Outrage
-
పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం
అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా అరుదైన గౌరవాన్ని సాధించింది. మువ్వన్నెల చీరలో భారత పతాకాన్ని చేబూని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించింది. దీనికి సంబందించిన ఫోటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన జీవితంలో ఇంతకంటే గొప్ప గౌరవం మరేదీ ఉండదంటూ తన ఆనందాన్ని ప్రకటించింది.Hello Tarun Tahiliani!I have seen better Sarees sold in Mumbai streets for Rs.200 than these ceremonial uniforms you’ve ‘designed’.Cheap polyester like fabric, Ikat PRINT (!!!), tricolors thrown together with no imagination Did you outsource it to an intern or come up with it… https://t.co/aVkXGmg80K— Dr Nandita Iyer (@saffrontrail) July 27, 2024భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై దుమారంఅయితే అంతర్జాతీయ క్రీడా వేదికపై పీవీ సింధు కట్టుకున్న చీరపై దుమారం రేగింది. తరుణ తహిలియానీ డిజైన్ చేసిన దుస్తులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. మీరు ‘డిజైన్ చేసిన’ ఈ యూనిఫామ్‌ల కంటే మెరుగైన చీరలు రూ.200లకు ముంబై వీధుల్లో అమ్మడం నేను చూశాను. చౌకైన పాలిస్టర్ వస్త్రంతో, ఇకత్ ప్రింట్((!!!) త్రివర్ణమనే ఊహకు అందకుండా గజిబిజిగా అద్దిన రంగులతో అధ్వాన్నంగా ఉందంటూ విమర్శించారు. అంతేకాదు ఇంటర్న్‌కి అవుట్సోర్స్ చేశారా? లేక ఆఖరి 3 నిమిఫాల్లో హడావిడిగా డిజైన్ చేశారా? అంటూ ఆమె మండి పడ్డారు. భారతదేశ సుసంపన్నమైన నేత సంస్కృతికి, చరిత్రకు ఇది అవమానం అటూ నందితా అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల అగౌరవం కాదని కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై ఎన్ఐఎఫ్టీ బెంగళూరు మాజీ డైరెక్టర్ సుసాన్ థామస్ (అఫ్సర్నామా) ఇన్‌స్టాగ్రామ్‌లో దృక్కోణాన్ని కూడా ప్రస్తావించారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో, నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శరత్ కమల్ భారతీయ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.TEAM INDIA IS HERE TO WIN 🇮🇳🫶💙#OpeningCeremony #Paris2024 #Olympic2024 #Paris #ParisOlympics #ParisOlympics2024 #paris2024olympics #Olympics #Olympics2024Paris #OlympicGames pic.twitter.com/7ELyTEFpMV— Ankit Avasthi Sir 🇮🇳 (@ankitavasthi01) July 27, 2024ప్రారంభ వేడుక కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాని భారతీయ అథ్లెట్ల కోసం ప్రపంచ వేదికపై భారతీయ వారసత్వాన్ని హైలైట్ చేసే అసాధారణమైన దుస్తులను రూపొందించారు. పురుష అథ్లెట్లు తెల్లటి కుర్తా , నారింజ , ఆకుపచ్చ నక్సీ వర్క్‌తో అలంకరించబడిన బూండీ జాకెట్ ధరించగా. ఈ జాకెట్లపై 'ఇండియా' ఇన్ స్రిప్ట్, ఒలింపిక్ లోగో ఉన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. మహిళలకు మూడు రంగుల మేళవింపుతో చీర, జాకెట్టును డిజైన్ చేశారు. -
చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా
తుని రూరల్: చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం గెడ్లబీడు వద్ద శుక్రవారం జరిగిన జేసీఎస్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. తనపై యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటనందూరు మండలంలో తాను 150 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఆయనకే రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. -
కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలు సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణ పోలీసులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టులతో బీజేపీ వెనకడుగు వేయబోదన్నారు. కేసీఆర్ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా ఆ బుద్ధులు మానుకోవాలని హితవు పలికారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించడంలో తప్పేముందన్నారు. డబుల్ బెడ్రూమ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టిచ్చారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమా ధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లు పూర్తి చేశాం అని కేంద్రానికి నివేదిక ఇచ్చిన కేసీఆర్... లబ్ధిదారుల లిస్ట్ ఎందుకు ఇవ్వ డం లేదని కేంద్రం ప్రశ్నిస్తే స్పందించకపోవడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ చూపిన గ్రాఫి క్స్‌కు, కట్టిన డబుల్ ఇళ్లకు పొంతనే లేదని, నా పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం కట్టించిన ఆ ఇళ్లను పరిశీలిస్తే ముట్టుకుంటే కూలిపోయేలా ఉన్నాయని తెలిపారు. అరెస్టులు, గృహ నిర్బంధాలు కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని, ఎంపీల అరెస్టులపై పార్లమెంట్లో ప్రివిలేజ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. -
'దేవాలయం కంటే తక్కువేం కాదు..' గీతా ప్రెస్పై ప్రధాని ప్రసంశలు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గీతా ప్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంశలు కురిపించారు. గీతా ప్రెస్ దేవాలయం కంటే తక్కువేం కాదని అన్నారు. ఈ మేరకు గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. ప్రతిపక్షాల చర్యలను ఎండగట్టారు. గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. 'కొన్నిసార్లు సన్యాసులు దారి చూపిస్తారు. మరికొన్ని సార్లు గీతా ప్రెస్ లాంటి సంస్థలు మార్గం చూపిస్తాయి' అని మోదీ చెప్పారు. గీతా ప్రెస్ మానవత్వానికి దారి చూపిస్తోందని అన్నారు. మహాత్మా గాంధీకి గీతా ప్రెస్‌తో మంచి సంబంధం ఉందని గుర్తు చేశారు. గాంధీ నెలవారీ మ్యాగజీన్ 'కల్యాన్'ను ఈ సంస్థకే కేటాయించారని తెలిపారు. ఇప్పటివరకు కూడా ఆ మ్యాగజీన్‌ను ప్రకటనలు లేకుండా కొనసాగిస్తున్నారని చెప్పారు. గీతా ప్రెస్‌కు మహాత్మాగాంధీ శాంతి బహుమతిని కేటాయిస్తూ కొన్నిరోజుల క్రితం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ పార్టీ భావాజాలానికి చెందిన సంస్థకే కేటాయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గీతా ప్రెస్ ఆ బహుమతికి చెందిన ప్రైజ్ మనీ కోటి రూపాయలను నిరాకరించింది. అనంతరం ప్రధాని మోదీ గీతా ప్రెస్పై మాట్లాడింది ఇదే తొలిసారి. గీతా ప్రెస్ ఎంతో మంచి పుస్తకాలను ముద్రిస్తుందని ప్రధాని తెలిపారు. ఎక్కడ గీత ఉంటుందో అక్కడ సాక్షాత్తు కృష్ణుడు ఉంటాడని అన్నారు. గీతా ప్రెస్ దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశ జ్ఞాన సంపదను పెంచుతోందని కొనియాడారు. 'ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్' విధానాన్ని గీతా ప్రెస్ ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఇదీ చదవండి: 'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు.. -
చిత్తూరు: కుప్పంలో మరోసారి టీడీపీ నేతల దౌర్జన్యం
-
కుప్పంలో మరోసారి టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ అరాచకం కొనసాగుతోంది. మరోసారి టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విజయవాణి స్కూల్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారు. వందలాదిగా తరలివచ్చి స్కూల్ అద్ధాలు ధ్వంసం చేశారు. అనంతరం వంట సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో మహిళ గాయపడింది. మహిళల వద్ద సెల్ఫోన్లు, మెడలో గోల్డ్‌చైన్లు టీడీపీ గూండాలు లాక్కెళ్లారు. చదవండి: kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు -
ఫేస్బుక్, వాట్సాప్ డౌన్.. జుకర్‌బర్గ్ పుట్టి ముంచిన ఆ ఒక్కడు!
WhatsApp, Facebook, Instagram restore services after 6-hours of outage: ఫేస్బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్బుక్ దాని అనుబంధ యాప్ సర్వీస్‌లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్పై పడగా.. ట్విటర్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి. ఏది ఏమైనా ఈ బ్రేక్‌డౌన్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్, దాని అనుబంధ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్‌బర్గ్ భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది. సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్‌బర్గ్. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్. అతని వల్లే.. ఇక ఫేస్బుక్ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్లో సరదా మీమ్స్‌తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగెటివ్’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్).. ఇంటర్నెట్కు ఫోన్ బుక్ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్ గేట్‌వే ప్రోటోకాల్)ను ఓ ఉద్యోగి మ్యానువల్‌గా అప్లోడ్ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్బుక్ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్బుక్, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీస్ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్‌ని అనుమతిస్తుంది. Seeing @Facebook's BGP announcements getting published again. Likely means service is on a path to getting restored. — Matthew Prince 🌥 (@eastdakota) October 4, 2021 చదవండి: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ చదవండి: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం -
లవర్స్‌కు షాకిచ్చిన ఇందిరా పార్క్: వెనక్కి తగ్గిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రముఖ పార్క్‌లోకి పెళ్లికాని జంటలను నిషేధించే ఉత్తర్వుల బోర్డు కలకలం సృష్టించింది. ‘‘పెళ్లి కాని జంటలకు పార్కులోనికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఇందిరా పార్కు యాజమాన్యం ఒక బోర్డు పెట్టింది. పార్క్ మేనేజ్మెంట్ కొత్త మోరల్ పోలీసింగ్ వ్యవహారం దుమారాన్ని రేపింది. పరోక్షంగా ప్రేమికులకు ప్రవేశం లేదన్నట్టు హుకుం జారీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తాలిబన్లు ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే వున్నారు, కావాలంటే వెళ్లి చూడండి హైదరాబాద్ ఇందిరాపార్క్‌కి అంటూ ఈ నిర్ణయంపై మహిళా ఉద్యమకారులు మండిపడ్డారు. పబ్లిక్ పార్క్ అనేది లింగభేదం లేని జంటలతో సహా చట్టాన్ని గౌరవించే పౌరులందరికీ అనుమతినిచ్చే ప్రదేశం. పార్క్‌లోకి ప్రవేశానికి 'వివాహం' ఎలా ప్రామాణికంగా ఉంటుందంటూ యాక్టివిస్ట్ మీరా సంగమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ అంటే చాలా ఫ్యామస్. ఈ పార్క్‌ను సందర్శించే వారిలో పిల్లలు, ప్రేమికుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా మార్నింగ్ వాక్కు వచ్చే వారితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందులోనూ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యక అభివృద్ది కార్యక్రమాలతో మరింత సందడి నెలకొంది. అయితే తాజాగా ప్రేమ జంటలకు షాక్ ఇవ్వడంపై భారీ వ్యతిరేకత రావడంతో ఈ బోర్డును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మరో బోర్డు తగిలించింది. అయితే పార్క్ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తూ తగిన శ్రద్ధ వహించాలని కోరినట్టు తెలిపింది. మరోవైపు ఇందిరా పార్కుతోపాటు, నగరంలోని ఇతర ప్రముఖ పార్కుల్లో కూడా ఇలాంటి ఆదేశాలే అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడవం గమనార్హం. చదవండి : Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి New low & new level of moral policing by Indira Park Mgmt in Hyd! A public park is an open space for all law abiding citizens, including consenting couples across genders. How can 'marriage' be criteria for entry! @GHMCOnline & @GadwalvijayaTRS this is clearly unconstitutional. pic.twitter.com/4rNWo2RHZE — Meera Sanghamitra (@meeracomposes) August 26, 2021 -
‘అత్యాచారం జరిగింది 11 నిమిషాలే.. అందుకే శిక్ష తగ్గిస్తున్నాం’
స్విట్జర్లాండ్/బెర్న్: అత్యాచారం.. ఓ బాలిక, యువతి, మహిళ జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇలాంటి దారుణ నేరాల్లో న్యాయం జరగడం అటుంచి.. సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని చిత్రవధ చేస్తుంది. వారి పట్ల ఏమాత్రం జాలి, సానుభూతి చూపరు. పైగా నేరం చేసినవాడిని వదిలేసి.. బాధితురాలి ప్రవర్తననే తప్పు పడతారు. వీటన్నింటిని తట్టుకుని కోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగకపోతే.. ఇక చట్టాలు, రాజ్యాంగాలు ఎందుకున్నట్లు. సరిగా ఇలానే ప్రశ్నిస్తున్నారు స్విట్జర్లాండ్ వాసులు. అత్యాచారం వంటి దారుణమైన నేరానికి సంబంధించి మీరు ఇలాంటి మతి లేని తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు. ఆ వివరాలు.. ఓ అత్యాచారం కేసులో స్విట్జర్లాండ్ బాసెల్ కోర్టు వివాదాస్పద తీర్పు వెల్లడించింది. ‘‘నిందితుడు కేవలం 11 నిమిషాల పాటే అత్యాచారం చేశాడు.. బాధితురాలిని పెద్దగా గాయపర్చలేదు. కనుక అతడికి విధించిన శిక్షను తగ్గిస్తున్నాం’’ అని తెలిపింది. ఈ తీర్పు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసెల్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో దుమ్మెత్తి పోస్తున్నారు. కేసేంటంటే.. స్విట్జర్లాండ్ వాయువ్య ప్రాంతంలోని ఓ నగరానికి చెందిన బాధితురాలిపై గతేడాది ఫిబ్రవరిలో పోర్చుగల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆమె ప్లాట్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలో మరో 17 ఏళ్ల మైనర్ అతడికి సహకరించాడు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరపరిచారు. ఈ నేరానికి సంబంధించి కోర్టు ఆగస్టు, 2020లో శిక్ష విధించింది. 31 ఏళ్ల వ్యక్తికి 4 సంవత్సరాల 3నెలల శిక్ష విధించింది. మైనర్ని జువైనల్ హోంకి తరలించింది. వివాదాస్పద నిర్ణయం.. తాజాగా కోర్టు గతంలో నిందితుడికి తాను విధించిన శిక్షను తగ్గించింది. 51 నెలల జైలు శిక్షను 36 నెలలకు తగ్గించింది. బాసెల్ కోర్టు ప్రెసిడెంట్ కోర్ట్ ప్రెసిడెంట్ జస్టిస్ లిసెలెట్ హెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విస్ న్యూస్ వెబ్సైట్ 20 మినిట్స్ ప్రకారం నిందితుడిని ఆగస్టు 11 న విడుదల చేయవచ్చని తెలిపింది. ఇక శిక్ష కాలాన్ని తగ్గిస్తూ జస్టిస్ హెంజ్ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బాధితురాలు కొన్ని తప్పుడు సంకేతాలు పంపి.. నిప్పు రాజేసింది.. పైగా అత్యాచారం జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్‌క్లబ్‌క్ వెళ్లి ఎంజాయ్ చేసింది.. ఇవన్ని నిందితుడిపై ప్రభావం చూపాయి’’ అన్నారు జస్టిస్ హెంజ్. ఈ కేసులో నిందితుడిది మధ్యస్థమైన నేరంగా పేర్కొన్నారు. పైగా అత్యాచారం కూడా 11 నిమిషాలపాటే సాగిందని.. ఈ ఘటనలో బాధితురాలికి ఎక్కువ గాయాలు కాలేదని.. అందుకే అతడికి శిక్షను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాసెల్ నగరవ్యాప్తంగా నిరసన తెలపుతున్నారు జనాలు. ఈ సదర్భంగా పలువురు నెటిజనులు జస్టిస్ హెంజ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘11 నిమిషాల దారుణ చర్య కొన్ని జనరేషన్ల వరకు వెంటాడుతూనే ఉంటుంది.. ఈ దారుణ అనుభవం నుంచి బయటపడటానికి ఆమెకు ఓ జీవితకాలం పడుతుంది. అంటే 11 నిమిషాల వ్యవధి ఆమె జీవితకాలంతో సమానం. కోర్టుకు ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు. నైట్‌క్లబ్‌కు వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత అంశం.. దాన్ని కూడా తప్పంటే... అసలు ఆడవారు ఈ భూమి మీద పుట్టడం కూడా నేరమే అవుతుంది కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "Rape ONLY lasted for 11 minutes” 11 minutes of rape feels like 16hrs and the effects/trauma last for generations. https://t.co/DRKgjTTqfA — daktari Linnie🇸🇪 🇰🇪 (@ElenaNjeru) August 9, 2021 -
