Selvaraj
-
అప్పులు తీర్చే మార్గం లేక...
జనగామ: వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీ లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుల కుమారుడు తెలిపిన వివరాల మేర కు.. తమిళనాడుకు చెందిన రాజ్ సెల్వరాజ్ (55), భార్య భాగ్యలక్ష్మి (45)కి ఇద్దరు కుమా రులు, ఒక కూతురు ఉన్నారు. మూడు దశా బ్దాల క్రితం వ్యాపారం కోసం వచ్చి వీవర్స్ కాలనీలో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం పెద్ద కుమారుడి వివాహం చేశారు. అనంతరం వ్యా పారంలో వరుసగా నష్టాలు వచ్చాయి. దీంతో సెల్వరాజ్ మొత్తం రూ.50 లక్షల అప్పు చేశా రు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇద్దరు కుమా రులు వేరుగా ఉంటూ వ్యాపారం చేసుకుంటు న్నారు. రోజురోజుకూ సెల్వరాజ్ వ్యాపారం తగ్గిపోవడంతో అప్పులు తీర్చే మార్గాలు మూ సుకుపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు అర్ధరాత్రి సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన వాచ్ మన్ చిన్న కుమారుడు చిన్నస్వామికి ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూసేసరికి అప్పటికే దంపతులు పూర్తిగా కాలిపోయి మృతి చెందారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. -
సివంగివే సివంగివే... నీ త్యాగమే గుర్తించగా.. సాహో అంటూ మోకరిల్లదా లోకమే
పాటలు అంటే సరదాగా పాడుకునేవే కావు శక్తి మాత్రలు కూడా. తాజా విషయానికి వస్తే ఇండియన్ ఉమెన్ కబడ్డీ కోచ్ కవితా సెల్వరాజ్ ‘రెయిన్ డ్రాప్ ఫౌండేషన్’ నిర్వహించిన సమావేశంలో విజయ్ ‘బిగిల్’ (తెలుగులో విజిల్) సినిమాలో ఏఆర్ రెహమాన్ పాడిన ‘సివంగివే’ పాట ఎంత ఇన్స్పైర్ చేసిందో చెప్పింది. స్వయంగా ఆ పాట పాడింది. డెబ్బై వేలకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ‘బిగిల్’ సినిమాలో విజయ్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా నటించాడు. మహిళా క్రీడాకారులలో స్ఫూర్తి, ధైర్యం నింపి విజయం వైపు తీసుకువెళ్లే క్రమంలో వినిపించే పాట సివంగివే. ఈ పాట (తెలుగు)లో నుంచి కొన్ని లైన్లు... ‘అడుగులే జలిపించు/ పిడుగులై ఒళ్లు విరుచుకో/ విను వీధి దారిన మెరుపులా/ భూమిని బంతాడు సివంగివే సివంగివే/ తలవంచె మగజాతి నీకే/ నీ త్యాగమే గుర్తించగా/సాహో అంటూ మోకరిల్లదా లోకమే -
సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్
తమిళసినిమా: విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ఆదిత్య వర్మ. ఇది తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్‌రెడ్డికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో ఈ త్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే నటుడిగా ధృవ్ విక్రమ్‌కు మంచి వర్కులు పడ్డాయి. తన తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ చిత్రంలో నటించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది. ఆ తరువాత ధృవ్ విక్రమ్ మంచి కథా చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. పరియేరుమ్ పెరుమాళ్, కర్నన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ కర్నన్ చిత్రం తరువాత ధృవ్ విక్రమ్ హీరోగా కబడ్డీ క్రీడ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. అలాంటిది సడన్‌గా ఉదయనిధి స్టాలిన్ హీరోగా వమన్నన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రవలు జరుపుకుంటోంది. దీంతో ధృవ్ విక్రమ్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
మరో గ్రీన్ సిగ్నల్!
తెలుగులో ‘బోళాశంకర్’, ‘సర్కారు వారి పాట’, తమిళంలో ‘సాని కాయిదమ్’, మలయాళంలో ‘వాషి’ .. ఇలా సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ కీర్తీ సురేష్. తాజాగా ఈ మలయాళ బ్యూటీ మరో తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
ఆ తల్లి నిర్దోషి, ఇవన్ని ఆకాశరామన్న ఉత్తరాలే?!
సాక్షి, చెన్నై: పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను హతమార్చి కసాయిగా ముద్ర పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ తల్లికి 17 ఏళ్లకు న్యాయం దక్కింది. ఆమె నిర్ధోషిగా పేర్కొంటూ మధురై ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. తిరుచ్చి జిల్లా తత్తయాన్‌కార పేట్టైకు చెందిన సెల్వరాజ్, శకుంతల (49) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2002 ఏడాదిన్నర చంటి బిడ్డను హతమార్చిన కసాయిగా అందరి దృష్టిలో శకుంతల మిగిలి పోయింది. సెల్వరాజ్ ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, శకుంతలను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. తిరుచ్చి మహిళా జైలులో శిక్ష అనుభవిస్తూనే న్యాయ పోరాటం మీద శకుంతల దృష్టి పెట్టారు. పిటిషన్ విచారణ సమయంలో ఆమెకు బెయిల్ లభించింది. అయితే, 2016లో బెయిల్ రద్దు కావడంతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పలేదు.పట్టు వదలకుండా న్యాయపోరాటం చేస్తూ వచ్చింది. ఏడాదిన్నర బిడ్డను బావిలో పడేసి హతమార్చినట్టుగా అభియోగం ఆమె మీద మోపినా, ఆధారాలన్నీ సృష్టించబడ్డట్టుగా, ఊహాజనితంగా, ఆకాశరామన్న ఉత్తరాలను తలపించే పొంతన లేనివిగా ఉన్నాయని బెంచ్ గుర్తించి ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. చదవండి: కోవాగ్జిన్ సింగిల్ డోస్?!: ఐసీఎంఆర్ -
20 మంది ప్రాణాలు కాపాడి.. గుండెపోటుతో మృతి
సేలం/తమిళనాడు: విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ఆదివారం మృతిచెందారు. గుండెనొప్పి రాగానే బస్సును డ్రైవర్ చాకచక్యంగా నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈరోడ్ జిల్లా కౌందంపాడికి చెందిన సెల్వరాజ్ (52) ప్రభుత్వ బస్సు డ్రైవర్. ఆదివారం ఉదయం 7.30 గంటలకు కౌందంపాడి నుంచి పెరుందురైకి 20 మంది ప్రయాణికులతో వెళుతున్నారు. మార్గమధ్యంలో సెల్వరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కన ఆపి కండక్టర్‌కి విషయం చెప్పాడు. ప్రయాణికులు సెల్వరాజ్‌ను మరో వాహనంలో సిరువల్లూరు పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. సిరు వల్లూరు పోలీసులు మృతదేహాన్ని గోపిచెట్టి పాళయం ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘సీఆర్ఐ పంప్స్’కు ఎన్ఈసీ అవార్డ్
విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ సీఆర్ఐ పంప్స్ తాజాగా మరో అవార్డును సొంతం చేసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2018’ని అందుకుంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా అవార్డ్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సెల్వరాజ్ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం అవార్డును అందుకోవడం ఇది 4వసారి. వినూత్న రూపకల్పన, సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ కస్టమర్లకు విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్‌ను అందిస్తున్నాం. అనుకున్న కార్యంలో విజయవంతమైనందుకు కస్టమర్లు, డీలర్లు, స్టేక్ హోలర్లకు దన్యవాదాలు.’ అని వ్యాఖ్యానించారు. -
డీఎంకే నేత హత్య
కేకే.నగర్:వాకింగ్‌కు వెళ్లిన డీఎంకే నగర కార్యదర్శి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన విల్లుపురం నార్త్ రైల్వే కాలనీలో చోటుచేసుకుంది. విల్లుపురం కేకేరోడ్డులో గల గణపతి లే అవుట్ ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ (44). విల్లుపురం నగర డీఎంకే కార్యదర్శి. ఇతని భార్య జయభారతి. కుమారుడు విగ్నేష్ (21). పుదుచ్చేరిలో గల ప్రైవేటు వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతున్నాడు. బుధవారం ఉదయం 5.30 గంటలకు డీఎంకేకు చెందిన సెంథిల్, ప్రకాష్, ధరణి, కన్నన్, మణి ఈ ఐదుగురితో కలిసి సెల్వరాజ్ వాకింగ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో బైకుల్లో వచ్చిన ఐదుగురు సెల్వరాజ్‌పై కత్తులతో దాడి చేశారు. అడ్డుకున్న సెంథిల్, ప్రకాష్‌లను గాయపరిచారు. రక్తం మడుగులో పడి సెల్వరాజ్ మృతిచెందారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సెల్వరాజ్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ముండియపాక్కం ప్రభుత్వాసుపత్రికి పంపారు. గాయపడిన ప్రకాష్, సెంథిల్లను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. సమాచారం అందుకుని అధిక సంఖ్యలో డీఎంకే సభ్యులు గుమికూడడంతో సంచలనం కలిగించింది. ప్రాథమిక విచారణలో ఈ హత్య పాత కక్షల నేపథ్యంలో జరిగిందని తెలిసింది. -
‘ఎర్ర’ స్మగ్లర్లకు రిమాండ్
- మదనపల్లె కోర్టుకు చైనా దేశీయుడు చెన్యీ ఫియాన్ - చిత్తూరు కోర్టుకు చెన్నైకి చెందిన సెల్వరాజ్ మదనపల్లె రూరల్/పూతలపట్టు : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్న చైనాకు చెందిన చెన్యీ ఫియాన్‌ను, చెన్నైకి చెందిన ఆర్.సెల్వరాజ్‌ను బుధవారం చిత్తూరు జిల్లా పోలీసులు కోర్టు హాజరుపరిచారు. వారిని కోర్టురిమాండ్కు ఆదేశించింది. మే 28న మదనపల్లె నుంచి డాబా శ్రీను, హరిబాబు ఎర్రచందనం తరలిస్తుండగా పోలీసులు అరెస్టుచేసి విచారించగా చైనాకు చెందిన చైనాకు చెందిన చెన్యీ ఫియాన్, తమిళనాడుకు చెందిన ఆర్.సెల్వరాజ్ పేర్లు చెప్పాడరు. దీంతో గత శుక్రవారం ఢిల్లీలో చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. పూతలపట్టు పోలీసులు బుధవారం చెన్నైలో ఆర్.సెల్వరాజ్‌ను అరెస్టుచేశారు. చెన్యీ ఫియాన్‌ను మదనపల్లె కోర్టులో హాజరు పరిచారు. సెల్వరాజ్‌ను చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు. నేను దొంగను కాదు .. ‘‘సారీ.. ఐయామ్ నాట్ ఏ తీఫ్.. ఐయామ్ బిజినెస్ పర్సన్’’ అంటూ విలేకరుల ముందు చెన్యీఫియాన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య ప్రోద్భలంతో అప్పుచేసి వ్యాపారం చేయడానికి ఢిల్లీకి వచ్చానన్నారు. తనను పోలీసులు అరెస్టు చేశారని, తన భార్య చుయాన్‌ఛుంగ్ ఆత్మహత్య చేసుకుంటుందని విలపించాడు. కాగా ఢిల్లీలో చెన్యై ఫియాన్‌ను అరెస్టు చేసినపుడు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు బుధవారం చిత్తూరుకు చేరుకున్నాయి.