పీవీ సింధు ఒలింపిక్‌ చీరపై దుమారం | Paris Olympics 2024 ourtrage on Tarun Tahiliani designs outfits for PV Sindhu | Sakshi
Sakshi News home page

పీవీ సింధు ఒలింపిక్‌ చీరపై దుమారం.. నెట్టింట చర్చ

Published Sat, Jul 27 2024 11:31 AM | Last Updated on Sat, Jul 27 2024 12:49 PM

Paris Olympics 2024 ourtrage on Tarun Tahiliani designs outfits for PV Sindhu

అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా అరుదైన గౌరవాన్ని సాధించింది. మువ్వన్నెల చీరలో భారత పతాకాన్ని చేబూని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించింది. దీనికి సంబందించిన ఫోటోలను పీవీ సింధు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తన జీవితంలో ఇంతకంటే గొప్ప గౌరవం మరేదీ ఉండదంటూ తన ఆనందాన్ని ప్రకటించింది.

భారతీయ ఒలింపిక్‌ యూనిఫాంపై దుమారం
అయితే అంతర్జాతీయ క్రీడా వేదికపై పీవీ సింధు కట్టుకున్న చీరపై దుమారం రేగింది. తరుణ తహిలియానీ డిజైన్‌ చేసిన దుస్తులు చాలా పేలవంగా ఉన్నాయంటూ  బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. మీరు ‘డిజైన్ చేసిన’ ఈ యూనిఫామ్‌ల కంటే మెరుగైన చీరలు రూ.200లకు ముంబై వీధుల్లో అమ్మడం నేను చూశాను. చౌకైన పాలిస్టర్ వస్త్రంతో, ఇకత్‌ ప్రింట్‌((!!!) త్రివర్ణమనే ఊహకు అందకుండా గజిబిజిగా అద్దిన రంగులతో అధ్వాన్నంగా ఉందంటూ విమర్శించారు. అంతేకాదు ఇంటర్న్‌కి అవుట్‌సోర్స్ చేశారా? లేక ఆఖరి 3 నిమిఫాల్లో హడావిడిగా డిజైన్‌ చేశారా?  అంటూ ఆమె మండి పడ్డారు. భారతదేశ సుసంపన్నమైన నేత సంస్కృతికి, చరిత్రకు ఇది అవమానం అటూ నందితా అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల అగౌరవం కాదని కూడా వివరణ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై ఎన్‌ఐఎఫ్‌టీ బెంగళూరు మాజీ డైరెక్టర్ సుసాన్ థామస్ (అఫ్సర్నామా) ఇన్‌స్టాగ్రామ్‌లో దృక్కోణాన్ని కూడా ప్రస్తావించారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో, నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శరత్ కమల్ భారతీయ జెండా బేరర్లుగా వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు  ఇందులో పాల్గొన్నారు.

ప్రారంభ వేడుక కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాని భారతీయ అథ్లెట్ల కోసం ప్రపంచ వేదికపై భారతీయ వారసత్వాన్ని హైలైట్ చేసే అసాధారణమైన దుస్తులను రూపొందించారు. పురుష అథ్లెట్లు తెల్లటి కుర్తా , నారింజ , ఆకుపచ్చ నక్సీ వర్క్‌తో అలంకరించబడిన బూండీ జాకెట్ ధరించగా. ఈ జాకెట్లపై 'ఇండియా' ఇన్‌ స్రిప్ట్‌, ఒలింపిక్ లోగో ఉన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. మహిళలకు  మూడు రంగుల మేళవింపుతో చీర, జాకెట్టును డిజైన్‌ చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement