bhagyalakshmi
-
అస్కీ మాజీ డైరెక్టర్ భాగ్యలక్ష్మి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ ఇన్వాయిస్లతో కుట్ర పూరితంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు (అస్కీ) చెందిన రూ.88.91 లక్షలు స్వాహా చేసిన కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) శుక్రవారం మాజీ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మిని అరెస్టు చేసింది. ఈ గోల్‌మాల్‌లో ఆమె పీఏగా పని చేసిన ఎం.రవికుమార్ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించామని డీసీపీ ఎన్.శ్వేత పేర్కొన్నారు. అస్కీ ఆధీనంలో సెంటర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ అడ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ పేర్లతో కేంద్రాలు పని చేస్తున్నాయి. అస్కీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన భాగ్యలక్ష్మి ఎక్స్‌టెన్షన్‌పై వీటికి డైరెక్టర్‌గా పని చేశారు. 2021–24 మధ్య ఈమె హయాంలో అనేక శిక్షణ కార్యక్రమాలు, ప్రాజెక్టులు జరిగాయి. ఆయా సందర్భాల్లో అవసరాన్ని బట్టి పలు ఏజెన్సీలు, కన్సల్టెంట్లతో పాటు పలువురు విక్రేతలు సేవల్ని వినియోగించుకున్నారు. ఆయా ఏజెన్సీలు, విక్రేతలు ఇచి్చన ఇన్వాయిస్ల ఆధారంగా అస్కీ నిధుల నుంచి చెల్లింపులు చేశారు. ఈ విక్రేతలు, కన్సల్టెంట్స్ జాబితాలో హర్యానాలోని గుర్గావ్కు చెందిన షేక్ అభిషేక్ ఇమ్లాక్, నగరానికి చెందిన బల్లపు శృతి, నలమస రజని, మాదాపూర్‌కు చెందిన ఎం.బుర్రయ్య, పాండురంగనగర్‌కు చెందిన ధనలక్ష్మి ఉన్నారు. వీరు ఇచ్చిన ఇన్వాయిస్ల ఆధారంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి 2021 మార్చి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.88.91 లక్షల చెల్లింపులు చేశారు. తన పీఏ రవికుమార్ సాయంతో ఆ నగదును వారి నుంచి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చెల్లింపులతో పాటు ఇతర కార్యకలాపాల నేపథ్యంలో భాగ్యలక్ష్మిని ఈ ఏడాది ఆగస్టు 16న అస్కీ విధుల నుంచి తొలగించింది. శుక్రవారం ఆమెను అరెస్టు చేసిన సీసీఎస్ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. -
సూపర్ 6 పథకాల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం- భాగ్యలక్ష్మి
-
‘అక్షయపాత్ర’ రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ప్రభుత్వం నిజంగా బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. -
ఎగ్జిట్ పోల్స్ పై పాడేరు ఎమ్మెల్యే రియాక్షన్
-
అప్పులు తీర్చే మార్గం లేక...
జనగామ: వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీ లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుల కుమారుడు తెలిపిన వివరాల మేర కు.. తమిళనాడుకు చెందిన రాజ్ సెల్వరాజ్ (55), భార్య భాగ్యలక్ష్మి (45)కి ఇద్దరు కుమా రులు, ఒక కూతురు ఉన్నారు. మూడు దశా బ్దాల క్రితం వ్యాపారం కోసం వచ్చి వీవర్స్ కాలనీలో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం పెద్ద కుమారుడి వివాహం చేశారు. అనంతరం వ్యా పారంలో వరుసగా నష్టాలు వచ్చాయి. దీంతో సెల్వరాజ్ మొత్తం రూ.50 లక్షల అప్పు చేశా రు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇద్దరు కుమా రులు వేరుగా ఉంటూ వ్యాపారం చేసుకుంటు న్నారు. రోజురోజుకూ సెల్వరాజ్ వ్యాపారం తగ్గిపోవడంతో అప్పులు తీర్చే మార్గాలు మూ సుకుపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు అర్ధరాత్రి సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన వాచ్ మన్ చిన్న కుమారుడు చిన్నస్వామికి ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూసేసరికి అప్పటికే దంపతులు పూర్తిగా కాలిపోయి మృతి చెందారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కామెంట్స్
-
అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు : భాగ్యలక్ష్మి
-
'నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే'
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'పవన్ కల్యాణ్ ఆంధ్రరాష్ట్రానికి పనికిరాడు. చిరంజీవి లేకుండా పవన్ కల్యాణ్ ఎవరికి తెలుసు. మెగాస్టార్ లేనిదే.. పవర్‌స్టార్ ఎక్కడ?. నాగబాబుకి విధి విధానం లేదు. చిరంజీవి ఫ్యాన్స్‌ను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేనకి సపోర్ట్ చేయాలని నాగబాబు చెప్పడం.. చిరంజీవిని అవమానించటమే. పవన్ కల్యాణ్ మాటలోడే తప్ప చేతలోడు కాదు. మొట్ట మొదట అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకొని పవన్ మాట్లాడాలి. మోడీ, అమిత్ షాలకు పవన్ వెదవ వేషాలు తెలుసు. బిజెపితో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ రాష్ట్ర సంక్షేమం కోసం ఒక్కరోజైనా పని చేశారా. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని పవన్ కల్యాణ్ బిజెపితో టచ్‌లో ఉన్నాడు. బిజెపి వాళ్లు పవన్ కల్యాణ్‌ని పట్టించుకోవడం లేదు. పవన్ మాత్రం బిజెపి భజన చేస్తున్నాడు' అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (ఉద్యోగుల బాగు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది: సజ్జల) -
కాంగ్రెస్‌లో చేరిన నల్లాల కుటుంబం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, మంచిర్యాల: టీఆర్ఎస్ పార్టీ నేత, చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మిలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల నేతృత్వంలో.. ఇద్దరు కుమారులు సందీప్, శ్రావణ్, ఇతర నేతలతో పాటు ఓదెలు దంపతులు ఢిల్లీ వచ్చారు. గురువారం మధ్యాహ్నం 11 జన్‌పథ్‌లోని సోనియా నివాసంలో ప్రియాంక గాంధీని కలిశారు. వారందరికీ ప్రియాంక కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో ఓదెలు పాత్రను ప్రియాంకకు రేవంత్‌రెడ్డి వివరించారు. జెడ్పీ చైర్మన్‌గా మరో రెండున్నరేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ అరాచక పాలన భరించలేక భాగ్యలక్ష్మి ఆ పార్టీని వీడుతున్న విషయాన్ని తెలియజేశారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, సీనియర్లకు మాదిరి గౌరవం, మర్యాద ఇస్తామని ఓదెలు దంపతులకు హామీ ఇచ్చారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు: ఓదెలు ప్రియాంకతో భేటీ అనంతరం ఓదెలు మీడియాతో మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అరాచకాల వల్లే టీఆర్ఎస్ను వీడుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసినట్లు చెప్పారు. ‘మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు 2018లో పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. తర్వాత సుముచిత స్థానం ఇస్తారని భావించినా ఇవ్వలేదు. నా భార్యకు జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చినా ఎలాంటి వసతులు, పాలనాధికారాలు కల్పించలేదు. ప్రొటోకాల్ పాటించడం లేదు. రెండేళ్లుగా ఎమ్మెల్యే సుమన్ మా ఇంటిపై నిఘా పెట్టి జైలుకు పంపుతానని హెచ్చరిస్తున్నాడు. ఫోన్ ట్యాప్ చేస్తున్నడు. బెదిరింపు మెసేజ్‌లు పెడుతున్నాడు. ఇవన్నీ భరించలేకే బయటకు వచ్చాం..’