెడ్డి : జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని నినాదాలతో హోరెత్తించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించిన మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా -
ముందస్తు ప్రణాళికతో మంచినీటి ఎద్దడికి చెక్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ ఇబ్బందుల మధ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 2,837 గ్రామాలకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది జనవరిలోనే రూ. 204.75 కోట్లతో గ్రామీణ మంచినీటి ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► ఈ వేసవిలో 2,055 గ్రామాల్లో పశువుల అవసరాలకు కూడా నీటి సరఫరా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ► 347 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని, ఆ నీటిని సమీప గ్రామాల్లోని మంచినీటి పథకాలకు అనుసంధానం చేశారు. ► సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో, గ్రామాల్లోని బావుల్లో పూడిక తీత వంటి అవసరాలకు రూ. 5.80 కోట్లు కేటాయింపు. ► మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ సభ్యులుగా కమిటీలను ప్రభుత్వం నియమించింది. ► భూగర్భ జలాలు కలుషితమైన చోట వైఎస్సార్ సుజల పథకంలో మంచినీటి ప్లాంట్ల ద్వారా క్యాన్ వాటర్ సరఫరాకు రూ. 46.56 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ► రాష్ట్ర వ్యాప్తంగా రూ. 55.86 కోట్లతో సోలార్ స్కీంల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. -
‘సీమ’లో మూడు ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: కృష్ణా వరదను ఒడిసి పట్టి రాయలసీమ సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించే మూడు ఎత్తిపోతల పథకాలకు రూ.4.27 కోట్లతో తొలి దశ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. గత సెప్టెంబర్ 2వ తేదీన పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పీఏడీఏ) పరిధిలో చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మూడు ఎత్తిపోతల పథకాలకు పరిపాలనా అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఆర్ సిద్ధమయ్యాక పనులు చేపట్టేందుకు రెండో దశ పరిపాలన అనుమతి మంజూరవుతుంది. వీటి ఆధారంగా టెండర్లు పిలుస్తారు. 1,050 క్యూసెక్కుల ఎత్తిపోత ఇలా.. గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి రోజుకు 1,050 క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి 350 క్యూసెక్కులను ఎత్తిపోసి చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో చెరువులను నింపుతారు. కాలేటివాగు రిజర్వాయర్ నుంచి 700 క్యూసెక్కులను లిఫ్ట్ చేసి హంద్రీ–నీవా ప్రధాన కాలువలో 473 కి.మీ వద్దకు తరలిస్తారు. వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను నింపుతారు. ఈ పనుల డీపీఆర్ తయారీకి రూ.3.58 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. వేముల, వేంపల్లిలో 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి రోజుకు 240 క్యూసెక్కులను లిఫ్ట్ చేసి అలవపాడు చెరువు నింపుతారు. అక్కడి నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)లో 52 కి.మీ. వద్ద ఎత్తిపోసి వేముల, వేంపల్లి మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. దీని డీపీఆర్ తయారీకి రూ.18 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.57 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి యర్రబల్లి చెరువును నింపడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని లింగాల, పులివెందుల మండలాల్లో చెరువులు కూడా నింపుతారు. ఈ పనుల డీపీఆర్‌కు రూ.51 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నీటి కష్టాల నుంచి విముక్తి.. వైఎస్సార్ జిల్లాలో పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు రిజర్వాయర్ నిరి్మంచినా వర్షాభావంతో ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పులివెందుల, లింగాల మండలాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు గాలేరు–నగరి జలాలను వినియోగించుకునే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదముద్ర వేయడంతో నీటి కష్టాలు తీరనున్నాయి. -
వాటర్‌గ్రిడ్‌తో నీటి సమస్యలకు చెక్
పులివెందుల: రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీంతో సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో నియోజకవర్గ అభివృద్ధి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పులివెందులను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రతి మండలంలో గోడౌన్లు, నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీఎం సహాయ నిధి కింద 9 మందికి మంజూరైన రూ.20 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్–2019లో కడపకు చెందిన ఆర్.కె.సిద్ధార్థ రెడ్డి, పి.వి.సాయిశ్రీనివాస్‌లు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారిని అభినందించారు. -
కర్నూలుకు కన్నీరు!
కర్నూలు (టౌన్)/ఓల్డ్‌సిటీ: కర్నూలు నగరానికి తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. వారం రోజుల్లో ప్రత్యామ్నాయం చూపకపోతే తీవ్ర కష్టాలు తప్పవు. ఇప్పుడే నగరంలోని శివారు కాలనీలకు వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా ట్యాంకర్ల ద్వారానే. చాలాప్రాంతాల్లో కుళాయిలు బంద్ అయ్యాయి. నీటి కష్టాల వల్ల వ్యాపార సముదాయాలు, హోటళ్లను సైతం మూసేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ హోటల్ మూత పడింది. డబ్బు పెట్టినా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో హోటల్‌ను తాత్కాలికంగా మూసేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్యూరిఫైడ్ వాటర్ ధరకు రెక్కలొచ్చాయి. క్యాన్ వాటర్ రూ.30–40 మధ్య విక్రయిస్తున్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మరో వారం రోజుల్లో పూర్తిగా ఖాళీ కానుంది.ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించడం లేదు. సుంకేసుల, జీడీపీ వెలవెల నగర తాగునీటి అవసరాలకు ప్రధానమైన సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) ఇప్పటికే డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. వీటి నుంచి నెల క్రితమే నీటి సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నీటిని మాత్రమే నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇది కూడా డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఫిల్టర్ బెడ్‌కు కూడా సరిగా నీరందని పరిస్థితి. ఇందులో ప్రస్తుతమున్న నీటి మట్టం చూస్తే వారంలోపే పరిస్థితులు మరింత దిగజారే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 2005వ సంవత్సరంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో 14 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి నీటినిల్వ తగ్గిపోయింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొనకపోతే కర్నూలు వాసులకు 2001 సంవత్సరం నాటి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా ఇబ్బందులు వర్షాభావ పరిస్థితుల వల్ల గత రెండేళ్లుగా కర్నూలు వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వేసవిలో సుంకేసుల డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని తరలించారు. అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు సరఫరా చేసి నగర వాసులను కష్టాల నుంచి గట్టెక్కించారు. ఈ ఏడాది కూడా వర్షాలు లేక నగరవాసులకు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిమాండ్‌కు తగినట్లు తాగునీటిని సరఫరా చేయకపోవడంతో ఇప్పటికే ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతిరోజూ నగర ప్రజలకు 83 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ప్రస్తుతం నగరపాలక సంస్థ 69 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. కాలనీల్లో కటకట కర్నూలు నగరంలోని పలు కాలనీల్లో ఇప్పటికే నీటి సమస్య ఉధృతరూపం దాల్చింది. శివారు కాలనీలైన మామిదాలపాడు, మునగాలపాడు, స్టాంటన్‌పురం, బాలాజీ నగర్, మమతానగర్, సమతానగర్, సోనియాగాంధీ నగర్ వంటి అనేక కాలనీలలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాతబస్తీ నుంచి కొత్త కాలనీలు, కల్లూరు కాలనీలలో నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. పాతబస్తీలోని చిత్తారిగేరికి మూడు రోజులు, పెద్దపడఖానాకు ఐదు రోజులుగా నీళ్లు రావడం లేదు. రొటేషన్ ప్రకారం పాతబస్తీలోని పలు కాలనీలకు మంగళవారం నీళ్లు రావాలి. కానీ ట్యాంకులోకే నీళ్లు ఎక్కలేదంటూ లైన్మెన్లు చేతులెత్తేశారు. అధికారులు నీటి ట్యాంకర్లు పంపినా అందరికీ అందడంలేదు. కర్నూలు, కల్లూరు ఏరియాలో ఉన్న మొత్తం 23 ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనూ పూర్తి స్థాయిలో నీటిని నింపలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నగర పాలక సంస్థకు చెందిన 8 ట్యాంకర్లతో పాటు 23 ప్రైవేటు ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. ఫిర్యాదులు వస్తున్న కాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నారు. పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా మరొక సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మిస్తే తప్ప వేసవి కష్టాలు తీరవు. ఎస్ఎస్ ట్యాంకులో నీరు 7 రోజులకు సరిపోతుంది సుంకేసుల, జీడీపీ నుంచి నెల క్రితమే నీళ్లు బంద్ అయ్యాయి. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి అందిస్తున్నాం. ప్రస్తుతం ఈ ట్యాంకులో 301.72 లక్షల లీటర్ల నీరు ఉంది. ఇది వారం రోజులకు మాత్రమే సరిపడుతుంది. ఆ తరువాత ఇబ్బందిగా ఉంటుంది. ఎల్లెల్సీ నుంచి నీటిని వదిలినట్లు సమాచారం ఉంది. – వేణుగోపాల్, నగరపాలక ఎస్ఈ 5 రోజులుగా రావడం లేదు పెద్దపడఖానాలోని పాఠశాల ప్రాంతానికి నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు. శుక్రవారం నీళ్లు పట్టుకున్నాం. ఆదివారం కొందరికే వచ్చాయి. తిరిగి మంగళవారం సరఫరా చేయాలి. కానీ బిందె నీళ్లు కూడా రాలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? – అయ్యమ్మ -
లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల నీటిగోస తీర్చడానికి గోదావరి జలాలను తరలించే పనులు వెంటనే చేపట్టకపోతే వచ్చే నెల 10న జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ, అనంతరం ధర్నా చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటన చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరుకు ప్రధాన వనరులైన సింగూరు, మంజీరా డ్యాంలు ఎండిపోవడంతో నీటి కటకట ఏర్పడిందన్నారు. దీంతో ప్రజలు కనీసం తాగునీటికి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి, సదా శివపేట మున్సిపాలిటీలతో పాటుగా నియోజకవర్గంలోని మండలాల్లో ఏర్పడిన నీటి కొరతను తీర్చాలని గత రెండు, మూడు నెలలుగా ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులు సాగునీరు లేక, ప్రజలు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారన్నారు. అందువల్ల తాను కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పటాన్చెరు వరకు సరఫరా అవుతున్న గోదావరి జలాలను సంగారెడ్డి వరకు తరలిస్తామని ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం, అధికారులు స్పష్ట ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా ప్రకటన వెలువడిన వెంటనే పనులు కూడా ప్రారంభం కావాలన్నారు. లేకపోతే ఆగస్టు 10వ తేదీన స్థానిక అంబేడ్కర్ గ్రౌండ్లో లక్షమంది ప్రజలతో మొదటగా బహిరంగ సభ నిర్వహించి అనంతరం ధర్నాకు దిగుతున్నానని వెల్లడించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. తనకు రాజకీయాల కంటే ప్రజల బాగోగులే ముఖ్యమని తెలిపారు. సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఇతర నియోజకవర్గాలకు తరలించి సంగారెడ్డి ప్రజల నీటి కష్టాలకు టీఆర్ఎస్ నేతలే బాధ్యులన్నారు. సంగారెడ్డి సమీపంలోని మహబూబ్‌సాగర్ చెరువును కాళేళ్వరం నీటితో నింపుతానని గతంలో నీటి పారుదల శాఖమంత్రిగా ఉన్న హరీష్‌రావు స్వయంగా ప్రకటించారనే విషయాన్ని గుర్తుచేశారు. 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి తరలిస్తామన్న టీఆర్ఎస్ నేతలు గోదావరి జలాలు తేవడం సాధ్యమవుతుందనే భావిస్తున్నానని చెప్పారు. కర్ణాటకలో వరదలు వస్తేనే సింగూరు, మంజీరా నిండే దౌర్భాగ్య పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా... ఈ నెల 30లోగా నీటి తరలింపుపై ప్రకటన చేసి పనులు ప్రారంభించండి...లేదా వచ్చే నెల 10న లక్ష మందితో ధర్నా చేస్తానని తెలిపారు. -
చినుకమ్మా! ఎటుబోతివే..!!
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు పక్షంరోజులుగా మొహం చాటేశాయి. కరువు ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయి. రైతులు అష్ట కష్టాలు పడి కన్న బిడ్డల్లా పెంచుకున్న మామిడి, బొప్పాయి, అరటి, బత్తాయి లాంటి పండ్ల తోటలు నీరందక ఎండిపోతున్నాయి. జూన్ నెల వచ్చి 20 రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడలేదు. జోరుగా వ్యవసాయ పనులు సాగాల్సిన కాలంలో పంట భూములు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలమట్టం దారుణంగా పాతాళానికి పడిపోయిది. ఉన్న బోర్లు ఎండిపోతుండగా... కొత్తగా బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేల ఎకరాల్లో పండ్ల తోటలు నిలువునా మాడిపోతున్నాయి. మిరప, టమోట, వంగ, బెండ తదితర కూరగాయల తోటలు కూడా ఎండిపోయాయి. మార్కెట్లో కిలో టమోటా రూ.45 చేరడానికి ఇది కారణమని వ్యాపారులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో కంది పోకుండా పండ్ల తోటల్లో కాయలను ఎండ నుంచి కాపాడుకోవడం కోసం పాత చీరలను దానిమ్మ చెట్లకు కప్పుతున్నారు. కొందరు రైతులు ఇలా టమోటా, దానిమ్మ పంటలను ఎండ నుంచి కాపాడుకునేందుకు మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలను కొనుగోలు చేశారు. అయిదేళ్లు కరువును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు వేసుకుని తిండి గింజలతోపాటు నాలుగు రూపాయలు సంపాదించుకుందామని ఆశించిన రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తే నెలాఖరులోపు మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం నైరుతీ రుతు పవనాలు సకాలంలో రానందున ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం తప్పకపోవచ్చని వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల నిపుణులు అంటున్నారు. సాధారణంగా జూన్ అయిదో తేదీలోగా నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. రుతు పవనాల రాకకు ముందస్తు సూచికగా జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జూన్ 20వ తేదీ వచ్చినా రుతు పవనాల జాడలేదు. ముందస్తు వర్షాలూ లేవు. వీటన్నింటికీ మించి ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటవల్ల భూమి సెగలు కక్కుతోంది. తాగునీటికీ కటకట సాగు నీరే కాదు తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ కిందకు పడిపోతోంది. అయిదేళ్లుగా వరుసగా వర్షాభావం ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 4800 పైగా గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కొంత వరకూ ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వేలాది గ్రామాల వారికి సమస్య తప్పడంలేదు. మైళ్ల దూరం నుంచి చాలా గ్రామాల మహిళలు బిందెలతో నీరు మోసుకెళుతున్న దృశ్యాలు రాష్ట్రంలో తాగునీటి సమస్యకు అద్దం పడుతున్నాయి. పశువులు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక మనసు చంపుకుని అన్నదాతలు వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. ఇప్పటికే 67 శాతం లోటు వర్షపాతం జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు 67 శాతానికి చేరింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన వర్షం (సాధారణం) కంటే నెల్లూరు జిల్లాలో 94 శాతం, కృష్ణా 91, శ్రీకాకుళం 81.70, ప్రకాశం 78.30, పశ్చిమ గోదావరి 78.10 శాతం, విజయనగరం 76.40, విశాఖపట్నం 64.80, వైఎస్సార్ 63.20, గుంటూరు 59.80, కర్నూలు జిల్లాలో 58.60 శాతం వర్షపాతం లోటు నమోదైంది. -
‘పానీ’ పాట్లు
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రతరమైంది. మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో సమస్య మరింతగా జఠిలమైంది. దీంతో స్థానికులు వీధుల్లోకి వస్తున్న ట్యాంకర్లను నిలిపివేస్తూ.. తరచూ మన్సిపల్ కార్యాలయానికి తరలివస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. రామాయంపేట గత ఏడాది మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. పట్టణ జనాభా 17,850 వరకు ఉంటుంది. మున్సిపల్ పరిధిలో రామాయంపేటతోపాటు గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాలను చేర్చారు. దీని పరిధిలో 60 బోర్లు, మోటార్లద్వారా నిత్యం నీటి సరఫరా జరుగుతోంది. మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణం పూర్తవడంతో అన్ని ఇళ్లకు తాగునీరు సరఫరా జరిగేది. దీంతో వేసవిలో పెద్దగా నీటి ఎద్దడి తలెత్తలేదు. నాలుగురోజులుగా భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఒక్కసారిగా పట్టణంలో సమస్య నెలకొంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా అవి అవసరాలకు సరిపోవడంలేదు. ఇంటికి రెండుమూడు బిందెలకన్నా ఎక్కువ రావడం లేదనే కోపంతో వార్డుల్లో ట్యాంకర్లను అడ్డుకుంటున్నారు. మంగళవారం ఏకంగా పట్టణంలోని నాలుగుచోట్ల స్థానికులు ఆందోళనలకు దిగారు. దుర్గమ్మ గల్లీ, సుభాష్‌నగర్‌లో రోడ్డుకడ్డంగా ఖాళీ డ్రమ్ములను ఉంచి ఆందోళనకు దిగగా, ముదిరాజ్‌గల్లీలో నీటి ట్యాంకర్‌ను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.బీసీ కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయాలనికి తరలివచ్చి ధర్నాకు దిగారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అస్తవ్యస్తం.. పట్టణంలో ప్రతిరోజు పది ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. చోటామోటా నాయకులు, గుర్తింపు ఉన్నవారికి ముందుగా డ్రమ్ముల్లో నీరు నింపుతున్నారని, చివరన ఉన్నవారికి నీరు దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ గల్లీలకు ఉదయం, సాయంత్రం సరఫరా జరిగితే పరిస్థితి కొంతమేర సద్దుమణిగేదని, అలా జరగడంలేదన్న ఆరోపణలున్నాయి. 60 మోటార్లకు ఆరుకూడా నీళ్లు పోయడం లేదు.. పట్టణంలో 60 బోర్లకు సంబంధించి మోటార్ల ద్వారా నీటి సరఫరా జరుగగా, ఇటీవల కాలంలో చాలావరకు బోర్లు ఎండిపోయాయి. ప్రస్తుతం ఆరు బోర్లు కూడా పనిచేయడం లేదు. సింగిల్‌ఫేజు మోటార్ల ద్వారా నాలుగైదు చోట్ల నీటి సరఫరా జరుగుతుండగా, అవి ఎంతమాత్రం సరిపోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 చేతి పంపుల్లో నీరులేక వట్టిపోయాయి. బీసీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న బోరులో కొద్దిగా నీరు వస్తుండగా, చాలామంది దూర ప్రాంతం నుంచి వచ్చి బారులు తీరి తీసుకెళ్తున్నారు. సమస్యను పరిష్కరించాలి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సరిగా చేయడం లేదు. వారికి తెలిసినోళ్లకు ఎక్కువ నీళ్లు పోస్తున్నారు. మాకు సరిగా పోస్తలేరు. ట్యాంకర్ల వెంట సార్లు ఉంటేనే కరెక్టుగా సరఫరా జరుగుతోంది. వెంటనే సమస్యను పరిష్కరించాలి.– దేవుని మల్లవ్వ, దుర్గమ్మ బస్తీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం ఈసారి వర్షాలు ఆలస్యం కావడం, బోర్లలో నీరు అడుగంటడంతో సమస్య తలెత్తింది. భగీరథ నీటి సరఫరా ఆగిపోవడం మరింత సమస్యగా తయారైంది. పట్టణంలో నీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన తీర్చడానికి కృషి చేస్తున్నాం. అవసరమైతే ట్యాంకర్ల సంఖ్యను పెంచడంతోపాటు ఇతర మార్గాలను అన్వేషిస్తాం. – రమేశ్, మున్సిపల్ కమిషనర్ ఖాళీ డ్రమ్ములతో నిరసన రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపల్ పరిధిలో నీటి ఎద్దడిపై మంగళవారం స్థానికులు ఖాళీ డ్రమ్ములను రోడ్డుపై ఉంచి ఆందోళన నిర్వహించారు. అధికారులు సరిగా పట్టించుకోవడంలేదంటూ శ్రీరామా మెడికల్ దుకాణం వద్ద, సుభాష్‌నగర్‌లో కాలనీవాసులు నిరసన తెలిపారు. ముదిరాజ్‌గల్లీలో నీటి ట్యాంకర్‌ను అడ్డగించారు. బీసీ కాలనీవాసులు మున్సిపల్ మేనేజర్ శ్రీహరిరాజుకు తమ సమస్య మొరపెట్టుకున్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. -
నీళ్లు రాని కుళాయిలు.. నోళ్ళు తెరిచిన బోర్లు
పొద్దుపొద్దున్నే.. నిద్ర లేవంగానే..కుళాయిలో నీళ్లు రావని తెలిసిందనుకోండి.ఎలా ఉంటుంది? ఎక్కడలేని చికాకు తన్నుకొచ్చేస్తుంది కదూ! మరి.. ఒక రోజుకే అంత ఇబ్బంది పడిపోతే.. వారం పాటు నీళ్లు లేవంటే? నెల గడిచినా చుక్క నీరు దక్కకపోతే? అబ్బో.. ఆ పరిస్థితిని అసలు ఊహించుకోలేం! ఇంకో ఏడాది గడిస్తే.. ఇదే వాస్తవం కానుందని అంటోంది నీతిఆయోగ్ నివేదిక ఒకటి! నీటికోసం ట్యాంకర్ల చుట్టూ వందల వేల బిందెలు.. కుళాయిల వద్ద కొండవీటి చాంతాడంత క్యూ.. నగరాల్లోని బస్తీల్లో, కొన్ని గ్రామాల్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యం. జనాభా పెరిగిపోతోంది.. అవసరాలూ ఎక్కువవుతున్నాయి. అందుకే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని కొంతమంది చెప్పవచ్చుగానీ.. వాస్తవం వేరే ఉంది. భూగర్భంలో దాగున్న జలసిరులు వంద లీటర్లనుకుంటే. మనం వాడుకుంటున్నది 150 లీటర్లు! అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో బోరుబావుల లోతులు ఏటికేటికీ పెరిగిపోతూ వందల అడుగులకు చేరుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లోనైతే ఈ సంఖ్య వెయ్యి కంటే ఎక్కువైపోయింది. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా.. గత నాలుగేళ్లుగా కురిసిన వర్షాలు అరకొరగానే ఉండటంతో ప్రాజెక్టులూ నోళ్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ గతేడాది సిద్ధం చేసిన నివేదిక ఒకటి అందరినీ ఆందోళనకు గురిచేసే స్థాయిలో ఉందంటే అతిశయోక్తి ఏమీ కాదు. దీని ప్రకారం.. వచ్చే ఏడాదికల్లా దేశంలోని ప్రధాన నగరాల్లో నీటి సమస్య అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకోనుంది. గత ఏడాది దక్షిణాఫ్రికా నగరం కేప్‌టౌన్‌లో మాదిరిగానే నీటికుళాయిల నుంచి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదన్నది ఈ నివేదిక సారాంశం. ఇంకేం ఉన్నాయి? హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలతోపాటు మొత్తం 21 నగరాల్లో తాగునీటి ఎద్దడి గణనీయమైన స్థాయిలో పెరగనుంది. ఫలితంగా ఆయా నగరాల్లోని పేద, బలహీన వర్గాల వారికి సమస్యలు ఎక్కువ కానున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాననీటి సంరక్షణ, సుదూర ప్రాంతాల్లోని నదుల నుంచి గొట్టాల ద్వారా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే ఇవేవీ సమస్యను పరిష్కరించవు. ప్రజలు దశాబ్దాలుగా అటు వ్యవసాయానికి, ఇటు దైనందిన అవసరాలకూ భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉండటం దీనికి కారణం. దక్షిణాదిలోనే పది కోట్ల మందికి గుక్కెడు నీరు కూడా దక్కని దారుణ నీటి కటకట ఏర్పడబోతోందని హెచ్చరిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటితే నగరవాసులు ప్రైవేట్ కంపెనీలు అక్రమంగా తవ్వితీసే నీటిపై ఆధారపడటం మొదలుపెడతారు. పరిస్థితి మరింత దిగజారిపోయేందుకు ఇదో కారణం కానుంది. దేశంలోని 130 కోట్ల ప్రజల్లో నీటి లభ్యత లేనివారి సంఖ్య 16 కోట్ల పైమాటేనని 2018 నాటి వాటర్ ఎయిడ్ రిపోర్ట్ చెబుతోంది. ఇంతటి దారుణమైన పరిస్థితి ఇంకెక్కడా లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. డిమాండ్ రెట్టింపు 2030 కల్లా దేశంలో అందుబాటులో ఉన్న నీటికి రెండు రెట్లు ఎక్కువ డిమాండ్ ఏర్పడబోతోందని.. ఎద్దడిని అధిగమించేందుకు ప్రజలు పెట్టే ఖర్చు కారణంగా స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం కోత పడనుందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ఒకవేళ కొంతమందికి నీళ్లు అందుబాటులో ఉంటే అది కలుషితాలతో నిండినవే అయి ఉంటాయని.. ఆ నీరు తాగడం ద్వారా అనారోగ్యం పాలై ఏటా 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఉందని తెలిపింది. స్వచ్ఛమైన నీరు లభించే విషయంలో 122 దేశాల జాబితాలో భారత్ ర్యాంకు 120 కావడం ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం. ఆహార భద్రతకూ చేటు.. నీటి లభ్యత విషయంలో ఇప్పటికిప్పుడు తగిన చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోకుంటే దాని ప్రభావం దేశ ఆహార భద్రతపై కూడా పడనుంది. రాష్ట్రాలు అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడుకోవడంతోపాటు అత్యంత సమర్థంగా నీటిని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న నీరు.. సమర్థ వాడకంపై ఇటీవలే కేంద్రం కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్‌ను సిద్ధం చేసింది. దీని ప్రకారం సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడోస్థానంలో ఉండగా.. తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అయితే మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాల కారణంగా తెలంగాణ తన పరిస్థితిని వేగంగా మెరుగుపరుచుకుంటోంది. భూగర్భజలాలతో పాటు సాగునీటి వసతులు, వాడకం వంటి 28 అంశాల ఆధారంగా సిద్ధం చేసిన ఈ సూచీలో మొత్తం 24 రాష్ట్రాలకు మార్కులేయగా.. 14 రాష్ట్రాలు 50 కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే దాదాపు 60 కోట్ల జనాభా ఉండటం గమనిస్తే.. భవిష్యత్తులో ఏర్పడబోయే నీటి ప్రభావం ఆహార భద్రత, లభ్యతలపై తీవ్ర ప్రభావం చూపనుంది. రుతుపవనాల ఆలస్యంతో పరిస్థితి జటిలం.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో నైరుతి రుతుపవనాల ద్వారానే 80 శాతం ఉపరితల నీరు మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే కొన్నేళ్లుగా సరైన వర్షాల్లేక దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీరు సగానికిపైగా తగ్గిపోయింది. ఈ ఏడాది కూడా నైరుతి దీర్ఘకాలిక సగటులో 94 నుంచి 96 శాతం వర్షాన్ని మాత్రమే తేనుందన్న సమాచారం ఆందోళన కలిగించే అంశం. 1970తో పోలిస్తే 2015 నాటికి ఖరీఫ్ వర్షపాతం 1,050 మిల్లీమీటర్ల నుంచి 1,000 మిల్లీమీటర్లకు తగ్గిపోగా, రబీ వర్షపాతం కూడా 150 నుంచి 100 మిల్లీమీటర్లకు చేరుకుంది. రుతుపవనాల సీజన్లో వానలు కురిసే రోజుల మధ్య ఎడం కూడా 40 నుంచి 45 శాతం వరకూ పెరిగిందని వాతావరణ నిపుణుల అంచనా. ఏం చేయాలి? నగరాల్లో పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు 30 నుంచి 50 శాతం వృథా అవుతోందన్న అంచనాల నేపథ్యంలో వాటి స్థానంలో కొత్తవాటిని వేసుకోవడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వాడేసిన నీటిని శుద్ధి చేసుకుని దైనందిన అవసరాలకు వాడుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు రీ సైకిల్ చేసిన నీటిని అందించడం ద్వారా విలువైన భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. నగరాల్లో వాననీటి సంరక్షణను విస్తృతంగా చేపట్టడం, ఎండిన బోర్లను వాననీటిని మళ్లీ భూమిలోకి పంపే సాధనాలుగా వాడుకోవచ్చు. దేశంలో సాగునీటి వసతి ఉన్న భూ విస్తీర్ణం 14 కోట్ల హెక్టార్లు కాగా.. ఇందులో కనీసం సగం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకు రావాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశం మొత్తమ్మీద బిందు, తుంపర సేద్యాల కింద సాగవుతున్న విస్తీర్ణం 77 లక్షల హెక్టార్లు మాత్రమే కావడం గమనార్హం మిగిలిన భూమిని కూడా బిందు, తుంపర సేద్యాల కిందకు తీసుకొస్తే.. సగటున 50 శాతం సాగునీటిని ఆదా చేయొచ్చు. -
మున్నేరు.. ఏదీ నీరు?
మహబూబాబాద్: మహబూబాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని శివారు కాలనీల ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. ప్రధానంగా వినాయక తండా, పత్తిపాక కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఐదు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. కనీసం మున్నేరువాగు నీరు కూడా సరఫరా కావడం లేదు. మిషన్ భగీరథకు సంబంధించిన నీటి సరఫరా జరగడానికి ఇన్ట్రా విలేజీ పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో సరఫరా కావడానికి చాలా సమయం పడే పరిస్థితి కనిపిస్తోంది. అడుగంటిన చేతి పంపులు జిల్లా కేంద్రం శివారు వినాయక తండాలో సుమారు 50 గృహాలు ఉండగా 250 మంది జనాభా, 120 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఆ తండా వాసుల నీటి అవసరాలు తీర్చేందుకు రెండు చేతి పంపులు వేయగా.. అందులో పూర్తిస్థాయిలో నీరు లేక అవి పెద్దగా ఉపయోగ పడడం లేదు. ఇక పత్తిపాక కాలనీలో 250 గృహాలు ఉండగా 800 ఓటర్లు, 1100 మంది జనాభా నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో మూడు చేతి పంపులు ఉండగా ఒకటి పని చేయడం లేదు. మరో చేతి పంపులో అరకొర నీరే ఉంది. కేవలం ఒకే ఒక చేతి పంపు ద్వారా మాత్రమే నీరు వస్తోంది. ఒక్క చేతి పంపే ఆధారం వినాయక తండా, పత్తిపాక కలిపి ఒకే చేతి పంపు ఆధారంగా మారింది. పత్తిపాకలో ఉన్న ఈ చేతి పంపులో మాత్రమే నీరు సమృద్ధిగా ఉంది. దీంతో అక్కడికే వినాయక తండా, పత్తిపాక కాలనీవాసులు వచ్చి బిందెలతో నీరు తీసుకెళ్తున్నారు. కొంత మంది తోపుడు బండ్లతో, మరికొందరు సైకిళ్లు, బైక్‌లపై నీరు తీసుకెళ్తున్నారు. ఆ నీరే తాగడానికి, వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దశాబ్దాలు గడిచినా... వినాయక తండా, పత్తిపాక కాలనీలు ఏర్పాటై ఐదు దశాబ్దాలు గడిచినా ప్రతీ వేసవిలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. మానుకోట శివారులోని మున్నేరువాగు నీటిని కూడా ఈ ప్రాంతాలకు ఇంత వరకు అందించలేదు. అందుకోసం కనీసం పైపులైను కూడా ఏర్పాటు చేయలేదు. ఇక మిషన్ భగీరథకు సంబంధించిన ఇన్ట్రా విలేజ్ పనులు ఆ ప్రాంతాల్లో ప్రారంభం కాలేదు. ఇంకా ఆరు నెలలైనా పైపులైను పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నల్లాల బావి నీటి సరఫరా.. పత్తిపాక శివారులోని నల్లాల బావి నుంచి మునిసిపల్ సిబ్బంది నీరు సరఫరా చేస్తున్నారు. ఆ బావిలో కూడా నీరు అడుగంటడంతో మూడు రోజులకోసారి ఇంటికి 10 బిందెల చొప్పున మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. ఆ బావిలోనూ ఫ్లోరైడ్ ఉండటంతో వాటిని తాగడానికి వీలు కావడం లేదు. గతంలోనూ ఆ నీటిని తాగిన కొందరు ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికైనా కాలనీలకు శాశ్వత పైపులైను నిర్మాణం చేసి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. నీటి కోసం ఇబ్బంది పడుతున్నాం గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. పత్తిపాకలోని చేతి పంపే అందరికీ దిక్కయింది. అధికారులకు పలుమార్లు తెలియజేసినా ఫలితం లేదు. వేసవి కాలంలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. – తోళ్ల అరుణ, పత్తిపాక కాలనీ వాసి ట్యాంకుల ద్వారా అయినా సరఫరా లేదు నీటి కోసం ఇబ్బంది పడుతున్నా కనీసం మునిసిపాలిటీ అధి కారులు ట్యాంకుల ద్వారా అయినా నీటి సరఫరా చేయడం లేదు. మూడు చేతి పంపుల్లో అరకొర నీరు మాత్రమే ఉంది. దీంతో వినాయక తండా, పత్తిపాక కాలనీవాసులమంతా పత్తిపాక చేతి పంపు వద్దకే వస్తున్నాం. – జి.తార, పత్తిపాక కాలనీవాసి మూడు రోజులకోసారి నీటి సరఫరా నల్లాల బావి నుంచి మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. కేవలం 10 బిందెల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. బావిలో నీరు అడుగంటింది. ఆ బావిలోనూ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది. ఆ నీటిని తాగడానికి ఉపయోగించడం లేదు.– సోమారపు నాగమణి -
క‘న్నీళ్లు’
పల్లె గొంతెండుతోంది. నీళ్లో రామచంద్ర అంటూ జనం అలమటిస్తున్నారు. జిల్లాలో కరువు పర్యాయ పదంగా మారిన రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతంలో పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో బహుదా, మాండవ్య, పాపాఘ్ని పరివాహకంలోని కొన్ని గ్రామాల్లోనైనా కాస్తో, కూస్తో తాగునీరు అందుబాటులో ఉండేది. సంవత్సర కాలంగా వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. వేయి అడుగులు తవ్వితేగానీ నీటి జాడ కనిపించడం లేదు. ప్రభుత్వ రక్షిత తాగునీటి పథకాలు అన్నీ ఎండిపోయాయి.వ్యవసాయ బోరు బావులు బావురుమంటున్నాయి. ఇంతటి దుర్బర పరిస్థితులు తామెన్నడూ చూడలేదని శతాధిక వృద్ధులు పేర్కొంటున్నారు. ఇప్పటిదాకా పనులు లేక వలసలు వెళ్లే వాళ్లం. ఇప్పుడు తాగేందుకు గుక్కెడు నీరు లేక ఊర్లు ఖాళీ చేయాల్సి వస్తుందేమోనని వారు చెబుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. కడప సెవెన్‌రోడ్స్ : సెప్టెంబరు అంటే మంచి వర్షాలు కురిసే మాసం. అలాంటిది గత ఏడాది సెప్టెంబరు నుంచి రాయచోటి నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు తాగునీరు రవాణా అవుతోంది. దీనిని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఏ పల్లెకు వెళ్లినా ప్రతి ఇంటిముందు ప్లాస్టిక్ డమ్ములు కనిపిస్తాయి. తాగునీరు రవాణా చేసే ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూసే దృశ్యాలు కనిపిస్తాయి. ట్యాంకర్ వచ్చిందంటే మహిళలు, పిల్లలు బిందెలతో ఎగబడుతున్నారు.ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపు ప్రతి రైతు, వ్యవసాయ కూలీ పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. పంటలు గ్యారంటీ లేకపోయినా పాల విక్రయం ద్వారా కాస్తో కూస్తో ఆదాయం వస్తోంది. అందుకే పశువుల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ డ్రమ్ములకు నీరు పట్టుకుంటున్నారు. బోర్లలో జలం అడుగంటుతుండటం వల్ల ట్రిప్పులు తగ్గిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రాజకీయ నాయకులు రోజూ ట్యాంకర్లు పంపించారని, పోలింగ్ ముగిశాక పట్టించుకోవడం లేదని చిన్నమండెం మండలం చాకిబండ, సంబేపల్లె మండలం శెట్టిపల్లె ప్రజలు ‘సాక్షి’కి తెలిపారు. తమ గ్రామంలో నాలుగైదు కుటుంబాలు కలిసి డబ్బులు వేసుకుని ట్యాంకర్లు తెప్పించుకోవాలనుకుంటున్నామని సంబేపల్లె మండలం పాపిరెడ్డిగారిపల్లె ప్రజలు తెలిపారు. ఆరు నెలలుగా తాగునీటి ట్యాంకరు వస్తోందని రాయచోటి మండల కంచరపల్లె కాలనీకి చెందిన కాల్వపల్లె వేమయ్య తెలిపారు. అయితే కాలనీ అవసరాలకు నీరు సరిపోవడం లేదన్నారు. తమ గ్రామంలోని ప్రభుత్వ రక్షిత నీటి పథకం ఎండిపోయిందని గాలివీడు మండలం మలసానివాండ్లపల్లెకు చెందిన మల్లమ్మ చెప్పారు. వెలిగల్లు, కుషావతి ప్రాజెక్టులు ఉన్నా ఇక్కడి గ్రామాల్లో భూగర్భ జలం లేదని తెలిపారు. రోజుకు రెండు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా మనుషులు, పశువులకు సరిపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఆరు మండలాల్లో 261 గ్రామాలకు రోజుకు 830 ట్రిప్పులు నీటి రవాణా చేస్తున్నట్లు శుక్రవారం నాటి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నివేదిక వెల్లడిస్తోంది. అలాగే 58 గ్రామాల్లో వ్యవసాయ బోరు బావులు అద్దెకు తీసుకుని నీరందిస్తున్నారు. మండలాల వారీగా..... చిన్నమండెం మండలంలో 44 గ్రామాలకు రోజుకు 123 ట్రిప్పుల నీటి రవాణా జరుగుతోంది. గాలివీడు మండలంలో 74 గ్రామాలకు 247 ట్రిప్పులు, లక్కిరెడ్డిపల్లె మండలంలో 56 గ్రామాలకు 172 ట్రిప్పులు, రామాపురం మండలంలోని 32 గ్రామాలకు 112 ట్రిప్పులు, సంబేపల్లె మండలంలోని ఐదు గ్రామాలకు 25 ట్రిప్పులు, సుండుపల్లె మండలంలోని 29 గ్రామాలకు 78 ట్రిప్పులు, వీరబల్లి మండలంలోని 13 గ్రామాలకు 29 ›ట్రిప్పులు నీరు రవాణా అవుతోంది. ఇవి కాకుండా వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటి పట్టణంతోపాటు గాలివీడు మండలంలోని 12 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు. ఆగిపోయిన బిల్లులు తాగునీరు రవాణా చేస్తున్న ట్యాంకర్ల యజమానులకు గత సంవత్సరం సెప్టెంబరు నుంచి బిల్లులు చెల్లించలేదు. డీజిల్, డ్రైవర్ జీతం, ఇతర నిర్వహణ వ్యయాన్ని ఇక తాము భరించలేమని పలువురు ట్యాంకర్ల యజమానులు చెబుతున్నారు. రాయచోటి మండలం దిగువ కంచరపల్లెకు చెందిన మంచింటి రాజారెడ్డి అనే ట్యాంకర్ యజమాని మాట్లాడుతూ తాను దిగువ కంచరపల్లె, కాలనీకి తాగునీరు రవాణా చేస్తున్నానని, సెప్టెంబరు నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు. గాలివీడు మండలం కొత్త బండివాండ్లపల్లెకు చెందిన కె.లోకేష్‌రెడ్డి అనే ట్యాంకర్ యజమాని మాట్లాడుతూ తాను రోజుకు ఎనిమిది ట్రిప్పుల నీరు సరఫరా చేస్తున్నానని, సెప్టెంబరు నుంచి బిల్లులు నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్ఎఫ్ కింద కోటి మూడు లక్షల రూపాయలు బిల్లులను ఫిబ్రవరి 17వ తేదీ ట్రెజరీకి పంపి టోకెన్ నంబర్లు కూడా తీసుకున్నారు. అయితే డబ్బులు మాత్రం రాలేదు. ఈ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీరు తమ శాఖ ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే నాన్ సీఆర్ఎఫ్ కింద రెండు కోట్ల 20 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలకు దోచుపెట్టే నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించిన బిల్లులకు ఆగమేఘాల మీద నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం తాగునీటి విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం విచారకరమని పలువురు విమర్శిస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నాం మా గ్రామంలో సుమారు 300 ఇళ్లున్నాయి. నాలుగు బోర్లు ఉండగా, అందులో రెండు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన వాటిలో కొద్దిసేపు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. వేయి అడుగుల లోతులోగానీ నీరు లభించడం లేదు. మా గ్రామానికి నాలుగు ట్యాంకర్ల నీరు సరఫరా చేస్తున్నా అవసరాలకు సరిపోవడం లేదు. – దేవరింటి సిద్దయ్య, చిన్నర్సుపల్లె, చిన్నమండెం మండలం వారానికోసారి ట్యాంకర్ వస్తోంది ఎన్నికలకు ముందు ప్రతిరోజు గ్రామానికి నీళ్ల ట్యాంకర్లు వచ్చేవి. ఇప్పుడు వారం, పది రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే బోర్లలో జలం లేదని ట్యాంకర్ల యజమానులు చెబుతున్నారు. దీంతో తాము వ్యవసాయ బోరు బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నాము. అక్కడ కూడా కొద్దిసేపు వచ్చాక ఆగిపోతున్నాయి. – కుర్నూతల అంజనమ్మ, చాకిబండ గ్రామం, చిన్నమండెం మండలం సమస్య పరిష్కరించాలి మా గ్రామంలో బోర్లన్నీ ఎండిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు ట్యాంకర్లు రోజుకు ఆరు ట్రిప్పులు తోలుతున్నాయి. మా గ్రామ పరిసరాల్లో నీరు లేకపోవడంతో ఆరు కిలోమీటర్ల దూరంలోని రామాపురం నుంచి నీరు వస్తోంది.సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – ఎన్.జగన్మోహన్రెడ్డి, అంబాబత్తినవారిపల్లె, చిన్నమండెం మండలం -
హే‘కృష్ణా’.. పానీ పరేషానీ
సాక్షి, హైదరాబాద్: మండువేసవిలో నాగార్జున సాగర్(కృష్ణా) నీటిమట్టాలు శరవేగంగా పడిపోతుండటంతో అత్యవసర పంపింగ్ చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుతం సాగర్‌లో 513 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. మరో నెలరోజుల్లో నీటినిల్వలు 510 అడుగుల దిగువకు చేరుకున్న పక్షంలో అత్యవసర పంపింగ్ చేయక తప్పదని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో జూన్ నెలాఖరువరకు సాగర్‌లో 510 అడుగుల మేర నీటినిల్వలను నిర్వహిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పినప్పటికీ..ప్రస్తుతం మండుటెండలకు నీటిమట్టాలు శరవేగంగా పడిపోతుండటంతో అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు చేసుకోవాలని జలమండలికి తాజాగా లేఖ రాయడంతో అధికారులు పంపింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ.2.8 కోట్ల అంచనా వ్యయంతో పుట్టంగండి (సాగర్‌బ్యాక్‌వాటర్)వద్ద పది భారీ మోటార్లు, షెడ్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసే పనులు మొదలు పెట్టేందుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. ఈ మేరకు త్వరలో పంపింగ్ ఏర్పాట్లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం నీటి సరఫరా పరిస్థితి ఇదీ ప్రస్తుతం కృష్ణా మూడుదశల నుంచి 250 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటిదశ ద్వారా 172 ఎంజీడీలతోపాటు గండిపేట్(ఉస్మాన్‌సాగర్) నుంచి 25 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 18 ఎంజీడీలు మొత్తంగా 465 ఎంజీడీల నీటిని నిత్యం జలమండలి నగర తాగునీటి అవసరాలకు తరలిస్తోంది. అయితే సింగూరు సరఫరా వ్యవస్థ నుంచి నీటిసరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో గోదావరి రింగ్‌మెయిన్–3 పైపులైన్ ద్వారా సింగూరు సరఫరా వ్యవస్థ నెలకొన్న పటాన్చెరు, లింగంపల్లి తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను అందిస్తున్నారు. రివర్స్పంపింగ్కావడంతో ఆయా ప్రాంతాలకు తాగునీటి సమస్య తప్పడంలేదు. కాగా ప్రస్తుతం జంటజలాశయాల నీటిని వినియోగిస్తున్నప్పటికీ మరింత నీటిని తోడి పాతనగరంతోపాటు నారాయణగూడ,రెడ్‌హిల్స్ తదితర డివిజన్లకు నీటిసరఫరా పెంచే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ వేసవిలో గోదావరి జలాలకు ఎలాంటి ఇబ్బందుల్లేవని..ఎల్లంపల్లి జలాశయంలో గరిష్ట నీటిమట్టం 485 అడుగులకు ప్రస్తుతం 468 అడుగుల మేర నీటినిల్వలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
గొంతెండుతోంది..!
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో ఒక్కసారిగా ఉషోగ్రతలు పెరిగిపోవడంతో గ్రామాలు, పట్టణాలు దాహంతో కేకలు వేస్తున్నాయి. దప్పికతో ప్రజల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటడం, రక్షిత మంచినీటి పథకాలు విఫలమవడంతో తాగునీరు లభించక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాలు, తండాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. చెలమల్లో, కుంటల్లో అపరిశుభ్ర నీరే దిక్కవడంతో ప్రజలు వ్యాధులబారినపడుతున్నారు. ఇక పట్టణాలు, నగరాల్లో తాగునీటిని సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేయడంతో దాహం తీరే దారి లేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వేసవి మరింత ముదరనున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మన్యంలో పరిస్థితి తీవ్రం శ్రీకాకుళం జిల్లాలో వేసవి తీవ్రతతో మంచినీటికి కటకటగా ఉంది. ఏజెన్సీలో గెడ్డలు ఎండిపోయి గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సీతంపేట అటవీ ప్రాంతంలో పలు గెడ్డలు అడుగంటాయి. ఎత్తయిన కొండలపై నివసిస్తున్న కొన్ని గ్రామాల గిరిజనులు తాగునీటి కోసం గెడ్డలపై ఆధారపడతారు. వీరు నీరు కరువై అల్లాడుతున్నారు. విశాఖ మన్యంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రక్షిత మంచి నీటి పథకాలు అలంకారప్రాయంగా మిగలడంతో పలు గ్రామాల్లో తాగునీటి కోసం గిరిజనులు ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. పాడేరులో ఇటీవల నీరు కలుషితమై సుమారు 18 మంది డయేరియా బారినపడ్డారు. లంబసింగి, మేడూరు, అన్నవరంలో కూడా తాగునీటి పథకాలు సక్రమంగా పనిచేయడం లేదు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక బృందాలతో సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ అధికారులు చెబుతున్నా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ జున్నుల ప్రాంత గిరిజనులకు దశాబ్దాల తరబడి ఊటగెడ్డలే దిక్కు. డుంబ్రిగుడ మండలంలో దాహం కేకలతో గిరిజనులు అల్లాడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఎండలు ముదరకముందే తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పోతుమర్రు గ్రామ ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో 4000 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఏడు ఎకరాల విస్తీర్ణంలో తాగునీటి చెరువు ఉంది. ఈ చెరువుకు గుడ్లవల్లేరు లాకుల నుంచి క్వాంప్‌బెల్ ఛానల్ ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఇంకా నీటిని సరఫరా చేయలేదు. మరోవైపు తాగునీటి చెరువులో ఉప్పునీటి శాతం అధికంగా పెరిగిపోయింది. దీంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. రాయలసీమ క‘న్నీటి’ కష్టాలు దేశంలోనే కరువు జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో ఏటా కరువే. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా గ్రామాల్లో తాగునీటి సరఫరా మార్చి నాటికే బంద్ కాగా జనం సమీప ప్రాంతాల్లోని పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రభుత్వ స్కీమ్ బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో గుక్కెడునీటికి ప్రజలు గుటకలు వేయాల్సిన దుస్థితి. గ్రామాల్లో అరకొరగా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసినప్పటికి అవి చాలక, ప్రజలు నీరు పట్టుకునే సమయంలో ఘర్షణ కూడా పడుతున్నారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం క్రిష్టిపాడులో దాదాపు 1,600 ఇళ్లు ఉన్నాయి. పక్కనే కుందూ నది ఉంది. నది నుంచి నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి గ్రామస్తులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం నది ఎండిపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి సమస్య నెలకొంది. విధిలేని పరిస్థితుల్లో గ్రామస్తులు నదిలో చెలమలు తవ్వుకుని నీటిని పట్టుకుంటున్నారు. నీళ్ల కోసం పైపులను నోటిలో పెట్టుకొని పీల్చుతున్న మహిళలు గోదావరి చెంత.. తాగునీటికి చింత గోదావరి చెంతనే ఉన్న రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలాచోట్ల రోజుకు ఒక్క పూట మాత్రమే నీటిని అందిస్తున్నారు. మామూలు రోజుల్లో 1 నుంచి 44వ డివిజన్ వరకూ రోజుకు రెండుసార్లు, 45వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకూ రోజుకు ఒక్కసారి నీటిని సరఫరా చేస్తారు. కానీ, ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో రోజుకు ఒక్కసారి నీటిని అందించడమే కష్టంగా ఉంది. నగర శివారు ప్రాంతాలైన 44, 45, 46, 47, 48, 49, 50 డివిజన్లలో కొన్నిసార్లు రోజులో ఒకసారి కూడా మంచినీటి సరఫరా జరగడం లేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని రాజగోపాలపురంలో ట్యాంకర్ వద్ద గుమికూడి నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు పట్టణాల్లో దాహం కేకలు రాష్ట్రంలో వివిధ పట్టణాల్లోని ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రెండేళ్లుగా కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటిమట్టం పడిపోవడం, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాల్లో జాప్యం, పెరిగిన విలీన గ్రామాల కారణంగా నీటిఎద్దడి రోజురోజుకీ పెరుగుతోంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్‌లోనే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. 30 మున్సిపాల్టీల్లో రెండు రోజులకు ఒకసారి, 12 మున్సిపాల్టీల్లో నాలుగు రోజులకు ఒకసారి, 68 మున్సిపాల్టీల్లో రోజుకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో రాత్రి సమయాల్లో నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తాగునీటి సరఫరాకు కష్టాలెన్నో.. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 40 మున్సిపాల్టీల్లో అమృత్ పథకం పనులను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. వాస్తవానికి గత డిసెంబర్లోనే వీటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే పనులు ఆలస్యం కావడంతో అ పథకాలేవీ అందుబాటులోకి రాలేదు. విలీన గ్రామాలు కలిగిన విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి నగరాల్లో కొత్తగా రక్షిత మంచినీటి పథకాలు నిర్మించలేదు. ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలతోపాటు గుంటూరు జిల్లా పల్నాడులో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు కూడా పనిచేయడం లేదు. మున్సిపాల్టీల్లో 41,615 బోరుబావుల్లో 3 వేలు పూర్తిగా ఎండిపోయాయి. పాత పంపుసెట్లు, పంపిణీ పైపులైన్లు, వాల్వులు, మోటార్ల మరమ్మతులు, కొత్తవి కొనుగోలుకు ఈ ఏడాది ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. నీటి సరఫరాకు సంబంధించి సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెకానిక్, కాపలాదారులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునే అవకాశం కల్పించాలని అధికారులు పంపిన ప్రతిపాదనల పట్ల ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలోని దాదాపు 2,500 డివిజన్లలో రోజుకు ఒకసారి, 612 డివిజన్లలో రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. తిరుపతికి ఇబ్బందులు తప్పవా? చిత్తూరు జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులకొకసారి నీరు సరఫరా అవుతోంది. రిజర్వాయర్లలో మరో 25–30 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. ఈ లోపు వర్షాలు పడకపోతే సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. తిరుపతికి నీరు సరఫరా చేసే కల్యాణి డ్యామ్, కైలాసగిరి రిజర్వాయర్లలో నీరు దాదాపు అడుగంటింది. తిరుపతిలో నీటి సరఫరాపై అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అక్కడక్కడ నాలుగు, 7 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో గంట పాటు కూడా సరఫరా చేయడంలేదు. నీటి కొరతతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కడప కార్పొరేషన్లో మూడు రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో ఐదారు రోజులకు ఒకసారి సరఫరా జరుగుతోంది. మచిలీపట్నం మున్సిపాల్టీ, గుంటూరు కార్పొరేషన్లలోని శివారు ప్రాంతాలకు నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మున్సిపాల్టీ పరిధిలోని ప్రజలను నాలుగేళ్లగా నీటిఎద్దడి సమస్య వెంటాడుతోంది. పట్టణానికి నీటిని సరఫరా చేసే సింగరకొండ చెరువులో నీటిమట్టం పడిపోవడంతో నాలుగు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా జరుగుతోంది. మరో పదిరోజుల్లో చెరువుల్లోని నీటిమట్టం పూర్తిగా అడుగంటే పరిస్థితి నెలకొంది. గతేడాది వినుకొండ పట్టణ ప్రజలు ఒక్కో ట్యాంకరు నీటిని రూ.500 నుంచి రూ.600 వరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది అదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నగరాల్లో నీటికొరతతోప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ట్యాంకరు నీరు కావాలంటే రూ.450 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది. వివాహాలు, రిసెప్షన్లకు ట్యాంకర్ నీటిని రూ.1000 వరకు అమ్ముతున్నారు. దుకాణాన్ని మూయాల్సి వస్తోంది మాది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట. చిన్నపాటి దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కొద్దిరోజులుగా మున్సిపాలిటీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ట్యాంకర్ల వద్ద నీరు పట్టుకునేందుకు దుకాణాన్ని మూసివేసి పడిగాపులు కాసి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది. – ఎస్కే నిజాం, నాయుడుపేట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోర్ల నుంచి తెచ్చుకుంటున్నాం మాది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కల్లూరివారిపాలెం. ఊళ్లో నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. కుళాయిలు, చేతిపంపుల్లో సరిగా నీళ్లు రాకపోవడంతో గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. పక్క గ్రామాలకు వెళ్లి 20 లీటర్ల నీటిని రూ.10కి కొనుగోలు చేస్తున్నాం. – ఈశ్వరమ్మ, కల్లూరివారిపాలెం, ప్రకాశం జిల్లా మంచినీటికి ఇబ్బంది పడుతున్నాం రాజమహేంద్రవరంలో రోజుకు ఒక్క పూటే మంచినీటిని వదులుతున్నారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మిగిలిన అవసరాల కోసం దూరం వెళ్లి బిందెలతో నీటిని పట్టుకొని వస్తున్నాం. – గొప్పిశెట్టి విజయ, రాజమహేంద్రవరం ఈమె పేరు.. సోనీ. ఊరు.. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు తండా. కుళాయి నీరు అప్పుడప్పుడు మాత్రమే వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని వాపోతోంది. పంపుల్లో వచ్చే నీళ్లు చాలక పొలాలకు వెళ్లి డబ్బులు ఇచ్చి మంచినీరు తెచ్చుకుంటున్నామని చెబుతోంది. ట్యాంకు నుంచి వచ్చే నీళ్లు తాగితే కీళ్లనొప్పులొస్తున్నాయని, కిడ్నీ వ్యాధులతో తండాలో చాలామంది మంచాన పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆందోళన చెందుతోంది. ఈయన పేరు గౌడపేర ఏసోబు. ఊరు ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ముక్తేశ్వరం. తమ గ్రామానికి పది రోజులకొకసారి మాత్రమే మంచినీరు వస్తోందని వాపోతున్నాడు. ఉన్న ఒక్క చేతిపంపు కూడా భూగర్భ జలాలు అడుగంటి సక్రమంగా పనిచేయడం లేదని చెబుతున్నాడు. పశువులకు తాపడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నాడు. -
జన్మభూమి కమిటీల అవినీతిమయం
సాక్షి,పెళ్లకూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.దోచుకోవడమే పరమావధిగా అధికార పార్టీ పాలన సాగింది. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేశారు. ఆ పార్టీ నాయకులు ఇసుక అక్రమంగా తరలించి రూ.కోట్లు గడించారు. దీంతో స్వర్ణముఖి, కాళంగి నదులు రూపు కోల్పోయాయి. ఇళ్లు, పెన్షన్లు, రుణాలు మంజూరు చేసుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులంతా ఐదేళ్లపాటు జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా అర్హులకు ఒక్క పథకాన్ని కూడా అందించిన దాఖల్లాలేవు. దోపిడీయే ధ్యేయంగా.. నీరు – చెట్టు పథకం కింద నియోజకవర్గానికి సుమారు రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. పనులను టీడీపీ నాయకులు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా తూతూమంత్రంగా పనులు పూర్తి చేసి రూ.కోట్లు నిధులు బొక్కేశారు. కొన్నిచోట్ల పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారు. అదేవిధంగా రైతు రథాల కింద మంజూరైన ట్రాక్టర్లను అర్హులైన అన్నదాతలకు అందజేయకుండా అధికార పార్టీ నేతలే కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్ గృహాలు, పెన్షన్లు, మరుగుదొడ్లు మంజూరు చేయాలంటే జన్మభూమి కమిటీలు లబ్ధిదారుల వద్ద అధిక మొత్తంలో గుంజుకున్నట్లు విమర్శలున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు పంచాయతీ సర్పంచ్‌లకు నిధులు మంజూరు చేయకుండా రాజ్యాంగా విరుద్ధంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. వారు చేసిన అరచకాలతో ప్రజలు బాగా విసిగిపోయారు. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసింది. గడిచిన ఐదేళ్లలో ఒక్కపైసా మాఫీ చేయకపోగా వడ్డీ భారంతో అన్నదాతలు అనేక కష్టాలు పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ భారీగా అవినీతి చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని అనేక మండలాల్లో అధికార పార్టీ నాయకుల భూ కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఇన్చార్జిగా వ్యవహరించిన వారు అధికారులపై ఒత్తిళ్లపై తెచ్చి తమ నాయకులను పనులు చేయించుకున్నారు. మున్సిపాలిటీల్లో ఇలా.. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో ప్రజల గురించి అధికార పార్టీ నాయకులు స్పందించలేదు. పలుచోట్ల జరిగిన పనుల్లో అవినీతిని ఏరులై పారించారు. తెలుగుదేశం నాయకులు కాంట్రాక్టర్లుగా మారి రూ.లక్షలు స్వాహా చేశారు. ప్రధానంగా నాయుడుపేట మున్సిపాలిటీలో జరిగిన రోడ్డు, డ్రెయినేజీ పనుల్లో అవినీతి ఎక్కువగా చోటుచేసుకుంది. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇక్కడి ప్రజలు తాగునీటితో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా దోచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సూళ్లూరుపేటలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న తీసుకున్న చర్యలు శూన్యం. ప్రజల కోసం ప్రతిపక్షం పోరాటాలు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అధికార పార్టీ పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకులు వాటిపై పోరాటాలు చేస్తూ పరిష్కారానికి తమవంతు కృషి చేశారు. ఐదేళ్లలో వర్షాలు సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మారుమూల గ్రామల ప్రజల దుస్థితిపై ఇక్కడి టీడీపీ నేతలు స్పందించలేదు. వైఎస్సార్సీపీ నాయకులు పలుమార్లు జెడ్పీ సమావేశంలో ప్రజల పక్షాన గళం విప్పారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిత్యం గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లకూరు, నాయుడుపేట మండలాల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లు, లారీలతో చెన్నైకి తరలించడంపై పెళ్లకూరు ఎంపీపీ సత్యనారాయణరెడ్డి కొందరు రైతులతో కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటికి కష్టాలు తప్పవని, ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయో ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొని అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే పలుమార్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులను సైతం టీడీపీ నేతలు బెదించి వాహనాలను విడిపించిన ఘటన చోటుచేసుకున్నాయి. అధికార పక్ష అవినీతిపై ప్రతిపక్ష నేతలు అనేక సందర్భాల్లో గళం విప్పారు. సమావేశాల్లో మాట్లాడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. తాగు, సాగునీటి విషయంలో అధికారులతో అనేకసార్లు మాట్లాడి వినతులు సమర్పించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రజలపక్షాన గళం విప్పారు. ప్రజల సమస్యలపై చర్చించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వైనంపై బహిరంగ వేదికలపై నిలదీసిన ఘటనలున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ ఒక్కోసారి ఒక్కో స్టాండ్ తీసుకున్నా ప్రతిపక్షం మాత్రం మొదటి నుంచి హోదా కోసమే పోరాడింది. ఆ పార్టీ నాయకులు హోదా వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పోరుబాట పట్టారు. ప్రజలతో కలిసి ధర్నాలు, ర్యాలీలు చేశారు. -
టీడీపీ అసమర్థ పాలనకు ఇదే సాక్ష్యం
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల అసమర్థ పాలనపై గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు చొరవ చూపకుండా విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. మూలుగుతున్న ఇంటింటికి కుళాయి నిధులు గ్రామాల్లోని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మండలానికి రూ.37 కోట్లు కేటాయించింది. కేవలం నెల రోజుల్లో పథకాన్ని పూర్తి చేసి తాగునీటిని అందిస్తామని కొల్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం ఎక్కడా ప్రారంభం కాకపోవడం అసమర్థ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. మంగినపూడికి మంగళం అరిసేపల్లి, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, పోతేపల్లి, పోతిరెడ్డిపాలెం, పొట్లపాలెం, మంగినపూడి, చిరివెళ్లపాలెం, గోకవరం, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామ పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మంగినపూడి తాగునీటి పథకాన్ని2012లో అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2015 వరకు ఈ పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు పుష్కలంగా చేరింది. టీడీపీ నాయకులు పథకం నిర్వహణ కాంట్రాక్ట్ పనులు చేజిక్కించుకుని పైప్‌లైన్‌కు ఏర్పడుతున్న లీకులకు మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం ఏ గ్రామానికి తాగునీరు సక్రమంగా చేరకపోవడంతో ప్రజలు బిందె నీటిని రూ.20 కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఏడాది జరుగుతున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. డంపింగ్ యార్డు తరలింపులోనూ నిర్లక్ష్యమే.. స్థానిక రాజుపేట శివారులో శివగంగ మేజర్ డ్రెయిన్‌కు ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డును తరలించడంలోనూ పాలకులు విఫలమయ్యారు. రాజుపేట, కరెంటుకాలనీ ప్రజలతోపాటు మండలంలోని ఎస్ఎన్ గొల్లపాలెం, సీతారామపురం, సుల్తానగరం గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ఈ యార్డు ప్రభావం చూపుతోంది. దీన్ని అక్కడి నుంచి తరలించాలని గత పాలకవర్గం హయాంలోనే రూ.2.75 కోట్ల మునిసిపల్ నిధులను సమకూర్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా యార్డు తరలింపు అంగుళం ముందుకు కదలకపోవడం పాలనాతీరును ఎద్దేవా చేస్తోంది. తాగునీటి పథకాన్ని వీడని గ్రహణం చిన్నాపురం గ్రామంలో తాగునీటి పథకం ఏర్పాటు చేసి శివారు పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. పథకం నిర్మాణానికి భూమి కొలుగోలు ప్రక్రియ అప్పట్లోనే పూర్తయింది. ఈ ప్రాంతాన్ని రెండుసార్లు అప్పటి జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పరిశీలించారు. పాలకుల చొరవ లేకపోవడంతో పథకం పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలకుల అసమర్థత కారణంగా చిన్నాపురం గ్రామ పంచాయతీతోపాటు ఎన్‌గొల్లపాలెం, పెదయాదర, తుమ్మలచెరువు, వాడపాలెం, కొత్తపల్లెతుమ్మలపాలెం గ్రామ పంచాయతీల ప్రజలు ఐదేళ్లుగా ఉప్పునీరు తాగుతున్నారు. అప్రోచ్ నిర్మించ లేకపోయారు పల్లెతాళ్లపాలెం గ్రామం వద్ద తాళ్లపాలెం మేజర్ డ్రెయిన్‌పై నిర్మాణం చేసిన వంతెనకు అప్రోచ్‌ను నిర్మాణం చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు. గత పాలకవర్గం హయాంలోనే రూ.60 లక్షలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. సత్తెనపాలెం ఎస్సీకాలనీ, బోట్లవానిపాలెం గ్రామాలను కలుపుతూ పల్లెతాళ్లపాలెం గ్రామం మీదుగా కానూరు, పెదపట్నం సులువుగా చేరుకునేందుకు అప్పట్లో పేర్ని నాని ఈ వంతెన నిర్మాణం చేశారు. వంతెనకు ఒక వైపున అప్రోచ్ రోడ్డును నిర్మాణం చేసేందుకు ఓ రైతు వద్ద కొంత భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. సదరు రైతుకు పరిహారం మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. -
బిందె బిందెకు కన్నీళ్లు
సాక్షి , మచిలీపట్నం : ఇంట్లో చంటోడు ఆకలితో గుక్క పెట్టాడు.. వాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి. ఎసట్లో పోయడానికి ఇంట్లో చెంబుడు నీళ్లు కూడా లేవు.. అందుకే అమ్మ.. బుంగ చేతబట్టి ఊళ్లో వాటర్ ట్యాంకర్ దగ్గరకు పరుగులు పెట్టింది.. అప్పటికే చాంతాడంత క్యూ.. చెమటలు తుడుచుకుంటూ.. అమ్మా .. పిల్లాడు ఏడుస్తున్నాడు.. ఒక్క బుంగ పట్టుకోనివ్వండమ్మా అంటూ వేడుకుంది. ఖాళీ బిందెలతో ఎదురు చూస్తున్న మిగిలిన మహిళలు.. అసలు నీళ్లే రావడం లేదమ్మా.. అంటూ బదులిచ్చారు.. పిల్లాడి ఏడుపు గుర్తొచ్చి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. గబగబా ట్యాంకర్ వద్దకు వెళ్లి.. పైపు నోట్లోకి తీసుకుని నీళ్ల కోసం తంటాలు పడింది. పచ్చని నీళ్లు పైపులో నుంచి సన్నని ధారగా వచ్చాయి. దగ్గరగా చూస్తే ముక్కుపుటాలను బద్దలు చేస్తున్నాయి. ఇక దిక్కులేక వాటినే బిందెలో పట్టుకుని బయలుదేరింది.. ఆ నీళ్లనే వడబోసి.. కాచి వంటకు సిద్ధం చేసింది. ఇలా మిగిలిన మహిళలూ గంటల తరబడి తమ వంతు వచ్చే వరకు ఉండి.. బిందెడు నీళ్లు పట్టుకున్నారు...‘అయ్యా..ఇదెక్కడి పాలనయ్యా.. మా నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు.. అయినా గుక్కెడు నీళ్లివ్వడం చేతకాలేదు.. వేల ఎకరాల్లో పంటలు మాత్రం తడిపామని చెబుతున్నారు.. మా ఎండిన గొంతులో బాధను మాత్రం ఒక్కసారి కూడా ఆలకించడం లేదు. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని మీ చేతగానితనాన్ని వెక్కిరిస్తున్న ఈ దుస్థితిని కళ్లారా చూడండయ్యా..! అంటూ వారి వేదన కన్నీటి బొట్లుగా రాలుతుండగా ఇంటి దారి పట్టారు. మచిలీపట్నం నియోజవర్గంలోని పల్లెతుమ్మలపాలెంలో మత్స్యకారుల నీటి కోసం ఇలా నిత్యం అవస్థలు పడుతున్నారు. -
పల్లెల్లో దాహం కేకలు !
సాక్షి, దాచేపల్లి : పల్లెవాసుల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో ప్రజలు మండిపడుతున్నారు. ఓట్లు కోసం గడప తొక్కే నాయకులు ఇప్పుడు నీటి సమస్యను పరిష్కరించకపోవటంతో వారి తీరును తప్పుపడుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి ఎద్దడి ఉంటే ముందు రోజుల్లో మరింతగా నీటి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంతనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించకపోవటంతో అనేక గ్రామాలకు కృష్ణమ్మ రావటంలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించటంతో మంచినీటి సమస్యకు కారణంగా మారింది. పైపులైన్ల తొలగింపు.... నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం,మన్షూర్షాపేట, అంజనాపురం, నడికుడి ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం తాగునీటి పైపులను తొలగించారు. నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణాలు పూర్తికాక పైపులైన్లను అమర్చలేదు. దీంతో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కేసానుపల్లి గ్రామంలో పలు బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లకు నీరు అందటంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లకు నీరు అందక పనిచేయటంలేదు. దీంతో ప్రజలు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. రైల్వేట్రాక్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో బోర్లు పనిచేయక కాలనీవాసులు నీటి కోసం అరకిలోమీటర్ దూరం వెళ్తున్నారు. దాచేపల్లిలోని పలు వార్డుల్లో మంచినీటి సమస్య ఉంది. మాదినపాడు, తంగెడ, తక్కెళ్లపాడు, గామాలపాడు, పొందుగల గ్రామాల్లో కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వేసవికాలం రావటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గతేడాది వర్షపాతం తక్కువ మోతాదులో నమోదు కావటంతో భూగర్భ జలాలు స్థాయి పెరగలేదు. దీంతో బోర్లకు నీరు అందటంలేదు. ప్రస్తుతం 500 అడుగుల లోతులో బోర్లు వేసిన అర అంగుళం నీటి ధార రావటంలేదు. నాగులేరు, పలు వాగుల్లో అధికపార్టీ నాయకులు చెక్‌డ్యాంలను నిర్మించారు. కేవలం నిధులు డ్రా చేసుకునేందుకు వీటిని నిర్మించారే తప్ప నీరు నిలబడేందుకు కాదనే విషయం చెక్‌డ్యాంలను చూస్తే తెలుస్తుంది. మార్చిలో భూగర్భ జలాలు అడుగంటిపోతే ఏప్రిల్, మే నెలలో అసలు బోర్లు పనిచేయవనే ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. రెండేళ్ల క్రితం డిసెంబర్ నుంచి మే నెలాఖారు వరకు మంచినీటి ఎద్దడి నెలకొనటంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నడికుడికి చెందిన మందపాటి నాగిరెడ్డి ఫౌండేషన్, ఇరికేపల్లికి చెందిన ది మధర్ స్వచ్ఛంద సేవా సంస్థల వారు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచి నీటిని అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకున్న చొరవను ప్రభుత్వం చూపించకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల కోసం పైపులైన్లు తొలగించారు నారాయణపురంలో రోడ్ల నిర్మాణం కోసం మంచినీటి పైపులైన్లను తొలగించారు. పైపులను తీసేయటం వల్ల మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. గత నెల రోజుల నుంచి మంచినీటి కోసం పక్క వీధులకు వెళ్తున్నారు. పైపులైన్ల ద్వారా మంచినీరు సక్రమంగా అందటంలేదు. – షేక్ షరిఫ్. నారాయణపురం -
తాగునీటి కోసం ఆందోళన
సాక్షి,మేదరమెట్ల( ప్రకాశం) : వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం ప్రజలు రోడెక్కాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ఉదాహరణ కొరిశపాడు మండలంలోని అనమనమూరు ముంపు గ్రామంలోని కొంతమందికి బొడ్డువానిపాలెం కొండసమీపంలో పునరావాసం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉంటున్నారు. గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న పైపులైను పది రోజుల క్రితం పగిలిపోవడంతో ఆ కాలనీ ప్రజలు, బొడ్డువానిపాలెం ఎస్సీకాలనీ వారు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేదరమెట్ల నుంచి అద్దంకి వెళ్లే రాష్ట్రీయ రహదారి నాలుగులైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇదే రోడ్డు పక్కన బొడ్డువానిపాలెం గ్రామానికి తాగునీటి సరఫరా చేసే పైపులైను ఉంది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే ఐదుసార్లు ఈ పైపులైను మరమ్మతులకు గురైందని, ప్రతిసారి తాము కొంతసొమ్ముతో మరమ్మతులు చేయించుకుంటున్నట్లు కాలనీ వాసులు చెపుతున్నారు. పదిరోజుల కిందట సుమారు 300 అడుగుల మేర తాగునీటి సరఫరాచేసే పైపులైను రోడ్డునిర్మాణంతో పూర్తిగా దెబ్బతింది. విషయం కాంట్రాక్టర్ దృష్టికి తీసుకుపోయారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మేదరమెట్ల వచ్చిన సమయంలో విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోవలేదని కాలనీ వాసులు వాపోయారు. పనులు అడ్డుకున్న మహిళలు తాగునీటి పైప్‌లేన్ మరమ్మతుల విషయం ఎవరూ పట్టించుకుకోకపోవడంతో కాలనీకి చెందిన మహిళలు అద్దంకి రోడ్డులో నిర్మాణం చేస్తున్న పనులను బుధవారం మహిళలు అడ్డుకున్నారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ రెండు, మూడు రోజుల్లో పైపులైను మరమ్మతులు చేయించడం జరుగుతుందని కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇటీవల ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాలనీలోని చేతి పంపులు, బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయని, పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తామే ట్యాంకర్‌ను ఏర్పాటు చేసుకొని తాగునీటి సరఫరా చేసుకుంటున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బొడ్డువానిపాలెం, అనమనమూరు ముంపు కాలనీకి తాగునీటి సమస్యపై శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆప్రాంత ప్రజానీకం కోరుతున్నారు. -
గుక్కెడు నీటికి గంపెడు కష్టాలు
సాక్షి, కొండపి(ప్రకాశం): మండలంలోని చోడవరం గ్రామస్తులకు రక్షిత మంచినీటి సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంకులతో పాటు మూసి నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకుకు మంచినీటి సరఫరాకు పైప్‌లైన్ ఉంది. దీంతో పాటు ఇటీవల రామతీర్థం రిజర్వాయర్ నుంచి మంచినీరు గ్రామస్తులకు అందిస్తున్నామని అధికారులు పాలకులు చెబున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామస్తులకు గుక్కెడు మంచినీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో వెయ్యి మంది జనాభాతో పాటు మరో 500 మందికి పైగా కాలనీవాసులు ఉన్నారు. మంచినీరు అందించటం కోసం 50వేల లీటర్ల సామర్థ్యంతో గ్రామంలో ఒక ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మూసిలో బోర్లు వేసి బావికి నీరు సరఫరా చేసి అక్కడి నుంచి గ్రామానికి మంచినీరు వచ్చేలా పథకం రూపొందించారు. దీంతో పాటు రామతీర్థం రిజర్వాయర్ నుంచి సైతం మంచినీరు గ్రామానికి మంచినీరు సరఫరా చేయటం కోసం పైప్‌లైన్ ట్యాంకుకు సైతం అనుసంధానం చేశారు. అంత వరకు బాగానే ఉన్నా రామతీర్థం రిజర్వాయర్ నుంచి ఒక్కరోజు సైతం గ్రామానికి మంచినీరు సరిగా సరఫరా చేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా అంతకు ముందు గ్రామంలోని రక్షిత పథకం నుంచి మంచినీరు అందడం లేదని గ్రామస్తులు తెలిపారు. అదే విధంగా గ్రామంలో 20 కుటుంబాలకు నీరు ఆధారంగా ఉన్న చేతిపంపు మరమ్మతులకు గురైనా ఇంత వరకు పట్టించుకోకపోవడంతో వాడుకనీరు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. అలంకారప్రాయంగా ఓవర్‌హెడ్‌ట్యాంకు పట్టించుకోని అధికారులు గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పంచాయతీ కార్యదర్శి గానీ ప్రత్యేకాధికారి గానీ మంచినీరు సరఫరా విషయమై పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులకు పక్షం రోజులు పైగా మంచినీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రామతీర్థం నుంచి సరఫరా చేసే రక్షిత మంచినీరు పథకం పైపులైన్లో సమస్య ఉండి నీరు ట్యాంకుకు ఎక్కటం లేదని, పైప్‌లైన్ పగిలిందనే విషయం పథకం సిబ్బందికి తెలిపినా స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు. పొరుగు గ్రామాలకు పరుగు.. గ్రామంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో పక్కన ఉన్న వెన్నూరు, దేవిరెడ్డిపాలెం గ్రామాలకు ద్విచక్రవాహనాలతో వెళ్లి తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. వృద్ధులు పొరుగు గ్రామాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. కొంతమంది గ్రామానికి వచ్చే బబుల్వాటర్ వ్యాన్ల నుంచి మంచినీరు కొనుక్కోని తాగుతున్నట్లు తెలిపారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి కిరణ్‌ను ఫోన్లో వివరణ కోరగా..విషయం తన దృష్టికి వచ్చిందని రామతీర్థం పైప్‌లైన్ పగిలిందని, పైప్ జాయింట్ మిషన్‌తో వేయాలని అప్పటి లోగా గ్రామంలోని రక్షితపథకం నీరు అందిస్తాన్నారు. ప్రత్యేక అధికారి సురేఖను వివరణ కోరగా మంచినీరు సమస్య ఎవ్వరు తనదృష్టికి తీసుకరాలేదని, సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా అయినా తొలిస్తామని, ఎన్నికల పనుల్లో తీరికలేకున్నామని తెలిపారు. పది రోజులుగా మంచినీరు సరఫరాలేదు గ్రామానికి పక్షం రోజులుగా మంచినీరు సరఫరా లేదు. దీంతో గ్రామస్తులు మంచినీరు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవటంలేదు. రామతీర్థం మంచినీరు సైతం రావడం లేదు. – ఆర్ వెంకటనారాయణ, చోడవరం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది మంచినీరు కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. వయస్సు మళ్లిన వారు మంచినీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రెండు పథకాలు ఉన్నా మంచినీరు అందించలేకపోవటం దారుణం. మున్ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం కావడం లేదు. – ఎన్ రమణయ్య, చోడవరం -
గ్రామాల్లో పొంచి ఉన్న తాగునీటి ముప్పు
వేసవి ప్రారంభంలోనే పల్లెల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఒక వైపు సింగూరు ప్రాజెక్ట్ పూర్తిగా అడుగంటింది. దీంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి వచ్చే తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు భూగర్భజలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. దీనికోసం అధికారులు గ్రామాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహించి నీటి సమస్య ఉత్పన్నమయ్యే గ్రామాలను గుర్తించారు. దీని ప్రకారం 17 మండలాల్లోని 801 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉండనున్నాయి. ఈ నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. సాక్షి, మెదక్ : గ్రామాల్లోని తాగునీటి వనరులు ఎండిపోవటం, తాగునీటి బోరుబావుల్లో నీటి మట్టాలు పడిపోవటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తే గ్రామాలను గుర్తించారు. మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట మండలాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయి. దీంతో వేసవిలో ఈ మూడు మండలాల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సింగూరు ప్రాజెక్టులో నీరు ఎండిపోయిన నేపథ్యంలో మిగితా 17 మండలాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ఈ 17 మండలాల్లో 900కు పైగా ఆవాసాలు ఉన్నాయి. ఇందులో 801 గ్రామాల్లో తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి. కౌడిపల్లి మండలంలో అత్యధికంగా తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కౌడిపల్లి మండలంలో అత్యధికంగా 96 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ సర్వేలో తేలింది. ఆ తర్వాత నర్సాపూర్ మండంలో 90, శివ్వంపేట మండలంలో 76, టేక్మాల్ 59, హవేళిఘణాపూర్ 57, వెల్దుర్తి 52, పాపన్నపేట 50, చిన్నశంకరంపేట 48, కొల్చారం 43 మెదక్ 36, పెద్దశంకరంపేట 38, అల్లాదుర్గం 26 గ్రామాల్లో నీటి కొరత ఏర్పడనుంది. అలాగే రేగోడ్ మండలంలోని 25 గ్రామాలు, నార్సింగి 6, రామాయంపేట 38, నిజాంపేట 23, చిల్పిచెడ్ 38 గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్డబ్ల్యూఎస్ ముందస్తుగానే రూ.11.93 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. 281 గ్రామాలకు తాగునీటి రవాణా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తనున్న 281 గ్రామాలకు తాగునీటి ట్యాంకర్ల ద్వారా రవాణా చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. తాగునీటి సమస్య తలెత్తనున్న 801 గ్రామాలకు తాగునీటి రవాణా, బోరుబావుల మరమ్మతు, వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవటం, బోరుబావుల ప్లషింగ్, డీపెనింగ్ పనులు చేపట్టేందు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి మార్చి నెలలో నిధులు విడుదల చేయనుంది. ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా 17 మండలాల్లోని 281 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందజేయనున్నారు. అలాగే 1031 బోరుబావులను అద్దెకు తీసుకోనున్నారు. 353 చేతిపంపులను ఫ్లషింగ్, 296 చేతిపంపులను డీపెనింగ్, 362 బోరుబావులను మరమ్మతు చేయనున్నారు. నిధుల రాగానే పనులు ప్రారంభం.. సింగూరు ప్రాజెక్టు ఎండిపోవటం, భూగర్భజలాలు పడిపోవటం వల్ల వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.11.93 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం. సీఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఈ నిధులు త్వరలో విడుదల చేస్తుంది. వేసవిలో ప్రజలు తాగునీరు కోసం ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. –కమలాకర్, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ -
అసహనం.. అక్కసు
ఆయన ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధి. ప్రజల బాగోగులు చూడాల్సిన ఆయనే భగ్గుమన్నారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చెబుతుంటే తనకేమీ పట్టనట్టుగా కారులో కూర్చున్నారు. ఓటు వేసి గెలిపిస్తే.. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా అంటూ ప్రజలు తిరగబడ్డారు. అంతే చిర్రెత్తుకుపోయిన ప్రజాప్రతినిధి అసహనంతో రగిలిపోయారు. అనంతపురం , సోమందేపల్లి: సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లిలో సోమవారం పర్యటించిన ఎమ్మెల్యే బీకే పార్థసారథిని ప్రజలు తాగునీటి సమస్యపై నిలదీశారు. నాలుగున్నరేళ్ల తర్వాత గ్రామానికి వచ్చి సమస్యల గురించి తెలుసుకోకుండానే వెనుదిరుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుకు కదలనీయకుండా ఘెరావ్ చేశారు. అయితే ఎమ్మెల్యే ఎటువంటి హామీ ఇవ్వకుండా కారు ఎక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో ప్రజలు అడ్డుకున్నారు. మసీదుకు సైతం నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. తాజా మాజీ సర్పంచ్ శిల్ప, ఆమె భర్త సోముల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని పట్టుబట్టారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరి జాకీర్ హుసేన్‌ను ఎమ్మెల్యే గమనించి.. కారు దిగి వచ్చారు. ‘చేయి చూపిస్తూ.. ఫొటోలు తీస్తున్నావ్.. ఏమనుకుంటున్నావ్? నీ అంతు చూస్తా.. జాగ్రత్త’ అంటూ బెదిరించారు. సమస్య పరిష్కారంపై హామీ ఇవ్వకపోగా ఆందోళనను కవరేజ్ చేస్తున్న విలేకరిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగడంపై ప్రజలు మండిపడ్డారు. ఇంతలో టీడీపీ నాయకులు రంగప్రవేశం చేసి ప్రజలను కట్టడి చేశారు. ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించివేశారు. పట్టాల పంపిణీకి డబ్బు వసూళ్లు నిరుపేదలకు నివేశన స్థల పట్టాలు ఇవ్వడం కోసం సేకరించే భూములకు సంబంధించి సదరు రైతులకు ప్రభుత్వమే పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ టీడీపీ మాజీ సర్పంచ్ శిల్ప భర్త సోము గ్రామంలోని 59 మంది వద్ద రూ.10 వేల నుంచి రూ.13 వేల దాకా పట్టాల కోసం వసూళ్లూ చేసి.. ఎమ్మెల్యే చేతుల మీదుగా సోమవారం పట్టాల పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సేకరించిన భూముల యజమానులకు ప్రభుత్వం పరిహారం అందజేసినట్లు ప్రకటించారు. పట్టాల పంపిణీకి సంబంధించిన సర్వే నంబర్ 211 భూమిపై నాగభూషణ్‌రెడ్డి అనే వ్యక్తి హిందూపురం కోర్టులో కేసు సైతం వేశారు. కోర్టు పరిధిలో కేసు ఉండగానే టీడీపీ నాయకులు అధికారులతో కలిసి పట్టాల పంపిణీకి అత్యుత్సాహం చూపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై స్ధానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో వారిపై కొంతమంది టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు నచ్చచెప్పడానికి కానిస్టేబుల్ ఒకరే ఉండడంతో ఇబ్బంది పడ్డారు. -
వెలిగొండ నీళ్లు ఏ సంక్రాంతికి బాబూ?
యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి సంక్రాంతి నాటికి నీళ్లు ఇస్తానన్నావు, ఏ సంక్రాంతికి నీళ్లు ఇస్తావన్న విషయం స్పష్టం చేయలేదని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించారు. వైవీ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజలు సాగునీరు మాట అటుంచి తాగునీటి కోసం అల్లాడుతుంటే టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పశ్చిమ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ నీరు తాగి మరణిస్తున్నా.. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని ఆయన అన్నారు. ఫ్లోరైడ్ నీటితో జిల్లాలో దాదాపు 500 మంది మరణించినా టీడీపీ నాయకులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కరువుతో అలమటిస్తోందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని, రైతు ఆత్మహత్యలు ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కరువు పీడిత ప్రాంత ప్రజలను ఆదుకోవటానికి పశ్చిమ ప్రకాశంను సస్యశ్యామలం చేయటానికి వైఎస్సార్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి 70 శాతం పనులు పూర్తి చేశారని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టుకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, పర్సెంటేజీల కోసం కాంట్రాక్టర్‌ను మార్పు చేశారని విమర్శించారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తిచేసి సాగు, తాగునీరు అందించాలని తాను 3 నెలల క్రితం ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన కనిగిరి నుంచి పాదయాత్ర చేసినా ప్రభుత్వం కళ్లు తెరవలేదన్నారు. జగన్‌తోనే వెలిగొండ సాధ్యం: టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ఆ పెద్దమనుషులు అధికారం చేజిక్కించుకొని ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని వైవీ విమర్శించారు. ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే వెలిగొండ ప్రాజెక్టు సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. జగన్ సీఎం అయిన సంవత్సరంలోపేప్రాజెక్టును పూర్తి చేస్తారని అన్నారు. సీఎం అఫిడవిట్ వల్లే హైకోర్టు మార్పు: ఏపీలో హైకోర్టు డిసెంబర్ 15 నాటికి సిద్ధం అంటూ సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ప్రకారమే హైకోర్టును తరలించేలా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా అమరావతిలో రాజధాని నిర్మిస్తూనే ఉన్నావు.. అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేకపోయిన వాడివి హైకోర్టు సిద్ధం అంటూ అఫిడవిట్ ఏ విధంగా ఇచ్చావని ఆయన ప్రశ్నించారు. కాసుల కోసం పాకులాడుతున్నారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చరిష్మా, ఆ పార్టీ గుర్తుతోపాటు వైఎస్సార్ బొమ్మను అడ్డుపెట్టుకొని గెలిచిన ప్రజాప్రతినిధులు అధికార దాహంతో పార్టీ ఫిరాయించారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. వారికి అధికారం ఉన్నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టును గాలికి వదిలివేసి కాసుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులను త్యాగం చేయడం వల్లనే అని ఆయన అన్నారు. పదవులు ప్రధానం కాదని, ప్రజాసేవే పరమావధిగా భావించించిన వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు సేవలు చేస్తూనే ఉన్నారని ఆయన కొనియాడారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారని, పేదల వద్దకు వైద్యం తీసుకొని వెళ్లేలా మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారని ఆయన అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కె.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకుడు వెన్నా హనుమారెడ్డి, వైపాలెం ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పెద్దారవీడు, పెద్దదోర్నాల జెడ్పీటీసీ సభ్యులు దుగ్గెంపూడి వెంకటరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు డి.కిరణ్‌గౌడ్, యు.శ్రీనివాసరెడ్డి, జె.ఆవులరెడ్డి, పి.చంద్రమౌళిరెడ్డి, సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర నాయకులు కె.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, కె.ప్రమీల, ధనలక్ష్మిబాయి, అరుణాబాయి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, త్రిపురాంతకం మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రక్తశుద్ధికి.. నీటి కొరత!
నల్లగొండ టౌన్ : కిడ్నీ వ్యాధి్ర గస్తుల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తశుద్ధి కేంద్రం (డయాలసిస్) ఆశించిన స్థాయిలో సేవలను అందించలేక పోతోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు గతంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే వారు. ప్రతి వారం హైదరాబాద్‌కు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాలంటే నిరుపేదలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు నెలల కిందట డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పది మిషన్లతో పది మంది రోగులకు డయాలసిస్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది. దీని నిర్వాహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. కానీ కేంద్రం నిర్వహణ కోసం అవసరమైన విద్యుత్, నీటి సౌకార్యాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి బాధ్యులు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ఉన్న ఒక్క నీటి మోటార్ ఆస్పత్రితోపాటు డయాలసిస్ కేంద్రానికి వినియోగిస్తున్నారు. ఒక్క మోటార్ నీరు ఆస్పత్రి అవసరాలకు మాత్రమే సరిపోతుండడంతో డయాలసిస్ కేంద్రానికి నీటికొరత ఏర్పడింది. రోజూ 13వేల లీటర్లు నీరు అవసరం ప్రతి షిఫ్టులో పది మంది చొప్పున రోజూ 40 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ చేయొచ్చు. ఇందుకు రోజూ 13 వేల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అయితే ఒకే ఒక్క మోటార్ ఉండడం వల్ల సరిపడా నీరు సరఫరా చేయకపోవడంతో కేవలం మూడు షిçఫ్టులుగా డయాలసిస్ చేస్తున్నారు. ఫలితంగా రోజూ పది మంది రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో డయాలసిస్ జరగక పోవడంతో రోగులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ డయాలసిస్ కేంద్రంలో 92 మంది కిడ్నీ రోగులు తమ పేర్లను నమోదు చేయించుకుని డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రతి కిడ్నీ రోగి మూడు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. నీటి వసతి సక్రమంగా లేకపోవడం వల్ల కొత్త రోగుల పేర్లను నమోదు చేసుకోవడం లేదు. దీంతో పాటు ఇప్పటికే నమోదు చేసుకున్న బాధితులకు కూడా సరైన డయాలసిస్‌ను సకాలంలో అందించలేక పోతున్నారు. అంతే కాకుండా, కిడ్నీ రోగులకు వాడాల్సిన ఎరిత్రోపొయిటిన్ ఇంజక్షన్ల కొరత తీవ్రంగా ఉందని సమాచారం. ఆస్పత్రి వీటిని సరఫరా చేయకపోవడంతో, రోగులే ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్కటే మోటార్‌తో ఇబ్బందులు జిల్లా కేంద్రంలోని డయాలసిస్ కేంద్రంలో పూర్తి స్థాయిలో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలను అందించాలంటే కేంద్రానికి అవసరమైన నీటిని అందించడానికి ప్రత్యేకంగా బోరు, మోటార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రానికి సరిపడా నీటిని అందించడానికి ఆస్పత్రి అధికారులు ఎందుకు చొరవచూపడం లేదో అర్థంకాని స్థితి. ఇప్పటికైన ఆస్పత్రి బాధ్యులు ప్రత్యేక బోరు, మోటార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందకుండా పోయే ముప్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మందుల సరఫరా లేదు కేంద్రంలో డయాలసిస్ చేయించుకున్న వారికి అవసరమైన మందుల సరఫరా లేకపోవడంతో రోగులు బయట డబ్బులను వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్ చేయించుకున్న వారికి అక్కడే ఉచితంగా మందులను అందిస్తారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఉచితంగా మందులను అందజేయాలని కిడ్నీ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక బోరును ఏర్పాటు చేయాలి డయాలసిస్ కేంద్రానికి ప్రత్యేక బోరు మోటార్‌ను ఏర్పాటు చేయాలి. సరైన నీటి వసతి లేకపోవడంతో డయాలసిస్‌కు చాలా ఆలస్యమవుతుంది. ఒక్కోసారి రెండు సార్లు వెళ్లాల్సి వస్తుంది. బోరు, మోటార్‌తో పాటుకేంద్రం క్లీనింగ్‌కు ఆయాలను ఏర్పాటు చేయాలి. మందులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. – వెంకటరమణ, పేషంట్ నీరు సరిపోవడం లేదు జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు డయాలసిస్ కేంద్రానికి ఒకే ఒక్క బోరు మోటా ర్ ఉన్నందున నీరు సరిపోవడం లేదు. త్వరలో కొత్తగా బోరు వేయించేందుకు కృషి చేస్తాం. డయాలసిస్ రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – డాక్టర్ టి.నర్సింగరావు,ఆస్పత్రి సూపరింటెండెంట్ -
పల్లెల్లో ఫ్లోరైడ్ భూతం
బజార్హత్నూర్(బోథ్): ఫ్లోరైడ్ మహామ్మరి గిరి గ్రామాలను వణికిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకూ వ్యాధి ప్రబలుతూ భయాందోళకు గురి చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి హెచ్చరించినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్లు పనిచేయకుండా పోతున్నాయి. దీంతో సమస్య పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. ఫ్లోరైడ్‌తో పళ్లు రంగు మారుతున్నాయి. నల్లబారి వ్యాధి తీవ్రతను చూపుతున్నాయి. కొందరి పళ్లు గారలు పట్టడం, అరిగిపోవడం జరుగుతుంది. పుట్టిన పిల్లలకు ఎముకలు పెరగడం లేదు. కీళ్ల నొప్పులు, చిన్న దెబ్బకే ఎముకలు విరగడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్య ఏళ్ల తరబడి వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫ్లోరైడ్ ప్రభావానికి గురైన ఆ ఎనిమిది గ్రామాలు బజార్హత్నూర్ మండలంలోని చందునాయక్ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి). వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వేలో పైన పేర్కొన్న ఎనిమిది గ్రామాల్లో ఫ్లోరైడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆయా గ్రా మాల్లో బోర్లను సీజ్ చేశారు. సరైన పద్ధతిలో నీటి వసతిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. పడకేసిన శుద్ధజల పథకం.. చందునాయక్ తండాను ఫ్లోరైడ్ బాధిత గ్రామంగా 2009లో గుర్తించారు. దీంతో గ్రామీణ నీటి పారుదల శాఖ(ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో రూ.10లక్షలతో హడావిడిగా శుద్ధజల ప్లాంటును ఏర్పాటు చేశారు. కాని నిర్వహణ లోపంతో అది కాస్త పని చేయకుండా పోయింది. గ్రామానికి సమీపంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంలో గల కడెం వాగు ఒడ్డున వేసిన బోరు నిరుపయోగంగా మారింది. బోరు నుంచి శుద్ధజల ప్లాంట్ వరకూ పైపులైన్ వేయలేదు. దీంతో బోరును ఇతరులు సాగు నీటికి వినియోగిస్తున్నారు. తండాలో మొత్తం 2800 మంది జనాభాకు 60 శాతం మంది ఫ్లోరైడ్ బారిన పడిన వారే కావడం ఆందోళనకరం. ఇక్కడ మూడేళ్ల పాప నుంచి ముసలి వరకూ పళ్ళు నల్లబారి పోయి ఉంటాయి. శుద్ధజల పథకం గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గులాబ్ తండాలో స్వచ్ఛందంగా ప్లాంటు.. వంద శాతం గిరిజనులు గల గులాబ్ తండా గ్రామంలో ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన నిజామబాద్ జిల్లా డిచ్‌పెల్లి డీఎస్పీ రాథోడ్ దేవిదాస్ స్వంతంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షెడ్డు నిర్మాణం జరిగింది. త్వరలో మిషనరీలు ఏర్పాటు చేయనున్నారు. అందని ‘భగీరథ’ నీరు.. మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు సైతం మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. ఈ నీరు అందితే కొంత మేర ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కలిగే అవకాశముంది. కాని ఇంకా అంతర్గత పైపులైన్ పనులు కూడా ప్రా రంభించలేదు. ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అంద డం వచ్చే ఏడాది కూడా అనుమానంగానే ఉంది. ఫ్లోరైడ్ బారి నుంచి కాపాడే మార్గం.. ప్రభుత్వ వైద్యుడు డా. హరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉన్న గ్రామాల పరిధిలో బోరు బావుల నీటిని వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఫ్లోరైడ్ రహిత గ్రామాల నుంచి తాగు నీటిని సరఫరా చేయాలి. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో నాగ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూషన్(ఎన్ఈఈఆర్ఐ) నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్ బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఆ విధానం ఇక్కడ అమలు చేస్తే తప్పా ఫ్లోరైడ్ సమస్య తీరేలా లేదు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ దిశగా ఆలోచించి ఈ ఎనిమిది గ్రామాల ప్రజలను ఫ్లోరైడ్ బాధ నుంచి తప్పించాల్సిన అవసరముంది. తాగునీటికి దూరభారమవుతుంది.. గులాబ్ తండాలో తాగు, సాగు నీటిలో ఫ్లోరైడ్ ఆనవాళ్ళు ఉన్నాయి. గతంలోనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మూడు బోర్లను సీజ్ చేశారు. కాని వాటికి ప్రత్యామ్నయం చూపించలేదు. దీంతో ఇతర అవసరాలకు ఈ నీటినే వాడుతున్నాం. తాగడానికి గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలోని ఇంద్రనగర్ నుంచి కాలి నడకన ప్రతిరోజు తెచ్చుకుంటున్నాం. దీంతో దూరభారం తప్పడం లేదు. – రాథోడ్ అశోక్, గులాబ్‌తండా నీరీ పద్ధతి అమలు చేయాలి బజార్హత్నూర్ మండలంలో చందునాయక్ తండా, మోర్కండి, ఏసాపూర్, గులాబ్‌తాండ, టెంబి, హర్కాయి, బోస్రా, భూతాయి(బి) ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుగా గుర్తించాం. ఈ గ్రామాల్లో చిన్న పిల్లలకు పాల పళ్ళ నుంచే ఫ్లోరైడ్ వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. నాగపూర్ ఎన్‌ఈఈఆర్‌ఐకు చెందిన విద్యార్థులు నీరీ పద్ధతి ద్వారా ఫ్లోరైడ్‌ను అరికట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. ఈ పద్ధతిలో ఫ్లోరైడ్ రహిత గ్రామల నుంచి నీటిని సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించాం. – డా.హరీష్, పీహెచ్సీ వైద్యుడు, బజార్హత్నూర్ -
లక్ష్యం.. లక్ష లీటర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాల వ్యాపార సంస్థ విజయ డెయిరీ.. మినరల్ వాటర్ విక్రయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అంతర్గతంగా మినరల్ నీటిని తయారు చేస్తూ పరిశీలిస్తున్న సంస్థ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ముందుగా లక్ష లీటర్లు లక్ష్యంగా మార్కెట్లోకి అడుగిడుతున్నామని.. 200 మిల్లీ లీటర్లు, అర లీటరు, లీటరు బాటిళ్లతో పాటు 20 లీటర్ల క్యాన్లను తీసుకొస్తున్నామని డెయిరీ వర్గాలు తెలిపాయి. తొలుత హైదరాబాద్‌లో.. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డెయిరీ ప్లాంటులోనే అత్యాధునిక వాటర్ ప్లాంటును నెలకొల్పారు. తొలుత హైదరాబాద్‌లో తాగు నీటిని సరఫరాకు టెండర్లు ఆహ్వానించారు. త్వరలో వాటిని ఖరారు చేసి ఏజెంట్ల ద్వారా సరఫరా ప్రారంభిస్తారు. నీటి ధరపై మాత్రం యాజమాన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మార్కెట్లోని ప్రముఖ కంపెనీల ధరలకు కాస్త తక్కువుండేలా కసరత్తు చేస్తున్నారు. అత్యంత తక్కువకు అమ్మడం సాధ్యమవదని, సరైన ప్రమాణాలు ఉండాలంటే ఆ స్థాయిలో ధర తప్పదని చెబుతున్నారు. ‘కొత్త’మార్కెటింగ్ విజయ డెయిరీ పార్లర్లను రాష్ట్రవ్యాప్తం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 150 డెయిరీ పార్లర్లు ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి వాటి సంఖ్యను 1,000కి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్లర్లలో ప్రస్తుతం 14 రకాల పాల ఉత్పత్తులు విక్రయిస్తుండగా త్వరలో మరిన్ని ఉత్పత్తులనూ పరిచయం చేయాలని నిర్ణయించారు. కొన్ని రకాల రుచుల్లో (ప్లేవర్స్) పాలను, బాసుంది, కీర్ మిక్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. టీ స్టాళ్లు, హోటళ్లను దృష్టిలో ఉంచుకొని టీ చేసుకోడానికి మాత్రమే ఉపయోగపడే పాల ను కూడా తీసుకురావాలని నిర్ణయించారు. పాల ఉత్పత్తుల ప్యాకెట్లు, నాణ్యతలో మా ర్పులు చేయనున్నారు. మార్కెటింగ్‌లో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టి మార్కెటింగ్, ప్రచార వ్యవస్థనూ పటిష్టం చేయనున్నారు. త్వరలో మెగా డెయిరీ: అధికారులు విజయ పాలు, పాల ఉత్పత్తులే శ్రేయస్కరమని డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు. శనివారం సోమాజీగూడలో విజయ పార్లర్ ప్రారంభించిన తర్వాత వారు మాట్లాడుతూ.. విజయ పాలను వినియోగదారుల వద్దకు తీసుకెళ్లేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం లాలాపేటలో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీ అందుబాటులో ఉందని, దాని స్థానంలో 10 లక్షల లీటర్లతో మెగా డెయిరీకి కసరత్తు చేస్తున్నామన్నారు. అందుకు రుణం కూడా మంజూరైందని తెలిపారు. మెగా డెయిరీని ఎక్కడ నెలకొల్పాలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. -
ఏయ్.. నీ అంతు చూస్తా : కాలవ శ్రీనివాసులు
సాక్షి, రాయదుర్గం (అనంతపురం జిల్లా) : కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు. ‘ఏయ్ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు. ఇక నుంచి తన కార్యక్రమాలకు రావద్దంటూ హూకుం జారీ చేశారు. వివరాల్లోకవి వెళితే..రాయదుర్గం పట్టణంలోని జర్నలిస్టులకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కణేకల్లు రోడ్డులో ఇళ్లస్థలాలు ఇచ్చింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక..పాత పట్టాలు రద్దుచేసి, కొత్తపట్టాలను మంత్రి కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆ లేఅవుట్లో కొంతమంది విలేకరులకు ‘హౌస్‌ఫర్ ఆల్’ పథకంకింద ఇళ్లు మంజూరు చేశారు. ఆ లేఅవుట్లో సౌకర్యాలను పరిశీలించేందుకు మంత్రి కాలవ ఆదివారం సాయంత్రం అక్కడికి వచ్చారు. ఇది తెలుసుకున్న సమీపంలోనే ఉన్న ఎంసీఏ లేఅవుట్ మహిళలు తాగునీటి సమస్య చెప్పుకునేందుకు ఖాళీ బిందెలతో మంత్రి వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డగించి.. వలి అనే వ్యక్తితో పాటు ఓ మహిళను మంత్రి వద్దకు పంపించారు. ‘ఏంటయ్యా ఖాళీ బిందెలతో వచ్చారు.. సమస్య చెప్పేందుకు ఒకరిద్దరు రావాలి గానీ ఖాళీ బిందెలతో వస్తావా..? ఆడవాళ్లతో నన్నే అడ్డుకోవాలని చూస్తావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను సాక్షి టీవీ రిపోర్టర్ విష్ణు చిత్రీకరిస్తుండగా మంత్రి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. ‘ఏయ్ .. ఎందుకు తీస్తున్నావ్’ అని గదమాయించారు. సార్ నీటి సమస్య చెబుతున్న విషయాన్ని తీస్తున్నా అని చెబితే ‘తీయొద్దు, ఇక కార్యక్రమాలకు సాక్షి విలేకరులు రావద్దు’ అంటూ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ‘లేనిపోనివి సృష్టిస్తున్నారు, పనికిమాలిన లం.కొ..లు మీడియాలో చేరి జర్నలిజం విలువలు తీస్తున్నారు’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. వాడికి ఎవడైనా సపోర్ట్ చేస్తే వారి అంతు కూడా చూస్తా..ఏమనుకున్నారో ఏమో? అంటూ అక్కడే ఉన్న జర్నలిస్టులనూ హెచ్చరించారు. -
తాగునీటి సమస్య ఉంది
‘మాది నాతవరం మండలం మెట్టపాలెం. స్థానికంగా జామ, సపోట పండ్ల వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం. నాకు ముగ్గురు కుమారులు. మొత్తం 16 మంది కుటుంబ సభ్యులం కలసి పూరి పాకల్లో నివాసం ఉంటున్నాం. ఇల్లు మంజూరు కోసం టీడీపీ నాయకుల వద్దకు వెళితే పట్టించుకోవడం లేదు. పక్కా ఇళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రాంతంలో తాగునీటి సమస్యలు ఎక్కువ. మా బాధలు జగన్ బాబుకు చెప్పుకున్నాం. ఆయన మాకు ధైర్యం చెప్పారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది అంతా మంచే జరుగుతుందన్నారు.’అని వడ్డాది లక్ష్మి తెలిపారు. -
మహిళలకు నీటి కష్టాలు దూరం
కొడంగల్ (రంగారెడ్డి): మహిళల కన్నీటి కష్టాలను దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణ శివారులోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో మిషన్ భగీరథ ట్రయల్ రన్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని అన్నారు. 283 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జలాలను కొడంగల్‌కు రప్పించి ప్రజలకు సరఫరా చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.2 వేల కోట్లు, కొడంగల్‌కు రూ.267 కోట్లు ఖర్చుచేసి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రత్యేకంగా ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలుచేయని విధంగా కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మహిళలు తాగునీటి కోసం పొలాల దగ్గరకు వెళ్లకుండా తమ ఇంట్లోనే ధీమాగా కుళాయి వద్ద నీళ్లను పట్టుకోవచ్చని చెప్పారు. ఈనెల 13న కొడంగల్ మురహరి ఫంక్షన్ హాల్లో రైతులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత రెండో విడత రైతు బంధు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పంద్రాగస్టు నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేస్తారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 229 టీమ్‌లు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మాజీ జెడ్పీటీసీలు ఏన్గుల భాస్కర్, కృష్ణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, మండల రైతు సమాఖ్య అధ్యక్షుడు వన్నె బస్వరాజ్, మధుయాదవ్, మోహన్‌రెడ్డి, ప్రహ్లాద్‌రావు, మహిపాల్ ఉన్నారు. -
గొంతులెండుతున్నాయ్ !
