
వైరల్
పాటలు అంటే సరదాగా పాడుకునేవే కావు శక్తి మాత్రలు కూడా. తాజా విషయానికి వస్తే ఇండియన్ ఉమెన్ కబడ్డీ కోచ్ కవితా సెల్వరాజ్ ‘రెయిన్ డ్రాప్ ఫౌండేషన్’ నిర్వహించిన సమావేశంలో విజయ్ ‘బిగిల్’ (తెలుగులో విజిల్) సినిమాలో ఏఆర్ రెహమాన్ పాడిన ‘సివంగివే’ పాట ఎంత ఇన్‌స్పైర్ చేసిందో చెప్పింది. స్వయంగా ఆ పాట పాడింది. డెబ్బై వేలకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది.
అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన ‘బిగిల్’ సినిమాలో విజయ్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా నటించాడు. మహిళా క్రీడాకారులలో స్ఫూర్తి, ధైర్యం నింపి విజయం వైపు తీసుకువెళ్లే క్రమంలో వినిపించే పాట సివంగివే. ఈ పాట (తెలుగు)లో నుంచి కొన్ని లైన్లు...
‘అడుగులే జలిపించు/ పిడుగులై ఒళ్లు విరుచుకో/ విను వీధి దారిన మెరుపులా/ భూమిని బంతాడు
సివంగివే సివంగివే/ తలవంచె మగజాతి నీకే/ నీ త్యాగమే గుర్తించగా/సాహో అంటూ మోకరిల్లదా లోకమే
Comments
Please login to add a commentAdd a comment