మచిలీపట్నం రైల్వేస్టేషన్‌లో రెండు సూట్‌కేస్‌లు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో ప్రయాణికులు వదిలి వెళ్లిన రెండు సూట్‌కేస్‌లను గుర్తించిన రైల్వే పోలీసులు అనుమానం వచ్చి విషయాన్ని బందరు డీఎస్పీ శ్రీనివాసరావుకు తెలిపారు.
దీంతో ఆయన మచిలీపట్నం పోలీసులతో పాటు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ లను రైల్వేస్టేషన్‌కు పంపించారు. మచిలీపట్నం ఎస్.ఐ జి.శ్రీహరిబాబు, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్వ్కాడ్ సిబ్బంది రైల్వే అధికారుల సహకారంతో జనరల్ కోచ్‌లో ఉన్న రెండు సూట్‌కేస్‌లను ప్లాట్‌ఫారంపైకి తీసుకువచ్చారు. బాంబ్‌స్వ్కాడ్ సూట్‌కేస్‌లను తెరచి చూడగా ఒక సూట్‌కేస్‌లో మహిళకు సంబంధించిన దుస్తులు, వస్తువులు, మరో సూట్‌కేస్‌లో మగవారికి సంబంధించిన దుస్తులు కనిపించాయి. పలు వస్తువులను పరిశీలించిన పిమ్మట సంబంధిత మహిళ ఫోన్ నంబరు దొరకడంతో ఆమెతో మాట్లాడారు.
తనది సికింద్రాబాద్ అని అక్కడి రైల్వే స్టేషన్‌లో తన సూట్‌కేస్ అపహరణకు గురైందంటూ సదరు మహిళ బందరు పోలీసులకు తెలిపారు. దీంతో రెండు సూట్‌కేస్‌లను రైల్వే పోలీసులకు అప్పగించారు.
రైలు కోచ్‌లో అనుమానాస్పదంగా రెండు సూట్‌కేస్‌లు ఉన్నట్లు ప్రచారం కావటం, బాంబ్‌స్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్ టీముల హడావుడి చూసి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సూట్‌కేసులలో అపాయకర వస్తువులు లేవని తేలటంతో ఊపిరి పీల్చుకున్నారు.