పేదల ఇంటిపై టీడీపీ కడుపుమంట
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడుపుమంటతో అడ్డుతగులుతున్నారు. పేదల ఇంటి శంకుస్థాపన చేయడానికి వచ్చిన నేతలను, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను అడ్డుకుంటూ దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరొస్తోందన్న అక్కసుతో జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. రామభద్రపురం/పెదకూరపాడు: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువలో భూమిపూజకు వెళ్తున్న బొబ్బిలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు వాహనాన్ని గ్రామ పొలిమేరల్లో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదంటూ ఘెరావ్ చేశారు. సమస్య ఏదైనా ఉంటే గ్రామ రామమందిరంలో కూర్చొని మాట్లాడుకుందామని, అర్హులకు న్యాయం చేద్దామని ఆయన నచ్చజెప్పినా వినలేదు. స్థలం రాని వారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో మంజూరవుతుందని ఎమ్మెల్యే వివరించినా చెవికెక్కించుకోలేదు. టీడీపీ నేతలు గంటసేపు పెద్దగా కేకలు వేస్తూ రణరంగం సృష్టించారు. సీఐ స్పందించి ఎమ్మెల్యేను పోలీస్ వాహనంలో ఎక్కించి శంకుస్థాపన స్థలానికి తీసుకెళ్లే క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వాహనంపై రాళ్లు రువ్వడంతోపాటు పోలీసులపైనా రాళ్ల దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అల్లరిమూకలను పోలీసులు చెదరగొట్టారు. అప్పటికీ ఆగని కొంతమంది టీడీపీ కార్యకర్తలు శంకుస్థాపన కార్యక్రమం వద్ద టెంట్లు పీకేసి.. కుర్చీలు విసిరేశారు. మైక్సెట్లు, సౌండ్ బాక్సులను తన్నేశారు. టీడీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎమ్మెల్యే మాత్రం శంకుస్థాపన పూర్తిచేసి వెనుదిరిగారు. కాగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సర్పంచ్ నాగేశ్వరరావుపై దాడి గుంటూరు జిల్లా కంభంపాడులో వైఎస్సార్ జగనన్న కాలనీకి మౌలిక వసతులు కల్పించేందుకు శనివారం విద్యుత్, వాటర్ పైపులైన్ పనులు చేపట్టారు. టీడీపీ కార్యకర్త దుప్పటి లక్ష్మణ్ పొలం నుంచి విద్యుత్, వాటర్ పైపులైన్లు వేస్తుండగా అడ్డగించారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తుంటే అడ్డుకోవడం తగదని సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు హితవు పలికారు. దీంతో నాగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు దుప్పటి లక్ష్మణ్, శ్రీనివాసరావు, తిరుపతిరావు, నరసింహరావు, బాలకృష్ణ, వెంకటకృష్ణ, హరిబాబు, వెంకట్రావు దాడి చేశారు. నాగేశ్వరరావుకు రక్తగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో ఆరుగురిని కోర్టులో హాజర్చగా, ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ గుంజి తిరుమలరావు తెలిపారు. -
ఓటేయలేదుగా ఊరు విడిచి పోండి: ఓ నాయకుడి దౌర్జన్యం
హుబ్లీ: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఓ వ్యక్తి సదరు గ్రామానికి చెందిన వారిని గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశాడు. హుబ్లీ తాలూకా తిమ్మసాగర అంచటకేరి గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప తమను ఊరు విడిచి వెళ్లాలని రోజూ వేధిస్తున్నాడని ఆ గ్రామ ప్రముఖులు మంజునాథ్ తదితరులు మీడియా ఎదుట వాపోయారు. ప్రభుత్వం స్థలంలో వీరు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. దివంగత శివళ్లి మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ క్రమంలోనే వీరికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన మరణాంతరం పరిస్థితి మారిపోయింది. గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప, మల్లవ్వ జంబాళ మాకు ఓటు వేయలేదంటూ నిత్యం వేధిస్తున్నారని మేము ఎక్కడి వెళ్లాలని బాధితులు వాపోయారు. చదవండి: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం -
కొటియాలో ఒడిశా దౌర్జన్యకాండ..
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసులు, నేతలు పేట్రేగిపోయారు. ఏపీలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికలకు వస్తున్న గిరిజనులను అడ్డుకుని వారిపై దౌర్జన్యానికి దిగారు. వారు వెళ్లే దారిలో అడ్డంగా బారికేడ్లు, గేట్లు పెట్టారు. కోవిడ్‌ను సాకుగా చూపుతూ కోరాపుట్ జిల్లా కలెక్టర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు, పోలీసులు ఆ గ్రామాల్లో మోహరించి గిరిజనులను అడుగడుగునా అడ్డుకున్నారు. ఆంధ్రాలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులపై గిరిజనం తిరగబడ్డారు. తాము ప్రతిసారీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని, ఇప్పుడే ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. ఆంధ్రా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తోందని.. తాము ఆంధ్రాలోనే ఉంటామని నినదించారు. దారికి అడ్డంగా నిలిచిన ఒడిశా పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులను తోసుకుంటూ ఓటేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనుల మధ్య జరిగిన తోపులాటలో మహిళా గిరిజన ఓటర్లు రోడ్డుపై పడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. అయినప్పటికీ పట్టుదలతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లారు. పట్టుచెన్నేరు, పగులుచెన్నేరుల్లో రోడ్డుకు అడ్డుగా ఒడిశా అధికారులు వేసిన గేట్లను తోసేసి తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విరుచుకుపడ్డ ఐటీడీఏ పీవో కొటియా గ్రామాలకు వెళ్తున్న గిరిజన సమీకృతాభి వృద్ధిసంస్థ (ఐటీడీఏ) పీవో ఆర్.కూర్మనాథ్‌ను ధూళిభద్ర, ఎగువశెంబి గ్రామాల సమీపంలో ఒడి శా అధికారులు అడ్డుకున్నారు. దీంతో పీవోకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించే హక్కు మీకెక్కడదని. సుప్రీంకోర్టు స్టేటస్కో విధించిన అంశాన్ని ఆయన వారికి గుర్తుచేశారు. అడ్డంగా వేసిన బారికేడ్లను ఆయనే తోసేసి ముందుకు కదిలారు. ఆ గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. దీంతో ధూళిభద్ర ప్రజలు కాలిబాటన, ఎగువశెంబి ప్రజలు అప్పటికే ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా నేరెళ్లవలస పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఒడిశా అధికారులు చల్లగా జారుకున్నారు. విజయనగరం జిల్లా సబ్ కలెక్టర్ విధేహ్ ఖరే, ఎస్పీ రాజకుమారి, తదితరులు నేరెళ్లవలస, ధూళిభద్ర గ్రామాల్లో పర్యటించారు. చదవండి: పరిషత్ ఎన్నికలు: పోలింగ్ ప్రశాంతం.. రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: వాలంటీర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్లో వాలంటీర్ హరికుమార్ తనకు సహకరించలేదనే కారణంతో జేసీ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను ఆయన అనుచరులు లాక్కెళ్లారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకున్నవారు తనను ప్రశ్నించొద్దంటూ జేసీ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ హరికుమార్ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 384, 506,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: కుప్పం టీడీపీలో ముసలం.. ‘పాచిపోయిన లడ్డూను తింటున్నారా..’ -
వివాదంలో ఫ్లిప్‌కార్ట్ : క్షమాపణలు
