అప్పులు తీర్చే మార్గం లేక... | Couple committed suicide by pouring petrol | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చే మార్గం లేక...

Published Thu, Mar 28 2024 1:58 AM | Last Updated on Thu, Mar 28 2024 1:58 AM

Couple committed suicide by pouring petrol - Sakshi

పెట్రోలు పోసుకుని దంపతుల ఆత్మహత్య

జనగామ: వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రం వీవర్స్‌ కాలనీ లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుల కుమారుడు తెలిపిన వివరాల మేర కు.. తమిళనాడుకు చెందిన రాజ్‌ సెల్వరాజ్‌ (55), భార్య భాగ్యలక్ష్మి (45)కి ఇద్దరు కుమా రులు, ఒక కూతురు ఉన్నారు. మూడు దశా బ్దాల క్రితం వ్యాపారం కోసం వచ్చి వీవర్స్‌ కాలనీలో స్థిరపడ్డారు.

రెండేళ్ల క్రితం పెద్ద కుమారుడి వివాహం చేశారు. అనంతరం వ్యా పారంలో వరుసగా నష్టాలు వచ్చాయి. దీంతో సెల్వరాజ్‌ మొత్తం రూ.50 లక్షల అప్పు చేశా రు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇద్దరు కుమా రులు వేరుగా ఉంటూ వ్యాపారం చేసుకుంటు న్నారు. రోజురోజుకూ సెల్వరాజ్‌ వ్యాపారం తగ్గిపోవడంతో అప్పులు తీర్చే మార్గాలు మూ సుకుపోయాయి.

దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు అర్ధరాత్రి సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన వాచ్‌ మన్‌ చిన్న కుమారుడు చిన్నస్వామికి ఫోన్‌ చేయడంతో అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూసేసరికి అప్పటికే దంపతులు పూర్తిగా కాలిపోయి మృతి చెందారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement