సాక్షి, కామారెడ్డి : జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని నినాదాలతో హోరెత్తించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించిన మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి..
శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
Published Tue, Feb 9 2021 2:48 PM | Last Updated on Tue, Feb 9 2021 3:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment