వివేకా కేసులో సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారు: ఎంపీ అవినాష్‌ | MP Avinash Press Meet On Sunitha Dastagiri Behavior Viveka Case | Sakshi
Sakshi News home page

వివేకా కేసులో సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారు: ఎంపీ అవినాష్‌

Published Tue, Apr 16 2024 3:31 PM | Last Updated on Tue, Apr 16 2024 6:35 PM

MP Avinash Press Meet On Sunitha Dastagiri Behavior Viveka Case - Sakshi

వివేకా కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడిన అవినాష్‌

సునీత చేసిన ఆరోపణలపై పవర్‌ ఫుల్‌ సమాధానాలిచ్చిన అవినాష్‌

తాను చెప్పే సమాధానంతో పాటు సాంకేతిక ఆధారాలను చూపించిన అవినాష్‌

ఎన్నికల వేళ సునీత వ్యవహారం, షర్మిల ప్రకటనలను తప్పుబట్టిన అవినాష్‌

సునీత, సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడి

సాక్షి, కడప: వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు  చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్‌. ఏపీ ఎన్నికల వేళ.. రాజకీయాలు వేడేక్కిన వేళ.. పోలింగ్‌ సమీపిస్తోన్న వేళ.. నర్రెడ్డి సునీత పెడుతున్న ప్రెస్‌మీట్‌లు, చేస్తోన్న వివాదస్పద అంశాలు, బోడిగుండుకు.. మోకాలికి ముడిపెడుతూ చేస్తోన్న సూత్రీకరణలను అవినాష్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక పకడ్బందీగా పన్నిన కుట్రలో భాగంగా సునీత ప్రెస్‌మీట్‌లలో అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, షర్మిల ఓ అడుగు ముందుకేసి ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందని, వాటిని చంద్రబాబు.. మరో అడుగు ముందుకేసి హత్యా రాజకీయాలంటూ ప్రకటనలు చేస్తున్నారని అవినాష్‌ రెడ్డి మండిపడ్డారు. అసలు హత్య కేసులో ఇప్పటివరకు సిబిఐ అనుసరించిన ధోరణి, దర్యాప్తులో డొల్లతనంతో పాటు సునీత వ్యవహార శైలిని కూడా అవినాష్‌ రెడ్డి పలు ఆధారాలతో మీడియా ముందుంచారు.

ఎంపీ అవినాష్‌ ప్రెస్‌మీట్‌లో ముఖ్యాంశాలు:

  • షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారు
  • లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోంది
  • అసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చాను
  • దస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండి
  • ఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడు
  • రంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలి
  • నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదు
  • దస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారు
  • అనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడు
  • దస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదు
  • పక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు
  • 306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్‌ అయిపోయే వరకు బయటకు పంపకూడదు
  • కానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారు
  • అప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది?
  • సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయి
  • ఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.?
  • హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసు
  • జమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పింది
  • ఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు?
  • నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చాను
  • ఎవరో ఫోన్ చేస్తే అవినాష్‌ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోంది
  • ఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది?
  • వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్‌ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ?
  • శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పాను
  • మూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ?
  • ఎవరైనా కాల్‌ చేస్తారని ముందే ఊహిస్తారా?
  • నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడు
  • నేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పాను
  • వివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే  చెప్పి ఉండాలి
  • ఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడు
  • ఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడు
  • సునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలి
  • ఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసు
  • వివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారు
  • చివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ?
  • బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు.
  • రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారు
  • ఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదు
  • గూగుల్‌ టేక్‌ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోంది
  • వైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది
  • 100 మీటర్ల నుంచి కిలోమీటర్‌ అంత దూరం తేడా కనిపిస్తోంది
  • అది కూడా మూడేళ్ల తరువాత చూశారు?
  • మొదట్లో గూగుల్ టేక్‌ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు?
  • గూగుల్ టేక్‌ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది?
  • గ్రీన్‌ విచ్‌ మీన్‌ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది?
  • ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారు
  • వారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదు
  • చంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారు
  • నేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదు
  • న్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉంది
  • ఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుంది
  • నా ఫోన్‌లో వాట్సప్ యాక్టివ్‌ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారు
  • ఆరోపించే వారికి కనీసం వాట్సాప్‌ పట్ల అవగాహన అయినా ఉండాలి
  • నా నెంబర్‌ వాట్సాప్‌లో  ఎన్నో గ్రూపులున్నాయి.
  • ఏ గ్రూపులో ఎవరు పోస్ట్‌ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుంది
  • నేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా?
  • మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారు
  • అనేక ఇబ్బందులకు గురిచేశారు
  • 74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడు
  • టిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారు
  • హత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.!
  • వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు?
  • వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచింది
  • కేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement