తన ఇంటిని బంధువులు ఆక్రమించుకున్నారనే బాధతో ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగింది.
గోదావరిఖని: తన ఇంటిని బంధువులు ఆక్రమించుకున్నారనే బాధతో ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న భాగ్యలక్ష్మి అనే మహిళ ఇంటిని సమీప బంధువులు ఆక్రమించుకోవడంతో.. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కింది. తనకు న్యాయం చేయాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను కిందకు దించడానికి యత్నిస్తున్నారు.