సాక్షి, ముంబై: ఫెస్టివ్ సీజన్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో వినియోగదారుల ముందుకొచ్చిన ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పై పెద్దదుమారం రేగుతోంది. అయితే ఆ తరువాత సంస్థ తరపున జరిగిన తీవ్ర తప్పిదానికి ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ చేసింది ఘోర తప్పిదమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు) వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్ సర్వీస్‌లు నాగాలాండ్ రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో కొహిమాకు చెందిన ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇంకా స్వాతంత్ర్యం లభించలేదా.. తమ రాష్ట్రంలో ఎందుకు డెలివరీ చేయడం లేదని ప్రశ్నించారు. ఫ్లిప్‌కార్ట్ అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీనికి ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి ఇచ్చిన సమాధానమే దుమారానికి కారణమైంది. ఫ్లిప్‌కార్ట్‌పై ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు, కానీ తమ విక్రయదారులు ఇండియా బయట తమ సేవలను అందించలేరని పేర్కొన్నారు. ఈ సమాధానానికి షాకైన సదరు వినియోగదారులు తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌పై నెటిజన్లు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత ఈ జవాబును తొలగించింప్పటికీ చాలామంది దీని స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. వావ్..నాగాలాండ్ కు ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్ర్యం ఇచ్చేసిందని ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నాగాలాండ్ భవిష్యత్తును ముందే ఊహించారంటూ ప్రఖ్యాత నాగా సంగీతకారుడు అలోబో చమత్కరించారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన ఈశాన్యరాష్ట్రం గురించి ఎంత తక్కువ మందికి తెలుసు అనేవిషయాన్ని హైలైట్ చేస్తోంది.. నాగాలాండ్ ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. దీనికి విద్యావ్యవస్థ పూర్తి బాధ్యత వహించాలని తాను భావిస్తున్నానన్నారు. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్‌తో కాకపోయినా, తనకూ ఇలాంటి అనుభవం ఎదురైదంటూ నాగాలాండ్ బోర్డర్స్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ రూపిన్ శర్మ పేర్కొన్నారు. నాగాలాండ్ ఇండియాలో భాగమన్నారు. ఈ వివాదంపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ యూజర్లను క్షమాపణలు కోరింది. ఇలా జరిగినందుకు విచారిస్తున్నామని, సాంకేతికంగా జరిగిన పొరపాటని పేర్కొంది. నాగాలాండ్‌లోనూ ఫ్లిప్‌కార్ట్ సేవలు అందిస్తుందని వివరణ ఇచ్చింది. To those who were questioning me ! Here is the @Flipkart reply ! Don’t shoot the messenger 💪 Nagaland and NE is India even if your heart may not think so pic.twitter.com/qocNMXqH3N — Pradyot_Tripura (@PradyotManikya) October 8, 2020 Although not with Flipkart, Even I had this experience once. Nagaland is India #Flipkart . pic.twitter.com/WDS7kodF94 — Rupin Sharma IPS (@rupin1992) October 8, 2020 -
కుప్పంలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శాంతిపురంలో ఉపాధి హామీ ఏపిఓ అశోక్ రెడ్డిని చితకబాదారు. ఆఫీసులోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఎంపిడిఓ చెన్నయ్య మీద చంద్రబాబు పిఏ మనోహర్ చేయి చేసుకున్నాడు. టీడీపీ నేతల తీరుపై ఎంపిడిఓ చెన్నయ్య, ఏపీఓ అశోక్ రెడ్డిలు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనలో 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక టీడీపీ నేతల దాడిని వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ భరత్ తీవ్రంగా ఖండించారు. (రఘురామరాజు సెక్యూరిటీ తొలగించండి) -
యువతరం కదిలింది
మొన్న హాంకాంగ్‌నూ, నిన్న అమెరికానూ తాకిన యువతరం ఆగ్రహజ్వాలలు ఇప్పుడు రెండు ఖండాల్లోని రెండు దేశాలను చుట్టుముట్టాయి. ఆగ్నేయాసియాలోని థాయ్‌లాండ్, తూర్పు యూరప్ లోని బెలారస్‌లు తాజాగా ఉద్యమ వేదికలయ్యాయి. రెండుచోట్లా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించా లన్నదే ఉద్యమకారుల ప్రధాన డిమాండు. థాయ్‌లాండ్‌లో సైనిక తిరుగుబాట్లు కొత్త కాదు. అక్కడ 2014లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దేశ చరిత్రలో అది పన్నెండో సైనిక తిరుగుబాటు. ప్రతిసారీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే అధికారాన్ని స్వాధీనం చేసుకున్నా మని సైనికాధికారులు చెప్పడం రివాజు. అలాగే అనంతరకాలంలో ఉద్యమాలు చెలరేగడం, ప్రజా స్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడటం కూడా తరచు జరుగుతున్నదే. ఈ క్రమంలో ఎక్కడా రాజరి కాన్ని ప్రశ్నించడం కనబడదు. రాజును విమర్శించినా, రాజరికాన్ని ప్రశ్నించినా ఆ దేశంలో మూడు నుంచి పదిహేనేళ్ల వరకూ శిక్ష పడుతుంది. ఆ శిక్ష మాటెలావున్నా ఛాందసవాద దేశంగా ముద్రపడిన థాయ్‌లాండ్‌లో జనం రాజుగారి జోలికి వెళ్లిన సందర్భాలు పెద్దగా లేవు. కానీ ఈసారి వరస మారింది. దేశంలో ఏం జరుగుతున్నా పట్టనట్టు వుంటున్న రాజరికాన్ని ప్రక్షాళన చేయాలని, రాజ్యాం గాన్ని పూర్తిగా మార్చాలని కోరుతూ ఉద్యమం మొదలైంది. ఇది అనుకోని పరిణామం. సైనిక పాల కులు కూడా దీన్ని ఊహించలేదంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలు మొదలుకొని కళాశాలలు, విశ్వ విద్యాలయాల వరకూ అన్నీ ఉద్యమకేంద్రాలయ్యాయి. దాంతో అణచివేత మొదలైంది. నియంతలు అధికారదాహంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం మొదలయ్యాక వారిపై జనంలో ఏవగింపు ప్రారంభమవుతుంది. ఆ పాలకులు తమకున్న పరిమితులేమిటో సకాలంలో గ్రహంచి జాగ్తత్తగా వుంటే పేచీ వుండదు. కానీ విచక్షణ కోల్పోయినవారికి పరిమితులు తెలిసే అవ కాశం లేదు. కనుకనే ఉద్యమాలు నానాటికీ తీవ్రమవుతాయి. ప్రస్తుతం ఉద్యమిస్తున్నవారు రాజరికం కూలిపోవాలని కోరుకోవడం లేదు. దేశం పూర్తి స్థాయి రిపబ్లిక్‌గా అవతరించాలని వాంఛించడం లేదు. రాజరికం ఉండాలంటున్నారు. కానీ అది ప్రజాస్వామ్య వ్యవస్థకు లోబడి పనిచేయాలంటు న్నారు. వారు పది డిమాండ్లు పాలకుల ముందుంచారు. రాజరికాన్ని విమర్శిస్తే జైలుకుపంపే నిబం ధన తొలగించాలంటున్నారు. రాజరికాన్ని ఘనంగా, ఏకపక్షంగా కీర్తించే సిలబస్ ఉండరాదంటు న్నారు. మారిన ప్రపంచంలో తమకూ మెరుగైన అవకాశాలు లభించేలా ఎదగాలని యువతరం కోరు కుంటోంది. అందుకు తగ్గ సిలబస్ అవసరమంటోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కావాలంటోంది. ఇప్ప టికైతే ఉద్యమం ప్రశాంతంగానే సాగుతోంది. ఉద్యమకారులు కూడా కొత్త కొత్త పోకడలతో దాన్ని సాగిస్తున్నారు. వాట్సాప్ మొదలుకొని ఫ్లాష్‌మాబ్ వరకూ అన్ని రకాల వేదికలను నిరసనలకు ఉపయోగిస్తున్నారు. రోజూ ఉదయమే పాఠశాలల్లో జాతీయగీతాలాపన సాగే సమయంలో పిల్లలు తిరుగుబాటుకు సూచనగా చేతులు పైకి ఎత్తి, మూడువేళ్లతో సెల్యూట్ చేయడం కొనసాగుతోంది. ఈ ఉద్యమం నిరుడు డిసెంబర్లో మొదలైంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడిన తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో నిలిచిపోయింది. అయితే మొన్న జూన్‌లో కంబోడియాలో వుంటున్న థాయ్ లాండ్ మానవహక్కుల కార్యకర్త ఒకరిని సాయుధులు అపహరించడంతో ఉద్యమం మళ్లీ ప్రారం భమైంది. ఆ అపహరణ వెనక థాయ్ సైన్యం హస్తం వుందన్నది ఉద్యమకారుల ఆరోపణ. ఆగ్నేయా సియాలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న థాయ్‌లాండ్ ఇప్పటికే నిరుద్యోగం, అధికధరలు వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఇంచుమించు ఇవే కారణాలతో తూర్పు యూరప్‌లోని బెలారస్లో ఉద్యమం రాజుకుంది. అక్కడ పేరుకు ప్రజాస్వామ్యం వుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి స్వాతంత్య్రం లభించాక 1994లో జరిగిన తొలి అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకషెంకో అధికార పీఠాన్ని అధిరోహించారు. అప్పటినుంచీ ఆయన ఆ పీఠాన్ని దిగలేదు. 26 ఏళ్లుగా ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఆయనే అధ్యక్షుడు! దీనిపై ఎప్పటికప్పుడు విమర్శలొస్తున్నా అవి ఉద్యమ రూపం తీసుకోలేదు. ఒకపక్క క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, మరోపక్క పెద్దన్నలా వ్యవహరిస్తున్న పొరుగు దేశం రష్యాను ఆయన నిలువరించలేకపోవడం జనంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. అందుకే ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ముందు జరిగిన సర్వేలో ఆయనకు స్వల్ప సంఖ్యలో మద్దతుందని తేలింది. తీరా ఫలితాలు అందుకు భిన్నంగా రావడమే ప్రస్తుత ఉద్యమానికి మూలం. లుకషెంకో ఎక్కడికెళ్లినా నిరసనలు ఎదురుకావడం, రాజీనామా చేయాలంటూ జనం నినదించడం విశేషం. ఆఖరికి ప్రభుత్వ నిర్వహణలోని చానెల్లో ఉదయం ప్రసారాల సమయంలో సిబ్బంది ఉద్యమానికి మద్దతుగా నిష్క్రమించడంతో కొంతసేపు సంగీతంతో సరిపెట్టాల్సివచ్చింది. విదేశాంగ శాఖ కార్యాలయంలోని ఒక విభాగం అధిపతి, మరొక ఉద్యోగి ధర్నాకు దిగారు. వేలాదిమందిని జైళ్లకు పంపడం, విచక్షణారహితంగా బలప్రయోగం చేయడం ప్రజలకు ఆగ్రహం కలిగిస్తోంది. యూ ట్యూబ్ ద్వారా సుపరిచితుడైన సెర్గీతిఖనోవ్స్కీ లుకషెంకోకు వ్యతిరేకంగా పోటీచేస్తానని ప్రకటిం చిన వెంటనే అధికారులు తప్పుడు ఆరోపణలతో అతన్ని నిర్బంధించారు. వెంటనే అతని భార్య స్వెతలానా బరిలో నిలబడతానని ప్రకటించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో విజేత ఆమేనని అత్యధి కులు విశ్వసిస్తున్నారు. సాధారణ గృహిణిగా వున్న ఆమె ఇప్పుడు అమాంతం ఉద్యమకారిణిగా ఎదిగారు. అయితే బెలారస్‌లోని ఉద్యమంపై లుకషెంకోను మించి పొరుగునున్న రష్యా అధినేత పుతిన్‌కు ఆందోళన వుంది. ఈ ఉద్యమం మరింత ఉధృతమై, విజయం సాధిస్తే రష్యాలో కూడా రాజుకుంటుందని ఆయన భయం. మొత్తానికి జనం సహనాన్ని పరీక్షిస్తే, ఇష్టానుసారం పాలిస్తే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని, పదవులకు ఎసరు తెస్తుందని థాయ్‌లాండ్, బెలారస్‌లు నిరూపిస్తున్నాయి. -
2019లో ప్రపంచవ్యాప్తంగా పౌరుల ఆగ్రహం
-
అనంతపురంలో టీడీపీ నాయకులు దౌర్జనం
-
నిమ్స్ ఆస్పత్రిలో రాజకీయ నేత అనుచరుల వీరంగం
-
మీడియాపై గల్లా జయదేవ్ అనుచరులు దౌర్జన్యం
-
టీడీపీ నేతల దౌర్జన్యంపై ఆగ్రహం
సాక్షి, సీఎస్‌పురం (ప్రకాశం): మండల కేంద్రం సీఎస్‌పురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ తోబుట్టువుకు పుట్టింటి కానుకగా మండలంలోని మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు రోజులుగా సీఎస్‌పురం పంచాయతీలోని గ్రామాల్లో చీరలు పంపిణీ చేస్తున్నారు. సీఎస్‌పురంలోని ఏనిమిట్ట వీధిలో చీరలు పంపిణీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బొబ్బూరి రమేష్ శుక్రవారం రాత్రి దౌర్జన్యం చేసి చీరల పంపిణీని అడ్డుకున్నాడు. యువకులను బూతులు తిట్టడమేగాక అక్కడే ఉన్న మాజీ ఎంపీపీ భువనగిరి వెంకటయ్య పట్ల దురుసుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి వెంకటయ్యపై టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారని ప్రచారం సాగడంతో మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం ఉదయం సీఎస్‌పురం చేరారు. సీఎస్‌పురం, పామూరు ఎస్ఐలు శివనాంచారయ్య, రాజ్‌కుమార్‌లు అప్రమత్తమై గుమిగూడిన ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇరుపార్టీల నాయకులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. భువనగిరి వెంకటయ్యకు బొబ్బూరి రమేష్ క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
కర్నూలు జిల్లాలో ఆటో డ్రైవర్లపై రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
విశాఖ జిల్లా నర్సీపట్నంలో దారుణం
-
గుంతకల్లులో టీడీపీ నేత మల్లికార్జున చౌదరి అరాచకం
-
కర్నూలు జిల్లలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
దొడ్డిపట్లలో దళితులపై పోలీసులు అమానుషం
-
తాడిపత్రిలో జేసీ వర్గీయుల దౌర్జన్యం
-
బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల దౌర్జన్యం
-
వృద్ధురాలిపై సీఐ దౌర్జన్యం
కడప అర్బన్ :పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని, ప్రజలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. అయితే కొందరు సిబ్బంది తమ తీరును ఏ మాత్రం మార్చుకోనట్లు కనబడుతోంది. కడప చిన్నచౌకు పోలీసుస్టేషన్ సీఐగా పనిచేస్తున్న రామకృష్ణ వైఖరి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఓ మైనర్ బాలిక వ్యవహారంలో కూడా సీఐ రామకృష్ణ తమదైన శైలిలో వ్యవహరించడం, మీడియాలో వార్తలకెక్కడం అధికారులనుంచి అక్షింతలు పడడం...తీరు మార్చుకోవాలని హెచ్చరించడం తెలిసిందే.తాజాగా శుక్రవారం జరిగిన సంఘటన ఆయన వ్యవహారశైలికి అద్దం పట్టినట్లుగా తెలుస్తోంది. ♦ ఈ సంఘటనపై బాధితుల కథనం మేరకు... కడప నగరం ప్రకాశ్‌నగర్‌కు చెందిన గౌరమ్మ అనే వృద్ధురాలిపై, కుటుంబ సభ్యులపై స్థల వ్యవహారంలో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థలం వ్యవహారం విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా తెలిసినప్పటికీ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని తన చాంబర్లో కూర్చోబెట్టుకుని విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వృద్ధురాలు గౌరమ్మ ప్రకాశ్‌నగర్‌లో నివసిస్తుండగా, ఆమెను, కుటుంబ సభ్యులను సీఐ రామకృష్ణ పిలిపించారు. వచ్చిన వెంటనే ఎలాంటి వివరాలు అడగకుండా వారిని కూర్చోబెట్టకుండా మాట్లాడటంతో అభ్యంతరం తెలిపారు. వృద్ధురాలిని, ఓ మహిళను దుర్బాషలాడి బయటికి వెళ్లిపోవాలని తిట్ల పురాణం అందుకున్నారు. వెంటనే ఆవేదనతో తమను సివిల్ పంచాయతీలో పిలిపించడమే తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గౌరమ్మ పెద్దకుమారుడు రమేష్ సీఐ వ్యవహార తీరును ప్రశ్నించగా, అతన్ని కొట్టి చొక్కాను చించి వేసి బయటికి నెట్టివేశారు. దీంతో వారు పూర్తి ఆవేదన చెందారు. సామాన్య ప్రజానీకం వస్తే న్యాయం జరగదా? అని ప్రశ్నించారు. సీఐ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. తమకు ఏమైనా జరిగితే సీఐయే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ సంఘటన వ్యవహారం కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా దృష్టికి వెళ్లింది. వెంటనే కడప నగరంలోని సీఐలు, ఎస్ఐలు తమ సిబ్బందితో వెళ్లి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విధులను నిర్వర్తించారు. ఈ సందర్బంగా బాధితులు గౌరమ్మ, బంధువులు మాట్లాడుతూ సీఐ రామకృష్ణ తమ పట్ల దురుసుగా వ్యవహరించారని, స్థలం వ్యవహారంలో ఏదైనా తప్పు ఉంటే కోర్టులో తేల్చుకుంటామని, మాట్లాడే విధానం తెలియకుండా దుర్బాషలాడటం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకుపోరాటం చేస్తామన్నారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా బాధితులతో, సీఐతో వేర్వేరుగా మాట్లాడి పరిస్థితిని సర్దుమనిపించారు. ఈ సంఘటనపై చిన్నచౌకు సీఐ రామకృష్ణను వివరణ కోరగా తాను వృద్ధురాలినిగానీ, మరెవరినీ గానీ దుర్బాషలాడలేదన్నారు. -
పార్క్‌లో వికృతచర్య.. నెటిజన్లు ఫైర్
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని ఓ పార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వికృతచర్యకు పాల్పడ్డారు. ఏ మాత్రం జాలి లేకుండా మూర్ఖంగా, అనాగరికంగా వ్యవహరించారు. ఓ కోవాలా(ఎలుగు బంటి రూపంలో ఉండే చిన్న ప్రాణి. ఉడుతలకుండే జుట్టు మాదిరిగా వీటి జుట్టు ఉంటుంది)ని చంపడమే కాకుండా కర్కశంగా దానిని ఓ పోల్‌కు శీలలతో బిగించారు. దీనిపై ఆస్ట్రేలియాలోని సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా కోవాలా రెస్క్యూ క్వీన్‌లాండ్(కేఆర్క్యూ) దీనిపై తీవ్రంగా స్పందిస్తోంది. బ్రిస్బేన్‌కు 175 కిలోమీటర్ల దూరంలోని జింపీకి సమీపంలో బ్రూలూ పార్క్ లుకౌట్ అనే పార్క్ ఉంది. అక్కడో పిక్నిక్ సెంటర్ కూడా కలదు. అయితే, అక్కడి చెట్లు, స్తంబాలను కోవాలు సరదాగా అప్పుడప్పుడు ఎక్కుతుంటాయి. అయితే, తొలుత అంతా అది పోల్‌పై ఎక్కిందని అనుకున్నారు. కానీ, స్పష్టంగా పరిశీలించగా దానిని చంపి పోల్‌కు స్క్రూలతో బిగించి పెట్టారని గుర్తించారు. దీనిపై కేఆర్క్యూ అధికారులు స్పందిస్తూ 'ఇప్పటి వరకు తుపాకులను ఉపయోగించి కోవాలాను కొంతమంది దుండగులు చంపడం చూశాం. కానీ, ఈ కోవాలాను చంపిన వారు అసలు మనుషులే కాదు. ఇలా జరగడం తొలిసారి. సమాజం ఎంత చెడుగా మారుతుందో ఈ సంఘటన పెద్ద ఉదాహరణ. ఈ సంఘటన చూస్తేనే మనసు చివుక్కుమంటోంది' అంటూ వ్యాఖ్యానించారు. కాగా, దానిని అంతక్రూరంగా చంపినవారిని అరెస్టు చేసి అంతకంటే క్రూరమైన శిక్ష వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోవాలాలకు గత కొంతకాలంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జంతువులు ఆస్ట్రేలియాలో కంగారుల మాదిరిగానే ప్రత్యేకం. -
సత్తెనపల్లిలో పోలీసుల దౌర్జన్యం
-
చిత్తూరులో ఆధికార పార్టీ నేతల ఆగడాలు
-
ఎమ్పీడీఓపై టీడీపీ నేతల దౌర్జన్యం
-
ప్రతిపక్షంపై ఆగని అధికార పార్టీ దౌర్జన్యం
-
తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం..
-
దాడి చేసి సారీ చేబితే సరిపోతుందా
-
గుంటూరు జిల్లాలో కల్తీ కలకలం
-
ఏఈఓపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
డీ.హీరేహాళ్ : మండలకేంద్రంలో పప్పుశనగ పంపిణీ సందర్భంగా ఏఈఓ గోపాల్‌పై టీడీపీ నాయకుడు శనివారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. పప్పుశనగ టోకన్లకోసం మాజీ జెడ్పీటీసీ శ్రీరామజ్యోతి భర్త శ్రీరాములు తన విధులకు ఆటంకం కలిగించడమే కాక దుర్భాషలాడినట్లు ఏఈఓ గోపాల్ తెలిపారు. టీడీపీ నాయకుడికి ఎలాంటి నల్లరేగడి భూమి లేకున్నా పప్పుశనగ కొనుగోలుకు వచ్చాడని, అయితే ఏఓతో అనుమతి తీసుకోవాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. ‘నువ్వు అధికారివి కాదా, నీకు పని చేయడం రాదా’ అంటూ నానా హంగామా చేసినట్లు ఏఈఓ వాపోయారు. చివరికి నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఏఈఓ డీ.హీరేహాళ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
'కన్య'గా ఉంటేనే స్కాలర్షిప్ ఇస్తారట!
పద్దెనిమిదేళ్ల థుబెలిల్.. దక్షిణాఫ్రికా క్వాజులూ నాటల్ ప్రావిన్స్‌లో ఓ మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థిని. త్వరలోనే ప్రిటోరియా వెళ్లి అక్కడి యూనివర్సిటీలో చదువాలనుకుంటోంది. కానీ, థుబె (ఆమె స్నేహితులు ఇలాగే పిలుస్తారు) కుటుంబం నిరుపేదది. ఆమె కాలేజీ చదువులకు ఫీజులు చెల్లించే స్థోమత ఆమె కుటుంబానికి లేదు. చదువుకోవడానికి ఆమెకు ఉన్న ఏకైక మార్గం స్థానిక ఉథుకెలా మున్సిపాలిటీ అందించే ప్రభుత్వ స్కాలర్షిప్లు. క్వాజులు నాటల్ ప్రావిన్స్ లోని 11 జిల్లాల్లో విద్యార్థినులకు ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ అందిస్తోంది. అయితే, ఈ స్కాలర్షిప్ పొందడానికి విద్యార్థినుల ఏకైక అర్హత 'కన్యలు'గా (వర్జిన్స్) ఉండటం. 'అందుకే మేం అబ్బాయిలకు దూరంగా ఉంటున్నాం. మా లక్ష్యాలను సాధించాలనుకుంటున్నాం' అంటోంది థుబె. 'నాకు ఇప్పుడు 18 ఏళ్లు. పిల్లలు లేరు. ఈ ప్రపంచాన్ని గెలువాలంటే నేను తప్పకుండా కష్టపడి చదువాలి' అని చెప్తోంది ఆ యువతి. 'మెయిడెన్ బర్సరీ అవార్డ్' పేరిట ఇచ్చే ఈ స్కాలర్షిప్ కోసం ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో థుబె కన్యత్వ పరీక్షలకు హాజరవుతుంది. వాళ్ల కమ్యూనిటీలో ఓ మహిళా పెద్ద ఓ గడ్డి పరుపుపై పడుకోబెట్టి.. 'మానవ పరీక్ష' ద్వారా తను కన్యనా కాదా? అన్నది నిర్ధారిస్తుంది. ఈ ఉపకార వేతనం పొందడానికి కన్యగా ఉండటం తప్ప మరో మార్గమేది లేదని చెప్తోంది థుబె. ఈ పరీక్షలు దారుణం.. మానవత్వానికి మచ్చ! కన్యత్వ ఆధార స్కాలర్షిప్ విధానంపై దక్షిణాఫ్రికాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. హక్కుల సంఘాలు ఈ విధానాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. ఈ పరీక్షలు దారుణమని, మానవత్వానికి వ్యతిరేకమని మండిపడుతున్నాయి. ఈ స్కాలర్షిప్లు అనాది మూఢనమ్మకాలను కొనసాగించేవిధంగా ఉన్నాయి. కన్యత్వం ఆధారంగా కాకుండా ప్రతిభా, సామర్థ్యాల ఆధారంగా స్కాలర్షిప్ ఇవ్వాలి' అని లింగ సమానత్వ కమిషన్ చీఫ్ జువు బలోయి డిమాండ్ చేశారు. దక్షిణాఫ్రికా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఈ విధానంపై దేశ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ స్కాలర్షిప్ పథకం వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న ఉథుకెలా మేయర్ దుబు మజిబుకో మాత్రం ఈ విధానాన్ని నిర్ద్వంద్వంగా సమర్థించుకుంటున్నారు. 'విమర్శకులు సమస్యలపై విమర్శలు మాత్రమే చేస్తున్నారు. కానీ పరిష్కారాలు ఆలోచించడం లేదు. నేను టీనేజర్‌గా ఉన్నప్పుడే గర్భవతిని అయ్యాను. అప్పుడు నేను అనుభవించిన వేదన ఇప్పుడు బాలికలు అనుభవించకూడదని నేను భావిస్తున్నాను' అని ఆమె చెప్తున్నారు. 2012 గణాంకాల ప్రకారం క్వాజులు-నాటల్ ప్రావిన్స్ లో టీనేజ్ వయసులోనే గర్భవతులైన బాలికలు పెద్ద మొత్తంలో ఉన్నారు. 2012లో 15-19 ఏళ్ల మధ్య వయస్సున యువతులకు 26వేల మంది పిల్లలు పుట్టారు. ఉథుకెలా జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధి కూడా ప్రబలంగా ఉంది. ఈ నేపథ్యంలో బాలికలు లైంగిక దుశ్చర్యల బారినపడే అవకాశముందని, దీనిని నిరోధించేందుకే తాము ఈ పథకాన్ని తెచ్చామని మేయర్ మజిబుకో వివరణ ఇస్తున్నారు. 'బాలికలు చాలా దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నారు. పెద్ద వయసు వ్యక్తితో శృంగారాన్ని వారు నిరాకరించే పరిస్థితి లేదు. ఆ వ్యక్తిని కండోమ్ ధరించమని చెప్పే పరిస్థితిలో కూడా వాళ్లు ఉండరు. బాలికలు లైంగిక దశకు రాకముందే ఇది జరుగుతోంది' అని ఆమె చెప్పారు. -
పిజ్జా పుట్టిన ప్రాంతంలో పొల్యూషన్ రగడ..!
నేను యాంటీ పిజ్జా మేయర్‌ని అంటున్నాడు... ఇటలీ శాన్ విటలియానో లో సివిక్ లీడర్ గా మారిన ఓ డాక్టర్. ప్రజారోగ్యమే తనకు ముఖ్యమని, అందుకు తనవంతు ప్రయత్నాన్ని ప్రారంభించానని చెప్తున్నాడు. నీపోలిటన్ హింటర్ ల్యాండ్ లోని ఓ చిన్న పట్టణానికి మేయర్ అయిన ఆయన.. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. అందుకు టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్ కలిగించే కట్టెల పొయ్యిల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు కూడ జారీ చేశాడు. అయితే పిజ్జా పుట్టిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో కట్టెల పొయ్యిల నిషేధం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కట్టెల పొయ్యిలను వాడే కుటుంబాలు, పిజ్జాలు తయారు చేసే బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారస్తులు ఇప్పుడు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ వెంటనే రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు కూడ వెల్లువెత్తాయి. అయితే చైనా రాజధాని నగరమైన బీజింగ్ లో ఇప్పటికే కాలుష్య పొగమంచుపై రెడ్ అలర్ట్ ప్రకటించారని, ముందు జాగ్రత్త చర్యగానే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ చెప్తున్నారు. వాయుకాలుష్యంపై అత్యవసర చర్యలు చేపట్టడంలో భాగంగా... చట్ట పరిమితులు దాటి కాలుష్యాన్నిసృష్టించడాన్ని ఫాల్కోన్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా ఇప్పటికే ఒక్కోరూ ఒక్కో పద్ధతిని అమల్లోకి తెస్తూనే ఉన్నారు. రోమ్ 'ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్స్' ను ప్రవేశ పెట్టగా... మిలాన్ వారంలో మూడు రోజులపాటు వాహనాల వాడకాన్నేనిషేధించింది. తమవంతు బాధ్యతగా మిలాన్ తో పాటు చాలా నగరాలు న్యూ ఇయర్ వేడుకల్లో టపాసుల వినియోగాన్ని కూడ నిషేధించాయి. అయితే వాయు కాలుష్యంలో యూరప్ లోనే ఇటలీ.. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇటలీలో సంవత్సరానికి సుమారు 30 వేలమంది దాకా కాలుష్యంతో మరణిస్తున్నట్లు 2015 ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో పెరిగే కాలుష్యాన్నినిషేధించేందుకు పురపాలక సంఘాలు కాలుష్య మూలాల నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. జాతీయ వాతావరణ శాఖామంత్రి పర్యావరణంపై పురపాలక సంఘాల ప్రతినిధులతో రోమ్ లో అత్యవసర సమావేశం కూడ నిర్వహించారు. ఇళ్ళలో, కార్యాలయాల్లో థర్మోస్టాట్ల వాడకాన్నినిషేధించారు. నగరాల్లో స్పీడ్ లిమిట్ ను అమల్లోకి తెచ్చారు. పాత కార్ల వాడకానికి స్వస్తి పలికి, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని ఆదేశించారు. పొగ గొట్టాల వాడకంపై కూడ పరిమితులు విధించారు. అయితే చట్టాలు, నిషేధాలతో పొల్యూషన్ ను నియంత్రించడాన్ని అమలు చేస్తున్న లక్షల ప్రాంతాల్లో ఇటలీ ఒకటి. పొల్యూషన్ సమూలంగా నిర్మూలించాలంటే ఇటువంటి బాధ్యతను సక్రమంగా అమలు చేయడం ఫాల్కోన్ వంటి ప్రతి మేయర్ పైనా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక పిజ్జా విక్రయదారులు, వ్యాపారస్తులు ఫిబ్రవరి 29 నాటికి ఓవెన్లకు తగిన పొల్యూషన్ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మార్చి 1 నుంచి ఇనస్పెక్లర్లు తనిఖీలు ప్రారంభిస్తారని, ఫిల్టర్లు లేని రెస్టారెంట్లు, పిజ్జా తయారీదారుల లైసెన్సులు రద్దు చేస్తారని హెచ్చరించారు. కాగా ప్రాణాంతకమైన పొల్యూషన్ నియంత్రణపై అవగాహన అనంతరం పిజ్జా విక్రయదారులు కూడ మేయర్ కు సహకరించేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. అయితే ఇటువంటి పెద్ద సమస్యను మిణుగురు పురుగువంటి తమ చిన్న పట్టణంలో అమలు చేస్తే సరిపోదని, మిగిలిన నగరాల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. -
చిన్నంపల్లిలో చిరుత కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చిన్నంపల్లిలో చిరుత పులి కలకలం సృష్టించింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లుకు చెందిన పొలంలో చిరుత పడుకుని ఉండడాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా చిరుత పులి గాయపడి ఉండటం కాని లేదా గర్భం దాల్చి ఉండవచ్చునని, అందువల్లే అక్కడి నుంచి కదలడం లేదని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. వలల ద్వారా చిరుతను పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా మండల పరిధిలో చిరుత దాడి చేసి మేకలను, గొర్రెలను తిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. -
‘దేశం' దౌర్జన్యం
అరండల్‌పేట(గుంటూరు)/తుళ్లూరు: తుళ్లూరులో శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై దౌర్జన్యానికి దిగారు. అదేమంటే రాజధాని రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. తాము తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, భూ సమీకరణలో నష్టపోతున్న వారికి అండగా ఉండేందుకే సభ నిర్వహిస్తున్నామని వామ పక్ష నాయకులు చెబుతున్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్ర వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్‌పార్టీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులపై దాడులకు దిగినట్టుగానే పది వామ పక్ష నాయకుల సభను అడ్డుకున్నారు. తుళ్లూరులో శుక్రవారం పది వామపక్షాల నాయకులు నిర్వహించిన బహిరంగసభను అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. అడుగడుగునా సభకు ఆటంకాలు కల్పించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయినా సభను నిర్వహిస్తుండటంతో ఓర్చుకోలేని కార్యకర్తలు వామపక్షాల నాయకులు గోబ్యాక్ అంటూ ఒక్కసారిగా సభావేదిక వద్దకు వచ్చారు. చంద్రబాబునాయుడు జిందాబాద్, టీడీపీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. వారిని వామపక్షాల నాయకులు సైతం ప్రతిఘటించారు. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగారు. అప్పటి వరకు అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కనిపించకుండా పోయారు. గొడవ పెద్దది కావడంతో ఎస్ఐతో పాటు మరికొద్ది మంది పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమివేశారు. మధ్యలోనే వామపక్షాల నాయకులు సభను ముగించి వెళ్లిపోయారు. తుళ్లూరులో ఇతర పార్టీ నాయకులపై వరసగా దాడులు జరుగుతున్నా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ సభ నిర్వహణపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ముందస్తు అనుమతి సైతం తీసుకోలేదని చెబుతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రంగా స్పందించారు. తాము ఇక్కడ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని చెబుతున్నా దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దాడులను తాము ఎన్నో చూశామని, కూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేయడం తప్పు ఎలా అవుతుందన్నారు. కొంతమంది నాయకులతో చంద్రబాబు ఇలా చేయిస్తున్నారని ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాజధాని భూసమీకరణలో నష్టపోతున్న కౌలురైతులు, కూలీలు, చేతివృత్తుల వారికి చట్టప్రకారం రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేకుంటే ప్రజాపోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు సొంత వ్యవహారంలా రాజధాని అంశం మారిపోయిందన్నారు. ప్రజలతో, ప్రతిపక్షాలతో చర్చించకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని కోసం నిధుల సమీకరణకు చంద్రబాబు మన దేశ ప్రధాని వద్దకు వెళ్లకుండా సింగపూర్ ప్రధాని వద్దకు ఎందుకు వెళ్లారన్నారని ప్రశ్నించారు. ఇక్కడ సేకరించే 30వేల ఎకరాల్లో 6 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీకి అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా 30వేల ఎకరాల్లో రాజధానిని నిర్మించలేదన్నారు. ఒక విధానపత్రం విడుదల చేయకుండా ఇష్టారాజ్యంగా భూములు సేకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు, రైతుకూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడేందుకు పోరాటాలు చేస్తామన్నారు. తిరిగి మరోసారి తుళ్లూరు వస్తామాన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ విల్సన్, వామపక్షాల నాయకులు కోటయ్య, రమాదేవి, హరనాధ్, గుర్రం విజయ్‌కుమార్, సింహాద్రి లక్ష్మీనారాయణ, తూమాటి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
పరిగిలో టీడీపీ నేతల దౌర్జన్యం
వైఎస్ఆర్ సీపీ నేతపై దాడి పరిగి : మరుగు దొడ్డి నిర్మాణ సామగ్రిని రోడ్డుపై కాకుండా పక్కకు ఉంచుకోవాలని సూచించిన పాపానికి వైఎస్ఆర్ సీపీ నేతపై టీడీపీ నేతలు దాడి చేశారు. బాధితుడు అనిల్‌కుమార్ తెలిపిన మేరకు... పి.నరసాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణాన్ని అదే గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారు సర్పంచ్ వర్గీయులు శుక్రవారం చేపట్టారు. అందుకు సంబంధించిన సామగ్రిని వారు రోడ్డుపై ఉంచుకుని పనులు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వైఎస్ఆర్ సీపీ నేత అరుణ్‌కుమార్ రోడ్డుకు అడ్డంగా ఉంచిన సామగ్రిని పక్కకు వేసుకోవాలని సూచించాడు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకుని అరుణ్‌కుమార్‌పై వారు దాడి చేశారు. ఘటనపై అదే రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనకు బాధ్యులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తామని పోలీసులు చెప్పి పంపారు. శనివారం ఉదయాన్నే అరుణ్‌కుమార్‌పై సర్పంచ్ వర్గీయులు మరోసారి దాడికి తెగబడ్డారు. వారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ వైపు అరుణ్‌కుమార్ పరుగు తీశాడు. జరిగిన విషయాన్ని ఎస్ఐ రంగడుకు వివరించారు. విషయం తెలుసుకొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ పరిగి పోలీస్ స్టేషన్లో ఉన్న అరుణ్ కుమార్‌ను పరామర్శించి, దాడికి గల కారణాలను అడిగి తెలుసుకొన్నారు. ఎస్ఐతో చర్చించారు. సర్పంచు వర్గీయులు కావాలనే తమ పార్టీ నాయకుడిపై దాడి చేసారన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళతామని అన్నారు. దాడి చేసిన వారిపై తప్పక చర్యలు తీసుకొంటామని ఎస్ఐ తెలిపారు. -
కలకలం
నగరంలో వరుస ఘటనలు భార్య, కుమారుడి హత్య..ఉలిక్కిపడిన పహడీషరీఫ్ భార్య సీమంతం ఏర్పాట్లలో అపశ్రుతి..గాలికి పట్టుతప్పి పడి భర్త దుర్మరణం చార్మినార్‌లో డీఆర్డీఓ ఆర్డీపై బ్లేడుతో దాడి రహమత్‌నగర్‌లో కానిస్టేబుళ్లపై దౌర్జన్యం గండిపేట జలాశయంలో ఇద్దరి గల్లంతు పహడీషరీఫ్: తెలతెలవారుతూనే.. భార్య, కుమారుడిని భర్త హతమార్చాడనే వార్తతో పహడీషరీఫ్ ప్రాంతం ఉలిక్కిపడింది. హయత్‌నగర్ ప్రాంతంలో భార్య సీమంతానికి ఏర్పాట్లు చేస్తూ.. పెద్దగా వీచిన గాలికి అదుపుతప్పి పడిపోయి ఆమె భర్త దుర్మరణం పాలైన ఘటన విషాదాన్ని నింపింది. శుభకార్యం జగరాల్సిన ఆ ఇంట చావు బాజా మోగడం పలువురిని కలచివేసింది. ఆపై రహమత్‌నగర్‌లో జూబ్లీహిల్స్ కాని స్టేబుళ్లపై దాడి, చార్మినార్‌లో డీఆర్డీఓ రీజనల్ డెరైక్టర్ సత్యపతిపై బ్లేడుతో ఓ బాలుడు దాడి, గండిపేట జలాశయంలో ఇద్దరు యువకుల గల్లంతు ఘటనలు కలకలం రేపాయి. తల్లీకొడుకుల దారుణహత్య చిన్న విషయానికే గొడవపడిన ఓ వ్యక్తి కిరాతకుడయ్యాడు. కట్టుకున్న భార్యను, కన్న కుమారుడిని దారుణంగా హతమార్చాడు. అనంతరం భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటిం చాడు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన మినీందర్ (24)కు కర్ణాటకకు చెందిన స్వప్న (19)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సూరజ్ అనే పది నెలల కుమారుడు ఉన్నాడు. వీరు జల్పల్లి శ్రీరాం కాలనీలో ఉంటున్నారు. మినీందర్ స్థానిక ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యాభర్తలు శనివారం రాత్రి 8 గంటల సమయంలో గొడవ పడ్డారు. వీరి ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి అర్ధరాత్రి 12.30ప్రాంతంలో బయటకు రాగా, మినీందర్ ఇంట్లోంచి పొగలు రావడం కనిపించింది. ఆయన వెంటనే స్థానికుల సాయంతో లోనికి వెళ్లి చూడగా స్వప్న మంటల్లో కాలి పడి ఉంది. పక్కనే ఆమె కుమారుడు సూరజ్ విగతజీవిగా కన్పించాడు. సూరజ్‌కు కాలిన గాయాలు లేవు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్వప్నకు కొద్దిపాటి కాలిన గాయాలే ఉండడాన్ని గమనించిన పోలీసులు మరింత లోతుగా పరిశీలించగా ఆమె మెడకు చీరతో ఉరేసి హత్య చేసినట్టు ఆనవాళ్లు కన్పించాయి. భార్యాభర్తల మధ్య గొడవ జరగడం.... భర్త పరారీలో ఉండడంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. భార్యను చీరతో ఉరేసి హత్య చేసిన మినీందర్ నేరం తనపైకి రాకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం
అన్యాయంగా ఇద్దరు అరెస్టు నిరసనగా గ్రామస్తుల రాస్తారోకో సీలేరు, న్యూస్‌లైన్ :అడవుల్లోను, మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులపై ఒడిశా పోలీసుల దౌర్జన్యం నానాటికీ పెరుగుపోతోంది. విశాఖ జిల్లా జీకేవీధి మండలం దుప్పుడువాడ పంచాయితీ కాట్రగెడ్డ గ్రామంలో పది రోజుల కిందట ఓ వివాహం జరిగింది. ఆ గ్రామానికి పక్కనే ఉన్న ఒడిశా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు మూడు బైక్‌లపై వచ్చి అక్కడ దొరికిన రెండు కేసుల మద్యాన్ని తీసుకువెళ్లారు. అయితే రెండు రోజుల కిందట సదరు మద్యం కేసుల యజమానిగా భావిస్తున్న వంతల నారాయణరావు కొడుకు, అతని స్నేహితురాళ్లను తీసుకుని బలిమెల రిజర్వాయర్ని చూపించడానికి బైక్‌పై వెళుతుండగా ఒరిస్సా పోలీసులు వారిని అడ్డగించి బైక్‌ను స్వాధీనం చేసుకొని మీ తండ్రిని తీసుకురావాలని చెప్పి పంపారు. దీంతో గ్రామస్తులు నారాయణరావును తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ తరుణంలో పోలీసులు నారాయణరావును అక్రమంగా బంధించి స్టేషన్లో ఉంచారు. స్టేషన్లో ఉన్న ఈయన్ను చూడడానికి వచ్చిన బంధువైన చిట్టి పడాలుపైనా తప్పుడు కేసు పెట్టి మల్కన్‌గిరి కోర్టుకు తరలించారు. పోలీసులు అకారణంగా తమవారిని బంధించడాన్ని నిరసిస్తూ కాట్రగెడ్డ గిరిజనులు ఏకమై ఆంధ్ర -ఒడిశా సరిహద్దు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ ఊరికి వచ్చి మద్యం అడిగితే తాము ఇవ్వలేదని, ఈ కోపంతోనే పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
దానం ఆగడాలను అడ్డుకోండి
చట్టాలు, నిబంధనలన్నీ పాతరేస్తూ దౌర్జన్యంతో ప్రజాస్వామ్య వ్యవస్థను పాతరేయాలని చూస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్, కార్పొరేటర్ భారతిల ఆగడాలను అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసింది. సోమవారం పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త పి.విజయారెడ్డితో పాటు నందీనగర్, దేవరకొండ బస్తీవాసులు లక్ష్మీ, విజయా నాయక్, నవీన్ నాయక్, ఇషాక్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. ఈ సందర్భంగా శాంతియుతంగా ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం చేపట్టిన తమపై దానం నాగేందర్, భారతిల ప్రోద్బలంతో దాడి చేసిన తీరును వారు వివరించారు. తక్షణం వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వారు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. -
బందరు రైల్వేస్టేషన్లో సూట్‌కేసుల కలకలం
మచిలీపట్నం రైల్వేస్టేషన్లో రెండు సూట్‌కేస్‌లు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో ప్రయాణికులు వదిలి వెళ్లిన రెండు సూట్‌కేస్‌లను గుర్తించిన రైల్వే పోలీసులు అనుమానం వచ్చి విషయాన్ని బందరు డీఎస్పీ శ్రీనివాసరావుకు తెలిపారు. దీంతో ఆయన మచిలీపట్నం పోలీసులతో పాటు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ లను రైల్వేస్టేషన్‌కు పంపించారు. మచిలీపట్నం ఎస్.ఐ జి.శ్రీహరిబాబు, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్వ్కాడ్ సిబ్బంది రైల్వే అధికారుల సహకారంతో జనరల్ కోచ్‌లో ఉన్న రెండు సూట్‌కేస్‌లను ప్లాట్‌ఫారంపైకి తీసుకువచ్చారు. బాంబ్‌స్వ్కాడ్ సూట్‌కేస్‌లను తెరచి చూడగా ఒక సూట్‌కేస్‌లో మహిళకు సంబంధించిన దుస్తులు, వస్తువులు, మరో సూట్‌కేస్‌లో మగవారికి సంబంధించిన దుస్తులు కనిపించాయి. పలు వస్తువులను పరిశీలించిన పిమ్మట సంబంధిత మహిళ ఫోన్ నంబరు దొరకడంతో ఆమెతో మాట్లాడారు. తనది సికింద్రాబాద్ అని అక్కడి రైల్వే స్టేషన్లో తన సూట్‌కేస్ అపహరణకు గురైందంటూ సదరు మహిళ బందరు పోలీసులకు తెలిపారు. దీంతో రెండు సూట్‌కేస్‌లను రైల్వే పోలీసులకు అప్పగించారు. రైలు కోచ్‌లో అనుమానాస్పదంగా రెండు సూట్‌కేస్‌లు ఉన్నట్లు ప్రచారం కావటం, బాంబ్‌స్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్ టీముల హడావుడి చూసి రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సూట్‌కేసులలో అపాయకర వస్తువులు లేవని తేలటంతో ఊపిరి పీల్చుకున్నారు.