రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జనం రద్దీ
రైళ్లలో జన ప్రవాహం
Published Sun, Aug 21 2016 8:27 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
గద్వాల : పట్టణంలోని రైల్వేస్టేషన్ కృష్ణాపుష్కరాల ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో పుష్కర స్నానం చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున గద్వాలకు తరలివచ్చారు. హైదరాబాద్, కర్నూలు నుంచి గద్వాలకు వచ్చే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లన్నీ రద్దీగా మారాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద చాలాసేపు పడిగాపులు పడాల్సి వచ్చింది. పలు రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్లాట్‌ఫాంపై జనం గంటల తరబడి వేచి ఉన్నారు. రైల్వేస్టేషన్‌తో పాటు రైల్వే ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ ఒక్కరోజే సుమారు 15వేల మంది యాత్రికులు పుష్కర స్నానాల కోసం వచ్చారు. రైల్వేస్టేషన్ నుంచి నదిఅగ్రహారం, బీచుపల్లి పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఆర్‌పీఎఫ్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Advertisement