జనం గొంతెండుతోంది. పశ్చిమాన పల్లెలన్నీ గుక్కెడు నీటి కోసం విలవిల్లాడుతున్నాయి. చినుకు జాడ కనిపించడం లేదు. జూలై చివరి నాటికే సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో నీళ్లు అడుగంటాయి. పొలాల్లో ఉండే వ్యవసాయ బోర్లపై ఆధారపడి కాలం నెట్టుకొస్తున్నారు. 4 టీఎంసీల సాగర్ నీరు వస్తే తప్ప జిల్లా ప్రజల దాహం తీరదు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో తాగునీటి ఇక్కట్లు పతాక స్థాయికి చేరాయి. పశ్చిమ ప్రకాశం పరిధిలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వెయ్యి గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి లేదు. ప్రభుత్వం మాత్రం గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో 419 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందులో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు మూడు నియోజకవర్గాల్లోనే 300 గ్రామాలు ఉండగా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 119 గ్రామాలు ఉన్నాయి. అయితే పై 6 నియోజకవర్గాల్లో వెయ్యి గ్రామాల్లో నీటి సమస్య అధికమైంది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 419 గ్రామాల్లో మాత్రమే అరకొర నీటిని సరఫరా చేసి చేతులు దులుపుకుంటుంది. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైనా జిల్లాలో చినుకు జాడ లేదు. దీంతో పశ్చిమ ప్రకాశంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. వేలాది చేతి పంపులు, ప్రభుత్వ తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. వర్షం వస్తే తప్ప ప్రజల తాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు. మనుషులతో పాటు పశువులకు నీరు అందడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై మూడు నియోజకవర్గాల్లోనే దాదాపు 700 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు ప్రకాశంలోనూ నీటి కష్టాలు మొదలయ్యాయి. సాగర్ పరివాహక ప్రాంతంలో 292 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సాగర్ నీటితో అధికారులు ఈ ట్యాంకులను నింపారు. జూలై చివరి నాటికే ట్యాంకులు అడుగంటాయి. ప్రస్తుతం చుక్కనీరు లేదు. రెండు మూడు రోజుల్లో చెరువులు నీటితో నింపకపోతే సాగర్ పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీరు అందే పరిస్థితి లేదు. ఇక ఒంగోలు నగరానికి ఇప్పటికే తాగునీటి ఇక్కట్లు తలెత్తాయి. నగర పరిధిలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. మరో వారంలోపు పూర్తిగా నీరు ఆగిపోతుంది. అదే జరిగితే లక్షలాది మంది నగర వాసులకు తాగునీటి ఇబ్బందులు తీవ్రస్థాయికి చేరుతాయి. ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు నగర వాసులకు అరకొర నీటిని మాత్రమే అందిస్తున్నారు. మూడురోజులకు ఒక మారు నీటి విడుదల అని పేరుకు చెబుతున్నా సక్రమంగా నీరు అందడం లేదు. గంటపాటు కూడా నీరు వదలడం లేదు. మళ్ళీ వారం రోజుల పాటు నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే చాలా మంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. తక్షణం 4 టీఎంసీల సాగర్ జలాలు విడుదల చేయాలని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తక్షణం నీటిని విడుదల చేయకపోతే పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలోనూ తాగునీటి ఇబ్బందులు పతాక స్థాయి కి చేరే ప్రమాదం ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో 142 గ్రామాల పరిధిలో రోజూ 1214 ట్రిప్పుల నీటిని ప్రభుత్వం సరఫరా చేయగా, ఫిబ్రవరి నెలలో 178 గ్రామాల పరిధిలో 1591 ట్రిప్పులు, మార్చి నెలలో 247 గ్రామాల పరిధిలో 2492 ట్రిప్పులు, ఏప్రిల్‌లో 316 గ్రామాల పరిధిలో ప్రతి రోజు 3,308 ట్రిప్పుల చొప్పున నీటిని సరఫరా చేశారు. రాను రాను ఇది పెరిగింది. తాజాగా శనివారం నాటికి జిల్లా వ్యాప్తంగా 419 గ్రామాల్లో రోజూ 4500 ట్రిప్పుల చొప్పున ప్రభుత్వం నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. వర్షాలు కురవక పోతే ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీరు మొక్కుబడిగా కూడా ప్రజలకు అందడం లేదు. అధికారులు చూపిస్తున్న గణాంకాల్లో చాలా మటుకు తప్పుడు గణాంకాలన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సాగర్ నీటిని విడుదల చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపాలి. పశ్చిమ ప్రకాశంలో నీరున్న ప్రాంతాల నుంచి తాగునీటి ఇబ్బందులున్న అన్ని గ్రామాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంది. తూర్పు ప్రకాశంలో నీటి కొరత: వర్షాకాలం వచ్చినా పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలోనూ నీటి కష్టాలు అధికమయ్యాయి. ఆగస్టు నెల వచ్చినా జిల్లాలో చినుకు జాడ లేదు. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, కొండపి, దర్శి, యర్రగొండపాలెం పరిధిలో 292 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఏప్రిల్‌లో అధికారులు నీటితో నింపారు. జూలై చివరి వరకు నీటి ఇబ్బందులు ఉండవన్నారు. జూలై ముగిసి ఆగస్టు నెల వచ్చింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. ఒకటి రెండు రోజులు మినహా ప్రజలకు నీరు అందే పరిస్థితి లేదు. ఈ లోపు సాగర్ నీటిని విడుదల చేయకపోతే నగర వాసులు నీటి కోసం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
నీళ్ల కోసం మహిళల రాస్తారోకో
రెబ్బెన (కుమురం భీం): గత వారం రోజులుగా గోలేటి పరిధిలోని భగత్‌సింగ్ నగర్ కాలనీలకు నీటి సరాఫరా నిలిచిపోవటంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. సింగరేణి రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి వా హనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈసంద ర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజు లుగా కాలనీలకు తాగునీటి సరాఫరా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించాలన్నా స్నానాలు చేసేందుకు బిందెడు నీళ్లు లేకుండా పోయాయన్నారు. దూరంగా ఉన్న చేతిపంపుల నుంచి తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చుకుంటున్న రోజు వారి అవసరాలకు నీళ్లు దొ రకటం లేదన్నారు. పంచాయతీ సిబ్బంది సమ్మె పేరుతో కాలనీలకు నీటి సరాఫరా పూర్తిగా నిలిచిపోయిన అధికారులెవరు పట్టించుకోవటం లేద న్నారు. వారం రోజులుగా ప్రజలందరూ నీళ్ల కో సం అవస్థలు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పంచాయతీ సి బ్బంది సమ్మె చేపడితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలం అ య్యారని అన్నారు. సుమారు ఆరగంటకు పైగా వాహనాలను అడ్డుకోవటంతో రోడ్డుకు ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీం తో సమాచారం అందుకున్న సీఐ రమణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం రాస్తారోకో చే యటం సరికాదని పోలీస్ యాక్ట్ అమలులో ఉ న్నందుకు ధర్నాలు, రాస్తారోకోలు చేయటం సరికాదన్నారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూ స్తామని హామీ ఇవ్వటంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. -
తాగునీటి సమస్యను పరిష్కరించండి సారూ...
వీరబల్లి: మండలంలోని మట్లి వడ్డేపల్లిలో తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నామని ఆ గ్రామప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి రోళ్లమడుగు నీరు రాకపోవడంతో పంచాయతీలోని వాటర్స్కీంతోనే కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పైప్‌లైన్ పగిలిపోవడంతో అక్కడే పట్టుకోవాల్సి వస్తోందన్నారు. మరికొందరు చేతిపంపులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. సుమారు వంద ఇళ్లవరకు జీవనం సాగిస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవతీసుకుని తమ ఇళ్లవద్ద కుళాయిలు వేయించి మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మంత్రి లోకేశ్‌ను నిలదీసిన మహిళలు
సాక్షి, కర్నూలు : ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆయన జిల్లాలోని గూడూరు మండలం నాగలాపురంలోని పంటలను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై మంత్రి లోకేశ్‌ను మహిళలు నిలదీశారు. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయనను కోరారు. అయితే, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కుదరదని, నీళ్ల ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. -
గుక్కెడు నీటి కోసం... బండెడు కష్టాలు
చింతకొమ్మదిన్నె : మండలంలోని జె.నారాయణపురం, బయనపల్లి గ్రామాల్లో ప్రజలు గుక్కెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచి నీటి కోసం గ్రామంలోని బోరు వద్ద మిందెలతో బారులు తీరుతున్నారు. అనేక సార్లు నీటికోసం అధికారులను, పాలకులను కలసి సమస్యను వివరించినా పరిష్కారం లభించక పోవడంతో చేసేదేమి లేక ప్రజలు వారి తిప్పలు వారు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరులో నీరు ఇంకి పోవడంతో వస్తున్న అరకొర నీటితోనే గొంతులు తడుపుకుంటున్నారు. గ్రామంలో ఒక్క ఇంటికి కూడా కుళాయిల ద్వారా నీరు అందే పరిస్థితి కనిపించడంలేదు. మంచి నీటి కోసం ఇంటి దగ్గర ఎవరో ఇకరు కాపలా ఉండాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. బయనపల్లి, బుగ్గలేటిపల్లి గ్రామాల్లో తాగేందుకు నీరు పుష్కలంగా ఉన్నప్పటికి అవి గొంతు వరకు చేరడంలేదు. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న మంచి నీటి పైపులైన్‌ను తొలగించి అలాగే వదిలేయడంతో నీటి కోసం పక్క ఊర్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఈ రెండు గ్రామాల ప్రజలు ఆర్అండ్బీ, కార్పొరేషన్ అధికారులను కలసి సమస్యను వివరించినా పట్టించుకన్న పాపానపోటేదు. దీంతో ట్యాంకర్ల వద్దకు, పంటపొలాల వైపుకు నీటి కోసం వెళుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తగిన చర్యలు తీసుకుని మంచి నీటి సమస్యను పరిస్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ముసలి మొప్పున తిప్పలు పడుతున్నాం ముసలిమొప్పున తాగేందుకు నీళ్లు లేక దూరం నుంచి తెచ్చుకునే శక్తి లేక ఇబ్బందులు పడుతున్నాం. మూడేళ్ల నుంచి మా ఊర్లో నీళ్ల కోసం తిప్పలు పడుతున్నాం. ఉన్న ఒక్క బోరులో నీరు అడుగంటడంతో ఈ అగచాట్లు వచ్చాయి. మా ఊరికి మరో బోరును ఏర్పాటు చేయాలని అధికారులను, పాలకులను అడిగినా ఫలితం లేదు. సరస్వతి, జె.నారాయణపురం ఎన్నాళ్లో ఈ తిప్పలు రోడ్డు నిర్మాణ పనుల కోసమని ఉన్న పైపులైన్‌ను తొలగించారు. తాగేందుకు పష్కలంగా ఉన్నా అవి గొంతును తడపడం లేదు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు, పాలకులకు సమస్యను వివరించినా వారు పట్టించుకోకపోవడంతో ఈ తిప్పలు పడుతున్నాం. రోడ్డు నిర్మాణ పనులు పూర్తై నెలలు గడుస్తున్నా పైపులైన్ ఏర్పాటు చేయలేదు. మల్లీశ్వర్‌రెడ్డి, బయనపల్లి -
మెరుపు వేగంగా కాళేశ్వరం
పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మెరుపు వేగంతో పూర్తవుతున్నాయని, అన్ని ప్రాజెక్టుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సృష్టించబోతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారంలోని ప్యాకేజీ–6 పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల చివరి వారంలో గ్యాస్ ఆధారిత కరెంటు ఉత్పత్తిని పూర్తి చేయాలన్నారు. వచ్చే జూలై నాటికి మూడు పంపుల ద్వారా నీరందించాలన్నారు. దీనికి కావాల్సిన నిపుణులను రంగంలోకి దించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికి రెండు పంపులు పూర్తయినందున మూడో పంపు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేసి, జూలై నాటికి అందుబాటులో ఉంచాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. టన్నెల్ నిర్మాణం అయినందున వర్షాలు సమృద్ధిగా కురిసి నీరు నిల్వ స్థాయికి చేరగానే అనుకున్న వ్యవధికి నీటిని విడుదల చేసేందుకు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు తొంగి చూస్తున్నాయన్నారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి, సాగు, తాగునీటి సమస్యలను తీర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీనికోసం యంత్రాం గం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. -
కన్నీటి కష్టాలు
అచ్చంపేట రూరల్ : వేసవిలో తాగునీరు లేక గ్రామీణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు సరిపడా తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నారు. బిందె నీటి కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలోని నీరు ఎండిపోయింది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో మరింత జఠిలమంది. అచ్చంపేట మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డైరెక్ట్ పంపింగ్ ద్వారా.. అన్ని గ్రామాల్లో డైరెక్టు పంపింగ్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో ప్రధానంగా బోర్లపైనే ఆధార పడి ఉన్నారు. కొన్ని చోట్ల లీకేజీలు ఉండడంతో తాగునీరు వృథాగా పోతుంది. పట్టించుకోని ప్రజాప్రతినిధులు పదవీకాలం ముగియనుండడంతో గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని ప్రజల దాహార్తిని తీర్చలేక పోతున్నారు. గతంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశామని, అప్పటి డబ్బు రాకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లోని ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. గ్రామాలకు చాలా దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. మిషన్ స్లో.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపులైను పనులు గ్రామాలకు వచ్చినా ట్యాంకులు మాత్రం నేటికీ పూర్తికాలేదు. వివిధ కారణాలతో కొన్నింటికి పునాదులే పడలేదు. ఈ వేసవిలో తాగునీటి కష్టాలు తీరుతాయని ప్రజలు భావించినా అధికారుల అలసత్వంతో మిషన్ భగీరథ పనులు స్లోగానే సాగుతున్నాయి. మండలంలో 36 మిషన్ భగీరథ ట్యాంకులు పూర్తి చేయాల్సి ఉన్నా కేవలం 16 ట్యాంకులు మాత్రమే పూర్తి చేశారు. తీవ్ర తాగునీటి ఎద్దడి మండలంలోని రంగాపూర్‌లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. వేసవి కాలం వస్తే చాలు భయమేస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటిని అందించాలి. -
గిరి గ్రామాల్లో నీటి గోస
జైనథ్ : మండలంలోని గిరిజన గ్రామం జామ్ని పంచాయతీ, అనుబంధ గ్రామం దత్తగూడలో చేతి పంపులు ఎండిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులుపడుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా నీటికటకట మొదలైంది. దీంతో చేతిపంపుల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఓ గంట సేపు చేతిపంపులు వాడితే మరల గంట, రెండు గంటల వరకు నీళ్లు రాకపోవడంతో పనులు మానుకొని నీళ్లకోసం వేచి చూడాల్సిన దుస్థితి. దీంతో ప్రజలు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి, బిందెలతో లైన్లు కడుతున్నారు. ఉన్నవి 14... పని చేస్తున్నవి 4. జామ్ని గ్రామంలో 235 కుటుంబాలు, 1350 జనాభా వుంది. ఈ గ్రామంలో మొత్తం 14 చేతి పంపులు ఉన్నాయి. ప్రస్తుతం ఎండలకు కేవలం నాలుగు మాత్రమే పని చేస్తున్నాయి. అందులో ఒకటి గ్రామంలోని ఓహెచ్ఎస్ఆర్ నింపే వనరు బోరు కాగా, మిగిలినవి మూడు చేతి పంపులు ఉన్నాయి. పొచ్చమ్మ ఆలయం, పైకు ఇల్లు, జుగ్నక్ మోపత్ ఇండ్ల సమీంలోని మూడు చేతి పంపులు మాత్రమే పని చేస్తుండడంతో ప్రజలు నీళ్లకోసం బిందెలతో క్యూకడుతున్నారు. ఇవి కూడా గంట, రెండు గంటలు మాత్రమే పని చేస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సగం గ్రామానికే ఓహెచ్ఎస్ఆర్ వాస్తవంగా జామ్ని గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ప్రస్తుతం పని చేస్తుంది. దాని సోర్స్ బాగానే ఉంది. కాకపోతే ఈ ట్యాంకు నీళ్లు కేవలం సగం గ్రామానికి మాత్రమే సరిపోతున్నాయి. మిగిలిన వాళ్లకు నీళ్లు రాకపోవడంతో దిక్కు లేని పరిస్థితుల్లో ఊరి బయట ఉన్న బావిని ఆశ్రయిస్తున్నారు. ఎడ్లబండిపై డ్రమ్ములతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. బావి నీళ్లతో రోగాలు వ్యాపించే అవకాశం ఉందని తెలిసిన కూడ గత్యంతరం లేక వాటిని తాగుతున్నారు. దత్తగూడలో ఒకేఒక చేతిపంపు.. జామ్ని అనుబంధ గ్రామం దత్తగూడ 52 ఇళ్లు 280మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో సైతం తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో ఓక బోర్, ఒక చేతి పంపు ఉంది. కరెంట్ ఉన్నప్పుడు ఓ గంట సేపు మాత్రమే బోర్లో నీళ్లు వస్తుండడం, చేతి పంపు వద్ద అంతంత మాత్రంగానే నీళ్ల ఉండడంతో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కుంటున్నారు. ఎడ్లబండితో బావి నీళ్లను తెచ్చుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. దీంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా నీళ్ల కోసం చేతిపంపుల వద్ద, బావి వద్ద క్యూకడుతున్నారు. కాగా గ్రామ పంచాయతీ ని«ధులతో గ్రామంలో ట్యాంకర్ ఏర్పాటు చేసినప్పటికి కూడా ప్రజలకు సరిపడా నీళ్లు అందించలేకపోతున్నామని సర్పంచ్ పెందూర్ మోహన్ చెబుతున్నాడు. ఎడ్లబండితో తెచ్చుకుంటున్నాం ఊళ్లో నీళ్లు దొరకడం లేదు. ఎడ్లబండి కట్టుకొని, డ్రమ్ములతో బావి నీళ్లను తెచ్చుకుంటున్నాం. బావి ఊరికి బయట ఉండడంతో ఎడ్లకు కూడా ఇబ్బందిగా ఉంది. బావి వద్ద కూడా లైన్ ఉంటుంది. డ్రమ్ముల్లో తెచ్చిన నీళ్లను తాగునీటికి కూడా వాడాల్సి వస్తున్నదని. రోజు పొద్దున పనిగట్టుకొని నీళ్ల కోసం వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు ఇకనైన దయచూపాలి. ట్యాంకులు ఏర్పాటు చేస్తాం జామ్ని, దత్తగూడ గ్రామాల్లో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రెండు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించం జరిగింది. ట్యాం కులు కూడా తెప్పించాం. గ్రామంలోని నీటి సోర్స్‌లకు కనెక్షన్ ఇచ్చి ట్యాంకులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే ఏర్పాటు చేసి, నీటి వసతి కల్పిస్తాం. -
మంచినీటికి కటకట
బొమ్మలరామారం : మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని కింది తండాలో మంచి నీటి ఎద్దడి తలెత్తింది.తండాకు మిషన్ భగిరథ నీరు అందుతున్నా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తండాలో కొందరి గిరిజనుల పరిస్థితి. వివరాల్లోకి వెళితే కింది తండాకు మిషన్ భగిరథ ద్వారా నీటిని అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నూతనంగా నిర్మించి నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఓ పది ఇళ్లకు మాత్రం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన బోరు బావే దిక్కైంది. తండాలోని చివరగా ఉన్న ఓ పది కుటుంబాలు ఇప్పటికీ భగీరథ నీటిని చూడలేదు.పైప్‌లైన్ ఏర్పాటులో సాంకేతిక లోపం కారణంతోనే లేక మరో కారణంగానే ఈ పది కటుంబాలకు గత మూన్నెళ్లుగా నీటి కటకట మొదలైంది. ఈ పది కుటుంబాలను మొన్నటి వరకు ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ బోరు బావి సైతం వట్టిపోవడంతో వీరికి నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అరగంటకు ఒకసారి పనులు మానుకొని బోరు బావి వద్ద నీటి కోసం పడిగాపులు తప్పడం లేదు. ఎన్నిసార్లు నాయకులకు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాథుధుడే కరువైయ్యాడని తండా గిరిజనులు వాపోతున్నారు. ఇకనైనా తమకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నీళ్లకు తిప్పలవుతోంది తండాలో బోరు బావి వద్ద అరగంటకు ఒక బిందె నీళ్లు వస్తున్నాయి. నీళ్ల కోసం పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నం. సర్కారోళ్లు వేసిన నల్లాల్లో నీళ్లు రాక సిలుము పడుతున్నాయి. తండా కొందరికే నీళ్లు వస్తున్నాయి. అందరికీ వచ్చేటట్లు చేయాలే. నీళ్లు సరిపోను లేక రెండు, మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాం. వంతుల వారీగా నీళ్లకు లైన్ల నిలబడి పంచాయతీలు అవుతున్నాయి. ఎండాకాలంలో నీళ్లకు తిప్పల ఎక్కువైంది. -
నీటి సమస్య పరిష్కరించాలని రాస్తారోకో
వర్ని(బాన్సువాడ) : రుద్రూర్ మండలంలోని అంగడిబజార్ ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆదివారం రాస్తారోకో చేశారు. గతనెల రోజులుగా కుళాయిలు సరిగా రాక తీవ్ర అవస్థ పడుతున్నామని వారు వాపోయారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సమస్య పరిష్కరించే వరకు కదలబోమని మొండికేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని వారిని సముదాయించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్యను సోమవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో స్థానికులు రాస్తారోకో విరమించారు. -
భూగర్భశోకం
సాక్షి, మెదక్: వేసవి ప్రారంభంలోనే జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జలాశయాలు, చెరువుల్లో నీరు వేగంగా ఇంకిపోతుంది. దీనికి తోడు భూగర్భ జల మట్టాలు అడుగంటుతున్నాయి. పర్యవసానంగా గ్రామాలు, తండాల్లోని ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. నిజాంపేట మండలం చల్మెడలో తాగు నీటి కష్టాలు తీర్చాలంటూ మూడు రోజుల క్రితం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందో? మెదక్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, చిలప్‌చెడ్ తదితర మండలాల్లో ఇప్పటికే నీటి సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా గిరిజన తండాల్లో నీటి సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో గిరిజనులు కిలోమీటర్ల మేర నడుచకుంటూ వెళ్లి వ్యవసాయ భూముల వద్ద ఉన్న బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే నీటి కోసం ఇబ్బందులు పడాల్సివస్తే వేసవిలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళనకు గురువుతున్నా రు. మరోవైపు మిషన్‌భగీరథ పనులు నత్తనడక న సాగుతున్నాయి. ఏప్రిల్‌లోగా మొదటి దశలో గ్రామాలకు తాగునీరు సరఫరా చేయటం సాధ్యం కాకపోవచ్చని ప్రజలు ఆలోచిస్తున్నారు. వేగంగా పడిపోతున్నాయి.. జిల్లాలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం భూగర్భ జలాలు 16.07 మీటర్ల లోతులో ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో భూగర్భ జలాలు 13.07 మీటర్లు ఉండటం గమనార్హం. 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉండటంతో వ్యవసాయం కోసం రైతులు ఎడాపెడా బోరుబావుల్లో నుంచి నీటిని తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తూప్రాన్ మండలంలో అత్యధికంగా భూగర్భ జలాలు 32.26 మీటర్ల లోతుకు పడిపోగా, రేగోడ్‌లో 9.56 మీటర్ల లోతునే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ జలాలు మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. గిరిజన తండాల్లో నీటి సమస్య అధికం జిల్లాలోని పలు గ్రామాలతోపాటు గిరిజన తండాల్లో నీటి సమస్య మొదలైంది. రామాయంపేట పట్టణంలోని టీచర్స్‌కాలనీ, రెడ్డికాలనీలో నీటి సమస్య ఉండటంతో కాలనీవాసుల ట్యాంకర్‌ద్వారా తాగునీటిని తెప్పించుకుంటున్నారు. మండలంలోని టి.నంబర్‌తండా, దంతేపల్లితండాల్లో నీటి సమస్య ప్రారంభమైంది. నిజాంపేట మండలంలోని చల్మెడ, నగరంతండా నీటి సమస్య ప్రారంభంకావటంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.చిల్పిచె మండలంలోని ఎర్రమట్టి తండా, పానాదితండా, ఎల్లుగుట్టతండా, చిట్కుల్ ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉంది.చిన్నశంకరంపేట మండలంలోని ఎస్.కొండాపూర్, పాటగడ్డ, రంగువాన్‌పల్లి, జప్తిశివనూరుతండా, శేరిపల్లి గ్రామంలో నీటి సమస్య ఉంది. పాపన్నపేట మండలం సోమ్లా, బ్యాక్యా, మెదక్ మండలం మక్తభూపతిపూర్, శివాయిపల్లి, హవేళిఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. చేగుంటపట్టణంలోని పలు కాలనీలతోపాటు వెల్థుర్తి మండలంలోని బస్వాపూర్, అచ్చంపేటలో నీటి సమస్య ప్రారంభమైంది. ఇదిలా ఉంటే గిరిజన తండాల్లో తాగునీటి కోసం ఉపయోగించే చేతిపంపుల మరమ్మతుకు వచ్చినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించటంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. -
తండ్లాట
సాక్షి, పెద్దపల్లి: ముత్తారం మండలం సీతంపేటలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బావులు ఎండిపోయాయి. ఫలితంగా గ్రామంలో తాగునీటి ఎద్దడి మొదలైంది. తప్పనిపరిస్థితుల్లో వ్యవసాయ బావులపై ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కష్టమైనా కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నారు. పారుపల్లి పంచాయతీ పరిధిలోని శాలగుండ్లపల్లిలో నీటిసరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముత్తారం–కూనారం డబుల్ రోడ్ నిర్మాణ పనుల్లో పైప్‌లైన్ పగిలిపోవడంతో, నీటి సరఫరా నిలిచిపోయింది. నెలలు గడుస్తున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలకు కొన్ని ఉదాహరణలివి. ఉన్న మంచినీటి పథకాల నిర్వహణలో లోపం, అంతా మిషన్ భగీరథపైనే ఆధారపడడం, తాత్కాలిక సమస్యలను కూడా పరిష్కరించకపోవడం, షరామామూలుగానే అధికార యంత్రాంగం ముందుగా∙ మేల్కొనకపోవడం కారణంగా, వేసవి ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాకముందే ప్రజానీకం తాగునీటి ఇక్కట్లను ఎదుర్కొంటోంది. మార్చి మొదటివారంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లందిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మిషన్ భగీరథ పనుల్లో విపరీతమైన జాప్యం, అప్పుడే తాగునీటికి ఇబ్బందులు ఎదురవడంతో చూస్తుంటే, భవిష్యత్ జిల్లా ప్రజానీకాన్ని భయపెడుతోంది. అడుగంటిన జలాలు జిల్లాలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి అప్పుడే మొదలైంది. మంథని, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం, రామగుండం తదితర మండలాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీనితో తాగునీటి కోసం ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో తాగునీటి ప్రధాన పైప్లైన్లు పగిలిపోతున్నాయి. వాటిని సరిచేసే నాథుడే లేకపోవడంతో, సంబంధిత గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయి, రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. చాలా గ్రామాల్లో ట్యాంకులు నిర్మించినప్పటికీ తాగునీటి కనెక్షన్లు ఇంకా ఇవ్వలేదు. అంతర్గాం మండలం ముర్మూరు ఆర్అండ్ఆర్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీ నిర్మించే సమయంలో పైపులైన్లు అమర్చినప్పటికీ ఆ తర్వాత ఇళ్లను చాలా ఎత్తులో నిర్మించడంతో ఆ పైపులు లోతుకు వెళ్లిపోయాయి. దీంతో కనెక్షన్లను ఇవ్వలేని స్థితి ఏర్పడింది. దీంతో వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి నీళ్లను క్యాన్లలో తెచ్చుకుంటున్నారు. రామగుండం పట్టణంలోని ఎస్టీ కాలనీకి మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఎన్టీసీపీ ఏరియాలోని ఇందిరమ్మకాలనీ, పీకే రామయ్య కాలనీల్లో ట్యాంకుల ద్వారా కార్పొరేషన్ నీటిని సరఫరా చేస్తోంది. అయినా అవి సరిపోకపోవడంతో చాలా మంది మేడిపల్లి సెంటర్లో ఎన్టీపీసీ మినరల్ వాటర్‌ప్లాంట్ వద్దకు వచ్చి క్యాన్లలో నీళ్లను తీసుకెళుతున్నారు. గోదావరిఖని మార్కండేయకాలనీలోని నగునూరి గడ్డ ప్రాంతానికి ఇప్పటికీ తాగునీటి వసతి లేకపోవడంతో సమీపంలో ఉన్న పైపులైన్ల వద్ద గల నల్లాల నుంచి నీటిని తీసుకెళ్తున్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. భగీరథ జాప్యం ఇంటింటికి నల్లానీళ్లు అందివ్వాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పనులు జిల్లాలో ఆలస్యంగా సాగుతున్నాయి. మిషన్ భగీరథ పూర్తి చేయడానికి ఇంకా గడువు ఉన్నా.. ప్రధాన పైప్లైన్లు పూర్తిచేసి వచ్చే మార్చి మొదటి వారంలో గ్రామాలు, పట్టణాలకు బల్క్‌గా నీళ్లందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ శ్రీదేవసేన సైతం మార్చి మొదటి వారంలో నీళ్లందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పనుల ‘తీరు’ను పరిశీలిస్తే, మార్చి మొదటి వారంలో నీళ్లందించడం కష్టంగానే ఉంది. ఇప్పటివరకు ప్రధాన పైప్‌లైన్ పూర్తికాలేదు. మరో 34 కిలోమీటర్ల మేర పూర్తిచేయాల్సి ఉంది. అలాగే ఇంట్రావిలేజ్ పనుల ప్రగతి చాలా దారుణంగా ఉంది. స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ కూడా గురువారం జరిగిన సమీక్షలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 1664 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 292.84 కిలోమీటర్లు మాత్రమే వేశారు. అలాగే 292 ఓవర్ హెడ్ ట్యాంకులకు గాను, 195 ట్యాంక్‌లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. రామగుండం, పెద్దపల్లి పట్టణాల్లో 180 కిలోమీటర్లకు గాను కేవలం 32 కిలోమీటర్లు మాత్రమే పైప్‌లైన్ పూర్తయింది. మిషన్‌భగీరథ పనులు ఇలా ఉంటే, జిల్లాలో ఇప్పటికే తాగునీటి ఎద్దడి మొదలైంది. రోడ్డెక్కుతున్న మహిళలు వేసవి కాలం మొదట్లోనే తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కుతున్నారు. నీళ్లు కావాలంటూ జిల్లాలో ఆందోళనలు సాగుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఓ చోట భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయి, మరో చోట పైప్లైన్లు పగిలిపోయి..కారణాలేవైనా మొత్తానికి నీళ్లకు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పరిస్థితి కనిపిస్తున్నా అధికారుల తీరులో మార్పు లేదు. వేసవికి ముందే మేల్కొనాల్సిన అధికారులు షరామామూలుగానే వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. గత వర్షాకాలం జిల్లాలో లోటు వర్షాపాతం నమోదు కావడం, ప్రస్తుతం భూగర్భజలాలు వేగంగా అడుగంటిపోతున్నా సంబంధిత అధికారులు తీసుకున్న ముందస్థు చర్యలు లేవు. మిషన్ భగీరథ ద్వారానే నీళ్లు అందించేందుకు సిద్దమవుతున్నా, చాలా ప్రాంతాల్లో పైప్‌లైన్ వ్యవస్థ సరిగాలేదు. ట్యాంక్‌లు అందుబాటులో లేవు. సకాలంలో పనులుపూర్తవుతాయన్న నమ్మకమూ లేదు. ఇప్పటికప్పుడు ఎదురవుతున్న తాగునీటì ఎద్దడి నివారణకు ప్రత్యామ్నయ చర్యలు లేవు. తాగునీటి సరఫరా మెరుగు పరచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోతే రాబోయే రోజుల్లో సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. నీటి ఎద్దడి నివారణకు చర్యలు నీటి ఎద్దడి నెలకొందన్న సమాచారం అందుకోవడంతోనే అక్కడ తాత్కాలికంగా చర్యలు తీసుకొంటున్నాం. గతంలో బావులు అద్దెకు తీసుకొని ట్రాకర్లు, పైప్‌ల ద్వారా నీటిని సరఫరా చేసేవాళ్లం. ఇప్పుడు మిషన్ భగీరథ గ్రిడ్ల నుంచే నీళ్లు పంపించాల్సి ఉంటుంది. మార్చి మొదటి వారం నాటికి నీళ్లు అందుతాయి. –తిరుపతిరావు, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ -
సీఎం హామీల సంగతేంటి?
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలకు వచ్చిన సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని ఇంతవరకు నెరవేరలేదు. ముఖ్యంగా తాగునీటి సమస్య నుంచి గట్టెక్కేందుకు ఇచ్చిన హామీలు ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. పరిస్థితులు ఇదేవిధంగా ఉంటే రానున్న వేసవిలో ప్రజల తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. నీటి రవాణాకు సంబంధించిన బిల్లులు 70కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించకుంటే ఈసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకురారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.నారాయణ వద్ద ఏకరువు పెట్టారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఒంగోలులోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో శాసససభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పనులు చేయకపోతే రేపు మనం ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతాం అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రిని ప్రశ్నించారు. ఇగో ప్రాబ్లమ్స్లో లేట్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ కరణం బలరాం ప్రపంచబ్యాంకు నిధులతో నాగార్జునసాగర్ కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రపోజల్స్ సంవత్సరం నుంచి పైకి కిందకు తిరుగుతున్నాయని శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రపంచబ్యాంకుకు సంబంధించిన పనులు తెలంగాణ రాష్ట్రంలో పూర్తయితే, ఇక్కడి సెక్రటేరియట్లో ఇగో ప్రాబ్లమ్స్‌తో లేట్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే నీటి పంపిణీలో, సాగర్ కాలువ ఆధునీకరణ పనుల్లో జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు. 150కోట్ల రూపాయలతో పనులు చేస్తామంటూ సీఎం స్వయంగా ప్రకటించినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. జిల్లాలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్, దర్శి బ్రాంచ్ కెనాల్, ఒంగోలు బ్రాంచ్ కెనాల్లో లైనింగ్ పనులు చేపట్టి వచ్చే వేసవిలో నీటిని విడుదల చేసేనాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2015లో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు: ఎమ్మెల్యే స్వామి 2015 సంవత్సరంలో కొండపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మూసీనదిపై ఆరు చెక్‌డ్యామ్‌లు, పాలేరు నదిపై ఐదు చెక్‌డ్యామ్‌లను రూ.25కోట్లలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎలాంటి కదలిక లేదన్నారు. ఆఫీసులతోపాటు సెక్రటేరియేట్ చుట్టూ తిరిగితేనే ఫైళ్లు వస్తున్నాయన్నారు. సీఎం పేషీ నుంచి సంవత్సరం క్రితం ఫైల్ వస్తే ఇంతవరకు పనులు చేపట్టలేదని అధికారుల తీరును ఎండగట్టారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎస్కేప్ ఛానళ్ల వద్ద బలవంతంగా నీళ్లు తెచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అనంతపురంలో కరువుపోయి పశ్చిమ ప్రకాశంలో వచ్చిందన్నారు. పనులు చేస్తేనే జనం వెళ్లగలుగుతాం : ఎమ్మెల్యే ముత్తుముల 2013 సంవత్సరంలో వచ్చిన తుఫాన్‌తో అంబవరం, పూసలపాడు, మోక్షగుండం చెరువులు తెగిపోయాయని, ఆ చెరువులకు వెంటనే ప్రతిపాదనలు పంపి పనులు చేస్తేనే రేపు మనం ఆ గ్రామాల్లోకి వెళ్లగలుగుతామని గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ మూడు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, 1200 అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు పడటం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేశారని, దానికి సంబంధించి 70కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి చెల్లించకుంటే ఈసారి నీటిని రవాణా చేసేవారు కూడా ఉండరన్నారు. గత ఏడాది తన నియోజకవర్గంలో 600బోర్లు నాన్ సీఆర్ఎఫ్ కింద చేస్తే ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ సీపీ వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారు: మాజీ ఎమ్మెల్యే కందుల మార్కాపురం నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారని, మనం వేసే పరిస్థితులు ఉండటంలేదని ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వాపోయారు. ఎంపీ గ్రాంట్ ఇస్తుండటంతో వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు గ్రామాల్లో నీళ్లు తోలుకుంటున్నారన్నారు. కరువు కారణంగా మిర్చి పంట ఎండిపోతే, పక్క మండలాల్లో నష్టపరిహారం చెల్లించి తమ మండలాలకు చెల్లించలేదన్నారు. తర్లుపాడు, కొనకనమిట్ల మండలాలకు చెందిన రైతులు ఫసల్ బీమా కింద డబ్బులు కట్టినప్పటికీ వారికి బీమా వర్తించలేదన్నారు. ‘నోరున్నోడికే పనులు జరుగుతున్నాయని, నాలాంటి వాడికి కావడంలేదని’ నారాయణరెడ్డి వ్యాఖ్యానించడంతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పెద్దగా నవ్వారు. వాళ్లు ఐదేళ్లు ఎమ్మెల్యేలు, మేము మూడేళ్లే.. : పాలపర్తి డేవిడ్‌రాజు నీరు–చెట్టు కింద వాళ్లు బాగా పనులు చేసుకుంటున్నారని, వాళ్లు ఐదేళ్లు ఎమ్మెల్యేలు, మేము మూడు సంవత్సరాల ఎమ్మెల్యేమని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా సభలో నవ్వులు వెలిశాయి. మీరు ముందే రావచ్చు కదా అంటూ అధికారపార్టీ శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. రేపటి నుండి తాము దళిత వాడల్లోకి వెళుతున్నామని, అక్కడి తాగునీటి సమస్యను అడుగుతారని, ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడకుండా బోర్లు మంజూరు చేయాలని ఇన్‌ఛార్జి మంత్రిని కోరారు. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో 13వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, రైతులు డీడీలు కట్టినప్పటికీ ఇవ్వలేదన్నారు. ముంపు గ్రామాల కాలనీలకు ఇళ్లు నిర్మాణ వ్యయాన్ని పెంచాలని ఇన్‌ఛార్జి మంత్రిని కోరారు. మాది ఏకాకి జీవితం: ఎమ్మెల్సీ మాగుంట జిల్లాలోని శాసనసభ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శాసనమండలి సభ్యులమైన తమది ఏకాకి జీవితమని ఎమ్మెల్యే మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించడంతో çసమావేశం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. తమకు నియోజకవర్గాలు లేకపోయినప్పటికీ శాసనసభ్యుల సమస్యలను మా సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు లేవనెత్తిన సమస్యలపై వెంటనే సంబంధిత ఉన్నతాధికారులతో సెల్ఫోన్లో మాట్లాడి నిర్ణీత గడువులోగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి శిద్దా రాఘవరావు, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, పోతుల రామారావు, దామచర్ల జనార్ధన్‌రావు, శాసనమండలి సభ్యులు పోతుల సునీత, జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు, సీపీఓ కేటీ వెంకయ్య, మాజీ శాసనసభ్యులు పాల్గొన్నారు. -
నీటిపాట్లు
మడకశిర: నెలల తరబడి నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఏ ఒక్కరూ చర్యలు తీసుకోకపోవడంతో పట్టణంలోని వడ్రపాళ్యం మహిళలంతా రోడ్డెక్కారు. తమ దుస్థితిని వివరిస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పార్వతమ్మదాసన్న ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి గురువారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. 6వ వార్డులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడినా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. మడకశిర – హిందూపురం రోడ్డుపై బైఠాయించి దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. దీంతో వాహనరాకపోకలన్నీ స్తంభించగా.. వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తాగునీరు సరఫరా చేసే పైపులు దెబ్బతిని లీకేజీలు ఎక్కువయ్యాయనీ, అందువల్లే నీరు సక్రంగా సరఫరా కావడం లేదన్నారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించాలని మున్సిపల్ అధికారులను పలుమార్లు కోరినా వారు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా తాగునీరు సరఫరా చేయాలని కోరినా స్పందించలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆందోళన చేపట్టినట్లు మహిళలు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు కదలేది లేదని రోడ్డుపైనే కూర్చున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ లింగన్న వడ్రపాళ్యం చేరుకుని మహిళలతో చర్చించారు. ఆందోళన విరమించాలని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా... మహిళలంతా ఆయనతో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఎస్ఐ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను విరమించారు. -
తీరని దాహం
పర్సెంటేజీ తమ ఇంటికొస్తే చాలనుకునే నేతలు... ప్రాజెక్టు లేటైతే అంచనాలు పెంచేద్దామనుకునే కాంట్రాక్టర్లు... నాలుగు కాసులిస్తే సర్దుకుపోయే అధికారులు.. అంతిమంగా 120 గ్రామల దాహార్తి తీర్చేందుకు రూ. కోట్ల నిధులు పారించినా... జనం గొంతు మాత్రం తడవడం లేదు. ముదిగుబ్బ మండలంలో పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులు ఐదున్నరేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ధర్మవరం : సరిగ్గా ఐదేళ్ల క్రితం 2013 జూలై 30న ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో రూ. 21.40 కోట్లతో బృహత్తర పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులకు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లోని 120 గ్రామాలకు 2014 నవంబరు నాటికి మంచినీటిని అందివ్వాలన్నది దీని లక్ష్యం. దీని కోసం జాతీయ గ్రామీణ మంచినీటి అభివృద్ధి పథకం (ఎన్‌ఆర్‌డబ్ల్యూపీ) కింద రూ. 21.40 కోట్ల కేంద్రం నిధులు మంజూరయ్యాయి. తొలివిడతగా రూ. 7 కోట్లు, మలివిడతగా మరో రూ. 14 కోట్లు ఇచ్చేలా టెండరు ఖరారు చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సత్యసాయివాటర్ సప్లై స్కీంద్వారా ఈ ప్లాంటకు వచ్చిన నీటిని శుద్ధిచేసి, రోజుకు 30 మిలియన్ లీటర్ల శుద్ధ జలాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచిననీటి పథకాలకు తాగునీటిని అందించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. తొలి విడత పనులు 2014 జనవరి నాటికే పూర్తయ్యాయి. ఆ తర్వాత రెండో విడత పనులను రూ.14.40 కోట్లతో ప్రస్తుత ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ 2014 సెప్టెంబర్ 7న భూమి పూజ చేశారు. అయితే ఆ పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో 120 గ్రామాలకు నేటికీ చుక్కనీటిని కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడువు ముగిసినా కదలికేదీ? : వాస్తవానికి 2015 సెప్టెంబర్ నాటికే కాంట్రాక్టర్ ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరగటంతో కాలపరిమితిని పెంచారు. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా మొదటి విడతలో ప్లాంట్, రెండో విడత కింద గ్రామాల్లో ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలకు అను«సంధానం చేయాల్సి ఉంది. తొలిదశలో పనులు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా... మలిదశ పనుల్లో తీవ్ర జాప్యం జరగుతోంది. వివిధ సాంకేతిక కారణాలను చూపుతూ పనులు చేయడం లేదు. 2014 సెప్టెంబర్ 7న రెండో దశ పనులు ప్రారంభమయితే ఇంకా చిన్నా చితకా పనులు సాగుతూనే ఉన్నాయి. కనీసం వచ్చే వేసవికైనా గ్రామీణులకు తాగునీరు అందుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పట్టించుకునేవారేరీ? ఏళ్లుగా ప్రాజెక్టు పనులు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. కంట్రాక్టర్‌కు రూ.కోట్లు చెల్లిస్తున్నా పనులెందుకు పూర్తి కావడంలేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చేవారులేరు. ప్రజలేమో గుక్కెడు తాగునీటికి పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. రూ. కోట్లు ఖర్చుచేసినా.. పొలాల గట్లపైన ఇబ్బందులు పడుతూ నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాత్రం మారలేదు. ప్రాజెక్ట్ పేరు : సమగ్ర మంచినీటి పథకం (ముదిగుబ్బ మండలం) లక్ష్యం : ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా లబ్ధి : సుమారు 90,000 మందికి పొలాల వద్దనుంచి తాగునీటిని తెచ్చుకుంటున్న నాగారెడ్డిపల్లి గ్రామస్తులు -
మిషన్ భగీరథపై బేస్ లైన్ సర్వే
- 200 మంది విద్యార్థులు, పరిశోధకులతో నిర్వహణ - 12 వేల ఇళ్లకు వెళ్లి అభిప్రాయసేకరణ - సామాజిక, ఆర్థిక మార్పులపై పరిశీలన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ భగీరథ వల్ల కలిగే సామాజిక, ఆర్థిక మార్పులపై వివిధ కళాశాలల విద్యార్థులు బేస్ లైన్ సర్వే చేశారు. తాగునీటి సరఫరాతో పాటు గ్రామాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లోని పారిశుధ్య పరిస్థితులు, పరిశ్రమలకు అందుబాటులో ఉన్న నీటి వనరుల స్థితిపై కూడా ఈ సర్వే నిర్వహించారు. యూనిసెఫ్–సెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు, పరిశోధకులు నిర్వహించారు. ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు సర్వే చేశారు.1,424 గ్రామాలతో పాటు వివిధ నగర పంచాయతీలకు చెందిన 76 వార్డుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ప్రతీ గ్రామంలోని 8 ఇళ్ల చొప్పున మొత్తంగా 12 వేల ఇళ్లల్లో సర్వే నిర్వహించారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్) చరిత్రలోనే ఇది అతి పెద్ద సర్వే అని నిర్వాహకులు తెలిపారు. సర్వేలోని సమాచారాన్ని ఈ నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు విశ్లేషణ చేస్తారు. ముసాయిదా నివేదికను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31వ తేదీలోగా పూర్తిచేస్తారు. తుది నివేదికను నవంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ మధ్య తయారు చేస్తారు. బేస్‌లైన్ సర్వే తర్వాత మిడ్ టర్మ్ సర్వే నిర్వహిస్తారు. చివరగా ఫైనల్ సర్వే జరుగుతుంది. కాగా, ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి సర్వే ఫలితాలను విశ్లేషించి మధ్యంతర నివేదికలను యునిసెఫ్–సెస్ తయారు చేస్తుంది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉండే ఉన్నతస్థాయి కమిటీ ఈ నివేదికలను విశ్లేషించి ప్రభుత్వానికి అందజేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, గిరిజన ఆవాసాలకు సంబంధించి ప్రత్యేక సర్వే ఫలితాన్ని విడుదల చేస్తారు. నివేదిక స్వరూపంపై సలహా కమిటీ భేటీ సురక్షిత మంచినీటి సరఫరాతో పాటు సురక్షిత నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మిషన్ భగీరథ బేస్ లైన్ సర్వే సలహా కమిటీ అభిప్రాయపడింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో మరింత ప్రభావవంతంగా తాగునీటిని సరఫరా చేయడానికి బేస్ లైన్ సర్వే నివేదిక ఉపయోగపడుతుందని కమిటీ పేర్కొంది. మిషన్ భగీరథ బేస్ లైన్ సర్వే సలహా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. బేస్ లైన్ సర్వే ముగియడంతో నివేదిక స్వరూపం, ఏయే అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయాలపై చర్చించారు. ప్రస్తుతమున్న తాగునీటి వనరులు, వినియోగం, నాణ్యతతో పాటు నీటి సంబంధిత వ్యాధుల విషయాలను నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. నీటి కొరతతో మహిళలు, విద్యార్థినులు, గర్భిణులు, చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు యునిసెఫ్ రూపొందించిన ‘సుస్థిర అభివృద్ధి’ లక్ష్యాలను ఈ నివేదికలో పొందుపరచనున్నారు. ఈ సమావేశంలో సెస్ డైరెక్టర్, సర్వే సమన్వయకర్త డాక్టర్ గాలెబ్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, కన్సల్టెంట్ నందారావు, సెస్ ప్రొఫెసర్ రేవతి, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈ నెలాఖరుకు తాగునీటి సమస్య పరిష్కారం
♦ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు సాగునీరు ♦ లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామస్తులకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హామీ ♦ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని మండిపాటు లింగాల : ఈ నెలాఖరుకంతా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం లింగాల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తాతిరెడ్డిపల్లె గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెంటనే లింగాల ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రజలు తాగునీరు అందించాలని కోరారని గుర్తు చేశారు. అప్పటినుంచి ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1500 అడుగుల లోతు వరకు మూడు బోరుబావులను తవ్వించానని చెప్పారు. అలాగే పార్నపల్లె ఆఫ్ ల్యాండ్ స్కీం నుంచి ప్రత్యేక సంప్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేశామన్నారు. అయినా ఆ గ్రామస్తుల దాహార్తి తీర్చలేక పోయామన్న బాధ తనలో మిగిలి పోయిందన్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం కోసం తన సొంత నిధులతో పార్నపల్లె భారీ తాగునీటి పథకం ప్రధాన పైపులైన్ ద్వారా నేర్జాంపల్లె గ్రామ సమీపం నుంచి సుమారు 5కిలో మీటర్ల మేర పైపులైన్ ఏర్పాటుచేసి ఈ నెలాఖరు నాటికి గ్రామానికి తాగనీరు అందిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అంతవరకు ట్రాక్టర్ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేయిస్తామన్నారు. నేర్జాంపల్లె నుంచి పైపులైన్ ఎలా వేయాలనే అంశంపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే సర్వే నిర్వహించాలని ఏఈ శివారెడ్డికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం సీబీఆర్‌లో నీరు అడుగంటిపోయిందని, దీంతో కడప, అనంతపురం జిల్లాలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. గ్రామాలలో కనీసం ప్రజలకు తాగునీటిని అందించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదన్నారు. జలయజ్ఞం ద్వారా 90 శాతం పనులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపడితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 10 శాతం పనులను కూడా చేపట్టలేదన్నారు. ఈ కారణంగా గ్రామాలలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తాయన్నారు. వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన గండికోట, పైడిపాలెం, చిత్రావతి ఎత్తిపోతల పథకాలకు ట్రయల్ రన్ నిర్వహించి బిల్లులు చేసుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రతి ఎకరాకు సాగునీరు అందించే పనులను పూర్తిచేసి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తామన్నారు. అధికారులపై మండిపడ్డ ఎంపీ తాగునీరు అందించాలని లింగాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న తాతిరెడ్డిపల్లె గ్రామ ప్రజల పట్ల ఎంపీడీఓ దురుసుగా వ్యవహరించడంపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్దారు. సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు వారిపై తిరగబడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలా ప్రవర్తిస్తే తానే ధర్నా నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ ఆదినారాయణ, తహసీల్దార్ ఎస్ఎం ఖాసీం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివారెడ్డి, ఏవో నాగభూషణరెడ్డి, మండల యూత్ కన్వీనర్ మనోహర రెడ్డి, లింగాల సింగిల్ విండో అధ్యక్షుడు మల్లికేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, తాతిరెడ్డి పల్లె గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
నిధులుండీ కక్కుర్తి..!
♦ విజయనగరం పట్టణంలో తీరని దాహార్తి ♦ ఏపీఎండీపీ, అమత్ పథకాల కింద రూ.73 కోట్లు కేటాయించిన కేంద్రం ♦ రెండు పథకాల పూర్తయితే 14 వేలకు పైగా నూతన కుళాయిల ♦ మంజూరుకు అవకాశం ♦ మూడున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్న పనులు ప్రాంతం : విజయనగరం హోదా : జిల్లా కేంద్రం, సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు: 40 2011 అధికారిక లెక్కల ప్రకారం జనాభా :2.44 లక్షలు ప్రస్థుతం నివసిస్తున్న జనాభా : సుమారు 4 లక్షలు మంచి నీరు అందించే పథకాలు :3 పట్టణ ప్రజలకు అవసరమైన నీరు:36 ఎంఎల్డీ మూడు పథకాల నుంచి లభ్యమవుతోన్న నీరు :17 ఎంఎల్డీ ప్రస్తుతం ఉన్న కొరత :19 ఎంఎల్డీ ప్రతి రోజు వ్యక్తికి ఇవ్వాల్సిన నీరు :140 ఎల్పీసీడీ ప్రస్తుతం ఇస్తున్న నీరు : 70 ఎల్పీసీడీ వ్యక్తిగత కుళాయిలు :19,880 పబ్లిక్ కుళాయిలు: 458 మీటరు కుళాయిలు :434 చేతిపంపులు : 1080 విజయనగరం మున్సిపాలిటీ: త్వరలో కార్పొరేషన్ హోదా దక్కించుకోనున్న విజయనగరం సెలక్షన్ గేడ్ర్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు మోక్షం లభించడం లేదు. ఇక్కడి ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా ప్రయోజనం లేకపోతుంది. పనుల ప్రగతిపై అధికారులు, మున్సిపల్ పాలకవర్గం దృష్టి్ట సారించకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విజయనగరం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీఎండీపీ, అమత్ పథకాల కింద మొత్తంగా రూ.73 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తంతో పట్టణ ప్రజలకు నిరంతరాయంగా పూర్తి స్థాయిలో నీటిని అందించాలన్నది ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ఏపీఎండీపీ పథకం పనులు పూర్తయితే పేద ప్రజలకు రూ.200కే 7 వేల నూతన కుళాయిలు, అమత్ పథకం పనులు పూర్తయితే మరో 7,414 కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే రెండు పథకాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా పనుల్లో ప్రగతి లేకపోవడంతో పట్టణంలో దాహం కేకలు తప్పడం లేదు. మరోవైపు కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయాల్సిన పాలకులు, అధికారులు నివేదికల్లో నూతన కుళాయిలు మంజూరు సంఖ్య చూపించుకునేందుకు కసరత్తు చేయడం విమర్శలకు తావిస్తోంది. దశాబ్దం క్రితం అనధికారికంగా ఏర్పాటైన కుళాయి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేసి వాటిని ఈ పథకాల కింద మంజూరు చేశామని చూపించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. కేవలం కాగితాల్లో లెక్కలు చూపించుకునేందుకు పడుతున్న తాపత్రయం ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించడం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. నిధులుండీ కక్కుర్తి బుద్ధి చూపించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నత్తేనయం.. దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్లు మార్పు చేయడంతో పాటు కొత్త ప్రాంతాల్లో పైప్లైన్ల ఏర్పాటు, రక్షిత మంచి నీటి పథకాల వద్ద నూతన మోటార్లు బిగించటం, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ల సౌకర్యం కల్పించడం, కొత్తగా వాటర్ ట్యాంక్‌లు నిర్మించడం తదితర కార్యక్రమాల కోసం 2014లో ప్రభుత్వం ఏపీఎండీపీ పథకంలో రెండు ప్యాకేజీల కింద రూ.48 కోట్ల నిధులు మంజూరు చేసింది. కేటాయించిన నిధులతో ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇందులో ప్యాకేజీ–1 కింద చేపట్టాల్సిన పనులు పూర్తికాగా, ప్యాకేజీ–2లో చేపడుతున్న పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్యాకేజీలో మొత్తం 313 కిలోమీటర్ల పైప్లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడేళ్లలో 236 కీ.మీ మేర పూర్తి చేయగలిగారు. పూల్‌బాగ్‌కాలనీ శివారుల్లో ఉన్న వ్యాసనారాయణమెట్ట ప్రాంతంలో రూ.96 లక్షల వ్యయంతో 5 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యంతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పూల్‌బాగ్‌లో నిర్మించతలపెట్టిన మరో రిజర్వాయర్ నిర్మాణం ఇప్పటికీ పునాదుల దశలోనే ఉంది. అమత్ పథకంలో రూ.25 కోట్లు కేటాయింపులు.. విజయనగరం పట్టణ వాసుల దాహార్తిని తీర్చేందుకు అమత్ పథకం కింద 2015–16, 2016–17 సంవత్సరాలకు సంబంధించి రూ.25 కోట్లు కేటాయించారు. ఈ ని«ధులతో రామతీర్థం, నెల్లిమర్ల రక్షిత మంచి నీటి పథకాల వద్ద తాగు నీటి వనరులు అభివద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రెండు పథకాల నుంచి 6 ఎంఎల్డీ నీరు వస్తుండగా, అమత్ పనులు పూర్తయితే 16 ఎంఎల్డీ నీరు పంపింగ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అనధికారిక కుళాయిలను గుర్తిస్తున్నాం.. గతంలో మున్సిపాలిటీలో చాలా వరకు అనధికారిక కుళాయిలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని గుర్తించే పని మొదలుపెట్టాం. ఏపీఎండీపీ, అమత్ పథకాల కింద రెగ్యులరైజ్ చేస్తాం. ఈ రెండు పథకాల పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. సాంకేతిక ఇబ్బందులు అదిగమించాల్సి ఉంది. – గణపతిరావు, ఇన్చార్జి ఎంఈ, విజయనగరం మున్సిపాలిటీ. -
‘తన్నీరు ఇల్లె తంబీ’
► మాకే లేవు మీకెలా ► కృష్ణ నీటిపై ఏపీ ► వర్షాలు కురిపించలేం ► చెన్నైలో దాహార్తికి తంటాలు వర్షాలు కురవక జలాశయాలు ఎండిపోయి మాకే నీళ్లు లేవు. మీకెలా ఇస్తాం.. తన్నీరు ఇల్లె తంబీ (నీళ్లు లేవు తమ్ముడు) అంటూ తమిళనాడుపై యుగళగీతం పాడాయి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు. తాగునీరు, సాగునీరు కోసం తిప్పలు పడుతున్న తమిళనాడు పొరుగురాష్ట్రాలపై ఆధారపడగా వారు సైతం మొండిచేయిచూపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై దాహార్తిని తీర్చే జలాశయాల్లో పూండి జలాశయం ఎంతో ముఖ్యమైంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3,231 మిలియన్ ఘనపుటడుగులు కాగా ప్రసుత్తం 20 మిలియన్ ఘనపుటడుగులు మాత్రమే ఉంది. గత ఏడాది జూలై 17వ తేదీన 776 మిలియన్ ఘనపుటడుగుల నీరు నిల్వ ఉంది. గత ఏడాది తగిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తమిళనాడులోని జలాశయాలు నిండలేదు. దీంతో నాలుగు నెలల క్రితమే పూండి జలాశయం ఎండిపోయింది. పుళల్, చెంబరబాక్కం, చోళవరం, వీరాణం జలాశయాలు ఎడారిని తలపిస్తుండగా చెన్నైలో తాగునీటి ఇబ్బందులు మరింతగా పెరిగిపోయాయి. ఈ దుర్భరస్థితిని తట్టుకునేందుకు మాంగాడు క్వారీల నుంచి నీరు, పోరూరు జలాశయం నీటిని శుద్ధి చేసి చెన్నైకి పంపుతున్నారు. ఇదిగాక నైవేలీ సొరంగ నీరు, సముద్రపు నీటి నిర్లవీకరణతో తాగునీటికి అవసరాలను ఓమేరకు తీరుస్తున్నారు. వ్యవసాయ బావులు, బోర్ల నీటిని చెన్నైకి తరలిస్తున్నా చాలడం లేదు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కండలేరు జలాశయం ద్వారా పూండికి కృష్ణానది నీరు విడుదల చేయడం పరిపాటి. అయితే కృష్ణనీరు రాలేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్యన జరిగిన ఒప్పందం ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ వరకు కండలేరు నుంచి పూండికి 8 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆ తరువాత జూలై నుంచి అక్టోబరు వరకు మరో 4 టీఎంసీలను విడుదల చేయాలి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి తరువాత కృష్ణనీరు విడుదల చేయకపోవడంతో తమిళనాడు అధికారులు ఏపీకి ఉత్తరం రాశారు. అయితే ఏపీ ప్రభుత్వం నీటి విడుదల చేయలేమంటూ చేతులెత్తేసింది. కావేరీలో నీళ్లు లేవు : కర్ణాటక మంత్రి కావేరి వాటా జలాలను తమిళనాడుకు విడుదల చేసేలా ఆదేశించాలని సుప్రీం కోర్టులో తమిళనాడు ప్రభుత్వ న్యాయవాదులు వాదన వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి పటేల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, గత నెల 1వ తేదీ నుంచి ఈనెల 17వ తేదీ వరకు 44 టీఎంసీల నీటిని తమిళనాడుకు వదలాల్సి ఉంది. అయితే పులిగుండు జలాశయం నుంచి 2.2 టీఎంసీల నీటిని వదిలినట్లు రికార్డులు చెబుతున్నాయని అన్నారు. తమ రాష్ట్రానికే తగినంత నీరు అందుబాటులోని తరుణంలో తమిళనాడు ఒత్తిడి చేస్తోందని చెప్పారు. గత ఏడాది జూలైలో కర్ణాటక జలాశయాల్లో 57 టీఎంసీల నీళ్లు ఉండగా, ప్రస్తుతం 26 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని అన్నారు. అందుబాటులో ఉన్న నీటితో కర్ణాటక అవసరాలే తీరనపుడు తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమిళనాడుకు తన్నీరు కోసం కర్ణాటకలో వర్షం కురిపించలేమని ఆయన ఎద్దేవా చేశారు. వర్షాలు లేవు.. నీళ్లు రావు : ఆంధ్రప్రదేశ్ ఏపీకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, కండలేరు జలాశయంలో 8 టీఎంసీల నిల్వ ఉంటేనే తమిళనాడుకు నీళ్లు ఇవ్వగలం, కనీసం 5 టీఎంసీలైనా ఉండాలని అన్నారు. అయితే ఇప్పుడున్న నీళ్లు మాకే చాలవని, వర్షాలు పడిన తరువాతనే లేకుంటే ఎటువంటి పరిస్థితిల్లోనూ నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తమకివ్వాల్సిన రూ.460 కోట్ల బాకీని ముందు చెల్లించాలని ఆయన తిరుగుబాణం వేశారు. -
11,000 కోట్ల భారం
► సాగు, తాగునీటి ప్రాజెక్టులపై జీఎస్టీ ఎఫెక్ట్ ► తగ్గించాలంటూ కేంద్రంపైఒత్తిడి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలపై జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపనుంది. నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ తాగునీటి పనులు, డబుల్ బెడ్రూం ఇళ్లపై దాదాపు రూ.11 వేల కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రస్తుత వ్యాట్ ప్రకారం వర్క్స్ కాంట్రాక్టులపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాలో జమవుతుండటంతో ప్రాజెక్టులపై రూ.వేలాది కోట్లు వెచ్చించినప్పటికీ అందులో 5% తిరిగి ఖజానాకు వచ్చి చేరేది. కానీ జీఎస్టీలో ఖరారు చేసిన పన్ను స్లాబ్‌ల ప్రకా రం వర్క్స్ కాంట్రా క్టులపై 18% పన్ను పడినట్లయింది. దీంతో ప్రాజెక్టులకయ్యే వ్యయం రూ.లక్ష కోట్లలో రూ.18 వేల కోట్లు జీఎస్టీకి జమ చేయాల్సి ఉంటుంది. అందులో సగం రాష్ట్ర ఖాతాకు, మిగతా సగం కేంద్రానికి జమవుతుంది. దీంతో దాదాపు రూ.9 వేల కోట్లు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ పెరిగిందనే కారణంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాలూ పెరిగే ప్రమాదముందని పేర్కొంటున్నాయి. వరుసగా కేంద్రంపై ఒత్తిడి మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టుల పనుల ను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఇప్పటికే పలు మార్లు కేంద్రాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇటీవలే ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖలు రాశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేం దుకు వెళ్లిన మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయాన్ని ఆర్థిక మంత్రికి నివేదించారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం.. మరోసారి ఆర్థిక మంత్రిని కలసి ప్రాజెక్టులకు జీఎస్టీ పన్నును కనిష్ట స్లాబ్‌కు తగ్గించాలని విన్నవించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
కమిటీ వల్ల మీకేంటి నష్టం?
- ఎన్జీటీ ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీపై ఎందుకు ఆందోళన? - పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు - ఎన్జీటీ ఉత్తర్వులను నిలిపేసేందుకు నిరాకరణ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్ఎల్ఐఎస్) విషయంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేసేందుకు హైకోర్టు ప్రాథమికంగా నిరాకరించింది. పీఆర్ఎల్ఐఎస్ విషయంలో జరుగుతు న్న చట్ట ఉల్లంఘనలు, ప్రాజెక్టు సాగుతున్న తీరుతెన్నులు, అటవీ ప్రాంతంలో జరుగు తున్న నిర్మాణాలు తదితర విషయాల్లో నిజానిజాలను తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని, ఎన్జీటీ ఉత్తర్వులను చూసి ప్రభుత్వం ఎందుకు ఆందోళన చెందుతోం దని నిలదీసింది. ఎన్జీటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిజ నిర్ధారణ కమిటీ వంటి దేనని, దాని పనిని దాన్ని చేయనివ్వాలని స్పష్టం చేసింది. కమిటీ తన నివేదికను ఎన్జీటీకి ఇవ్వడంపై అభ్యంతరం ఉంటే, కమిటీ నుంచి తామే నివేదికను తెప్పించుకుంటామని తేల్చిచెప్పింది. ఈ విషయంలో స్పష్టతనిచ్చేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గడువు కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. బుధవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనా థన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణ చట్ట నిబంధ నలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవ హారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉల్లంఘనలను, ప్రాజెక్టు తీరు తెన్నులను తెలుసుకునేందుకు వీలుగా స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన ఎన్జీటీ గత నెల 30న ఎన్జీటీ విశ్రాంత సభ్యులు ప్రొఫెసర్ ఏఆర్ యూసఫ్ చైర్మన్‌గా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్జీటీ ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పనులు ఆపమని ఎన్జీటీ చెప్పలేదు కదా పిటిషనర్ల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, ఎన్జీటీ ఉత్తర్వులు ఏకపక్షమని ఆరోపించారు. ఎన్జీటీలో ఎక్స్పర్ట్ సభ్యుడు లేరని, తగిన ఫోరం లేకపోయినప్పటికీ ఈ ఉత్తర్వులు జారీ చేసిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని వివరించారు. ఈ విషయంలో ఎన్జీటీ తమ అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోలేదని విన్నవించారు. ఈ సమయం లో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘కమిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి. ప్రాజెక్టు పనులను ఆపమని ఎన్జీటీ చెప్పలేదు కదా’అని వ్యాఖ్యానిం చింది. దీనికి ఏఏజీ సమాధానమిస్తూ, తాము కేవలం తాగునీటి ప్రాజెక్టును మాత్రమే చేపడుతున్నామని, సాగునీటి ప్రాజెక్టును చేపట్టబోమని హామీ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ఎన్జీటీ స్వతంత్ర కమిటీని నియమించిందని, జూలై 19 నాటికి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించిందని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ, ‘ఎన్జీటీకి నివేదిక ఇవ్వడంపై ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే, మేమే ఆ కమిటీ నుంచి నివేదిక తెప్పించుకుంటాం. అందుకు సంబంధించి ఆదేశాలు ఇస్తాం..’అని స్పష్టం చేసింది. -
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
నార్నూర్(ఆసిఫాబాద్): ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఉట్నూర్ ఆర్డీవో విద్యాసాగర్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. 2014, 2016– 17 ఓటరు జాబితాలో ఉన్న తేడాను గమనించి సవరించాలని తహసీల్దార్ ముంజం సోమును ఆదేశించారు. మండలంలోని సుంగాపూర్ తండా, గోండుగూడ, కోలాంగూడ గూడేలకు ఒకే చేతిపంపు ఉండడంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ గ్రామంలో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సుంగాపూర్ సమీపంలో చెరువు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంసీ సోహాన్‌సింగ్, ఆర్ఐ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ వ్యవస్థలు నిధులపై దృష్టి పెట్టాలి
ఒంగోలు అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలందించి మున్సిపల్ వ్యవస్థలు సొంత నిధులను పెంచుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం అన్నారు. ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్మించిన కళాప్రాంగణం ప్రారంభించారు. రూ.40కోట్లతో ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలు వరకు ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైపులైన్ పనులు, రూ.9కోట్లతో గోరంట్ల కాంప్లెక్స్ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి పైలాన్లు ఆవిష్కరించారు. అనంతరం ఏ1 కన్వెన్షన్ హాలులో పౌర సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. స్మార్ట్ సిటీల ఏర్పాటులో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేటికీ దేశంలో మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేని గ్రామాలున్నాయని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మున్సిపాలిటీలు ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందిస్తే పన్నుల రూపంలో నిధులు పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా మున్సిపాలిటీలకు రూ.85వేల కోట్లు కేటాయించామన్నారు. జిల్లాకి సంబంధించి రామాయపట్నం పోర్టు ఏర్పాటుకి కృషి చేస్తామని తెలిపారు. వాన్‌పిక్ పై చర్యలు తీసుకొని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిపినట్లు చెప్పారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపితే పరిశీలించి తప్పక సహకరిస్తానన్నారు. చీమకుర్తి నుంచ హైవే ఏర్పాటు చేస్తామని వివరించారు. తన రాజకీయ ప్రవేశం ఒంగోలు నుంచే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. 1977లో ఎంపీగా మొదటిసారి ఒంగోలు నుంచే పోటీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు అధ్యక్షత వహించారు. -
తాగునీటి సమస్యపై వైఎస్ఆర్సీపీ పోరుబాట
-
కడప జిల్లాలో తాగునీటికి కటకట
-
తెలంగాణకు 1.5.. ఏపీకి 6.5
-
మనకు 1.5.. ఏపీకి 6.5
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో 8 టీఎంసీల నీటిని పంపిణీ చేసిన కృష్ణా బోర్డు సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 8 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు పంచింది. అందులో తెలంగాణకు 1.5 టీఎంసీలు, ఏపీకి 6.5 టీఎంసీలు కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించగా.. ఏపీకి కేటాయించిన దానిలో సాగర్ కుడి కాల్వకు 2.5 టీఎంసీలు, కృష్ణా డెల్టా వ్యవస్థ కింది అవసరాలకు 4 టీఎంసీలు ఇచ్చింది. మే నెల చివరి వరకు ఈ నీటిని వినియోగించుకోవాలని సూచిస్తూ.. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ శుక్ర వారం రాత్రి ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు లేఖలు రాశారు. సాగర్‌లో 502 అడు గులు, శ్రీశైలంలో 765 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకునేందుకు అంగీకరిం చారు. ఈ మేరకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. నీటి విడుదలపై ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ భేటీ ఉండదని నీటి పారుదల వర్గాలు పేర్కొన్నాయి. టెలీమెట్రీపై వెనక్కి తగ్గిన బోర్డు... టెలీమెట్రీ పరికరాల విషయంగా రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో బోర్డు వెనక్కి తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలీమెట్రీకి ప్రతిపాదించగా.. దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్‌కు మార్చా లన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ వరకు మధ్య లో 4,500 ఎకరాలకు నీళ్లిచ్చే ఎత్తిపోతల పథ కాలను ఏపీ నిర్వహిస్తోందని.. బంకచర్ల వరకు తాగునీటి పథకాలు సైతం ఉన్నాయని తెలంగాణ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇక సాగర్ ఎడమ గట్టు కాల్వలపై ఏపీ, తెలంగాణ సరిహద్దులో 101.36 కిలోమీటర్ వద్ద ప్రతిపాదించిన పరికరాల ఏర్పాటును 102.63 కిలోమీటర్‌కు మార్చాలన్న నిర్ణయా న్నీ వెనక్కి తీసుకుంది. అలా చేస్తే ఏపీ పరిధి లోని నూతిపాడు కింద రెండు ఎత్తిపోతల పథకాల నీటి వినియోగం లెక్కలోకి రాదని రాష్ట్రం స్పష్టం చేసింది. అభిప్రాయాలు చెప్పండి... కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నియంత్రణపై బోర్డు రూపొందించిన వర్కింగ్ మ్యాన్యువల్‌పై ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరా లు తెలపాలని బోర్డు మరోమారు కోరింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా నియంత్రణలు ఉంటాయని బోర్డు తెలుపగా.. తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక బోర్డు కేవలం వాటి నిర్వహణను మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ కేటాయించిన ఎన్‌బ్లాక్ కేటాయింపులకు అనుగుణంగానే పంపిణీ జరగాలని, అంతకుమించి ఇతర ప్రత్యామ్నాయాలు వేటినీ ఒప్పుకోబోమని స్పష్టం చేసింది. అయితే దీనిపై లిఖితపూ ర్వకంగా అభిప్రాయాలు తెలపాల్సి ఉంది. ఇక నీటి వినియోగ ప్రోటోకాల్, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి విడుదల తదితర అంశాల పైనా బోర్డు పలు వివరణలు కోరింది. -
సంక్షేమ పథకాల్లో రాష్ట్రం అగ్రగామి
► అన్ని కులాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం ► లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుతో తాగునీటి సమస్యకు చెక్ ► కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం ► మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కేశంపేట(షాద్‌నగర్): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అల్వాల గ్రామంలో బీరప్ప ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని ముఖ్యకూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అభివృద్ధి పథకాల అమల్లో రాష్ట్రం అగ్రాగామిగా ఉందన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తయితే తాగునీటి సమస్య తీరి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని 18 సంవత్సరాలు నిండిన గొల్ల,కురుమలు సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి 75శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 గొర్రెలను, ఒక పొట్టేలును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్రంలోని అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకొన్న కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. అన్ని కులవృత్తులు అభివృద్ధి చెందేలా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కా ర్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మార్కెట్‌కమిటీ చైర్మెన్ లిం గారం యాదమ్మ, వైస్ చైర్మెన్ వెంకట్‌రెడ్డి, సర్పంచి విజయేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్‌గౌడ్, లక్ష్మీనారాయణ , రాంబల్ నాయక్, జమాల్‌ఖాన్, నారాయణరెడ్డి, వేణుగోపాలాచా రి, యాదగిరి రావు, కొత్తూరు, కొందూ రు టీఆర్ఎస్ నాయకులు,పాల్గొన్నారు. -
కలెక్టర్ గారూ.. కనికరించండి
ఒక వైపు కరువు.. ఇంకో వైపు వలసలు.. మరో వైపు వ్యవసాయోత్పత్తులకు ధర లేక దిగాలు పడ్డ రైతులతో జిల్లా అతలాకుతలమవుతోంది. కలెక్టరేట్లో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు ఉద్యోగులను వెక్కిరిస్తున్నాయి. రెవెన్యూ సమస్యలు తీరక రైతులు విలవిల్లాడుతున్నారు. ప్రధానమైన అభివృద్ధి ప్రాజెక్టులన్నీ పడకేశాయి. సాగు, తాగునీటి సమస్యలతో పల్లె జనంఅల్లాడుతున్నారు. ఈ తరుణంలో జిల్లాకు కొత్త కలెక్టర్ ప్రద్యుమ్న వస్తున్నారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కరువు నేలపై కనికరం చూపాలని జనం కోరుకుంటున్నారు. తిరుపతి : జిల్లాలో పల్లెజీవనం దుర్భరంగా మారింది. కరువు విలయ తాండవం చేస్తోంది. తాగునీరు లేక 15 మండలాల్లో జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. ఉపాధి పనులు దొరక్క మండు వేసవిలోనూ పది వేల మందికి పైగా రైతులు, కూలీలు నిత్యం వలస వెళ్తున్నారు. కుప్పం పరిసర మండలాల నుంచి, పలమనేరు, మదనపల్లి ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే జిల్లా వాసులు పెరిగారు. సరైన ఉపాధి పనులు దొరక్కపోవడం ఒక కారణమైతే, చేసిన పనులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం మరో కారణం. మరో వైపు రైతులు పలు రకాల సమస్యలతో ఆర్థికంగా నష్టపోయారు. ప్రధానంగా పండించిన పంటకు సరైన గిట్టుబా«టు ధర లేక మామిడి, టమాటా రైతులు రూ.200 కోట్లకు పైగా నష్టపోయారు. వేసవి ఎండలు పెరిగి పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు లేక, సుదూర ప్రాంతాలకు రవాణా చేయలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికితోడు 2015–16 సీజన్ల పంట నష్టపోయిన రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.128 కోట్లకు గాను రూ.20 కోట్లు నిలిచిపోయింది. ఆన్లైన్ సమస్యల వల్ల 6 వేల మంది రైతులకు పంపిణీ ఆగిపోయింది. జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలు ఆగిపోయాయి. అంగన్వాడీ వర్కర్లకు నాలుగు నెలలుగా జీతాలు అందలేదు. జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఆగిపోయింది. రెవెన్యూ సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగాయి. సర్వేయర్లు లేక మండలాల్లో భూ వివాదాలు, వాటి తాలూకు ఫిర్యాదులు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోలేదు. చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో భూములకు విపరీతంగా ధరలు పెరగడంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయి. తిరుపతి పరిసరాల్లోని హాథీరాంజీ మఠం భూములు 800 ఎకరాలకు పైగా ఆక్రమణల్లో ఉన్నాయి. వీటికి తోడు దేవాదాయ, రెవెన్యూ, వాగు పోరంబోకు భూములు సైతం అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. జిల్లాలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. స్వర్ణముఖి నదిలో విలువైన ఇసుకను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్న ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మైనింగ్ శాఖ పూర్తిగా నిద్రావస్థలో ఉంది. ఇకపోతే వైద్య రంగంలో కీలకంగా వ్యవహరించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో వైద్యం అస్తవ్యస్తంగా మారింది. నేడు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్ ప్రద్యుమ్న గురువారం తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రెవెన్యూ ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీజేఏసీ రాష్ట్ర కోశాధికారి నర్సింహులు నాయుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్వోల సంఘం నేతలు భక్తవత్సలనాయుడు, బాలాజీరెడ్డి తదితరులు కలిసి కలెక్టర్‌కు సాదర స్వాగతం పలికారు. -
బాలయ్యా.. ఇటువైపూ చూడయ్యా..
హిందూపురంలో తాగునీటి సమస్యపై మహిళల ఆగ్రహం ఆరునెలలుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని మండిపాటు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా శాంతియుత నిరసన చేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జి హిందూపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో తాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే రూ. 250 కోట్లతో ప్రత్యేక పైపులైన్ వేయించి పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా తీరుస్తానని హామీ ఇచ్చిన బాలకృష్ణ.. ఆరు నెలలుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో వేలాదిమంది మహిళలు ఖాళీ బిందెలను తలపై పెట్టుకుని స్థానిక చిన్నమార్కెట్ వద్ద నుంచి సద్భావన సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దున్నపోతులపై ‘ఎమ్మెల్యే బాలకృష్ణ’ అని రాసి తీసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దున్నపోతులను తీసుకువచ్చిన వారిపై లాఠీచార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. పోలీసులు అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ శాంతియుత నిరసనను అడ్డుకుంటున్నారని నవీన్‌నిశ్చల్ ధ్వజమెత్తారు. అనంతరం సద్భావన సర్కిల్లో మండుటెండలోనే రోడ్డుపై బైఠాయించారు. 15 మంది వైఎస్సార్ సీసీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెరపై హీరో.. రియల్‌గా జీరో.. మహిళలంతా ఖాళీబిందెలు నెత్తిన పెట్టుకుని ‘నీళ్లు కావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘చూడు.. పురం వైపే చూడు.. మరోవైపు చూస్తే ప్రజాగ్రహాన్ని తట్టుకోలేవు..’, ‘తెరపై హీరో.. రియల్‌గా జీరో..’, ‘గుక్కెడు నీటికోసం శోధన.. గుండె లోతుల్లో వేదన.. వద్దురా నాయనా టీడీపీ పాలనా..’ అనే నినాదాలను హోరిత్తిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శిం చారు. ప్రధాన రహదారిలో ఖాళీబిందెలతో తోరణాలు కట్టారు. సుమారు రెండు గంటల పాటు ప్రధాన రహదారిలో రాకపోకలు స్తంభించి పోయాయి. ప్రజల దాహార్తి తీర్చలేని గుడ్డి, చెవిటి ప్రభుత్వానికి ప్రజాగళాన్ని వినిపించడానికే తాము మహాధర్నా చేపట్టామని నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ తెలిపారు. హిందూపురంలో నీటిఎద్దడి నివారణకు బాలకృష్ణ శాశ్వత పరిష్కరం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. -
తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం: లోకేష్
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మరోసారి నోరు జారారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిగా తూర్పుగోదావరి జిల్లాలో చేసిన తొలి పర్యటనలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గతంలో అంబేద్కర్ జయంతిని వర్థంతి అంటూ వ్యాఖ్యానించి వివాదంలో ఇరుక్కున్న లోకేష్ తీరు మారలేదని మరోసారి రుజువయింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ లోకేష్ అన్న మాటలు విని సామాన్య జనం అవాక్కయ్యారు. అంతకుముందు జి.మేడపాడు సభలో కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ ఉప ముఖ్యమత్రి పేర్కొనగా ఆ వెంటనే మరోసభలో లోకేష్ తాగునీటి సమస్య సృష్టించడమే తన లక్ష్యమంటూ పేర్కొనడం ఆసక్తిగా మారింది. తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పడానికి బదులు స్వయంగా మంత్రిగారు ఇలా చెప్పడంతో కరప వాసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇప్పటికే లోకేష్ తీరుతో పెద్ద దుమారం రేగుతోంది. అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది. దానికి తోడు ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతా తాగునీటి సమస్య ఉంది. లోకేష్ మామ బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో తాగునీటిని బిందెల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆందోళనకు దిగారు. ఇక ఇప్పుడు ఏకంగా గోదావరి జిల్లాకు వెళ్లి అక్కడ కూడా తాగునీటి సమస్య ఏర్పాటు చేస్తాననడం మరోసారి సంచలనంగా మారింది. -
కర్నూలు జిల్లాలో తాగునీటి కష్టాలు
-
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
-
ఇది తోలుమందం సర్కార్
⇔ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ధ్వజం ⇔ ప్రజాసమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది ⇔ ప్రత్యేక జీవోలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు.. సాక్షి, కడప : ‘‘ప్రజలు కష్టాలు పడుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు.. ఒకవైపు కరువు... మరోవైపు తాగు నీరు, సాగునీటి సమస్యలతో జనం అల్లాడు తున్నా చంద్రబాబు పట్టించుకోవ డంలేదు’’ అని వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమె త్తారు. గురువారం వైఎస్ఆర్ జిల్లా పులివెం దుల నియోజకవర్గంలోని లింగాలలో అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు, అధికారులతో సమస్యలపై ఆయన సమీక్షించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిల సమక్షంలో వివిధ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వానికి తోలు మందమని.. సమస్యలను ఎత్తి చూపినా నిర్లక్ష్యం వహిస్తారే తప్ప.. పరిష్కారంపై చిత్తశుద్ధిలేదని జగన్ ఎద్దేవా చేశారు. ఎలాంటి సమ స్యలైనా అందరం కలిసికట్టుగా పోరాడి సాధించుకుం దామని పిలుపునిచ్చారు. వేసవి మూడు నెలల పాటు ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కోకుండా ప్రభు త్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఉచితమంటూ.. వందల బిల్లులా.. ప్రభుత్వం చెప్పేదొకటి.. ఆచరణలో చేసేది మరొకటిగా మారిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాలకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 50యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని పేర్కొంటున్నా.. రూ.100, రూ.200, రూ.300లు ఇలా రూ.600ల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నా చంద్రబాబు పట్టించుకోరు కానీ.. ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం ప్రత్యేక జీవోలు విడుదల చేసి దోచిపెడుతున్నారని జగన్ విమర్శించారు. లింగాల మండలం తాగునీటి సమస్యపై అనంతపురం కలెక్టర్ కోనశశిధర్‌తో,చీనీ రైతుల సమస్యలపై వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణతో జగన్ మాట్లాడారు. -
ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోవడం లేదు
-
కోహ్లి డ్రింక్స్...
వరుసగా 54 టెస్టులు ఆడిన తర్వాత విరాట్ కోహ్లి ఆటకు బ్రేక్ లభించింది. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో కోహ్లి ధర్మశాల టెస్టుకు దూరమయ్యాడు. అయితే మైదానంలోకి రాకుండా మాత్రం అతను ఉండలేకపోయాడు. ఎలాంటి చిన్నతనంగా భావించకుండా డ్రింక్స్ బాటిల్స్‌తో ఫీల్డ్‌లోకి వచ్చి కోహ్లి సహచరులను ఉత్సాహపరిచాడు. తొలి వికెట్ తీసిన అనంతరం బౌండరీ బయటి నుంచి కుల్దీప్ను అభినందించి తగిన సూచనలు కూడా ఇచ్చాడు. 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన తర్వాత కోహ్లి ఆడకపోవడం ఇదే తొలిసారి. కెప్టెన్ నంబర్ 33... అజింక్య రహానే భారత్ టెస్టుల్లో నాయకత్వం వహించిన 33వ ఆటగాడిగా నిలిచాడు. రహానే గతంలో ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో కూడా కెప్టెన్‌గా పని చేయలేదు. ముంబై తరఫున గతంలో ఉమ్రీగర్, నారీ కంట్రాక్టర్, రామ్‌చంద్, వడేకర్, గావస్కర్, వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, సచిన్ భారత్‌కు కెప్టెన్లుగా వ్యవహరించారు. తొలి రోజు రహానే తనదైన శైలిలో ఎలాంటి ఉద్వేగాలకు లోను కాకుండా ప్రశాంతంగా, సమర్థంగా జట్టును నడిపించాడు. ఆటలో ఇరు జట్ల మధ్య ఏ క్షణంలో కూడా మాటల తూటాలు, దూషణలు కనిపించలేదు. ఈ సిరీస్‌లో ఒక అంపైర్ రివ్యూ కూడా లేకుండా సాగిన ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. -
‘భగీరథ’ పనుల వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పాత మెదక్ జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జరుగుతున్న భగీరథ పనులను గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి సమీక్షిం చారు. హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తయితే ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించిన జిల్లాగా సిద్దిపేటకు దేశంలో ప్రథమ స్థానం లభిస్తుందన్నారు. ఇకపై ప్రతివారం పనులను సమీక్షించాలని, స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయపర్చుకుని భాగస్వాములను చేసుకో వాలని అధికారులను ఆదేశించారు. కనీసం రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున పనులు పూర్తి చేస్తేనే పురోగతి ఊపందుకుంటుందన్నారు. సిబ్బంది కొరత ఉన్నచోట అధికా రులను సర్దుబాటు చేయాలని, అవసరమైతే పంచాయతీరాజ్‌శాఖ రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఒక కార్యాచరణ ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ప్రభాకర్, మదన్‌రెడ్డి, బాబూమోహన్ పాల్గొన్నారు. -
రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులన్నీ ఆపేయండి
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీ ఉత్తర్వులు - అటవీ ప్రాంతంలో పనులు చేయడం లేదన్న ప్రభుత్వం - అది అబద్ధమంటూ శాటిలైట్ ఫొటోలు చూపిన పిటిషనర్ - ఈ ప్రాజెక్టు గురించి కేసీఆర్ ప్రసంగం ఎన్జీటీకి సమర్పణ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జరుగుతున్న పనులన్నింటినీ వెంటనే ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ, చెన్నై) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అన్ని అనుమతులు పొందేంత వరకు ఏ ఒక్క పని కూడా చేయరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎస్ నంబియార్, పీఎస్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రాజెక్టు జరుగుతున్న తీరు తెన్నులు.. ప్రభుత్వ ఉల్లంఘనలు తదితర విషయాలను నిగ్గు తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ దరఖాస్తును ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాగునీటి ప్రాజెక్టు వాదనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అనుబంధ దరఖాస్తుతో పాటు ప్రధాన పిటిషన్‌ను ఆ రోజు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇదే సమయంలో ప్రభుత్వ వాదనకు మద్దతు తెలుపుతూ ప్రాజెక్టు పనులను ఆపవద్దని, ఈ కేసులో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ కొందరు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అటవీ, పర్యావరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపించారు. కేసీఆర్ ప్రసంగం కాపీల సమర్పణ విచారణ ప్రారంభం కాగానే వాయిదా కోసం ఏఏజీ కోరగా, సంజయ్ ఉపాధ్యాయ్ దానిని వ్యతిరేకించారు. ఏమీ చేయడం లేదని ఒకవైపు చెబుతూ, మరోవైపు ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూనే ఉన్నారని, దీనికి ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగమే సాక్ష్యమన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి ధర్మాసనం ముందుంచారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఎన్జీటీని గేలిచేసేలా మాట్లాడారని వివరించారు. ఎన్జీటీ ఇచ్చిన స్టే ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి తీరుతామన్నారని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఈ సమయంలో రామచంద్రరావు స్పందిస్తూ.. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదని చెప్పారు. ఉపాధ్యాయ్ ఈ వాదనలతో విభేదించారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పనులతో పాటు ప్రాజెక్టు కొనసాగుతున్న ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. ఉత్తర్వులు ఆటంకం కాదు ‘‘రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులేవీ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరగటం లేదు. కావున ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులు పాలమూరు పనులకు ఆటంకం కాదు’’ – సీఈ లింగరాజు -
వట్టిపోతున్న కృష్ణమ్మ
పరీవాహక ప్రాంతాల్లో ఎండుతున్న పంటలు నదిపై ఆధారపడి 40 వేల ఎకరాల్లో సాగు ఇప్పటికే 2 వేల ఎకరాల్లో ఎండిన పంట కర్ణాటకలో అడ్డుకట్టలు వేయడం వల్లే.. మాగనూర్: కృష్ణానది వట్టిపోతోంది. నదిలోకి ఎగువనుంచి దిగువకు చుక్కనీరు రావడం లేదు. దీంతో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల పరిధిలోని పరీవాహక ప్రాంతాల్లో సాగుచేసిన పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మరో తడికి నీళ్లు అందితే పంట చేతికి వచ్చే పరిస్థితి ఉండగా, నీరు లేక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఇప్పటికే 2వేల ఎకరాలు ఎండిపోగా.. మిగతావి ఎండుముఖం పడుతున్నాయి. కృష్ణానది రాష్ట్రంలో అడుగుపెడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలం తంగిడి గ్రామం నుంచి మొదలుకొని జూరాల ప్రాజెక్టు వరకు మక్తల్, ఆత్మకూర్, మాగనూర్ మండలాల్లోని మొత్తం 15 ఎత్తిపోతల పథకాల కింద 8,500 ఎకరాలు, జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వకింద 12,000 ఎకరాలు ఈ రబీలో వరిసాగు అవుతుందని ఐడీసీ వారి అంచనా. దీంతోపాటు నదీతీరంలోని రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న పంపుల ద్వారా మరో 20వేల ఎకరాల వరకు వరి సాగవుతుందని అంచనా వేశారు. అయితే, ఈ పంటలన్నీ చివరి దశలో ఉన్నాయి. కర్ణాటక దిగువకు చుక్కనీరు కూడా వదలకుండా అడ్డుకట్టలు వేసింది. దీంతో కృష్ణాలో నీరు అడుగంటింది. ఎత్తిపోతలకు నీరందక వాటిపై ఆధారపడిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వారంరోజులు ఇలానే పరిస్థితి ఉంటే ఒక్క గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని అధికారులు, నేతలకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల కింద తగ్గిన సాగు.. ఖరీఫ్‌లో కృష్ణా మండలంలోని గుడెబల్లూర్ ఎత్తిపోతల పథకంలో 3 వేల ఎకరాల భూమిసాగు కావాల్సి ఉండగా కేవలం 850ఎకరాల్లో మాత్రమే వరి సాగుచేశారు. అదే రబీకి వచ్చే సరికి కేవలం తిండిగింజల కోసం 400 ఎకరాల్లో వరి సాగు చేశారు. ముడుమాల్ ఎత్తిపోతల పథకంలో 3 వేలకుపైగా ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, కేవలం 300 ఎకరాల్లో సాగు చేశారు. కళహళ్లి ఎత్తిపోతల పథకం కింద 2,500 ఎకరాలు సాగుకావాల్సి ఉండగా ప్రస్తుతం 200 ఎకరాల్లో సాగు చేశారు. ఆత్మకూర్ మండలంలోని అమరచింత ఎత్తిపోతల పథకం కింద 4వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా కేవలం 1,200 ఎకరాల్లో సాగవుతోంది. ఇందులో 1,090 మంది రైతులు ఉన్నారు. ఈ పథకం కింద అమరచింత, మస్తీపురం, ఖానాపురం, సింగంపేట, మూలమళ్ల పామిరెడ్డిపల్లి గ్రామాలకు సాగునీరు అందుతుంది. అయితే, సాగు చేసే సమయంలో పై నుంచి దిగువకు ఏ స్థాయిలో నీరు వస్తుంది.. ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలి. ఎప్పటివరకు నీరు వస్తుందనే విషయంపై రైతులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేవారు లేకుండా పోయారు. పుంజనూరు ఎత్తిపోతల కింద వరి పంట ఎండుముఖం పట్టింది. తాగునీటికీ తప్పని ఇబ్బందులు కృష్ణా నదిలో నీరు లేక గ్రామాల కు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మక్తల్ మండలంలోని పస్పుల, జూరాల వద్ద ఏర్పాటు చేసిన సత్యసాయి తాగునీటి పథకంతోపాటు రామన్‌పాడు తాగునీటి పథకానికీS నీళ్లు అందక రెండురోజులకు ఒకమారు నీటి సరఫరా చేస్తున్నారు. మాగనూర్‌లో సత్యసాయి తాగునీటి సరఫరా నెల రోజులుగా నిలి చిపోయింది. -
వాకింగ్ చేసి వస్తానని..
⇒ గుర్తుపట్టలేని విధంగా శవమై తేలిన యువకుడు ⇒ మున్సిపల్ తాగునీటి ట్యాంక్‌లో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి ⇒ పదిహేను రోజులుగా మృతదేహం కుళ్లిన నీటినే తాగునీటిగా సరఫరా ⇒ కంగుతిన్న పట్టణ ప్రజలు కావలి : ‘అమ్మా.. ఇంకో రౌండ్ వాకింగ్ చేసి ఇంటికి వస్తాను’ అని చెప్పిన ఓ యువకుడు 15 రోజుల తర్వాత గుర్తుపట్టలేని విధంగా శవమై తేలాడు. పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే మున్సిపల్ ఓవర్ హెడ్ ట్యాంక్‌లో ఐఐటీ విద్యార్థి అనుమానా స్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిగ గ్రామానికి చెందిన మండవ వెంకట రమణయ్య కుటుంబం కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో శ్రీ వెంకటేశ్వరస్వామి గుడి పక్కనే నివాసం ఉంటుది. ఆయన కలిగిరి మండలం కుమ్మరకొండూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ఆయన సతీమణి రజని జలదంకి మండలం తొమ్మిదో మైలు మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వారి కుమారుడైన మండవ సతీష్ (22) పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఉన్న ఐఐటీలో బీటెక్ మెకానికల్ బ్రాంచ్ ఫైనలియర్ చదవుతున్నాడు. మూడో సంవత్సరం ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో ఐఐటీ కళాశాల ప్రాంగణంలోని సహచర హాస్టల్ విద్యార్థులతో తలెత్తిన మనస్పర్థలతో మనస్థాపానికి గురై జనవరి 11న ఇంటికి వచ్చేశాడు. మానసికంగా ఇబ్బంది పడుతుండటంతో అతన్ని తల్లిదండ్రులు తిరుపతికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. 15 రోజుల క్రితం అదృశ్యం ప్రతి రోజు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై వాకింగ్ చేస్తున్న సతీష్ ఫిబ్రవరి 17న వాకింగ్ కోసం బయటకు వచ్చాడు. చాలా సమయం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లి రజని కుమారుడికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మళ్లీ సతీష్ తల్లికి ఫోన్ చేసి ఇంకో రౌండ్ వాకింగ్ చేసి వస్తానని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తల్లి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా రింగ్ అవుతున్నా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో తండ్రి వెంకట రమణయ్య రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. తాగునీటి సరఫరా కాకపోవడంతో.. స్థానిక కో ఆపరేటివ్ కాలనీలో ఉన్న మున్సిపాలిటీ ఓవర్‌హెడ్ ట్యాంకు నుంచి ప్రజలకు తాగునీరు అందుతుంది. శుక్రవారం తమకు కుళాయిలకు తాగునీరు రావడం లేదని ప్రజలు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాటర్ వర్క్స్ సిబ్బంది అన్ని పరిశీలించి చివరగా ట్యాంకు లోపల పరిశీలించారు. పైపు లైన్‌కు నీరు విడుదలయ్యే ట్యాంకు లోపలి భాగం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, పోలీసులకు తెలియజేశారు కావలి అగ్నిమాపకశాఖాధికారి వి.శ్రీనివాసులురెడ్డి పరిశీలించారు. మున్సిపల్ కార్మికులతో ట్యాంక్ నీటిలో కుళ్లి ఛిద్రమైన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి అతికష్టం మీద కిందకు దించారు. రెండు వారాల క్రితం మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో, ఆ కేసుకు సంబంధించిన మండవ వెంకట రమణయ్యను అక్కడికి పిలిపించి ఆనవాళ్లు గుర్తించమని పోలీసులు చెప్పారు. ఈ మృతదేహం తన కుమారుడిదేనని ఆయన గుర్తించి బోరున విలపించారు. పదిహేను రోజులుగా శవం కుళ్లిన నీరే సరఫరా అయితే నీటి ట్యాంక్‌లో మృతదేహం పడి ఉన్న విషయాన్ని వాటర్ వర్క్ సిబ్బంది గుర్తించకపోవడంతో ఇన్ని రోజులు ఈ ట్యాంక్ పరిధిలోని పట్టణ ప్రజలకు తాగునీటిగా సరఫరా చేశారు. మృతదేహం కుళ్లిన నీటిని తాము పదిహేను రోజులు వాడుకున్నామని తెలిసిన సమీప ప్రాంత ప్రజలు ఒక్కసారి ఖంగుతిన్నారు. ఈ విషయం పట్టణంలో సంచలనం సృష్టించింది. మా అబ్బాయిని చంపేశారు మా అబ్బాయి సతీష్‌ను హత్య చేశారని, దీని వెనుక బలమైన మిస్టరీ ఉందని, ఎవరో కావాలని చంపేశారని తల్లిదండ్రులు వెంకట రమణ, రజని విలేకరుల వద్ద రోదించారు. పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి నిజాలను వెలికి తీయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
తాగునీటి సమస్యలపై పోరు
⇒ క్షేత్రస్థాయి నుంచి పోరాడతాం: దిగ్విజయ్ ⇒ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి నుంచి పోరాడుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం ఉత్తమ్, ఇతర ముఖ్య నేతలతో కలసి దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, సమస్యలను పరిష్కరించడంలో విఫలమైం దన్నారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీని దారి మళ్లిం చిందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టు లను పూర్తి చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కాం గ్రెస్‌పై నిందలు వేయడం సరికాదన్నారు. ‘‘ప్రాజెక్టుల కు మాపార్టీ వ్యతిరేకం కాదు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రజెంటేషన్‌లోని ప్రశ్నలకు సీఎం ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ప్రాజెక్టుల అంచనాలను అడ్డగోలుగా పెంచుతున్నారు. భూసేకరణపై రోజుకో జీవో ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారు. భూసేకరణ చట్టం–2013తోనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో అధికారం అంతా కేసీఆర్, ఆయ న అల్లుడు, కొడుకు, కూతురు చుట్టూనే కేంద్రీకృతమైంది’’ అన్నారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. 9న సీఎల్పీ భేటీ... రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రజాక్షేత్రంలో కార్యాచరణపై చర్చించడానికి కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ నెల 9న సమావేశం కానుంది. దీనికి దిగ్విజయ్ కూడా హాజరుకానున్నారు. గిరిజనులకు చెందిన అటవీ భూముల స్వాధీనంపై ఈ నెల 10న టీపీసీసీ చర్చించనుంది. మదర్సాలపై ఆరెస్సెస్ దుష్ప్రచారం మదర్సాలపై ఆరెస్సెస్, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీలు దుష్ప్రచారం చేస్తున్నాయని దిగ్విజయ్ విమర్శించారు. మదర్సాల్లో చదువుకున్న ఒక్క విద్యార్థి కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న దాఖలాలు లేవన్నారు. ముస్లింలపై జాతీయ మీడియాలోని కొన్ని వర్గాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. హిందూ తీవ్రవాదం గురించి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీలు ఫాసిస్టు విధానాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. జాత్యహంకార దాడుల్లో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబానికి దిగ్విజయ్‌సింగ్ సంతాపం ప్రకటించారు. సమన్వయ కమిటీ సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, మధుయాష్కీ, బలరాం నాయక్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. పాల్వాయి.. కోమటిరెడ్డి వాగ్వాదం సమన్వయ కమిటీ భేటీలలో రాజ్య సభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఉత్తమ్‌పై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేలా వ్యవహరిం చాల ని పాల్వాయి సూచించారు. అందుకు కోమటిరెడ్డి స్పందిస్తూ.. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించా రో, తనను భువనగిరి ఎంపీగా ఓడించ డానికి ఎవరు పనిచేశారో గుర్తుంచుకోవా లన్నారు. దీంతో దిగ్విజయ్ జోక్యం చేసు కుని పార్టీ అంతర్గత అంశాలపై బహి రంగంగా ఎవరు మాట్లాడినా మంచిది కాదని, తొందరపాటు వ్యాఖ్యల వల్ల నష్టం కలుగుతుందని హెచ్చరించారు. -
మూడేళ్లయినా మొదలు కాని పనులు
ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఎదుట స్థానికుల ఆవేదన బిట్రగుంట : బోగోలు మండలం కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీలో మూడేళ్ల క్రితం మౌలిక వసతుల కల్పన కోసం అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు శిలాపలకం ఏర్పాటు చేసినా నేటికీ ఒక్క పని కూడా ప్రారంభించలేదంటూ కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీ వాసులు ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఎదుట వాపోయారు. శుక్రవారం కోవూరుపల్లి అంబేడ్కర్‌కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, యువత ఎమ్మెల్యేని శిలాపలకం వద్దకు తీసుకువెళ్లారు. 2014లో ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే మస్తాన్‌రావు హడావుడిగా శిలాపలకం ఏర్పాటు చేశారని, పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి మూడేళ్లు గడిచినా ఒక్కపని కూడా ప్రారంభించలేదని అన్నారు. కాలనీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, మురుగునీరు రోడ్లపైకి చేరుతుందని, తాగునీరు, వీధి దీపాలు లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. స్థానిక సామాజిక వనరుల భవనం కూడా శిథిలావస్థకు చేరుకుందని, కొత్త భవనం మంజూరు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దార్ కృష్ణారావుతో ఫోన్లో చర్చించి తాగునీటి సమస్యను వివరించారు. ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లాన్ నిధుల రూ.94 లక్షల అంచనాతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శిలాపలకం వేశారు. పనులకు సంబంధించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అరెస్టు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణ దాహార్తి తీర్చాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం 10 గంటలకు జలదీక్ష ప్రారంభించిన ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డిని పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి పోలీసు బలగంతో దీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించిన విషయం విదితమే. అయితే ఆయన సోమవారం ఉదయం తన అనుచరులతో వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట జలదీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్ష మంగళవారం ఉదయం 10 గంటలకు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే దీక్ష ప్రారంభించిన కాసేపటికే పెద్దఎత్తున పోలీసులు వచ్చి ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే రాచమల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద జల దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు వేలాది మంది మద్దతుతో దీక్ష చేయనున్నారు. ప్రధానంగా ప్రతి ఏటా మైలవరం డ్యాం నుంచి టీఎంసీ నీటిని పెన్నానదిలోకి విడుదల చేసేందుకు శాశ్వత జీఓను విడుదల చేయాలని, కుందూ పెన్నా వరద కాలువ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని, చెన్నమరాజుపల్లె సమీపం నుంచి రామేశ్వరం హెడ్ వాటర్ వర్క్స్ వరకు పైపులైన్ ద్వారా వరద నీటిని తరలించాలని, తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం పట్టణంలోని 40 వార్డులకు రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన దీక్షకు మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి మద్దతు పలికారు. అర్థరాత్రి పోలీసులు, అధికారుల హడావుడి ప్రొద్దుటూరు నీటి సమస్యలపై ఆదివారం అర్థరాత్రి నుంచి జలదీక్ష చేయాలని ఎమ్మెల్యే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అర్ధరాత్రి మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి, పోలీసులు జలదీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించేందుకు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చేపట్టనున్న 24 గంటల జలదీక్షా శిబిరాన్ని తొలగించే యత్నం చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు. నీళ్లు ఇవ్వలేని అధికారులు సిగ్గు లేకుండా శిబిరాన్ని ఎలా తొలగిస్తారంటూ కమిషనర్‌ను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఒక్క సారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మా ఇళ్ల వద్దకు వచ్చి ప్రజలు బూతులు తిడుతున్నారని, మీ ఇళ్లల్లో మినరల్ వాటర్‌తో నీళ్లు పోసుకుంటూ ప్రజల గురించి ఆలోచించరా అని నాయకుడు బంగారురెడ్డి అన్నారు. వంద కోట్లు మున్సిపాలిటీలో పెట్టుకొని ప్రజలకు పది రోజులకు ఒక సారి కూడా నీళ్లు ఇవ్వలేరా అని శాసనసభ్యుడు రాచమల్లు అన్నారు. వన్‌టౌన్ సీఐ బాలస్వామిరెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఎమ్మెల్యే వద్దకు వచ్చి బోర్లు వేస్తున్నామని నీళ్లు రెండు రోజుల్లో ఇస్తామని తెలిపారు. ఎక్కడ బోర్లు వేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన డిమాండ్లు మైలవరం జలాశయం నుంచి 1 టీఎమ్సీ నీటిని పెన్నాకు వదలించడం, కుందూపెన్నా కాలువను పూర్తి చేయడం, కుందూ నుంచి పైప్‌లైన్ పనులు ప్రారంభించడం అని తెలిపారు. తనకు మీరు చెప్పే విషయాలపై నమ్మకం లేదని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే 24 గంటల దీక్ష కూడా విరమిస్తానని చెప్పారు. -
కొల్లగొట్టేందుకు కొత్త వ్యూహం!
–‘శ్రీరామరెడ్డి’ పథకం కాంట్రాక్టరును తొలగించి ఉద్యోగాల పేరుతో దోపిడీకి కుట్ర – 700 మంది పొట్ట కొట్టే యోచనలో ఓ నేత కుమారుడు – రూ.8 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తప్పుకుంటానన్న కాంట్రాక్టర్ అనంతపురం సిటీ : శ్రీరామరెడ్డి పథకం ద్వారా ఆరేళ్లుగా తాగునీరు సరఫరా చేస్తున్న ఓ కాంట్రాక్టరు కోట్లు సంపాదిస్తున్నాడన్న భావనతో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు దురాశకు పోతున్నారు. తనకు ఎలాగైనా ఆ కాంట్రాక్టు కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి సహకారంతో మరో నలుగురు ఎమ్మెల్యేలను చేరదీసుకుని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతమున్న కాంట్రాక్టరు తప్పుకుంటే సిబ్బందిని విధుల్లోంచి తొలగించి ఆ పోస్టులను అమ్ముకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమలో సుమారు 700 మందిని తొలగించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఒక్కో పోస్టుకు రూ.50 వేల దాకా వసూలు చేయాలని ఇప్పటికే వ్యూహం పన్నినట్లు తెలిసింది. ఈ వ్యవహారంతో విసుగు చెందిన కాంట్రాక్టరు మాత్రం జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రను కలసి తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని, తర్వాత తనకు ఈ కాంట్రాక్టు అవసరమే లేదని రాత పూర్వకంగా తెలిపినట్లు సమాచారం. సరఫరా ఇలా.. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 170 కిలోమీటర్ల పైపులైన్ ఉంది. దానికి అనుబంధంగా 1,800 కిలోమీటర్ల సబ్‌లైన్ వెళుతుంది. ఈ పథకం ద్వారా హిందూపురం, రాయదుర్గం, మడకశిర, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలతో పాటు పలు గ్రామాలకు నీరు సరఫరా అవుతోంది. ఈ పథకం నిర్వహణ కోసం కాంట్రాక్టరుకు నెలకు రూ.90 లక్షల ఖర్చు అవుతోంది. ఇదులో రూ.60 లక్షలు వేతనాలకు, రూ.30 లక్షలు నిర్వహణకు వెచ్చించాల్సి వస్తోంది. ఆరేళ్లుగా నిర్వహణ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని, ప్రతినెలా రూ.90 లక్షలు సమకూర్చుకోవడానికి అవస్థ పడుతున్నానని కాంట్రాక్టు చెబుతున్నారు. ప్రభుత్వం ఏడు నెలలకోసారి బిల్లులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, కాంట్రాక్టర్‌ను తొలగించి తాము ఆ వర్కును చేజిక్కించుకోవాలని చూస్తున్న నాయకుడు సోమవారం జెడ్పీలో పంచాయితీ కూడా పెట్టించారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన కాంట్రాక్టర్ తన సంపాదన దేవుడెరుగు...పెట్టుబడి గిట్టుబాటు కాక ఇబ్బంది పడుతున్న విషయాన్ని జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాంట్రాక్టును రద్దు చేసి ఈ ఏడాది మార్చి నుంచి తనకు రావాల్సిన బకాయిలు రూ.8 కోట్లు ఇప్పించాలని 45 రోజుల క్రితమే సీఈఓను కోరినట్లు సమాచారం. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. జెడ్పీ సీఈఓ రామచంద్ర ఫోన్లో అందుబాటులోకి రాలేదు. -
వలసపోయిన సర్పంచ్.. ఉప సర్పంచ్
ఇద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే - గల్ఫ్‌కు వెళ్లడంతో కుంటుబడిన గ్రామాభివృద్ధి - అస్తవ్యస్తంగా పారిశుధ్యం పనిచేయని తాగునీటి పథకాలు - ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నతాధికారులకు కార్యదర్శి ఫిర్యాదు సాక్షి, జగిత్యాల/ గొల్లపల్లి: పల్లె అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందో.. ఉపాధి నిమిత్తమో తెలి యదు కానీ గ్రామాన్ని విడిచి గల్ఫ్‌బాట పట్టారు. ఆరు నెలల క్రితం ఉప సర్పంచ్.. 50 రోజుల క్రితం సర్పంచ్ ఇలా ఒకరి తర్వాతా మరొకరు పరాయిదేశానికి పయనమయ్యా రు. గ్రామప్రథమ, ద్వితీయ పౌరులిద్దరూ అందుబాటులో లేకపోవడంతో గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. పారిశుధ్యలోపం.. వివిధ పథకాల బిల్లుల చెల్లింపులు నిలిచాయి. తాగునీటి పథకాలు పడకేశాయి. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి కూడా లేకపోవడంతో ఐతుపల్లి పంచాయతీ కార్యదర్శి వాజిద్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. అత ను వారంలో ఓ రోజు గ్రామానికి వచ్చి వెళ్తుం టాడని.. గ్రామసమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామపంచాయతీలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. పెగడపల్లి మండల పరిధిలో ఉన్న లక్ష్మీపూర్ జిల్లా పునర్విభజనలో గొల్లపల్లి మండలంలో చేరింది. పంచాయతీ పరిధిలో పది వార్డులు.. 2120 జనాభా ఉంది. గత ఎన్నికల్లో సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ రాగా.. ఓ వార్డు సభ్యుడికి బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మానాల సురేశ్ సర్పంచ్‌గా గెలుపొందారు. ఇటీవల అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉప సర్పంచ్‌గా చింతపండు రమేశ్ ఎన్నికయ్యా రు. ఇద్దరూ టీఆర్ఎస్కి చెందిన వాళ్లే. గ్రామంలోని సమస్యలు.. అందుబాటులో లేని సర్పం చ్.. ఉపసర్పంచ్ గురించి ఇన్చార్జీ కార్యదర్శి వాజిద్ ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే వెళ్లేలా చేశాయా? సర్పంచ్ సురేశ్ ఊరు విడిచి గల్ఫ్‌కు వెళ్లడానికి ఆర్ధిక ఇబ్బందులే కారణమనే చర్చ గ్రామంలో జరుగుతోంది. రిజర్వేషన్ అవకాశం కలిసిరావడంతో సురేశ్(25) ఎన్నికల్లో పోటీ చేసి గెలిపొందారు. యువకుడు కావడంతో సురేశ్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేకచొరవ తీసుకునేవాడు. కానీ 50 రోజుల క్రితం అతడు ఊరు విడిచి దుబాయ్‌కు వలస వెళ్లారు. ‘గతంలో ఊర్లో మాకు పది గుంటల వ్యవసాయభూమి ఉండేది. కానీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు డబ్బులు అవసరమైనయ్. గ్రామ సర్పంచ్‌గా గెలిచిన తర్వాత భూమి అమ్మి అప్పులు తీర్చేసినం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఎండాకాలంలో ప్రజల దాహార్తి తీర్చేం దుకు సురేశ్ రూ. 3.50 లక్షలు అప్పులు చేసి గ్రామంలో బావి తవ్వించారు. పంచాయతీ నుంచి రూ. 90 వేలు మాత్రమే వచ్చాయి. అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటి చుట్టూ తిరగడం.. ఆర్థిక సమస్యలు ఉండడం తో దుబాయ్‌కు వెళ్లారు.’ అని సురేశ్ భార్య మంగ, అన్న మహేశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన సురేశ్.. ‘ నేను గ తంలో దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేశా.. డ్రైవింగ్ లెసైన్స్ గడువు ముగిసింది. రెన్యూవల్ కోసం ఇక్కడికి వచ్చా. నెలాఖరులోగా ఊరికి తిరిగి వచ్చేస్తా’ అన్నాడు. ఉపసర్పంచ్ రమేశ్ మాత్రం ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పడకేసిన పాలన.. గ్రామ ప్రథమ.. ద్వితీయ పౌరులిద్దరూ లేకపోవడంతో అభివృద్ధిపరంగా లక్ష్మీ‘పూర్’గా మారింది. ఎటు చూసినా డ్రైనేజీలు నిండుకుండలా తయారై.. దుర్గందం వెదజల్లుతోంది. వీధి దీపాలు లేక గ్రామంలో అనేక వార్డుల్లో అంధకారంలో మగ్గుతున్నాయి. తాగునీటి సమస్య తీర్చేందుకు సురేశ్ తవ్వించిన బావి మోటరు పాడవడంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి మళ్లీ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు చేతిబావుల్లో నీరు రావడంతో కొన్నిప్రాంతాల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. బిల్లులకు సర్పంచ్ సంతకం అవసరం కాగా సురేశ్ అందుబాటులో లేకపోవడంతో 40 మంది బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. సఫాయి కార్మికులకు వేతనాలు సైతం నిలిచిపోయాయి. కాగా, సర్పంచ్, ఉప సర్పంచ్ లేక.. గ్రామ పరిపాలన కుంటుపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ దావు సత్తయ్య ప్రభుత్వాన్ని కోరారు. -
ఒట్టేసి చెప్పు ఇకనైనా తాగనని...
తాగుబోతు భర్తలో మార్పు కోసం భార్య ప్రాణత్యాగం తాడేపల్లి రూరల్(గుంటూరు): ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలో మార్పు తీసుకురావాలని ఓ భార్య ప్రాణత్యాగం చేసిన సంఘటన తాడేపల్లి పట్టణ పరిధిలోని బైపాస్‌రోడ్డులో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.... తాడేపల్లిలో నివాసం ఉండే ఎం.కళావతి, శివారెడ్డి 15 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్తను ఎలాగైనా తాగుడు మాన్పించాలని ఆమె విశ్వప్రయత్నం చేసింది. భర్తలో ఎటువంటి మార్పు రాకపోవడంతో తాను చనిపోయిన తరువాత అయినా తాగుడు మానమంటూ గత నెల 30న ఎలుకల మందు తాగింది. ప్రేమించిన భార్య తన కళ్ల ముందే పురుగుమందు తాగడంతో, ఆమెను ఎలాగైనా బతికించుకోవాలని శివారెడ్డి చుట్టుపక్కల వారి సాయంతో దగ్గరలోనే ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. పరిస్థితి విషమించడంతో గుంటూరు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కళావతి గురువారం మృతి చెందింది. చనిపోయే ముందు కూడా తాగనని భర్తతో ఒట్టేయించుకుని చనిపోయినట్టు బంధువులు తెలిపారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ఖిల్లాఘనపురం : తాగునీరు లేక అల్లాడుతున్నామని, వారం రోజులు దాటినా నీళ్లు రావడం లేదని ఆరోపిస్తూ శనివారం మండల కేంద్రంలోని తోకగేరికి చెందిన ప్రజలు సర్పంచ్ సౌమ్యానాయక్ ఇంటి ముందు జిల్లా కేంద్రానికి వెల్లే ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా తమ గేరికి వారం గడిచినా రాలేదన్నారు. తమ వీధికి ట్యాంకర్ పంపే వరకు ధర్నా విరమించేది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మశ్చందర్‌రెడ్డి, సర్పంచ్ అక్కడికి చేరుకుని ప్రజలతో మాట్లాడి నచ్చజెప్పారు. ట్రాక్టర్ ద్వారా 20 ట్యాంకుల నీళ్లను ప్రతిరోజు సరఫరా చేస్తున్నామని, కరెంట్ వచ్చిన వెంటనే తోకగేరికి వాటర్ ట్యాంకును పంపిస్తామని సర్పంచ్, ఎస్ఐ హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించి వెళ్లిపోయారు. సుమారు గంట పాటు రోడ్డుపై ధర్నా చేపట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
బ్యారేజీల భారం రాష్ట్రానిదే
- తమ్మిడిహెట్టి, మేడిగడ్డ నిర్మాణ బాధ్యత తెలంగాణదే - అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ భారాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్రమే భరించాలని తెలంగాణ, మహారాష్ట్ర సీఎం్ల నేతృత్వంలోని అంతర్రాష్ట్ర వాటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. పెన్‌గంగపై నిర్మించే ఛనాఖా-కొరాటా బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని మాత్రం 80:20 నిష్పత్తిన భరించనున్నారు. ప్రాజెక్టుల కింద సాధ్యమైనంత వరకు ముంపును నివారించేందుకు తెలంగాణ సర్కారు ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణం చేపట్టాలని.. బ్యారేజీల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రైవేటు భూములేవీ ముంపు కాకుండా చూసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. భూసేకరణ చట్టం లేదా భూ కొనుగోలు విధానం ద్వారా సేకరించే ముంపు భూములకు తెలంగాణే పరి హారం చెల్లించాలని నిర్ణయించారు. వాటర్‌బోర్డు సమావేశం నిర్ణయాల మినిట్స్ కాపీని నీటి పారుదల శాఖ మంగళవారం విడుదల చేసింది. తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు అంగీకారం కుదరగా.. మేడిగడ్డను 100 మీటర్ల ఎత్తుతో, ఛనాఖా-కొరాటాను 213 మీటర్ల ఎత్తుతో చేపట్టేందుకు అంగీకారం కుదిరింది. గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ప్రకారం... ఈ బ్యారేజీల నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని నీటిని తాగు, సాగు అవసరాలకు వినియోగించుకునే హక్కు మహారాష్ట్రకు ఉంటుంది. అలాగే కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు మహారాష్ట్రలోని బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యమివ్వాలి. భూసేకరణ లేదా కొనుగోలు కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల నిర్వహణకు మహారాష్ట్ర సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలనూ ఇరు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పంచుకోవాల్సి ఉంటుంది. -
తీర ప్రాంతాల దాహార్తి తీర్చండి
షార్ అధికారులతో ఎమ్మెల్యే కిలివేటి సూళ్లూరుపేట: తీర ప్రాంత గ్రామాలైన కొరిడి, కడపట్ర, దామరాయ, వేనాడు పంచాయతీల్లో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిలివేటి షార్ అధికారులను కోరారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వెంటబెట్టుకుని షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డితో సోమవారం ఆయన కార్యాలయంలో చర్చించారు. పేర్నాడు, దామరాయ, కొరిడిలో మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మిస్తే సమస్య తీరుతుందని వివరించారు. దీనిపై తాను గతంలో కూడా వినతిపత్రం ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఆయనతో పాటు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగజ్యోతి, డీఓ నందకుమార్, జేఈ ఉమా మహేశ్వరిలను తీసుకెళ్లడంతో అక్కడికక్కడే వారి వద్దనుంచి అనుమతి పత్రాన్ని రాసి ఇప్పించారు. దీంతో కంట్రోలర్ జేవీ రాజారెడ్డి కూడా సానుకూలంగా స్పందించి డైరెక్టర్ కున్హికృష్ణన్‌తో మాట్లాడి మూడు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పట్టణ పార్టీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నీటి విడుదలకు నో!
తెలంగాణ, ఏపీల విజ్ఞప్తిని తిరస్కరించిన కృష్ణా బోర్డు - 16 టీఎంసీలు ఇవ్వాలన్న ఏపీ, ఏడు టీఎంసీలు కోరిన తెలంగాణ - నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరడాన్ని ఎత్తిచూపిన బోర్డు సభ్య కార్యదర్శి - దీనిపై ఇరు రాష్ట్రాల కార్యదర్శులతో చర్చించి నిర్ణయిస్తామని స్పష్టీకరణ - కృష్ణా జలాల వినియోగం అంశంపై కుదరని ఏకాభిప్రాయం - కేంద్ర కమిటీ నివేదిక ఆధారంగా ‘టెలీమెట్రీ’ వ్యవస్థ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల అంశంపై బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలతోపాటు భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్‌సాగర్ పథకాల ట్రయల్ రన్‌కు కలిపి ఏడు టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ కోరగా... సాగు, తాగునీటి అవసరాలు, పుష్కరాల కోసం తక్షణమే 16 టీఎంసీలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస స్థాయికి మించి పడిపోయిన నేపథ్యంలో... రాష్ట్రాలు కోరుతున్నట్లుగా నీటి విడుదల సాధ్యం కాదని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ స్పష్టం చేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ ఈఎన్సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు వినియోగించుకుంటామని తెలంగాణ కోరింది. భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ట్రయల్ రన్ నిర్వహణకు కనీసం నాలుగు టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిపోయాయని.. దీంతో భారీగా వరద జలాలు అందుబాటులోకి వస్తాయని వివరించింది. గతేడాది నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేయాలన్న బోర్డు ఆదేశాలు అమలుకాకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. వాటిని ఈ ఏడాది సర్దుబాటు చేయాలని కోరింది. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ కింద సాగు అవసరాలకు 8 టీఎంసీలు.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం 4 టీఎంసీలు, కృష్ణా పుష్కరాల కోసం మరో 4 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ కోరింది. ఈ ప్రతిపాదనలను సమీర్ చటర్జీ తోసిపుచ్చారు. శ్రీశైలం, సాగర్‌లలో నీటి నిల్వలు కనిష్ట స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జలాలను విడుదల చేయలేమని తేల్చిచెప్పారు. కేంద్ర కమిటీ నివేదిక తర్వాతే.. తెలంగాణ, ఏపీల పరిధిలో కృష్ణా జలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు లెక్కించేందుకు టెలీమెట్రీ వ్యవస్థ ఏర్పాటుపై బోర్డు త్రిసభ్య కమిటీ చర్చించింది. కల్వకుర్తి, కోయల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, జూరాల, ఎలిమినేటి మాధవరెడ్డి, హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టుల వద్ద టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు కోరింది. శ్రీశైలం కుడికాలువ, హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ కుడికాలువ, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీల వద్ద టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిపై బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ స్పందిస్తూ.. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) రిటైర్డు చైర్మన్లతో కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటించి, ఇరు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ టెలీమెట్రీ సెన్సర్లు ఏర్పాటు చేయాలన్న అంశంపై నివేదిక ఇస్తుందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగానే టెలీమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేసి, నీటి వినియోగాన్ని లెక్క కడతామని స్పష్టం చేశారు. -
ఆరు రోజులుగా తాగునీరు బంద్
కె.కొత్తపల్లి గ్రామంలో ఆరు రోజుల నుంచి తాగునీటి సరఫరా బంద్ అయ్యింది. ఆలూరు శివారులో ఉన్న సంప్ నుంచి ఈ గ్రామానికి తాగునీటి సరఫరా కావాల్సి ఉంది. సంప్ వద్ద తాత్కాలికంగా పని చేస్తున్న వర్కర్ ఇటీవల విధుల నుంచి తప్పుకొన్నాడు. అతని స్థానంలో మరొకరిని నియమించే విషయంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు పొలాలకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామన్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కర్ణాటకలో కృష్ణమ్మ పరవళ్లు
- 4 రోజుల్లో ఆలమట్టి, తుంగభద్రలోకి 30 టీఎంసీల నీరు - ఆలమట్టికి 1.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం - ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో ఇలాగే ఉంటే ఆగస్టు కల్లా శ్రీశైలం, జూరాలకు నీరు సాక్షి, హైదరాబాద్/జూరాల : కృష్ణా నది ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ప్రాజెక్టులకు భారీగా నీరు చేరుతోంది. గడిచిన నాలుగు రోజుల్లోనే అక్కడి ప్రధాన ప్రాజెక్టులైన ఆలమట్టి, తుంగభద్రల్లోకి 30 టీఎంసీల మేర నీరు వచ్చింది. బుధవారం సైతం ఆలమట్టికి 1.27 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఒకట్రెండు రోజుల్లో మరో 20 టీఎంసీల నీరు చేరే అవకాశ ం ఉంది. ఎగువ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో చేరితే దిగువకు క్రమంగా ప్రవాహాలు మొదలుకానున్నాయి. ఎగువన ప్రస్తుతం మాదిరే ప్రవాహాలు కొనసాగితే ఆగస్టు రెండు లేక మూడో వారానికి శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన ఇదీ పరిస్థితి.. ఆలమట్టి నిల్వ సామర్థ్యం 129.7 టీంసీలు. ఈ ప్రాజెక్టులోకి నాలుగు రోజుల క్రితం వరకు కొత్తగా 19 టీఎంసీల నీరు చేరింది. బుధవారం నాటికి అది 39.7 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 54.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో ఆలమట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.50 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు నిండితే కృష్ణమ్మ తెలంగాణ వైపు వైపు పరుగులు తీసే అవకాశం ఉంది. కర్ణాటకలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.86 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 11,756 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా తాగునీటి అవసరాలకు 756 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూరాలకు వస్తోంది తక్కువే.. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.57 టీఎంసీల నిల్వ ఉంది. జూరాలకు ఇన్‌ఫ్లో కేవలం 35 క్యూసెక్కులు మాత్రమే ఉండగా.. అదేస్థాయిలో ఎడమ కాల్వ ద్వారా తాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌కు 28 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 590 అడుగులకు గానూ 504 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలోనూ 885 అడుగులకుగానూ నీటినిల్వ 788.4 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో లభ్యతగా ఉన్న 23.72 టీఎంసీలపైనే రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. -
పట్టణాల్లో ‘భగీరథ’కు గ్రీన్ సిగ్నల్
పీపీపీ విధానంలో 35 పురపాలికల్లో పనులు సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ మినహాయిస్తే.. రాష్ట్రంలోని 35 నగరాలు, పట్టణాల్లో రూ.2,296.38 కోట్ల అంచనా వ్యయంతో ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య పద్ధతిలో మిషన్ భగీరథ పనులను చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. సీఎం కేసీఆర్‌తో పాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత ప్రతిపాదనపై సంతకం పెట్టడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ పరిధిలోని పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి. రాష్ట్రంలోని మొత్తం 68 నగరాలు, పట్టణాలకుగాను జీహెచ్ఎంసీ, నగర శివారు ప్రాంతాల్లో జలమం డలి ఆధ్వర్యంలో... సిద్దిపేట మునిసిపాలిటీ సహా కొత్తగా ఏర్పడిన 32 నగర పంచాయతీల్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కింద పనులు జరుగుతున్నాయి. మిగిలిన 35 నగరాలు, పట్టణాల్లో పనులను మాత్రమే పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టబోతోంది. పీపీపీలో పనులు... 35 నగరాలు, పట్టణాల్లో రూ.2,296.38 కోట్ల అంచనా వ్యయంతో మిషన్ భగీరథ పనులు చేపట్టనుండగా.. అందులో రూ.636 కోట్లు కేంద్రం నుంచి రానున్నా యి. ‘అమృత్’ పథకం కింద ఎంపికైన 10 పట్టణాల్లో నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మా ణం కోసం ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. మిగిలిన రూ.1,660.38 కోట్ల వ్యయాన్ని రాష్ట్రం భరిస్తుంది. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకునే సంస్థే తొలుత పెట్టుబడి పెట్టి రెండేళ్లలో పనులు పూర్తి చేయాలి. ఆతర్వాత 6 ఏళ్లలో ప్రభుత్వం ఆరు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్నీ సదరు సంస్థకు చెల్లిస్తుంది. మూడు ప్యాకేజీలుగా పనులు పట్టణ మిషన్ భగీరథ పనులను ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా విడగొట్టింది. ప్యాకేజీ-1 కింద కరీంగనర్ జిల్లాలోని కరీంనగర్, కోరుట్ల, మెట్పల్లి మునిసిపాలిటీలతోపాటు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాల్వంచ, ఇల్లెందు మునిసిపాలిటీల్లో రూ.701.52 కోట్లతో పనులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్యాకేజీ-2 కింద ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి, మం చిర్యాల మునిసిపాలిటీలు, వరంగల్ జిల్లాలోని వరంగల్ కార్పొరేషన్, జనగాం మునిసిపాలిటీల్లో రూ.874.3 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. ప్యాకేజీ-3 కింద తాండూరు, వికారాబాద్,నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, సదాశివపేట,సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్, గద్వాల్, వనపర్తి, నారాయణ్‌పేట్, మహబూబ్‌నగర్ మునిసిపాలిటీల్లో రూ.720.56 కోట్లతో పనులు చేపట్టనున్నారు. -
బెల్లంపల్లిలో ప్రబలిన డయేరియా
► ఆస్పత్రిలో చేరిన రోగులు ► కలుషిత నీటితోనే ప్రమాదం బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లిలో డయేరియా ప్రబలింది. రెండు రోజుల నుంచి వాంతులు, నీళ్ల విరేచనాలతో ప్రజలు తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం... బెల్లంపల్లిలోని పలు కాలనీలకు సింగరేణి ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. అంతర్గత పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మురికినీటి కాలువలను ఆనుకొని తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేయడంతో కొన్ని చోట్ల లీకేజీ జరిగి నీరు కలుషితమై డయేరియా ప్రబలినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి ప్రజలు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. సుభాష్‌నగర్, శాంతిఖని, 65 డీప్ ఏరియా, 85 డీప్ ఏరియా, నం.2 ఇంక్లైన్, బెల్లంపల్లిబస్తీలకు చెందిన సుమారు 100 మంది వరకు కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. ఆహారం భుజించిన, నీరు తాగిన వెంటనే వాంతులు, విరేచనాలు చేసుకుంటున్నారు. నీరు కలుషితం కావడం వల్లే వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రెండు రోజుల నుంచి రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. బుధవారం పదిహేను మంది రోగులు ఆస్పత్రిలో చేరారు. వీరికి సత్వరంగా వైద్యం అం దించడంతో ఆరోగ్యం కుదుటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. గురువారం పెద్ద సంఖ్యలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం 34 మంది ఆస్పత్రిలో ఇన్‌పేషంట్లుగా ఉన్నారు. వీరంతా కలుషితమైన నీరు తాగడం వల్లే వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - కుమారస్వామి, ప్రభుత్వ వైద్యుడు ( బెల్లంపల్లి) -
జూరాలకు చేరిన కృష్ణా జలాలు
సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు శనివారం జూరాల ప్రాజెక్టుకు చేరాయి. ప్రాజెక్టులోకి నీరు చేరుతున్న విషయాన్ని మహబూబ్‌నగర్ ఇరిగేషన్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ ధ్రువీకరించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎగువ నుంచి తాగునీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం నీటి విడుదలకు అంగీకరించింది. ఒక టీఎంసీ నీటి విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈ నెల 20న కర్ణాటక ఇరిగేషన్ విభాగం ముఖ్య కార్యదర్శి రాకేశ్ సింగ్.. తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశారు. మరోవైపు నీటివిడుదలకు సానుకూలంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వానికి హరీశ్‌రావు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
నీటి సమస్య పరిష్కరించాలంటూ వంగవీటి ధర్నా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు..ప్రజలకు గుక్కెడు నీళ్లువ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా అన్నారు. నగరంలో మంచినీటి సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ గుణదలలో గురువారం ఉదయం ఆయన ధర్నా చేపట్టారు. ప్రజలకు తాగునీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వంగవీటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి చేపట్టిన ధర్నా కార్యక్రమానికి వామపక్షాలు మద్దతు తెలిపాలి. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, నగర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
‘గ్రేటర్’కు నిరంతర తాగునీరు
♦ త్వరలోనే అందిస్తాం: హరీశ్ ♦ కేటీఆర్ డైనమిక్ మినిస్టర్ అని ప్రశంస హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు నిరంతరం తాగునీటిని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ కల త్వరలోనే సాకారమవుతుందని భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. ఇందుకు సీఎం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. శనివారమిక్కడ జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం డివిజన్ ఎంఐజీ కాలనీలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సమస్య అన్ని చోట్ల ఉందన్నారు. సింగూరు, మంజీర జలాశయాలు పూర్తిగా ఎండిపోవడంతో నగరంలో నీటి ఎద్దడి నెలకొందని, దీనిని అధిగమించేందుకే సీఎం కేసీఆర్.. గోదావరి జలాలను నగరానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 24 గంటలపాటు తాగునీరు అందించేలా కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. కాగా, కేటీఆర్‌ను డైనమిక్ మినిస్టర్‌గా అభివర్ణించారు హరీశ్‌రావు. ఆయన మహానగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని, అది తప్పక నెరవేరుతుందని చెప్పారు. రామచంద్రాపురం డివిజన్లో నీటి సరఫరా పైపుల ఆధునీకరణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కార్పొరేటర్ సూచన మేరకు రామచంద్రాపురం డివిజన్‌ను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సమీక్షలో ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి సోమిరెడ్డి పాల్గొన్నారు. -
తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభం
► అడ్డుకున్న లచ్చన్నపాలెం గ్రామస్తులు ► పోలీసుల సాయంతో కొనసాగుతున్న పనులు లచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఎట్టకేలకు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను స్థానికులు మళ్లీ అడ్డుకోగా పోలీసుల రంగ ప్రవేశంతో కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నారు. మండలంలోని లచ్చన్నపాలెం సర్పానదిలో రూ.ఏడు కోట్ల వ్యయంతో భారీ తాగునీటి ప్రాజెక్టును నిర్మించతలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని భావించిన గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఈ పనులను అడ్డుకున్నారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో మళ్లీ గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు గ్రామస్తులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. ఈ పనులను అడ్డుకుంటే కేసులు తప్పవని ఎస్ఐ రమేష్ హెచ్చరించడంతో చేసేదిలేక వారు అడ్డుతొలగారు. దీంతో పనులు యథావిధిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నదిలో ట్యాంకు నిర్మాణానికి తీసిన ప్రాంతంలో ఉన్న నీటిని తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ పర్యవేక్షిస్తున్నారు. కోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటితోపాటు పాడిపరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లచ్చన్నపాలెం గ్రామస్తులు అనేక సార్లు పనులు అడ్డుగించారు. ఇక్కడ ప్రాజెక్టు వద్దని స్పష్టం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిసింది. -
కరువు కౌగిట కరీంనగర్
మానేరులో నీరు లేదు.. చేలల్లో చెమ్మ లేదు... ఎక్కడివక్కడ ఎండిపోయిన చెరువులు, పంటలు గుక్కెడు నీటికి అల్లాడుతున్న పల్లెలు, పట్టణాలు గడ్డి లేక పశువులను అమ్ముకుంటున్న రైతన్నలు ఈ చిత్రం చూశారా...? యాభై ఏళ్ల క్రితం మానేరు డ్యాం నిర్మాణానికి ముందు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి ఇది. ఇప్పుడు డ్యాంలో నీరు పూర్తిగా ఎండిపోవడంతో ఇలా బయటపడింది.. తెలంగాణలోనే కాదు... తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధాన్యాన్ని పండించే జిల్లా కరీంనగర్! ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా తీరొక్క పంటలతో అలరారుతూ అన్నపూర్ణగా విరాజిల్లిన జిల్లా. కానీ నేడు సాగు సంగతి దేవుడెరుగు... గుక్కెడు నీటి కోసం అలమటిస్తోంది. ఎటు చూసినా ఎండిన పంటలు... ఎడారిని తలపిస్తున్న మానేరు... తాగునీటి కోసం జనం కష్టాలే దర్శనమిస్తున్నాయి. నలుగురికి అన్నం పెడుతూ రాజుగా బతికిన రైతన్నకు నేడు బతుకుదెరువే భారమైంది. జిల్లాలో రోజూ ఏదో ఒక మూల అన్నదాత మరణ మృదంగం విన్పిస్తోంది. ఆవులు, గేదెలకు గ్రాసం లేక అంగట్లో అమ్ముకుంటున్నారు. కరువు దెబ్బకు కన్నీరు పెడుతున్న పల్లెల్లో ఉండలేక లక్షలాది మంది యువత ఉపాధి కోసం వలస బాట పడుతున్నారు. కరీంనగర్లో కరువుపై సాక్షి ప్రత్యేక కథనం. -పసునూరు మధు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ రైతు సంతతి అంతరించిపోతున్నది వ్యవసాయ సంస్కృతిలోంచి మొలకెత్తే మనిషి తొలిగిపోతున్నడు వ్యాపారం పులి నాగలిపై స్వారీ చేస్తున్నది రెండెడ్లను స్వాహాచేసి త్రేనుస్తున్నది నాగలి కర్రను ముక్కలు చేసి మంటేసి చలి కాచుకుంటున్నది దళారి ఒకడు రంగప్రవేశం చేశాడు రైతు మరణ హనన ఆజ్యం పోసి రాజ్యానికి కానుక ప్రకటిస్తున్నడు ఇప్పుడు పది జిల్లాల్లో ఒకటే పాట ఒక్కటే రాగం.. ఒక్కటే పల్లవి అంతట ఒక్కటే దరువు చావు డప్పుల మధ్య మరణ నృత్యం సామూహిక గానమై పరవశిస్తున్నది - ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అంతటా దాహం దాహం గత ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ జిల్లాలో తాగునీటికి కటకట ఏర్పడింది. పల్లె, పట్నం తేడా లేకుండా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీకి వెళ్లినా నీళ్ల కష్టాలే కనిపించాయి. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో చుట్టుపక్కల చెరువులన్నీ ఎండిపోవడంతో నాలుగు నెలలుగా నల్లా నీళ్లు బంద్ చేశారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా.. ప్రజల అవసరాలు 30 శాతానికి మించి తీరడం లేదు. దీంతో జనం మూడ్రోజులకో ట్యాంకర్ చొప్పున నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నా... పలు కాలనీలు, వాడల్లో తాగునీటి కటకట ఏర్పడింది. స్థానిక ఇందిరమ్మ కాలనీని ‘సాక్షి’ బృందం సందర్శించగా ఒక్కో ఇంటి వద్ద 4, 5 డ్రమ్ములు దర్శనమిచ్చాయి. ఈ కాలనీలో మొత్తం 1,100 కుటుంబాలు నివాసముంటుండగా... 5,200 డ్రమ్ములు ఉండటం విశేషం! వారానికోసారి ట్యాంకర్ల ద్వారా నీళ్లు వచ్చినప్పుడు డ్రమ్ముల్లో నింపుకుంటూ వాడుకుంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. శ్రీరాజరాజేశ్వరస్వామి నిలయమైన వేములవాడ పట్టణంలోనూ గత నాలుగు నెలలుగా నల్లా నీటి సరఫరా ఆగిపోయింది. పట్టణంలో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. ప్రైవేటు ట్యాంకర్లే దిక్కయ్యాయి. కోరుట్ల మున్సిపాలిటీలో గత 6 నెలల కాలంలో నల్లాల ద్వారా నీరు సరఫరా అయ్యింది కేవలం 45 రోజులే. గత నెల రోజులుగా నల్లాలు పూర్తిగా బంద్ అయ్యాయి. మిగిలిన పట్టణాల్లోనూ వారానికి, రెండు మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలోని అపార్ట్మెంట్లలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ప్రతిరోజూ రూ.3 వేలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటూ అపార్ట్మెంట్ వాసులలు నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. చతికిలపడిన సాగు కరీంనగర్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.3 లక్షల హెక్టార్లు(13 లక్షల ఎకరాలు). సరిగ్గా మూడేళ్ల కిందట (2013-14) ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగుకు మించి 14.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసి రికార్డు సృష్టించింది. కానీ ఈసారి కరువు దెబ్బకు సీన్ రివర్స్ అయ్యింది. జిల్లాలో ఈ ఏడాది సాగు పూర్తిగా చతికిలపడింది. రబీ సీజన్లో కేవలం 2,79,670 ఎకరాల్లోనే సాగు చేయగా... నీటి వసతి లేక అందులో 60 శాతానికిపైగా పంటలు ఎండిపోయాయి. ఉన్న కొద్ది పంటను సాగు చేసుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు అన్నీ కావు. నీళ్లు లేక ఎండిన బోర్ల స్థానంలో రూ.లక్షల అప్పు తెచ్చి కొత్త బోర్లు వేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా వేసిన బోర్లలో 100కు 70 శాతం ఫెయిలవుతున్నాయి. వెయ్యి అడుగుల మేరకు బోరు వేసినా చుక్క నీరు రాని ప్రాంతాలెన్నో ఉన్నాయి. మానేరు తీర ప్రాంతాల్లోని రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఏకంగా మానేరు నదిలో బోర్లు వేసి అక్కడి నుంచి కిలోమీటర్ల కొద్దీ పైపుల ద్వారా నీటిని పంటలకు తీసుకెళ్తున్నారు. గోదారిలో బోర్లు వేసి పైపుల ద్వారా నీటిని మళ్లిస్తూ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలను కాపాడుకుంటున్నారు. ఈ సీజన్లో అన్నదాతకు కలిసొచ్చే ఏకైక పంట మామిడి. నీళ్లు లేక ఆ తోటలు కూడా ఎండిపోతున్నాయి. హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఎండిన మామిడి తోటలు దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా కాతకు వచ్చిన తోటలు సైతం తరచూ గాలివానతో కాయలు రాలిపోతున్నాయి. కేసీఆర్ ఇంటెక్‌వెల్‌కు కష్టకాలమొచ్చే! ఈ చిత్రం చూశారా... సరిగ్గా పదిహేనేళ్ల క్రితం నాటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్ సిద్దిపేటకు తాగునీటి కోసం కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం హన్మాజీపల్లె వద్ద మానేరు నది మధ్యలో ఇంటెక్వెల్ను ఏర్పాటు చేశారు. మానేరు డెడ్‌స్టోరేజీకి వచ్చినా సిద్దిపేటకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు వచ్చేలా ఇంజనీర్లు నది మధ్యలో దీన్ని నిర్మించారు. మానేరు డ్యాం నుంచి ఇంటెక్వెల్ వరకు కాలువలు కూడా తవ్వించారు. ఒకవేళ డెడ్‌స్టోరేజీకి చేరితే డ్యాంలోని కొద్దిపాటి నీళ్లను సైతం పంపింగ్ ద్వారా కాలువలోకి మళ్లించి అక్కడ్నుంచి ఇంటెక్వెల్ ద్వారా సిద్దిపేటకు తాగునీరు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గత పదేళ్లలో ఏనాడూ మానేరు డెడ్‌స్టోరేజీకి రాలేదు. ఈ ఏడాది కరువు దెబ్బకు గోదారి ఎండిపోవడంతో లోయర్ మానేరు డ్యాం డేడ్స్టోరేజీకి చేరింది. ఇంటెక్‌వెల్‌లోని పైపులన్నీ పైకి తేలాయి. దీంతోపాటు నాడు ఇంటెక్వెల్ నుంచి ఎల్ఎండీ వరకు తవ్వించిన కాలువ బయటకు కన్పిస్తోంది. కరువు పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మరోనెల రోజుల మించి సిద్దిపేటకు నీళ్లు సరఫరా అయ్యే పరిస్థితి లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మేత లేక పశువులు కబేళాకు.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వారానికోసారి జరిగే అంగడికి రైతులు తీసుకొచ్చిన పశువులు ఇవి. రెండు నెలలుగా ఈ అంగడిలో ప్రతీ వారం సగటున వెయ్యి పశువులు కబేళాకు తరలిస్తున్నట్లు అంచనా. గత నెల రోజులుగా ప్రతీ వారం వందకుపైగా లారీల్లో ఆవులు, గేదెలు కబేళాకు తర లించారు. గత శుక్రవారం ఈ అంగడిని ‘సాక్షి’ సందర్శించగా... ఒక్క గంటలోనే 30కి పైగా లారీల్లో పశువులను తరలించారు. నీళ్లు, మేత లేక బక్కచిక్కిన పశువులతోపాటు లీటర్ల కొద్దీ పాలిచ్చే వందలాది గేదెలు, ఆవులు సైతం అంగడిలో కన్పించాయి. నీళ్లు, మేత లేకపోవడంతో వాటి పోషణ భారమైందని, అందుకే అమ్ముకుంటున్నామని పశువుల యజమానులు చెప్పారు. జిల్లాలో 15 కేంద్రాల్లో పశువుల వార సంతలు జరుగుతున్నాయి. ప్రతీ వారం సగటున ఒక్కో సంతలో 200 చొప్పున అన్ని కేంద్రాల్లో 3 వేల పశువులు కబేళాకు వెళుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలోని అన్ని సంతల్లో కలిపి నెలకు సుమారు లక్ష పశువులు కబేళాకు తరలిస్తున్నట్లు అంచనా. ఇటు కరువు కాటు.. అటు గల్ఫ్ గాయం కరువు దెబ్బతో పొట్టచేతబట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న యువత అక్కడ కూడా మోసానికి గురవుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సగటున 20 కుటుంబాలకు ఒక్కరు చొప్పున గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉన్నారు. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి గ్రామాన్ని సందర్శించగా 50 మంది యువకులు దుబాయ్ వెళ్లినట్టు తెలిసింది. వీరిలో 15 మంది మోసపోయి మళ్లీ సొంత గ్రామానికి తిరిగొచ్చారు. మల్లారపు రవి అనే యువకుడిని సాక్షి కదిలిస్తే ‘సార్ ఇంట్ల ఎల్లకపోవడంతో రూ.2 లక్షలు అప్పు చేసిన. దుబాయ్ పోతే అప్పు తీర్చడంతోపాటు డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ ఏజెంట్ చెబితే మరో లక్ష అప్పు చేసి గత జూన్‌లో దుబాయ్ పోయిన. అక్కడి నెలకు 1200 దిర్హమ్స్ ఇస్తామని ఆశపెట్టారు. తీరా ఆడికి పోతే నెలకు రూ.600 చొప్పున ఇచ్చిండ్రు. రోజూ 12 గంటలు పనిచేయించుకున్నరు. పని ఒత్తిడికి ఆరోగ్యం దెబ్బతిన్నది. డబ్బులు తిండికి, నా ఆరోగ్యానికే సరిపోయినయ్. ఇక్కడికి వచ్చి ఉపాధి కూలీకి పోతున్న’ అని వాపోయాడు. నీళ్లులేక మామిడి చెట్ల నరికివేత మామిడి, బత్తాయి రైతును కరువు నిండా ముంచుతోంది. కోహెడ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన రైతు భట్టు చంద్రారెడ్డి తనకున్న 9 ఎకరాల పొలంలో మామిడి సాగు చేశాడు. పంటకు నీరందక దాదాపు సగం చెట్లు ఎండిపోయాయి. లాభం లేదనుకుని మామిడి చెట్లన్నీ నరికివేశాడు. అదే ఊళ్లో గన్నెబోయిన వెంకటేశ్వరావు వేసిన బత్తాయి తోటదీ ఆదే పరిస్థితి. నీళ్లలేక బత్తాయి ఎదగడం లేదని, ఇప్పటికే పంటపై రూ.3 లక్షల అప్పు చే శానని ఆయన గోడు వెళ్లబోసుకున్నాడు. చెరువులన్నీ ఎండిపాయె.. జిల్లాలో మానేరు నది ఎడారిని తలపిస్తోంది. కాలువలన్నీ ఒట్టిపోయాయి. దాదాపు జిల్లాలోని చెరువులన్నీ ఎండిపోయాయి. దీంతో తెనుగ, ముదిరాజ్, మత్స్యకారులకు పని లేకుండా పోయింది. వారంతా పొట్టకూటి కోసం అడ్డా కూలీలుగా మారుతున్నారు. సిరిసిల్ల మండలంలోని సారంపల్లి పెద్ద చెరువును సందర్శించగా.. చేపల అమ్మకమే జీవనాధారంగా బతుకుతున్న ముదిరాజ్ కులస్తులు ఆ ఎండిన చెరువు గట్టుపై కూర్చొని బతుకు దెరువు కోసం ఏం చేయాలా? అని చర్చించుకుంటున్నారు. సంఘం పెద్ద దాసరి రాజయ్యను కదిలించగా...‘కరువుతో పొలం సాగుచేయలేదు. చేపలు పడదామంటే చెరువులో నీళ్లే లేకపాయే. ఎట్లా బతకాలో అర్థం కాక ఈడ కూసున్నం. మావోళ్లంతా రోజూ కూలీ కోసం సిరిసిల్ల అడ్డా కాడికి పోయొస్తున్నరు. ఒకరోజు పని దొరికితే...మూడు రోజులు పస్తులుండాల్సి వస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కరువైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఉపాధి కష్టమాయే! చీర్లవంచ గ్రామంలో నెత్తిన బేసిన్ తట్ట పెట్టుకుని కూలీ కోసం వెళ్తున్న మహిళలు వీరంతా. ఉపాధి హామీ పనులకు వెళుతున్నారా? అని వారిని అడగ్గా.. ‘ఈ ఎండలకు చెరువులన్నీ ఎండిపోయినయ్. భూమి గట్టి పడింది. మా ఏరియాలో కందకాలు తవ్వాలంటే గడ్డపార భూమిలోకి దిగుతలేదు. మగోళ్లకు రోజుకు రూ.వంద ఇస్తున్నారు. మాకు ఆ పని చేతగాక మామిడి కాయలు తెంపేందుకు వెళుతున్నాం’ అని పేర్కొన్నారు. రోజంతా కష్టపడితే రూ.150 కూలి ఇస్తారన్నారు. ప్రైవేటు బావులు, బోర్లను అద్దెకు తీసుకుని నీరందిస్తున్నాం జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొన్న గ్రామాల్లో ప్రైవేటు బోర్లు, బావులను అద్దెకు తీసుకుని తాగునీరు సరఫరా చేస్తున్నాం. జియాలజిస్టుల సిఫారసు మేరకు కొత్త బోర్లు, బావుల తవ్వకానికి సిఫారసు చేస్తున్నాం. తాగునీటి కోసం నిధుల సమస్య లేనే లేదు. ఎన్ని నిధులైనా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ నీటి సమస్య ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - కలెక్టర్ నీతూప్రసాద్ -
ఇది దుర్భిక్ష చిత్రం
♦ రాష్ట్రంలో ఇంటింటా దాహం కేకలు.. ♦ గుక్కెడు నీటి కోసం అగచాట్లు ♦ ఎండుతున్న తోటలు.. దిక్కుతోచని అన్నదాతలు ♦ కరువును ఎదుర్కొనే ప్రణాళిక ఊసే లేని వైనం ♦ పరిస్థితిని ఇప్పటిదాకా కేంద్రం దృష్టికి తీసుకెళ్లని సీఎం మార్కాపురం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. పల్లెలు గొల్లుమంటున్నాయి. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 42 నుంచి 47 డిగ్రీల వరకు పెరిగిపోయాయి.రైతుల కళ్లెదుటే పంటలు ఎండిపోతున్నాయి. ఎటుచూసినా వడిలిపోతున్న తోటలే. పశుపక్ష్యాదులు గుక్కెడు నీటి కోసం అలమటించిపోతున్నాయి. గొంతు తడుపుకోవడానికి మైళ్లకొద్ది దూరం నడిచి వెళ్లాల్సిందే. కరువు కసిగా కాటేస్తుండడంతో జనం కన్నవాళ్లను, ఉన్న ఊరిని వదిలేసి పొట్టచేతపట్టుకొని వలసబాట పడుతున్నారు. గ్రామాలు కళ తప్పుతున్నాయి. ఇప్పటిదాకా తమ కన్నబిడ్డల్లా చూసుకుంటున్న మూగజీవాలను పోషించలేక రైతులు వాటిని సంతల్లో అయినకాడికి అమ్మేస్తున్న దృశ్యాలు నిత్యకృత్యం. రైతు బతుకు ఛిద్రమవుతున్నా పాలకులు చలించడం లేదు. సుప్రీంకోర్టు మందలించినా, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పాలకుల్లో ఉలుకూ పలుకూ లేకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 500కుపైగా మండలాల్లో కరువే దేశంలో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అధికారిక గణాంకాల ప్రకారం.. ఏపీలో ఏడు జిల్లాల్లో 359 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. రెండున్నర కోట్ల మందికిపైగా జనం కరువు బారినపడ్డారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలతోపాటు గుంటూరు జిల్లాలోని కొంతభాగం కరువుతో అతలాకుతలం అవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో 9 జిల్లాల్లోని 500కుపైగా మండలాల్లో కరువు తాండవిస్తోంది. పచ్చిక జాడే లేదు... ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి పుల్లలచెరువు వైపు వె ళ్లే ఏ మార్గం చూసినా కరువు చిత్రాలే. తాగడానికి నీళ్లు లేవు. పచ్చిక బయళ్ల జాడే లేదు.రోడుకిరువైపులా ఉన్న బత్తాయి, బొప్పాయి వంటి తోటలు నీటి తడి లేక ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఒక్కొక్క నీటి ట్యాంకర్ రూ.700కు కొనుగోలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గతంలో 22 వేల హెక్టార్లలో బత్తాయి తోటలు సాగయ్యేవి. కరువు వల్ల వీటి సాగు ఈ ఏడాది 2 వేల హెక్టార్లకు పడిపోయింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఇదే దుస్థితి. సేద్యంపై రైతన్నల అనాసక్తి ఏపీ ధాన్యాగారంగా భావించే ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం జనం మంచినీటి కోసం అల్లాడుతున్న దృశ్యాలు కోకొల్లలు. రాయలసీమలోని నాలుగు జిల్లా ల్లో ఉద్యానవన పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గోదావరి డెల్టాలో సగానికి సగం పంటలే పడగా, కృష్ణా డెల్టాలోనూ అదే పరిస్థితి. నాగార్జునసాగర్ కుడి కాలువ క్రింద ఆయకట్టు ఆనవాళ్లే లేకుండా పోయింది. రెండేళ్ల క్రిందటి వరకు రాష్ట్రంలో చాలాచోట్ల ఎరువుల వ్యాపారులు రూ.కోటిన్నర టర్నోవర్ చేసేవారు. ఈ ఏడాది రూ.50 లక్షలకు పడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానరాని సుజల పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఎన్టీఆర్ సుజల పథకం కథ అర్ధంతరంగానే ముగిసినట్లు కనిపిస్తోంది. నీటి కోసం ప్రతి కుటుంబం ప్రతినెలా రూ.వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణ అవసరాల కోసం ట్యాంకర్ నీటిని రూ.700 నుంచి రూ.900 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ‘‘బత్తాయి తోట వేసి నాలుగేళ్లు దాటిపోయింది. ఎండవల్ల చెట్లు వడలిపోతున్నాయి. చేతికి కాసిన్ని డబ్బులు వస్తాయన్న ఆశతో శక్తికి మించిన పనే అయినా ట్యాంకర్ల ద్వారా నీళ్లను కొని చెట్లకు పెడుతున్నాం. పంట చేతికి వస్తే నా అప్పులు తీరుతాయనే ఆశతో ఈ పని చేస్తున్నాం. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి’’ - పుచ్చకాయల సుబ్బారావు,యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా ప్రభుత్వం చేస్తోందేమిటి? రాష్ట్రంలో వరుసగా రెండేళ్ల నుంచి కరువు పరిస్థితులు నెలకొన్నా... రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేయలేదు. ఇక అఖిలపక్ష సమావేశం మాటే మరిచిపోయింది. కరువును జాతీయ విపత్తుగా పరిగణించి, సహాయం చేయండని ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు అప్పడప్పుడు వెళ్తున్నా కరువు గురించి కనీసం ఒక్కసారైనా ప్రస్తావించలేదు. మరోవైపు వచ్చే రెండు మూడేళ్లలో కరవును శాశ్వతంగా పారద్రోలుతామంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. జనాన్ని మభ్యపెడుతోంది. ఇంకుడు గుంతలు, పంట సంజీవని వంటి పథకాల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటోంది. కరువు నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఇప్పటిదాకా పటిష్టమైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వం చేయాల్సిందేమిటి? ► రాష్ట్రాన్ని కబళిస్తున్న కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రణాళిక రూపొందించాలి.అఖిలపక్ష ఏర్పాటు చేసి, చర్యలపై చర్చించాలి. ► తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలి. కరువు పీడిత గ్రామాల్లోని ప్రజలకు పాలపొడి, పౌష్టికాహారం అందజేయాలి. ► కరువు మండలాల్లో పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలి.తిరిగి పంటలు వేసుకునేందుకు రుణాలు మంజూరు చేయాలి. బకాయిలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 12 నుంచి 15 శాతం వడ్డీని పూర్తిగా రద్దు చేయాలి. పంటల బీమా కింద రావాల్సిన నిధులను తక్షణమే రైతులకు పంపిణీ చేయాలి. ► రైతులు చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేయాలి. ► పశువుల మేత కోసం గడ్డి కేంద్రాలను నెలకొల్పాలి. ప్రతి ఊరిలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి. గడ్డి తరలింపు వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. అటవీ ప్రాంతాల్లో పశువులను మేపుకునేందుకు అనుమతించాలి. ► అన్ని గ్రామాల్లో గంజి కేంద్రాలు, చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలి. ూ వలసల నివారణకు ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. సాంప్రదాయక నీటి వనరులను ప్రోత్సహించాలి. -
శివార్లలో తాగునీటికి కటకట
అమలాపురం : నియోజకవర్గ పరిధిలో శివార్లలో తాగునీటి కోసం ప్రజలు అలమటిస్తున్నారు. పట్టణ పరిధిలో మున్సిపల్ కుళాయిలకు విద్యుత్ మోటార్లు పెట్టి తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. పట్టణ ప్రజలకు 45 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంటే అందులో 13 లక్షల లీటర్ల నీరు పక్కదారి పడుతోంది. మిగిలిన 32 లక్షల లీటర్ల నీరు పట్టణంలోని 11 వేలఇళ్లకు చెందిన 53 వేల మంది ప్రజలకు సరిపోవడం లేదు. 15 శివారు ప్రాంతాల్లో ఉదయం పూట మాత్రమే నీరు సక్రమంగా సరఫరా అవుతోంది. సాయంత్ర వేళల్లో ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. అమలాపురం మండలంలో బండారులంకలో రూ.3.50 కోట్లతో మంచినీటి పథకాన్ని ఆరంభించినా సమ్మర్‌స్టోరేజ్‌కు గ్రామంలో భూమి దొరక్కపోవడంతో కాలువలు మూసిన తరువాత వేసవిలో నీటి ఇక్కట్లు తప్పడం లేదు. బోరు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా, పూర్తి స్థాయిలో అందడం లేదు. ఫిల్టర్ బెడ్లు పాడైపోవడంతో అమలాపురం మున్సిపాలిటీ, ప్రైవేట్ కంపెనీల నుంచి మంచినీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గున్నేపల్లి అగ్రహారం, నడిపూడి, గ్రామాల్లో వేసవిలో శివారుల్లో నీటి సరఫరాకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈదరపల్లిలో శివారు ప్రాంతాలకు తాగునీరు అందడంలేదు. శ్రీనివాసనగర్‌లో 60 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్‌ను నిర్మించినప్పటికీ పైపులైన్లేకపోవడం వల్ల నీరు అందడంలేదు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ఉన్న ఓహెచ్ ట్యాంకు సామర్థ్యం సరిపడక, పైపులైన్ సాంకేతిక సమస్యతో తాగునీరు సరిగా అందడం లేదు. కుళాయిల వద్ద గోతులు తీసి అడుగుభాగాన ఉన్న పైపులైన్ నుంచి నీరు పట్టుకుంటున్నారు. వాసాలతిప్ప తీరంలో అయితే ఓహెచ్ ట్యాంకుశిథిలస్థితికి చేరింది. డి.రావులపాలెం గ్రామంలో శివారు ప్రాంతాలైన బళ్లవారిపేట, సాపేవారిపేట ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. శివారు ప్రాంతాలు కావడంతో మంచినీటిని ఉప్పలగుప్తం మండలం సరిపెల్ల గ్రామంలో ఉన్న ట్యాంకు నుంచి వాటర్టిన్నుల సహాయంతో సైకిల్‌పై తెచ్చుకుంటారు. అల్లవరం మండలం ఎస్.పల్లిపాలెం, కొమరగిరిపట్నం శివారు నక్కా రామేశ్వరంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి నక్కా రామేశ్వరానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. దూరం కావడం వల్ల ట్యాంకులోకి నీరు రావడం లేదు. రెండు రోజులకు ఒక్కసారి మత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారు. -
కరువుపై అధికారులు స్పందించాలి
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో 125 తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అధికారులు విధులు నిర్వహించేందుకు స్పందించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి హెచ్‌కే.పాటిల్ అధికారులను కోరారు. ఆయన గురువారం జిల్లా పంచాయతీ సభాంగణంలో తాగునీటి ఎద్దడి, కరువు ఆధ్యయన పరిస్థితిపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో మాట్లాడారు. అధికారులు శాఖల మధ్య సమన్వయం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన తాగునీటి పథకాలకు త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించి నీరందించాలని కోరారు. అవ సరం ఉన్న చోట్ల నీటి ట్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. రాయచూరు జిల్లాలో కరువు సహాయక పనుల కింద 27 లక్షల మానవ ఆహార పనులకు గానూ రూ.181 కోట్ల నిధులు ఖర్చు అయ్యాయన్నారు. 11 పశుగ్రాస కేంద్రాలను ప్రారంభించి 49,5978 మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని నిల్వ ఉంచామన్నారు. 269 చెరువుల్లో తాగునీటిని నిల్వ చేయడం జరిగిందన్నారు. కరువు సహాయక అధికారులు సంబంధం లేని విధంగా వ్యవహరించడం తగదన్నారు. తాగునీటి సమస్యలున్న గ్రామాలను గుర్తించక పోవడంపై పంచాయితీరాజ్ ఇంజనీర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 185 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, 467 గ్రామాల్లో ఏ విధంగా అధికారులు పని చేశారనేది అర్థం కావడం లేదన్నారు. అధికారులు కరువు గ్రామాల్లో పర్యటించాలన్నారు. పశు గ్రాసాన్ని సబ్సిడీ రూపంలో లభించే విధంగా చూడాలన్నారు. లింగసుగూరు, మాన్వి, మస్కి, రాయచూరు గ్రామీణ, రాయచూరు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు సంబంధించి శాసన సభ్యులు మంత్రికి విన్నవించారు. సమావేశంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్, నగరాభివృద్ధి, మైనార్టీ శాఖా మంత్రి ఖమరుల్ ఇస్లాం, మహిళ శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉమాశ్రీ, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు వీరలక్ష్మి, ఉపాధ్యక్షులు గీత, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బోసురాజు, బాదర్లి హంపన గౌడ, ప్రతాప గౌడ పాటిల్, బసవరాజ పాటిల్ ఇటగి, అధికారి మౌనేశ, జిల్లాధికారి శశికాంత సింతల్, సీఈఓ కూర్మారావులున్నారు. -
వాటర్ ‘ఎమర్జెన్సీ’!
► సిటీకి పొంచి ఉన్న మంచినీటి గండం ► తప్పని ఎమర్జెన్సీ పంపింగ్ ► రూ.7 కోట్లతో పుట్టంగండి వద్ద 10 అత్యవసర మోటార్ల ఏర్పాటు ► 270 ఎంజీడీల మేర పంపింగ్ సాక్షి, సిటీబ్యూరో: భానుడి భగభగలతో నగరానికి మంచినీటి గండం పొంచి ఉంది. ఎండలు ఇలాగే ఉండి, వరుణుడు కరుణించకపోతే మే చివరి నాటికి భాగ్య నగరానికి మంచినీటి సరఫరా కష్టమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు జలమండలి అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు వరదాయినిలుగా మారిన కృష్ణా, గోదావరి జలాల అత్యవసర పంపింగ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. కృష్ణా మూడుదశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటి దశ ద్వారా 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల తాగునీటిని తరలించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అత్యవసర పంపింగ్ ఇలా... మహానగరానికి కృష్ణా మూడుదశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని తరలించేందుకు అవసరమైన 10 భారీ మోటార్లను నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున ఉన్న పుట్టంగండి వద్ద ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు రూ.7 కోట్లు వ్యయం చేయనున్నారు. నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 507.30 అడుగుల మేర నిల్వలున్నాయి. నీటిమట్టాలు 506 అడుగులకు పడిపోయిన పక్షంలో అత్యవసర పంపింగ్ మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం మే నెల 20వ తేదీ నాటికే మోటార్ల ఏర్పాటు, ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. కాగా కృష్ణా, గోదావరి జలాల అత్యవసర పంపింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విపత్తు సహాయనిధి కింద రూ.40 కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. గోదావరి నీళ్లకూ తప్పదు... కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి తరలిస్తున్న 86 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలకూ మే చివరి నుంచి అత్యవసర పంపింగ్ తప్పదని జలమండలి సంకేతాలిచ్చింది. ఇందుకోసం ఎల్లంపల్లి జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని సేకరించేందుకు అవసరమైన అప్రోచ్ చానల్(కాల్వ)ను తవ్వుతున్నామని జలమండలి వర్గాలు తెలిపాయి. మే చివరి నాటికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే గోదావరి జలాలకూ అత్యవసర పంపింగ్ తప్పకపోవచ్చని స్పష్టంచేశాయి. కృష్ణా, గోదావరిలే వరదాయినిలు.. మహానగర దాహార్తిని తీర్చినసింగూరు, మంజీరా జలాశయాలు వట్టిపోవడం, జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లు డెడ్‌స్టోరేజికి చేరుకున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాలే సిటీజన్ల దాహార్తిని తీర్చే వరదాయినులుగా మారాయి. నిత్యం కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, గోదావరి మొదటిదశ ద్వారా ఎల్లంపల్లి నుంచి 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల నీటిని సిటీకి తరలించి 8.74 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నారు. మే చివరినాటికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే నగర తాగునీటి సరఫరా విషయంలో సంక్షోభం తప్పదన్న సంకేతాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధప్రాతిపదికన పంపింగ్‌కు ఏర్పాట్లు కృష్ణా జలాల అత్యవసర పంపింగ్‌కు 10 మోటార్లను ఏర్పాటు చేయనున్నాం. ఈ మోటార్ల సామర్థ్యం 300 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. మోటార్ల ఏర్పాటు ప్రక్రియను ఇతర అధికారులతో కలిసి బుధవారం పరిశీలించాము. మే 20 వతేదీకల్లా మోటార్ల ఏర్పాటు,ట్రయల్న్ ్రపూర్తవుతుంది. నగర తాగునీటికి ఢోకా ఉండదని భావిస్తున్నాం. - విజయ్‌కుమార్‌రెడ్డి, జలమండలి ట్రాన్స్మిషన్ చీఫ్ జనరల్ మేనేజర్ -
తీరనున్న గ్రేటర్ వరంగల్ ప్రజల దాహార్తి
ఏటూరునాగారం: మంచినీళ్ల కోసం గ్రేటర్ వరంగల్ వాసులు పడుతున్న ఇబ్బందులు అతి త్వరలో తీరనున్నాయి. ఏటూరునాగారం మండలంలోని దేవాదుల నుంచి మంగళవారం నీటి పంపింగ్ ప్రారంభంకానుంది. ఇందుకు వీలుగా అధికారులు గోదావరి ఒడ్డున 16 మోటార్లను ఏర్పాటు చేశారు. గోదావరి నీటిని ఫోర్‌బేలకు మళ్లించి అక్కడి నుంచి భీంఘన్‌పూర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి పులకుర్తి, ధర్మసాగర్‌కు నీరు చేరుతుంది. అక్కడి నుంచి గ్రేటర్ వరంగల్ ప్రజలకు నీటి సరఫరా జరుగుతుంది. గురువారం నాటికి వరంగల్ ప్రజలకు తాగు నీరు అందనుంది. దీంతో నీటి కష్టాలు తీరనున్నాయి. -
డీఆర్సీ ఎప్పుడో?
► ఇన్చార్జి మంత్రిని నియమించి పదినెలలు గడిచినా.. ► అభివృద్ధి సమీక్షపై అధికారగణం నిర్లక్ష్యం ► డబుల్ బెడ్ రూమ్... తాగు నీరే ప్రధాన సమస్యలు ► చర్చించే అవకాశం లేక ఇబ్బందులు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా స్థానిక మంత్రిని నియమించి పది నెలలు గడిచినా.. ఇప్పటి వరకు జిల్లా అభివృద్ధి కమిటీ(డీఆర్సీ) సమీక్ష సమావేశానికి మోక్షం లభించడంలేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజల దరికి చేరుతున్నాయా..? లేదానన్న విషయాలతోపాటు అమలులో చోటుచేసుకుంటున్న లోపాలపై జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షించాల్సి ఉంటుంది. ఇందులో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయటానికి డీఆర్సీ సమావేశం ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్టుగా వివిధ శాఖల అధికారుల పాత్ర ఉండే విధంగా డీఆర్సీ దోహద పడనుంది. ఈ కమిటీ సమావేశాన్ని మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. దాదాపు 40 లక్షల జనాభా దాటిన హైదరాబాద్ జిల్లాలో ప్రజలు ముఖ్యంగా తాగు నీరు, ఇళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఇప్పటికి 1.87 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో మందులు, సరిపడు డాక్టర్లు, సిబ్బంది లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీపీ)ను ప్రజల ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు చేయటం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమస్యలున్నప్పటికీ డీఆర్సీ సమావేశాన్ని నిర్వహించక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు నలుగురు మంత్రులు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నాయిని నర్సింహారెడ్డిని నియమించి పది నెలలు గడిచినా, ఇప్పటి వరకు డీఆర్సీ సమావేశం జరగలేదు. ఈ జిల్లాలో మరో ముగ్గురు మంత్రులు మహామూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావులు ఉన్నారు. వీరెవ్వరూ...డీఆర్సీ సమావేశాల నిర్వహణపై దృష్టి సారించటం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే... జిల్లాలో సమస్యల ప్రాధాన్యత, ఉత్సవాలు, శాఖాపరమైన విషయాలు వచ్చేసరికి మాత్రం మంత్రులు ఎవ్వరికివారుగా సంబంధిత అధికారులతోపాటు జిల్లా అధికారులతో కలిపి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా సమస్యలకు సంబంధించి సమగ్ర చర్చ, అభివృద్ధిపై తగిన చర్యలు తీసుకోలేక పోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా డీఆర్సీ సమావేశం నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులైతే ఏడాదికి పార్లమెంటు సభ్యులకు రూ.5 కోట్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అయితే రూ.1.50 కోట్లు చొప్పున నిధులు విడుదలవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి నియోజకవర్గం అభివృద్ధి నిధుల్లో 50 శాతం నిధులను ఆయా నియోజకవర్గాల్లో వారు చేస్తున్న ప్రతిపాదనలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకునే వీలుండగా, మిగిలిన సగం నిధులు ఖర్చు చేయడానికి మాత్రం ఖచ్చితంగా జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతి తీసుకోవాలి. -
కన్నీటి కృష్ణమ్మ
► శ్రీశైలం జలాశయంలో అట్టడుగుకు నీటిమట్టం ► 2002 తర్వాత మళ్లీ ఈ ఏడాది అదే పరిస్థితి ► తాగునీటి అవసరాల పేరిట తరలింపు ► రాయలసీమ గోడు పట్టని పాలకులు వేసవి ప్రారంభంలోనే శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం అట్టడుగుకు చేరుకుంది. జలాశయంలో పురాతన కట్టడాలు బయటపడుతుండటం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఉన్న నీటితో మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాలను కొంత వరకు తీర్చుకునే అవకాశం ఉంది. ఆలోపు వర్షాలు రాకపోతే పరిస్థితి ఏమిటనే విషయమై నీటి పారుదల శాఖ అధికారులే ఆందోళన చెందుతుండటం గమనార్హం. ఇక ఆగస్టు 2, 2002న అనూహ్యంగా 752.50 అడుగులకు పడిపోయిన నీటిమట్టం.. ప్రస్తుతం అదే స్థాయిలో పడిపోవడం, రెండు సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబే కావడం యాదృచ్ఛికమే. సాక్షి, కర్నూలు: తెలుగు రాష్ట్రాల ప్రధాన జలవనరు శ్రీశైలం జలాశయం. పూర్థి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 215.85 టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో జలాశయంలోకి నీటి చేరిక పూర్తిగా తగ్గిపోయింది. శుక్రవారం నాటికి జలాశయంలో నీటి మట్టం 784.80 అడుగులకు చేరుకోగా.. 22.2200 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాధారణంగా మే నెల ఆఖరుకు జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. అలాంటిది మార్చి మొదటి వారంలోనే ఆ పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిలోనూ తాగునీటి పేరిట సాగర్‌కు శ్రీశైలం నీరు తరలిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత మూడున్నర దశాబ్దాల్లో మొదటిసారిగా ఈ సంవత్సరం 58 టీఎంసీల నీరు మాత్రమే డ్యాంలోకి వచ్చి చేరింది. జలాశయం కనీస నీటి మట్టం 854 అడుగులు. 1996లో ఈ మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జీఓ 69 జారీ చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జీఓ 107తో నీటి మట్టం 885 అడుగులకు పెంచారు. గత నాలుగు సంవత్సరాలుగా శ్రీశైలం జలాశయ కనీస నీటి మట్టం ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి. వాస్తవానికి కృష్ణా డెల్టాలో తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా కృష్ణా బోర్డును కూడా తప్పుదోవ పట్టించి నీటిని దిగువకు పారిస్తున్నారు. వాస్తవానికి కోస్తాతో పోలిస్తే రాయలసీమలోనే తాగునీటి సమస్యలు అధికం. రాయలసీమకు కన్నీళ్లే.. తెలంగాణ, కృష్ణా డెల్టాలో తాగునీటి ఇక్కట్ల పేరుతో జలాశయం నీటిని తరలిస్తున్న పాలకులు.. గొంతెండిన రాయలసీమను ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇక్కడి ప్రజలపై చూపుతున్న ప్రేమకు నిదర్శనం. కనీసం ఇక్కడి పరిస్థితిని కృష్ణా బోర్డుకు వివరించే ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సీమకు శ్రీశైలం జలాశయం నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పారించాల్సి ఉంది. జలాశయంలో 841 అడుగలకు పైగా నీటి మట్టం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. గత ఏడాది 841 అడుగులకు చేరక ముందు నుంచే ఒకవైపు తెలంగాణ.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి అవసరాల పేరిట నీరు వినియోగించారు. నీటి మట్టం 845 అడుగులకు చేరుకున్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడం.. కర్నూలు ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో పోతిరెడ్డిపాడుకు కంటితుడుపుగా నీరు విడుదల చేశారు. ఈలోపు నీటి మట్టం 841 అడుగులకు చేరుకోగానే నీటి విడుదల నిలిపేశారు. సా..గుతున్న ముచ్చుమర్రి ప్రస్తుతం శ్రీశైలంలో 784 అడుగులకు నీటి మట్టం చేరినా.. సీమకు కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంది. ఇందుకు ముందుచూపుతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో కనీసం రెండు మోటార్ల పనులు పూర్తి చేసినప్పుడే సాధ్యమవుతుంది. అయితే ఈ పథకం విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. -
సాగర్‌లోనూ తోడేద్దాం!
♦ కనీస మట్టానికి దిగువన నీటిని తీసుకునేందుకు రంగం సిద్ధం ♦ తెలంగాణ, ఏపీ మధ్య సూత్రప్రాయ అవగాహన సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే కనీస మట్టాల దిగువ వరకూ నీటిని పంచుకున్న తెలంగాణ, ఏపీ నాగార్జునసాగర్‌పై దృష్టి పెట్టాయి. సాగర్‌లో కనీస నీటి మట్టాల దిగువన ఉన్న నీటిని సైతం వాడుకోవాలని నిర్ణయించాయి. దీనిపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన అధికారుల స్థాయి చర్చల్లో అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. జూన్ వరకు శ్రీశైలం నీటిని వాడుకోవాలని, జూన్‌లో కొరతగా ఉండే నీటిని సాగర్ దిగువ నుంచి తీసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి వినియోగం కోసం.. శ్రీశైలంలో వినియోగార్హమైన 11.24 టీఎంసీ నీటిని తక్షణ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ, ఏపీలు వాడుకునేందుకు కృష్ణా బోర్డు అంగీకరించింది. అందులో 6.5 టీఎంసీలు తెలంగాణకు, 4.5 టీఎంసీలు ఏపీకి కేటాయించింది. ఈ నీటితోనే వేసవిలో నెట్టుకురావాలని సూచించింది. కానీ కేటాయించిన నీటినంతా వాడేసుకున్న ఏపీ.. తన తాగునీటి అవసరాల కోసం శ్రీశైలంలో 790 అడుగుల కనీస మట్టానికి దిగువన 780 అడుగుల వరకు లభ్యతగా ఉండే నీటిని పంచాలని బోర్డుకు విన్నవించింది. విస్తృత చర్చల అనంతరం 790 అడుగుల దిగువన లభ్యతగా ఉండే 4 టీఎంసీల్లో ఒక టీఎంసీని తెలంగాణకు, 3 టీఎంసీలు ఏపీకి పంచింది. అయితే ఈ నీరు జూన్ తర్వాత అవసరాలకు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో... సాగర్ దిగువన నీటిని తోడాలన్న ప్రతిపాదన వచ్చింది. సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగుల దిగువన 4 టీఎంసీల వరకు నీటిని తోడుకునే అవకాశం ఉంటుందని, హైదరాబాద్ అవసరాలకు నీటిని తరలించేలా ఎమర్జెన్సీ మోటార్లు అందుబాటులో ఉన్నాయని అధికారుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై ప్రాథమికంగానే నిర్ణయం తీసుకున్నారని, బోర్డు సమక్షంలో మరోమారు సమావేశమై తుది నిర్ణయం చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. -
శ్రీశైలం నీటిపై సందిగ్ధత
నీటి విడుదల కోరుతున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాలకు దిగువన సైతం నీటిని తోడే అంశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తీవ్రమైన తాగు నీటి కొరత దృష్ట్యా కనీస మట్టానికి దిగువ నుంచి సైతం నీటిని తీసుకునే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గట్టిగా కోరుతుండగా తెలంగాణ దీన్ని వ్యతిరేకిస్తోంది. దీనిపై బుధవారం ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమయ్యారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి హాజరు కావాల్సిన ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఇతరత్రా కారణాలతో హాజరుకాలేదు. తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు మరో 6 నుంచి 7 టీఎంసీల నీరు అవసరం ఉన్న దృష్ట్యా శ్రీశైలంలో 790 అడుగుల దిగువన సైతం నీటిని తీసుకునేందుకు సహకరించాలని ఏపీ ఈఎన్సీ రాష్ట్ర కార్యదర్శిని కోరారు. అయితే దీనిపై జోషి ఎలాంటి నిర్ణయం చెప్పారన్నది బయటకి తెలియరాలేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 790 అడుగుల వద్ద 4.06 టీఎంసీల వినియోగార్హమైన నీరు మాత్రమే ఉంది. అది పూర్తిగా తెలంగాణకు కేటాయించిన దే. కాగా ఈ నెల 10న కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత శ్రీశైలం దిగువన నీటిని తీసుకునే అంశంపై నిర్ణయం చేసే అవకాశాలున్నాయని నీటి పారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
విప్పర్ల చెరువును ఆధునీకరించండి..
► అప్పుడే నరసరావుపేట తాగు నీటి సమస్య పరిష్కారం ► స్టోరేజ్ ట్యాంక్‌లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట వెస్ట్ : నరసరావుపేట పట్టణ ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటి అవస్థలు తీరాలంటే రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలో ఉన్న 200 ఎకరాల చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. పట్టణ ప్రజల తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు. పట్టణానికి తాగునీటిని అందించే రావిపాడు శాంతినగర్ రిజర్వాయర్, నకరికల్లులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఆదివారం ఆయన ప్రజారోగ్య శాఖ ఈఈ నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. విప్పర్ల చెరువుకు సాగర్ మైనర్ కాలువ ద్వారా సరాసరి నీరు తరలుతున్నందున కొద్ది సమయంలోనె చెరువు నిండుతుందన్నారు. కేవలం రూ.30 లక్షల వ్యయంతో ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చవచ్చని చెప్పారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుతో పాటు విప్పర్ల చెరువు నీరు కూడా ఉంటే తాగునీటి అవస్థలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చన్నారు. పది రోజులుగా సాగర్ కాలువల ద్వారా వస్తున్న నీరు ప్రస్తుతం నకరికల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 15 శాతం మాత్రమే చేరిందని చెప్పారు. రోజు విడిచి రోజు ఇస్తే రెండు లేదా మూడు నెలలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో వర్షాలు పడితే కాలువలకు నీరు వదిలే అవకాశం ఉంటుందని ఎన్ఎస్పీ ఎస్ఈ తెలిపారన్నారు. అధికారుల విఫలం.. రిజర్వాయర్లను నింపటంలో కూడా అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేక విఫలమయ్యారని ఆయన తెలిపారు. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చుచేసి 20 మోటార్లను వినియోగించి రిజర్వాయర్లు నింపే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు కార్పొరేషన్ మాదిరిగానే రూ.15 లక్షలతో 500 హార్స్ పవర్ ఇంజిన్‌ను కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే తక్కువ సమయంలోనే ట్యాంకును 50 శాతం వరకు నింపవచ్చన్నారు. అలాగే, కాలువ తూములను 2 నుంచి నాలుగైదు మీటర్లకు పెంచాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, జిల్లా కార్యదర్శులు షేక్ ఖాదర్‌బాషా, కందుల ఎజ్రా, కౌన్సిలర్లు ఉన్నారు. -
గొంతెండుతోంది..
♦ వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఎద్దడి తీవ్రతరం ♦ వందలాది గ్రామాల్లో అష్టకష్టాలు పడుతున్న ప్రజలు ♦ ప్రొద్దుటూరులో నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా ♦ కడపలో ఎండిన బోర్లు.. పలు కాలనీల్లో మూడు రోజులకోసారి నీటి విడుదల ♦ పెండ్లిమర్రి, దువ్వూరు, బి.కోడూరులలో వ్యవసాయ బోర్ల వద్దకు జనం పరుగులు మాటలు కోటలు దాటేలా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వారు.. ఆ హామీలను అమలు చేయకపోగా కనీసం తాగు నీటిని కూడా ఇవ్వలేకపోతున్నారని జనం మండిపడు తున్నారు. పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నీటి ఎద్దడి నెలకొన్న గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్న మాటలు వాస్తవం కాదని ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడైంది. సాక్షి, కడప : వేసవి ప్రారంభంలోనే తాగు నీటి ఎద్దడి తీవ్రతరమైంది. నవంబర్‌లో భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు పోటెత్తడంతో ఇక నీటికి కరువు ఉండదని అందరూ భావించారు. మార్చి నెలలో భానుడి ఉగ్ర రూపానికి అక్కడక్కడ నిలువ ఉన్న నీరంతా అవిరైపోయింది. భూగర్భ జల మట్టం సైతం అనూహ్యంగా తగ్గిపోయింది. పర్యవసానంగా బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. గ్రామాల్లో ఉన్న ఫలంగా తలెత్తుతున్న తాగునీటి సమస్యతో ప్రజలు హోరెత్తుతున్నారు. దాహార్తి తీర్చుకునేందుకు దారులు వెతుకుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో మంచి నీటి కోసం ప్రజలు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఏప్రిల్, మే, జూన్ నాటికి ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 లక్షల జనాభా ఉండగా, కేవలం 20 లక్షల మందికి మాత్రమే నీటి పథకాల ద్వారా అందించే నీరు సరిపోతున్నట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు లాంటి ప్రధాన పట్టణాలలో సైతం తాగునీటి సమస్య జఠిలంగా మారింది. ప్రొద్దుటూరులో నాలుగు రోజులకోసారి.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీతోపాటు పరిసర గ్రామాల్లోనూ తాగునీటి సమస్య ఎక్కువగా కంగారు పెడుతోంది. పట్టణ ప్రజలకు 14 ఎంఎల్డీల నీటిని అందించాల్సి ఉండగా, కేవలం 8 ఎంఎల్డీల నీటిని మాత్రమే అందిస్తున్నారు. ఆరు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా, అవి ఏ మూలకూ సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. చాలా వార్డుల్లో నాలుగు రోజులకు ఒకసారి నీరందిస్తున్నారు. పెన్నానది ఎండిపోవడం, కేసీ కెనాల్ చుట్టు పక్కల బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. నాగులకట్టవీధి, సంజీవనగర్, స్వరాజ్‌నగర్, బాలాజీనగర్-1, 2, అమృతానగర్, గీతాశ్రమం చుట్టు పక్కల ప్రాంతాలు, 35 వార్డుల్లో సమస్య మరింత తీవ్రతరం కానుంది. ఉప్పరపల్లె, బొజ్జవారిపల్లెలో బోర్లు ఎండిపోవడంతో ప్రజలు బావి వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. కొత్తపేట, శంకరాపురం, చౌడూరు, చిన్నశెట్టిపల్లెల్లో నీటి సమస్య ఆందోళన కలిగిస్తుండగా, కొర్రపాడులో ఆరు రోజులకు ఒకసారి నీరందిస్తున్నారు. వెలవల్లి రోడ్డులో ఉన్న బోరు వద్దకు ట్రాక్టర్లు, సైకిళ్లు, బైకుల్లో వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్నానాలు, దుస్తులు శుభ్రపరుచుకోవడానికి కూడా ఇబ్బంది ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు. వందలాది గ్రామాల్లో సమస్య మొదలు.. జిల్లాలోని వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య ప్రారంభమైంది. అయితే ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మాత్రం పదుల సంఖ్యలోని గ్రామాల్లో మాత్రమే సమస్య ఉందని చెబుతున్నారు. రాయచోటి నియోజకవర్గంలో సుమారు 80కి పైగా గ్రామాల్లో, జమ్మలమడుగు పరిధిలో 15 గ్రామాల్లో సమస్య ఏర్పడింది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో మురికి నీరు వస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాజంపేట పరిధిలో ఐదు గ్రామాల్లో, కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలంలో ఐదు గ్రామాల్లో నీటి సమస్య ఇబ్బంది పెడుతోంది. బద్వేలు మున్సిపాలిటీతోపాటు చుట్టు పక్కల 20 గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడింది. బి.కోడూరు మండలం నరసింహాపురంలో వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి ప్రజలు నీటిని తెచ్చుకుంటున్నారు. దువ్వూరు మండలంలో కూడా వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్ ఆఖరు నాటికి 1000-1500 గ్రామాల్లో సమస్య తీవ్రతరం కానుంది. కాగా, జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.7.20 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. పాతాళంలోకి గంగమ్మ.. కడప ఎడ్యుకేషన్: జిల్లాలో భూగర్భ జల మట్టం 12 మీటర్లకు పడిపోయింది. ఫలితంగా జిల్లాలో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తనుంది. సీకేదిన్నె, గాలివీడు, దువ్వూరు, గోపవరం, ఖాజీపేట, నందలూరు, రాజంపేట, రాజుపాలెం, రామాపురం, రాయచోటి, ఒంటిమిట్ట మండలాల్లో ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒకటి నుంచి 5 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 12 మీటర్లకు పడిపోయింది. బిమఠం, చక్రాయపేట, చెన్నూరు. చిట్వేల్, కడప, కమలాపురం, లింగాల, మైలవరం, పెనగలూరు. ప్రొద్దుటూరు, పుల్లంపేట, సంబేపల్లి, సిద్దవటం, తొండూరు. వీఎన్‌పల్లి, వల్లూరు. వీరబల్లి, వేముల, ఎర్రగుంట్ల మండ లాల్లో 5 నుంచి 10 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం 15 మీటర్లకు దిగజారింది. అట్లూరు. బికోడూరు. బద్వేల్, చిన్నమండెం, జమ్మలమడుగు, కోడూరు, కొండాపురం, ఎల్‌ఆర్‌పల్లి, ముద్దనూరు, మైదుకూరు. ఓబులవారిపల్లె, పెద్దముడియం, పెండ్లిమర్రి, పులివెందుల, సింహాద్రిపురం, టి సుండుపల్లి మండలాల్లో 20 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. పోరుమామిళ్ల, కాశినాయన, వేంపల్లి మండలాల్లో మాత్రం 30 మీటర్ల లోతులో, కలసపాడు మండలంలో 30 మీటర్లు పైన నీటి మట్టం ఉంది. మంచినీటి ఎద్దడిని అధిగమిస్తాం ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన సంజీవరావు కడప ఎడ్యుకేషన్: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడ మంచినీటి ఎద్దడి తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకుంటామని గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్యం శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు సంజీవరాయుడు పేర్కొన్నారు. ఒంగోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై కడపకు వచ్చారు. ఈమేరకు సోమవారం ఎస్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మంచినీటి సమస్య రాకుండా చూస్తామన్నారు. ఈఈలతో చర్చించి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైన సమస్య వస్తే యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసి గ్రామీణ ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు. శుభాకాంక్షలు తెలిసిన ఈఈలు, డీఈలు జిల్లా సూపరెండెంట్ ఇంజనీరుగా బాధ్యతలు చేపట్టిన సంజీవరావుకు జిల్లాలోని పలు డివిజన్లకు చెందిన ఈఈలు, డీఈలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో మంచినీటి సమస్య గురించి అయన వారితో చర్చించారు. -
తాగునీటి కష్టాలు రానివ్వం
► రూ.19 కోట్లతో వేసవి కార్యాచరణ ► 197 ఆవాసాల్లో ప్రైవేటు బోర్లు అద్దెకు ► రెండు ఊళ్లకు బయటి నుంచి నీరు ► ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాంచంద్ సాక్షిప్రతినిధి, వరంగల్ : వేసవిలో నీటి ఎద్దడి నివారణపై గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. వరుసగా రెండో ఏడాది కరువు వచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంత కిందికి వెళ్లాయి. గ్రామాల్లో మంచినీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంముందుగానే ప్రణాళిక రూపొందించిందని ఈ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎల్.రాంచంద్ తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలోని 195 ఆవాసాల్లో తాగునీటి ఇబ్బంది నెలకొందని, ఈ ప్రాంతాలకు స్థానికంగా ఉన్న 247 ప్రైవేటు బోర్లను కిరాయికి తీసుకుని తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం నర్మెట మండల కేంద్రం, అంకుశాపూర్(బచ్చన్నపేట)లో తీవ్ర నీటి సమస్య ఉందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి రవాణా మార్గంలో ఈ రెండు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కరువు నేపథ్యంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోసం ప్రత్యేకంగా రూ.17.27 కోట్లు కేటాయిందని ఎస్ఈ తెలిపారు. గ్రామాల్లోని ప్రభుత్వ పరంగా ఉన్న నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బోరు బావులు, పైపులైన్ మరమ్మతు, పైపులైన్ల విస్తరణ, ఎండిపోయిన నీటి వనరుల పునరుద్ధరణ వంటి పనులను ఈ నిధులతో పూర్తి చేస్తామని తెలిపారు. కరువు పరిస్థితి ఉన్న 11 మండలాల్లోని ప్రజల తాగునీటి ఇబ్బందులను అధిగించేందుకు విపత్తు సహాయ నిధి(సీఆర్ఎఫ్) నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు విడుదల చేసిందని ఆయన వివరించారు. సీఆర్‌ఎఫ్‌లోని రూ. 1.54 కోట్లతో తాగునీటి సరఫరా కోసం 730 పనులు చేపట్టినట్లు తెలిపారు. విపత్తు నిర్వహణ నిధుల కింద గత ఏడాది పనులు చేపట్టిన బిల్లుల కోసం ప్రభుత్వం రూ.3.97 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూస్తున్నామని, రోజువారీగా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈ రాంచంద్ చెప్పారు. -
ముంచుకొస్తున్న తాగునీటి గండం
రాయచూరుకు తప్పని తాగునీటి ఎద్దడి రాయచూరు రూరల్ : రాయచూరు పట్టణానికి తాగునీటిని అందిస్తామని ప్రగల్భాలు పలికిన నగరసభ అధికార యంత్రాంగానికి మరో 10 రోజుల్లో నీటి గండం ఎదురు కానుంది. పట్టణ జనాభా సుమారు 4 లక్షలు ఉంది. ప్రస్తుతం రాయచూరులో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా నగర సభ అధ్యక్షుడు, తాగునీటి సరఫరా మండలి ఉపాధ్యక్షుడు జయణ్ణలు చర్యలు తీసుకుంటున్నా, పట్టణానికి నీరందించే రాంపూర్, గణేకల్ రిజర్వాయర్లలో ఉన్న నీరు మరికొన్ని రోజుల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. రాంపూర్ జలాశయంలో ప్రస్తుతం 12 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. రాంపూర్ రిజర్వాయర్ నుంచి రాయచూరు ప్రధాన నీటి పంపింగ్‌కు 5 కి.మి.ల దూరంలో వుంది. 12 అడుగుల నీరు ఈ నెలాఖరు వరకూ సరఫరా చేసేందుకు సరిపోతాయి. ఆ తర్వాత పట్టణ ప్రజలను నీటిని ఎలా అందించాలనే ప్రశ్న నెల కొంది. ఈ విషయంలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లాధికారి ప్రకటిస్తున్నారు. 95వ మైలు వద్ద గణేకల్ రిజర్వాయర్ వుండటం వల్ల అక్కడి నుంచి రాంపూర్ జలాశయానికి నీటిని కాలువల గుండా విడవటానికి దాదాపు 22 కి.మి.ల దూరంలో ఉంది. ఏదేమైనా రాంపూర్ జలాశయంలో నీరు ఖాళీ కాక మునుపే గణేకల్ రిజర్వాయర్ నుంచి రాంపూర్ రిజర్వాయర్‌కు నీటిని నింపేందుకు చర్యలు చేపట్టాల్సి వుంది. -
పునరావాస కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం
►జాయింట్ కలెక్టర్ రాంకిషన్ ►ఇంటికో ఉద్యోగం ఇప్పించండి ►సంగంబండ బాధితల మొర మక్తల్: పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరిస్తామని, ఇందుకు అందరూ సహకరించాలని జేసీ రాంకిషన్ సంగం ముంపు బాధితులను కోరారు. శుక్రవారం మండల సమీపంలో చేపడుతున్న పునరావాస కేంద్రమైన కొత్తగార్లపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా నీటి సమస్య వేధిస్తోందని, దీంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. పునరావాసంలో 240 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 79 ఇళ్లు పూర్తి కాగా 64 బేస్‌మెంట్‌లెవల్, 15 ఇళ్లుపైకప్పు వరకు, 46 ఇళ్లు పనులు చేపట్టలేదని అధికారులు నివేదికలను సమర్పించారు. అందులో పది మంది మృతి చెందారని పేర్కొన్నారు. కొందరు శ్మశాన వాటికకు స్థలంలేదని, మరికొందరు తమకు ఇళ్లస్థలాలు చూపలేదని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కన్నీటితో దాహం తీర్చుకోవాలా సారూ.. పునరావాస కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన జేసీ రాంకిషన్‌కు హృదయ విదారకర ఘటన ఎదురైంది. తాగేందుకు గుక్కెడు నీరు లేవు. కన్నీటితో దాహం తీర్చుకోవాలా సారూ...అంటూ బాధితులు మొరపెట్టుకున్నారు. భగభగ మండే ఎండలో దాహం తీర్చుకోడానికి నీళ్లు లేక తాము ఎలా బతకాలి... ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని కొందరు ప్రశ్నించారు. నీటి కోసం ఎంత మంది కాళ్లు పట్టుకోవాలి..ఎవరినని అడుక్కోవాలి సారూ...అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇందుకు చలించిపోయిన ఆయన వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారి నాగరాజు పనితీరు గురించి ఆరా తీయగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఈకి ఫోన్ చేయగా విద్యుత్ మోటార్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని కొందరు తెలపగా ప్రస్తుతానికి ఒక మోటారుతో సరిపెట్టుకోవాలని, ఆ తరువాత శాశ్వత పరిష్కారానికి చర్యలు తీ సుకుంటామన్నారు. పదైదు రోజుల కోసారి వచ్చి పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు. గార్లపల్లిని ఖాళీ చేయాలి ఆ తరువాత సంగంబండ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఊట్కూర్ మండలం గార్లపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. త్వరలో ఖాళీ చేయాలని బాధితులకు తెలపగా నీటి సమస్యను పరిష్కరించేంత వరకు ఖాళీ చేయమని స్పష్టం చేశారు. సర్వం కో ల్పోయామని తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. కొత్తగార్లపల్లిలో రేషన్‌షాపు, అంగన్వాడీ తదితర అనేక సమస్య లు ఉన్నాయని జేసీకి తెలపగా అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నారాయణపేట్ ఆర్డీఓ వేణుగోపాల్, హౌసింగ్ డీఈ సురేందర్‌గౌడ్, తహసీల్దార్లు అంజిరెడ్డి, మాదవ్‌రావు, హౌసింగ్ ఏఈలు విజయకుమార్, వీరేష్‌చారి, సతీష్‌కుమార్, నాగరాజు, బాల్‌రాజు, ఆర్ఐ భాస్కర్, వీఆర్ఓలు నారాయణ, ఆనంద్, మల్లికార్జున, నిర్వాసితులు మల్లేష్‌గౌడ్, శాంతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
వా'ట'ర్
► కడుపు ఎండి.. గుండె మండి ► కోయిల్‌సాగర్ నీళ్లు వదిలిన రైతులు ► ఎడమకాల్వల చట్రం ధ్వంసం ► రైతులతో చర్చించిన డీఎస్పీ, ఆర్డీఓ ► మనుషులకే కాదు..పశువుల గొంతులు తడవని పరిస్థితి ► కోయిల్‌సాగర్ నుంచి కాలువలకు రైతులే నీటి విడుదల ► కోయిల్‌సాగర్‌ను ముట్టడించిన మూడు మండలాల రైతులు, ప్రజలు తాగునీటి కోసం కోయిల్‌సాగర్ నుంచి కాలువలకు నీటిని వదలాలని కోరుతూ దేవరకద్ర నియోజకవర్గంలోని మూడు మండలాల రైతులు, ప్రజలు శుక్రవారం ప్రాజెక్టు గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు. నీటిని విడుదల విషయమై సిబ్బందితో మాట్లాడారు. తామేమీ చేయలేమని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహంతో తూముగేట్లను పైకి లేపారు. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు.మూడున్నర గంటలపాటు కాల్వల వద్దకాపలాగా ఉండి వంటావార్పు చేశారు. దేవరకద్ర: రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.. చెంతనే నీళ్లున్నా దాహం తీర్చుకోలేని, పొలాలకు పారించుకోలేని పరిస్థితిని చూసి వారి కడుపుమండింది. కలెక్టర్ సైతం తమ వినతి వినిపించుకోలేని దైన్యం చూసి ఆవేశం దహించుకుపోయింది.. తాగు, సాగునీటి కోసం కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేయాలని నాలుగురోజుల క్రితం కలెక్టర్‌కు విన్నవించినా ఆమె పట్టించుకోకపోవడంతో శుక్రవారం దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల రైతులు వేలాదిగా వచ్చి తూములు తెరిచి నీటిని దిగువకు వదిలారు. అయితే ఉదయం మూడు మండలాలకు చెందిన రైతులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గె స్ట్హౌస్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిబ్బంది అధికారుల అనుమతిలేకుండా నీటివిడుదల సాధ్యం కాదని తేల్చిచెప్పడంతో కోపోద్రిక్తులైన రైతులు కోయిల్‌సాగర్ ఎడమకాల్వ హ్యాండిల్‌తో పాటు షట్టర్‌ను ధ్వంసం చేశారు. దీంతో నీరంతా కాల్వద్వారా పరవళ్లు తొక్కింది. అనంతరం ధన్వాడ వైపు ఉన్న కుడికాల్వ హ్యాండిల్‌ను తిప్పి నీటిని వదిలారు. రెండుకాల్వల ద్వారా నీరు విడుదల చేసిన రైతులు సమీపంలోనే చెట్లకింద వంటావార్పు చేసుకుని అక్కడే ఉండిపోయారు. అధికారులు వచ్చి నీటిని నిలిపేస్తారేమోనని భావించిన రైతులు కాపలా ఉన్నారు. ఇలా మూడున్నర గంటల పాటు కాల్వల్లో నీరు ఉధృతంగా ప్రవహించింది. పర్యవేక్షించిన ఆర్డీఓ, డీఎస్పీ విషయం తెలుసుకున్న నారాయణపేట ఆర్డీఓ వేణుగోపాల్, గద్వాల డీఎస్పీ బాలకోటి అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అప్పటికే దేవరకద్ర, ధన్వాడ పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడి వచ్చారు. నీటిని విడుదల చేయడం చట్టరీత్యా నేరమవుతుందని రైతలను సముదాయించారు. కలెక్టర్‌తో మరోసారి చర్చిద్దామని రైతులకు నచ్చచెప్పారు. రైతులు దిగిరాకపోవడంతో ప్రాజెక్టు చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు రైతునాయకులతో చర్చించారు. చివరకు నీటి విడుదలను నిలిపివేసేందుకు రైతులు అంగీకరించడంతో అధికారులు మొదట కుడికాల్వ నీటిని నిలిపేశారు. ఎడమకాల్వలను కొద్దిసేపటి తరువాత మూసివేశారు. కోయిల్‌సాగర్ నీళ్లను వదులుకోవద్దు జూరాల: జూలై చివరి వరకు మహబూబ్‌నగర్ పట్టణ తాగునీటి అవసరాలకు కోయిల్‌సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని అందించాల్సి ఉన్నందున, ఎవరూ పంటలకు విడుదల చేసుకోవడానికి ప్రయత్నించకూడదని జిల్లా ప్రాజెక్టుల సీఈ ఖగేందర్ కోరారు. మహబూబ్‌నగర్ పట్టణ తాగునీటి అవసరాలకు(జూలై చివరి వరకు) 200 ఎంసీఎఫ్‌టీ ఉందని, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వివిధ గ్రామాలకు 40 ఎంసీఎఫ్‌టీ నీళ్లు అందించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్‌లో కేవలం 240ఎంసీఎఫ్‌టీ నీటినిల్వ మాత్రమే ఉందని, అందులో 50ఎంసీఎఫ్‌టీల నీళ్లు ఆవిరి అవుతాయన్నారు. మొత్తం 290 ఎంసీఎఫ్‌టీ నీళ్లు తాగునీటికి అవసరం కాగా 50 ఎంసీఎఫ్‌టీల కొరత ఇప్పటికే ఉందన్నారు. వేసవిలో వర్షాలు కురవకపోతే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలని ప్రాజెక్టుల సీఈ ఖగేందర్ కోరారు. కలెక్టరేట్లో రెండుగంటల హైడ్రామా! మహబూబ్‌నగర్ న్యూటౌన్: కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం రెండుగంటల పాటు హైడ్రామా కొనసాగింది. కోయిల్‌సాగర్ వద్ద తాగునీటి కోసం ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేకవాహనాల్లో కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. కలెక్టర్ అప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ముగించుకుని వెళ్లిపోయారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి కలెక్టరేట్లో పోలీసులు మోహరించారు. రైతుల నుంచి విషయం తెలుసుకున్న ఆయన ఫోన్లో కలెక్టర్‌కు వివరించారు. జాయింట్ కలెక్టర్ రాంకిషన్ వస్తారని డిఎస్పీ వారికి సూచించారు. కలెక్టరేట్లో రెండుగంటల పాటు నిరీక్షించిన రైతులు డీఆర్వోకు విషయాన్ని వివరించి జేసీ రాంకిషన్ రాక విషయంపై స్పష్టత తీసుకున్నారు. ఆయన పెళ్లిలో ఉన్నారని, శనివారం ఉదయం 10గంటలకు రావాలని సూచించారు. విషయం తెలుసుకున్న రైతులు చివరికి నిరాశతో వెనుదిరిగారు. -
ఒట్టిపోయిన ఆశలు
జలాశయాల్లో అడుగంటిన నీరు మృత్యువాత పడుతున్న జలచరాలు ఉరుముతున్న నీటి ఎద్దడి బెంగళూరు: రాష్ట్రంలో జలాశయాలు అడుగంటాయి. ఎప్పుడూ లేనంతగా కృష్ణ, కావేరి నది పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో డెడ్ స్టోరీజీ కంటే నీటి మట్టం కిందకు పడిపోయింది. ఈసారి వేసవిలో బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటిని ఎలా సరఫరా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఆయా నదుల్లో నీటి మట్టం తగ్గిపోతుండటంతో అందులోని జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలో కృష్ణ, కావేరి నదీ పరివాహక ప్రాంతంలో జలాశయాల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తాగు, సాగు నీరు అందుతుండేది. పరిశ్రమల అవసరాలకు ఈ నీరే శరణ్యం. అయితే రాష్ట్రంలో రెండు వ్యవసాయ సీజన్లలోనూ (ఖరీఫ్, రబీ) తక్కువ వర్షపాతం నమోదైంది. అంతేకాకుండాఅంతకు ముందు రెండేళ్లు కూడా వర్షం సరిగా పడలేదు. దీంతో రాష్ట్రంలోని నదుల్లో నీటి ప్రవాహనం తగ్గిపోవడంతో జలాశయాల్లో కూడా నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి. కావేరి నదీతీరంలోని కేఆర్ఎస్, హారంగి, హేమావతి, కబిని జలాశయాల్లో ప్రస్తుతం 19.34 టీఎంసీల నీరు నిల్వ ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 38.75 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. బెంగళూరుకు తాగునీటిని అందించే కే.ఆర్.ఎస్‌లో ప్రస్తుతం 10.88 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే నీటి పరిమాణం సగాని కంటే తక్కువ. ఉత్తర కర్ణాటక ప్రాంతంల్లోని జిల్లాలకు తాగు,సాగు నీటిని అందించే కృష్ణ నదీపరివాహక ప్రాంతంలోని భద్ర, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, ఆల్మట్టి, నారాయణపుర జలాశయాల్లో గత ఏడాది ఈ సమయానికి 119.77 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 64.41 టీఎంసీలకు పడిపోయింది. వీటిలో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ భాగాలకు సాగునీటిని అందించే తుంగభద్ర డ్యాం మరీ ఘోరం. ఈ డ్యాంలో ప్రస్తుతం 7.40 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇదే సమాయానికి తుంగభద్ర డ్యాంలో 18.52 టీఎంసీల నీరు ఉండటం గమనార్హం. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల 98 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా ఈ ఏడాది 137 తాలూకాల్లో కరువు తాండవిస్తోంది. ఈ విషయమై రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎం.బీ పాటిల్ మాట్లాడుతూ...‘జలాశయాల్లో నీరు లేక పోవడం వల్ల రాష్ట్రంలోని ప్రజలకు తాగు నీటిని అందించడమే గగనమవుతోంది. అందువల్లే రబీ పంటల కోసం కాలువలకు నీటి విడుదలను ఇప్పటికే నిలిపివేశాం. పరిశ్రమల అవసరాలకు నీటిని ఇవ్వకూడదని కూడా సంబంధితఅధికారులకు సూచించాం. అయినా ప్రజల దాహార్తిని తీరుస్తామని చెప్పలేం. వర్షం కోసం దేవుడిని ప్రార్థించాల్సిందే.’ అని పేర్కొన్నారు. -
చిక్కని చుక్క
► గుక్కెడు నీరు కరువాయే ► అడుగంటిన తాగునీటి చెరువులు ► ట్యాంకర్లతో సరఫరా ఏదీ.. ► మళ్లీ నీటి విడుదల ఎప్పటికో.. ► తీరాన్ని వదలని తాగునీటి కష్టాలు పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా తీరప్రాంతవాసుల పెదవులు తడారిపోతున్నాయి. సరైన ప్రణాళిక లేకుండా గత నెలలో ఐదు రోజులపాటు కాలువలకు నీరు విడుదల చేసినా శివారుకు చుక్క దక్కని దుర్భర పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాగునీటి చెరువులు ఎండిపోయాయి. తీర ప్రాంతంతో పాటు కృష్ణానదిలో నీరు అడుగంటడంతో పలు తాగునీటి పథకాలు పడకేసి ఏటిపట్టు గ్రామాల్లోనూ దాహం కేకలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నం : ప్రస్తుతం జిల్లాలోని పరిస్థితి చూస్తుంటే వేసవి సమీపిస్తున్న కొద్దీ మంచినీటి ఎద్దడి అధికమయ్యేలా ఉంది. గ్రామాల్లోని సామూహిక రక్షిత మంచినీటి చెరువులు అడుగంటడంతో ఎప్పుడు తాగునీటి సరఫరా నిలిచిపోతుందో తెలియని దుస్థితి. నందివాడ మండలం లక్ష్మీరసింహపురం తాగునీటి చెరువులో నీరు అడుగంటి పచ్చగా మారింది. నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లోని తాగునీటి చెరువు జనవరిలోనే ఎండిపోయింది. గుంటూరు జిల్లా రాజు కాలువ నుంచి కృష్ణానదిలో ఉన్న పైప్‌లైన్ ద్వారా ఈ చెరువుకు నీరు రావాల్సిఉంది. పాలకులు పట్టించుకోకపోవడంతో ఎదురుమొండి దీవుల్లోని చెరువులోకి చుక్కనీరు చేరలేదు. అక్కడి ప్రజలు గ్రామం నుంచి వలసపోయే దుస్థితి దాపురించింది. జిల్లాలో 374 తాగునీటి చెరువులుండగా అధిక శాతం చెరువుల్లో 20 నుంచి 35 శాతం మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. ఫిబ్రవరిలో కాలువలకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసినా తీరప్రాంతంలోని బందరు, కోడూరు, నాగాయలంక, బందరు, గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలతోపాటు కాలువ శివారున ఉన్న నందివాడ, కైకలూరు నియోజకవర్గ పరిధిలోని పలు కొల్లేటిలంక గ్రామాల్లోని తాగునీటి చెరువులకు నీరు చేరలేదు. జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎక్కడెక్కడంటే.. బందరు మండలంలోని కోన, పల్లెతుమ్మలపాలెం, చిన్నాపురం, తుమ్మలచెరువు, వాడపాలెం, పెదయాదర గ్రామాల్లోని తాగునీటి చెరువులు ఎండిపోయాయి. ఇటీవల కాలువలకు నీరు విడుదల చేసినా ఆ నీరు తొమ్మిదవ ప్రధాన కాలువలకు రాలేదు. దీంతో చెరువులు నింపలేదు. తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకునీటి సామర్థ్యం 6 మీటర్లు కాగా ఇటీవల 2.50 మీటర్ల మేర మాత్రమే నీటిని నింపారు. ఈ చెరువు ద్వారా మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాల్లోని 4.50 లక్షల మందికి తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ట్యాంకులోని ప్రస్తుతం ఒక మీటరుకు నీటిమట్టం చేరింది. మూడు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ముందుముందు వారానికి ఒకసారి సరఫరా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పెడన మండలం ఉప్పలకలవగుంట మంచినీటి పథకం ద్వారా 17 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే చెరువును కొద్దిమేర నింపారు. కాకర్లమూడి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడక, జింజేరు, అర్తమూరు, చోడవరం, ముచ్చర్ల, నేలపాడు, దేవరపల్లి చెరువులకు నీరు చేరకపోవడంతో అడుగంటి తాగేందుకు పనికిరాకుండా ఉంది. కోడూరు మండలంలోని ఉల్లిపాలెం, నాగాయలకం మండలంలోని గుల్లలమోద, అవనిగడ్డ మండలంలోని రామచంద్రాపురం, చిరువోలులంక, టి.కొత్తపాలెం, కమ్మవారిపాలెంలోని తాగునీటి చెరువుల అడుగంటాయి. పది రోజులపాటు కూడా ఈ చెరువుల్లోని నీరు తాగునీటి అవసరాలను తీర్చలేని పరిస్థితి నెలకొంది. కృత్తివెన్ను మండలంలోని కృత్తివెన్నుతో పాటు మరో 31 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు సీతనపపల్లిలో నిర్మించిన తాగునీటి చెరువులో నీరు పూర్తిస్థాయిలో అడుగంటింది.కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని 22 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కృష్ణానదిలో బత్తినపాడు, చౌటపల్లి తాగునీటి పైలట్ ప్రాజెక్టుల నుంచి మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కృష్ణానదిలో నీరు లేకపోవడంతో అమరావతి వైపు నుంచి నీటిని తీసుకువచ్చేందుకు నదిలో జేసీబీల ద్వారా కాలువ తవ్వినా నీరు అంతంతమాత్రంగానే వస్తోంది. నందిగామ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు మునేరు, వైరా నదుల్లో ఏర్పాటు చేసిన తాగునీటి పైలట్ ప్రాజెక్టులు సక్రమంగా పనిచేయడం లేదు. మునేరు పైలట్ ప్రాజెక్టు బావిలో 20 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా నేడు ఏడున్నర అడుగులకు చేరింది.జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని పలు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే బులుసుపాడు తాగునీటి పైలట్ ప్రాజెక్టు మునేరువాగు నుంచి తాగునీటిని అందించాలి. మునేరులో నీరులేకపోవడంతో ఆముదాలపల్లి, తక్కెళ్లపాడు, గరికపాడు, రామచంద్రునిపేట గ్రామాలకు తాగునీరు అంతంతమాత్రంగానే అందుతోంది.కైకలూరు మండలంలోని కొల్లేటి గ్రామాల్లో తాగునీటి చెరువులు అడుగంటాయి. చేసేదిలేక ఈ గ్రామాల ప్రజలు సమీపంలోని గ్రామాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. కాలువలకు నీరొచ్చేనా! తాగునీటి చెరువులు నిండకపోవడంతో నాగార్జునసాగర్ నుంచి రెండున్నర టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం తీసుకువస్తామని ఇటీవల విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నీరు ఎప్పటికి విడుదల చేస్తారో తెలియడం లేదు. ఇక పశువులకు సైతం తాగేందుకు నీరులేకుండా పోయింది. జెడ్పీ సమావేశంతో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించినా ఈ ప్రక్రియ అమల్లోకి రాలేదు. తాగునీటి పథకాలకు సంబంధించి 2015 మార్చి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.గత నెలలో 2015 మార్చి, ఏప్రిల్, మే నెలలకు సిబ్బంది జీతాలను విడుదల చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. -
నిధులన్నీ ‘నీళ్ల’పాలు
► మంత్రి సునీత నియోజకవర్గంలో దాహం తీర్చని రూ.14.69 కోట్ల పథకం ► పదేళ్లుగా చుక్కనీరు అందలేదంటున్న గ్రామీణులు ► ఎక్కడికక్కడ పగులుతున్న పైప్‌లైన్ రామగిరి : జిల్లాలో అత్యంత వెనుకబడిన రామగిరి, కనగానపల్లి మండలాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. వీటి ద్వారా ఏ ఒక్కరోజూ నీరు సక్రమంగా అందలేదంటూ గ్రామీణులు చెబుతున్నారు. మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి నెలకొనడం గమనార్హం. ఈ రెండు మండలాల్లోని 54 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 14.69 కోట్లతో రామగిరి మండలం గంగంపల్లి వద్ద సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. దీన్ని 2003 మే 21న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని రోజుల పాటు నీరు సక్రమంగా అందింది. తర్వాత పైప్లైన్లు తరచూ పగిలిపోతుండటంతో పథకం కాస్తా నీరుగారిపోయింది. ఫలితంగా రామగిరి మండలంలో 30, కనగానపల్లి మండలంలోని 24 గ్రామాలకు నీరు అందడం లేదు. పథకం నిర్వహణలో 54 మంది కార్మికులు ఈ పథకం కింద పీఏబీఆర్ నుంచి ఆత్మకూరు, కొండపల్లి, నర్సంపల్లి, పీఆర్ కొట్టాల మీదుగా పైప్‌లైన్ అమర్చి నీటిని సరఫరా చేసేవారు. పథకం నిర్వహణకు 54 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా నియమించారు. కొండపల్లి నుంచి గరిమేకలపల్లి వరకు సుమారు 250 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా ఆయా గ్రామాలకు తాగునీరు చేరాల్సి ఉండగా.. ఎక్కడికక్కడ పైపులు పగిలిపోతుండటంతో చుక్కనీరు అందడం లేదు. పదమూడేళ్లుగా మరమ్మతు పనులు కూడా సక్రమంగా చేపట్టడం లేదు. కాంట్రాక్టర్లు మారుతున్నారు కానీ, ఏ ఒక్క పనీ సక్రమంగా చేపట్టలేదన్న ఆరోపణలున్నాయి. ప్రధాన పైప్లైన్లోనే లోపాలు ప్రధాన పైప్‌లైన్ సక్రమంగా లేకపోవడంతో తరచూ లీకేజీలు ఏర్పడేవి. మరమ్మతులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఆయా కాంట్రాక్టర్ల జేబులను మాత్రమే నింపాయి. లీకేజీల నివారణకు సంబంధించి పనులు చేపట్టిన దాఖలాలు లేవు. -
కదిలిస్తే క‘న్నీరే’
జోగిపేట : అందోలు మండలం కొడెకల్ గ్రామస్తులను కదిలిస్తే కన్నీటి కథే.. గ్రామంలో మంచినీటి ఇబ్బందు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళితుల కాలనీలో కాలనీవారే చందాలు వేసుకొని బోరు వేసుకోగా, గ్రామానికి నీరందించేందుకు వ్యవసాయ బోరును రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బోరు నుంచి ట్యాంకు ద్వారా మినీ ట్యాంకును నింపి నీటిని పంపిణీ చేస్తున్నారు. గ్రామంలోని రెండు వీధుల్లోని కుటుంబాలు విరాళాలు వేసుకొని సొంతగా నీటి సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. నీటి కోసం పుట్టెడు కష్టాల్లో ఉన్న గ్రామాన్ని ఆదుకోవాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అటువైపు కన్నెత్తయినా చూడడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరిని కదిలించిన బుక్కెడు అన్నం లేకున్నా సరే.. నీరు వచ్చేటట్లు చూడండంటూ ప్రాధేయపడుతున్నారు. వ్యవసాయబోరు కొనుగోలు గ్రామస్తులు నీటి ఎద్దడిని నివారించాలని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తామే రూ.1.50 లక్షలతో వ్యవసాయ బోరును కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీకి వివిధ పద్దుల కింద వచ్చిన నిధులతో గ్రామానికి 2.కి.మీ దూరంలో ఉన్న నారాయణకు చెందిన వ్యవసాయ బోరును కొనుగోలు చేశారు. అయితే పంచాయతీలో కేవలం రూ.70వేలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనే ట్రాక్టర్‌పై ట్యాంకర్ ద్వారా గ్రామంలోని మినీ ట్యాంకుల్లోకి చేరవేస్తున్నారు. అక్కడి నుంచి గ్రామస్తులు బిందెలతో పట్టుకెళుతున్నారు. కన్నెత్తి చూడని అధికారులు అందోలు మండలంలో కొడెకల్‌లో ఉన్న మంచినీటి ఎద్దడి ఏ గ్రామంలో లేదు. ఇన్ని ఇబ్బందులు ఏ గ్రామంలోనూ లేవు. కనీసం దగ్గరలోని వ్యవసాయ బోరుబావిలో నుంచి తెచ్చుకుందామనుకున్నా ఆ పరిస్థితిలేదు. గత్యంతరం లేక సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలంతా చర్చించుకొని సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావిని కొనుగోలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పశువులకు ట్యాంకరు నీరే... గ్రామంలో ఉన్న పశువులకు నీటి కోరత తీవ్రంగా ఏర్పడింది. ఎక్కడా వాటికి నీటి వసతిలేకపోవడంతో ప్రజలకు పంపిణీ చేసే ట్యాంకర్ ద్వారా తీసుకువచ్చిన మంచి నీటిని నీటి తొటెల్లో పోస్తున్నారు. పశువులను అక్కడికి తీసుకువచ్చి నీటిని తాగిస్తున్నారు. ఇంత కరువు ఎన్నడూ చూడలే.. నేను పుట్టినప్పటి నుంచి నీటి కరువును ఇంతగా చూడలేదు. తినడానికి తిండి లేకున్నా మంచినీళ్లు మాత్రం తప్పనిసరిగా కావాలి. ప్రభుత్వం వాగులో బోర్లు వేసి పైపులైన్ ద్వారా గ్రామానికి నీటిని అందించాలి. - సామెల్, కొడెకల్ వాసి చందాలువేసి బోరు వేయించుకున్నాం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎస్సీ వాడకు చెందిన 20 కుటుంబాలకు చెందిన మేము ఇంటికి రెండు వేలు వేసుకొని బోరు వేయించుకున్నాం. అయినా బోరు నుంచి సరిగా నీరు రావడంలేదు. గ్యాప్ ఇచ్చుకుంటూ నీళ్లు వస్తున్నాయి. - సాయమ్మ, కొడెకల్ గ్రామ మహిళ రూ.150 లక్షలతో బోరు కొనుగోలు చేశాం గ్రామంలో మంచినీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని రెండు బోర్లు వేయించగా ఫెయిలయ్యాయి. తప్పనిసరి పరిస్థితిలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయబోరును రూ.1.50 లక్షలకు పాలకవర్గ సభ్యుల అనుమతితో కొనుగోలు చేశాం. బోరు వద్ద నుంచి ట్యాంకర్ ద్వారా నీటిని గ్రామంలోని మినీ ట్యాంకులకు చేరవేస్తున్నాం. - రజిత శ్రీనివాస్‌రెడ్డి, గ్రామసర్పంచ్, కొడెకల్ -
మూస పద్ధతిలో ప్రతిపాదనలు వద్దు
పంచాయతీరాజ్ ‘బడ్జెట్’పై అధికారులతో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను మూస పద్ధతిలో కాకుండా అవసరాలకు అనుగుణంగా తయారు చేయాలని మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ అంచనాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే మూడేళ్లకు సంబంధించిన విజన్‌పైనా సమీక్షించారు. గతేడాది బడ్జెట్లో కేటాయింపులు, వ్యయంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యయం, ప్రాధాన్యతలపై చర్చించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీని బీటీ రోడ్డుతో అనుసంధానించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న పంచాయతీ రోడ్లను అవసరమైన చోట విస్తరించాలని, రోడ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న ఇంజనీరింగ్ పనులను డిజిటలైజ్ చేసేందుకు, పనులను ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు టూల్ రూపకల్పన కోసం బడ్జెట్లో ప్రతిపాదించాలన్నారు. మిషన్ భగీరథకు అధిక నిధులు కేటాయిస్తామని, అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మంత్రి ఆరా తీశారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.55 లక్షల టాయిలెట్స్ నిర్మాణానికి గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు. గ్రామజ్యోతిలో దత్తత తీసుకున్న గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడతామని ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ తెలిపారు. 1,000 గ్రామ పంచాయతీ భవనాలు, 1,064 అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు 2016-17 బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)-2016 డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్, కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
నీటియాతన
కృష్ణమ్మ చెంత.. తాగునీటికి చింత మున్సిపాలిటీల్లో దాహం కేకలు కొన్నిచోట్ల వారానికి ఒక రోజే మంచినీరు అన్ని చోట్లా ట్యాంకర్లే దిక్కు బందరు, పెడన, తిరువూరుల్లో నీటికోసం ఎదురుచూపులు పాలకుల ప్రణాళికాలోపమే కారణం కృష్ణమ్మ చెంతనే ఉన్నా జిల్లాప్రజల దప్పిక తీరడం లేదు. వేసవి ఇంకా రాకముందే చుక్కనీటి కోసం పాలకులు చుక్కలు చూపిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలు లేక పోవడంతో కృష్ణానది సహా అనేక వాగులు, వంకలు పూర్తిగా ఎండిపోయాయి. నిత్యం ట్యాంకర్లు నడవనిదే చుక్క నీరు అందదు. వారంలో రెండుసార్లు.. అదీ రెండు గంటలు వస్తే గొప్ప. తాగునీటి సరఫరా ఫర్వా లేదనుకుంటే ఆ ప్రాంతాల్లో పైప్ లైన్ లీకేజీలు. ఇవీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘సాక్షి’ నెట్ వర్క్ బృందం గమనించిన అంశాలు. విజయవాడ : విజయవాడ నగరం సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జల యుద్ధాలు మొదలయ్యాయి. ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణానది, మునేరు, కృష్ణా కుడి కాలువ ఎండిపోవడంతో నీటి కొరత వెంటాడుతోంది. విజయవాడ నగరపాలక సంస్థ సహా ఎనిమిది మున్సిపాలిటీల్లో నెలకు సగటున అదనంగా కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టే పరిస్థితి వేసవి రాకముందే ఉత్పన్నమైంది. ఇక ఎండాకాలంలో దానికి రెట్టింపు మొత్తం ఖర్చు పెట్టినా మంచినీరు దొరకని దుర్భర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. బందరులో మూడు రోజులకోసారి... జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మున్సిపాలిటీలో 2.25 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరికి రోజుకు 18 మిలియన్ లీటర్ల నీరు కావాల్సి ఉండగా.. దానిలో 20 శాతం కూడా సరఫరా కావడం లేదు. బందరుకు నీరందించే తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోయింది. కనీసం ఆరు మీటర్ల లెవల్ వరకు ఉండాల్సిన నీరు ప్రస్తుతం అర మీటరు కూడా లేకపోవడంతో 12 ట్యాంకర్లు ఏర్పాటు చేసి మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు. పెడన మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్న 30 వేల మంది జనాభా అవసరాలకు రోజుకు 30 లక్షల లీటర్ల నీరు కావాల్సి ఉండగా దానిలో 50 శాతం కూడా విడుదల కాని పరిస్థితి నెలకొంది. ఈ మున్సిపాలిటీకి తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు వస్తుంది. అక్కడ నీరు లేకపోవడంతో రామరాజుపాలెం పంటకాల్వ ద్వారా కృష్ణా నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కృష్ణా నీరు కూడా లేకపోవడంతో బోర్లపై ఆధారపడి ట్యాంకర్ల ద్వారా వారానికి ఒకరోజు సరఫరా చేస్తున్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో 40 వేల జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల లేదు. నీరు మురుగు వాసన వస్తుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సుందరంపేట, దళితవాడ, ఉర్దూ పాఠశాల సెంటర్, డొంకరోడ్డు సెంటర్ ప్రాంతాల్లో కాలువల్లోనే మంచినీటి పైప్లైన్లు ఉండడంతో ఈ పరిస్థితి దాపురించింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 53 వేల జనాభాకు 70 ఎంఎల్డీ నీరు అవసరం కాగా 30 ఎంఎల్డీకి మించి విడుదల కావడం లేదు. జగ్గయ్యపేటకు పాలేరు రిజర్వాయర్ నుంచి నీరు విడుదలవుతోంది. అది ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా బోర్ల నుంచి నీటిని తెచ్చి సరఫరా చేస్తున్నారు. దీంతో రెండు రోజులకు ఒకసారి మాత్రమే గంటసేపు నీరు విడుదలవుతోంది. నందిగామ మున్సిపాలిటీలో 50 వేల జనాభా అవసరాలకు అనుగుణంగా మునేరు, కృష్ణానదితోపాటు మూడు పథకాల ద్వారా నీరందుతోంది. 80 శాతం కుళాయిలకు హెడ్స్ లేకపోవడం, లీకేజీల వల్ల నీరు ఎక్కువ వృథాగా పోతోంది. ఫలితంగా వారంలో ఒక్కసారే నీరు అందుతోంది.తిరువూరుకు శాశ్వత మంచినీటి వ్యవస్థ లేకపోవడంతో మూడు రోజులకు ఒకసారే మంచి నీరు అందుతోంది.నూజివీడు, గుడివాడ పట్టణాల్లో తాగునీటి ఇబ్బంది కొంత ఉన్నా మున్సిపాలిటీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల సమస్య పెద్దగా లేదు. విజయవాడలో నీరు వృథా విజయవాడ నగరంలో నిత్యం సరఫరా అయ్యే మంచినీరులో 30 శాతం పైప్‌లైన్ లీకుల వల్ల మురుగుకాల్వల పాలవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఇలా జరుగుతున్నా పాలకులకు మాత్రం కనువిప్పు కలగడం లేదు. నగర జనాభా 11.48 లక్షల మంది. వారి అవసరాలకు అనుగుణంగా రోజుకు 1.50 మిలియన్ గ్యాలన్ల నీరు కావాల్సి ఉండగా నగరపాలక సంస్థ 1.65 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. వృథా అయ్యే 30 శాతం నీరు వల్ల 1.10 మిలియన్ గ్యాలన్ల కంటే ఎక్కువ నీరు ఇళ్లకు చేరకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పైప్‌లైన్ పాతది కావడం వల్ల నీటి లీకేజీలు అధికంగా ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలోని పటమట, కరెన్సీనగర్, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మురుగునీరు అధికంగా కలుస్తోంది. నగరానికి వచ్చే నీటిలో 22 శాతం బోర్ల ద్వారా, మిగిలిన నీరు కృష్ణానది ద్వారా సరఫరా అవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న వాటర్ రిజర్వాయర్లకు నీరు సరిగా ఎక్కకపోవటంతో హైస్పీడ్ మోటార్లు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేశారు. అవి వచ్చేసరికి వేసవి పూర్తయ్యే అవకాశం ఉంది. రామలింగేశ్వరనగర్లో ఉన్న ప్లాంట్ ద్వారా మురుగునీరు అధికంగా వస్తోంది. నగర మేయర్ మంచినీటి సమస్య రాకుండా నిధులు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారే కాని ఆచరణలో పూర్తిస్థాయిలో కనిపించకపోవడంతో నగరంలోనూ రానున్న రోజుల్లో నీటిఎద్దడి పెరిగే అవకాశం ఉంది. -
అంతరగంగలో నీటి ఎద్దడి: మహిళల ధర్నా
కూడేరు: అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకర్ల ద్వారా అందిస్తోన్న మంచినీటి సరఫరాలను అధికారులు నిలిపివేయడంతో గ్రామానికి చెందిన మహిళలు సోమవారం మండల కేంద్రంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకున్న మహిళలు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో తమ గ్రామానికి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేవారని, బిల్లులు చెల్లించలేదంటూ వాటిని ఆపేశారని, ఫలితంగా గడిచిన మూడు రోజులుగా దాహార్తితో అల్లాడుతున్నామని మహిళలు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటిసరఫరా పునరుద్ధరించారని కోరుతున్నారు. -
ప్రతినిధీ... ఇదీ మీ విధి
నీళ్లు, రోడ్లు, మురుగు సమస్యలే మా ఎజెండా ♦ వీటిని పరిష్కరించే వారికే ఓటేస్తాం ♦ నినదిస్తున్న నగర ఓటర్లు ♦ ఆవాజ్‌దో సంస్థ ఓటింగ్ క్యాంపెయిన్‌కు వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులు ♦ సమర్థులకు ఓటేస్తామన్న 68.4 శాతం మంది ♦ ఓటుతోనే స్థానిక సమస్యల పరిష్కారం సాధ్యమన్న 83.2 శాతం ఓటర్లు బల్దియా పోరులో స్థానిక సమస్యల పరిష్కారమేగ్రేటర్ జనం జెండా..ఎజెండాలుగా మారాయి. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు..హంగు..ఆర్భాటాల కన్నా నిత్య జీవితంలో తాము ఎదుర్కొంటున్న రోడ్లు, తాగునీరు, మురుగు నీటి సమస్యలను పరిష్కరించే వారికే తమ ఓటు అని మహానగర ఓటర్లు ఎలుగెత్తి చాటుతున్నారు. మౌలిక వసతులు లేకుండా...మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, మల్టీప్లెక్స్‌లు, హైటెక్ హంగులు అక్కర్లేదని స్పష్టంచేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంతోపాటు జనాన్ని చైతన్యం చేసేందుకు ‘ప్రామాణ్య స్ట్రాటజీ’ అనే రాజకీయ పరిశోధన సంస్థ ప్రారంభించిన ‘ఆవాజ్ దో హైదరాబాద్’ ఓటింగ్ క్యాంపెయిన్‌లో వేలాది మంది ఓటర్లు పాల్గొని తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రామాణ్య స్ట్రాటజీ సంస్థ ఆధ్వర్యంలో గత పదిరోజులుగా నగర వ్యాప్తంగా సుమారు 12 వేల మంది ఓటర్ల నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్సైట్లు, టెలీకాలింగ్ వంటి మాధ్యమాలు, నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా సేకరించిన అభిప్రాయాలను ఈ సర్వేలో క్రోడీకరించారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సింహభాగం ఓటర్లు స్థానిక సమస్యలు పరిష్కరించేవారికే తమ ఓటు అని స్పష్టం చేయడం విశేషం. ఈ సర్వేలో తేలిన పలు అంశాలు మహానగర ఓటర్ల మనోగతానికి అద్దం పడుతున్నాయి. సర్వే వివరాలివే... మా సమస్యలు పరిష్కరించేవారికే ఓటేస్తాం మా వీధి, వార్డులో పేరుకుపోయిన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేవారికి, నిత్యజీవితంలో మేము పడుతున్న అవ స్థలకు శాశ్వతంగా చరమగీతం పాడే అభ్యర్థికే ఓటేస్తామని ఈ సర్వేలో సుమారు 68.4 శాతం మంది ప్రజలు తెలిపారు. మరో 24.9 శాతం మంది మాత్రం అభ్యర్థులతో పనిలేకుండా తమకు నచ్చిన రాజకీయ పార్టీ గుర్తుకే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇక 3.7 శాతం మంది ఎవరికీ ఓటు వేయమన్నారు. మరో 3 శాతం మంది ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ గడపకూడా తొక్కబోమని తెలపడం గమనార్హం. సర్వత్రా.. మంచినీటి కటకట ఇక నగరవ్యాప్తంగా జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాగు నీటి ఎద్దడి. వారం, పదిరోజులకోమారు జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామని..గొంతు తడుపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. నల్లా నీళ్లు రాకపోవడం, బోరుబావులు వట్టిపోవడంతో ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ఫిల్టర్‌ప్లాంట్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నామని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీరు, డ్రైనేజి పైపులైన్లు పక్కపక్కనే ఉన్నచోట రంగుమారి దుర్వాసన వెదజల్లుతున్న కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం రహదారులను తవ్వి వదిలేస్తుండడంతో గతుకుల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక మురుగు నీటి పైపులైన్లకు ఏర్పడుతున్న లీకేజీలతో మురుగు నీరు రహదారులను ముంచెత్తుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని, వీటికి నిర్దిష్ట పరిష్కారాలు చూపి, వాటిని పరిష్కరిస్తామని విస్పష్టమైన హామీ ఇచ్చినవారికే తాము ఓటేస్తామని స్పష్టం చేశారు. అయినా ఓటేస్తాం.. చరిత్రను మార్చేస్తాం.. తెలంగాణా రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న బల్దియా ఎన్నికల్లో తాము ఓటేస్తామని..ఓటేసేందుకు ఆసక్తిగా ఉన్నామని..సమస్యల పరిష్కారానికి ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేస్తామని మెజార్టీ సిటీజనులు పేర్కొనడం కొసమెరుపు. తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలివే.. భోలక్‌పూర్,మల్లాపూర్,చాంద్రాయణగుట్ట,,లాల్‌దర్వాజ,కార్వాన్,మాసాబ్‌ట్యాంక్,మియాపూర్,మెహిదీపట్నం,సైదాబాద్,మొఘల్‌పురా,ఫలక్‌నుమా,ముషీరాబాద్,మీర్పేట్,నాచారం,పత్తర్‌ఘట్టీ,కుత్భుల్లాపూర్,ఈసీఐఎల్,ఆర్కెపురం,రాజేంద్రనగర్,సంతోష్‌నగర్,హిమాయత్‌నగర్,సీతాఫల్మండి,లింగోజిగూడా,వెంకటాపురం,మల్కాజ్‌గిరీ,బాలాపూర్,సికింద్రాబాద్,బాపూనగర్,లంగర్‌హౌజ్,దోమల్‌గూడ, జగద్గిరిగుట్ట,సరూర్‌నగర్‌లలో నీటి ఎద్దడి ఉన్నట్లు ఓటర్లు పేర్కొన్నారు. మంచినీరు, రహదారులు, మురుగు సమస్యలకే అధిక ప్రాధాన్యం ప్రజల ఎజెండాలో అరకొర నీటి సరఫరా, కలుషిత జలాల నివారణ, అధ్వాన్న రహదారులు..ఈ మూడు సమస్యలేతొలి ప్రాధాన్యాలుగా నిలిచాయి. ఈ సమస్యల నుంచి తమకు విముక్తి కల్పిస్తామని గట్టిగా హామీ ఇచ్చిన వారికే ఓటు వేస్తామని జనం స్పష్టం చేశారు. జనం ఎజెండాలో 34 శాతం మంది మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరగా..మరో 22.7 శాతం మంది అధ్వాన్న, గతుకుల రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని కోరారు. మరో 18.6 శాతం మంది కాలనీలు, బస్తీలు, వీధుల్లో పొంగిపొర్లుతున్న మురుగు ప్రవాహంతో తాము పడుతున్న అవస్థలను పరిష్కరించే పార్టీలు, అభ్యర్థులకే ఓటు వేస్తామని స్పష్టంచేశారు. మరో 5.7 శాతం మంది చెత్త సమస్యతో బాధపడుతున్నట్లు వివరించారు. ఇక మరో 19 శాతం మంది విద్యుత్ కట్ కట, వీధి దీపాలు లేక అలుముకుంటున్న చీకట్లు, ట్రాఫిక్ రద్దీ, ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, చాలినన్ని బస్సులు లేకపోవడంతో తాము పడుతున్న అవస్థలు, వీధికుక్కల బెడద, మూతలు లేని మ్యాన్‌హోళ్లు, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. వీటిని పరిష్కరించేవారికే ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం. ఓటు వజ్రాయుధమే... అవును..మేము దైనందిన జీవితంలో ఎదుర్కొంటు న్న సమస్యలను ఓటు అనే వజ్రాయుధంతో పరిష్కరించుకుంటామని సర్వేలో 83.2 శాతం మంది గ్రేటర్ ఓటర్లు అభిప్రాయపడ్డారు. 10.8 శాతం మంది రాజకీయ పార్టీల మేనిఫెస్టో చూసి ఓటేస్తామని చెప్పగా.. మరో 6 శాతం మంది ఏదీ చెప్పలేమన్నారు. అయితే ఓటేయాలన్న కోరిక తమలో బలంగా ఉన్నప్పటికీ తమ నిరాసక్తతకు పలు కారణాలు వివరించారు. వివిధ రాజకీయ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు బాగాలేదని, ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం, డబ్బు, మద్యం పంపిణీతో పలు పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడం చూసి విసిగిపోయామని, ఒక వేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఓటేసినా మా సమస్యలను తీర్చే నిధులు, విధులు, అధికారాలు బల్దియాకు లేవని, అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కార్పొరేటర్ల పనితీరు.... గత బల్దియా ఎన్నికల్లో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు తమ సమస్యల పరిష్కారం విషయంలో, నిత్యం అందుబాటులో ఉండే విషయంలో తమను నిరాశ పరిచినట్లు పలువురు సిటీజనులు తెలిపారు. తమ ఫిర్యాదులపై తక్షణం కార్పొరేటర్లు స్పందించారని 39.8 శాతం మంది తెలపగా..అంతగా చొరవచూపలేదని, ముభావంగా స్పందించారని, చూద్దాం..చేద్దాం అన్న ధోరణితో వ్యవహరించారని 25.3 శాతం మంది తెలిపారు. ఇక 34.9 శాతం మంది మాత్రం అసలు తాము ఎనుకున్న కార్పొరేటర్లు సమస్యల వైపు కన్నెత్తి చూడలేదని కుండబద్దలు కొట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులపై ఎక్కువ మంది తమ అసంతృప్తిని తె లియజేయడం విశేషం. ట్రాఫిక్ జాంఝాటం... అల్వాల్, నల్లకుంట, చైతన్యపురి ఓటర్ల ఫిర్యాదులు ఇక్కడి నుంచే... అధ్వాన రహదారులు.. బహదూర్‌పురా, మల్కాజ్‌గిరీ, బండ్లగూడ, కాచిగూడా, బోయిన్పల్లి, చార్మినార్, ఘానీభాగ్, మలక్‌పేట్, గోల్కొండ, తలాబ్‌కట్ట, హైదర్గూడా,లంగర్‌హౌజ్, జియాగూడా, బోరబండ, మణికొండ, యాకుత్‌పురా, మేడ్చల్, ఎల్బీనగర్, ఓల్డ్‌బోయిన్‌పల్లి, సరూర్‌నగర్, ఎల్లారెడ్డిగూడా, ముషీరాబాద్, జీడిమెట్ల, కూకట్పల్లి, సనత్‌నగర్, ఉప్పుగూడా, మోతీనగర్, ఈసీఐఎల్, రాజేంద్రనగర్, హిమాయత్‌నగర్, లింగోజిగూడ. మురుగు అవస్థలు... బంజారాహిల్స్, ఎల్భీనగర్, చిక్కడపల్లి, మలక్‌పేట్, శివరాంపల్లి, తలాబ్‌కట్ట, బేగంబజార్, లంగర్‌హౌజ్, బేగంపేట్, బోరబండ, చంపాపేట్, కార్వాన్, చింతల్, మియాపూర్, ఐఎస్‌సదన్, యూసుఫ్‌గూడా, కొత్తపేట్, కూకట్పల్లి, కృష్ణానగర్, మైలార్‌దేవ్‌పల్లి, దిల్సుఖ్నగర్, చార్మినార్, కాచిగూడా, సైదాబాద్, ఫలక్‌నుమా, మీర్పేట్, మోతీనగర్ విద్యుత్ కట్‌కట.. ఆజంపురా, ఛత్రినాక , కుర్మగూడా, మదీనా, ఉప్పుగూడా, యూసుఫ్‌గూడా, యాకుత్‌పురా చెత్త సమస్యలిక్కడే.. కర్మన్‌ఘాట్, పంజాగుట్ట, రామ్‌కోఠి, ఈస్ట్ఆనంద్బాగ్, హాజిపురా, యాకుత్‌పురా, పత్తర్‌ఘట్టీ, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, మల్కాజ్గిరి. వీధికుక్కలు, అపరిశుభ్రత సికింద్రాబాద్, హయత్‌నగర్, అంబర్పేట్, పద్మారావునగర్, మన్సూరాబాద్,ముషీరాబాద్. -
‘ప్రభుత్వ అసమర్ధతే కారణం’
మంగళగిరి: ప్రభుత్వం అసమర్ధత కారణంగానే గుంటూరు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా మారిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం ఉదయం ఆయన మంగళగిరిలోని తాగునీటి పథకాలను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. నీటి ఎద్దడి నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో వేసవికి ముందే నీళ్ల ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు. కృష్ణా నదిలో నీటి నిల్వలు త గ్గుముఖం పట్టటంతో సమస్య తీవ్రతరమైందని చెప్పారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు పరిష్కార మార్గాలు వెదికి, ప్రజల ఇక్కట్లు తీర్చాలని కోరారు. -
చుక్క నీటికీ గగనమే!
♦ తాగునీటి సరఫరా లేక ప్రజలు విలవిల ♦ పట్టణాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ♦ చాలా మున్సిపాలిటీల్లో మూడు నాలుగు రోజులకు సరఫరా ♦ కొన్ని చోట్ల వారానికోమారు... ♦ అదను చూసి ధరలు పెంచిన ట్యాంకర్ల యజమానులు ♦ శీతాకాలంలోనే ఇలా ఉంటే మరి వేసవిలో ఎలా..! సాక్షి నెట్వర్క్: అన్నమో రామచంద్రా అనే బదులు నీళ్లో రామచంద్రా అని వేడుకునే కష్టకాలం వచ్చింది. వేసవి ఇంకా రానే లేదు... శీతాకాలం మంచు కురుస్తూనే ఉంది. కానీ దప్పిక తీర్చుకునేందుకు చుక్క నీటికీ గగనమైంది. గొంతు ఎండిపోతోంది. రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. వారం నుంచి పదిరోజులకోమారు తాగునీరు సరఫరా అవుతున్న పట్టణాలూ ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. వేసవిని తలచుకుంటేనే గుండె గుభేల్మంటుంది. రాజధాని నగరం హైదరాబాద్‌తో సహా నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో నీటి సమ స్య తీవ్రమైంది. ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశా లు కనిపించకపోవడంతో నీటిఎద్దడిని ఎలా తీర్చాలన్న ఆందోళన అధికారులను భయపెడుతోంది. ప్రతీ వేసవిలో ట్యాంకర్ల సంఖ్య పెంచి నీరందించడం మామూలుగా జరిగేది. కానీ ఇప్పు డు శీతాకాలంలోనే ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి. మున్సిపాలిటీలకు నీటి సరఫరా చేసే రిజర్వాయర్లు ఒట్టిపోతున్నాయి. రోజు విడిచి రోజు నీటి సరఫరా చేసిన మున్సిపాలిటీల్లోనూ ఇప్పుడు నాలుగు రోజులకోమారు సరఫరా జరుగుతోంది. నాలుగైదు రోజులకు... గోదావరి నీటితో తాగునీటిని అందించే మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. కృష్ణా నది పరీవాహకంలోనూ ఈ సమస్య ఎదురవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో 4 రోజులకోమారు సరఫరా జరుగుతుంటే.. మందమర్రిలో ఆరేడు రోజులకోమారు అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, కోరుట్ల మున్సిపాలిటీల్లోనూ నాలుగు రోజులకోమారు మంచినీటి సరఫరా జరుగుతోంది. మంజీరా నది ఎండిపోవడంతో.. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సైతం నీటి సరఫరా కష్టమైంది. కృష్ణా నదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే మహబూబ్‌నగర్ నగరానికి తాగునీటి సమస్య ఉండేది. ఇప్పుడది మరింత పెరిగింది. పదిరోజులకోమారు సరఫరా జరుగుతోంది. మున్సిపాలిటీల్లో రోజూ కనీసం ప్రతీ మనిషికి 70 లీటర్ల మంచినీరు సరఫరా చేయాలని నిబంధనలున్నా.. కొన్ని మున్సిపాలిటీల్లో వారానికి గాని సరఫరా కావట్లేదు. హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉండే.. బడంగ్‌పేట నగర పంచాయతీలో వారానికోమారు సరఫరా జరుగుతోంది. ట్యాంకర్ల దగ్గర ప్రజలు నీటి కోసం తరుచూ గొడవలు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మహానగరాల్లో ఒక్కో మనిషికి 135 లీటర్ల కంటే ఎక్కువ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా ఎక్కడా అది అమలు కావడం లేదు. ఒక్కో మనిషికి రోజుకు ఇచ్చే నీరు (ఎల్పీసీడీ) 50 లీటర్ల కంటే కంటే తక్కువ సరఫరా జరుగుతున్న మున్సిపాలిటీల్లో అగ్రస్థానం షాద్నగర్దే. అక్కడ కేవలం 25.88 ఎల్పీసీడీ నీరు సరఫరా అవుతోంది. వ్యవసాయ బోర్ల నుంచి.. కరువు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు కూడా పొట్టచేత పట్టుకొని పట్టణాల వైపు వలసలు వస్తున్న తరుణంలో తాగునీటి కొరత మరింత తీవ్రం కానుంది. ఇదే అదనుగా నీటి వ్యాపారులు ట్యాంకర్ల ధరలను అమాంతం పెంచేశారు. రాష్ట్రంలో మొత్తం 68 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేష న్లున్నాయి. సగానికి పైగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నీటి ఎద్దడే. భూగర్భ జలాలపై ఆధారపడిన మున్సిపాలిటీలు.. అవి అడుగంటిపోతుండడంతో కొత్తగా బోర్లు వేయలేక డైలమాలో పడ్డాయి. వీటిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని సరఫరా చేసేందుకు స్థానిక అధికారులు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. వర్షాల్లేక ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గింది. ఆరుతడి పంటలవైపు మొగ్గుచూపుతున్న క్రమంలో వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితులున్నాయి. -
తాగునీటి భారం
పథకాల నిర్వహణ పంచాయతీలదే సర్కారు నిర్ణయం గ్రామాలకు మరిన్ని ఆర్థిక తిప్పలు ఆర్థిక సం ఘం నిధులు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్న ప్ర భుత్వం తాజాగా తాగునీటి పథకాల నిర్వహణ భారం పంచాయతీల నెత్తిన పెట్టింది. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్ దీపాల బిల్లుల చెల్లింపును అప్పగించిన వైనం తెలిసిందే. వచ్చే ఐదు రూ.లక్షల్లో సగం వీటికే ఖర్చుచేయాల్సి రావడంతో ఏ మేరకు అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్‌లు వాపోతున్నారు. సీపీడబ్ల్యూ స్కీంల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నం : జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో 18,485 చేతిపంపులు, 2765ఎన్‌పీడబ్ల్యూ, పీడబ్ల్యూస్కీమ్లు, 29 సీపీడబ్ల్యూ స్కీమ్‌లు న్నాయి. చే తిపంపు నిర్వహణకు రూ.2 వేలు, ఎన్‌పీడబ్ల్యూ,పిడబ్ల్యూ స్కీమ్‌లకు రూ.లక్ష న్నర నుంచి 3లక్షల వరకు, సీపీడబ్ల్యూ స్కీమ్‌కైతే రూ.30లక్షల నుంచి రూ.60 లక్షల వ రకు మెయింటనెన్స్‌కు ఖర్చవుతుంటుంది. వీటిలో విద్యుత్ బిల్లులే అధికంగా ఉంటాయి. సీపీడబ్ల్యూ స్కీమ్‌ల నిర్వహణను జెడ్పీ, చేతిపంపుల మరమ్మతులను మండల పరిషత్‌లు, ఎన్పీ డబ్ల్యూ,పీడబ్ల్యూ స్కీమ్‌ల మరమ్మతు పనులను పంచాయతీలు పర్యవేక్షిస్తుండేవి. ఇప్పటి వరకు ఈ మొత్తాన్ని కేంద్రం ఏటా విడుదల చేసే ఆర్థిక సంఘం నిధుల నుంచి జెడ్పీ, మండల పరిషత్‌లే భరించేవి. 2015-16 నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకే కేటాయించాలని నిర్ణయించడంతో వీటి నిర్వహణ భారాన్ని కూడా పంచాయతీలే భరించాలని సర్కార్ తేల్చి చెప్పింది. జెడ్పీ, మండల పరిషత్‌కు ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఇక నుంచి తాగునీటి పథకాల నిర్వహణ కయ్యేఖర్చుతో పాటు పంచాయతీల్లో ఉండే ప్రభుత్వ భవనాలకు రిపేర్లు, అంతర్గత సీసీ రోడ్లు,డ్రైన్లు, పంచాయతీ కార్యాలయ కంప్యూటరీకరణ వంటి ఆర్థిక సంఘం నిర్దేశించిన పనులన్నింటికి అయ్యే వ్యయాన్ని పంచాయతీలే భరించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా గతంలో మహానేత వైఎస్సార్ తీసుకున్న నిర్ణయం మేరకు మొన్నటి వరకు ప్రభుత్వం భరించిన విద్యుత్ బిల్లుల చెల్లింపు భారాన్ని కూడా తిరిగి పంచాయతీలకే అప్పగించింది. ఏ స్కీమ్ ద్వారా ఏఏ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు తాగునీరందుతుందో ఆయా పంచాయతీలే ఆ స్కీమ్‌ల నిర్వహణ భారం జనాభా ప్రాతిపదికన భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. చేతిపంపుల మరమ్మతులు కూడా పంచాయతీలే చేపట్టాలని పేర్కొంది. ఆ మేరకు నిధులను జెడ్పీకి పంచాయతీలు జమచేయాలని ఆదేశించారు. ఈ నిధులను ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించి స్కీమ్‌ల వారీగా నిర్వహణకు ఖర్చు చేయాలని సూచించింది. పనులను పర్యవేక్షించేందుకు ఇందుకోసం స్కీమ్‌ల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల్లో స్కీమ్ పరిధిలోని పంచాయతీ సర్పంచ్‌లతో పాటు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వాదేశాల మేరకు ఇటీవల పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులతో జెడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ్ సమావేశం నిర్వహించి వారి అంగీకారం తీసుకున్నారు. మెజారిటీ సర్పంచ్‌లు ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించగా, కొందరు మాత్రం తాగునీటి పథకాల నిర్వహణతో పాటు విద్యుత్, టెలిఫోన్ తదితర బిల్లుల చెల్లింపులన్నీ ఈ నిధుల నుంచే మీట్ అవ్వాలంటే ఇక అభివృద్ధి పనులకు ఖర్చు చేసేందుకు ఏం మిగులుతుందని వాపోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్కీమ్‌ల నిర్వహణఖర్చులతో పాటు తాత్కాలిక మరమ్మతులకయ్యే మొత్తాన్ని మాత్రృమే భరిస్తాం తప్ప.. పెండింగ్ బిల్లులు, శాశ్వత మరమ్మతులకు ఖర్చు చేసే ప్రసక్తే లేదని వారు తెగేసి చెప్పారు. కాగా జిల్లాలో చాలా వరకు చేతిపంపులు మూలనపడ్డాయి. సీపీడబ్ల్యూ స్కీమ్‌లు పంపులు, ఫిల్టర్ బెడ్స్ పనిచేయక మొరాయిస్తున్నాయి. మరొక పక్క లక్షల్లో పేరుకు పోయిన విద్యుత్ బిల్లులు భయపెడుతున్నాయి. -
నీళ్లేవి సారూ..
-
ఆర్నెలల్లో 3వేల గ్రామాలకు తాగునీరు
♦ నిర్దిష్ట లక్ష్యాలతో వేగంగా వాటర్ గ్రిడ్ పనులు ♦ అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో కేటీఆర్ సమీక్ష ♦ సెగ్మెంట్ల వారీగా నీరిచ్చే తేదీలను ప్రకటించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్ గ్రిడ్) ద్వారా రాబోయే ఆర్నెళ్లలోపే సుమారు మూడు వేల గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించబోతున్నామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సోమవారం అన్ని జిల్లాల సూపరింటిండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తొలిదశను ఏప్రిల్ 30కల్లా పూర్తి చేసి గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు గ్రామాలకు సురక్షిత తాగునీటి సరఫరా ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసేందుకు ఇంజనీర్లంతా పట్టుదలతో పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సెగ్మెంట్ల వారీగా తేదీలు ప్రకటించండి... వాటర్ గ్రిడ్ పరిధిలోని సెగ్మెంట్ల వారీగా ఏఏ ప్రాంతాలకు నీటి సరఫరాను ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాన్ని తేదీలతో సహా ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ అన్ని జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. డెడ్లైన్లు పెట్టుకొని పనులు పూర్తిచేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో అవసరమైన అన్ని సదుపాయాలను క ల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఔట్సోర్సింగ్ పద్ధతిన తాత్కాలిక నియామకాలను చేపట్టాలని సూచించారు. అటవీ అనుమతులపై ఆరా... జిల్లాల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి కేటీఆర్... ప్రాజెక్ట్‌కు సంబంధించి అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులు, భూసేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఏర్పాటుచేసిన జిల్లా జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలు ఎలా జరుగుతున్నాయని ఎస్ఈలను మంత్రి ప్రశ్నించారు. డిజైన్లను ఆమోదించే అధికారాలను జిల్లా సూపరింటిండెంట్ ఇంజనీర్లకే అప్పగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గ్రిడ్ పనులతో పాటు గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ ఏర్పాటును కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 15కల్లా గోదావరి జలాలు
♦ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ♦ నగరంలో తాగునీటిపై వాటర్‌వర్క్స్ అధికారులతో సమీక్ష ♦ గోదావరి మొదటి దశ, కృష్ణా మూడో దశ పనుల తీరుపై ఆరా ♦ టోలిచౌకి, ప్రశాసన్నగర్లలో గ్యాప్ వర్క్ 15 రోజుల్లో పూర్తికి ఆదేశం ♦ రూ. 1,900 కోట్లతో పది శివారు మున్సిపాలిటీలకు తాగునీరు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నిరంతరం తాగునీరు సరఫరా చేసేందుకు తగి న ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశిం చారు. బంజారాహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. రానున్న వేసవిలో నగర ప్రజలకు ఎలాంటి తాగునీటి కొరత లేకుండా చూసేందుకు కావాల్సిన నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ సూచించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు తీసుకువచ్చేందుకు జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గోదావరి మొదటి దశ నీటి సరఫరా పనుల్లో శామీర్‌పేట్, గుండ్లపోచంపల్లి వద్ద జరుగుతున్న పనులను సమీక్షించారు. ఈ పనులు పూర్తయితే సుమారు 86 ఎంజీడీల గోదావరి నీళ్లు నగరానికి వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 15 నాటికి హైదరాబాద్‌కు గోదావరి జలాలు అందిస్తామన్నారు. అలాగే కృష్ణా మూడో దశ పనులు చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధు లు, అధికారులతో సమావేశమయ్యారు. పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా టోలిచౌకి, ప్రశాసన్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న రింగ్ మెయిన్ పైపు.. గ్యాప్ వర్క్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. అయితే తమకు రాత్రి సమయంలోనే పనులు చేపట్టేలా అనుమతులు ఇచ్చారని, దీంతో పనులు మందకొడిగా కొనసాగుతున్నాయ ని అధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి కేటీఆర్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో రోజంతా పనులు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో వారం పాటు రోజంతా పనులు చేసుకునేలా కమిషనర్ అనుమతి ఇచ్చారు. అయితే పనులు జరిగే ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, డైవర్షన్ రోడ్లను ఒక్క రోజులోనే మరమ్మతు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే 45 ఎంజీడీల నీరు ప్రశాసన్‌నగర్ రిజర్వాయరుకు చేరుతుందని, దీంతో కూకట్పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలోని ప్రాంతాలకు నీటి సరఫరా అవుతుందని మంత్రి తెలిపారు. అలాగే రూ.1,900 కోట్లతో 10 శివారు మున్సిపల్ సర్కిళ్ల గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ పనులు చేపట్టేందుకు హడ్కో రూ.1,700 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చిందని, ఈ మేరకు హడ్కో ఇచ్చిన హామీ పత్రాన్ని జలమండలి అధికారులకు మంత్రి చూపించారు. అయితే ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పాలనాపరమైన అనుమతులు వేగంగా ఇప్పించాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఉత్తర్వులు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో బుధవారమే పాలనాపరమైన అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో 138ని జారీ చేసింది. వచ్చేనెల మొదటి వారంలోగా ఈ కార్యక్రమానికి టెండర్లు పిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి ఎండీ జనార్దన్‌రెడ్డితో పాటు ఎంఈఐఎల్ కంపెనీ డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఎనీ టైం వాటర్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామాల పరిస్థితులు మారుతున్నాయి. సాంకేతిక శరవేగంగా పల్లెలకు చేరుతోంది. మనిషికి ప్రాణాధారమైన తాగునీటి సరఫరాలో ఏటీఎం తరహా సాంకేతిక పరిజ్ఞానం కొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు ఎనీ టైం వాటర్ (ఏటీడబ్ల్యూ) కేంద్రాలు వెలుస్తున్నాయి. 2012 ఏప్రిల్ 7న వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం వెంకటాపురంలో మొదలైన ఈ సరికొత్త సౌకర్యం... ఇప్పుడు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల్లోని 351 గ్రామాలకు విస్తరించింది. సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలోనూ ఈ వ్యవస్థ ఉంది. గ్రామీణ అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్న బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఈ ఏటీడబ్ల్యూలకు రూపకల్పన చేసింది. ‘నీటి శుద్ధీకరణ పథకం’ పేరుతో 702 తాగునీటి సరఫరా కేంద్రాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. సమష్టి స్ఫూర్తితో ఆదర్శంగా నిలిచిన వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో రూపాయికే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఈ ఏటీడబ్ల్యూ కేంద్రాలతో అందుతోంది. గంటకు వెయ్యి లీటర్ల నీటిని సరఫరా చేసేలా ప్లాంటును నిర్మించారు. ఏటీడబ్ల్యూ కేంద్రం స్థాపనకయ్యే ఖర్చు కోసం మొదట గ్రామంలోని 80 కుటుంబాలు వెయ్యి రూపాయల చొప్పున జమచేశాయి. బాల వికాస సంస్థ మిగతా మొత్తాన్ని, యంత్ర సామగ్రిని సమకూర్చింది. మెరుగైన సరఫరాతో ప్రస్తుతం గ్రామంలోని 283 కుటుంబాలు ఈ ఏటీడబ్ల్యూ కార్డుతో నీటిని పొందుతున్నాయి. రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మంచినీటి సరఫరా ఉంటుంది. కార్డు చూపితే చాలు.. మంచినీటి ప్లాంటు వద్ద అమర్చిన మిషన్‌కు ఏటీడబ్ల్యూ కార్డును దగ్గరగా పెడితే 20 లీటర్ల మంచి నీరు వస్తుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు నీటిని తీసుకువెళతారు. ఏటీడబ్ల్యూ కార్డు కోసం ఏడాదికి రూ.360 చెల్లించాలి. ఈ లెక్కన రూపాయికే 20 లీటర్ల మంచినీరు లభిస్తోంది. అదనంగా అవసరమైతే రూ.4కు 20 లీటర్ల చొప్పున తీసుకునే వెసులుబాటు ఉంది. ఏటీడబ్ల్యూ కార్డులను ఏడాదికోసారి రీచార్జ్ చేస్తారు. ఎంత మేర వినియోగించుకున్నాం, కార్డులో ఎంత మొత్తం ఉందనేదానినీ యంత్రం వద్ద కార్డును ఉంచి తెలుసుకోవచ్చు. ఇబ్బందులను తొలగించేందుకు.. బాల వికాస స్వచ్ఛంద సంస్థ 24 ఏళ్లుగా గ్రామాల్లో మంచినీటి సరఫరా పథకాలను అమలు చేస్తోంది. ఈ సంస్థ తొలుత ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా ప్లాంట్ల నిర్వహణలో సమస్యలను గుర్తించింది. ప్లాంట్ నిర్వహణకు ఇద్దరు ఆపరేటర్లను నియమించాల్సి రావడంతో నీటి ధర పెరిగేది. కొన్ని ప్లాంట్లలో పర్యవేక్షకులు ఉండకపోవడం, ఎవరెవరు ఎంత మంచినీటిని తీసుకెళుతున్నారో తెలియకపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో హైదరాబాద్‌కు చెందిన ఆల్ఫా ఎలక్ట్రానిక్ సిస్టమ్ సహాయంతో ఏటీడబ్ల్యూ విధానాన్ని బాల వికాస సంస్థ అమలుచేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం ‘‘స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందడమే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తోంది. ప్రస్తుతం 14 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. అందులో 8 లక్షల మంది ఏటీడబ్ల్యూ విధానంలో నీటిని పొందుతున్నారు. మిగతా ప్లాంట్లలోనూ కార్డు పద్ధతిలోకి మార్చుతున్నాం. హైదరాబాద్‌లోనూ 8 ప్లాంట్లను ఏర్పాటు చేశాం. పేదలకు తక్కువ ధరకు మంచినీటిని సరఫరా చేయడం ఏటీడబ్ల్యూ వల్ల కచ్చితంగా సాధ్యమవుతుంది..’’ - సింగారెడ్డి శౌరిరెడ్డి, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఏటీడబ్ల్యూ ఒక వరం... ‘‘మా గ్రామంలో 1993లోనే బాల వికాస సహకారంతో తాగునీటి సరఫరా ట్యాంకు నిర్మించుకున్నాం. తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. విద్యుత్ శాఖ అధికారులు మాకు సాధారణ కేటగిరీలోనే కరెంటు సరఫరా చేస్తున్నారు. దీని వల్ల రూపాయికే 20 లీటర్ల నీటిని సరఫరా చేయగలుగుతున్నాం. ఏటీడబ్ల్యూ నిజంగా వరమే..’’ - పెండ్లి మల్లారెడ్డి, వాటర్ కమిటీ చైర్మన్, గంగదేవిపల్లి -
ఏం తమాషాలు చేస్తున్నారా?
పురుషోత్తపట్నం (సీతానగరం) : ‘ఏం తమాషాలు చేస్తున్నారా? త్రాగునీరు ఆపడం దుర్మార్గమైన చర్య’ అంటూ కలెక్టర్ ఆరుణ్‌కుమార్ శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న నేమాల శ్రీనివాసరెడ్డికి ఎక్స్‌గ్రేషియా అందించాలని, నాలుగు నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలని, మరికొన్ని డిమాండ్లతో నాలుగు రోజులుగా సిబ్బంది సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏఐటీయూసీ యూనియన్ వారు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ప్రయత్నించగా సీఐటీయూ వారు అడ్డుకోవడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. శుక్రవారం ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఎల్ అండ్ టీ అధికారులు చర్చించారు. కాగా వారి ద్వారా ప్రాజెక్ట్ నుంచి నీటిని శనివారం జీరోఅవర్స్లో విడుదల చేయడానికి ప్రయత్నించడంతో సీఐటీయూ అడ్డుకుంది. సమాచారం అందుకున్న కలెక్టర్ శనివారం సాయంతం ప్రాజెక్ట్ వద్దకు వచ్చారు. 216 గ్రామాలకు నీటి విడుదల ఆపడం తమాషాగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై సెక్షన్ 107 అమలు చేసి, తక్షణమే తొలగించాలని సీతానగరం తహశీల్దార్ చంద్రశేఖర్‌కు సూచించారు. ఏఐటీయూసీ యూనియన్ వారితో ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ చేయించి అక్కడ నుంచి వెళ్లారు. అక్టోబర్ 3న సమావేశం కాగా సీఐటీయూ యూనియన్ నాయకులు, కార్మికులు, ఆర్డబ్ల్యూఎస్, ఎల్అండ్టీ అధికారులు ప్రాజెక్ట్ వద్ద సమావేశం అయ్యారు. సీఐటీయూ డిమాండ్లపై చర్చించడానికి అక్టోబర్ 3న రాజమండ్రి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ లక్ష్మీపతిరావు, రంపచోడవరం డీఈలు జనార్దనరావు, పద్మనాభం, జేఈ రామారావు, రాజమండ్రి ఆర్డబ్ల్యూఎస్ డీఈ రమేష్, ఏఈఈ శ్రీనివాస్, ఎల్అండ్టీ అధికారులు పాల్గొన్నారు. -
అప్పటి వరకూ ఓట్లు అడగం: కేటీఆర్
ఖమ్మం: ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తామని సీఎం కేసీఆర్ భీష్మ ప్రతిజ్ఞ చేశారని, నీళ్లు ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఓట్లు అడగమని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వు గ్రామంలో పాలేరు సెగ్మెంట్ వాటర్‌గ్రిడ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. 60ఏళ్ల ఆంధ్రా పాలనలో చితికిపోయిన తెలంగాణ అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. వచ్చే నాలుగేళ్ల లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లుగా తాగునీటికి కటకట
కెలమంగలం : కెలమంగలం సమితి బైరమంగలం పంచాయతీలో గత రెండేళ్లుగా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పంచాయతీలోని బైరమంగలంలో 1000 ఇళ్లకుపైగా ఉన్నాయని, కారుకొండపల్లి, అగ్గొండపల్లి గ్రామాలలో కూడా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని 15 రోజులకొకసారి నీరందంచడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పశువులకు తాగునీటి కొరత ఏర్పడిందని, ఇటీవలే ఎం.పి.పర్యటించి వెళ్లారని, కానీ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు వాపోతున్నారు. కెలమంగలం సమితి అధికార్లు కూడా పట్టించుకోకపోవడంతో కార్మికులు ఎక్కువగానున్న అగ్గొండపల్లి, కారుకొండపల్లి గ్రామాలలో తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. -
జల గరళం
- సర్కారు స్కూళ్లలో తాగునీటి తిప్పలు - విద్యార్థులకు పొంచి ఉన్న ముప్పు - ఏజెన్సీ స్కూళ్లలో పరిస్థితి తీవ్రం - రక్షిత మంచినీరు కరువు - అటకెక్కిన జలమణి ప్లాంట్లు సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సర్కారు స్కూళ్ల విద్యార్థులకు ముప్పు పొంచి ఉందా..? స్కూళ్లలో విద్యార్థులు తాగుతున్నది అరక్షిత మంచినీరేనా..? జిల్లా స్థాయిలో విద్యాశాఖ, క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులపై తమ బాధ్యతను విస్మరించారా..? వారి ఆరోగ్యంపై పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 2వేల పాఠశాలల్లో విద్యార్థులు కలుషిత బోరు నీరే తాగుతున్నారు. నమ్మలేకున్నా ఇదే వాస్తవం. ఓ పక్క విజృంభిస్తోన్న విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ జిల్లా ప్రజల్లో దడపుట్టిస్తుంటే.. మరోపక్క సర్కారు స్కూళ్లలో విద్యార్థులకు డయేరియా ముప్పు పొంచి ఉంది. ఆరేళ్ల క్రితం జిల్లాకు జలమణి ప్లాంట్లు(రక్షిత మంచినీటి) మంజూరు కాగా.. ప్రస్తుతం అవి జాడలేకుండా పోయాయి. దీంతో గ్రామీణ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉన్న చేతిపంపులు, బోరుబావుల నీళ్లు తాగుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అటకెక్కిన ‘జలమణి’..! ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యతోపాటు రక్షిత తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2010లో ‘జలమణి’ పథకానికి శ్రీకారం చుట్టింది. తొలివిడతగా జిల్లా అధికారులు 2011లో జిల్లా వ్యాప్తంగా 146 పాఠశాలలను ఎంపిక చేసి ‘జలమణి’ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించింది. పథకానికి సంబంధించి యూనిట్ల ఏర్పాటుకు ఓ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్ల సామార్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు ఒక్కో విధంగా నిధులు కేటాయించింది. కనిష్టంగా రూ.15వేలు గరిష్టంగా రూ.30వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. క్షేత్రస్థాయిలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల కక్కుర్తితో విద్యార్థులకు రక్షిత నీరు అందకుండాపోయింది. చాలా పాఠశాలల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనే లేదు. కొన్ని స్కూళ్లలో ఏర్పాటు చేసినా నిర్వహణ లోపంతో నిరుపయోగంగా.. అలంకార ప్రాయంగా మారాయి. ప్లాంట్లు ఏర్పాటు చేసే పాఠశాలల గుర్తింపు విషయంలోనూ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పెద్ద తప్పే చేశారు. భూగర్భ జలం, కనీసం బోరు కూడా లేని పాఠ శాలల పేర్లనూ కేంద్రానికి పంపారు. ఆయా స్కూళ్లలోనూ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్ర నిధులు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో నీళ్లు లేకపోవడంతో ప్లాంట్ల ఏర్పాటు జరగనే లేదు. ఫలితంగా మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఇప్పటికీ బావులు, బోరు నీటినే సేవించాల్సిన దుస్థితి ఏర్పడింది. రక్షిత మంచినీరు లేని స్కూళ్లు 2వేలపైనే.. జిల్లాలో ప్రభుత్వ, ఐటీడీఏ పరిధిలో 4వేలకు పైగా ప్రాథమిక, 486 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలున్నాయి. మూడు లక్షలకు పైగా మంది విద్యార్థులున్నారు. సగానికి పైగా పాఠశాలలు, పలు వసతిగృహాల్లోనూ రక్షిత తాగునీరు కరువైంది. ప్లాం ట్లు పని చేయకపోవడంతో బోరు నీరే తాగుతున్నారు. ఏజెన్సీ పరిధిలోని పలు ఆశ్రమ, రెగ్యులర్ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. కలుషిత నీరే కారణమని వైద్యు లు స్పష్టం చేశారు. దీంతో పలు చోట్ల హెచ్ఎం దాతలను ఆశ్రయించి మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మినరల్‌వాటర్ సమకూరుస్తున్నారు. మిగిలిన చోట్ల ఇంకా బోరు, కలుషిత నీరే తాగుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మూర్తిని సంప్రదించగా.. జలమణి ప్లాంట్లు పని చేయకపోవడంపై తమకు సంబంధం లేదని, నిర్వహణ బాధ్యత హెచ్‌ఎంలదేనని స్పష్టం చేశారు. -
సింగూరు వట్టిపోతోంది!
డెడ్ స్టోరేజీకి నీరు - 50 రోజులకు మించి నీటి సరఫరా కష్టమే - ప్రస్తుత నీటిమట్టం 1.8 టీఎంసీలే - వర్షాలు పడకుంటే ఇబ్బందే.. పుల్కల్: జిల్లాతోపాటు, జంటనగరాల తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన జలాశయమైన సింగూరులో పూర్తి స్థాయిలో నీటి మట్టం పడిపోయింది. ఈ నెలలో వర్షాలు కురవకుంటే జంటనగరాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో సింగూర్ ప్రాజెక్ట్‌లోకి చుక్కనీరు చేరలేదు. గతేడాది ఇదే సమయంలో 11 టీఎమ్సీల నీటి నిల్వ ఉంది. ఈసారి (513.82 మీటర్లు) దారుణంగా 1.8 టీఎంసీలకు పడిపోయింది. జంట నగరాలతో పాటు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు, గజ్వేల్, జోగిపేట, నర్సాపూర్, దుబ్బాక నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే సత్యసాయి నీటి పథకం ద్వారా నీరు సరఫరా అవుతుంది. ప్రధానంగా సింగూరు దిగువన ఉన్న మంజీరా బ్యారేజ్‌లో ఇప్పటికే పూర్తిగా నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో విడతల వారీగా సింగూర్ నుంచి ఆరు నెలలుగా మూడు టీఎంసీల నీటిని విడుదల చేశారు. కేవలం తాగు నీటి అవసరాలకు ఉపయోగించినా... సింగూర్ నీరు మరో యాభై రోజుల కంటే ఎక్కువ సరిపోవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మంజీరాలోకి కొత్త నీరు మనూరు: ఎగువనున్న కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా మంజీరా నదిలోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇన్నాళ్లు ఎండిపోయిన మంజీరా నదికి జీవం పోసినట్లు అవుతుందని పరీవాహక ప్రజలు అంటున్నారు. రెండు రోజులగా కురుస్తున్న వర్షాల వల్ల నదిలోని గుంతల్లో నీరు చేరిందని స్థానికులు తెలిపారు. పశువులకు కొంతమేర తాగునీటి సమస్య తీరిందని, భారీ వర్షం పడితే తప్ప మంజీరాకు పూర్వ వైభవం రాదంటున్నారు. గౌడ్గాం జన్వాడ నుంచి తోర్నాల్ వరకు మంజీరా పూర్తిగా అడుగంటింది. ఇరవయ్యేళ్లలా మంజీరా ఇంతలా ఎండి పోవడం ఇదే తొలిసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తడారుతున్న గొంతులు
వరుణుడు ముఖం చాటేశాడు. చినుకు నేలరాలడం గగనమైంది. వంకలు, వాగులు, కుంటలు..ఇలా ఎక్కడా చుక్కనీరు లేదు. బోర్లన్నీ బావురుమంటున్నాయి. పంటల సాగు పూర్తిగా పడకేసింది. కనీసం తాగేందుకూ గుక్కెడు నీరు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెసీమల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరిగ్గా 20 రోజుల కిందట జిల్లాలో 220 గ్రామాలకు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేవారు. తాజాగా ఈ సంఖ్య 266కు చేరింది. జిల్లాలో తాగునీటి సమస్య ఎంత జఠిలంగా ఉందనేందుకు ఈ లెక్కలే నిదర్శనం. - జిల్లాలో గుక్కెడు తాగునీరూ కరువే - వరుణుడి జాడ లేక అడుగంటిన భూగర్భజలాలు - 37 మండలాల్లో 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా - పది మండలాల్లో 22 అద్దె బోర్లు అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. 37 మండలాల పరిధిలోని 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అధికంగా పుట్లూరు మండలంలో 25 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అలాగే ఆమడగూరు మండలంలో 24, తనకల్లు మండలంలో 21, ఓబుళదేవచెరువులో 18, యల్లనూరులో 18, నల్లమాడలో 17, తలుపులలో 14, ధర్మవరంలో 13, ముదిగుబ్బలో 12 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అసలే నీరులేని గ్రామాలకు మనిషికి 40 లీటర్ల మేరకు సరఫరా చేస్తున్నారు. అలాగే 96 గ్రామాల్లో పశువులకు నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కో పశువుకు 30 లీటర్ల లెక్కన అందిస్తున్నారు. వివిధ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి 22 వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకున్నారు. ఒక్కో బోరుకు నెలకు రూ. 6 వేలు అద్దె చెల్లిస్తున్నారు. జఠిలమవుతున్న సమస్య బోర్లలో నీరు అడుగంటుతుండడంతో తాగునీటి సమస్య రోజురోజుకు జఠిలమవుతోంది. గతేడాదికంటే ఈసారి సమస్య మరీ తీవ్రతరం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 200 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటే ఈసారి 266 గ్రామాలకు చేస్తున్నారు. అలాగే గతేడాది ఈ సమయానికి కేవలం 7 మాత్రమే వ్యవయబోర్లు అద్దెకు తీసుకుని ఉంటే, ఈసారి 22కు పెరిగింది. రానున్న వారం పదిరోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు గ్రామీణ నీటి పథకం అధికారులు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న రూ. 21.78 కోట్లు ఖర్చు చేశారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సమస్య ఎక్కువవుతోంది - కాంతానాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతూ తాగునీటి సమస్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. 266 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఇప్పటిదాకా రూ. 21.78 కోట్లు ఖర్చు చేశాం. డిసెంబరు దాకా రూ. 12.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. -
మంచినీటికి చెడ్డ కష్టం!
జిల్లా ప్రజలకు తప్పని తాగునీటి ఇబ్బందులు వేసవి వస్తే 48 గ్రామాలలో నరకం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకూ ఇబ్బంది మూడేళ్లుగా పూర్తికాని ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం ఏలూరు టూటౌన్ : జిల్లాలోని రైతులు ఓ పక్కసాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క తాగునీటికి కూడా ప్రజలు కటకటలాడుతున్నారు. నరసాపురం మండలంలోని ఆరు గ్రామాల ప్రజలు, మొగల్తూరు మండలంలోని 42 గ్రామాల ప్రజలు వేసవి వస్తే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఆయా ప్రాంతాలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో సమస్యకు పరిష్కారం చూపటంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 48 మండలాలలో 2399 హేబిటేషన్లు ఉన్నాయి. నరసాపురం, మొగ ల్తూరు మండలాలలోని 48 గ్రామాలలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉంటున్నాయి. నరసాపురం పరిధిలోని పసలదీవి, కొత్తపేట, శెట్టిబలిజపేట, పసలదీవి హరిజనపేట, చామకూరిపాలెం, కొండవీటి కొడప గ్రామాల ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొగల్తూరు మండలంలోని మొగల్తూరు, వారతిప్ప, ముత్యాలపల్లి, మోడి, పేరుపాలెం సౌత్, పేరుపాలెం నార్త్, కేపీ పాలెం సౌత్, నార్త్‌ల పంచాయతీలలోని 42 గ్రామాలలో మంచినీటికి అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏటా ఇవే ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారులు 20 రోజులపాటు ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ గ్రామాలు సముద్ర తీర ప్రాంతం పరిధిలో ఉండటం వల్ల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎన్నికలప్పుడు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు సముద్ర అలల్లో కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు సినీ పరిశ్రమలలోను, రాజకీయాల్లోనూ కీలక వ్యక్తులుగా ఉన్నప్పటికీ తాము పుట్టి పెరిగిన గ్రామాల ప్రజల తాగునీటి సమస్యను పట్టించుకోకపోవటం స్థానికులను కలిచి వేస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని కుమ్మరరేవు, అమీనాపేటలోని బీసీ హాస్టల్, ఎంఆర్సీ కాలనీలకు చెందిన ప్రజలు మాత్రం తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం రోజుకు 20 ట్యాంకర్ల ద్వారా నీటిని నగరపాలక సంస్థ అధికారులు సరఫరా చేస్తున్నారు. రోజూ ట్యాంకర్లు వచ్చే వరకూ ఇంట్లో వంటలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మూడు సంవత్సరాలుగా పూర్తికాని ఓహెచ్ఎస్ఆర్లు జిల్లాలోని 65 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.14 కోట్ల 15లక్షలు కేటాయించారు. మూడు సంవత్సరాల క్రితమే ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు అయినప్పటికీ ఇప్పటికి ఇంకా పూర్తికాని దుస్థితి నెలకొని ఉంది. నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ స్కీం లో ఈ నిధులు మంజూరు అయ్యాయి. అధికారులు ఇప్పటి నుంచైనా యుద్ధ ప్రతిపాదికన పనులు చేయిస్తే వచ్చే వేసవికైనా ఇవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిల్టర్ వాటరు కొనాల్సిందే అయితే జిల్లాలోని 60 శాతం మంది ప్రజలు మాత్రం తాగునీటికి ఫిల్టర్ వాటర్‌నే ఉపయోగిస్తున్నారు. డెల్డా, మెట్ట ప్రాంతాలతోపాటు ఏజెన్సీ ప్రాంతాలలో సైతం వాటర్ ప్లాంటులు అందుబాటులో ఉండటంతో ప్రజలు వాటినే కొనుగోలు చేసుకుని తాగుతున్నారు. 20 లీటర్ల నీళ్ల టిన్ను రూ. 2నుంచి రూ. 10 వెచ్చిస్తున్నారు. కొన్ని ప్లాంట్ల వారయితే ఈ నీటికే మినరల్ వాటర్ అని పేరు పెట్టి రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేస్తున్నారు. -
పంచాయతీ కార్యాలయానికి తాళం
ఇల్లందుకుంట (కరీంనగర్ జిల్లా) : మూడు నెలలుగా గ్రామంలో తాగునీరు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులను నిర్బంధించి బయట తాళం వేశారు. ఈ సంఘటన గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం ముస్కాన్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలిసిన ఎంపీపీ ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు కార్యాలయం తాళం తీశారు. -
'కేసీఆర్ సర్కారుకు సఖ్యత లోపించింది'
హైదరాబాద్: తాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ సర్కారుకు సఖ్యత లోపించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. కృష్ణా నదిపై కర్ణాటక ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణకు తాగు నీటి కష్టాలు తప్పవని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినా స్పందించటం లేదన్నారు. ప్రాజెక్టుల అంశం పై కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రతిపక్షాలను కలుపుకొని పోయేలా కేసీఆర్ సర్కారు వ్యవహరించాలని సూచించారు. -
పెన్నమ్మకు దాహార్తి
కడప కార్పొరేషన్ : నగరపాలక వర్గం, అధికార యంత్రాంగం ముందుచూపుతో వేసవి గండాన్ని అధిగమించిన కడప నగరపాలక సంస్థకు మరో గండం ఆగస్టు మాసం రూపంలో ముంచుకొస్తోంది. జూన్, జూలై మాసాల్లో వర్షాలు సరిగా పడకపోవడంతో పెన్నా పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. మరో వారం రోజుల తర్వాత కడపలో తాగునీటి సమస్యలు తీవ్రమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మార్చి మాసంలోనే వేసవిలో త లెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా అలగనూరు, వెలుగోడు నుంచి నీటిని విడుదల చేయించి గండి, లింగంపల్లిల వద్ద నిల్వ చేయడం ద్వారా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకొన్నారు. వేసవి గండం గడిచిపోయిందిలే అని ఊపిరి పీల్చుకొనేలోపు ఆగస్టు గండం వచ్చిపడింది. వేసవిలో అధికారులు నిల్వ చేసిన నీరంతా నెలరోజుల క్రితమే ఆవిైరె పోయింది. దీంతో భూగర్భ జలాలు పదహారు అడుగులకు పడిపోయాయి. ఇప్పటికే చాలా బోర్లలో నీరు అందక ఇంకా లోతుకు పైపులు దించుతున్నారు. జూన్, జూలైలో వర్షాలు పడతాయని అనుకొంటే చినుకు కూడా రాలలేదు, శ్రీశైలం డ్యామ్‌లో కూడా డెడ్‌స్టోరేజీ ఉండటంతో కృష్జాజలాల ఆధారంగా ఉన్న చిన్న చిన్న నదులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. అందులో భాగంగానే పెన్నా కూడా ఎండిపోయింది. 2008 సెప్టెంబర్‌లో కూడా సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. ఇప్పుడు ఒకనెల ముందే అదే పరిస్థితి పునరావృతమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. - కడప నగరపాలక సంస్థ పరిధిలో 3.46లక్షల మంది జనాభా ఉండగా, వీరందరికీ సరిపడా తాగునీరు సరఫరా చేయాలంటే 55ఎంఎల్డీల నీరు అవసరమవుతుంది. పెన్నాలో నీరుంటే లింగంపల్లి వాటర్వర్క్స్నుంచి 35 ఎంఎల్డీల వరకూ నీరు పంపింగ్ చేయవచ్చు. కానీ ప్రస్తుతం 30 ఎంఎల్డీలు మాత్రమే వస్తోంది. గండి వాటర్ వర్క్స్‌నుంచి 15 ఎంఎల్డీలకుగాను 13ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. ఈదురు గాలులు, నదిలో నీరు లేకపోవడం వల్ల లింగంపల్లి, గండిలలో ఉన్న బోరుబావులు ఒకటి తర్వాత ఒకటి అడుగంటిపోతున్నాయి. దీంతో అధికారులు బావుల్లో మరింత లోతుకు పైపులు వేసి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. గండిలో 8 బోరుబావులుండగా, లింగంపల్లిలో మొత్తం 44 ఫిల్టర్ పాయింట్లు ఉన్నాయి. ఇవి కూడా చాలావరకూ అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయి. మహా అంటే మరో వారం రోజులు మాత్రమే నీరు లభించే అవకాశాలు ఉంటాయని, ఆ తర్వాత పెన్నాకు నీరు రాకపోతే కడప వాసులకు కష్టాలు తప్పవని తెలుస్తోంది. - కడప నగరానికి ఎదురు కాబోతున్న నీటిఎద్దడిని గుర్తించి ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న మల్లికార్జున పుష్కరాల సమయంలోనే ఈఎన్సీకి లేఖ రాశారు. వెలుగోడు నుంచి నీరు వచ్చే అవకాశం లేనందున అలగనూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని అందులో పేర్కొన్నారు. ఇటీవల కడపకు వచ్చిన పబ్లిక్ హెల్త్ ఎస్ఈ కూడా నగరపాలక అధికారులు చెబుతున్నది వాస్తవమేనని, కడపకు తాగునీటి అవసరాలకోసం నీటిని తప్పక విడుదల చేయాల్సిందేనని ఈఎన్సీకి నివేదిక కూడా ఇచ్చారు. ఈ మేరకు అలగనూరు నుంచి నీటిని విడుదల చేశారని చెబుతున్నారు.కానీ ఆ నీటిని మధ్యలోనే రైతులు తోడేస్తే గతసారిలాగే నీరు గండి, లింగంపల్లికి చేరడం చాలా ఆలస్యమవుతుంది కాబట్టి నీరు ఎంతవరకు వచ్చిందో చూసేందుకు ఒకరిద్దరు అధికారులు నేడు రాజోలి వద్దకు వెళ్తున్నట్లు సమాచారం. - కేసీకి నీరు వదిలితే సమస్య తప్పుతుందని నగరపాలకవర్గం, అధికారులు భావిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి కేసీ కెనాల్‌కు నీరు వచ్చే వరకైనా అలగనూరు నుంచి వదిలిన నీరు గండికి చేరితే కొన్ని రోజులైనా సమస్యలు రాకుండా ఉండే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగానే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి కేంద్రీకరించారు. గండిలో మూడు బోర్లు, బుగ్గలో ఒక బోరు రైతులనుంచి అద్దెకు తీసుకొంటున్నారు. కడప నగరంలో అక్కడక్కడా ఉన్న బోర్లను కూడా వినియోగించుకోవాలని చూస్తున్నారు. -
నాలుగు నెలల్లో నీటి కష్టాలకు చెక్!
క్షేత్రగిరి గుట్టపై చురుగ్గా సాగుతున్న వాటర్‌గ్రిడ్ పనులు గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్న శివారు ప్రాంతాలు మేడ్చల్ : తాగునీటి సమస్యతో సతమతమవుతున్న మేడ్చల్ ప్రజలకు మరో నాలుగు దాహార్తి తీరనుంది. ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పనులు చురుగ్గా సాగిస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్టు (హెచ్‌ఎండబ్ల్యుస్) చేపట్టిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి వెంబడి పైపులైన్ వేసి మేడ్చల్ మండలం ఘనాపూర్ గ్రామ పరిధిలోని వెంకటేశ్వరస్వామి క్షేత్రగిరి గుట్టపై సంప్, రిజర్వాయర్ నిర్మాణాలను సర్కారు చేపట్టింది. 1500 లక్షల లీటర్ల సంప్, 27 లక్షల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ఏడున్నర ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నెల రోజుల్లో ట్రయల్ చేయనున్నట్లు సంస్థ ఇంజినీర్లు తెలిపారు. మొత్తం రూ.80 కోట్లవ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఆఖరు దశలో ఉంది. నగరానికి గోదావరి జలాలు. క్షేత్రగిరిపై నిర్మిస్తున్న రిజర్వాయర్ నుంచి రెండు రింగుల ద్వారా హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేయనున్నారు. ఒక రింగు ద్వారా లింగంపల్లి, మరో రింగు ద్వారా మల్కాజిగిరి ప్రాంతాలకు మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల మీదుగా నీరు సరఫరా చేయనున్నారు. మేడ్చల్‌కు ప్రయోజనమిలా.. క్షేత్రగిరి గుట్టపై నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ పైపులైన్ మేడ్చల్ మీదుగా లింగంపల్లికి వెళుతుం ది. లింగంపల్లికి వెళ్లే పైపులైన్ నుంచి మేడ్చల్ పెద్ద చెరువులోకి గోదావరి జలాలు నింపడం వల్ల మేడ్చల్‌వాసుల నీటి కష్టాలు తీరుతాయి. మేడ్చల్ చెరువును మినీ రిజర్వాయర్‌గా మా ర్చనుండటంతో సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. నాలుగు మండలాలకు నీటి సరఫ రా చేసే విధంగా ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి వాటి ద్వారా నీటిని సరఫరా చేస్తారు. నాలుగునెలల్లో నీళ్ళందిస్తాం నగరానికి నాలుగు నెలల లోపు నీళ్లందిస్తాం. ప్రాజెక్ట్ నిర్మాణపనులు తుది దశలో ఉన్నాయి. లింగంపల్లి రిం గ్లో 7 కి.మీ., మల్కాజిగిరి రింగ్‌లో 8 కి.మీ. పైపులైన్ వేయాల్సి ఉంది. పనులు ప్రస్తుతం వేగిరం చేశాం. -సతీష్, క్షేత్రగిరి వాటర్‌గ్రిడ్ సైట్ ఇంజినీర్ నాలుగు మండలాలకు నీరందిస్తాం గోదావరి జలాలను నియోజకవర్గంలోని నాలుగు మం డలాలకు సరఫరా చేసే లా నిధులు మంజూరు చేసింది. క్షేత్రగిరి సంప్ నుంచి ఆ యా మండలాలకు వెళ్లే పైపులైన్ ద్వారా నీరు తీసుకుని ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి గ్రామాలకు నీరు సరఫరా చేస్తాం. -సుధీర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే -
కన్నీళ్లు..
♦ పల్లెలు గొల్లుమంటున్నాయ్.. ♦ చుట్టూ నీళ్లున్నా.. రోజూ ఇక్కట్లే ♦ ఎడారిగా మారుతున్న మంజీర తీరం ♦ వట్టి పోతున్న తాగునీటి పథకాలు ♦ నిద్రావస్థలో అధికారులు మెదక్ : మెతుకుసీమ ప్రజలకు సాగు, తాగునీటి ఆధారం మంజీర నది. డివిజన్ కేంద్రమైన మెదక్ నియోజకవర్గంలో 30 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న ఈ నదిపై పాపన్నపేట మండలం కొడుపాక, కొత్తపల్లి, పొడ్చన్‌పల్లి, మెదక్ మండలం జక్కన్నపేట ప్రాంతాల్లో సీపీడబ్ల్యూ స్కీమ్ ఏర్పాటు ద్వారా 40 గ్రామాలకు తాగునీరందిస్తున్నారు. ఇప్పటి వరకు సరైన వర్షం పడకపోవడంతో కొడుపాక పథకం త ప్ప, మిగతావన్నీ మూతపడేస్థితికి చేరాయి. మరోపక్క బోర్లలో నీటిమట్టం తగ్గిపోతుండటంతో సుమారు 20 శాతం గ్రామాలు నీటికి కటకటలాడుతున్నాయి. రోజూ కనీసం ఒక్కొక్కరికి 40 లీటర్ల తాగునీరు అందించాల్సిన అధికారులు కనీసం నాలుగు లీటర్లు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారు. సీఆర్ఎఫ్ నిధులు రూ.30లక్షలు, నాన్ సీఆర్ఎఫ్ నిధులు రూ.2.30 కోట్లు మంజూరైనా.. అందులో సగం కూడా వెచ్చించనట్టు తెలుస్తుంది. అలాగే గ్రామ పంచాయతీలకు వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధులను కూడా తాగునీటి సౌకర్యం కోసం వినియోగించక పోవడంతో రోజు రోజుకూ సమస్య తీవ్రమవుతోంది. అన్నారం.. తాగునీటికి జాగారం పాపన్నపేట మండలం అన్నారంలో 70 శాతం మందికి నీరందడం లేదు. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న బోరుబావిలో నీటిమట్టం తగ్గిపోవడంతో జనం గొంతు తడవడం లేదు. ముత్తరాసివాడలో చేతిపంపులో నీళ్లున్నా.. హ్యాండిల్, సింగిల్‌ఫేస్ మోటర్ బిగించక పోవడంతో సమస్య తీవ్రమైంది. దీంతో రెండురోజులకోసారి స్నానాలు చేస్తున్నామని, వారానికోసారి బట్టలు ఉతుక్కుంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. సర్పంచ్ పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామ మహిళలంతా శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రెండ్రోజుల్లో సమస్య తీర్చకుంటే తాగునీటి ట్యాంకులను కూల్చివేస్తామని హెచ్చరించారు. మెదక్ టౌన్లో నీటికి కటకట మెదక్ పట్టణ ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. పట్టణంలో నాలుగు నెలలుగా రెండ్రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. 80 వేల జనాభా కలిగిన పట్టణానికి రోజూ 4.20 లక్షల లీటర్ల తాగునీరు అవసరం. కానీ, సరఫరా 2.50 లక్షల లీటర్లకు మించడం లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ఆరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. 65 సింగిల్‌ఫేస్ మోటర్లు, 5హెచ్‌పీ 40 మోటర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్టు ఇంజనీర్ చిరంజీవులు చెబుతున్నారు. వ్యవసాయ బోరుబావులను సైతం అద్దెకు తీసుకొని నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. గొంతెండుతోన్న ‘మండలం’ మెదక్ మండల ప్రజలకు తాగునీరందించే పైలట్ పథకానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రెండునెలలవుతున్నా పట్టించుకునే దిక్కులేదు. మండలంలో 35 గ్రామ పంచాయితీలు, 17 శివారు గ్రామాలున్నాయి. మండలానికి నీటి సరఫరా నిమిత్తం 2008లో రూ. 10 కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో సర్దన శివారులోగల మంజీర నదిలో ఇంటెక్వెల్ను నిర్మించి నది ఒడ్డున సంప్‌హౌస్‌ను కట్టి, జక్కన్నపేట, హవేళిఘణపూర్ శివారుల్లో హెడ్‌ఓవర్ ట్యాంకులను నిర్మించారు. మంజీర నుండి పైపులైన్ల ద్వారా పలు గ్రామాల్లోని వాటర్‌ట్యాంకులకు నీటిని సరఫరా చేసి ప్రజలకు తాగునీటికి అందిస్తున్నారు. ఇందుకోసం సర్దన సబ్‌స్టేషన్ నుండి నీటిపథకం వరకు డెరైక్టు (హెచ్‌టీ) కరెంట్ లైన్‌ను మంజీర నది వరకు వేసి మోటార్లను నడుపుతున్నారు. 2 నెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిస్థితిని చక్కదిద్దడం లేదు. లాక్యతండా.. నీళ్ల కోసం తండ్లాట రామాయంపేట మండలం పర్వతాపూర్ పంచాయితీ పరిధిలోని లాక్యా తండాలో నీటి సరఫరా ట్యాంకు నిర్మాణంతో పాటు పైపులైను వేయడానికి, బోరు తవ్వకానికి గతంలో రూ.8 లక్షల వరకు ఖర్చుచేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా.. అనంతరం పైపులైను శిథిలం కావడం, ట్యాంకుకు నీరు సరఫరా చేసే బోరులో నీరు అడుగంటడంతో కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుక్కెడు నీటి కోసం రేయింబవళ్లు వ్యవసాయ బోర్ల చుట్టూ తిరుగుతున్నామని తండావాసులు అంటున్నారు. కరెంట్ లేకుంటే ఆపాటి నీళ్లూ దొరకడం లేదని వాపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో స్పందించడం లేదంటున్నారు. జంగరాయిలోనూ అంతే.. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంతో పాటు మరో మూడు తండాలు, ఎస్సీ కాలనీ ప్రజలు తాగునీటి కోసం అగచాట్లు పడుతున్నారు. మూడు తండాలకు కలిపి ఎర్రగుంట తండాలో రక్షిత నీటి ట్యాంకు ఉంది. గ్రామంలో మంచినీటి బోరుబావులు వట్టిపోవడంతో నీళ్లు ట్యాంకులో పడడంలేదు. దీంతో త్రీఫేజ్ విద్యుత్ సరాఫరా ఉన్నప్పుడే గ్రామంలో మంచినీటి సరఫరా జరుగుతోంది. అన్ని గ్రామాలలో మాదిరి ఇక్కడ ఇంటికి నల్లా నీరు అందడంలేదు. ఫలితంగా అంతా వీధి నల్లా వద్ద క్యూ కడుతున్నారు. కొన్నిసార్లు ఘర్షణలూ చోటుచేసుకుంటున్నాయి. -
ముప్పేట దాడి
శుక్రవారం జరిగిన జెడ్పీ సమావేశం గరంగరంగా సాగింది. గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్ ) అధికారుల తీరుపై ముప్పేట దాడి జరిగింది. ప్రొటోకాల్ వివాదం వేడెక్కించింది. నలుగురు ఎంపీడీవోలపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ మంత్రి శిద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు: గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగం( ఆర్‌డబ్ల్యుయస్ ) అధికారుల తీరుపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముప్పేట దాడి జరిగింది. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారంటూ అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపడుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు డోలాశ్రీ బాలావీరాంజనేయస్వామి, లంకా సాంబశివరావులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2010 నుంచి ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్ట పరిహారం రూ.35 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదో సమాధానం చెప్పాలంటూ వ్యవసాయశాఖ జేడీఏ మురళీకృష్ణను గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి నిలదీశారు. కందుకూరు జెడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి మాట్లాడుతూ దళారుల దెబ్బకు లారీ వరి గడ్డిని రూ.25 నుంచి రూ.30 వేలు చెల్లించాల్సి వస్తుందన్నారు. పశుసంవర్థకశాఖ చొరవ తీసుకొని గడ్డిని రవాణా చేయించగలిగితే పశుపోషకులకు ఉపయోగంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. పొదిలి ప్రాంతంలో పశువులను బలవంతంగా సంతలకు తరలిస్తున్నారంటూ పొదిలి ఎంపీపీ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఒక తీర్మానం చేసి కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, దానిపై తీర్మానం చేయాలంటూ కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సభ దృష్టికి తీసుకువెళ్లగా జెడ్పీ చైర్మన్‌తోపాటు సభ్యులు అంగీకరించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి డబ్బులు పుష్కలంగా ఉన్నా సమస్య ఏమిటో చెప్పాలంటూ మంత్రి శిద్దా రాఘవరావు ఆర్డబ్ల్య్యుస్ అధికారులను నిలదీశారు. పథకాలు బాగుపడేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో చెప్పండి...నిధులు నేను తెప్పిస్తా అంతే గాని మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే మాత్రం సహించేదిలేదంటూ మండిపడ్డారు. ప్రతిపాదనలు తయారుచేసి పంపామని, జెడ్పీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆర్‌డబ్ల్యుయస్ అధికారులు చెప్పడంతో జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ జోక్యం చేసుకొని నిధులన్నీ ఒకే పథకానికి ఖర్చుచేస్తే మిగితా అభివృద్ధి పనులు కుంటుపడతాయని, దాంతోపాటు బోర్లు వేస్తే తప్పనిసరిగా నీరు పడుతుందో లేదో అనే అనుమానంతో ఆపినట్లు ప్రకటించారు. నలుగురు ఎంపీడీవోలపై విచారణ ఉలవపాడు, త్రిపురాంతకం, తర్లుబాడు, కొనకనమిట్ల ఎంపీడీవోలు అవినీతికి పాల్పడుతున్నారని చర్యలు చేపట్టాలంటూ జడ్పీటీసీ, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, పాసుపుస్తకానికి వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు, చివరకు జెడ్పీటీసీ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనానికి, ట్రావెల్ అలవెన్స్‌లకు వాటా అడుగుతున్నారంటూ ధజమెత్తారు. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. మంత్రి శిద్దా జోక్యం చేసుకొని తక్షణమే ఉలవపాడు ఎంపీడీవోను సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. ఆర్డీవో స్థాయి అధికారితో విచారణకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతులరామారావు, డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి, లంకా సాంబశివరావు, కదిరి బాబూరావులు హాజరుకాగా వేదికపై చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ సుజాతాశర్మ, జేసీ హరిజవహర్‌లాల్, సీఈవో ఎ.ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరసింహారావు, ఏవో ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాగుంటకు సన్మానం ఒంగోలు: స్థానిక సంస్థల ప్రతినిధిగా ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన మాగుంట శ్రీనివాసులరెడ్డిని శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ, కంచర్ల శ్రీకాంత్‌చౌదరి, జెడ్పీ సీఈవో ప్రసాద్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రతినిధిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.