
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప పట్టణంలో అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల సందర్బంగా జరిగిన ప్రార్థనలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అధిక వర్షాలతో భూములు జవుకు ఎత్తుతున్న విషయాన్ని ఇటీవల లింగాల మండల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి రైతులు తీసుకెళ్లారు.
ఆ సమస్యపై అధ్యయనం చేయటానికి వచ్చిన కమిటీ సభ్యులతో కలిసి రైతుల భూములను ఎంపీ పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్డీ అనిల్ కుమార్‌రెడ్డి.. ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్ శాఖ అధికారులు, మండల నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment