women protest
-
నాలుగేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సోషల్ మీడియా ఇన్‌స్ట్రాగామ్‌లో చిగురించిన ప్రేమ ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో కొత్త మలుపు తిరిగింది. ప్రియురాలు ప్రియుడు ఇంటి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని కోరిన ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల వివరాలు ప్రకారం.. ఇల్లంతకుంట మండలానికి చెందిన రచన అనే యువతికి తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఇరువురు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో రచన తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్న క్రమంలో ఆ విషయాన్ని సాగర్‌కు చెప్పి తనను వివాహం చేసుకోవాలని కోరింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించాలని కోరింది. అప్పటి నుంచి సాగర్ ముఖం చాటేశాడు. రచన ఫోన్ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టి స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించింది. ఆదివారం గండిలచ్చపేట గ్రామానికి చేరుకొని సాగర్ ఇంటి ఎదుట బైఠాయించింది. యువతి బైఠాయించిన విషయం తెలుసుకున్న తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్ సఖీ టీమ్‌తో గండిలచ్చపేట చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రచన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆంక్షలను ధిక్కరిస్తూ.. లో దుస్తులతో నిరసన
టెహ్రాన్: బహిరంగంగా మహిళల వేషధారణపై కఠిన నిబంధనలు, కట్టుబాట్లను అమలుచేస్తున్న ఇరాన్లో ఓ విద్యార్థిని నిరసన గళం విప్పారు. ముఖం కనిపించకుండా సంప్రదాయ వస్త్రం ధరించలేదన్న కారణంగా టెహ్రాన్‌లో ఆ విద్యార్థినిపై బసీజ్ పారామిలటరీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ ఇందుకు వేదికైంది. వాగ్వాదంలో బసీజ్ పారామిలటరీ సభ్యులు ఆ వర్సిటీ విద్యార్థిని దుస్తులు చింపేశారు. దీంతో ఆగ్రహంతో ఆ అమ్మాయి చిరిగిన బట్టలు పక్కన పడేసి లోదుస్తుల్లో తన నిరసన వ్యక్తంచేసింది. విద్యార్థినులపై కఠిన మత చట్టాలను అమలుచేయడమేంటని నిలదీసింది. అలాగే లోదుస్తుల్లో వందలాది విద్యార్థినీవిద్యార్థుల మధ్యలో వర్సిటీ ప్రాంగణంలో కలియ తిరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసింది. దీంతో సాధారణ దుస్తుల్లో వచి్చన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కారులో కుక్కి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీంతో ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ సంస్థ స్పందించింది. ‘‘ ఆమె ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. బేషరతుగా విద్యార్థిని తక్షణం విడుదలచేయాలి. ఆమెను పోలీసులు కొట్టడం, వేధించడం చేయొద్దు. కుటుంసభ్యులు, లాయర్‌తో మాట్లాడే అవకాశం కల్పించాలి. పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ డిమాండ్ చేసింది. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమినీ అనే యువతిని నైతిక పోలీసులు చిత్రవధ చేసి చంపడం, అది ఇరాన్లో భారీ నిరసనలకు దారితీయడం తెలిసిందే. -
కాకినాడ జిల్లా తునిలో మద్యం షాపులపై మహిళల తిరుగుబాటు
-
నెల్లూరులో టెన్షన్ టెన్షన్..
-
తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మద్యం షాపును మహిళలు అడ్డుకున్నారు. ఆశ్రమం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు, స్థానికుల నినాదాలు చేశారు.విజయవాడ: కూటమి లిక్కర్ టెండర్లపై వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి నేతల జేబులు నింపడానికే చంద్రబాబు లిక్కటర్ టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిని కూటమి నేతలు బెదిరిస్తున్నారని.. కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం కమీషన్ ఇవ్వాలని బెదిరిస్తున్నారన్నారు. మరికొందరు బరితెగించి టెండర్ దక్కించుకున్న వారిని కిడ్నాప్ చేస్తున్నారన్నారు.పేద మహిళల కళ్లలో ఆనందం చూడటమే అప్పటి జగన్ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు కుటీల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అవినాష్ అన్నారు.ప్రకాశం జిల్లా: ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడం చేతకాని ప్రభుత్వం నాణ్యమైన మద్యం పేరుతో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం సిగ్గుచేటని ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి.పద్మ మండిపడ్డారు. అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన మద్యం టెండర్ల లాటరీని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు నిరసన చేపట్టాయి.మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మద్యం వ్యాపారాన్ని చేస్తుందని మండిపడ్డారు. -
అర్ధరాత్రిలో స్వతంత్ర పోరాటం
‘నైట్ ఈజ్ అవర్స్’ పేరుతో ఆగస్టు 14 అర్ధరాత్రి కోల్‌కతాలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలుపనున్నారు.అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాని అర్ధరాత్రి సురక్షితంగా జీవించే హక్కు స్త్రీలకు రాకపోవడంపై ఈ నిరసన.కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో రాత్రిని చూసి భయపడుతూ బతకవలసిందేనా అని నిలదీస్తున్నారు స్త్రీలు.ఈ నిరసన, గతంలో ఇలాంటి ప్రతిఘటనలపై కథనం.‘ఏ రోజైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద నడవగలదో ఆ రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అన్నారు గాంధీజీ. ఆయన కలలుగన్న స్వాతంత్య్రం ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉంది. డిసెంబర్ 16, 2012లో ఢిల్లీలో అర్ధరాత్రి ఒక నిర్భయ దారుణంగా లైంగికదాడికి లోనై మరణిస్తే మొన్న గురువారం (ఆగస్టు 8) అర్ధరాత్రి కోల్‌కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఒక ట్రయినీ డాక్టర్ దారుణంగా అత్యాచారానికీ హత్యకూ లోనైంది. దీంతో దేశవ్యాప్తంగా వైద్యబృందాలు భగ్గుమన్నాయి. నిరసనలు సాగుతున్నాయి. వైద్యులు వైద్యసేవలు మాని ఈ అన్యాయానికి జవాబేమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.అర్ధరాత్రి నిరసన‘ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చింది. కాని స్త్రీలకు తమ ఇంట్లో, పని చోట, బహిరంగ ప్రదేశాల్లో రాత్రుళ్లు ఎటువంటి స్వేచ్ఛ లేని బానిసత్వమే మిగిలింది. కోల్‌కతాలో జరిగిన దారుణకాండ కు నిరసనగా ఈ ఆగస్టు 14 అర్ధరాత్రి మహిళలందరం నిరసన చేయనున్నాం’ అని కోల్‌కతాలోని మహిళలు తెలియచేస్తున్నారు. ఈ నిరసకు స్త్రీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మనదేశంలో సూర్యుడు అస్తమించగానే స్త్రీలలో, వారి కుటుంబ సభ్యుల్లో ఆ స్త్రీలు ఇంటికి చేరే వరకు ఆందోళన ఉంటుంది. వారి మీద ఏదోవిధమైన దాడి జరిగే వాతావరణం ఉండటమే ఇందుకు కారణం. ఒంటరి స్త్రీ బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తే ఆమెతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే తెగింపు కొన్ని మూకలలో ఈ సమాజంలో ఉంది. స్త్రీలకు పరిమిత సమయాలలో పరిమిత స్థలాలలోనే రక్షణ. లేదంటే లేదు. అయితే నిర్భయ ఘటన ఆమె రోడ్డు మీద ఉన్నప్పుడు జరిగితే కోల్‌కతాలో బాధితురాలు ఆస్పత్రిలో తన డ్యూటీలో ఉండగా దాడి జరగడం తీవ్రమైన ప్రశ్నను లేవదీసేలా ఉంది.మీట్ టు స్లీప్నిర్భయ ఘటన జరిగాక ఆమెను తలుచుకుంటూ ప్రతి డిసెంబర్ 16న పార్కుల్లో మహిళలు బృందాలుగా నిదురించే కార్యక్రమం ‘మీట్ టు స్లీప్’ నిర్వహించాలని బెంగళూరుకు చెందిన ‘బ్లాక్ నాయిస్’ అనే సంస్థ పిలుపునిస్తే దేశంలోని అన్ని మెట్రో నగరాలలో ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ‘పబ్లిక్ ప్లేసులపై మా హక్కు కూడా ఉంది. మేము అక్కడ సురక్షితంగా ఉంచే పరిస్థితిని డిమాండ్ చేస్తున్నాం’ అని ఈ కార్యక్రమం కోరుతోంది. బ్లాక్ నాయిస్ ఫౌండర్ జాస్మిన్ పతేజా దీని రూపకర్త.విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్:ఢిల్లీ రోడ్ల మీద అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిచే హక్కు స్త్రీలకు ఉంది అని ‘విమెన్ వాక్ ఎట్ మిడ్నైట్’ పేరుతో అక్కడి మహిళా బృందాలు రాత్రుళ్లు నడిచి తమ గళాన్ని వినిపించాయి. మల్లికా తనేజా అనే థియేటర్ ఆర్టిస్ట్ ఇందుకు పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘రాత్రిపూట ఖాళీ ఫుట్‌పాత్ మీద స్వేచ్ఛగా కూచునే అనుభూతి ఇప్పుడు పొందాను’ అని ఈ అర్ధరాత్రి నడకలో పాల్గొన్న ఒక మహిళ అంది.సమాజంలో స్త్రీకి గౌరవం దక్కాలన్నా ఆమె సురక్షితంగా ఉండాలన్నా ఇంటిలో బడిలో పని చోట్ల ప్రభుత్వ విధానాలలో సినిమాలలో కళల్లో ఆమెను గౌరవించే వాతావరణం, బౌద్ధిక శిక్షణ అవసరం. కఠినమైన చట్టాలతో పాటు విలువల ఔన్నత్యం కూడా అవసరం. స్త్రీలను కించపరిచే భావజాలం ఎక్కడ ఉన్నా దానిని నిరసించడం అందరూ నేర్వాలి. లేని పక్షంలో అర్ధరాత్రి నిరసనలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూనే ఉంటాయి. -
దారి ఆక్రమించారని మహిళ నిరసన
కుప్పం రూరల్: రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ ఓ మహిళ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించారని మునిసిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ దారిలో కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నారని, తమకు దారి సౌకర్యం కల్పించాలని కోరింది. ఈ నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్ తనతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని, రోడ్డు సమస్యను పరిష్కరించలేదని ఆమె నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు మహిళను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి రోడ్డు మూసివేసిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మునిసిపల్ కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. శనివారం సాయంత్రం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో తన తప్పు ఏమీలేదని, హిమబిందు తనకు కూతురు లాంటిందని వివరణ ఇచ్చారు. -
ఇరాన్లో హిజాబ్ హీట్.. చైనా తరహా పరిస్థితే అక్కడ కూడా ఉందా?
ఆడోళ్లు పిడికిళ్లు బిగించడంతో ఇరాన్ భగ్గుమంటోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని ఓ అమ్మాయిని అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపిస్తూ మహిళలు వీధులకెక్కి ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే హిజాబ్‌లను తీసి నడివీధిలో దగ్ధం చేశారు. పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హిజాబ్ అనేది తమ కల్చర్ కానే కాదని అది కేవలం మహిళలను కల్చర్ ముసుగులో అణచివేసే ఒత్తిడి మాత్రమేనని వారు దుయ్యబడుతున్నారు. ఇరాన్లో కొనసాగుతోన్న ఈ ఉద్యమానికి పలు ప్రపంచ దేశాల్లో ప్రజల నుండి సంఘీభావం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వంపైనా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. పోలీసుల తీరుకు.. పాలకుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ మంటలు పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలీని భయం పాలకులను కంగారు పెడుతోంది. గత ఏడాదో అంతకు ముందో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటిన వేళ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. ఆ తర్వాత ఇంతగా జనం బయటకు వచ్చి ఆందోళనలకు దిగిన సంఘటనలు ఒక్కటి కూడా లేవు. ఇపుడు ఈ ఉద్యమం రోజు రోజుకీ తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే ఈ ఆందోళనలో పోలీసుల తూటాలకు లాఠీ దెబ్బలకు చాలా మంది తలలు వాల్చేశారు. ఆందోళన కారుల తిరుగుబాటు దాడిలో ఒకరిద్దరు భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. మొత్తం మీద అటూ ఇటూ కలిసి ఇప్పటివరకు 75 మందికి పైనే మరణించి ఉంటారని ప్రాధమిక అంచనా. కాకపోతే చైనా తరహాలోనే ఇరాన్ లో కూడా ఉద్యమాల సమయంలో మరణించే వారి సంఖ్య బయటకు రాదు. ప్రభుత్వాలు అంత గట్టిగా ఉక్కుపాదానికి పని చెబుతారు. అంతటి కఠిన నిబంధనల చట్రంలోనూ 75 మంచి చనిపోయారన్న వార్త బయటకు వచ్చిందంటే వాస్తవంగా ఈ లెక్క ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో ఊహించడానికే భయమేస్తుందంటున్నారు మేథావులు. అసలింతకీ ఇరాన్లో మహిళలు ఎందుకిలా వీధుల్లోకి వచ్చి ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందో తెలుసుకోవాలి ముందు. మహసా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి టెహ్రాన్ కు వచ్చింది. ఆమెను మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేసిన తప్పేంటంటే హిజాబ్ ను సరిగ్గా ధరించకపోవడమే. ఇరాన్ లో ప్రతీ మహిళ హిజాబ్ ను ధరించాలి. అది అక్కడి డ్రెస్ కోడ్. ఆ హిజాబ్ ను కూడా ఒక పద్ధతి ప్రకారం ధరించాలి. ఎలాగంటే అలా తలకి చుట్టేయకూడదు. ఈ నిబంధనలను మహిళలు అమలు చేస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించేందుకే మోరల్ పోలీసు విభాగాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మహాసా అమిని హిజాబ్ ను సరిగ్గా కట్టుకోలేదని గమనించిన మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత అత్యంత దారుణంగా హింసించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా లాభం లేకపోయింది . సెప్టెంబరు 16న అమిని చనిపోయింది. Thousands of people at the #Vancouver Art Gallery, standing in solidarity with the people of Iran, following Mahsa Amini's death in custody. Their message: “stop Islamic regime’s brutality, put an end to compulsory hijab, end the use of capital punishment in Iran.” @cbcnewsbc pic.twitter.com/gtdKea1p2w — Janella Hamilton (@JanellaCBC) September 26, 2022 అమిని మరణ వార్త క్షణాల్లో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో అధికారులను తిట్టిపోసిన జనం ఈ విషయంలో ప్రభుత్వానికి గట్టి అల్టిమేటం ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. గంటల్లోనే అమిని హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. మహిళలు తమ పోనీ టెయిల్ జుట్టును కత్తిరించుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఉంచి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇరాన్ అంతటా వ్యాపించేసింది. అక్కడితో ఆగలేదిది. ఇరుగు పొరుగు దేశాలకూ విస్తరించింది. ప్రతీ దేశంలోనూ ఇరాన్ మహిళల ఉద్యమానికి మద్దతుగా మహిళలు యువకులు కూడా బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. టర్కీలో నివసించే ఇరాన్ యువతి నసీబే ఇరాన్ కాన్సులేట్ ఎదురుగా నిరసన ప్రదర్శనలో పాల్గొని అందులోనే తన పోనీ టెయిల్ ను కత్తిరించుకుంది. ఈ ఆందోళనల్లో చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ముందు పెట్టుకుని కుటుంబ సభ్యులు రోదిస్తోన్న సమయంలో అతని సోదరి తన జుట్టు కత్తిరించి సోదరుని మృతదేహంపై పెట్టి నిరసన వ్యక్తం చేసింది. "Women have been protesting against the compulsory hijab for four decades now, and this time around, there has been a real outpouring of support from people from all walks of life, from many different provinces across Iran." - @UNHumanRights #Iran #IranProtests #MahsaAmini pic.twitter.com/slGRXebak0 — UN Geneva (@UNGeneva) September 27, 2022 అసలు హిజాబ్ సంస్కృతి ఎలా మొదలైందో కూడా తెలసుకోవాలి.. 1979 ప్రాంతంలో ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖొమైనీ దేశంలో మహిళలంతా విధిగా హిజాబ్ ధరించి తీరాలని ఆదేశించారు. దాంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి దాన్ని వ్యతిరేకించారు. ఆ ఉద్యమ సెగకు కంగారుపడిన పాలకులు అబ్బే అదేమీ ఆంక్ష కాదు కేవలం ఆయన సిఫారసు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ తర్వాత దేశంలో విప్లవం వచ్చింది. దాని తర్వాత 1983 నుండి హిజాబ్ ధారణతో పాటు మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక డ్రెస్ కోడ్ ను ప్రకటించారు. అప్పటి నుండి హిజాబ్ ను ధరించడమే కాదు దాన్ని చట్టంలో చెప్పిన విధంగానే ధరించాలన్న ఆంక్ష అమలవుతూ వస్తోంది. 1979కి ముందు దేశాన్ని పాలించిన లౌకిక పాలకుడు మహమ్మద్ రెజా పహలావి హయాంలో హిజాబ్ ధరించాలన్న ఆంక్షలు లేవు కానీ.. చాలా మంది మహిళలు స్వచ్ఛందంగా హిజాబ్ ధరించేవారు. దానికి రకరకాల కారణాలున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకైతేనేం ఓ సంప్రదాయంగా భావించడం వల్లనైతేనేం తమ మతానికి సంబంధించిన ఓ చిహ్నంగా గౌరవించడం వల్లనైతేనే మహిళలు తమంతట తాము ధరించేవారు. అయితే 1983కి ముందు వరకు ఎవరైనా హిజాబ్ ధరించకపోయినా అది నేరమేమీ కాదు. ఎలాంటి శిక్షలూ ఉండేవి కావు. ఎవరూ ఒత్తిడి చేసేవారు కూడా కాదు. కానీ ఎప్పుడైతే అది ఒక చట్టమై కూర్చుందో అప్పటినుంచే సమస్య మొదలైంది. దాన్ని కఠినంగా అమలు చేసే క్రమంలో మోరల్ పోలీసులు మరీ కఠినంగా వ్యవహరించడంతో మహిళల్లో హిజాబ్ పట్ల ఒకరకమైన వ్యతిరేకత వస్తోందని ప్రముఖ ఇరాన్ జర్నలిస్ట్, కవి అమిని అంటున్నారు. హిజాబ్ ధరించకపోతే అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తారన్న భయమే మహిళల్లో హిజాబ్ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యిందని మేథావులు అంటున్నారు. హిజాబ్‌ను అడ్డుపెట్టుకుని మహిళలను అణచివేస్తున్నారన్న భావన రావడంతోనే హిజాబ్ ను అణచివేతకు ఓ సింబల్ గా భావిస్తున్నారు మహిళలు. ప్రస్తుతం ఇరాన్ ను అట్టుడికిస్తోన్న ఉద్యమం కేవలం హిజాబ్ కు వ్యతిరేకంగా మాత్రమే కాదంటున్నారు ఇరాన్ మహిళలు." మాకు స్వేచ్ఛ కావాలి. మాకు ప్రజాస్వామ్యం కావాలి. సంప్రదాయాలు సంస్కృతుల ముసుగులో మమ్మల్ని అణచివేసే నిరంకుశ పోకడలు పూర్తిగా పోవాలి మా బతుకులు మేం ప్రశాంతంగా బతికే వీలు ఉండాలి" అని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. ఇరాన్లో రకరకాల జాతులు, తెగల వాళ్లు జీవిస్తున్నారు. వాళ్లల్లో ఒక్కో తెగ ఒక్కో రకమైన వస్త్ర ధారణ చేస్తారు. అది వారి సంప్రదాయం. హిజాబ్‌ను కూడా ఒక్కో తెగ ఒక్కో విధంగా కట్టుకుంటారు. అది కూడా వారి సంస్కృతి. పాలకుల ఆంక్షలు మాత్రం అందరూ ఒకేలా హిజాబ్ కట్టాలి. ఇష్టం వచ్చినట్లు హిజాబ్ ను కట్టుకుంటే అరెస్ట్ చేసి జైలుకు పంపేస్తారు. ఈ తలా తోకా లేని పాలకుల విధానాలే వివిధ తెగలు జాతుల స్వేచ్ఛను మంటకలుపుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇరాన్లో పర్షియన్లు, కుర్దులు, అజర్ బైజానీయులు, గిలాకీలు, అరబ్బులు, బలూచ్‌లు, టర్క్ మెన్లతో పాటు మరికొన్ని జాతులు నివసిస్తున్నాయి. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో జీవనశైలి. ఒక్కొక్కరిదీ ఒక్కో సంప్రదాయం. ఒక్కో సంస్కృతి. అందరినీ ఒకే గాటన కట్టేసి మీరు ఇలాగే చేయండని ఆంక్షలు విధించడమంటే వారి జీవించే స్వేచ్ఛను అణచివేయడమే అవుతుందంటున్నారు హక్కుల నేతలు. ప్రజలకు నచ్చని పనులు చేసి తీరాలని ఆంక్షలు విధించడం హక్కులను హరించడం కిందే లెక్క అంటున్నారు మహిళలు. ఇరాన్ పాలకులు రకరకాల ఆలోచనలతో చేస్తున్నది అదే అంటున్నారు వారు. తల నుంచి పాదాల వరకు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే నల్లటి బట్టను ధరించాలని ప్రభుత్వం ఓ విధానాన్ని ప్రతిపాదించింది. వ్యవస్థలో మార్పు రావాలన్న కసి అందరిలోనూ ఉంది. అందుకే హిజాబ్ అనేది కేవలం మహిళల సమస్యగా చూడ్డంలేదు ఇరానియన్లు. మహిళలతో పాటు పురుషులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా వీధుల్లోకి వచ్చి పాలకుల తీరును ఎండగడుతున్నారు. దేశంలోని మొత్తం 31 ప్రావిన్సులు, 80కి పైగా నగరాల్లో ఉద్యమం ఉధృత రూపంలో కొనసాగుతోంది. జనజీవితాలు స్తంభించాయి. ఈ ఉద్యమ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోక తప్పదంటున్నారు ఇరాన్ అధినేత ఎబ్రహీం రైజీ. దేశ సమగ్రత అంతర్గత భద్రతలకు ముప్పు వాటిల్లేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి ఉండనే ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు. దానర్ధం ఉద్యమం ఎంత ఉధృతం అయినా అణచివేసి తీరతాం అనా? అని మేధావులు నిలదీస్తున్నారు. Why are Iranian women burning their hijabs and cutting their hair? Al Jazeera's @DorsaJabbari explains how Mahsa Amini has become a symbol for Iranian women’s rights after her death ⤵️ pic.twitter.com/puw0gZYTN4 — Al Jazeera English (@AJEnglish) September 27, 2022 ఆందోళనలే అయితే ఫరవాలేదు. ఇవి ఆందోళనల్లా కనపడ్డం లేదు. అంతకు మించి తీవ్రమైన లక్ష్యాలేవో ఉన్నాయని అనిపిస్తోంది అని రైజీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ కు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఆస్కార్ అవార్డ్ విజేత అస్ఘర్ ఫర్హాదీ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులంతా కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. అమిని హత్యోదంతం యావత్ ప్రపంచం సిగ్గుతో తలదించుకోవలసిన ఘటన అని అస్ఘర్ అభివర్ణించారు. యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాల్లోని ఇరానియన్లు ఈ ఉద్యమానికి మద్దతుగా ఆయా దేశాల్లో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ సమాజం అంతా ఇరాన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతోంది. ఇది ఇరాన్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే ఉంది. అలాగని ఇప్పటికిప్పుడు హిజాబ్ తప్పనిసరి కాదు అని ఎలాంటి ప్రకటన చేసే పరిస్థితులూ లేవు. అమెరికా ఆంక్షలతో ఆర్ధికంగా చితికిపోయి ఉన్న ఇరాన్‌కు హిజాబ్ ఉద్యమం పెద్ద తలనొప్పిగానే పరిణమిస్తోంది. ఏదో ఒకటి చేయకపోతే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందంటున్నారు మేథావులు. Famous Turkish singer Melek Mosso cut her hair on stage in a show of support to the anti-hijab protests in Iran following the death of Mahsa Amini.#MelekMossco #MahsaAmini #Hijab pic.twitter.com/IbMIqJC2gp — TIMES NOW (@TimesNow) September 28, 2022 ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలే పోరాడారు. సతీసహగమనానికి వ్యతిరేకంగా హిందువులే ఉద్యమించారు. అదే వేరే మతాల నుంచి ఒత్తడి వస్తే ఆ సమస్యలు ఎప్పటికీ అలానే ఉండేవి కావచ్చు. అందుకే ఆంక్షలు విధించడం అనేది పాలకులకు, వ్యవస్థలకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు మేథావులు. అది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని వారంటున్నారు. అందరికీ స్వేచ్ఛనిచ్చే మంచి సమాజాన్ని ఆవిష్కరించడమే ప్రభుత్వాల విధానం కావాలని వారు సూచిస్తున్నారు. Ruthless: Look how this Young Iranian Girl is Brutally thrashed by Monster Police of Iran on roads😡4 Protesting against Forced Hijab & Murderer Regime of Predators that her Head Hit d Pavement on d Road #Hijab #IranProtests2022 #Iran #IranProtests #IranRevolution #MahsaAmini pic.twitter.com/mOe1FJRMQ5 — Jyot Jeet (@activistjyot) September 26, 2022 -
బన్నీ వాసు మోసం చేశాడు.. జనసేన కార్యాలయం ఎదుట..
మంగళగిరి : మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సోమవారం ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బోయ సునీత ఆరోపించింది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దామనుకుంటే.. తనను మానసిక వికలాంగురాలిగా చిత్రీకరించారని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట మహిళల నిరసన
-
మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట మహిళల నిరసన
సాక్షి, గుంటూరు: మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. బీస్సీ, ఎస్సీ, ఎస్టీలను పార్టీలో ఎదగకుండా అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ పీఏ సాంబశివరావు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, చర్యలు తీసుకోవాలంటూ మహిళలు నిరసన తెలిపారు. చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్.. -
వివాహేతర సంబంధానికి ఒత్తిడి.. ఐదుగురితో కలిసి కారులో
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): పెద్ద దిక్కుగా ఉంటానంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఈ క్రమంలోనే బలవంతంగా కారులో ఎక్కించుకుని మరో నలుగురితో కలిసి ఆమెను రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి మొబైల్ ఫోన్, పర్సు గుంజుకున్నాడు. తెల్లవారుజామున ప్రధాన రహదారిపై ఆపి బయటకు తోసేసి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న 37ఏళ్ల మహిళతో ఎనిమిది నెలలుగా జడ్చర్లకు చెందిన పెద్ద వెంకటేశ్‌గౌడ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య ఆరోగ్యంగా లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు కలువలేకపోతున్నానని చెప్పాడు. తాను పెద్ద దిక్కుగా ఉంటానంటూ నమ్మబలికి భార్యతోనూ మాట్లాడించాడు. ఇటీవల మహబూబ్‌నగర్‌కు చెందిన మిత్రుడు వెంకటేశ్ తదితరులతోనూ వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్నాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఈనెల 2న జడ్చర్లలోని తన ఇంటికి రప్పించాడు. అనంతరం కారులో ఎక్కించుకుని తన బావమరిదితో కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి క్రిస్టియన్‌పల్లి మీదుగా భూత్పూర్కు తీసుకెళ్లారు. అక్కడి దాబాలో ఉన్న పెద్ద వెంకటేశ్‌గౌడ్ తమ్ముడు చిన్న వెంకటేశ్‌గౌడ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అక్కడి నుంచి తిరిగి జడ్చర్ల మీదుగా అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు మయూరి నర్సరీ సమీపంలో పర్సు, మొబైల్ ఫోన్ లాక్కొని దింపేసి వెళ్లిపోయారు. కాలినడకన మహబూబ్‌నగర్‌లోని పాత డీఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద ఉన్న కానిస్టేబుళ్లకు తన గోడును వెళ్లబోసుకుంది. చివరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మూడు గంటలకు డీఎస్పీ శ్రీధర్ వచ్చి బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ధర్నాకు అనుమతివ్వండి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ సిగ్నల్‌గడ్డపై ధర్నా చేసేందుకు అనుమతివ్వాలని కోరగా పోలీసులు నిరాకరించారు. అనంతరం విలేకరుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. నిందితులు ధన బలంతో పోలీసులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. తన మొబైల్లోని ఫొటోలు, వీడియో, ఆడియో రికార్డులను డిలీట్ చేసి పోలీసులకు అప్పగించారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
సాక్షి, కామారెడ్డి : జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని నినాదాలతో హోరెత్తించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించిన మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా -
అయిన వాళ్ల మోసం: కూతురితో బిక్షాటన
సాక్షి, సంగెం: ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా.. తన పేరిట ఉన్న భూమిని అత్త, బావలు అక్రమంగా పట్టా చేసుకున్నారు.. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కూతురుతో కలిసి భిక్షాటన చేసింది ఓ మహిళ. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తీగరాజుపల్లి గ్రామానికి చెందిన రంగరాజు అమరావతికి, మధుసూదన్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో సదరు మహిళ 2012లో హన్మకొండలోని మహిళా పోలీసుస్టేషన్లో భర్త, బావ, అత్త, ఆడబిడ్డలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఓ వైపు ఆ కేసు విచారణలో ఉండగానే అత్త, బావ రంగరాజ్ రాజు.. బాధితురాలు పేరిట ఉన్న భూమిని వారి పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయం తెలియగానే అమరావతి తన కూతురుతో కలిసి గ్రామంలో భిక్షాటన చేసింది. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు పరశురాములు, మహేందర్‌రెడ్డి వారిని అడ్డుకున్నారు. చిన్నపిల్లలతో భిక్షాటన చేయడం నేరమని వారించడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బాధితురాలు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా పోలీసులు గ్రామానికి చేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. -
దేశంలో జైళ్లు సరిపోవు
సాక్షి, హైదరాబాద్: సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతి రేకంగా జైల్ భరో ఆందో ళన్ నిర్వహిస్తే దేశంలోని జైళ్లు సరిపోవని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శివరాంపల్లి లోని జామియా ఇస్లామియా దారుల్ ఉలుమ్లో ఆదివారం యూనైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోడీకి వ్యతిరేకంగా గళం విప్పితే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ‘‘నరేంద్ర మోడీజీ.. ఒక సమయం వస్తోంది..జైల్ భరో ఆందోళన్ నిర్ణయం తీసుకుంటాం. దేశంలోని జైళ్లలో మూడు లక్షల మంది కంటే ఎక్కువగా నింపలేరు. మూకుమ్మడిగా రోడ్డుపైకి వస్తే దేశంలోని జైళ్లు సరిపోవు’’అని పేర్కొన్నారు. బాధ్యతగల ఒక మంత్రి అసభ్య పదజాలంతో ఆందోళనకారులపై కాల్పులు జరపమని పిలుపునివ్వడం ఆయన మానసిక స్థితిని బహిర్గతపరుస్తోందన్నారు. మతాలకతీతంగా ఈ దేశం అందరిదీ అని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని హిందుత్వ అజెండా నుంచి కాపాడవల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్కు వ్యతి రేకంగా ఉద్యమం కొనసాగుతుందని, గాం«ధీజీ, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుగు సాగుతామని ప్రకటించారు. ఈ సదస్సులో ఇస్లామిక్ పండితులు, మహిళా ప్రతినిధులు,పౌర హక్కుల కార్యకర్తలు ప్రసంగించారు. -
తాళిబొట్ల అప్పగింత ఆందోళన
టీ.నగర్: విద్యుత్ టవర్ల ఏర్పాటు పనులతో బాధిత రైతులకు అధిక నష్టపరిహారం చెల్లించాలంటూ మహిళలు తాళిబొట్ల అప్పగింత ఆందోళన బుధవారం జరిగింది. తిరుపూర్ జిల్లా, పల్లడం తాలూకా సెంబిపాళయం గ్రామంలో విద్యుత్ టవర్లు ఏర్పాటుచేసేందుకు 30 మంది రైతుల 200 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పనులు చేపట్టేందుకు వచ్చిన పవర్‌గ్రిడ్ సంస్థ సిబ్బందికి రైతులు వ్యతిరేకత తెలిపారు. ఇటీవల తమ ఇళ్లను ఖాళీ చేసి మేకలు, గేదలతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రెవెన్యూ అధికారులు వారిని అడ్డగించి చర్చలు జరిపారు. దీనిపై కలెక్టర్ సమావేశం చర్చలు జరిపి హామీ ఇచ్చారు. అయినప్పటికీ సరైన పరిష్కారం లభించలేదు. ఇలావుండగా మంగళవారం ఆ ప్రాంతంలో 300 మంది పోలీసుల భద్రతతో పవర్‌గ్రిడ్ సంస్థ సిబ్బంది పనులు చేపట్టేందుకు వెళ్లారు. దీంతో ఆగ్రహించిన రైతులు మహిళలతో కలెక్టరేట్ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహిళలు పసుపు కొమ్ములు కట్టిన తాళిబొట్లతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి కుమార్, ఉద్యమకారుడు పళనిస్వామి పాల్గొన్నారు. దీంతో ఆర్డీఓ కవితా అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. తర్వాత పది మందిని మాత్రం కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతినిచ్చారు. తర్వాత కలెక్టర్‌తో వారు చర్చలు జరిపారు. ఆందోళన జరపడం మంచిది కాదని కలెక్టర్ తెలిపారని, దీంతో విద్యుత్ టవర్లు ఏర్పాటుచేస్తే అడ్డుకుంటామని అన్నారు. -
మొఘల్స్‌పై పోరాడిన గభోరులాగే....
సాక్షి, న్యూఢిల్లీ : దేశ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా అస్సాంలో కొనసాగుతున్న ప్రజాందోళనలో మహిళలే ముందున్నారు. నాడు 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తుల దురాక్రమణకు వ్యతిరేకంగా అహోం రాజుల తరఫున వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర వనిత మూల గభోరుతో నేటి మహిళలను పోలుస్తున్నారు. ‘సరాయిఘాట్’ యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయిన నాటి యుద్ధంలో బెంగాల్ సుల్తాన్ జనరల్ టర్బక్ ఖాన్‌ను గబోరు నాయకత్వాన మహిళలు తరమితరమి కొట్టారు. నేటి సీఏఏ వ్యతిరేక ఆందోళనలో ప్రతి మహిళా ఒక మూల గభోరు కావాలని సామాజిక, కళారంగాలకు చెందిన ప్రముఖులు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ర్యాలీలలో అస్సాం సినీ నటి బార్షా రాణి బిషాయ ప్రముఖ ఆకర్షణగా మారారు. ఆమెను మూల గభోరుగా ప్రముఖ అస్సాం, హిందీ చలన చిత్రాల దర్శకుడు పద్మశ్రీ జాహ్ను బారువా పోల్చారు. ఆదివారం నాడు గువాహటిలోని లతాసిల్ ప్లేగ్రౌండ్ నుంచి చాంద్మారి సెంటర్ వరకు కొనసాగిన ఆందోళనలో పద్మశ్రీ జాహ్ను గట్టిగా నినాదాలు చేస్తూ అందరిని ఆకర్షించారు. ఆమెకు అండగా ప్రముఖ డిజైనర్ గరిమా గార్గ్ సైకియా నిలబడ్డారు. ‘కావల్సినంత సమయం ఉన్నప్పటికీ మీ కాలంలో మీరేమీ చేయలేకపోవడంవల్ల నేడు మేము ఇబ్బందులు పడుతున్నాం. పరాయి వాళ్లు వచ్చి మా భాషను, సంస్కతిని నాశనం చేయడమే కాకుండా నోటికింత ముద్ద దొరక్కుండా మా ఉద్యోగాలను కొల్లగొట్టుకుపోయారు’ అంటూ మన పిల్లలు మనల్ని రేపు నిలదీయకముందే లక్ష్య సాధనలో మనం ముందుకుపోదాం పదంటూ సినీ నటి బార్షా రాణి తోటి మహిళలను ప్రేరేపిస్తున్నారు. 1985లో కేంద్ర ప్రభుత్వం తమ అస్సాం రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా నేడు కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఎలా తీసుకొస్తుందంటూ ఆమె నినదిస్తున్నారు. 1971, మార్చి 24వ తేదీ అర్ధరాత్రికి ముందు భారత్‌కు వచ్చి స్థిరపిడిన వారిని, వారి పిల్లలను మినహా ఆ తర్వాత వచ్చిన వారందరిని విదేశీయులుగానే పరిగణించి అస్సాం నుంచి బయటకు పంపించాలన్నది 1985లో కేంద్రంతో చేసుకున్న అస్సాం ఒప్పందం. ఇప్పుడు ఆ ఒప్పందానికి విరుద్ధంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ నుంచి 2014కు ముందు వచ్చిన ముస్లింలు మినహా మిగతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏ బిల్లును తీసుకొచ్చింది. నాడు అహోమ్ రాజులు, మొఘల్స్‌కు మధ్య జరిగిన యుద్ధాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన యుద్ధంగా చూడలేం. ఎందుకంటే మొగల్స్ సైన్యానికి జైపూర్‌కు చెందిన రాజా రామ్ సింగ్ నాయకత్వం వహించగా, అహోం రాజుల సైన్యానికి అస్సామీస్ ముస్లిం బాగ్ హజోరికా అనే ముస్లిం నాయకత్వం వహించారు. బీజేపీ నేతలు మాత్రం నాటి ‘సరాయిఘాట్’ యుద్ధాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన యుద్ధంగా పేర్కొంటూ ‘ఇదే ఆఖరి సరాయి ఘాట్’ యుద్ధమంటూ 2016లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేయడం ద్వారా బీజేపీ మొట్టమొదటిసారి అస్సాంలో అధికారంలోకి వచ్చింది. ఇక తమ రాష్ట్రంలో బీజేపీకి శాశ్వతంగా నూకలు చెల్లాయని బార్షారాణి నాయకత్వాన అస్సాం మహిళలు నినదిస్తున్నారు. -
సమీప బంధువే నమ్మించి మోసం చేశాడు!
-
పెళ్లి చేసుకుంటానని మోసం
సాక్షి, మల్యాల(చొప్పదండి) : ప్రేమించానని వెంటపడి.. కన్నవారికి.. కడుపున పుట్టిన వారికి దూరమై.. ప్రేమించిన వాడి సరసన చేరిన మహిళ రోడ్డున పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ.. ఇంట్లో సమస్యలు పరిష్కారం కాగానే ఇంటికి తీసుకెళ్తానంటూ పన్నెండేళ్లుగా సహజీవనం చేశాడు. ప్రియురాలితో నిత్యం ఫోన్లో మాట్లాడుతూ.. మరో మహిళ మెడలో తాళి కట్టిన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ అదే గ్రామానికి చెందిన మ్యాకల అనిల్‌తో పన్నెండేళ్ల క్రితం స్నేహం కుదిరింది. అప్పటికే మహిళకు వివాహమై, ముగ్గురు పిల్లలున్నారు. నిన్ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానంటూ అనిల్ నమ్మబలికాడు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం వ్యవహారం మహిళ భర్తకు తెలియడంతో పలుమార్లు పంచాయతీ కాగా, చివరికి వీరిద్దరి వివాహేతర సంబంధం కారణంతోనే విడాకులు తీసుకుని, భర్త దగ్గరనే పిల్లలను వదిలిపెట్టి అనిల్ చెంతకు చేరింది. పన్నెండేళ్లుగా సహజీవనం పెళ్లిచేసుకుంటానంటూ నమ్మిస్తూ.. పన్నెండేళ్లుగా సంసారం చేస్తున్నాడు. మా చెల్లి భర్త చనిపోతే కూడా వెళ్తానన్నా వెళ్లనివ్వలేదు. బయట ప్రపంచంతో సంబంధం ఉండకూదడని, ఎవరితో మాట్లాడవద్దంటూ హింసించాడు. వివిధ ప్రాంతాల్లో అద్దెకు ఉంచుతూ, ఇంట్లో సమస్యలు తీరిపోగానే ఇంటికి తీసుకెళ్తానంటూ నమ్మించాడు. చివరికి చెల్లి పెళ్లి అయిన తర్వాత అంటూ ఏ రోజుకారోజు ఏదో ఒక సమస్య చెబుతూ దాట వేశాడు. అన్ని సమస్యలు తీరిపోగానే పన్నెండేళ్లు సంసారం చేసిన విషయం మరిచి, మరో మహిళను మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈనెల 25న కూడా ఫోన్లో మాట్లాడాడు. నా పుట్టింటికి దూరమై..అందరికి నన్ను దూరం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసి, మరో మహిళను వివాహం చేసుకున్నాడని మహిళ బోరున విలపించింది. పోలీస్‌స్టేషన్‌కు చేరిన బాధిత మహిళ తక్కళ్లపల్లిలో నమ్మించి మోసం చేసిన వ్యక్తి ఇంటి ఎదుట బుధవారం మహిళ బైఠాయించింది. సమాచారం మేరకు ఎస్సై ఉపేంద్రచారి అక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. తనను అనిల్ ఏవిధంగా వంచించాడో వివరించింది. తనకు న్యాయం చేసేదాకా ఇక్కడి నుండి కదలనని, పోలీస్‌స్టేషన్‌కు వస్తే అనిల్ తన ధనబలంతో న్యాయం జరగదంటూ తేల్చి చెప్పింది. దీంతో అక్కడినుంచే ఎస్సై ఉపేంద్రచారి అనిల్‌తో ఫోన్లో మాట్లాడి, పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందిగా హుకుం జారీ చేశారు. చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని, ఎవరి పైరవీలకు లొంగమంటూ మహిళకు నచ్చజెప్పడంతో పోలీసులతోపాటు బాధిత మహిళ మల్యాల పోలీసు స్టేషన్‌కు చేరింది. -
అదనపు కట్నం కోసం వేధింపులు
అనంతపురం సిటీ: అదనపు కట్నం మెట్టినింటి వారి వేధింపులు తాళలేని ఓ మహిళ న్యాయం కోసం ఆందోళనకు దిగింది. భర్త ఇంటి ఎదుట చంటిబిడ్దతో బైఠాయించింది. ఈ ఘటన బుధవారం నగరంలోని శ్రీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... నగరంలో శ్రీనగర్‌కాలనీకి చెందిన శ్రీనివాసులుకు గుంతకల్లుకు చెందిన యామినితో 2016లో వివాహమైంది. అప్పట్లో కట్నం కింద రూ.15 లక్షల నగదు, 23 తులాల బంగారు నగలు, రెండు సెంట్ల స్థలం ఇచ్చారు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపుకట్నం కోసం భర్త, అత్తమామాల నుంచి వేధింపులు ప్రారంభమాయ్యియి. భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసించడంతో పాటు జేఎన్టీయూ అనుబంధ ఓటీఆర్‌ఐలో ఉద్యోగానికి రాజీనామా చేయించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై గతంలో గుంతకల్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపింది. అయితే పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పినా బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపించింది. దీంతో తాను న్యాయం కోసం ధర్నాకు దిగినట్లు వివరించింది. దాదాపు రెండు గంటల పాటు చంటిబిడ్డతో భర్త ఇంటి ఎదుట ఆందోళన కొనసాగించింది. విషయం తెలుసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి సర్దిచెప్పారు. న్యాయం చేస్తామని, స్టేషన్‌కువచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈమెకు మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశాబీ, పద్మావతి, చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగమయ్య తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పొదుపు మహిళల కన్నెర్ర
పొదుపు మహిళలు టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు – కుంకుమ పేరుతో మరోసారి మోసం చేశారని చెబుతున్నారు. చెక్కులను బ్యాంక్‌ల్లో వేస్తుంటే నగదు రావడంలేదని, పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారని మహిళలు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల బ్యాంక్‌ల ఎదుట నిరసన చేపట్టారు. నెల్లూరు సిటీ: పసుపు – కుంకుమ పథకం కింద మూడు దఫాలుగా ఇచ్చిన చెక్కులను ఒకేసారి చెల్లించాలని పొదుపు సమన్వయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని మెప్మా కార్యాలయం ఎదుట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు విడతలుగా రూ.10 వేలు చెల్లించడం చూస్తుంటే అది ఓట్ల కోసమే అని అర్థమవుతోందన్నారు. మొదటి చెక్కును బ్యాంక్‌లో జమ చేసినా బ్యాంకర్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదన్నారు. మూడు చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాలని చెబుతున్నారన్నారు. వేలమందికి ఇప్పటి వరకు చెక్కులు అందలేదన్నారు. ప్రతిరోజూ మెప్మా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొందరి చెక్కులను బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ మాత్రమే పొదుపు మహిళలు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి మస్తాన్ బీ, రెహానాబేగం, షామీనా బేగం తదితరులు పాల్గొన్నారు. -
నువ్వు లేక నేను లేను అన్నాడు.. కానీ!
భువనేశ్వర్ : వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. నువ్వు లేకపోతే నేను లేనంటూ బాసలు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు ఆ యువకుడు ముఖం చాటేయడంతో కథ అడ్డం తిరిగింది. బాధిత యువతి, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జమదాల గ్రామానికి చెందిన కళింగపట్నం పద్మ (రజక కులానికి చెందిన యువతి) అదే గ్రామానికి చెందిన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కొర్ర సంతోష్‌కుమార్ ప్రేమించుకున్నారు. సంతోష్‌ను పూర్తిగా నమ్మిన పద్మ శారీరకంగా దగ్గరైంది. పద్మ తల్లిదండ్రులు సంబంధాలు తీసుకువచ్చినా ఎవర్నీ పెళ్లి చేసుకోవద్దని... తానే చేసుకుంటానని సంతోష్ చెప్పడంతో బాధిత యువతి వచ్చిన సంబంధాలను వదులుకుంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని పద్మ కోరగా కొద్దికాలం నుంచి సంతోష్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సంతోష్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట పద్మ ప్రియుడి ఇంటిముందు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించగా.. పెద్ద మనుషుల ముందు సంతోష్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరలా మాట తప్పడంతో పద్మ శుక్రవారం యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకూ దీక్ష విరమించేది లేదని బాధితరాలు స్పష్టం చేస్తోంది. మాకు ఇష్టమే.. తమ కుమారుడు సంతోష్‌కి నచ్చితే పెళ్లి చేయడానికి తమకు ఇబ్బంది లేదని యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఈ నాటకమంతా వారే ఆడిస్తున్నారని బాధిత యువతి ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటే చనిపోతామని తల్లిదండ్రులు బెదిరించడం వల్లే సంతోష్ తనతో వివాహానికి వెనకడుగు వేస్తున్నాడని చెప్పింది. ఇదిలా ఉంటే తనతో పాటు తమ కుటుంబ సభ్యులపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించింది. చివరకు ఈ కేసు పార్వతీపురం రూరల్ పోలీసు స్టేషన్కుచేరింది. ఎస్సై లోవరాజు ఇరువర్గాలతో మాట్లాడినా సంతోష్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అనేక మలుపులు..! ప్రేమికుల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఒకసారి చేసుకుంటాను.. మరోసారి చేసుకోను.. అంటూ ప్రియుడు మాట మార్చడం వెనుక కొంతమంది పెద్దల దన్ను ఉందని బాధిత యువతి తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించి ఆ నెపం మామీద వేసి కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి
కత్తిపూడి (శంఖవరం): నమ్మించి గర్భవతి చేసిన వ్యక్తితోనే మనువు జరిపించాలని కోరుతూ ఓ యువతి పోరాటానికి దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆపై ముఖం చాటేశాడు. దిక్కు తోచని ఆ యువతి పోలీసులను ఆశ్రయించినా కనికరం చూపలేదు. న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందే మంగళవారం ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ రెండో రోజూ బుధవారం కూడా ఆందోళన కొనసాగించింది. మండలంలోని కత్తిపూడి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. బాధితురాలు దడాల వసంత కథనం ప్రకారం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దడాల వసంత అదే గ్రామానికి చెందిన మిరియాల రాజేష్ గత కొంత కాలంగా ప్రేమించమంటూ వెంట తిరిగాడు. తన సామాజిక వర్గీయుడే కావడం, వివాహం చేసుకుంటానని చెప్పడంతో అతడిని నమ్మింది. అయితే తాను గర్భవతిని కావడంతో మోహం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రోత్సాహించడంతో తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని తెలిపింది. ప్రేమించిన రాజేష్‌తో వివాహం జరిపించాలని అంతవరకు ఆందోళన విరమించేది లేదని ఆమె భీష్మించింది. ఆమె ఆందోళనకు బుధవారం మహిళా సంఘాల సభ్యులు మద్ధతు తెలిపారు. ఈ విషయంపై అన్నవరం పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మహిళలేమైనా మావోయిస్టులా : ప్రకాశ్‌రెడ్డి ఆవేదన
మంత్రి పరిటాల సునీతకు తన రాజకీయ జీవితంలో చవిచూడని ఎదురుదెబ్బ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఆర్భాటంగా ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం నిర్వహించాలనుకున్న ఆమెకుఅడుగడుగునా అడ్డుంకులే ఎదురయ్యాయి. ఆదివారం తోపుదుర్తి వెళ్లిన సునీతను.. డ్వాక్రా మహిళలుఅడ్డుకున్నారు. రోడ్లపై బైఠాయించి.. నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ‘నిన్ను నమ్మం సునీతమ్మా’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో చేసిన మోసం చాలనీ, ఇప్పుడు కొత్తగామళ్లీ స్మార్ట్‌ఫోన్ రూ.10 వేల పేరుతో మాయచేయడం మానుకోవాలన్నారు. మహిళల ప్రతిఘటన..పోలీసుల బలవంతపు అరెస్టులతో తోపుదుర్తి గ్రామం అట్టుడికింది. అనంతపురం, ఆత్మకూరు : మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఆదివారం ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయాలని మంత్రి పరిటాల సునీత నిర్ణయించుకున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆ గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలు రెండురోజుల కిందటే సమావేశమయ్యారు. మంత్రి సునీత, టీడీపీ సర్కార్ చేసిన మోసానికి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మంత్రి గ్రామానికి వస్తున్నట్లు తెలిసి రోడ్డుపై బైఠాయించారు. నల్లజెండాలు చేతబట్టి నిరసన తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది చాలక మళ్లీ ఇప్పుడు రూ.10వేలు ఇస్తామని పోస్ట్‌డేటెట్ చెక్కులు(మూన్నెల్ల తర్వాత చెల్లేలా తేదీ వేసిన చెక్కులు) ఇచ్చి మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. తమకిచ్చిన హామీలు నెరవేరిస్తేనే మంత్రిని గ్రామంలోనికి అడుగుపెట్టనిస్తామని, లేదంటే అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. ఇదంతా తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత గ్రామంలోకి కచ్చితంగా వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ బాబుతో పాటు సీఐలు, ఎస్ఐలు, సుమారు 400 మంది పోలీసులను గ్రామంలో మొహరించారు. మహిళలపై పోలీసు జులుం గ్రామానికి వస్తున్న మంత్రి ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతామని మహిళలు భీష్మించారు. దీంతో పోలీసులు వారిని చుట్టుముట్టారు. ‘వజ్ర’ వాహనాలను రప్పించారు. 11 గంటలకు మంత్రి కార్యక్రమం జరగాల్సి ఉండగా.. మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ సమయంలోనే మహిళలు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. చివరకు పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. గంటన్నర గ్రామం బయటే... గ్రామంలోని పరిస్థితి తెలుసుకున్న మంత్రి సునీత గ్రామం బయటే వేసి చూశారు. ఆ తర్వాత గ్రామానికి వెళ్లారు. అయితే పరిస్థితి అదుపులోకి రాలేదని తెలిసి దారిలోని గంటన్నరేపు కాన్వాయ్ నిలిపేశారు. దీంతో ఎస్పీ అశోక్‌కుమార్ గ్రామానికి వచ్చి పోలీసు బలగాలతో మహిళలను అరెస్టు చేసి తరలించారు. ఆ తర్వాత మంత్రి కాన్వాయ్ గ్రామంలోకి రాగానే పోలీసులు రెండువైపులా రక్షణగా ఉండి గ్రామంలోకి అనుమతించారు. అయినప్పటికీ గ్రామస్తులు మంత్రి కాన్వాయ్‌పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు. తోపుదుర్తి మహిళల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని కూడా బలవంతంగా అరెస్టు చేశారు. రోడ్డుపై బైఠాయించి మంత్రి సునీతకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తోపుదుర్తి గ్రామ మహిళలు వడ్డీ మాఫీ కాలేదు మహిళా సంఘాల్లో తీసుకున్న రుణం అంతా మాఫీ అవుతుందని ఆశపడ్డాం. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రుణాలు కాదు కదా...వాటికి సంభందించిన వడ్డీలు కూడా మాఫీ కాలేదు. అలాంటప్పుడు మోసపూరిత హామీలు ఎందుకివ్వాలి. – భావమ్మ, తోపుదుర్తి పోలీసుల అండతో వచ్చారు డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మహిళలం నిలదీస్తామని తెలియడంతో మంత్రి సునీత గ్రామంలోకి పోలీసులు అండతో వచ్చారు. నిజంగా హామీలు నెరవేర్చి ఉంటే మహిళలు ఎందుకు నిలదీస్తారు. ఇప్పుడు ‘పసుపు –కుంకుమ’, సెల్‌ఫోన్ అంటూ మళ్లీ మోసం చేస్తూ.. చెక్కులను అందజేస్తున్నారు. – చంద్రకళ, తోపుదుర్తి మహిళలకుఅన్యాయం చేసిన మంత్రి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని పరిటాల సునీత ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ రుణమాఫీ కాదు కదా కనీసం వడ్డీ కూడా కట్టలేదు. పెట్టుబడి నిధి కింద రూ.10 వేలు ఇస్తే.. ఆ డబ్బును బ్యాంకోళ్లు వడ్డీ కింద జమ చేసుకున్నారు. మహిళలకు అన్యాయం చేసిన మంత్రి మాకు వద్దేవద్దు.– అక్కమ్మ, తోపుదుర్తి -
ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష
పాతపట్నం: ఎన్నారై భర్త మోసం చేశాడంటూ భార్య మౌన పోరాటం చేసిన సంఘటన పాతపట్నం ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలంలోని హరిజన గోపాలపురం గ్రామానికి చెందిన పట్నాల సింహాద్రి, భారతిల కుమార్తె శిరీషకు పాతపట్నం ఎస్సీ కాలనీకు చెందిన సాన ధర్మపురి, విజయల కుమారుడు సాన గౌరీశంకర్‌తో 2016లో వివాహం జరిగింది. గౌరీశంకర్లో బ్యాంకాక్‌లో పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో రూ.5 లక్షలు, 5 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకగా ఇచ్చారు. పెళ్లయిన నెల రోజుల నుంచే అదనపు కట్నం కావాలంటూ అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. రెండు నెలలు గడిచిన తర్వాత శిరీషను బ్యాంకాక్ తీసుకెళ్లిన గౌరీశంకర్ 15 రోజుల అనంతరం భార్యను ఒంటరిగా పాతపట్నం పంపించేశాడు. అప్పటి నుంచి శిరీష కన్నవారింట్లోనే ఉంటుంది. గౌరీశంకర్ మాత్రం పాతపట్నం రాకుండా విదేశాల్లోనే ఉంటున్నాడు. ఎప్పటికీ భర్త రాకపోవడంతో శిరీష శనివారం తన మూడేళ్ల కుమారుడు సుజిత్ శంకర్‌తో కలిసి మౌనదీక్షకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అత్తమామలు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, పోలీసులు స్పందించి తన భర్త పాతపట్నం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాధేయపడింది.