Railwaystation
-
మానవత్వం: మమతమ్మా... నీ మేలు మరువనమ్మా!
సమైక్య భావన స్ఫూర్తి గురించి చెప్పడానికి... పెద్ద పెద్ద సిద్ధాంతాలే అక్కర్లేదు. చిన్న సంఘటనలు చాలు! ఆరోజు ఏమైందంటే... థానే (ముంబై)లోని దివ రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫామ్ నంబర్:1 ఎప్పటిలాగే ఆ ఉదయం రైలు బండ్ల శబ్దాలు, ప్రయాణికుల అరుపులు, కేకలతో ౖరైల్వేస్టేషన్ సందడిగా ఉంది. తిత్వాల ప్రాంతానికి చెందిన నజ్‌మింజహాన్ తన భర్త ఫసిముద్దీన్తో కలిసి ప్లాట్‌ఫామ్ పైకి వచ్చింది.ఆమె గర్భిణి. రొటీన్–చెకప్‌లో భాగంగా నాయర్ హాస్పిటల్ వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చింది. కొద్దిసేపటి తరువాత... ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త ఆందోళన పడుతున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడంలేదు. ‘ఎవరో ఒకరు ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళతారులే’ అని ఎవరికి వారు అనుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. కొందరు మాత్రం రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. హుటాహుటిన రైల్వే అధికారులతోపాటు అక్కడికి వచ్చింది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మమత దంగి. నొప్పులు ఎక్కువయ్యాయి. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మహిళా రైల్వే ఉద్యోగులు, మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారిని నజ్‌మింజహాన్ దగ్గరకు తీసుకువచ్చింది మమత. అందుబాటులో ఉన్న వస్తువులతో మేక్‌షిఫ్ట్ క్లాత్ కర్టెన్ను తయారుచేసింది. అందరిలో ఉత్కంఠ! ఏమవుతుందో ఏమో!! ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు ఫలించాయి. నజ్‌మింజహాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ‘హమ్మయ్య’ అనుకున్నారు జనాలు. ‘ఆమె మీ ఇంటి అమ్మాయే అనుకోండి... ఒకసారి రండి.... ప్లీజ్... చేతులెత్తి దండం పెడతాను’ అనే మమత మాటలు ప్రయాణికులను కదిలించాయి. ఆ తరువాత...తల్లీబిడ్డలను దివలోని ఒక ప్రైవెట్ హాస్పిటల్లో చేర్పించారు. తల్లీబిడ్డలను హాస్పిటల్లో చేర్పించడానికి ప్రయాణికులు కొందరు తమ ప్రయాణాలు మానుకొని మరీ హాస్పిటల్‌కు వచ్చారు. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ‘ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో చూడడం ఇదే మొదటిసారి. నిజానికి ఆరోజు నేను అర్జంటుగా వేరే చోటుకు వెళ్లాలి. ట్రైన్ వచ్చే సమయం అయింది. అయితే మమత మాటలు నన్ను కదిలించాయి. నా పని, ప్రయాణం గురించి పట్టించుకోకుండా ఆమెతోపాటు వెళ్లాను’ అంటుంది సహాయక కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి. సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సతారా మమత కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. -
వామ్మో.. కరోనా ఎఫెక్ట్.. మేం జర్నీచేయం!
సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు రైళ్లు కిటకిటలాడుతాయి. ప్రయాణికుల రాకపోకలు రెట్టింపవుతాయి. రైల్వేస్టేషన్లలో సందడి నెలకొంటుంది. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గతేడాది వేసవిలో కోవిడ్ ఉధృతి దృష్ట్యా రైల్వే సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసారి వేసవిలో అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ రెండో దశ కోవిడ్ విజృంభణతో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. గత 15 రోజులుగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సుమారు 25 శాతానికి పైగా ప్రయాణికుల రద్దీ తగ్గినట్లు అంచనా. నెల రోజుల క్రితం వరకు సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు లక్ష మందికి పైగా రాకపోకలు సాగించగా ఇప్పుడు 60 వేల నుంచి 70 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు వేసవిలో ఏసీ బోగీలకు ఉండే డిమాండ్ కూడా తగ్గింది. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రయాణికులు స్లీపర్ కోచ్‌లను ఎంపిక చేసుకోవడం గమనార్హం. రైళ్లన్నింటినీ పునరుద్ధరించాక ఇలా... ►ఈ ఏడాది సంక్రాంతి నుంచి రైళ్ల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేశారు. గత సంవత్సరం కోవిడ్ దృష్ట్యా లాక్డౌన్ నిబంధనల అనంతరం మొదట 22 రైళ్లను అందుబాటులోకి తెచ్చిన దక్షిణమధ్య రైల్వే అధికారులు ఆ తరువాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచారు. ► అన్ని రైళ్లను ‘ప్రత్యేకం’ పేరిట నడుపుతున్నారు. సాధారణ చార్జీలను ‘తత్కాల్’కు పెంచేశారు. సంక్రాంతి నాటికి సుమారు 75 రైళ్లు అందుబాటులోకి రాగా ప్రస్తుతం వాటి సంఖ్య వంద దాటింది. ► సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, పట్నా, దానాపూర్, అహ్మదాపూర్, రెక్సాల్, లక్నో, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, తదితర అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలు పెరిగాయి. ► ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 22 రైళ్లను కొత్తగా పునరుద్ధరించారు. మొదట్లో కేవలం 25 వేల మంది ప్రయాణం చేశారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సంక్రాంతి నాటికి అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా నమోదైంది. కొన్నింటిలో ఏకంగా 250 నుంచి 300కు చేరుకుంది. వీకెండ్స్‌లో 1.10 లక్షల మంది వరకు ప్రయాణం చేశారు. కానీ రెండో దశ కోవిడ్ విజృంభణతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ‘ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నవాళ్లు తమ ప్రయాణాలను యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ కొత్తగా బుక్ చేసుకొనేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గింది’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. పర్యాటకులు బంద్ సాధారణంగా వేసవి రోజుల్లో పర్యాటకుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరాన్ని సందర్శించేందుకు ఎక్కువ మంది వస్తారు. కానీ ఈసారి పర్యాటకులకు బదులు వలస కూలీల రాకపోకలు కొద్దోగొప్పో ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ కాలంలో సొంత ఊళ్లకు వెళ్లిన కూలీలు సడలింపు అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో తరచుగా సొంత ఊళ్లకు వెళ్లి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గడమే కాకుండా నగరం నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గింది. -
ఆ స్టేషన్ ఖర్చు కోటీ అరవై లక్షలట..
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందనే విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ వీడియోలో ఓ రైల్వేస్టేషన్ కనబడుతుంది. ఇటలీలోని స్టేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని ముందు అనుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకుని ఇక్కడే రైల్వేస్టేషన్ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సెట్ వర్క్ జరిగింది. కోటీ అరవై లక్షల ఖర్చుతో సెట్‌ని నిర్మించారట. 30 రోజుల పాటు 250 మంది పని చేశారని తెలిసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ నిర్మిస్తున్నాయి. 1970లలో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథాచిత్రం ఇది. ఈ ఏడాది జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
పట్టాలెక్కని సౌకర్యాలు
సాక్షి, మహానంది(కర్నూలు) : నంద్యాల – గుంటూరు రైలు మార్గంలో గాజులపల్లె రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వసతులు కరువయ్యాయి. రైలు వచ్చే వరకు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఈ రైల్వేస్టేషన్‌కు సమీపంలో కేవలం 4 కి.మీ. దూరంలో మహానంది పుణ్యక్షేత్రం ఉండడంతో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. రోజుకు సుమారు 2 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ రైల్వే శాఖ అధికారులు రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి వెళ్లేందుకు సమీప గ్రామాల వారు అధిక సంఖ్యలో ఈ స్టేషన్ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. గాజులపల్లె స్టేషన్ నుంచి చలమ, పచ్చర్ల, కృష్ణంశెట్టిపల్లె, గిద్దలూరు తదితర స్టేషన్ల మీదుగా విజయవాడకు వెళ్లేందుకు సమీప గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు మహానంది పుణ్యక్షేత్రం దగ్గరగా ఉండడంతో అటు విజయవాడ నుంచి, ఇటు గుంతకల్లు వైపు నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. కాని ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గతంలో డీఆర్ఎంగా ఆనంద్మాథూర్ విధులు నిర్వహించే సమయంలో సుమారు రూ.16 లక్షలతో షెడ్లు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కాని అవి నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో భక్తులు, ప్రయాణికులు మండుటెండల్లోనే రైళ్లకోసం వేచి చూడాల్సి వస్తోంది. మహానంది స్టేషన్‌గా పేరు మార్పు ఎప్పుడు? గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా పేరు మార్చాలని, దీని ద్వారా మహానంది పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని అధికారులు కొన్నేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మహానంది దేవస్థానం ఈఓ సుబ్రమణ్యం, వేదపండితులు రవిశంకర అవధాని, అధికారులు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కలిసి గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా మార్పు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశంలో చర్చించడంతో పాటు రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారని దేవస్థానం అధికారులకు తెలిపారు. ఈ సారైనా ఎంపీ చొరవతో మహానంది ఫుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా పేరు వస్తుందని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
యువతిపై నలుగురు యువకుల లైంగికదాడి
సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. సూళ్లూరు, బొగ్గులకాలనీకి చెందిన నలుగురు యువకులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గూడూరు డీఎస్పీ బాబుప్రసాద్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన 24 ఏళ్ల యువకుడు, విజయనగరానికి చెందిన 20 ఏళ్లబాధితురాలు శ్రీసిటీ సెజ్‌లోని ఓ సెల్‌ఫోన్ కంపెనీలో పనిచేస్తున్నారు. స్నేహితులైన వీరు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం మీదున్న కుర్చీల్లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అదే సమయంలో సూళ్లూరు, బొగ్గుల కాలనీకి చెందిన నలుగురు యువకులు గంజాయి తాగిన మత్తులో ఆ యువకుడ్ని కొట్టి యువతిని బొగ్గుల కాలనీ వైపునకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ లోపు పోలీసుల గస్తీలో భాగంగా రైల్వేస్టేషన్ వైపు రావడంతో పోలీస్ సైరన్ విన్న బాధిత యువకుడు ఎస్ఐ పి.విశ్వనాథరెడ్డిని ఆశ్రయించి జరిగిన ఘటనను వివరించారు. దీంతో సీఐ, ఎస్ఐ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులొస్తున్నారని పసిగట్టిన నలుగురు యువకులు ఆ యువతిని బట్టల్లేకుండా కొంత దూరం నడిపించి అక్కంపేట రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ టన్నెల్ కిందకు తీసుకెళ్లి తెల్లవార్లూ ఆమెపై పైశాచికంగా అత్యాచారం చేశారు. సోమవారం ఉదయాన్నే ఆ యువతిని అక్కంపేట రైల్వేస్టేషన్లో సబర్బన్ రైలు ఎక్కించి పంపారు. ఆదివారం రాత్రి నుంచి యువతి కోసం గాలిస్తున్న పోలీసులు ఆమెను గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా బోరున విలపిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. నిందితులపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. -
గజ్వేల్‌కు రైలు కూత
తూప్రాన్ సిద్ధిపేట : కొత్త సంవత్సరంలోగా గజ్వేల్‌కు రైలుకూత వినాలన్నదే టార్గెట్‌గా అధికారులు, నాయకులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తూప్రాన్ మండలం రామాయపల్లి సమీపంలో 44వ నంబర్ రహదారిపై వందకోట్లతో రైల్వే వంతెన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనోహరాబాద్ –కొత్తపల్లి రైల్వేలైన్ మార్గం పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. రైల్వే నిర్మాణం పనులకోసం వందశాతం భూసేకరణ ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మెదక్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ల కృషి ఫలితంగా భూసేకరణ త్వరగా పూర్తయిందన్నారు. రైల్వే నిర్మాణం పనులకోసం ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి జీఎంఆర్ , నేషనల్హైవే అధికారులు, రైల్వే అధికారులతో చర్చించి రైల్వే పనులకోసం కృషి చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పనిని కూడా చేయలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పదవులు కావాలి కానీ ప్రజల అవసరాలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రైల్వే పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 30 కిలోమీటర్ల మేర మొదటి దశ పూర్తి చేసేందుకు పనులు సాగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం 600 వేల కోట్లతో మంజూరైన రైల్వే నిర్మాణం పనులు ఎనిమిదేళ్ల కాలంలో కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో రూ.1,160 కోట్ల వ్యయం పెరిగిందిన్నారు. ఏనాడూ పట్టించుకోలేదు.. కేసీఆర్ పట్టుదల వల్ల మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే రైల్వే నిర్మాణం పనులు పూర్తి చేశామన్నారు. ఈ ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. అలాగే రూ.5 కోట్లతో తూప్రాన్‌లో ఆర్అండ్బీ అతిథి గృహం, రూ.56 లక్షలతో ఆయుర్వేద ఆస్పత్రి, రూ.25కోట్లతో 500 డబుల్బెడ్రూమ్ ఇళ్లకు నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు అంటే లంచం లేనిది ఇల్లు రాదు, బిల్లు రాదని ఎద్దేవా చేశారు. కానీ టీఆర్ఎస్ పాలనలో పారదర్శకంగా అసలైన నిరుపేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను అందించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారన్నారు. తూప్రాన్‌లో ఇప్పటికే మూడు మార్కెట్లు కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ఇందులో గ్రేన్ మార్కెట్, వెజ్‌నాన్‌వెజ్ మార్కెట్, వే సైడ్ మార్కెట్ మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదిలా ఉంటే టోల్‌ప్లాజా వద్ద కూరగాయలు, పండ్లు అమ్ముకునే పేద రైతులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండగా అటువైపు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి ఏనాడు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కోటి రూపాయలతో వే సైడ్ మార్కెట్‌ను నెలరోజుల్లో పూర్తిచేసి వారికి అందించే లక్ష్యంగా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. రైతులు పండించిన పంటల నిల్వ కోసం రూ.6 కోట్లతో మార్కెట్ సదుపాయం కల్పించేందుకు మార్కెట్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధికి చిరునామా అంటే గజ్వేల్, తూప్రాన్ అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను గుర్తించి మీ ఆశీస్సులను కేసీఆర్‌కు అందించాలన్నారు. ఆయన వెంట ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, జెడ్పీటీసీ సుమన, జీఎంఆర్ , నేషనల్ హైవే, రైల్వే శాఖల అధికారులతోపాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి ఆర్మీ జవాను ఆత్మహత్య
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటర్సిటీ ప్యాసింజర్ రైలు కింద పడి చిన్నకోట్ల సుబ్బరాయుడు(32) అనే ఆర్మీ జవాను ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. వేముల మండలం వేముల కొత్తపల్లి గ్రామానికి చెందిన చిన్నకోట్ల వీరన్న కుమారుడు చిన్నకోట్ల సుబ్బరాయుడు జమ్ము కాశ్మీర్లో సిగ్నిల్ డిపార్టుమెంట్లో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కమలాపురం మండలం పెద్దచెప్పలి గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇతని ఆత్మహత్యకు వ్యక్తిగత సమస్యలే కారణమని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
ముద్దనూరు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం ప్రాంతానికి చెందిన నాగరాజు(35) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యర్రగుంట్ల రైల్వే హెడ్‌కానిస్టేబుల్ దేవదానం సమాచారం మేరకు నాగరాజు మద్యానికి బానిసై అనారోగ్యం పాలయ్యాడు. ఈ నేపథ్యంలో కడుపు నొప్పి తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రైళ్లలో జన ప్రవాహం
గద్వాల : పట్టణంలోని రైల్వేస్టేషన్ కృష్ణాపుష్కరాల ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో పుష్కర స్నానం చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున గద్వాలకు తరలివచ్చారు. హైదరాబాద్, కర్నూలు నుంచి గద్వాలకు వచ్చే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లన్నీ రద్దీగా మారాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద చాలాసేపు పడిగాపులు పడాల్సి వచ్చింది. పలు రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్లాట్‌ఫాంపై జనం గంటల తరబడి వేచి ఉన్నారు. రైల్వేస్టేషన్‌తో పాటు రైల్వే ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ ఒక్కరోజే సుమారు 15వేల మంది యాత్రికులు పుష్కర స్నానాల కోసం వచ్చారు. రైల్వేస్టేషన్ నుంచి నదిఅగ్రహారం, బీచుపల్లి పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఆర్పీఎఫ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. -
ప్రారంభమైన జనాహార్..
