
ఇది తోలుమందం సర్కార్
⇔ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ధ్వజం
⇔ ప్రజాసమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది
⇔ ప్రత్యేక జీవోలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు..
సాక్షి, కడప : ‘‘ప్రజలు కష్టాలు పడుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు.. ఒకవైపు కరువు... మరోవైపు తాగు నీరు, సాగునీటి సమస్యలతో జనం అల్లాడు తున్నా చంద్రబాబు పట్టించుకోవ డంలేదు’’ అని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమె త్తారు. గురువారం వైఎస్‌ఆర్ జిల్లా పులివెం దుల నియోజకవర్గంలోని లింగాలలో అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు, అధికారులతో సమస్యలపై ఆయన సమీక్షించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిల సమక్షంలో వివిధ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వానికి తోలు మందమని.. సమస్యలను ఎత్తి చూపినా నిర్లక్ష్యం వహిస్తారే తప్ప.. పరిష్కారంపై చిత్తశుద్ధిలేదని జగన్ ఎద్దేవా చేశారు. ఎలాంటి సమ స్యలైనా అందరం కలిసికట్టుగా పోరాడి సాధించుకుం దామని పిలుపునిచ్చారు. వేసవి మూడు నెలల పాటు ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కోకుండా ప్రభు త్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
ఉచితమంటూ.. వందల బిల్లులా..
ప్రభుత్వం చెప్పేదొకటి.. ఆచరణలో చేసేది మరొకటిగా మారిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాలకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 50యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని పేర్కొంటున్నా.. రూ.100, రూ.200, రూ.300లు ఇలా రూ.600ల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నా చంద్రబాబు పట్టించుకోరు కానీ.. ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం ప్రత్యేక జీవోలు విడుదల చేసి దోచిపెడుతున్నారని జగన్ విమర్శించారు. లింగాల మండలం తాగునీటి సమస్యపై అనంతపురం కలెక్టర్ కోనశశిధర్‌తో,చీనీ రైతుల సమస్యలపై వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణతో జగన్ మాట్లాడారు.