అని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని, మంత్రివర్గంలోనూ అందరూ ద్రోహులే ఉన్నారని ఆరోపించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ అనంతరం ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న భావనతో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించాలి: రేవంత్‌రెడ్డి తెలంగాణ కలను సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజం గుర్తించి కాంగ్రెస్ వైపు నడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాదిగల జీవితాలు బాగుపడతాయని, మాదిగ రిజర్వేషన్ సాధ్యమవుతుందని భావించారని, కానీ వారి ఆశలు అడియాశలయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించాల్సిన సమయం అసన్నమయిందని చెప్పారు. మూడుసార్లు ఎమ్మెల్యే.. ఓదెలు ఉద్యమం నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2009, 2010 (ఉప ఎన్నిక), 2014 ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పని చేశారు. 2018లో టికెట్ ఇవ్వనందుకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్త గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలావుండగా బుధవారం సాయంత్రం వరకు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌లో చేరేందుకు అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. -
‘పెద్ద మనసు లేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం గెలిచిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు గ్రామాలకు హీరో అయితే 13 జిల్లాలకు విలన్ అని మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన లోక్‌ష్‌ను మండలిలోకి పంపారని, లోకేష్ పదవి పోతుందని చంద్రబాబు బాధపడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చైర్మన్‌ను ప్రభావితం చేశారు శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను శాసన మండలిలో అడ్డుకుని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం బిల్లు, ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లును శాసన మండలి అడ్డుకుందని, తాజాగా పాలన వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను ప్రభావితం చేశారని, టీడీపీకి శాసన మండలిలో మెజారిటీ ఉందని రాజకీయంగా అడ్డుకున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో శాసన మండలి ఉందని గుర్తు చేశారు. మండలి రద్దును ప్రతిపాదిస్తే సమర్థిస్తానని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.శాసనమండలి అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాజకీయ దురుద్దేశంలో మండలిలో బిల్లులను అడ్డుకున్నారని, ప్రజా సంక్షేమం కోసం పనిచేయని మండలికి ప్రజాధనం వెచ్చించడం వృథా అని వ్యాఖ్యానించారు. పెద్ద మనసులేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారని చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
‘మూడు నెలలలోనే హామీ నెరవేర్చారు’
సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాల లీజు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. గిరిజనులందరి తరఫున తాము సీఎంకు కృతజ్ణతలు చెబుతున్నామన్నారు. తవ్వకాల ద్వారా వచ్చే కోట్ల రూపాయిల ఆదాయంపైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందనివిమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను నిషేదిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జీఓ నెంబర్ 97 తీసుకువచ్చి బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శుక్రవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాల లీజును రద్దు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. మూడు నెలలలోనే మాట నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయాన్ని చాలా మంది హేళన చేశారు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే కోట్ల రూపాయిల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందంటున్నారు. కానీ బాక్సైట్ తవ్వకాలతో వచ్చే ఆదాయం కన్నా గిరిజనుల జీవితాలే ముఖ్యమనుకున్నారు. బాక్సైట్ తవ్వకాల లీజు రద్దు చేయడం వల్ల గిరిజనులంతా జీవితాంతం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం.’ అని అన్నారు. -
ఉత్తరాంధ్రలోనే భాగ్యలక్ష్మికి భారీ ఆధిక్యత
విశాఖపట్నం , పాడేరు: పాడేరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రెండోసారి పాగా వేసింది. ఈ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఉత్తరాంధ్ర స్థాయిలోనే అత్యధిక మెజార్టీతో మొదటి స్థానంలో నిలిచారు. భాగ్యలక్ష్మికి 71,153 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 28,349 ఓట్లు లభించాయి. దీంతో భాగ్యలక్ష్మి 42,804 ఓట్ల ఆధిక్యతతో విజయంసాధించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు గాను 28 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. పాడేరు అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అత్యధిక మెజార్టీ సాధించి మొదటిస్థానంలో నిలిచారు. ప్రతి రౌండ్‌కి, ప్రతి పోలింగ్ బూత్‌లోను, అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి వైఎస్సార్సీపీ ఆధిపత్యం కొనసాగింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 26,114 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ సారి ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 14 మంది పోటీలో నిలిచారు. ఓట్ల