తాటిచెట్లపాలెం: ప్రయాణికులు వేయికళ్లతో ఎదురుచూసిన జనాహార్ ఎట్టకేలకు ప్రారంభమైంది.ఒకటోనెంబరు ప్లాట్‌ఫాం పై సుమారు రూ 3.83 కోట్లతో ఐఆర్సీటీసీ ప్రారంభించిన ఈ జనాహార్లో రూ.9 మొదలు రూ.50 లోపు విభిన్నవంటకాలను సిద్దంగా ఉంచనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంరోడ్డురైల్వేస్టేషన్లో దీనిని ప్రారంభించగా, నిత్యం 40 వేల పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగించే విశాఖరైల్వేస్టేషన్‌లో జనాహార్ ప్రాధాన్యతను గుర్తించిన రైల్వేశాఖ ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిపై కసరత్తుచేసింది. -
రండి... రైల్వేను అందంగా అలంకరిద్దాం
తాటిచెట్లపాలెం : జౌత్సాహికులైన కళాకారులు స్వచ్ఛందంగా రైల్వే స్టేషన్లో వాల్‌పెయింట్స్ వేయడానికి స్వాగతం పలుకుతోంది. విశాఖ రైల్వేస్టేçÙన్ ను ఆకర్షణీయంగా రూపొందించడానికి తమ వంతు సహకారం అందించమంటోంది. వేలాది మంది ప్రయాణికులు సంచరించే విశాఖ రైల్వేస్టేçÙన్లో తమకు తోచిన రీతిలో అందమైన పెయింటింగ్స్ వేసి, తమ పేరుని అక్కడే పెయింటింగ్ వద్ద లిఖించుకోమంటోంది. ఈకో రైల్వే హెడ్‌క్వార్టర్ భువనేశ్వర్ తరహాలో వాలే్తరు డివిజన్లో పలు స్టేషన్ల సుందరీకరణకు రైల్వేశాఖ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాలే్తరు డివిజన్ ఇంజినీరింగ్ విభాగాధికారులు విశాఖ రైల్వేస్టేçÙన్ ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫాంపై పలు రకాల ఆకతులను, ప్రకతి అందాలను ప్రతిబింబించే విధంగా వాల్పెయింటింగ్స్ను వేయించారు. ఇప్పటికే గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాత్మక రూపాలతో గోడలను సుందరీకరించిన వాలే్తరు డివిజన్, విశాఖలో ముఖ్యమైన ప్రదేశాలను ప్రతిబింబించేలా ఒకటి, ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫాంల గోడలపై లిఖింపజేసే యోచనలో ఉంది. విశాఖలో పర్యాటకSప్రదేశాలైన కైలాసగిరి, బీచ్‌రోడ్డు ప్రాంతం, సబ్మెరీన్, లైట్‌హౌస్, సంప్రదాయనత్యాలు, పల్లెటూరి ఆడపడుచుల రీతులతో పాటు గత వైభవాన్ని చాటే విధంగా ఉండే దశ్యాలతో వాల్‌పెయింటింగ్స్ వేయాలని సంకల్పించారు. ఇదే రీతిలో భువనేశ్వర్ రైల్వేశాఖ స్టేషన్ పరిసరాలను చూడదగ్గ ప్రాంతాలతో ఆకర్షణీయంగా రూపొందించాలని భావించగా, అక్కడి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రైల్వేశాఖ నుంచి సాయాన్ని అర్థించకుండా చక్కని వాల్ పెయింటింగ్స్‌ను రూపొందించి అందజేశారు. వారిని రైల్వే జీఎం రాజీవ్ బిష్ణోయ్ అభినందించారు. కాగా తాము తలపెట్టే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షిస్తున్నామని వాలే్తరు డివిజన్ సీనియర్ డీసీఎం ఎల్వేందర్‌యాదవ్ పేర్కొన్నారు. రైల్వేపరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయని, ఇదే తరహాలో ఇటు ఒకటో నంబరు ప్లాట్‌ఫాం, ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫాంల వద్ద సుందరీకరణకు స్వచ్ఛందంగా వచ్చే స్థానిక వలంటీర్లకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. తమకు నచ్చిన రీతిలో అందమైన పెయింటింగ్స్ వేసిన వారికి రైల్వే తరఫున అప్రిసియేషన్ సర్టిఫికెట్‌ను అందజేస్తామన్నారు. -
బందరు రైల్వేస్టేషన్లో సూట్‌కేసుల కలకలం
మచిలీపట్నం రైల్వేస్టేషన్లో రెండు సూట్‌కేస్‌లు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లో ప్రయాణికులు వదిలి వెళ్లిన రెండు సూట్‌కేస్‌లను గుర్తించిన రైల్వే పోలీసులు అనుమానం వచ్చి విషయాన్ని బందరు డీఎస్పీ శ్రీనివాసరావుకు తెలిపారు. దీంతో ఆయన మచిలీపట్నం పోలీసులతో పాటు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ లను రైల్వేస్టేషన్‌కు పంపించారు. మచిలీపట్నం ఎస్.ఐ జి.శ్రీహరిబాబు, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్వ్కాడ్ సిబ్బంది రైల్వే అధికారుల సహకారంతో జనరల్ కోచ్‌లో ఉన్న రెండు సూట్‌కేస్‌లను ప్లాట్‌ఫారంపైకి తీసుకువచ్చారు. బాంబ్‌స్వ్కాడ్ సూట్‌కేస్‌లను తెరచి చూడగా ఒక సూట్‌కేస్‌లో మహిళకు సంబంధించిన దుస్తులు, వస్తువులు, మరో సూట్‌కేస్‌లో మగవారికి సంబంధించిన దుస్తులు కనిపించాయి. పలు వస్తువులను పరిశీలించిన పిమ్మట సంబంధిత మహిళ ఫోన్ నంబరు దొరకడంతో ఆమెతో మాట్లాడారు. తనది సికింద్రాబాద్ అని అక్కడి రైల్వే స్టేషన్లో తన సూట్‌కేస్ అపహరణకు గురైందంటూ సదరు మహిళ బందరు పోలీసులకు తెలిపారు. దీంతో రెండు సూట్‌కేస్‌లను రైల్వే పోలీసులకు అప్పగించారు. రైలు కోచ్‌లో అనుమానాస్పదంగా రెండు సూట్‌కేస్‌లు ఉన్నట్లు ప్రచారం కావటం, బాంబ్‌స్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్ టీముల హడావుడి చూసి రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సూట్‌కేసులలో అపాయకర వస్తువులు లేవని తేలటంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఢిల్లీకి తరలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
ఢిల్లీకి తరలిన వైఎస్సార్ సీపీ శ్రేణులు గుత్తి, : అనంతపురం జిల్లా గుత్తి రైల్వేస్టేషన్ శనివారం జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జిల్లా నుంచి తరలివచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో 17న చేపట్టనున్న సమైక్య ధర్నాలో పాల్గొనడానికి తాము వెళ్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ పేర్కొన్నారు. గుత్తి నుంచి మూడు బోగీల్లో పార్టీ శ్రేణులు బయలుదేరినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీకి వెళ్లినవారిలో నాయకులు దిలీప్‌కుమార్‌రెడ్డి, పసుల నాగరాజు, వెన్న పూసపల్లి రామచంద్రారెడ్డి, తిప్పేపల్లి ఓబులరెడ్డి, గుత్తి మండల నాయకులు సీవీ రంగారెడ్డి, గురుప్రసాద్ యాదవ్, మామిళ్లచెరువు నాగిరెడ్డి, గాజులపల్లి మనుమంతరెడ్డి, ఎర్రగుడి శంకరరెడ్డి తదితరులు ఉన్నారు. ‘సమైక్య’ కింగ్ జగనే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పునరుద్ఘాటించారు. శనివారం ఆయన గుత్తి రైల్వేస్టేషన్లో సమైక్య ధర్నా (చలో ఢిల్లీ) రైలు ఎక్కడానికి ముందు పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మతో కలసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ తప్పా మిగిలిన రాజకీయ పార్టీలు పరోక్షంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి మాత్రం మొదట్నుంచీ సమైక్యాంధ్ర తప్పా మరో మాట అనడం లేదన్నారు. జగన్‌ను స్ఫూర్తిగా తీసుకొని తామంతా సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 17న ఢిల్లీలో చేపడుతున్న ‘సమైక్య ధర్నా’ను కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిర్వహిస్తామన్నారు. -
సూపర్ ఫాస్ట్ రైలింజన్ ఫెయిల్
కోసిగి రూరల్, న్యూస్‌లైన్: దాదర్ నుంచి చెన్నై వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు ఇంజన్ ఫెయిల్ కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తుంగభద్ర రైల్వేస్టేషన్లో ఉదయం 9.25 గంటలకు బయలుదేరిన రైలులో ఇంజన్ నుంచి డీజిల్ లీకేజ్ ప్రారంభమైంది. గమనించిన గార్డు, డ్రైవర్ అప్రమత్తమై సమీపంలోని ఐరన్గల్ స్టేషన్లో 9.50 గంటల సమయంలో రైలును నిలిపివేశారు. ఇంజన్లో మూడు సిస్టంల నుంచి డీజి ల్ లీకేజ్ తీవ్రంగా ఉండటంతో మరమ్మతు చేసేందుకు కూడా వీలు కాలే దు. పెద్ద మొత్తంలో డీజిల్ నేలపాలైం ది. తుంగభద్ర స్టేషన్ నుం చి అదనపు ఇంజన్‌ను తీసుకొచ్చి అమర్చడంతో 11.10 గంటల సమయంలో గుంతకల్ వైపు బయలుదేరింది. ఎలాంటి వసతులు లేని అడవి ప్రాంతంలో ఉన్న రైల్వేస్టేషన్లో దాదాపు 1.20 గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. -
ఫలించిన కల
గద్వాల, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు సాకారమైంది. దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉండి, పుష్కరకాలంగా పనులు కొనసాగిన గద్వాల - రాయిచూర్ నూతన బ్రాడ్‌గేజ్‌లైన్ ప్రారంభమవడం ఈ ప్రాంత అభివృద్ధికి మరింత దోహదపడుతుందని మంత్రి డీకే అరుణ అన్నారు. గద్వాల ఆర్ఓబీకి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. గద్వాల -రాయిచూర్ లైన్ ప్రారంభంతో గద్వాల రైల్వేస్టేషన్ జంక్షన్‌గా మారిందని, ఇక్కడ దూరప్రాంత రైళ్లు ఆగడంతో పాటు మరిన్ని రైళ్ల సౌకర్యం పెరుగుతుందన్నారు. దీంతో ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. శనివారం గద్వాల -రాయిచూర్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అరుణ, నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం రాయిచూర్‌లో ప్రారంభమైన కొత్త డెము రైలును జెండాఊపి గద్వాల స్టేషన్లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గద్వాల -రాయిచూర్ బ్రాడ్‌గేజ్ లైన్ కోసం దశాబ్దాలుగా ఈ ప్రాంతప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మల్లికార్జున్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ లైన్‌కు మంజూరు వచ్చేలా చేశారని తెలిపారు. 12 ఏళ్ల క్రితం పనులు ప్రారంభమైనప్పటికీ, అనేక అడ్డుంకులతో ఇన్నాళ్లు పూర్తికావడానికి కాలం పట్టిందన్నారు. అన్ని ఆటంకాలు తొలగి ఇప్పటికైనా ప్రారంభం కావడం, ఈ సమయంలో మంత్రిగా ఉండటం పట్ల అరుణ సంతోషం వ్యక్తంచేశారు. గద్వాల రైల్వేస్టేషన్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉందన్నారు. ఖాళీస్థలంలో శిక్షణ సంస్థలు, రైల్వే సంస్థలను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దశలవారీగా రాయిచూర్- గుంటూరు లైన్ పనులు: ఎంపీ మందా నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నా థం మాట్లాడుతూ.. దశాబ్దాల కల గ ద్వాల -రాయిచూర్ లైన్ ప్రారంభంతో నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాయిచూర్ నుంచి గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ కలుపాలన్నది ప్రతిపాదనగా ఉందన్నారు. ఇం త పొడవునా ఒకేసారి రైల్వేట్రాక్ నిర్మా ణం చేయడం సాధ్యం కాదన్న ఉద్దేశం తో దశలవారీగా పనులు చేపట్టేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు. ఇందులో గద్వాల- రాయిచూర్ పట్టణాల మధ్య 59 కి.మీల మార్గాన్ని ముందుగా పూర్తిచేసేందుకు మంజూరు ఇచ్చారని, ఈ పనులు కూడా ఆలస్యంగా పూర్తయ్యాయని తెలిపారు. గద్వాల జంక్షన్‌తో ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందని హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలో గద్వాల ప్రాంతానికి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉందని, కావునా ఇక్కడ దూరప్రాంత రైళ్లను ఆపేందుకు కోరినట్లు ఎంపీ మందా తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం రాకేష్‌యారన్, డివిజన్ రైల్వే అధికారులు, ఏజేసీ రాజారాం, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.