‘ప్రభుత్వ అసమర్ధతే కారణం’
Published Thu, Dec 24 2015 11:42 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
మంగళగిరి: ప్రభుత్వం అసమర్ధత కారణంగానే గుంటూరు జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా మారిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం ఉదయం ఆయన మంగళగిరిలోని తాగునీటి పథకాలను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. నీటి ఎద్దడి నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో వేసవికి ముందే నీళ్ల ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు.
కృష్ణా నదిలో నీటి నిల్వలు త గ్గుముఖం పట్టటంతో సమస్య తీవ్రతరమైందని చెప్పారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు పరిష్కార మార్గాలు వెదికి, ప్రజల ఇక్కట్లు తీర్చాలని కోరారు.
Advertisement
Advertisement