చీలిక ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు వేసిన అంచనాలుతలకిందులయ్యాయి. ఏకపక్షంగా వైఎస్సార్సీపీ హవా కనిపిం చింది. ఎన్నికలు మొదలు కాక ముందు నుంచి పాడేరులో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని అంచనాలు ఉన్నప్పటికీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్సీపీకి అనూహ్యమైన మెజార్టీ లభించడం విశేషం. అరకు లోక్‌సభ పరిధిలో స్థానాలన్నీ వైఎస్సార్సీపీ కైవసం అరకు లోక్‌సభ స్థానంతో పాటు ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా వైఎస్సార్సీపీ విజయం సాధించింది. గత 2014 ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. ఈ సారి ఎంపీ అభ్యర్థి గొడ్డేటి మాధవికి రెట్టింపు ఆధిక్యత 2,19,836 ఆధిక్యత లభించడమే కాకుండా అసెంబ్లీ అభ్యర్థులు కూడా మెజార్టీలో ఆధిక్యత సాధించారు. గతసారి అరకు స్థానాలన్నీ వైఎస్సార్సీపీ గెలుచుకోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ నియోజకవర్గంపై వివక్ష చూపింది. వైఎస్సార్సీపీని గెలిపించారని పలుసార్లు ఇక్కడ బహిరంగ వేదికలపై సీఎం చంద్రబాబు ప్రజల్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. దీంతో మరింత పట్టుదలగా ఈ సారి ఎన్నికల్లో కూడా ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపించారు. రెండోసారి వైఎస్సార్సీపీ అరకు స్థానాలన్నింటిని క్లీన్ స్వీప్ చేయడంతో పార్టీకి మరింత పట్టు పెరిగింది. -
ఆయన పోరాటం నన్ను కదిలించింది
సాక్షి, అమరావతి : నాకు వైఎస్సార్ అంటే ప్రాణం. మా ఆదివాసీల పట్ల ఆయన చూపిన ఆదరణ, అప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేం. మాకోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశారు. పక్కా ఇళ్లు, పింఛన్లు, మోడల్ కాలనీలు, తాగునీటి పథకాలు, లక్షల ఎకరాల భూ పంపిణీతో పాటు విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేద గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందింది. ఇప్పుడు ఆ రాజన్న రాజ్యం స్థాపన కోసం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం నన్ను కదిలించింది. అందుకే వైఎస్సార్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి, గిరిజనులకు న్యాయం జరుగుతుందని భావించి ఆ పార్టీలో చేరాను. ఎమ్మెల్యేగా పనిచేసిన మా నాన్నను చిన్నప్పటి దగ్గర్నుంచి చూసిన నాకు ఎప్పటికైనా ఆయనలా ప్రజాసేవ చేయాలని అనుకునేదాన్ని. జగనన్నతో నా కల నిజమైంది. నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నిత్యం ఆదివాసీలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నీ పరిష్కరిస్తాను’ అని పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాక్షితో తన మనసులో మాటను బయటపెట్టారు. వైఎస్ మరణం.. గిరిజనులకు శాపం వైఎస్ హయాంలో నేను ట్రైఫాడ్ వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశాను. మా తండ్రి దివంగత కొట్టగుల్లి చిట్టినాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. పాడేరులో ఆర్టీసీ డిపో, కాంప్లెక్స్ ఏర్పాటు, 50 పడకల ఆస్పత్రి, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు శ్రమించారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళు గడిచినా మా గిరిజనులకు పూర్తి స్థాయిలో సంక్షేమం అందలేదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో మాత్రమే అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. ఆయన మరణాంతరం ఆదివాసీల సంక్షేమాన్ని టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కనీసం ఒక పూట కూడా పోషకాహారం అందక అత్యంత దయనీయ స్థితిలో ఆదివాసీలు జీవిస్తున్నారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్ళలేక దేవుడి మీద భారం వేస్తున్నారు. నేను వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాను. ప్రధానంగా విద్య, వైద్యం, సురక్షిత తాగునీరు, రోడ్లు, అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలు గుర్తించాను. స్వలాభం కోసమే గిడ్డి ఈశ్వరీ పార్టీ ఫిరాయింపు ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రభుత్వం ఆదివాసీలపై పూర్తి నిర్లక్ష్యం చూపింది. గిరిజనులంతా జగనన్న వెంట ఉన్నారనే కక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు మా సంక్షేమాన్ని విస్మరించారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఆదివాసీల్ని అడవికి నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో బాక్సైట్ తవ్వకాలకు పూనుకున్నారు. జీవో 97తో ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఆదివాసీలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం వల్ల బాక్సైట్ తవ్వకాలకు అడ్డుకట్టపడింది. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన స్వలాభం కోసం టీడీపీలోకి ఫిరాయించారు. తనకు అనుకూలమైన వారికి సబ్సిడీ రుణాలు, ట్రైకార్ పథకం ద్వారా వాహనాలు కేటాయించుకున్నారు. దీంతో టీడీపీ పట్ల, స్థానిక అభ్యర్ధి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగనన్నతోనే ...రాజన్న రాజ్యం ఆదివాసీలు తమకు మేలు చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోరు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంకా వారి మనస్సులో అలాగే ఉన్నాయి. జగనన్న సీఎం అయితేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందని ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగనన్న చేస్తున్న పోరాటానికి గిరిజనులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, టీడీపీపై వ్యతిరేకత కూడా నాకు కలిసి వస్తుందని నమ్ముతున్నాను. పార్టీ శ్రేణులు, గిరిజనులంతా పాడేరు ఎమ్మెల్యే స్థానాన్ని వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని శ్రమిస్తున్నాం. టీడీపీ పాలనతో పాడేరు నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నమ్మకద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ఇబ్బందులు పడేందుకు ఇక్కడి ప్రజలు సిద్దంగా లేరు. వారి జీవితాల్లో మార్పునకు ఇదే సరైన అవకాశం. నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి మార్పునకు పట్టం కడతారని గట్టి నమ్మకముంది. -
మావా! సుందరం మావా!!
‘‘ద్రౌపదమ్మ తిరునాళ్లకి పోవాలిరా పాండురంగా! మరవమాకు. వచ్చే మూడో శనివారం రథంలాగుడు, ఆదివారం అగ్గి తొక్కేది’’. పంచె ఎగగట్టుకుంటూ మీసాలు లాగుకుంటూ మేనల్లుడు పాండురంగంతో సుందరం మావ చెప్పినాడు. ‘‘పుత్తూరు తిరునాళ్లకి మావ తోడుగా పోయిరారా కొడకా! ద్రౌపదమ్మని మొక్కితే సెడ్డాగిడ్డా కొట్టకపోతాది. బాగుపడతావ్’’ అని అరస్తా సెప్పింది అమ్మ అనసూయమ్మ. నల్లంగా, జెండామానులగా వుంటాడు సుందరం మావ. అయిదారు ఊర్లల్లో అందరితోనూ అడ్డంగా మాట్లాడతాడు. అందరూ సమానమే! ‘అందరూ కుడిసేత్తో తిని ఎడంసేత్తో కడుక్కొనేటోళ్లేకదా’ అని ఎగిరెగిరి చెబుతాడు. ‘అందరూ ఎట్లా సమానమవుతారని?’ ఊర్లో నోర్లంతా మావని తిడతా వుంటాయి. అయినా అమ్మకి మావ భలే మంచోడు. ఎంతయినా తోడబుట్టినోడు కదా, సందు పోనిస్తదా ఏంటి? ‘మేనమామ మాట మల్లెలమూట’ అంటంది అమ్మ. ‘మేనమామ మాట సద్దిమూట’ అనికూడా అంటంది. ‘మావ సెప్పినట్టు వినరా కొడకా, సుఖపడతవ్’ అంటుంది. మావ ‘నీ మంచి కోరేటోడేగానీ నీకు సీమంత సెడ్డ సేయడురా కొడకా’ అంటుంది. ‘ఇంట్లో దేముడి ఫోటోలు తీసేసి మావ ఫోటోలు పెడ్తాంరా కొడకా’ అని రెండు మూడు సార్లు చెప్పింది కూడా. అట్టాంటి మావతో మేనల్లుడు తిరునాళ్లకి బయలుదేరినాడు. చేంద బావి నీళ్లు తలపైన పోసుకొని ముఖంపైన మురుగడి విభూది పెట్టి పాలమంగళం పంచె కట్టి రెడీ అయినాడు. జేబులో సిల్లరేసుకొని రంగురంగుల సొక్కా వేసుకొని వచ్చీరాని మీసాలను దువ్వెనతో దువ్వి పూలరంగడి లెక్కన రాసపల్లి నుంచి బయలుదేరినాడు. దారిన పోతావుంటే నల్లరంగన్న, ఎర్రరంగన్న, పొడల పాలాయన, మెల్లకన్ను మునిలక్ష్మి, బొజ్జనత్తం బండారామన్నలు పలకరించినారు. నిలబడి అవీయివీ మాట్లాడినారు మావా అల్లుళ్లు.నరసింహన్న కూతురు భాగ్యలక్ష్మి సింగారంగా కొప్పునిండా కనకాంబరాలు పెట్టి ఎదురువచ్చినాది. ఆయమ్మి చీరకట్టేది కొత్తో ఏమో! చీరని ఒంటికి కట్టుకోలా. ఒంటికి చుట్టుకున్నట్టుగా వుంది. గట్టిగా నవ్వితే నడుంనుంచి చీర బొడ్డు కిందికి జారిపోయేట్టు గట్టిగా తుమ్మితే ఊడి పడిపోయేట్టుగా కట్టి వుండాది. చీర కట్టడాలు అమ్మలక్కలు నేర్పిస్తే కదా పాపం. ఆయమ్మిని పలకరిద్దామని పాండురంగం నిలిచినాడు. ఆయమ్మి వాడిని చూసీచూడనట్టుగా దాటుకొని వెళ్లిపోయింది.‘ఎంతయినా పెండ్లి కావాల్సిన పిల్లకదా! ....కొంచెం బలుపు వుంటాదిలే’ అనుకొని గమ్మున నడిచినాడు.రెడ్డోళ్ల బావికాడికి పోయేసరికి మీసాలాయన కొడుకు జ్యోతిరాజు గాడు కానవచ్చినాడు. చెరుకుగడలు ముందుర వేసుకొని కసాకసా నమలతా వుండాడు. పలకరిస్తే పలకలేనంతగా నోటితోనే గానుగ ఆడిస్తావుండాడు.పోతాపోతా బావి ప్రక్కన మునగసెట్టు కాడ నిలిచినాడు సుందరం మావ. జ్యోతిరాజుకి కానరాకుండా నాలుగు మునగకాయలు కోసినాడు.‘‘మునగ కాయలు మనకి దేనికి మావా! మన కయ్యికాడ దండిగా వుండాయి కదా’’ అని పాండురంగం చెప్పినాడు. ‘మన తోటలో మునక్కాయ మనకి రుచిగా ఉండదురోయ్! ఊళ్లోళ్ల మునక్కాయలైతే భలే మంచి రుచగా వుంటుంది’ అని చిన్నగా చేతి సంచిలో మూటకట్టినాడు. నవ్వుకుంటూ ఊళ్లోవాళ్ల గురించి, సినిమావాళ్ల గురించి మాట్లాడతా ఇరవై నిమిషాల్లో రెండు మైళ్లు నడిచినారు. ఇద్దరూ జేబుల్లో పోసుకొచ్చిన బఠాణీలు, ఉప్పుశెనగలు తింటా శాంతి సినిమా టాకీసు కాడికి చేరుకున్నారు. అక్కడ ధర్మరాజుల గుడి పెద్దలు చల్ల మజ్జిగ పంచతా వుండారు. ఇసుకలో నల్ల కుండలు పెట్టి కుండలకు తెల్లగుడ్డలు చుట్టి గుడ్డ ఎండినప్పుడల్లా తడి చేస్తా వుండారు. తెల్ల మజ్జిగ, చల్ల మజ్జిగ చూసి సుందరం మావ నిలబడలేక పోయినాడు. రెండు సత్తు గ్లాసుల నిండా తాగినాడు. కొత్తమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపలు వేసి తిరగమాత వేసి ఉప్పఉప్పగానీళ్లమజ్జిగ చేసి వుండారు. మీసాలకంటిన మజ్జిగని నాలికతో లాక్కొని ఉప్పంగా కమ్మగా వుండేసరికి మళ్లా రెండు గ్లాసులు తాగినాడు. మజ్జిగ పోసేటోళ్లు సినిమా చూసినట్లు చూస్తావుండారు. పాండురంగడికి మజ్జిగ తాగను మనసుకిరాలేదు. మజ్జిగ బాగలేక కాదు. మజ్జిగపోసే అమ్మి నల్లగా వుండాది. నల్లపిల్ల మజ్జిగ ఇస్తే చల్లగా వుండదా ఏమిటి? అట్లనికాదు. ఆ పిల్ల ముక్కుపుడక బిరడాకి చీమిడి అంటి వుండాది. అది చూడను సగించలా. అందుకు తాగలేదు పాండురంగడు. మావ ఏమో తాగింది తాగిందే ... అట్టాయిట్టా నడుచుకుంటూ ద్రౌపదమ్మ గుడికాడికి చేరినారు. రథం కదులుతోంది. జనాలు దండిగా చేరి వున్నారు. చిన్న తాగేలివాళ్లు తప్పట్లు, తాళాలతో భజనలు చేస్తున్నారు. పచ్చికాపల్లం స్వామి పద్యాలు పాడుతున్నాడు. రామగిరి కళాబృందం మేళతాళాలతో పాటలు పాడుతోంది. గెరామణి గ్రూపు డాన్సు వాళ్లు రంగులేసుకొని సినిమా పాటలు మైకులో పాడతా వుండారు.కుర్రకారు ‘జజ్జనక జజ్జనక’ డ్యాన్సులు వేస్తున్నారు. పతంగులు ఎగుర వేస్తున్నారు. కదిరిమంగళం వాళ్లు కోలాటం చేస్తావుండారు. బుగ్గ అగ్రహారం వాళ్లు బూరలు ఊదుతున్నారు. గూలూరు వెంకటయ్య దాయాదులు రంగునీళ్లు చల్లుతున్నారు. తొరూరు నారాయణ స్వామి మనుషులు జనాలపైన, రథంపైన పూలు విసురుతున్నారు. అత్తరు సాయిబు పన్నీరు చల్లతా వుండాడు. రథానికి కట్టిన చామంతి మాలలు గాలికి ఉయ్యాలలలాగా ఊగుతున్నాయి. రథం నాలుగు దిక్కులా వున్న బొమ్మగుర్రాలు దూకడానికి సిద్దంగా వున్నట్లుగా వున్నాయి. రథం చుట్టూ కట్టిన రంగురంగు చీరలు గాలికి రెపరెపలాడుతున్నాయి. గోవిందనామంతో హోరెత్తుతోంది. రథం ముందు తిక్కశంకరుడు పులి అడుగులు వేస్తున్నాడు. కోటిగాడు కేరింతలు కొడుతున్నాడు. రథాన్ని జనాలంతా ‘‘హైలెస్సా హైలెస్సా’’ అంటూ లాగుతున్నారు.కదులుతున్న రథానికి పట్టు చీరలు కట్టినోళ్లు కర్పూర హారతులిస్తున్నారు. భలే పసందుగా వుంది వాతావరణం. రథంపైన మిరియాలు విసిరితే చర్మవ్యాధులు రావని ఊరిజనం నమ్మకం. తీట, గజ్జి, తామర, తెల్లపొడ, నల్లపొడ, చుండ్రు, మొటిమలు, చెమటకాయలు, పులిపురి కాయలు దగ్గరికి రావని అంటారు. ఉంటే పోతాయని కూడా చెబుతారు.ఇంటి నుంచి మూట కట్టుకొచ్చిన మిరియాలను మావా అల్లుల్లిద్దరూ చల్లినారు. దూరం నుంచే రథానికి దండాలు పెట్టినారు. ఇంక ఇంటికి వెళ్దామని పోతా పోతా తుంబూరాహోటల్ దగ్గర ఆగినారు. రవ్వ ఇడ్లీలు ఇక్కడ బాగుంటాయని, తిందామని చెప్పిన సుందరం మావ నేరుగా హోటల్లోకి దూరినాడు. చక్కగా చేతులు కడుక్కొని కుర్చీలాక్కొని కూర్చొని టేబుల్‌పైన దరువేస్తూ ఒక ప్లేటు ఇడ్లీకి అర్డరిచ్చినాడు. ‘ఇద్దరికీ ఒక ప్లేటు ఇడ్లీ ఎట్టా సరిపోతుందో’ పాండురంగడికి అర్థంకాక అట్టాయిట్టా చూసినాడు. సినిమా పుస్తకం దొరికితే బొమ్మలు చూస్తా వుండిపోయినాడు. సుందరం మావ ఒక ఇడ్లీ పక్కన పెట్టి గిన్నెల గిన్నెల సాంబారు పోసుకొని పిసికి పిసికి తినినాడు. అట్లనే రెండో ఇడ్లీ కూడా సగం తినేసినాడు. మిగిలిన సగం ఇడ్లీని రెండుగా చేసి అటూ ఇటూ చూసినాడు. సప్లయిరుగానీ, వంటవాళ్లుకానీ, గల్లా మనిషి కానీ చూడటం లేదని నిర్ధారణకు వచ్చినాడు. వెంటనే తలలోని ఒక నల్ల వెంట్రుకను గభీమని పెరికి ఇడ్లీ ముక్కల మధ్యలో దూర్చినాడు. అవేశంగా లేచి సప్లయిర్లనీ హోటలోళ్లనీ అరవసాగినాడు. మావ రచ్చకి అందరూ పరుగెత్తుకొచ్చినారు. ‘‘మీరు ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు, ఇడ్లీలు ఉడికించేటప్పుడు, ఇడ్లీలు జనాలకు పెట్టేటప్పుడు చూసుకోవద్దా? చూడండి! ఇడ్లీలో వెంట్రుక వచ్చింది. మేము ఈ భూమిపైన వుండాల్నా పోవాల్నా’’ అని ఊగిఊగి అరిచినాడు. హోటలోళ్లంతా భయపడి గుంపు చేరినారు. మావని సముదాయిస్తూ మావా అల్లుళ్లిద్దరినీ ప్రక్క గదిలోకి తీసుకొనిపోయినారు. ఒక్కసారిగా మావ అక్కడ హీరో లెక్కన మారిపోయినాడు. తప్పు జరిగిందని ప్రాధేయపడినారు. నేతి ఇడ్లీలు తెప్పించి, అలసంద వడలు వేయించి, ఫిల్టర్ కాఫీ తాగించి డబ్బులేవీ తీసుకోకుండా సాగనంపినారు. గుట్టురట్టు చేయవద్దని చేతులు పట్టుకున్నారు. తాంబూలం తీసుకొమ్మని పుత్తూరు వక్కపొడి చేతినిండా పోసినారు. మావా అల్లుళ్లిద్దరూ చంకలు గుద్దుకున్నారు. వాళ్లు హోటల్ మెట్లు దిగతా వుంటే పాండిచ్చేరి పకోడి మాష్టార్ ‘ఒరే కోలాటం రొంబ కొండాట్టం’ అనడం వారికి వినిపించింది. మావ డ్రామా చూడటానికి భలేముచ్చటేసింది మేనల్లుడికి. ‘‘కనబడడు కానీ మావలో ఎన్ని వయ్యారాలో ... పైసా సెలవకాకుండా ఇద్దరికీ కడుపునిండా టిఫినీలు తినిపించిన మావ రుణం ఎట్టా తీర్చేదబ్బా’’ ... ఆలోచించినాడు రాత్రంతా. అగ్గి తొక్కేరోజు సాయంత్రం అయిదింటికంతా బయలుదేరి ద్రౌపదమ్మ గుడి కాడికి చేరినారు. అగ్గి తొక్కేటోళ్లు సిద్దంగా వున్నారు. ఒకరి వెనకాల ఒకరు నిలబడి వున్నారు. ఎనబైమంది దాకా వున్నారు. వారిముందు తిరుత్తణి మేళం జట్టు డప్పులు వాయిస్తోంది. పసుపు నీళ్లల్లో అద్దిన పంచె, బన్నియను వేసివున్నారు అగ్గితొక్కేటోళ్లు. వేప మండలు చేత పట్టుకొని, ముఖానికి కాళ్లకి గరువాయూరు గంధం, కంచి కుంకుమలు పూసి వున్నారు. ఎడమచేతికి గుండు మల్లెలు చుట్టినారు. కుడి చేతికి అగ్గి కంకణం కట్టినారు. మెడలో తురక చామంతుల మాలవేసినారు. భక్తిగా గోవిందలు పలుకుతున్నారు. పిల్లా జల్లా అగ్గి తొక్కేటోళ్ల వారి కాళ్లపైన పడి దండాలు పెట్టినారు. బిడ్డలు లేని మొగుడూ పెళ్లాలని వీధుల్లో పనబెట్టి అగ్గితొక్కేటోళ్ల చేత దాటించినారు. పలకలోళ్లు పలకలు వాయిస్తున్నారు. గెరిగెలు ఎత్తుకొని ఊరేగుతున్నారు. మీసాలొస్తున్న పిలకాయలు, మీసాలొచ్చిన పిలకాయలు, ఈలలు, ఊలలు వేస్తున్నారు. పెద్ద పూజారి పసుపు జండా ఊపినాడు. దబదబమని పరుగులు తీసినారు అగ్గితొక్కేటోళ్లు. ఊరంతా తిరిగి ఊరి బయటవున్న అనంతరాజు బావి, మిషను బావి, రామన్న బావి, జయన్న బావి, సూర్యనారాయణ బావి, కోమటోళ్ల బావి, నడిపక్క బావి....ఈ మాదిరి పదహారు బావుల్లో దూకిదూకి ఒళ్లంతా తడిచేసుకొని చివరిగా అగ్గితొక్కుతారు. అగ్గితొక్కినాక పాల్లో కాళ్లు పెట్టాలి. దీంతో అగ్గితొక్కడం అయిపోయినట్లే. ‘‘మావా! టిఫిన్ చేసిపోదాం. ఈరోజు ఉభయం నాది, నిన్న నాకు బంగారం లాంటి ఇడ్లీలు తినిపిస్తివి. నేను మాత్రం తక్కవా? నీకు ఈరోజు మసాలా దోశెలు తినిపిస్తా మావా’’ అని చెప్పినాడు పాండురంగడు. మావకి నోట్లో చక్కెర పోసినంత సంబరమయినాది. తన మేనల్లుడు తన ట్రైనింగుతో స్టెప్పు బై స్టెప్పు ఎదగతా వుండాడని మురిసిపోయినాడు. వాడిని అక్కడే ఎత్తుకొని గిరగిరా తిప్పదామనిపించింది ‘కానీ మోకాళ్లనొప్పులొకటి వచ్చినాయి కదా ప్రాణానికి’ అని ఊరుకున్నాడు. నిన్న తుంబూరా హోటల్లో తినినాం కదా. ఈసారి కొత్తగా మండీవీధిలో తిరపతా హోటల్లో తిందామని బయలుదేరినారు. చక్కగా చేతుల్ని మెడిమిక్సు సోపుతో రుద్దిరుద్ది కడిగినారు. అడిగి ఫ్యాను వేయించుకొని ఫ్యానుకింద కుర్చీలో కూర్చున్నారు. సర్వర్‌ని పిలిచి మసాలా దోశె ఒకటి తెమ్మని ఆర్డరిచ్చినాడు పాండురంగడు. ‘నీకు స్పెషల్ మసాలా దోశెలు తినిపిస్తా కాసేపు వుండు మావా’ అన్నట్లుగా వున్నాయి వాడి చూపులు. మేనల్లుడి తెలివితేటలకి ముచ్చటపడినాడు సుందరం మావ. ముద్దు మీద ముద్దు పెట్టాలనిపించింది. వాడికున్న నోరుపుండు గుర్తొచ్చి గమ్మున వుండినాడు. మసాలా దోశె వచ్చింది. తినడం ప్రారంభించినాడు పాండురంగడు. కుర్మాలోని ఉల్లిపాయ, పచ్చిమిరప, అల్లం, జీడిపప్పులను ఏరిఏరి కసాకసా తింటా వుండాడు. పొద్దుపోక సుందరం మావ హోటలోళ్ల తెలుగు పేపరుని కూడికూడి చదవతా వుండినాడు. సినిమా బొమ్మల్ని కసితీరా చూసినాడు. సగందోశె తినినాక పాండురంగడు చిన్నచిన్నగా తన చొక్కా జేబులో పెట్టకచ్చిన పొట్లం బయటికి తీసినాడు. రామక్కవ్వ పొడగాటి తెల్లనల్ల వెంట్రుకని తీసినాడు. చిన్నగా కుర్మా మధ్యలో దోపినాడు. నాటకం ప్రారంభించినాడు. ‘‘ బుద్ధి వుందా లేదా మీకు! వంటల్లో వెంట్రుకలు వచ్చేది చూసుకోరా? ఎట్టంటే అట్ట పెట్టేస్తారా? మేము ప్రాణాలతో వుండాల్నా? లేక పైకి పోవాల్నా? అంటూ పూనకం వచ్చినోడి లెక్కన వీరావేశంతో అరిచినాడు. హోటల్‌కి తినను వచ్చినోళ్లు, సర్వర్లు ఏం జరుగుతోందోనని ఎగాదిగా చూస్తా వుండారు. సుందరం మావ సస్పెన్స్ సినిమా చూసేవాడిలాగా కనుగుడ్లు పెద్దవిగాచేసి చూస్తా వుండాడు. సుందరం మావ భుజంపైన తువ్వాలును తీసి తలకు బిగించి కట్టినాడు. ఇంతలో మెరుపులాగా దూసుకొచ్చినాడు గల్లాపెట్టెకాడి గణేశం దబీదబీమని కొట్టినాడు పాండురంగడిని. అడ్డుపడదామని సుందరం మావ లేచినాడు. పటపటమని సుందరం మావనీ కొట్టినాడు గల్లాపెట్టె గణేశం. బెదిరిపోయిన మావ ‘ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు’ అని పంచె ఎగ్గట్టుకొని తలపైన తువ్వాలు పెరికేసి పరుగులెత్తినాడు. పరిగెత్తి పరిగెత్తి ఈశ్వరుని గుడికాడి కానగ సెట్టుకింద కూలబడినాడు. పాండురంగడిని సర్వర్లు తన్నుకుంటూ వంటగదికి తీసుకెళ్లినారు. వంటగాళ్లంతా గుండ్రంగా నిలబడినారు. తలా ఒక ఏటు ... ధర్మ ఏట్లు.... దండిగా పడినాయి. కట్టెల పొయ్యిలోని కట్టెతో వాతలు పెడతారేమోనని భయపడినాడు పాండురంగడు. వేడివేడి గంజి ముఖంపైన పోస్తారేమోనని బిత్తరపోయినాడు. సలసలకాగే నూనె తీసి నోట్లో పోస్తారేమోనని బిగసకపోయినాడు. కూరగాయల కత్తితో గొంతు కోసేస్తారేమోనని బెంబేలు ఎత్తినాడు. అలాంటిది ఏమీ జరుగలేదు కానీ కాఫీ మాస్టరు కన్నడ తిట్లు, తమిళ వంటవాడు తమిళ తిట్లు, దోశెల మాస్టారు మళయాళ తిట్లు, కోస్తా కుర్రాడి మసాలా తిట్లు పడ్డాయి. అందరికీ దండాలు పెట్టి కళ్ల నీళ్లు పెట్టుకొని జారుతున్న పంచెని ఎగ్గట్టుకొని బయటపడినాడు. రోడ్డుమీదకొచ్చి అట్టాయిట్టా చూసినాడు. దూరంగా కానగ సెట్టుకింద బిత్తర బిత్తరగా చూస్తూ దాక్కొని వున్న మావ కనబడినాడు. చిన్నచిన్నగా అడుగులేసుకుంటూ మావని చేరినాడు. ‘ఏమయ్యిందిరా మేనల్లుడా’ అని వాటేసుకున్నాడు మావ. ‘‘మావా! తిరపతామె హోటల్లో కెమెరాలు వుండాయి మావా. గల్లా పెట్టెకాడి కెమెరాలో అంతా కనబడతాది మావా. గల్లాపెట్టె గణేష్గాడు వెండితెరపైన బొమ్మ చూపిస్తా నన్ను జాంజాంమని కొట్టినాడు మావా. అడిగినోళ్లకంతా నా పొట్లం కథ ‘‘ఝూం’’ చేసి చూపిస్తా వుండాడు మావా’’. అంతే! అక్కడే నిలబడి వుంటే మళ్లీమళ్లీ పిలిచి కొడతారేమోనని మావా అల్లుళ్లిద్దరూ పరుగులు తీసినారు. పరిగెత్తి పరిగెత్తి అగ్గితొక్కేటోళ్ల గ్రూపులో చేరినారు. నిప్పుల్లో నడిచినారు. పాలల్లో కాళ్లు పెట్టినారు. గోవిందులు పలికినారు. వారికి ఎక్కడో పలకలు మోగుతున్నట్లుగా వినిపించింది. అంబికాపురం అంకడు ఈలలు వేయడం లీలగా కనిపించింది. - ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
చంద్రబాబు ఇలాకాలో మహిళపై దాష్టీకం
-
మహిళను వివస్త్రను చేసి, రాళ్లతో కొట్టి..
సాక్షి, కుప్పం : రాష్ట్రంలో మహిళలపై తెలుగుదేశం నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. ఇటీవల విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే మరోసారి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అలాంటి కీచకపర్వం పునరావృతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన భార్యాభర్తలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందినవారు దాడి చేశారు. మహిళను వివస్త్రను చేసి కిరాతకంగా ప్రవర్తించారు. ఈ దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన భార్యాభర్తలకు అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో కొంతకాలంగా గొడవలున్నాయి. ఇదే విషయాన్ని ఉమ దంపతులు ఇటీవలి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అయితే ఆ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిందంటూ ఆ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం...ఉమ దంపతులు పక్కింట్లోని అవ్వ దగ్గరకు వెళ్తుండగా వారిని చూసిన భాగ్యలక్ష్మి ఉమ్మివేసింది. ఎందుకు ఉమ్మావంటూ ఆ దంపతులు ప్రశ్నించడం నేరమయ్యింది. రెచ్చిపోయిన భాగ్యలక్ష్మి తన బంధువులతో కలసి వారిపై దాడికి తెగబడింది. అంతే కాకుండా జన్మభూమి కార్యక్రమంలో తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఉగిపోతూ... ఉమను వీధిలోకి లాక్కొచ్చి అందరి ముందే వివస్త్రను చేశారు. రాళ్లతో తీవ్రంగా కొట్టారు. నోటితో కొరికి దారుణంగా గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా చితకబాదారు. స్థానికులు తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. స్థానిక టీడీపీ నేతల అండదండలతోనే భాగ్యలక్ష్మి ఈ దారుణానికి ఒడిగట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. బాధితుడు తమపై జరిగిన దాడి గురించి రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మరోవైపు ఈ దారుణ ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాసిల్దార్ వనజాక్షిపై దాడి, కాల్‌మనీ సెక్స్ రాకెట్, విశాఖ జిల్లాలో దళిత మహిళపై దాడి ఘటనలు సిగ్గుచేటు అని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ...చంద్రబాబుకు బౌన్సర్లుగా మారారన్నారు. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. -
పెళ్లిరోజే తనువు చాలించింది
-
ఈ జీవితం నాకొద్దు
పెళ్లిరోజే తనువు చాలించింది అత్తింటి వారి వేధింపులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం సనత్‌నగర్: ప్రేమించుకున్నారు..అందరినీ ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.. అయితే పెళ్లయిన ఆరు నెలలకే అత్తింటి వారు వేధింపులకు ఆమె తాళలేకపోయింది...పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది...దీంతో తీవ్ర మనస్థాపంతో సరిగ్గా పెళ్లయిన ఏడాదికి.. అదీ పెళ్లిరోజే(శనివారం) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన మేరకు.. బేగంపేటకు చెందిన భాగ్యలక్ష్మి (29) ఏఎండీ సంస్థలో ఉద్యోగి. కర్మన్‌ఘాట్‌కు చెందిన శశి గూగుల్ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుని గత ఏడాది మార్చి 25న వివాహం చేసుకుని బేగంపేటలోని ఏఎండీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల పాటు సజావుగా సాగిన కాపురంలో విబేధాలు తలెత్తాయి. అత్తింటివారు మానసికంగా వేధిస్తున్నారంటూ భాగ్యలక్ష్మి కొన్ని నెలల క్రితం బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ ఫలితం లేదు. శనివారం దంపతుల పెళ్ళిరోజు కావడం..భర్త తన వద్ద లేకపోవడం.. అత్తింటి వారి వేధింపులు...వెరసి మానసికంగా కుంగిపోయిన ఆమె శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆమె ఉరేసుకున్న గది గోడలపై సూసైడ్ నోట్ రాసింది. నా చావుకు కారణం భర్త శశి, అత్తింటి కుటుంబసభ్యులు మంజుల, భాస్కర్, రమణిలు. మానసికంగా హింసించారు. భర్త నా మాట వినకుండా విడిపోయాడు. నేను చనిపోయాక నా శవాన్నీ, నాకు సంబంధించిన వస్తువులను ఎవరూ ముట్టుకోనీయవద్దు...బేగంపేట పోలీసులనూ వారు కొనేశారు...వాళ్లను నమ్మవద్దు...అంటూ గోడపై రాసి పెట్టింది. పోలీసులు అత్తింటివారిని అదుపులోకి తీసుకున్నారు. -
ఇంటి ముందు ముగ్గు వేయలేదని..
వేములపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యాదగిరి, భాగ్యలక్ష్మి(28) దంపతులు వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తగాదాలు నడుస్తున్నాయి. శుక్రవారం ఉదయం యాదగిరి ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయలేదని భార్యతో వాదన పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కాస్త ముదిరింది. దీంతో మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యులు 90 శాతం కాలడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. -
పిల్లలతో కలిసి ట్యాంక్ ఎక్కిన మహిళ
గోదావరిఖని: తన ఇంటిని బంధువులు ఆక్రమించుకున్నారనే బాధతో ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న భాగ్యలక్ష్మి అనే మహిళ ఇంటిని సమీప బంధువులు ఆక్రమించుకోవడంతో.. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కింది. తనకు న్యాయం చేయాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను కిందకు దించడానికి యత్నిస్తున్నారు.